15, జనవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 198 (పండుగ దినమందు)

కవి మిత్రులారా,
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
పండుగ దినమందు పాత మగఁడె!

26 కామెంట్‌లు:

  1. ***************************
    రంగవల్లులు గొబ్బెళ్ళు గంగిరెడ్లు
    పగటివేషాలు జియ్యర్లు ప్రభల ప్రభలు
    క్రొత్త అల్లుళ్ళు మరదళ్ల కొంటె పనులు
    రమ్య రాగాల డోల సంక్రాంతి హేల!
    ***************************
    గురువులకూ మిత్రులకూ పద్యప్రియులకూ
    మకర సంక్రమణ పర్వదిన శుభాకాంక్షలు!
    ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

    రిప్లయితొలగించండి
  2. మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు. మీకు కూడ సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. ఆమె చేయ వంట నందరు తిన నేటి
    పండుగ దినమందు పాత! మగఁడె
    స్టారు హోటలు లోకి వారిని గొనిపోయి
    ఫాస్టు ఫుడ్సు బెట్ట ఫ్యాష నిపుడు!

    రిప్లయితొలగించండి
  4. పులగ పాయసాలు భుజియింప గోరిన
    పండుగ దినమందు పాత మగఁడె
    యనిరి; పిజ్జహట్టు నందు బర్జర్‌ లన
    పండుగొచ్చె నంచు పలికిరంత!

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    హరి గారూ,
    మిస్సన్న గారి భావంతో ఏకీభవిస్తున్న మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నిండు చందు రుండు నిజమైన చెలికాడు,
    అండనుండు నెపుడు కొండ రీతి,
    కొంటె వాడు, మదికి క్రొత్తగా కనుపించు ,
    పండుగ దినమందు పాత మగడె!

    రిప్లయితొలగించండి
  7. మంద పీతాబర్ గారూ,
    పండుగ పూట చక్కని పద్యాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. హరి గారూ చెయ్యిలా ఇవ్వండి. సేం సేం.

    రిప్లయితొలగించండి
  9. కనుమ అనగనేమి? ఇనుడెప్పుడుండును?
    క్రొత్త పాతలందు గొప్ప యేది?
    ఆలికి సఖుడెవ్వడందరిలోఁజూడ?
    పండుగ, దినమందు, పాత, మగఁడె!

    రిప్లయితొలగించండి
  10. శంకరయ్య గారు,

    ధన్యవాదాలు.

    మిస్సన్న గారు, మీ పద్యం చూశాకే నాకు ఐడియా వచ్చింది. :)

    రిప్లయితొలగించండి
  11. జిగురు సత్యనారాయణ గారూ,
    క్రమాలంకారంతో మీ పూరణ అలరించింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు.
    మరియు
    సంక్రాంతి శుభాకాంక్షలు.

    మిస్సన్న మహాశయా !
    పండుగ పూట ఫాస్ట్ ఫుడ్స్
    బావున్నాయి.

    హరీజీ !
    పర్వ దినమున పిజ్జాలు పెట్టారు.
    పసందుగా వున్నాయి.

    పీతాంబరధరా !
    పాత పతిని కొత్తగా చూపించి
    అందరి మనసులూ కొల్ల గొట్టారు.
    అత్యంత మధురమైన భావన.(పూరణ)


    జి.యస్.జీ !
    యథా ప్రకారం సమస్యను
    వి డి వి డి గా పొ డి పొడి చే సే సా రు.
    మీకు రెండు వీర తాళ్ళు.
    (అయ్యో నా దగ్గర ఒక్కటే వుంది.
    గురువు గారు నాకిచ్చిన మూడూ మీకే ఇచ్చేసాను.
    మళ్ళీ గురువు గారిస్తే మీకిస్తాను.)

    రిప్లయితొలగించండి
  13. 01)
    __________________________________________

    విశ్వ విఖ్యాత నటనమ్ము - వేద్యు డతడు !
    (భరణి విఖ్యాత నట సార్వ - భౌము డతడు)
    పుడమి జనియించె నాంధ్రుల - పుణ్య ఫలము !
    యదు కులేశుని దలపించి - యశము గాంచె !
    పర్వ దినమందు కనువిందు - పాత మగడె !

    మాయ బాజారు నందున - మాయ జేసె !
    జగతి జగదేక వీరుడే - జనులు మెచ్చ !
    విష్ణు వైనను నాతడే - విందొనర్చు !
    పర్వ దినమందు కనువిందు - పాత మగడె !

    ప్రభలె పాతాళ భైరవి - ప్రజల మనము !
    రక్త సంబంధ మందున - రచ్చ గెలిచె !
    ప్రజల సంతోష మొందింప - పార్థు డయ్యె !
    పర్వ దినమందు కనువిందు - పాత మగడె !

    రాజు ! రారాజు ! యాతడే - రావణుండు !
    రాజ్య మేలెను రాముడై ! - రాజు పేద
    తేడ తెలియదు నిజముగా - ధీరు డతడు
    పర్వ దినమందు కనువిందు - పాత మగడె !
    _____________________________________

    (సశేషం)

    రిప్లయితొలగించండి
  14. తెమ్మెరలు మృదువుగ నిమ్మేను బులకింప
    నలరుఁ బోడిఁ గనగ నాలి యయ్యె,
    క్రొవ్విరుల శరముల సవ్వడి విని జూడ
    పండుగ దినమందు పాత మగఁడె !!!

    రిప్లయితొలగించండి
  15. వసంత్ కిశోర్ గారూ,
    కవి మిత్రుల పూరణలను విశ్లేషించిన మీ సహృదయతకు నమోవాకాలు.
    తెలుగు చలన చిత్ర రంగానికి ఎన్.టీ.ఆర్ తిరుగులేని మగడే. అందులో అనుమానం లేదు. అందులోను పండగ పూట ఆయన సినిమా చూడడం ఆనందదాయకం.
    మీ సశేష పూరణలు ఎంతో అలరించాయి. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. ___________________________________________

    వెలసె వెంకటేశ్వరునిగా - వీటి వీటి !
    మేఘ నాథుడు , ప్రవరుడై - మెరుగు జెందె !
    వీర బ్రహ్మము , మేజరు , - వేమ నయిన!
    పర్వ దినమందు , కనువిందు - పాత మగడె!

    నాట్య గురువు , బృహన్నలై - నాట్య మాడె
    కాలుడై , సిరి నాథుడై- ఖ్యాతి నొందె !
    బొబ్బిలి , పులిగా యుద్ధంబు - బొబ్బరించె!
    పర్వ దినమందు , కనువిందు - పాత మగడె!

    అగ్గి రాముడు , పిడుగుగా - నవతరించె!
    విక్ర మార్కుడు , రాయలై- వినుతికెక్కె!
    కథల నాయకుడై భువి - కదను ద్రొక్కె!
    పర్వ దినమందు , కనువిందు - పాత మగడె!

    దక్ష యఙ్ఞమ్ము శివునిగా - తాండవించె !
    భీముడై , బండ రాముడై - పేరు గాంచె !
    దాన వీరుడు శూరుడై - ధన్యు డయ్యె !
    పర్వ దినమందు , కనువిందు - పాత మగడె!

    వసుధ మిత్రు, కీచకుడయి - వ్యాప్తి నొందె !
    ఆంధ్ర ప్రజ , ముఖ్యమంత్రిగా నాదరింప !
    ఆత్మ గౌరవ మెగసెను - ఆకసమున !
    తెలుగు కేతన మెగిరెను - తేజ మొదువ !

    ఆడపడుచుల మనమున - యన్న గారు !
    ఆంధ్ర జనులకు నత్యంత - ఆప్తుడయ్యొ
    దివిజ నటవరు గుండియల్ - దిగ్గు మనగ!
    వెడలి పోయెను ,ఎన్ టి యార్ - వేల్పు దరికి !

    ________________________________________

    (ప్రస్తుతానికి)సమాప్తం

    రిప్లయితొలగించండి
  18. క్రొత్త ధాన్య మొచ్చె క్రొత్త చీరెలు నగలు
    క్రొత్త వంట రుచులు కోర్కె మీర
    క్రొత్త యింట సిరులు గుండెనిండ వెలుగె
    పండుగ దిన మందు పాత మగఁడె !

    రిప్లయితొలగించండి
  19. వసంత కుసుమాకరా మీ పద్య ధార అమోఘమ్ము!
    అభినందనల నందుకొనుడు.
    రాముని స్తుతు లొనరించి వి-
    రామము లేకుండ మీరు రంజిల్ల మదుల్
    ప్రేమను నింపిరి బ్లాగును
    వేమరు కొనియాడ బుధులు వేడుక లొప్పన్!

    రిప్లయితొలగించండి
  20. నిండు చంద మామ నెలరేడు వలరాజు
    పండు వెన్నెలందు మెండు హాయి.
    గుండె నిండ కలువ గుసగుసల విరహాలు
    పండుగ దినమందు పాత మగఁడె !

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందరి పూరణలు ఒక ఎత్తు ,శ్రీ వసంత కిశోరుల పూరణలు ఒకయెత్తు పండుగ దినాన ఆ మహానటున్ని సాక్షాత్కరింప జేశారు .ఆపాత మధురాలను అందించించిన కిశోరులకు" క్షోణి తలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు'

    రిప్లయితొలగించండి
  22. విద్యాసాగర్ అందవోలుఆదివారం, జనవరి 16, 2011 1:08:00 PM

    కవి మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
    పూరణలన్నీ అద్భుతం గా వున్నాయి.
    హరి గారూ, మిస్సన్న గారూ, మీ పద్యాలలో భావం ఒకటే అయినా రెండూ వైవిధ్యంగానూ, అద్భుతం గానూ వున్నాయి.
    మిస్సన్న గారూ, మీ పద్యం మూడవ పాదం 'స్టారు హోటలునకు వారిని గొనిపోయి' అని అంటే ఎలా వుంటుంది?
    నరసింహ మూర్తి గారి పద్యం లో తెలుగు భాష లోని తియ్య దనం వుట్టి పడుతోంది.
    ఎప్పటి లాగే, కిషోర్ గారి పద్య ధార అందరిని అలరిస్తోంది.
    మంచి పద్యాలనందిస్తున్న మీ అందరికీ కృతఙ్ఞతలు.
    విద్యాసాగర్ అందవోలు.

    రిప్లయితొలగించండి
  23. విద్యాసాగర్ గారూ మీ సూచన బాగుంది.
    నా పద్యాన్ని సవరిస్తూన్నాను.
    కానీ, 'హోటలు లోకి' అన్న చోట హో అక్షరాన్ని హ్రస్వంగా తీసుకొన్నాను.
    (నా టైపు ఉపకరణి లో హ కు సంబంధించి హ్రస్వ, దీర్ఘాలు రెండూ ఒకేలా వస్తున్నాయి)
    ఆ అక్షరాన్ని దీర్ఘంగా తీసుకొంటే మీ సూచన చక్కగా సరిపోతోంది. ధన్యవాదాలు.
    ఇప్పుడే గమనించాను. లేఖిని లో హ్రస్వ దీర్ఘాలకు తేడా స్పష్టంగా తెలుస్తోంది.

    రిప్లయితొలగించండి
  24. పీతాంబర ధరులకు
    మిస్సన్న మహాశయులకు
    విద్యాసాగర్ గారికీ
    వెన్నెలకోళ్ళు
    మరియు
    ధన్యవాదములు.

    పీతాంబరధరా !
    ఆ వాణికి అందరం కలసి మ్రొక్కుదాం!

    క్షోణి తలంబునన్ , నుదురు - సోకగ మ్రొక్కి నుతింతు , సైకత
    శ్రోణికి , జంచరీక చయ - సుందర వేణికి , రక్షి తామర
    శ్రేణికి ,దోయజాత భవ - చిత్త వశీకరణైక వాణికిన్
    వాణికి నక్షదామ శుక - వారిజ పుస్తక రమ్య పాణికిన్!
    (మహాకవి పోతన భాగవతం నుండి)

    రిప్లయితొలగించండి