సనత్ శ్రీపతి గారి పూరణ బహు చక్కగా ఉన్నది. అందరూ ఎవరికి వారే చదువరులని సంతసింపఁజేస్తున్నారు. అందులో ఒకరి పద్యం అబ్బురపరుస్తుంది భావప్రకటనలో. ఇలా రాయటం అభ్యంతరకరమైతే మీరు నా వ్యాఖ్యను తొలగించవచ్చు.
రవి గారూ, కొడుకు కంటే బడ్డకే ఎక్కువ ఇస్తూ చేసిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.
సనత్ శ్రీపతి గారూ, నిర్మొహమాటంగా చెప్తున్నాను. మీ పూరణ ఉత్తమంగా ఉంది. ఎంత చక్కని భావన? చాలా బాగుంది. అభినందనలు.
మందాకిని గారూ, మీరు నిరభ్యంతరంగా మీ వ్యాఖ్యలను బ్లాగులో ప్రకటించ వచ్చు. గుణదోష విచారణ చేసే హక్కు నా బ్లాగులో అందరికీ ఉంది. చర్చలకూ అవకాశం ఉంది.
హరి గారూ, అత్యుత్తమమైన పూరణ. "కూతున కొకటే బిడియము". ఎంత బాగుంది మీ కల్పన! అభినందనలు.
మంద పీతాంబర్ గారూ, మీ పూరణ కూడ ఉత్తమంగా ఉంది. అభినందనలు. (తలబడు + అతండు) అన్నప్పుడు యడాగమం రాదు. "తలబడ నతండు" అంటే సరి. లేక "చెడుతో తలబడుట; యత డచేతను డయ్యెన్." అన్నా సరిపోతుంది.
వడివడిగనూడెఁ కురులవి కొడుకునకు విడువక తండ్రి క్రోమోజోముల్, విడిచె సుత వంశ నామము, కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!
వివరణ: తండ్రికి బట్ట తల ఉంటే కొడుకుకు ఖచ్చితముగా వస్తుంది, కాని కూతురికి రాదు. కాబట్టి జీన్సు వలన కొడుకుకు వేలకు వేలు తల వెట్రుకలు ఊడిపోతే, కూతురికి మాత్రము ఒక్క ఇంటి పేరే మారుతుంది.
కూతుర్ని అశ్రద్ధ చేసి మరీ వేలకు వేలు తగలేసి పెద్ద పెద్ద చదువులు చదివిస్తే ఆ కోడుకులు విదేశాల్లో ఉంటూ తల్లి దండ్రులకు విషాదం మిగులుస్తున్నారు కడ చూపుకు కూడా రాకుండా!
నన్ను ప్రభావితం చేసిన వ్యక్త్యులలో శంకరయ్య గారొకరు. వారికి కృతజ్ఞతా పూర్వక నమస్కృతి నా బ్లాగు టపా లో వీక్షించగలరు. మిగిలిన సాహితీ సోదరబృందమునకుకూడా ఈ లంకెను తెలియ పరచగలరు
జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ, మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. మొదటి పూరణ రెండవ పాదంలో "పన్నులు" అని జగణం వేసారు. అక్కడ తప్పనిసరిగా నలం కాని, జగణం కాని ఉండాలి కదా! "రుసుములు" అంటే సరి!
రాజేశ్వరి నేదునూరి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. "కూతున కొకటే" అనేది "కూతున కంటెన్" అయింది. సనత్ శ్రీపతి గారి కంద పద్య లక్షణ సంబంధిత వ్యాఖ్య చూడండి.
రవి గారూ, కువలయము అంటే భూమండలము, కలువ అనే అర్థాలున్నాయి. కుజము = భూమినుండి పుట్టినది (చెట్టు), కుధరము = భూమిని ధరించేది (పర్వతం) ఇలా ....
గోలి హనుమచ్ఛాస్త్రి
రిప్లయితొలగించండిపడి ఫీజులు కట్టెదమిక
కొడుకునకున్ వేనవేలు,కూతునకొకటే
బడి చాలును ఊరక చె
ప్పెడు చదువను మాట నేడు వీడగవలెగా.
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ పంపించారు. అభినందనలు.
"బడి"కి బదులు "పడి" అని టైపయింది.
బుడిబుడి తడబడు నడకల
రిప్లయితొలగించండికొడుకునకున్ వేనవేలు,కూతునకొకటే
పడిగా లక్షల ముద్దుల
నిడువరె తలిదండ్రులు తమ ఇరుపాపలకున్
పడుకొని నింగిని జూపుచు
రిప్లయితొలగించండికొడుకేమో తారలడిగె కూతురు చంద్రున్
నడుగగ ఇచ్చెద నంటిని
కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!
సనత్ శ్రీపతి గారి పూరణ బహు చక్కగా ఉన్నది.
రిప్లయితొలగించండిఅందరూ ఎవరికి వారే చదువరులని సంతసింపఁజేస్తున్నారు.
అందులో ఒకరి పద్యం అబ్బురపరుస్తుంది భావప్రకటనలో.
ఇలా రాయటం అభ్యంతరకరమైతే మీరు నా వ్యాఖ్యను తొలగించవచ్చు.
అడుగగ ఫీజుల కిచ్చితి
రిప్లయితొలగించండికొడుకునకున్ వేనవేలు; కూఁతున కొకటే
బిడియము, అడగదు ఏమీ;
వెడలెద నేనే బడికిని వివరము లడుగన్.
శంకరయ్యగారూ.. కష్టపడి,ఇష్టపడి,పడి పడీ ఫీజులు కడతారనే అర్థంలొ 'పడి ' అని వాడాను.మీసవరణ బాగుంది.ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగోలి.హనుమచ్ఛాస్త్రి.
పడిఫీజులు కట్టెదమిక బదులుగా పడిపడి ఫీజులు కట్టెద అని మార్చితే సరిపోతుందనుకుంటాను
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
మందాకిని గారు, మీ పేరులానే మీ వ్యాఖ్య నిర్మలం. సనత్ గారి పూరణ బహుచక్కగా ఉంది. సందేహం లేదు. మీ వ్యాఖ్యలో తొలగించే దోషమేదీ లేదు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు రవి గారు!
రిప్లయితొలగించండిఒడిదుడుకులు, చెడునడతల
రిప్లయితొలగించండికొడుకునకున్ వేనవేలు ! కూతున కొకటే
ధృడ సంకల్పము కనబడె
చెడుతో తలబడు , యతండచేతను డయ్యెన్!
రవి గారూ,
రిప్లయితొలగించండికొడుకు కంటే బడ్డకే ఎక్కువ ఇస్తూ చేసిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.
సనత్ శ్రీపతి గారూ,
నిర్మొహమాటంగా చెప్తున్నాను. మీ పూరణ ఉత్తమంగా ఉంది. ఎంత చక్కని భావన? చాలా బాగుంది. అభినందనలు.
మందాకిని గారూ,
మీరు నిరభ్యంతరంగా మీ వ్యాఖ్యలను బ్లాగులో ప్రకటించ వచ్చు. గుణదోష విచారణ చేసే హక్కు నా బ్లాగులో అందరికీ ఉంది. చర్చలకూ అవకాశం ఉంది.
హరి గారూ,
అత్యుత్తమమైన పూరణ. "కూతున కొకటే బిడియము". ఎంత బాగుంది మీ కల్పన! అభినందనలు.
మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ కూడ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
(తలబడు + అతండు) అన్నప్పుడు యడాగమం రాదు. "తలబడ నతండు" అంటే సరి. లేక "చెడుతో తలబడుట; యత డచేతను డయ్యెన్." అన్నా సరిపోతుంది.
ధన్యవాదాలు గురువు గారూ!
రిప్లయితొలగించండినిండు మనసుతో అభినందించిన మందాకినిగారికీ, ఆదరించిన రవిగారికీ, ప్రోత్సహించిన గురువుగారికీ నమస్సుమాంజలి.
రిప్లయితొలగించండి- సనత్ కుమార్ శ్రీపతి
వడివడిగనూడెఁ కురులవి
రిప్లయితొలగించండికొడుకునకు విడువక తండ్రి క్రోమోజోముల్,
విడిచె సుత వంశ నామము,
కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!
వివరణ: తండ్రికి బట్ట తల ఉంటే కొడుకుకు ఖచ్చితముగా వస్తుంది, కాని కూతురికి రాదు. కాబట్టి జీన్సు వలన కొడుకుకు వేలకు వేలు తల వెట్రుకలు ఊడిపోతే, కూతురికి మాత్రము ఒక్క ఇంటి పేరే మారుతుంది.
అందరికీ వందనములు
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అందముగా
అలరించు చున్నవి.
______________________________________
ఎన్ని కష్టాలైనా పడి
ఎంతో ఇష్టంతో ఎన్ని వేలైనా
కొడుకుల కోసం బడి పన్నులు(ఫీజులు)
కట్టే తల్లి దండ్రులు
కూతురి కోసం కడతారా?
ఏమంటారు సాములూ !
01)
______________________________________
ఇడుమలు బడి తలి దండ్రులు
కడు ప్రియమున బడి పన్నులు - కడుదురు ! నటులే
ఇడుదురె ? కూతురు కొరకై !
కొడుకునకున్ వేనవేలు ! - కూఁతున కొకటే!
______________________________________
కడతేర్చును కడవరకని
రిప్లయితొలగించండికొడుకునకున్ వేనవేలు కూఁతున కంటెన్ !
కోడలిగ పరుల పంచకు
వేడుకల బరువు గుండెతొ వీడ్కోలిడగన్ !
కూతుర్ని అశ్రద్ధ చేసి మరీ
రిప్లయితొలగించండివేలకు వేలు తగలేసి
పెద్ద పెద్ద చదువులు చదివిస్తే
ఆ కోడుకులు విదేశాల్లో ఉంటూ
తల్లి దండ్రులకు విషాదం మిగులుస్తున్నారు
కడ చూపుకు కూడా రాకుండా!
02)
______________________________________
కడు దూరములోనుండుట
చెడ చదివిన కొడుకులెల్ల - చిత్రం బయ్యో
కడ చూపుకు రానోచరు
కొడుకునకున్ వేన వేలు ?- కూతున కొకటే ?
_______________________________________
కాష్ఠంలో కాలేటపుడు ఎవరూ నీ వెంట రారుగా !
రిప్లయితొలగించండిఅందర్నీ వదలి వెళ్ళ వలసిందే గదా !
కొడుకులనీ కూతుళ్ళనీ ఎందుకు ఈ తేడాలు???
03)
_______________________________________
ఎడబాయుట తప్పదులే
కొడుకుల గూతుళ్ళ సతుల !- కువలయమందున్
కడ కగ్నిని కాలు నపుడు
కొడుకునకున్ వేన వేలు ?- కూతున కొకటే ?
________________________________________
వసంత్ కిషోర్ గారు, కువలయమందున్ - కువలయము అంటే భువి/భూమి అన్న అర్థం ఉందాండి? నాకు తెలిసిన కువలయం - నీలికలువ.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండి(1) పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి
కోడలు, వేడుక పదాలు సరి కాదు.
(2) సమస్యలో పదాలను మార్చితే అది పద్యం ఔతుంది కానీ పూరణ కాజాలదు. అసలు కిటుకు ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు అన్నదాని పైనే. కనుక మరల ప్రయత్నించ గలరు.
కిశోర్ గారూ,
మీ మొదటి పూరణ బాగున్నది.
2,3 పద్యాల ఇతివృత్తాలు బానే ఉన్నా, పూరణ సమంజసంగా లేదని నాకనిపిస్తోంది. అన్యధా భావించవద్దు. కొడుకునకున్ వేనవేలు, కూతురికి ఒకటే అన్నవి అక్కడ కిట్టినట్టు అనిపించటం లేదు.
నన్ను ప్రభావితం చేసిన వ్యక్త్యులలో శంకరయ్య గారొకరు. వారికి కృతజ్ఞతా పూర్వక నమస్కృతి నా బ్లాగు టపా లో వీక్షించగలరు. మిగిలిన సాహితీ సోదరబృందమునకుకూడా ఈ లంకెను తెలియ పరచగలరు
రిప్లయితొలగించండిhttp://raata-geeta.blogspot.com/
- శ్రీపతి సనత్ కుమార్
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదంలో "పన్నులు" అని జగణం వేసారు. అక్కడ తప్పనిసరిగా నలం కాని, జగణం కాని ఉండాలి కదా! "రుసుములు" అంటే సరి!
రాజేశ్వరి నేదునూరి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
"కూతున కొకటే" అనేది "కూతున కంటెన్" అయింది.
సనత్ శ్రీపతి గారి కంద పద్య లక్షణ సంబంధిత వ్యాఖ్య చూడండి.
రవి గారూ,
కువలయము అంటే భూమండలము, కలువ అనే అర్థాలున్నాయి. కుజము = భూమినుండి పుట్టినది (చెట్టు), కుధరము = భూమిని ధరించేది (పర్వతం) ఇలా ....
అడిగితి నాడు నెమల్లిన్:
రిప్లయితొలగించండి"కొడుకుకు కనులెన్ని యమ్మ? కూతురు కెన్నౌ?"
పడిపడి నవ్వుచు నుడివెను:
"కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
భడవర! పెండ్లెప్పుడనగ
రిప్లయితొలగించండిపడతియె కాంగ్రెసు తనకని పల్కగ బుధుడే...
కడకిక చెలువురు సోనియ
కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!