8, జనవరి 2011, శనివారం

ప్రహేళిక - 36

ఇది ఏ వాహనం?
తే.గీ.
శివుఁడు, మగని తమ్ముఁడు, చచ్చిన తనువును,
పత్రపాలి, జిత్తులమారి, వదన మనఁగ
త్ర్యక్షరపదమ్ము లందలి యాది వర్ణ
ములు దెలుపు వాహనముఁ జెప్పఁ గలరె మీరు?

(పత్రపాలి అంటే కత్తిరించే ఒక సాధనం)
ఆ వాహన మేమిటో చెప్పండి.

5 కామెంట్‌లు:

 1. ధూర్జటి, మఱది,శవము కరణం,టక్కరి,ముఖము=

  ధూమశకటము

  రిప్లయితొలగించండి
 2. ధూమశకటము
  ధూర్జటి
  మరిది
  శవము
  కత్తెర
  టక్కరి
  ముఖము

  రిప్లయితొలగించండి
 3. ధూర్జటి,మఱది,శవము,కత్తెర,టక్కరి,ముఖము

  ధూమశకటము

  రిప్లయితొలగించండి
 4. పత్రపాలికి మీరు యిచ్చిన అర్ధము చూసుకోలేదు. పత్రాలు పాలించేవాడు కరణము యేమో అని ఊహించా. పప్పులో.............

  రిప్లయితొలగించండి
 5. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మైథిలి రాం గారు,
  మీ యిద్దరి సమాధానాలు సరియైనవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి