గురువు గారికి నమస్కారములు. పూర్తి పద్యం వ్రాస్తున్నాను. కాక పోతె ఇంత కంటె వివరాలు ఇవ్వలేను ఎందుకంటే ఎక్కడ చూసానో మర్చి పోయాను..ఇప్పుడు దొరకటల్లేదు బహుశా " మాగంటి " వారి ఓఅర్జి " అనుకుంటాను.
శంకరయ్య గారు! ’సమస్య’ అన్నప్పుడు ఏదైనా అసంగతమైన విషయం ఇవ్వాలి. అప్పుడు కవులు ఆ విషయాన్ని సమంజసమే అన్న రీతిలో ఒప్పించే విధంగా పూరిస్తారు. ఇది ఆనవాయితీ. మీరిచ్చిన " దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా? " లో సమస్య ఏముంది? అదే ... " దద్దమ్మల కీ జగత్తు దాస్య మొనర్చున్! " అంటే అది ’సమస్య’ అవుతుంది. అత్యున్నత స్థాయిలో సాహిత్య ప్రచారం సాగుతున్న మీ బ్లాగులో ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు జరుగకూడదని నా ఉద్దేశ్యం. కాబట్టి ఈ విషయాన్ని ఇక ముందు దృష్టిలో ఉంచుకొంటారని ఆశిస్తున్నాను. దయచేసి అన్యధా భావించకండి.
శ్రీమాన్ డా. అచార్య ఫణీంద్ర గారూ, నమస్కృతులు. మీరు చెప్పింది నిజమే. సమస్య అన్నాక అసంగతమూ, సందిగ్ధమూ అయిన అర్థంలోనే ఉండాలి. అయితే సమస్యలు పంపమని నిన్నటి నా అభ్యర్థనను మన్నించి కొందరు కొన్ని సమస్యలు పంపారు. వాళ్ళను నిరుత్సాహ పరచడం భావ్యం కాదని కోడీహళ్ళి మురళీ మోహన్ గారు పంపిన దాన్ని సవరించకుండా అలాగే ప్రకటించాను. ఇకముందు మీ సూచనను పాటిస్తాను. ధన్యవాదాలు. అబ్బూరి వారి పద్యాన్ని రాజేశ్వరి గారు పంపించారు. దాని వివరాలు మీకు తెలిస్తే చెప్పవలసిందిగా మనవి.
డా.ఆచార్య ఫణీంద్ర గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే నేను సూచించిన ఈ సమస్య ఒక అవధానంలో డా.ఆశావాది ప్రకాశరావు గారిని అడిగినదే. వారి పూరణ ఈ విధంగా వుంది.
గురువు గారికి నమస్కారములు. " అబ్బూరి వారి చాటువు " మాగంటి ఓఅర్గ్జి" లొ దొరికింది. ఇక ఈ పద్యమును " యడవల్లి సూర్యనారాయణ గారిని గురించి వ్రాసినట్లు గా చెప్పారు." యడవల్లి వారు [1888 - 1939 ] వీరు ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు.మరియు తొలితరం సినిమా నటుడు.ఇంకా గుంటూరులొ " అమెచ్యూర్ డ్రమెటిక్ క్లబ్ వ్యవస్థాపకుడు. వీరి సినిమాలు.1.పాదుకా పట్టాభి షేకం 2.శకుంతల 3.సీతా కల్యాణం .4.ద్రౌపదీ వస్త్రాప హరణం ..
అబ్బూరి వారిని గురించి తెలుప మంటే " గూగుల్ " లొ చూసి తెలుప గలను
రాజేశ్వరి నేదునూరి గారూ, పద్యం బాగుంది. అభినందనలు. అబ్బూరి వారి చాటువును గురించిన వివరాలు పంపినందుకు ధన్యవాదాలు. అబ్బూరి వారి గురించి వారి శిష్యులు డా. ఆచార్య ఫణీంద్ర గారి బ్లాగు ముఖపత్రంలోనే కావలసినంత సమాచారం ఉంది. ఒకసారి ఆ సమాచారాన్ని "శంకరాభరణం"లో ఇచ్చాను కూడ.
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ, డా. ఆశావాది ప్రకాశ రావు గారి పూరణను ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఊకదంపుడు గారూ, మీరు తెలుగు టైప్ చేయడానికి దేనిని ఉపయోగిస్తున్నారు? నేను లేఖినిని వాడుతున్నాను. లేఖినిలో మకార పొల్లు రావడం లేదు. "పద్యం" అని అనుస్వారాంతమే అవుతున్నది కాని మకారంతో కూడిన హలంతం కావడం లేదు. బరహా డౌన్ లోడ్ చేసాను కాని కొద్ది సేపు టైపు చేయగానే ముందుకు సాగక ఆ సాఫ్టు వేర్ కొనమని డైలాగ్ బాక్స్ వస్తున్నది.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, మీ లేటెస్ట్ పూరణకూడ చక్కగా ఉండి అలరించింది. అభినందనలు.
అచార్యులు సెలవిచ్చినట్లుగా మన బ్లాగు అత్యున్నత స్థాయిలో సాహిత్య ప్రచారం సాగుతున్న బ్లాగు. ప్రముఖుల పూరణలను పొందుపరచడం కూడా మరింత శోభ నిస్తోంది. అందరికీ ధన్యవాదాలు.
గోలి హనుమఛ్చాస్త్రి
రిప్లయితొలగించండిసుద్దులు విద్దెలు నేర్వక
పెద్దలపై ప్రేమలేక ప్రేలుచు దిరిగే
యెద్దులు,ప్రబుద్ధులునగు
దద్దమ్మలకీ జగత్తు దండుగ కాదా.
సుద్దులు రుద్దెడు బుద్దుల
రిప్లయితొలగించండిప్రొద్దున మాపున దలంప, పోవును చాలా !
ముద్దులు ,మురిపెము వద్దను
దద్దమ్మల కీ జగత్తు దండగ కాదా !
చద్దన్నము చవి దక్కదు
రిప్లయితొలగించండిపెద్దమ్మయు నింట జేరు పెదవులు కదలన్
సద్దులు నష్టమె మొద్దుకు
దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా !!
వద్దను వారలు కలరే
రిప్లయితొలగించండిఒద్దికగ శ్రమపడి వృద్ధి నొందిన జగతిన్
బద్దకము వీడగ వలయు
దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా?
సుద్దులు వినకయె ఊరక
ప్రొద్దును పుచ్చుచు మనెదరు పోరంబోకుల్
దిద్దగ నేర్వరు నడతల్
దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా?
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో చివర ఒక లఘువు తక్కువయింది. "ప్రబుద్ధులే యగు" అన్నా, "ప్రబుద్ధులగు నా" అన్నా సరిపోతుంది.
మంద పీతాంబర్ గారూ,
బాగుందండీ మీ పద్యం. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
పద్యం బాగుంది. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
ఒద్దని వారంటున్నను
రిప్లయితొలగించండిమద్దతు నిచ్చెద నటంచు మరిమరి యనుచున్
ప్రొద్దులు పుచ్చుచు గడిపెడు
దద్దమ్మల కీజగత్తు దండుగ కాదా?
బుద్ధిని హరిపై నిలుపుచు
రిప్లయితొలగించండిసుద్దుల పరిశుద్ధి యుంట సుకృతము గాదే
హద్దులు దెలిసిన జడులా
దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా ?
హరి గారూ,
రిప్లయితొలగించండిచాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
"ఒద్దని" గ్రామ్యం. "వద్దని" అంటే సరి!
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిచక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మీరు వసంత్ కిశోర్ గారి బాట పడుతున్నారు. సంతోషం!
మొద్దగు బుధ్ధియు బుర్రయు
రిప్లయితొలగించండిదద్దమ్మల,కీ జగత్తు దండుగ కాదా
దద్దమ్మలైన పిల్లలు?
పెద్దలు సుద్దులను చెప్పి పెంచగవలయున్
ముద్దియ ముద్దులు వద్దని
రిప్లయితొలగించండికొద్ది పదవికైన ఓట్లు గుద్దించు కొనన్
హద్దులు పద్దులు రుద్దెడు
దద్దమ్మల కీజగత్తు దండుగ కాదా?
శంకరయ్య గారూ
రిప్లయితొలగించండిమీరు చేసిన సవరణకు ధన్యవాదములు.'ప్రబుద్ధులునుయగు ' అనుకొన్నాను.టైపు తొందరలో అలా జరిగినది.
గోలి హనుమచ్ఛాస్త్రి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
ఎఱ్ఱాప్రగడ రామ్మూర్తి గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండి"ప్రబుద్ధులును + అగు" అన్నప్పుడు యడగమం రాదండీ.
గురువు గారికి నమస్కారములు. పూర్తి పద్యం వ్రాస్తున్నాను. కాక పోతె ఇంత కంటె వివరాలు ఇవ్వలేను ఎందుకంటే ఎక్కడ చూసానో మర్చి పోయాను..ఇప్పుడు దొరకటల్లేదు బహుశా " మాగంటి " వారి ఓఅర్జి " అనుకుంటాను.
రిప్లయితొలగించండి" ఎడవల్లి సూరనారయ
చెడ దొబ్బెను నలును పార్లు చీ !
ఏ ముండా కొడుకిచ్చె వీనికింబలి
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరయ్య గారూ
రిప్లయితొలగించండిఓపికగా మాకు సరియగు పద(పథ)ములు చూపుచున్నందులకు ధన్యవాదములు.
గోలిహనుమచ్ఛాస్త్రి
క్షమించాలి
రిప్లయితొలగించండిఎడవల్లి సూరనారయ
చెడదొబ్బెను నలును పార్టు చీ ! ఏ ముండా
కొడుకిచ్చె వీనికింబలి
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్ !
శంకరయ్య గారు!
రిప్లయితొలగించండి’సమస్య’ అన్నప్పుడు ఏదైనా అసంగతమైన విషయం ఇవ్వాలి. అప్పుడు కవులు ఆ విషయాన్ని సమంజసమే అన్న రీతిలో ఒప్పించే విధంగా పూరిస్తారు. ఇది ఆనవాయితీ.
మీరిచ్చిన " దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా? " లో సమస్య ఏముంది? అదే ... " దద్దమ్మల కీ జగత్తు దాస్య మొనర్చున్! " అంటే అది ’సమస్య’ అవుతుంది.
అత్యున్నత స్థాయిలో సాహిత్య ప్రచారం సాగుతున్న మీ బ్లాగులో ఇలాంటి చిన్న చిన్న లోటుపాట్లు జరుగకూడదని నా ఉద్దేశ్యం. కాబట్టి ఈ విషయాన్ని ఇక ముందు దృష్టిలో ఉంచుకొంటారని ఆశిస్తున్నాను. దయచేసి అన్యధా భావించకండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి నేదునూరి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
ముద్దులు మురిపెము నీయగ
రిప్లయితొలగించండివద్దనుచు చదువు సంధ్యలు బేలరి వలెనన్!
ఎద్దులవలె మొద్దుగ తిరిగెడు
దద్దమ్మలకీ జగత్తు దండుగ కాదా ?
[ దద్దమ్మలకీ జగత్తు దాస్య మొనర్చున్ ]
బేలరి = అవివేకి , వంచకుడు , మోసాగాడు.
శ్రీమాన్ డా. అచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండినమస్కృతులు. మీరు చెప్పింది నిజమే. సమస్య అన్నాక అసంగతమూ, సందిగ్ధమూ అయిన అర్థంలోనే ఉండాలి. అయితే సమస్యలు పంపమని నిన్నటి నా అభ్యర్థనను మన్నించి కొందరు కొన్ని సమస్యలు పంపారు. వాళ్ళను నిరుత్సాహ పరచడం భావ్యం కాదని కోడీహళ్ళి మురళీ మోహన్ గారు పంపిన దాన్ని సవరించకుండా అలాగే ప్రకటించాను. ఇకముందు మీ సూచనను పాటిస్తాను. ధన్యవాదాలు.
అబ్బూరి వారి పద్యాన్ని రాజేశ్వరి గారు పంపించారు. దాని వివరాలు మీకు తెలిస్తే చెప్పవలసిందిగా మనవి.
డా.ఆచార్య ఫణీంద్ర గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే నేను సూచించిన ఈ సమస్య ఒక అవధానంలో డా.ఆశావాది ప్రకాశరావు గారిని అడిగినదే. వారి పూరణ ఈ విధంగా వుంది.
రిప్లయితొలగించండిఎద్దులవలె పొర్లాడుచు
నిద్దురలో కాలమెల్ల నెరి గడిపెడు నా
మొద్దులకున్ గద్దలకున్
దద్దమ్మలకీ జగత్తు దండుగ గాదా!
గురువు గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండి" అబ్బూరి వారి చాటువు " మాగంటి ఓఅర్గ్జి" లొ దొరికింది.
ఇక ఈ పద్యమును " యడవల్లి సూర్యనారాయణ గారిని గురించి వ్రాసినట్లు గా చెప్పారు." యడవల్లి వారు [1888 - 1939 ] వీరు ప్రముఖ తెలుగు రంగస్థల నటుడు.మరియు తొలితరం సినిమా నటుడు.ఇంకా గుంటూరులొ " అమెచ్యూర్ డ్రమెటిక్ క్లబ్ వ్యవస్థాపకుడు. వీరి సినిమాలు.1.పాదుకా పట్టాభి షేకం 2.శకుంతల 3.సీతా కల్యాణం .4.ద్రౌపదీ వస్త్రాప హరణం ..
అబ్బూరి వారిని గురించి తెలుప మంటే " గూగుల్ " లొ చూసి తెలుప గలను
రాజేశ్వరమ్మగారూ, అబ్బూరి వారి పద్యమ్ గురించి సమాచారం పంచుకున్నందుకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిరాజేశ్వరి గారిచ్చిన సమచారమునకు కృతజ్ఞతలు. కోడేహళ్ళి మురలీమోహన్ గారు డా. ఆశావాది గారు చెప్పిన పద్యము మనకు చెప్పడము సంతోషకరము.
రిప్లయితొలగించండిభీముడు :
పెద్దన సుద్దులు వింటిమి
ఒద్దికగా నింతవరకు నోర్చుచు నెగ్గుల్
గుద్దుల వేళయె కృష్ణా
దద్దమ్మల కీ జగత్తు దండగ గాదా !
రాజేశ్వరి నేదునూరి గారూ,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. అభినందనలు.
అబ్బూరి వారి చాటువును గురించిన వివరాలు పంపినందుకు ధన్యవాదాలు.
అబ్బూరి వారి గురించి వారి శిష్యులు డా. ఆచార్య ఫణీంద్ర గారి బ్లాగు ముఖపత్రంలోనే కావలసినంత సమాచారం ఉంది. ఒకసారి ఆ సమాచారాన్ని "శంకరాభరణం"లో ఇచ్చాను కూడ.
కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
డా. ఆశావాది ప్రకాశ రావు గారి పూరణను ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఊకదంపుడు గారూ,
మీరు తెలుగు టైప్ చేయడానికి దేనిని ఉపయోగిస్తున్నారు? నేను లేఖినిని వాడుతున్నాను. లేఖినిలో మకార పొల్లు రావడం లేదు. "పద్యం" అని అనుస్వారాంతమే అవుతున్నది కాని మకారంతో కూడిన హలంతం కావడం లేదు. బరహా డౌన్ లోడ్ చేసాను కాని కొద్ది సేపు టైపు చేయగానే ముందుకు సాగక ఆ సాఫ్టు వేర్ కొనమని డైలాగ్ బాక్స్ వస్తున్నది.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ లేటెస్ట్ పూరణకూడ చక్కగా ఉండి అలరించింది. అభినందనలు.
గురువు గారూ! లేఖినిలో padyam అని టైపు చేస్తే పద్యమ్ వస్తోంది గదా!
రిప్లయితొలగించండిఅచార్యులు సెలవిచ్చినట్లుగా మన బ్లాగు అత్యున్నత స్థాయిలో సాహిత్య ప్రచారం సాగుతున్న బ్లాగు.
రిప్లయితొలగించండిప్రముఖుల పూరణలను పొందుపరచడం కూడా మరింత శోభ నిస్తోంది. అందరికీ ధన్యవాదాలు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిpadyam - పద్యం, padyaM - పద్యం, pada~m - పదఙ్, padya~M - పద్య~ం. padya@m - పద్యఁ, padya@M - పద్యఁ. padya^m - పద్య్‌ం, padya^M - పద్య్ం
ఇలా ఎన్ని రకాలుగా టైపు చేసినా దిక్, ఆగ్, అచ్, ఆజ్, షట్, గుడ్, సత్, యాద్, మన్, అప్, రబ్, సుర్, హల్, దివ్, దిశ్, బుష్, మిస్ మొ. వాటిలాగా మకారాంతంగా టైపు చెయ్యలేక పోతున్నాను (లేఖినిలో).
లేఖినిలో మ్ కోసం m&^ టైపు చేయండి
రిప్లయితొలగించండిఇలాంటి ఇబ్బంది కలిగినప్పుడు ఒకసారి లేఖిని సహాయం పేజి
& ఆ పేజిలో "కొన్ని క్లిష్టమైన పదాల" పట్టిక చూడగలరు
http://lekhini.org/help.html
రంజని గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
నిద్దురలో మెలకువలో
రిప్లయితొలగించండిప్రొద్దున రాతిరి బలుపగు బొక్కసమందున్
ముద్దుగ నోట్లను లెక్కిడు
దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా?
రిప్లయితొలగించండిపెద్దలు బుద్ధిగ పద్యపు
మిద్దెలు కడుతుండగా సమీరా! కామిం
ట్లద్దరి బ్లాగ్లోకమ్మున
"దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా?"
జిలేబి