2, జనవరి 2011, ఆదివారం

కవి మిత్రులకు మనవి ....

ఇంతకాలం ఇంట్లో కంప్యూటర్ ఉండడంతో బ్లాగు నిర్వహణ నిరాటంకంగా కొనసాగింది. ఈ రోజు మా అబ్బాయి సిస్టం ను హైదరాబాద్ తీసుకు వెళ్తున్నాడు. రేపటి నుండి "ఇంటర్ నెట్ కేఫ్"లే దిక్కు. అవి సాధారణంగా ఉదయం 10 గంటలకు తెరుస్తారు. వెళ్ళినప్పుడు సిస్టం ఖాళీగా దొరకక పోవచ్చు. దొరికినా నెట్ స్పీడు చాలా తక్కువగా ఉంటుంది.
పోని తక్కువ కాన్ ఫిగరేషన్ తో ఒక కొత్త సిస్టమో లేదా సెకండ్ హాండ్ దో కొందామంటే ప్రస్తుతానికి నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు.
ఏతా వాతా నా మనవి ఏమంటే ....
రేపటి నుండి నా పోస్టులు కాస్త ఆలస్యం కావచ్చు. ఒక్కొక రోజు ఉండక పోవచ్చు. మీ అందరి పూరణలను విడి విడిగా వ్యాఖ్యానిచడం వీలుకాక పోవచ్చు. మీ సందేహాలకు వెంట వెంటనే సమాధానాలు ఇవ్వలేక పోవచ్చు.
కాబట్టి మీరే మిగిలిన కవి మిత్రుల పూరణలను విశ్లేషిస్తూ, గుణదోష విచారణ చేస్తూ, వీలైతే సందేహాలకు సమాధానాలు ఇస్తూ ఉండండి.
వీలైనంత తొందరలో సిస్టం తీసుకొని బ్లాగును సక్రమంగా కొనసాగిస్తాను.
మీకు కలిగిస్తున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను.

70 కామెంట్‌లు:

 1. శంకరయ్య గారు,

  నిస్వార్థంగా సాహిత్య సేవ చేస్తున్న మీకు కంప్యూటరు వియోగం కలగడం నాకు, ఇతర బ్లాగు మిత్రులకు కూడా ఎంతో బాధాకరమైన విషయం.

  ఈ సందర్భంగా ఇతర బ్లాగు మిత్రులకు నా విఙ్ఞప్తి.

  ఈ అవకాశాన్ని వినియోగించుకుని గురువు గారికి కంప్యూటర్ మనమే కొనిద్దాం. అసెంబుల్‌డ్ కంప్యూటర్ విలువ హైదరాబాదులొ పదహారు నుండి ఇరవై వేల మధ్యలో ఉంటుంది.

  నా వంతుగా రూ. 1,116/- వేస్తున్నాను. దయచేసి ఇతర బ్లాగర్లు ముందుకు రావలసిందిగా కోరుతున్నాను.

  వేరే మార్గం లేక పోవడం వల్ల దీనికి మీ బ్లాగును ఉపయోగించు కుంటున్నందుకు గురువు గారు మన్నించాల్సిందిగా కోరుతున్నాను.

  రిప్లయితొలగించండి
 2. హరిగారూ చాలా మంచి ఆలోచన.
  నేను రు 2000 తో రెడీ.

  రిప్లయితొలగించండి
 3. హరిజీ!

  మీ ఆలోచన సమంజసం!

  కాని గురువు గారికి మన మివ్వడ మేమిటండీ బాబూ???!!!

  మన బ్లాగుకు మనమే సమకూర్చు కుంటున్నాం!

  నా వంతుగా రూ 1,116/-లు.

  రిప్లయితొలగించండి
 4. శంకరయ్యగారు, మీ అడ్రస్ నాకు మెయిల్ చెయ్యగలరా. నేను కూడా కొంత పంపిస్తాను. ఇదీ డబ్బు సాయం అనుకోకండి. మాకోసమే మేము కొంటున్నాము. మీరు వాడేది కూడా మాకోసమే అనుకోండి. తప్పుగా అనుకోవద్దు. మేమందరమూ మీ ఆత్మీయులమే..

  రిప్లయితొలగించండి
 5. హరి గారు, సుమారు కాన్ఫిగరేషన్ పర్లేదు అంటున్నారు కాబట్టి, నాదో సలహా. హెచ్ పీ వాడి నెట్ బుక్ పదిహేను వేలకు లభిస్తుంది. బెంగళూరులో నా మిత్రునికోసం కొనడం జరిగింది.

  రిప్లయితొలగించండి
 6. రవి మీలాటి సాంకేతిక ఉద్యోగులకు, అంకోపరి, నెట్ బుక్ లు బాగుంటాయి కాని డెస్క్ టాప్ ఐతేనే మంచిది.

  రిప్లయితొలగించండి
 7. స్పందించిన వారందరికీ ధన్యవాదాలు.

  ఇప్పటి వరకు స్పందించిన మొత్తం రూ.4232 + జ్యోతి గారి మొత్తం. జ్యోతి గారు, మీరు ఎంత పంపించ గలరో చెపితే ఒక అవగాహన ఉంటుంది. ఈరొజు, రేపు మరింత మంది స్పందిస్తారని ఆషిద్దాం.

  జ్యోతిగారు, వారికి డబ్బు పంపించడం కన్నా మనమే కంప్యూటర్ కొని వారికి అందజేయడం, లేదా హైదరాబాదులో ఉన్న వారి కుమారునికి అందజేయడం ఉత్తమంగా ఉంటుందనేది నా భావన.

  రవిగారు, నెట్‌బుక్ లొ హార్డ్‌డిస్క్ స్టొరేజీ ఉండదు. కేవలం ఇంటర్నెట్ పై ఆధార పడాలి. ల్యాప్‌టాప్‌ల ఖరీదు ఎక్కువ.

  రిప్లయితొలగించండి
 8. ఔను.
  కంప్యూటరు
  అంద జేయుటే
  ప్రశస్తమైన ఆలోచన.

  రిప్లయితొలగించండి
 9. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, జనవరి 03, 2011 8:55:00 AM

  మిత్రులకు,
  ఈ విధం గా చంద్రునికో నూలు పోగు సమర్పించే భాగ్యం కలిగినందులకు చాలా సంతోషం. ఎవరైనా బ్యాంక్ వివరాలు పంపగలిగితే నేను గురుదక్షిణ గా రూ. 1116/- సమర్పించుకుంటాను.
  గమనిక: శంకరాభరణం శిష్యగణం డెస్క్ టాప్ ఒకటే కాకుండా అన్ని Accessories (స్పీకర్లు, మైకు, ప్రింటరు, UPS) కూడా సమకూర్చాలని మనవి.

  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం (బెంగళూరు)

  రిప్లయితొలగించండి
 10. శంకరయ్యగారితో ఇప్పుడే మాట్లాడాను. ఆయన ఇలా పోస్టు పెట్టినందుకు చాలా గిల్టీగా ఫీలవుతున్నారు. కాని మేమంతా మాకోసమే కొనిస్తున్నాము అని చెప్పాను. వరంగల్ లోకూడా కంప్యూటర్లు ఈజీగానే దొరుకుతాయంట.హైదరాబాదుకు అక్కడికి నాలుగైదువందల తేడా ఉంటుంది. అన్నారు. హైదరాబాదు అంటే మళ్లీ మోసుకెళ్లడం కష్టంకదా. ఆయన అకౌంటులో డబ్బులు వేద్దామా?? SBI అకౌంట్. అన్లైన్ కూడా ట్రాన్ఫర్ చేయొచ్చు.

  రిప్లయితొలగించండి
 11. @ జ్యోతి గారు
  దయచేసి అకౌంట్ నెంబర్ వివరాలు తెలియజేయగలరు ...ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 12. జ్యోతమ్మా !

  ఏ bank???
  SBI or SBH ?
  కొంచెం విశద పరచండి!

  రిప్లయితొలగించండి
 13. మిత్రులందఱికీ ధన్యవాదములు. నా ఉడుతా సాయము నేను చేస్తాను, మన బ్లాగు కోసము

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. నా మాటను బలపరిచి ముందుకు వచ్చిన మిస్సన్న గారికి, వసంత్ కిషోర్ గారికి, జ్యోతి గారికి, నచికేత్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, జిగురు సత్యనారాయణ గారిక్, విష్ణునందన్ గారికి, మలక్‌పేట్ రౌడీ గారికి, నరసింహ మూర్తి గారికి ధన్యవాదాలు.

  మాకందరికి మార్గం సుగమమం చేసిన జ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

  ***

  శంకరయ్య గారు, ఇది మా అందరి సమిష్ఠి బాధ్యత, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని మనవి.

  ***

  నేను నావంతు వెయ్యి నూట పదహార్లు అప్పుడే చెల్లించాను. ఇక్కడ చూడండి.

  రిప్లయితొలగించండి
 16. హరిగారు, రుజువు చూపాల్సిన అవసరం లేదండి. నేను కూడా మా అబ్బాయిని పంపి వెయ్యినూట పదార్లు వేయించాను. ఎవరెవరు ఎంత వేసారో ఇక్కడ చెప్తే లెక్క తెలుస్తుంది. ఇంకా ఎంత సొమ్ము అవసరమవుతుందో..

  రిప్లయితొలగించండి
 17. hi Jyoti garu,, I didn't expect this, but in warangal there are many sbh branches. Can u plz give location details or IFSC Code ?

  in link given by hari garu it is mentioned as main-warangal.,
  but is it NIT CMPX, HNK-KAZIPET MAIN RD,WARANGAL or MAIN RD, KAZIPET ?

  రిప్లయితొలగించండి
 18. ఇప్పటివరకు జమ అయిన మొత్తం:

  హరి: 1116
  జ్యొతి: 1116
  మైత్రేయి: 1000
  --------------
  మొత్తం: 3232
  --------------

  రిప్లయితొలగించండి
 19. కవి మిత్రులకూ, శ్రేయోభిలాషులకూ నమస్కృతులు.
  ఈ రోజు ఓరుగల్లు కోటలో మా బావగారి ఇంట్లో నా మెయిల్ తెరిచి చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. నిన్నటి నా పోస్ట్ కు ఇంతటి స్పందనను నేను ఊహించలేదు. నా పట్ల, ఈ బ్లాగు పట్ల మీరు చూపుతున్న ఆదరాభిమానాలను వ్యాఖ్యానించడానికి, ప్రశంసించడానికి నాకు మాటలు కరువయ్యాయి. వెంటనే అందరినీ సంబోధిస్తూ లేఖినిలో వ్యాఖ్య టైపు చేస్తుండగా పవర్ కట్!
  ప్రస్తుతం నేను హైదరాబాదులో ఒక నెట్ సెంటర్ లో ఉన్నాను.
  వాస్తవానికి నేను ఆ పోస్టులో "ఆర్థిక ఇబ్బందులు" అన్న మాట పెట్టినందుకు అపరాధభావంతో (గిల్టీ ఫీలింగుతో) పశ్చాత్తాప పడుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి.
  వెంటనే స్పందించి నా సమస్యను తీర్చడానికి ముందుకు వచ్చి, మిగిలిన వారిని ప్రోత్సహించి, నిర్వహణా బాధ్యతను భుజాలమీద వేసుకొన్న హరి గారికి, మిస్సన్న గారికి, వసంత్ కిశోర్ గారికి, జ్యోతి గారికి, రవి గారికి, నచికేత్ గారికి, మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారికి, జిగురు సత్యనారాయణ గారికి, విష్ణు నందన్ గారికి, మలక్పేట్ రౌడీ గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, మైత్రేయి గారికి కృతజ్ఞతా పూర్వక నమోవాకాలు.
  మీ రందరూ నా బ్లాగు నిర్వహణ బాధ్యతను రెట్టింపు చేసారు. వీలైనంత తొందరగా సిస్టం తీసికొని ద్విగుణీకృత ఉత్సాహంతో నా బ్లాగును కొనసాగిస్తాను.

  రిప్లయితొలగించండి
 20. గురువు గారూ మీరు మీ బ్లాగు ద్వారా మమ్మల్ని ప్రోత్స హిస్తూ ఉత్తేజితుల్ని చేస్తున్నందుకు మీరు తీసుకునే శ్రమకు ఇలా చేయడం మా కనీస ధర్మం.

  రిప్లయితొలగించండి
 21. ఈ మధ్య చాలా బిజీగా ఉండి, సిస్టమ్ ముట్టుకోడం లేదు. ఇవాళే కాస్త టైమ్ దొరికి మెయిల్స్ చూసేసరికి జ్యోతి గారి మెయిల్ ద్వారా విషయం తెలుసుకొన్నాను. నా వంతుగా రెండు వేల రూపాయలను సారస్వత సేవకులు, సాహితీమిత్రులు శంకరయ్య గారి అకౌంట్లో రేపు వేస్తాను.

  రిప్లయితొలగించండి
 22. జ్యోతిగారు, ఆలస్యానికి అన్యధాభావించవద్దు.

  నా వంతు ఉడతా భక్తిగా 1116/- ఈ క్రింది అక్కౌంటుకు బదిలీ చేశాను. కొన్ని కొన్ని సార్లు బ్రాంచ్ పేరు, అది ఉండే ప్రదేశం ఒకటికాకపోవచ్చు కనుక, వారి అక్కౌంటు బుక్కుమీద బ్రాంచి ప్రదేశం ఈ క్రింది విధంగానె ఉందా లేదా కనుక్కో గలరు...

  NIT CMPX, HNK-KAZIPET MAIN RD,WARANGAL, WARANGAL

  రిప్లయితొలగించండి
 23. అయ్యో అది కాదండి. Main Road Warangal కి ట్రాన్ఫర్ చేయండి..

  రిప్లయితొలగించండి
 24. ఇప్పుడే రూ. 1116/- జ్యోతి గారిచ్చిన అకౌంట్ కి బదిలీ చేసాను.
  నూతన సంవత్సర ఆరంభం లో గురుదక్షిణ సమర్పించే సదవకాశం కల్పించిన హరి గారికీ, శంకరాభరణం సహచరులకీ, గురువు గారికీ నా కృతజ్ఞతలు.

  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 25. నేను నిన్ననే
  రూ1200/-లు
  పై A/c కు
  remitt చేసాను.

  A/c No. unique number కాదా ?

  branch గురించి ఎందుకు worry
  అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు

  రిప్లయితొలగించండి
 26. జ్యోతి గారూ, అనుకున్నంతా అయ్యింది.
  Main Road Warangal అన్న పేరుతో బ్రాంచి లేదు.

  మీరిచ్చిన IFSC కోడు SBHY0020148 కు అడ్రస్సు: 9-1-2, J P N RD, WARANGAL

  Main Road Warangal అన్న పేరుకు దగ్గరగా ఉన్న అడ్రస్సు: NIT CMPX, HNK-KAZIPET MAIN RD,WARANGAL. దాని IFSC కోడు SBHY0020149.

  మైత్రెయి గారి వచ్చిన డౌటే నాకూ వచ్చింది. ఆవిడ అన్నారని నేను కూడా బదిలీ చేసేశా... ముందుగా అడగవలసిందేమో... అయినా అక్కౌంటు నంబరు సరిగానే ఇచ్చాం కాబట్టి బదిలీ సరిగానే ఔతుందేమోనని ఆశిద్దాం..

  రిప్లయితొలగించండి
 27. వసంత్ గారూ, నేననుకోవడం... అన్ని వివరాలు సరిపోకపోతే బదిలీ జరగకపోవచ్చు. (పేరు, అక్కౌంటు నంబరు, కోడు). అక్కౌంటు నంబరు ఒక్కదానితో transfer జరిగే అవకాశమే ఉంతే అన్ని బ్రాంచీల వివరాలు, వాటి IFSC కోడులూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా...

  చెక్కులైతే ఆయా బ్రాంచీలకి పంపబడతాయి. ఫలాన బ్రాంచిలో మనమిచ్చిన అక్కౌంటు లేకపోతే అది మిగిలిన బ్రాంచీల్లో ఎక్కడ ఉందో అక్కడకు పంపిద్దాం అన్నట్టుగా ఉండదు. వెనక్కి తిరిగి పంపించబడతాయి. ఆన్ లైన్లో, అందునా వేరే బ్యాంకులతో లవాదేవీలు జరిగేటప్పుడు.. బ్రాంచీ బ్రాంచీలకి మధ్య సంచిత నిధి (consolidated fund)పంపబడుతుంది, దానికి అనుబంధంగా (enclosure) ఏ అక్కౌంటుకు జమచేయాలి, ఏ అక్కౌంటుకు ఖర్చురాయాలి అన్న వివరాలు పంపబడతాయి. అందులో అక్కడున్న బ్రాంచి వివరాలను పంపే వాళ్ళు ఖరారు చెయ్యలేరు. అందుకే IFSC కోడు వాడబడేది.ఏ అక్కౌంటు వివరాలు సరిపోవో, వాటిని సస్పెన్సులో పెట్టి ఉంచటమో, తిరిగి వెనక్కి జమచెయ్యటమో జరుగుతుంది. ఏ విషయమూ వారం రోజుల్లో తేలిపోతుంది లెండి.

  రిప్లయితొలగించండి
 28. ఇప్పుడు ఎస్బీహెచ్ లొ అన్నీ యునిక్ నంబర్లే. కాబట్టి వేరే అకౌంటులో పడే అవకాశమే లేదు.

  రిప్లయితొలగించండి
 29. ఆ code లన్నీ bank వాళ్ళ కోసం

  నాకు తెలిసి నంత వరకూ
  పేరు మరియు A/c No. tally ఐతే
  ఎవరు ఎక్కడి నుండై నా ఆ A/cకి డబ్బు
  trasfer చెయ్యవచ్చు.

  ఈ విషయంలో bank వాళ్ళెవరైనా
  స్పందిస్తే బాగుంటుంది

  రిప్లయితొలగించండి
 30. మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
  ఇప్పటికే కొందరు పంపిన డబ్బు నా అకౌంట్ లోకి వచ్చి చేరింది. బ్యాంకు చిరునామా విషయంలో సందిగ్ధత కలుగుతున్నదని కొందరు అంటున్నారు.
  ఆ వివరాలు ఇవి .......
  Kandi Shankaraiah
  S.B. A/c No. 62056177880
  State Bank of Hyderabad.
  Warangal Main Branch,
  J.P.N. Road,
  Warangal.
  IFSC Code: SBHY0020148.

  రిప్లయితొలగించండి
 31. మిస్సన్న మహాశయా!
  మీరు bank employee గదా!
  సందేహ నివృత్తి చేయండి మరి!

  unique number కి online money transfer
  చేయుటకు bank code అవసరమా?

  రిప్లయితొలగించండి
 32. ఒకే బ్యాంకు యొక్క ఇతర శాఖలలోని ఖాతాలలో చేయుటకు ఏ code number అవసరము లేదు ఇతర బ్యాంకులలోని ఖాతాలలో జమ చేయాలంటే IFSC కోడ్ అవసరము SBH యొక్క IFSC code No : SBHY0020XXX. ఈ 11 digit code లోచివరి మూడు అంకెలు ఆ బ్రాంచ్ యొక్క కోడ్.

  రిప్లయితొలగించండి
 33. మంద పీతంబార్ గారు చెప్పింది నిజం. రెండు వేర్వేరు బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలకు ఐ యఫ్ సి కోడ్ అవసరం. ఒకే బ్యాంకు యొక్క రెండు శాఖల మధ్య జరిగే వాటికి ఖాతా నెంబరు సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 34. హరిగారూ గురువుగారి ఖాతాకు ఈరోజు నేను డబ్బులు పంపించాను.

  రిప్లయితొలగించండి
 35. నేను ఇప్పుడే 1500/- ట్రాన్స్‌ఫర్ చేశాను. రేపటిలోగా అవి జమ కావొచ్చు.

  రిప్లయితొలగించండి
 36. పీతాంబర ధరునికీ
  మిస్సన్న మహాశయులకూ
  కృతఙ్ఞతాభి వందనములు.

  నిన్న నేను
  name, A/c No, amount - remittance slip లో వ్రాసి
  SBH ,TANUKU branch కి పంపించాను cash ఇచ్చి
  ఏ ఇబ్బందీ లేకుండా పని జరిగింది.

  మీరు చెప్పే దానిని బట్టి
  వేరే bank (suppose SBI) కి పంపితే IFSC code అవసరమా???
  SBH కి అఖ్ఖర్లేని code SBI కి మాత్రం ఎందుకు???

  అసలు IFSC code అంటే ఏమిటి???

  unique number అంటే ప్రపంచం మొత్తం మీద SBH ఎక్కడున్నా
  ఈ number తో వేరే A/c ఉండదు గదా !?

  ఇదే పేరుతో వేరే వ్యక్తి ఉన్ననూ
  అతనికి మరొక A/c number ఉంటుందిగదా!

  వీలైతే నా కుశ్శంకలు తీర్చ గలరు(విసుక్కోకుండా)
  ఎందుకంటే
  మనకు i mean నాకు bank knowledge పూజ్యం .
  అందుకని.
  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 37. చెక్కు డిపాజిట్ చెయ్యడానికి IFSC number ఆవ్సరం లేదు. కానీ ఆన్‌లైన్‌లో డిపాజిట్ చెయ్యలంటే IFSC Code లేదా బ్రాంచ్ వివరాలు తెలియాలి.

  IFSC - Indian Financial System Code

  రిప్లయితొలగించండి
 38. వసంత కిషోర్ గారూ ఆన్ లైన్ అంటే మీ దృష్టి లో యునిక్ నెంబర్ ఒకే బ్యాంక్లో ఉండే ఖాతాలకు మాత్రమె వర్తిస్తుంది. యస్ బి హెచ్ లో ఉన్న ఖాతా నెంబర్ ఒక వ్యక్తికీ ఒకటే ఉంటుంది. ఆ ఖాతాకు దేశంలో ఎక్కడ ఉన్న మరో యస్ బి హెచ్ బ్రాంచ్ నుంచైనా డబ్బును పంపాలంటే ఆ ఖాతా నెం ఇస్తే చాలు. అలాగే ఏ బ్యాంకుకు ఆబ్యాంకు ఖాతా నెంబర్లు అన్నమాట.
  ఇక ఖాతాలకు సంబంధించి నంత వరకూ యస్ బి ఐ వేరు. యస్ బి హెచ్ వేరు.
  ఐ యఫ్ యస్ సి అంటే శ్రీ నచికేత్ గారు చెప్పారు.
  ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు లావాదేవీలు జరుపుకోవడానికి అది అనుసంధాన కర్త అన్నమాట. అంటే మన పట్టణాలలో నగరాలలో ఉండే క్లియరింగ్ హౌస్ లాగ ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు సొమ్ములు బదిలీ చేసే ఎలక్ట్రానిక్ మాధ్యమ మన్న మాట.
  మీ శంకలు నివృత్తి అయ్యయనుకొంటాను. సెలవు మరి.

  రిప్లయితొలగించండి
 39. నచికేత్ గారికి
  మిస్సన్న మహాశయులకూ
  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 40. మిత్రులు కంది శంకరయ్య గారు!

  ఈ రోజు నా SBI A/C నుండి money transefer చేద్దామని బాంకుకు వెళితే, IFSC No. తప్పనిసరిగా కావాలని వెనుకకు పంపారు. ఇప్పుడు IFSC Code: SBHY0020148 అని తెలిసింది కాబట్టి రేపు money transefer చేయడానికి మళ్ళీ వెళుతాను. డబ్బు అందిన తరువాత ఆ విషయం దయచేసి నాకు తెలుపండి.

  రిప్లయితొలగించండి
 41. ఆలస్యానికి మన్నించవలసినదిగా అందరినీ కోరుతున్నాను.

  నా వంతు ఉడతా భక్తిగా 1000/- పైన పేర్కొన్న అక్కౌంటుకు జమ చేశాను.

  రిప్లయితొలగించండి
 42. @ హరి
  "నెట్‌బుక్ లొ హార్డ్‌డిస్క్ స్టొరేజీ ఉండదు. కేవలం ఇంటర్నెట్ పై ఆధార పడాలి"

  అది పొరపాటు అభిప్రాయం. డెస్క్‌టాప్, లాప్‌టాప్ ల కన్నా నెట్‌బుక్ లలో తక్కువ హార్డ్ డిస్క్ స్పేస్ వుంటుంది అంతే. నాకు వున్నది నెట్‌బుక్. అందులో హార్డ్ డిస్క్ వుంది. నేనయితే డెస్కుటాపులను అంతరించిపోతున్న జాతులుగా భావిస్తాను.మనం సిస్టం వినియోగించడం ముఖ్యంగా ఇంటర్నెట్ కోసమే అయితే నెట్‌బుక్ చక్కగా సరిపోతుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కూడా వుంటుంది.

  రిప్లయితొలగించండి
 43. @శరత్,

  నిజమే, నెట్‌బుక్ అయినా కూడా సరిపోతుంది శంకరయ్యగారికి.

  రిప్లయితొలగించండి
 44. mee sahithya sampada mundu maa danam trunaprayuam nenu veelainantha mothanni andhistanu. blog nirvahanaku sahakaristhanu. balaji-wgl.

  రిప్లయితొలగించండి
 45. నా వంతుగా 500/- జమ చేశాను.

  శరత్ చెప్పింది కరెక్ట్. నెట్ బుక్ HP వారిది పదిహేను వేలకు వస్తుంది. (యేడాది ముందుమాట ఇది) ఇప్పుడు ఇంకాస్త తక్కువ ఉండవచ్చు. నాకు తెలిసి హార్డ్ డిస్క్ మరీ తక్కువగా ఉండదు. కావాలంటే పెన్ డ్రైవ్ వాడవచ్చు.

  రిప్లయితొలగించండి
 46. అందరికీ కృతజ్ఞతాంజలులు.
  మీరంతా ఆదరాభిమానాలతో పంపుతున్న డబ్బు నా అకౌంట్ కు చేరుతున్నది. డెస్క్ టాప్ తీసుకోవాలా, నోట్ బుక్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి ఈ సాయంత్రానికి తీసుకుంటాను. అందరికీ మరొక్కమారు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 47. డెస్క్ టాప్ మంచిది.రఫ్ అండ్ టఫ్.. దానికి ప్రింటర్, స్పీకర్స్ పెట్టుకోవచ్చు. ఎప్పుడూ తిరిగేవాళ్లకు నోట్ బుక్ మంచిది. పైగా ఇది చాలా నాజూకు వ్యవహారం.

  రిప్లయితొలగించండి
 48. శంకరయ్య గారు ఇంతవరకు మీ బ్లాగును చూడకపోవడం నా దురదృష్టం. మీకోసం ఇంత మంది బ్లాగర్లు ఆత్రపడుతున్నరంటే మీ గొప్పదనం అబినండించ వలసిందే !!

  రిప్లయితొలగించండి
 49. శంకరయ్య గారు,
  ఈ రోజు నా ICICI Bank Account నుండి Rs 1000/- ని Transfer చేసాను.

  రిప్లయితొలగించండి
 50. శంకరయ్యగారు ఇంతకుముందే కాల్ చేసారు. అవసరానికంటే ఎక్కువే సొమ్ము అందింది. చాలా ధన్యవాదాలు. ఇక చాలు ఆపండి అని చెప్పమన్నారు. ఎక్కువైన సొమ్ముతో స్కానర్, ప్రింటర్ తీసుకోమన్నాను.

  అందరికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 51. గురువు గారికి సిస్టం కోసం స్పందించిన మిత్రులందరికీ శతాధిక వందనాలు.
  హమ్మయ్య ఇక మన పైత్యాలన్నీ నిరాఘాటంగా కొనసాగించ వచ్చు.

  రిప్లయితొలగించండి
 52. అందరికీ
  ధన్యవాదములు.

  ఔను
  మిస్సన్న మహాశయా!

  మహ చక్కగా చెప్పారు.

  రిప్లయితొలగించండి
 53. నేను ఇప్పుడే చూశాను, కామెంట్లు చదివాను. మీ తెలుగు భాష, సాహిత్యాభిమానం ముందు ప్రస్తుతం చెలరేగుతున్న ఏ ఇతర ప్రాంతీయ దురభిమానం అల్పమైనవని తెలియ చెప్పారు. మనసదోలా కాసేపు ఉద్వేగానుభూతికి లోనై ఆనందించింది.
  ధన్యుడనైతిని.

  రిప్లయితొలగించండి
 54. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మగురువారం, ఫిబ్రవరి 02, 2012 4:22:00 PM

  మిత్రులూ
  నేనో రెండువేలు నేరుగా శ్రీ శంకరయ్యగారికి అందచేయగలను.

  రిప్లయితొలగించండి
 55. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మగురువారం, ఫిబ్రవరి 02, 2012 4:29:00 PM

  అయ్యో నేను చాలా ఆలస్యంగా ఈ విషయం చూసేననమాట.

  రిప్లయితొలగించండి
 56. కామేశ్వర శర్మ గారూ,
  అది ఏడాది క్రితం ముచ్చట!
  అప్పుడు మిత్రులు పంపిన డబ్బుతో సిస్టం కొని, మిగిలిన డబ్బుతో కొన్ని విలువైన గ్రంథాలు కొనుక్కున్నాను.

  రిప్లయితొలగించండి