గన్నవరపు నరసింహ మూర్తి గారూ, పద్యం నిర్దోషంగా, చక్కగా ఉంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ, భాను రావు, వామనుల పూరణలు బాగున్నాయి. సమస్యను కొద్దిగా మార్చి చేసిన పూరణ కూడ బాగుంది. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ, పద్యం బాగుంది. అభినందనలు. "చారి + అను = చారియను" అని యడాగమం వస్తుంది. అక్కడ సంధి లేదు. "బ్రహ్మచారి యనెడు పేరు భావ్య మగునె" అంటే సరి.
మిస్సన్న గారూ, మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. "మాయ కావలి వేల్పుని మాయ"ను చూపించారు. ధన్యవాదాలు.
గురువు గారికీ, శంకరాభరణం సాహితీ మిత్రులందరికీ 'భోగి పండుగ శుభాకాంక్షలు'
రిప్లయితొలగించు- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
శ్రీ శంకరయ్య గారికి, మిత్రు లందరికి సంక్రాంతి శుభాకాంక్షలు .
రిప్లయితొలగించుపాడి పంట లిమ్ము! ఫల పుష్పములనిమ్ము!
గిరులనిమ్ము !పాఱు ఝరుల నిమ్ము!
సంబరాలు తెమ్ము !సంక్రాంతి మహలక్ష్మి !
స్వాగ తింతు నిన్ను సాదరముగ !!!
కాఫి, సిగరెట్టు, విడియమ్ము,కార్డు లాట,
రేసు గుర్రాలు ,బ్రాకెట్టు రేయిపగలు
మోహ తాపమ్ము,పానమ్ము మోదమౌట
బ్రహ్మ చారికి నెనమండ్రు భార్య లౌర!!
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
రిప్లయితొలగించుధన్యవాదాలు. మీకు కూడ నా శుభాకాంక్షలు.
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించుముందుగా మీ సంక్రాంతి స్వాగత పద్యానికి ధన్యవాదాలు.
అష్ట వ్యసనాలను బ్రహ్మచారికి భార్యలుగా చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ అద్భుతము.
బట్ట తల వచ్చె వరునకు వయసు మీరె
రిప్లయితొలగించుపిలిచి పిల్లనివ్వరు నేడు కలిమి లేక
బ్రహ్మచారికి, ఎనమండ్రు భార్య లౌర
ఎట్టు సాధ్యమౌ? శ్రీ కృష్ణ! గుట్టుఁజెప్పు!
బ్రహ్మ విద్యలను పఠించి, పరమ పదము
రిప్లయితొలగించుబ్రహ్మమని తలచిన వాడు బ్రహ్మచారి.
అరయ యదువంశ భూషణుడట్టివాడు
బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించుఅద్భుతంగా ఉన్నాయి మీ పూరణలు. అభినందనలు.
అందరికీ వందనములు.
రిప్లయితొలగించుమరియు సంక్రాంతి శుభా కాంక్షలు.
మిత్రులందరి పూరణలూ
ముచ్చట గొలుపు చున్నవి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించువటుడు మోపిన పాదము భక్తిఁ గడిగి
రిప్లయితొలగించుదిశల ప్రభువులు పూజల దిక్కు లిడిరి
పవన మానము పర్వగ వామనుండు
బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించు01)
రిప్లయితొలగించు__________________________________
భాను రావను , పేరున్న - బ్రహ్మచారి !
వాసి గాంచిన , శ్రీకృష్ణ - పాత్ర ధారి !
అష్ట భార్యల , పెండ్లాడె - నిష్ట పడుచు !
బ్రహ్మచారికి నెనమండ్రు - భార్య లౌర!
___________________________________
02)
రిప్లయితొలగించు____________________________________
అవతారిక :
దనుజ సంతతి , తగ్గింప - ధరణి యందు
కమల సంభవు, కైవార - కారణమున
బ్రహ్మ నాభుడు ప్రభవించె ! - భాగ్య మొదువ
అదితి , కశ్యప మౌనీంద్రు - కాత్మజుడయి !
పూరణ :
చషక , బుడ్డి, కుశా , జిన - సంయుతుండు
జన్నిదము, ముంజి , కౌపీన - ఛత్ర ధారి
బాలకుడు , బలి మఖవాటి - వామనుండు !
బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
____________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుప్రభవ విభవలు యరువది పిల్ల లనగ
రిప్లయితొలగించుబ్రహ్మ చారను పేరది భావ్య మౌనె ?
దివ్య లోకాల దిరిగెడు దేవ మునికి
బ్రహ్మ చారికి నెనమడ్రు భర్య లౌర !
(01) ఇలాగైతే బావుంటుందేమో!!!
రిప్లయితొలగించు__________________________________
భాను రావను , పేరున్న - బ్రహ్మచారి !
వాసి గాంచిన , శ్రీకృష్ణ - పాత్ర ధారి !
చేకొనె!నటన ,నెనిమిది - చేడియలను!
బ్రహ్మచారికి నెనమండ్రు - భార్య లౌర!
___________________________________
విశ్వసంసారి, విశ్వాత్మ, విశ్వ విభుడు,
రిప్లయితొలగించుఅతని జనకు, డనంతు, డస్ఖలితుడయిన
బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
మాయ కావలి వేల్పుని మాయ గాక?
సమస్యను
రిప్లయితొలగించుసుంత
సవరించిన
03)
_______________________________________
ధరలు పయనించు పైపైకి - తార పథము !
తినుట కేమియు నోచరు - దీన జనులు !
వలదు వలదిట్టి సమయాన - భార్య యొంటి !
బ్రహ్మచారికి నెనమండ్రు - భార్య లేల ???
_______________________________________
కలహములు వెట్టి సతులకు కాంతునకును
రిప్లయితొలగించువేడ్క జూడంగ తలబోసె వేల్పు మౌని!
బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర
మాధవుని లీల లెరిగింప మాయ తొలగె.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించుపద్యం నిర్దోషంగా, చక్కగా ఉంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ,
భాను రావు, వామనుల పూరణలు బాగున్నాయి.
సమస్యను కొద్దిగా మార్చి చేసిన పూరణ కూడ బాగుంది. అభినందనలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
పద్యం బాగుంది. అభినందనలు.
"చారి + అను = చారియను" అని యడాగమం వస్తుంది. అక్కడ సంధి లేదు.
"బ్రహ్మచారి యనెడు పేరు భావ్య మగునె" అంటే సరి.
మిస్సన్న గారూ,
మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి.
"మాయ కావలి వేల్పుని మాయ"ను చూపించారు. ధన్యవాదాలు.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించువీధు లందున నడిపించి విశ్వ విభుని
రిప్లయితొలగించుఅమ్మ జూపగ నెంచగ నా మహర్షి ;
మొరలు బెట్టుచు వలదని మ్రొక్కు లిడిరి
బ్రహ్మ చారికి, ఎనమండ్రు భార్య లౌర !
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించునిసందేహంగా మీది అద్భుతమైన పూరణ. అభినందనలు.
శాస్త్రిగారూ ! చక్కగా నున్నది !
రిప్లయితొలగించుశంకరార్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించుకిషోర్ జీ ! ధన్యవాదములు.