16, జనవరి 2011, ఆదివారం

ప్రహేళిక - 41

ఈ కూరగాయ ఏది?
తే.గీ.
వాయసము, స్వప్నము, తిమిరవైరి, వార
ణాసి, సన్యాసి యనెడి రెండక్షరముల
పదముల ప్రథమాక్షరములఁ బట్టి చూడఁ
దెలియు కూరగాయను దెల్పఁ గలరె మీరు?

ఆ కూరగాయ పేరేమిటో చెప్పండి.

3 కామెంట్‌లు:

  1. గురువుగారు మన్నించాలి. మీ సూచన మరచిపోయి ప్రత్యక్షంగా జవాబిచ్చాను.

    రిప్లయితొలగించండి
  2. కాకి,కల,రవి,కాశి,యతి = కాకర కాయ

    మిస్సన్న గారూ మీ వెనుక కుర్చీలో కూర్చున్నాను. నూటికి నూరు రాక పోతే తప్పు మీదే !

    రిప్లయితొలగించండి