18, జనవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 201 (కస్తురి తిలకమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కస్తురి తిలకమ్ము గరళ మయ్యె.

40 కామెంట్‌లు:

  1. కంసునకు :

    కృష్ణు గనిన వేళ కీడుయు మది గొల్పె
    కౌస్తుభమ్ము జూడ కళ్ళు తిరిగె
    వేణు గాన మలర ప్రాణముల్ గతి తప్పె
    కస్తురి తిలకమ్ము గరళ మయ్యె !

    రిప్లయితొలగించండి
  2. మకరజ్యోతి గాంచ సౌకర్యములులేని
    శబరిమలకు వెడలి జనులు చావ
    పన్నువేయు ప్రభుత పనితీరు మారదు
    కస్తురి తిలకమ్ము గరళ మయ్యె!

    రిప్లయితొలగించండి
  3. శ్రీ నరసింహ మూర్తి గారి పూరణ అద్భుతంగా ఉంది .కేరళ ప్రభుత్వాని ఎండగట్టిన హరి గారి పూరణ అంతే అద్భుతంగా ఉంది

    శుభము నిచ్చు నేది ? సుఖము నార్పు నేది?
    హరికి నుదుట నెపుడు మెరియు నేది?
    శివుని గళము నందు చేరియుండిన దేది?
    కస్తురి తిలకమ్ము! గరళ మయ్యె !

    రిప్లయితొలగించండి
  4. ఎందు గలడు వాడు ? ఎచ్చోట నున్నాడు ?
    గగన మందు గలడె? గలెడె వార్ధి ?
    స్తంభ మందు హరిని సంబ్రమంబున గాంచె,
    కస్తురి తిలకమ్ము గరళ మయ్యె !

    (మూర్తి గారి పూరణే స్పూర్తి )

    రిప్లయితొలగించండి
  5. ఆత్మజుండ్రు సేయు నాగడములకును
    అడ్డు చెప్ప లేడు గుడ్డి రాజు
    సంజయుండు పలుక సైచదు నొక్కింత
    కస్తురి తిలకమ్ము గరళ మయ్యె !!!

    రిప్లయితొలగించండి
  6. నీల మోహనునకు, నీల కంధరునకు
    కస్తురి తిలకమ్ము, గరళ మయ్యె
    నరయ ప్రేమ దైవ, మా లయకారుడున్
    గోప భామి నులకు, తాపసులకు.

    రిప్లయితొలగించండి
  7. హరినిఁ జూడ పసిడి హారముల్ వస్త్రముల్
    కస్తురి తిలకమ్ము, గరళ మయ్యె
    బువ్వ భూతపతికి పురహరునకుఁజూడ
    డాంబికమ్ము లేక డంగవుదురు!!

    రిప్లయితొలగించండి
  8. డి.నిరంజన్ కుమార్మంగళవారం, జనవరి 18, 2011 9:13:00 PM

    గన్నవరపు మూర్తి మిన్నగా చెప్పారు
    అందమలరజెప్పె మంద వారు
    దుమ్ము దులిపి నారు దోర్నాల హరిగారు
    కస్తురి తిలకమ్ము గరళ మయ్యె

    రిప్లయితొలగించండి
  9. శ్రీ పీతాంబర్ గారూ ధన్యవాదములు. మీ పూరణలు చాలా అందంగా బాగున్నాయి. మరి 'కస్తూరి తిలకం లలాటఫలకే 'గుర్తు తెచ్చుకొని వ్రాసాము. హరిగారి పూరణ సమయోచితముగా బాగుంది. ఒక్కసారి ప్రాస యతి చూసి సరి చెయ్యండి. శబరిమల విషాదము శోచనీయము. భారత దేశములో ప్రజా వాహినులను అదుపు చేయడము ప్రభుత్వము, స్వఛ్ఛంద సంస్థలు, ప్రజలు నేర్చుకోవాలి. మిస్సన్నగారు, సత్యన్నారాయణ గారు ఒకే భావముతో వ్రాసినా పదాల నడక వేఱు వేఱుగా ఉండి రెండు పూరణలు అందంగా ఉన్నాయి. నిరంజన్ గారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. భక్తి మీర బోయి భగవంతు దర్శనము
    భంగ పడిరి వారు బదులు రాక
    భక్తి యనగ నేమి ? ప్రాణంబు దీయుటయ ?
    కస్తురి తిలకమ్ము గరళ మయ్యె ?
    ------------------------------------
    అమెరి కాలు వచ్చె యైశ్వర్యములు దెచ్చె
    పసుపు కుంక మేల ? పుస్తె కనము.
    పాంటు షర్టు లందు పలకరించు పడతి
    కస్తురి తిలకమ్ము గరళ మాయె !

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అద్భుతముగా
    అలరారు చున్నవి.

    పీతాంబరధరా !
    మీ మొదటి పద్యంలో రెండవ ప్రశ్న !?
    కొంచెం వివరించ గలరా!

    రిప్లయితొలగించండి
  12. నాతో పాటూ మా అమ్మాయి శాంతికి కూడా
    శంకరాభరణ మంటే తగని సంప్రీతి.
    నేను అర్థ రాత్రి దాటితే గాని
    అరసున్న కూడా వ్రాయలేను.
    అందుచేత ప్రొద్దున్నే వచ్చి
    మీరేం వ్రాసారు?గురువు గారేమన్నారు?
    వాళ్ళేమన్నారు? వీళ్ళేమన్నారు?
    అని మిత్రులందర్నీ పేరు పేరునా అడిగి
    కొత్త సమస్య ఏమిటొ తెలుసుకొని గాని నన్ను వదలదు.

    ఈరోజు సరదాగా సమస్యను తననే పూరించమన్నాను.

    రిప్లయితొలగించండి
  13. సరేనని కాస్త ఆలోచించి ఇలా చెప్పింది.

    " తల్లిదండ్రులెంతో కష్ట పడి పిల్లాల్ని అమెరికా గట్రా పంపించి
    వాళ్ళనెంతో అభివృద్ది లోకి తీసుకు వస్తే, వాళ్ళేం జేస్తున్నారు?
    తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పడే స్తున్నారు.................
    అంటూ తను విన్నవీ కన్నవీ అన్నీ కలబోసి
    తల్లిదండ్రుల పాలి కస్తూరీ తిలకంలా
    భాసిల్ల వలసిన పిల్లలు
    వారి పాలిట గరళమవ్వట్లేదూ??? "

    రిప్లయితొలగించండి
  14. అది విని నేను అవాక్కయ్యాను .
    అప్పట్నుంచీ ఆలోచిస్తూనే ఉన్నాను.
    ఈ సమస్యకు పరిష్కారం ఏమిటీ?అని!
    శ్రీశ్రీ గారు చెప్పినట్లు
    "కూటి కోసం కూలి కోసం"--అమెరికాలో
    లేదా మరోచోట సుదూరంలో కొడుకు
    దీనావస్థలో ఇండియాలో తల్లిదండ్రులు.
    దేశ కాల మాన పరిస్థితులు మారినై.

    రిప్లయితొలగించండి
  15. ఏదీ తప్పడం లేదు
    ఏదీ తప్పు కాదు
    అన్న పరిస్థితులు ఈ రోజుల్లో.
    దేశ కాల మాన పరిస్థితులు ఎంతగా మారినా
    కని పెంచి పోషించి అభివృద్ధిలోకి
    తీసుకు వచ్చిన తల్లి దండ్రులను
    అవసాన దశలో ఆదుకోవలసిన భాద్యత పిల్లలదే గదా!

    రిప్లయితొలగించండి
  16. ఆదుకోవడమంటే ఏమిటి?
    వాళ్ళ కింత ముద్ద పడెయ్యడం కాదు గదా!
    అన్నందేముంది నాలుగు ఇళ్ళు
    అడుక్కుంటే కూడా దొరుకుతుంది.
    ప్రతీ తల్లీ తండ్రీ ఏం కోరుకుంటారు పిల్లల్నుంచి?
    కాస్త మమత
    కొంచెం అభిమానం
    మరి కాస్త ఆప్యాయత
    చివరికి వాళ్ళ చేతుల్లోనే కడ దేరి పోవాలని
    పోయేటప్పుడు వాళ్ళ రూపాల్నే కళ్ళల్లో పెట్టుకు పోవాలనీ!

    రిప్లయితొలగించండి
  17. నెలకోసారో వారానికోసారో
    పోనీ రోజుకోసారి ఫోన్ చేసి
    హాయ్ డాడ్ ! హాయ్ మామ్! అనేస్తే
    వాళ్ళ డ్యూటీ ఐ పోయినట్లేనా ???
    కొడుకులంతా ఆలోచించాలి.

    రిప్లయితొలగించండి
  18. ఎంత ఆలోచించినా ఉదయం నుంచీ
    ఏమీ వ్రాయ లేక పోయాను సంతృప్తిగా.
    అసంతృప్తిగానే దాన్ని ఇక్కడ పెడుతున్నాను.

    01)
    ___________________________________________

    కన్నతండ్రి , ఎన్నొ -కష్టాల పాలయి
    అమెరికాకు పంప ! - నతని సుతుడు

    కూడు పెట్ట లేడు - కొరివి పెట్టా రాడు
    (కొర గాని వాడు- కొడుకా ? కొరివా?)
    (ఫుడ్డు పెట్ట నోడు - పుత్రుడెట్లౌతాడు?)
    (కడ చూపు కరవు ! - కర్మకాండకు రాడు !)

    కస్తురి తిలకమ్ము గరళ మయ్యె.

    __________________________________________

    రిప్లయితొలగించండి
  19. నా భావాన్ని సరిగా ప్రకటించ లేక

    "కొండ అద్ద మందు కొంచెమై యుండదా"
    అంటూ కొండల కన్నా మిన్నయైన భావాల్ని
    చిన్న ఆట వెలదిలో బంధించిన
    వేమన్న
    గారి నాశ్రయిస్తున్నాను.

    తల్లి దండ్రు లందు - దయ లేని పుత్రుండు
    పుట్టనేమి వాడు - గిట్ట నేమి
    పుట్ట లోన చెదలు - పుట్టవా గిట్టవా
    విశ్వదాభిరామ - వినుర వేమ
    (వేమన శతకం నుండి)

    రిప్లయితొలగించండి
  20. 02)
    ______________________________________


    నీరు లేక పంట - నెండి పోవుచు నుండ
    బావి త్రవ్వె బ్రదుకు - బాగు పడగ !
    కొమరు డేమొ మడిసె - కూపములో మున్ గి!
    కస్తురి తిలకమ్ము గరళ మయ్యె.

    ______________________________________

    రిప్లయితొలగించండి
  21. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    రెండవ పూరణలో "ఆత్మజుండ్రు" టైపాటు దొర్లింది.

    హరి గారూ,
    భక్తిభావంతో తిలకధారణ చేసి, నలభై రోజులు దీక్షాబద్ధులై ఇరుముడితో దైవదర్శనానికి వెళ్ళిన స్వాములకు ఆ యాత్రే గరళమయింది. పూరణ బాగుంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ రెండు పూరణలూ అలరించాయి. ముఖ్యంగా ప్రశ్నోత్తర రూపమైన మీ మొదటి పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    క్రమాలంకారంతో మీ పూరణ ఉత్తమమై శోభిల్లుతోంది. ధన్యవాదాలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    చాలా బాగుందండీ మీ పూరణ. అభినందనలు.

    నిరంజన్ కుమార్ గారూ,
    పూరణలను చదివి కవిమిత్రులను పద్యంలో ప్రశంసించిన తీరు నన్ను సంతోష పెట్టింది. ఇటువంటి ప్రశంసలే కవిమిత్రులకు టానిక్కులు. ధన్యవాదాలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో "ప్రాణంబు దీయుటయ" అన్నప్పుడు గణదోషం. "ప్రాణంబు దీయుటా" అంటే సరి.

    వసంత్ కిశోర్ గారూ,
    ముందుగా మీ అమ్మాయి "శాంతి"కి నా ఆశీస్సులు. ఉదాత్తమైన ఆలోచన! చాలా సంతోషం. మరి ఆ భావానికి పద్యరూపం ఇవ్వలేదెందుకు? సరె! ఆ భావానికి నా పద్యరూపం ....

    కుల తిలక మనుకొని కోటి యాశల తోడ
    కొడుకు ప్రగతిఁ గోరి యిడుములఁ బడి
    ఆశతోడ నతని నమెరికా పంపఁగా
    కస్తురి తిలకమ్ము గరళ మయ్యె.

    రిప్లయితొలగించండి
  22. వసంత్ కిశోర్ గారూ,
    తొందరపడి పద్యం రాసినందుకు మన్నించండి. మీరు ఒకదాని వెంట మరొక వ్యాఖ్య పెడుతున్నారనుకోలేదు. నేను నా పద్యాన్ని వ్యాఖ్యగా పెట్టి మెయిల్ బాక్స్ తెరిచి చూస్తే మీ పూరణలు కనిపించాయి.
    మీ పూరణలు బాగున్నాయి. అనుకున్న భావాలకు చక్కని పద్యరూపాన్ని ఇచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. శంకరార్యా !
    మీరు గమనించి నటుల లేదు .
    నేను రెండు పూరణలు జేసి యుంటి.

    మొదటి పూరణ లో మూడవ పాదం సంతృప్తిగా లేక
    మూడవ పాదం కోసమే మరొక మూడు వరుసలు
    బ్రాకెట్టులో యుంచితిని.

    ఒక పరి గమనింప గలరు.

    రిప్లయితొలగించండి
  24. శంకరార్యా !
    శుభోదయం!
    గమనించి ప్రశంసించినందులకు
    ధన్యవాదములు.

    నేను కూడా మీలాగే పొరబడి
    నా వినతి పెట్టాను మన్నింప గలరు.

    రిప్లయితొలగించండి
  25. ప్రతిరోజు నాకు వచ్చిన భావాలు ఎవరో ఇక కవివరులకు వస్తున్నాయి. ఈ రోజు జిగురు సత్యనారాయణ గారి వంతు. అయితే నేను ఆయనకన్నా చక్కగా వ్రాసి ఉండలేను కాబట్టి ఆనందంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  26. గురువుగారూ ధన్యవాదములు. వసంత కిశోర్ గారి అమ్మాయి అవేదనకు భావానికి వారి పద్యాలు బాగున్నాయి, మీ రూప కల్పన కూడా అందముగా కస్తూరి తిలకము!వలె ఒప్పింది.

    రిప్లయితొలగించండి
  27. శ్రీ నిరంజన్ కుమార్ గారికి నమస్కారములు మరియు ధన్య వాదాలు.
    నా మొదటి పూరణ లొ టైపో పొరపాటు దొర్లింది సరియైనది యిది
    "శుభము నిచ్చు నేది? సుఖము నార్పున దేది ?"

    శ్రీ వసంత కిషోర్ గారు నేడున్న పరిస్తితులను మీ అమ్మాయి చక్కగా గ్రహించింది .నేటి మన విద్యా విధానములోనే నైతిక విలువలు ,తల్లిదండ్రుల పట్ల , సమాజం పట్ల ఉండాల్సిన బాద్యతల ను గూర్చి చెప్పే ప్రణాలికలు లేవు కదా!
    శుభాన్నిచ్చేది,హరి నుదుట మెరిసేది = కస్తురి తిలకము.
    సుఖముల నార్పేది (హరించేది ),శివుని గళంలో నుండేది = గరళము.

    రిప్లయితొలగించండి
  28. గురువుగారికి నమస్కారములు.
    నన్ను మనసారా ఆశీర్వదించి
    నా భావానికి పద్య రూపమిచ్చి
    నందులకు
    ఎంతో సంతోషం కలిగినది.

    మిక్కిలి ధన్యవాదములు.

    ఇట్లు

    శాంతి

    రిప్లయితొలగించండి
  29. పీతాంబరధరా !
    ధన్యవాదములు.
    మీరు ఒక్క జవాబుకే
    రెండు ప్రశ్నలు సంధించారనుకోలేదు!
    అఙ్ఞానిని.

    రిప్లయితొలగించండి
  30. మూర్తి గారికీ
    పీతాంబరం గారికీ
    నమస్కారములు
    మరియు
    ధన్యవాదములు.

    మీ అందరి పూరణలూ రోజూ చదువుతూ
    ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది.
    ఉంటానండీ.
    మళ్ళీ కలుస్తా

    ఇట్లు

    శాంతి

    రిప్లయితొలగించండి
  31. వసంతకిషోర్ గారూ మీ అమ్మాయి శాంతి చూపించే శ్రద్ధ, ఆలోచనా విధానం ప్రశంసార్హం. ఆశీస్సులు. మా పెద్ద అమ్మాయి పేరు గూడా శాంతి. తను కూడా నా పూరణలు చూస్తూ నాకు సూచనలు చేస్తూ ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  32. వసంత కిశోర్ గారమ్మాయి శాంతికి, మిస్సన్న గారి పుత్రిక శాంతికి కూడా అశీస్సులు,అభినందనలు. మీరు కూడా సమస్యా పూరణలు మొదలు పెట్టి ఈ వేదికను శాంతి మయము చేయాలని మా విజ్ఞప్తి.

    రిప్లయితొలగించండి
  33. మిస్సన్న మహాశయా !
    మీ అమ్మాయి శాంతికి నా శుభాశీస్సులు !

    మా శాంతి మీ శాంతికై స్నేహ హస్తము సాచు చున్నది.

    మూర్తిగారూ ! మీ కోరికే నా కోరిక కూడా !
    త్వరలోనే సాకార మవ్వాలని ఆకాంక్షిద్దాం !

    రిప్లయితొలగించండి
  34. మూర్తి గారికి నమస్కారములు.

    మా నాన్న గారి కోరిక మీ కోరికా
    తీర్చుటకై నా శాయసక్తులా ప్రయత్నిస్తాను.

    ఇట్లు
    శాంతి

    రిప్లయితొలగించండి
  35. వర్షమందు తడిసి వాసుదేవునిపాత్ర
    ధారి మారెనంట ధవుని రీతి
    నుదుటి బొట్టు కంఠ మందు నిల్వంగ నా
    కస్తు రితిల కమ్ము గరళ మయ్యె

    ఆలస్యానికి మన్నించగలరు
    - శ్రీపతి సనత్ కుమార్

    రిప్లయితొలగించండి
  36. శ్రీపతి సనత్ కుమార్ గారి పూరణ వాస్తవానికి దగ్గరగా ఉంది . బావుంది.

    రిప్లయితొలగించండి
  37. శ్రీపతిగారూ చక్కని పూరణ నందించారు.

    రిప్లయితొలగించండి
  38. కిషోర్ గారూ సంతోషం. మా శాంతి మెయిలు అడ్రసు:
    remella.latha@gmail.com

    రిప్లయితొలగించండి