ఏమిటో ..?! ఈ మధ్య సమస్యలు ఇవ్వడమే కాని పూరించే అవకాశం దొరకడం లేదు. న్యాయానికి నేను సమస్యను ఇచ్చినప్పుడు అందరి పూరణలను పరామర్శించిన తరువాత చివర నా పూరణ కూడ ఇవ్వాలి. సమస్యను ఇలా పూరించాలి అనుకుంటానా? అదే భావంతో ఎవరో ఒకరు పూరిస్తున్నారు. మరో ఆలోచన చేసే లోగా మరొకరు. చాలా కాలంగా ఇదే పరిస్థితి. అసలు సమస్య ఇచ్చినప్పుడే ఇదీ నా పూరణ అని ముందే ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. "తలను వంచి నీటిలో ప్రతిబింబించే గగనతలాన్ని చూచే ఆలోచన" చేసాను. దాన్ని గోలి హనుమచ్ఛాస్త్రి గారు (టెలీపతీ ద్వారా తెలుసుకొని) చౌర్యం చేశారు :-) ప్చ్! ఏం చేయను?
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, అద్భుతమైన పూరణ. చాలా సంతోషం. మరో వైపు కోపమూ ఉంది. ఉదయాన సమస్య ఇచ్చే సమయంలో ఈ భావంతోనే నా పూరణ ఇవ్వాలనుకున్నాను. ఎలా తట్టిందో మీకీ ఆలోచన? నాకు శ్రమ తప్పించారు. ధన్యవాదాలు.
నచికేత్ గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. అయినా ఫ్లైటులోంచి క్రిందికి చూస్తే కనిపించేవి మబ్బు తునుకలే కాని గగనతలం కాదు కదా. నే నెప్పుడూ ఫ్లైటు ఎక్కలేదు లెండి :-)
జిగురు సత్యనారాయణ గారూ, గాంధారీ గర్వభంగం కథను గుర్తుకు తెచ్చిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
శంకరయ్యగారూ నాకు టెలీపతి శక్తి ఉన్నదని తెలియజేసినందులకు కృతజ్ఞతలు. ఐనా ప్రశ్నలు ఇచ్చి జవాబు పత్రాలను దిద్దుస్థానములో నున్నారు.మా జవాబులన్నీ మీవే. మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహము.
అందరికీ వందనములు. అందరి పూరణలూ చక్కగా అలరించు చున్నవి. ______________________________________
వారం రోజుల నుండి phone , net problem వలన మిత్రు లందర్నీ మిస్సయ్యాను. _______________________________________
అందరూ అన్ని రకాలుగా పూరించేసారు. గురువుగారికి రోజూ ఎదురయ్యే సమస్యే నాకిప్పుడు. ఐనా ప్రయత్నిస్తాను. ________________________________________
మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం గారి ఉవాచ: "శక్తికి మించిన కలలు కనండి శక్తివంచన లేకుండా శ్రమించండి. దేశ ప్రతిష్ఠను దిగంతరాలకు వ్యాపింప జెయ్యండి." ________________________________________
01)
దేశ మాత కీర్తి - దిక్కులన్ బ్రసరింప కలలు గనుడు , మించి - కరువు దీర! నిజము చేయు డయ్య - నెనరుతో శ్రమ జేసి ! తలలు వంచి గగన - తలము గనుడు; __________________________________________
వీర వరులు మీరు - విధ్యాధికులుగను వేగ పెరుగు టన్న - వింత యౌనె; ప్రాణ మంత దేశ - భక్తి నిండిన చోట ! తలలు వంచి గగన - తలము గనుడు; ______________________________________
మూర్తి గారూ ! మీ ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్నిస్తోంది. మిక్కిలి ధన్యవాదములు.
మీరు నాదొక సలహాను తప్పక పాటించాలి. అప్పు డప్పుడూ మమ్మల్ని చాలా గందరగోళానికి గురి చేస్తున్నారు. మీరొక వ్యాఖ్య పెట్టాక ,మీకు తీసెయ్యాలని ఉంటే తీసేసి మరలా క్రింద పెట్టుకోవచ్చు; "ఇతరులెవరూ మీ వ్యాఖ్యపై వ్యాఖ్యానించక ముందు"వరకూ. మా వ్యాఖ్యలు అలాగే ఉండిపోతున్నాయ్. మీరేమో తీసేసి , సరి చేసి క్రింద నెక్కడో పెడు తున్నారు . దీని వలన context అర్థం కావడం లేదు. continuity దెబ్బ తింటోంది. మొన్నొకరోజు ఇలాగే చాలా తికమక పడ్డాను. మీ పద్యం మీద మిస్సన్న మహాశయుల చెణుకులు చదివి మీ పద్య మెక్కడ మిస్సయ్యానా అని క్రిందికీ పైకీ తిరగడంతోనే సరి పోయింది. పైదలా ఉంచుతూనే మీక్కావలన విధంగా సవరించి మళ్ళా క్రింద ప్రకటించు కోవచ్చు. మీ కడ్డే ముంది ? గురువు గారు మార్కులు తగ్గిస్తారని భయమా?
మన్నించంది మహాశయా కిశోరా ! మీరు రెండు పద్యాలే వ్రాసారనుకొని( భ్రమ ) నా వ్యాఖ్య పెట్తాను.ఇంకా పద్యాలు రావడము చూసి మీ పద్య ప్రవాహములో అది పానకంలో పుడక లాగ ఉందని తీసేసాను. అందులో మీరు దేశభక్తి ప్రబోధిస్తుంటే నేను విద్యుత్తుశాఖ వారికి,దూరవాక్కు వారికి,అంతర్జాల ఉద్యోగులకు మామూళ్ళు యివ్వమని సలహా యివ్వడము బాగనిపించ లేదు. ఇకపై జాగ్రత్త వహిస్తాను. ఇప్పుడు నేనే వ్యాఖ్య పెట్టానో మిత్రులకు తెలుస్తొంది కదా ?
రాజేశ్వరి నేదునూరి గారూ, ఆహా! నిర్దోషంగా ఎంత చక్కని పూరణ చేశారు! నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీ పద్య రచనకు తిరుగు లేదు. మీ కలం గాడిన పడింది. విజృంభించండి.
వసంత్ కిశోర్ గారూ, నీతి ప్రబోధకాలైన మీ పద్య దశకం చాలా బాగుంది. అభినందనలు. వెనుకటికి ఒక కవి ఒక రాజును ప్రస్తుతిస్తూ "నీవు యువతులకు మాఘ మేఘానివి. కవులకు శ్రావణ మేఘానివి" అన్నాడట! మీరు పద్యాల వాన కురిపించడంలో మాకు శ్రావణ మేఘమే.
గోలి హనుమచ్ఛాస్త్రి
రిప్లయితొలగించండిసీతజాడ వెదకి శ్రీరామభక్తుండు
లంకగాల్చి అపర శంకరువలె
నాకవాసులార! ఆకసంబుకెగసె
తలలువంచి గగన తలము గనుడు.
మిన్ను చుక్క లవియె మేలు మల్లెలు జూడ
రిప్లయితొలగించండితలలు వంచి , గగన తలముఁ గనుఁడు
గరిక పువ్వు లమరె సరులుగ రజనికి
నింగి ముకుర మయ్యె నేల కిపుడు !!
గోలి హనుమచ్ఛాస్త్రి, గన్నవరపు నరసింహ మూర్తి గార్ల పూరణలు చాలా మనోహరంగా ఉన్నాయి.
రిప్లయితొలగించండిలంక గాల్చి నాడు రంకెలు వేయుచు
రిప్లయితొలగించండినిలువ రక్క సాళి తలలు వంచి!
గగన తలము గనుడు గాలి కుమారుని
సీత దివ్య శక్తి! చిత్త శుధ్ధి!
హనుమఛ్చాస్త్రి గారూ మీ పద్యము చాలా బాగుంది. మిస్సన్నగారూ ధన్యవాదములు. మీ వారాంతము పద్యాన్ని సందు దొరికినప్పుడల్లా చదువుతున్నా,వారెవ అనుకొంటూ.
రిప్లయితొలగించండిమిస్సన్నగారూ నూరేళ్ళు ఆయుస్ష్హు , మీకు !ఈ పద్యం కూడా వారె వ్హా !
రిప్లయితొలగించండినరసింహ మూర్తి గారూ శహభాష్!
రిప్లయితొలగించండిమీరు నిద్రను జయించేశారా?
నరసింహ మూర్తి గారూ! మీకూ నూరేళ్ళే! భేష్!
రిప్లయితొలగించండినరసింహమూర్తిగారూ
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీభావనకూడా ఆకాశానచుక్కలనంటింది.
గోలి హనుంచ్ఛాస్త్రి.
మిస్సన్నగారూ.
రిప్లయితొలగించండిధన్యవాదాలు.మీపూరణ చాలబాగుంది.మొత్తానికి తలను పైకెత్తి గగనతలాన్ని క్రిదికి దింపారు.
గోలి హనుంచ్ఛాస్త్రి.
మిస్సన్నగారూ.
రిప్లయితొలగించండిధన్యవాదాలు.మీపూరణ చాలబాగుంది.మొత్తానికి తలను పైకెత్తి గగనతలాన్ని క్రిందికి దింపారు.
గోలి హనుంచ్ఛాస్త్రి.
శ్రీయుత కంది శంకరయ్యగారూ ! నమస్కారాలు ! వృత్తిపరమైన అననుకూలతలవల్ల యీ మధ్య కాస్త వ్యవధిలేకపోయినది. అన్యథా భావింపవలదు !
రిప్లయితొలగించండిస్వయంవరానికి విచ్చేసిన రాకుమారులతో జనకుని పలుకులు !
ఇది స్వయంవరమ్ము ; ఇవె ధనుర్బాణాలు ;
నీటిలోన జూచి , నింగి దిరుగు
మత్స్య యంత్రమును సమర్థులు ఛేదింప
తలలు వంచి గగనతలముఁ గనుఁడు.
హనుమఛ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఅంప శయ్య నున్న నాపగ సూనుని
రిప్లయితొలగించండిచెంత నిలచి నారు కుంతి సుతులు
తలలు వంచి, గగన తలము గనుడు
సురులు పుష్ప వృష్టి గురియు చుండ్రి.
విష్ణు నందను గారూ హృదయ రంజకంగా పూరించారు.
రిప్లయితొలగించండిప్రజల ధనము దోచి పలురీతి సుఖముల
రిప్లయితొలగించండిబడయు వారు నేడు ప్రభువు లైరి!
హితులు గారు పరమ హీనులు,వారల
తలలు వంచి గగన తలము గనుడు!
విష్ణునందన్ గారూ
రిప్లయితొలగించండిమీపూరణ బాగుంది.కాని ద్రౌపది జనకుని మాటలు జనకునితో పలికించారు.
గోలి హనుమచ్ఛాస్త్రి.
మిస్సన్న గారూ
రిప్లయితొలగించండిమీ కత్తికి రెండువైపులా పదునే(ఎత్తినా, దించినా)
గోలి హనుమచ్ఛాస్త్రి.
Nijame sastri garu! Draupadi janakudu andamanukuntoo draupadi ni marachipoyanu. Dhanyavadalu!
రిప్లయితొలగించండిmissannagaru! Mee rendo poorana chala bavundi. Bhaavam drusyamaanam ainadi.
రిప్లయితొలగించండిaithe moodava padam sari chudagalaru! Vyavadhi leka aanglam lo vrayavalasi vachinandulaku mannimpagalaru!
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
"ఆకసంబుకేగె" బదులు "ఆకసంబున నేగె" అంటే సరి.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
"మల్లెలు జూడ" అనేది "మల్లెలఁ జూచె" అంటే ఇలా ఉంటుంది?
మిస్సన్న గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
రెండవ పూరణ మూడవ పాదాన్ని "తలలు వంచి గగనతలముఁ గనుం డిదె" అంటే గణదోషం తొలగిపోతుంది.
డా. విష్ణు నందన్ గారూ,
మణిఫూసలాంటి పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.
మంద పీతాంబర్ గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
విష్ణు నందన్ గారు,
రిప్లయితొలగించండిసమస్యకు మత్స్య యంత్ర భేదనము చక్కగా సరిపోయింది
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండికొందమీదనున్న కోనేటిచిత్తరువు
అద్భుతమ్ము, చూడుడందములను
తేటనీటిలోన తెలిమబ్బు కనిపించె
తలలువంచి గగన తలము గనుడు.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిచిన్నమార్పు..గమనించగలరు
కొందమీదనున్న కోనేటిచిత్రంబు (చిత్తర్వు)
అద్భుతమ్ము, చూడుడందములను
తేటనీటిలోన తెలిమబ్బు కనిపించె
తలలువంచి గగన తలము గనుడు.
ఫ్లైటునెక్కి నీవు పైపైకి ఎగురగా
రిప్లయితొలగించండితెల్ల మబ్బులెళ్ళ తెల్లబోయె!
ఆకసమును గెలిచి అచ్చెరువు నొందగా
తలలు వంచి గగనతలముఁ గనుఁడు!!
ధర్మరాజు భీముని తో పలుకుట: (బాల భారత నేపద్యము లో)
రిప్లయితొలగించండివ్రతముఁ జేయఁ దలచె పాండవ మాత, ఓ
ధీర! భీమ! వలయు దేవ గజము,
వజ్రి యివ్వబోడు, బలము తోడ సురల
తలలు వంచి గగనతలముఁ గనుఁడు.
SaMkarayya gaarU
రిప్లయితొలగించండిlEkhini lO ma^..ma^... vraayavacchu gamaniMcagalaru.
శంకరయ్య గారూ
లేఖిని లో మ్..మ్... వ్రాయవచ్చు గమనించగలరు.
G.H.Sastry
ఏమిటో ..?! ఈ మధ్య సమస్యలు ఇవ్వడమే కాని పూరించే అవకాశం దొరకడం లేదు. న్యాయానికి నేను సమస్యను ఇచ్చినప్పుడు అందరి పూరణలను పరామర్శించిన తరువాత చివర నా పూరణ కూడ ఇవ్వాలి. సమస్యను ఇలా పూరించాలి అనుకుంటానా? అదే భావంతో ఎవరో ఒకరు పూరిస్తున్నారు. మరో ఆలోచన చేసే లోగా మరొకరు. చాలా కాలంగా ఇదే పరిస్థితి.
రిప్లయితొలగించండిఅసలు సమస్య ఇచ్చినప్పుడే ఇదీ నా పూరణ అని ముందే ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను.
"తలను వంచి నీటిలో ప్రతిబింబించే గగనతలాన్ని చూచే ఆలోచన" చేసాను. దాన్ని గోలి హనుమచ్ఛాస్త్రి గారు (టెలీపతీ ద్వారా తెలుసుకొని) చౌర్యం చేశారు :-) ప్చ్! ఏం చేయను?
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పూరణ. చాలా సంతోషం. మరో వైపు కోపమూ ఉంది. ఉదయాన సమస్య ఇచ్చే సమయంలో ఈ భావంతోనే నా పూరణ ఇవ్వాలనుకున్నాను. ఎలా తట్టిందో మీకీ ఆలోచన? నాకు శ్రమ తప్పించారు. ధన్యవాదాలు.
నచికేత్ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
అయినా ఫ్లైటులోంచి క్రిందికి చూస్తే కనిపించేవి మబ్బు తునుకలే కాని గగనతలం కాదు కదా. నే నెప్పుడూ ఫ్లైటు ఎక్కలేదు లెండి :-)
జిగురు సత్యనారాయణ గారూ,
గాంధారీ గర్వభంగం కథను గుర్తుకు తెచ్చిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
శంకరయ్యగారూ
రిప్లయితొలగించండినాకు టెలీపతి శక్తి ఉన్నదని తెలియజేసినందులకు కృతజ్ఞతలు.
ఐనా ప్రశ్నలు ఇచ్చి జవాబు పత్రాలను దిద్దుస్థానములో నున్నారు.మా జవాబులన్నీ మీవే. మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహము.
గోలి హనుమచ్ఛాస్త్రి.
కొలను లోన దిగిరి కొమ్మలందరు గలసి
రిప్లయితొలగించండిజలక మాడ బోవ చెలువు మీర
నదము నందు కనగ నిండు తారల శశిని
తలలు వంచి గగన తలముఁగనుఁడు.
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ చక్కగా
అలరించు చున్నవి.
______________________________________
వారం రోజుల నుండి phone , net
problem వలన
మిత్రు లందర్నీ
మిస్సయ్యాను.
_______________________________________
అందరూ అన్ని రకాలుగా పూరించేసారు.
గురువుగారికి రోజూ ఎదురయ్యే సమస్యే నాకిప్పుడు.
ఐనా ప్రయత్నిస్తాను.
________________________________________
మన మాజీ రాష్ట్రపతి
అబ్దుల్‌కలాం గారి ఉవాచ:
"శక్తికి మించిన కలలు కనండి
శక్తివంచన లేకుండా శ్రమించండి.
దేశ ప్రతిష్ఠను దిగంతరాలకు వ్యాపింప జెయ్యండి."
________________________________________
01)
దేశ మాత కీర్తి - దిక్కులన్ బ్రసరింప
కలలు గనుడు , మించి - కరువు దీర!
నిజము చేయు డయ్య - నెనరుతో శ్రమ జేసి !
తలలు వంచి గగన - తలము గనుడు;
__________________________________________
02)
రిప్లయితొలగించండి_________________________________________
వింత వింత యంత్ర - విఙ్ఞానమును బెంచు
చదువు చదువు డయ్య - శ్రద్ధ గాను;
మిత్ర , శత్రు ,దేశ - మెల్లరు మెచ్చగా;
తలలు వంచి గగన - తలము గనుడు;
_________________________________________
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి03)
రిప్లయితొలగించండి_______________________________________
యువకు లెల్ల మదిని - యోచించు కొనవలె
దేశ కీర్తి పెంచు - దిశల వైపు;
తనరు నట్లు ప్రతిభ - తారా పథంబున;
తలలు వంచి గగన - తలము గనుడు;
________________________________________
మూర్తి గారూ !
రిప్లయితొలగించండిమన్నించాలి
మీ సలహా శ్రద్ధగా
పాటిస్తున్నాను
ఐనా సమస్యలు తప్పడం లేదు.
ప్రస్తుతానికి
ప్రోబ్లం తీరినట్లే .
కడుంగడు ధన్యవాదములు.
04)
రిప్లయితొలగించండి_______________________________________
జాతి మెచ్చు నట్లు - జాతీయ ఝెండాను
నెగుర వేయ వలయు - నింగి దాటి;
మదిని దలప సుంత - మారాకు వేయులే;
తలలు వంచి గగన - తలము గనుడు;
________________________________________
05)
రిప్లయితొలగించండి______________________________________
వీర వరులు మీరు - విధ్యాధికులుగను
వేగ పెరుగు టన్న - వింత యౌనె;
ప్రాణ మంత దేశ - భక్తి నిండిన చోట !
తలలు వంచి గగన - తలము గనుడు;
______________________________________
06)
రిప్లయితొలగించండి_______________________________________
గెలుతు వేని యిల్లు - గెల్తువు గహనంబు
గగురు పాటు నొంద - గగన సీమ!
మొద్దు గాక యుండు - ముత్యమై యలరారు !
తలలు వంచి గగన - తలము గనుడు;
________________________________________
07)
రిప్లయితొలగించండి________________________________________
విద్య లేని వాడు - వింత పశు వగును!
నిత్య సత్యము గను! - భృత్యు డవకు!
కృషిని మదిని నమ్ము! - కృతకృత్యు డౌదువు!
తలలు వంచి గగన - తలము గనుడు;
________________________________________
08)
రిప్లయితొలగించండి________________________________________
కన్నతల్లి జూడు - కంటిపాపను రీతి
మాతృ దేశ మన్న - మాత సమము
దేశ భక్తి గలుగు - ధీరులె ధన్యులు
తలలు వంచి గగన - తలము గనుడు;
________________________________________
09)
రిప్లయితొలగించండి_________________________________________
ఈవి పొందు మయ్య! - ఈర్ష్య నోడించుము !
పెద్ద లందు మదిని - ప్రేమ జూపు !
పేద వారికి గల - భీతిని దొలగించు !
తలలు వంచి గగన - తలము గనుడు;
_________________________________________
10)
రిప్లయితొలగించండి__________________________________________
చెడ్డ వారి నెపుడు - శిక్షింప వెరువకు !
కండ గలిగె నేని - మెండు జయము !
సత్య మేవ జయతి !- సన్మార్గము జరించు !
తలలు వంచి గగన - తలము గనుడు;
___________________________________________
వసంత కిశోర్ జీ పద్యాలన్నీ చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిమీ పునర్దర్శనము అందఱికీ ఆనంద దాయకము.
మూర్తి గారూ !
రిప్లయితొలగించండిమీ ప్రోత్సాహం మరింత
ఉత్సాహాన్నిస్తోంది.
మిక్కిలి ధన్యవాదములు.
మీరు నాదొక సలహాను తప్పక పాటించాలి.
అప్పు డప్పుడూ మమ్మల్ని చాలా గందరగోళానికి గురి చేస్తున్నారు.
మీరొక వ్యాఖ్య పెట్టాక ,మీకు తీసెయ్యాలని ఉంటే తీసేసి మరలా
క్రింద పెట్టుకోవచ్చు;
"ఇతరులెవరూ మీ వ్యాఖ్యపై వ్యాఖ్యానించక ముందు"వరకూ.
మా వ్యాఖ్యలు అలాగే ఉండిపోతున్నాయ్.
మీరేమో తీసేసి , సరి చేసి క్రింద నెక్కడో పెడు తున్నారు .
దీని వలన context అర్థం కావడం లేదు.
continuity దెబ్బ తింటోంది.
మొన్నొకరోజు ఇలాగే చాలా తికమక పడ్డాను.
మీ పద్యం మీద మిస్సన్న మహాశయుల చెణుకులు
చదివి మీ పద్య మెక్కడ మిస్సయ్యానా అని
క్రిందికీ పైకీ తిరగడంతోనే సరి పోయింది.
పైదలా ఉంచుతూనే మీక్కావలన విధంగా సవరించి మళ్ళా
క్రింద ప్రకటించు కోవచ్చు.
మీ కడ్డే ముంది ?
గురువు గారు మార్కులు తగ్గిస్తారని భయమా?
మన్నించంది మహాశయా కిశోరా ! మీరు రెండు పద్యాలే వ్రాసారనుకొని( భ్రమ ) నా వ్యాఖ్య పెట్తాను.ఇంకా పద్యాలు రావడము చూసి మీ పద్య ప్రవాహములో అది పానకంలో పుడక లాగ ఉందని తీసేసాను. అందులో మీరు దేశభక్తి ప్రబోధిస్తుంటే నేను విద్యుత్తుశాఖ వారికి,దూరవాక్కు వారికి,అంతర్జాల ఉద్యోగులకు మామూళ్ళు యివ్వమని సలహా యివ్వడము బాగనిపించ లేదు. ఇకపై జాగ్రత్త వహిస్తాను. ఇప్పుడు నేనే వ్యాఖ్య పెట్టానో మిత్రులకు తెలుస్తొంది కదా ?
రిప్లయితొలగించండిరాజేశ్వరి నేదునూరి గారూ,
రిప్లయితొలగించండిఆహా! నిర్దోషంగా ఎంత చక్కని పూరణ చేశారు! నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీ పద్య రచనకు తిరుగు లేదు. మీ కలం గాడిన పడింది. విజృంభించండి.
వసంత్ కిశోర్ గారూ,
నీతి ప్రబోధకాలైన మీ పద్య దశకం చాలా బాగుంది. అభినందనలు.
వెనుకటికి ఒక కవి ఒక రాజును ప్రస్తుతిస్తూ "నీవు యువతులకు మాఘ మేఘానివి. కవులకు శ్రావణ మేఘానివి" అన్నాడట! మీరు పద్యాల వాన కురిపించడంలో మాకు శ్రావణ మేఘమే.
గురువుగారూ నా రెండవ పద్యానికి మీ సవరణ కు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిరైలుకెళ్ళే హడావిడి లో మూడవ పాదంలోని తప్పును గమనించ లేదు.
హనుమచ్చాస్త్రి గారూ మీరు అలా అనుకొంటున్నారు గానీ మా కత్తులు మొద్దు బారి పోయాయి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఆటపాటలందునవమానమైనచో
రిప్లయితొలగించండిపట్టుదలకుబోయి పంతమూని
గెలుపులందవలెను ,కీడెంచిమేలెంచి
తలలువంచి ,గగనతలముగనుడు