గురువుగారూ,నమస్సులు,కృతజ్ఞతలు . మీరు ఈ దినము చక్కని సమస్య ఇచ్చారు. మీ శిష్యుల ఉత్సాహము చూద్దురు గాని. శంకరాభరణములో పాల్గొనే మిత్రులందఱూ బోళ్ళు పద్యాలు కుమ్మరిస్తారు!
అందులో కౌశికుడు మధు పాన మత్తుడు. వేశ్యా లోలుడు. ఆ కౌశికుని భార్య సుమతి.పరమ సాధ్వి. నిత్య పతి సేవా పరాయణ. ధనము ,నగలు , యిల్లు,ఆస్తిపాస్తులు సర్వం భర్త ఆనందం కోసం త్యాగం చేస్తుంది.
వేశ్యచే గెంటి వేయబడి, కుష్ఠు రోగియైన భర్తను ఆదరించి సేవ జేస్తుంది. ఊంఛ వృత్తిని చేపట్టి ,కాలం వెళ్ళ దీస్తుంటుంది. భర్త అనుమానిస్తే, అగ్ని ప్రవేశం జేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొంటుంది.
చివరకు భర్త మరొక వేశ్యపై మోజు పడితే , ఆ వేశ్య యింటిలో ఊడిగం చేసి ఆమెను ఒప్పించి
ఒక రాత్రివేళ హోరు గాలి , కారు చీకటి విపరీతంగా వర్షం కురుస్తుంటే ,నడవ లేని భర్తను గంపలో పెట్టి ఆ గంప తల నిడుకొని వేశ్య యింటికి బయలు దేరుతుంది. దారిలో కొరతవేయబడిన మాండవ్య ముని కాలికి కౌశికుడు తగిలితే , ముని కోపోద్రిక్తుడై సూర్యోదయం ఐన వెంటనే తల పగిలి చావమని కౌశికుణ్ణి శపిస్తాడు. దిగ్భ్రాంతికి గురైన సుమతి శాపం మళ్ళించమని మునిని వేడు కొని ఫలితం లేని పరిస్థితిలో సూర్యుణ్ణి ఉదయించ వద్దని ఆఙ్ఞాపిస్తుంది. సూర్యుడు ఉదయించక, సమస్త లోకాలూ జీవాలూ తల్లడిల్లుతాయి. అప్పుడు త్రిమూర్తులు సతీ సమేతులై వేంచేసి,సుమతిని ఒప్పించి సూర్యోదయ మయ్యేలా చేసి, చనిపోయిన కౌశికుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తారు.
వసంత కిశోర్ మిత్రవర్యా ! మంగళం !!జయమంగళం !!! అత్యద్భుతం. బ్రహ్మాండమైన పూరణ. నిన్న రాత్రి ( మీకు పగలు ) గురువుగారుతో మీకు మంచి పూరణ లొస్తాయని చెప్పాను. మిత్రులందఱూ అందమైన పూరణలు చేసారు. కాని మీ పూరణ అదిరింది. గురువుగారు కూడా యిలాంటి పూరణ వస్తుందని ఊహించి యుండరు.హృదయపూర్వక అభినందనలు. మీరు గెంతులేసి నాట్యము చేసుంటారు యీ సీస పద్యము వ్రాసి.
గురువుగారూ కృతజ్ఞతలు. వసంత కిషోర్ గారూ చేరి పోతున్నారూ మీరూ చేరిపోతున్నారూ సుప్రసిద్ధ కవుల చెంత చేరిపోతున్నారూ! అభినందనలు. మంత్రిప్రగాదవారూ ధన్యవాదాలు. పీతంబార్ గారూ మీ పూరణ సహజంగా ప్రస్తుత కాలోచితంగా ఉంది.
కవి మిత్రులకు నమస్కృతులు. ఇంట్లో బంధువుల కోలాహలంతో ప్రొద్దున బ్లాగు చూసే అవకాశం లేకపోయింది. ఇప్పుడే ఒక మిత్రుని ఇంట్లో నెట్ తెరిచి, ముందు ఈనాటి సమస్యా పూరణం, ప్రహేళిక పోస్ట్ చేసి, వ్యాఖ్యలు చూస్తున్నాను. ఇక్కడా తీరిగ్గా వ్యాఖ్యలు పెట్టే అవకాశం లేదు. మా మిత్రుని కొడుకు నా వైపు గుర్రుగా చూస్తున్నాడు. అందరి పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అందరికీ అభినందనలు. వసంత్ కిశోర్ గారి "సుమతి కథ" అలరించింది. విడివిడిగా వ్యాఖ్యానించే సమయం లేదు. మన్నించండి.
కుక్క తగవులు నూరులో పిక్కటిల్ల
రిప్లయితొలగించండిఊర కుక్కల నదుపున నుంచ గలుగు
గ్రామసింహమె పట్టము కర్హ తొందె
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె !!
నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిగ్రామ సింహాన్ని సింహాసన మెక్కించారు. బాగుంది. అభినందనలు.
నీతి బాహ్యులు ప్రజలను నిలువ దోచి
రిప్లయితొలగించండిదొంగ లయ్యిరి దేశపు దొఱలు నేడు
రంగు మార్చిన శునకము సింగ మయ్యె
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె !
గురువుగారూ,నమస్సులు,కృతజ్ఞతలు . మీరు ఈ దినము చక్కని సమస్య ఇచ్చారు. మీ శిష్యుల ఉత్సాహము చూద్దురు గాని. శంకరాభరణములో పాల్గొనే మిత్రులందఱూ బోళ్ళు పద్యాలు కుమ్మరిస్తారు!
రిప్లయితొలగించండిస్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరి
రిప్లయితొలగించండిదేశమాతనే చేజార్చె దేహి యనుచు
తిరిగి స్వాతంత్ర్యమును తెచ్చె ధీరజనులు
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె!
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ ఇంకా బాగుంది. కాలోచితంగా చక్కగా ఉంది. అభినందనలు.
హరి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
తల్లి దండ్రుల బంధించి, దయను వీడి
రిప్లయితొలగించండితోడ బుట్టువు సంతతి దునిమి మధుర
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె
కృష్ణ రావేల మమునేల కృపను వేగ!
గోప కులమును విడనాడ నోప గలనె?
'మధుర' వేదన కలచెడి మదిని, యచట
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె
పట్టి కంసుని వధియించి వత్తు తిరిగి.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమధురమైన భావాలతో మీ రెండు పూరణలూ ప్రశంసార్హమై ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.
బాల నాగమ్మ అందాల భామ కాగ
రిప్లయితొలగించండిమాయల పకీరు కుక్కగా మార్చెనంత
మాయల పకీరు మరణించె మాయ తొలగె
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె.
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె
రిప్లయితొలగించండిననుట సత్య దూరము గాదె! నరయ గాను ,
శునక ములకున్న విశ్యాస శుద్ధి కొంత
ఏలికలకున్న, ఎంతైన మేలుగాదె!
కర్ణ భేరిని చేధింప కతలు పలుక
రిప్లయితొలగించండిస్వర్ణ మయమేను మనయాంధ్ర స్వామి పలికె
వర్ణ భేధము లేదింక పొత్తు కుదిరె
స్వర్ణ సిం హాసనమ్మున శ్వాన మమరె !
స్వామి = అధికారి .
గురువులకు
రిప్లయితొలగించండికవులకు
హితులకు
మిత్రులకు
నతులు.
అందరి పూరణలూ
అద్భుతముగా నున్నవి.
రాత్రి ఈటివీ లో "సతీ సుమతి" సినిమా చూశాను.
రిప్లయితొలగించండిఅందులో కౌశికుడు మధు పాన మత్తుడు. వేశ్యా లోలుడు.
ఆ కౌశికుని భార్య సుమతి.పరమ సాధ్వి. నిత్య పతి సేవా పరాయణ.
ధనము ,నగలు , యిల్లు,ఆస్తిపాస్తులు సర్వం
భర్త ఆనందం కోసం త్యాగం చేస్తుంది.
వేశ్యచే గెంటి వేయబడి, కుష్ఠు రోగియైన భర్తను ఆదరించి సేవ జేస్తుంది.
ఊంఛ వృత్తిని చేపట్టి ,కాలం వెళ్ళ దీస్తుంటుంది.
భర్త అనుమానిస్తే, అగ్ని ప్రవేశం జేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొంటుంది.
చివరకు భర్త మరొక వేశ్యపై మోజు పడితే ,
ఆ వేశ్య యింటిలో ఊడిగం చేసి ఆమెను ఒప్పించి
ఒక రాత్రివేళ హోరు గాలి , కారు చీకటి
విపరీతంగా వర్షం కురుస్తుంటే ,నడవ లేని భర్తను గంపలో పెట్టి
ఆ గంప తల నిడుకొని వేశ్య యింటికి బయలు దేరుతుంది.
దారిలో కొరతవేయబడిన మాండవ్య ముని కాలికి కౌశికుడు తగిలితే , ముని
కోపోద్రిక్తుడై సూర్యోదయం ఐన వెంటనే తల పగిలి చావమని కౌశికుణ్ణి శపిస్తాడు.
దిగ్భ్రాంతికి గురైన సుమతి శాపం మళ్ళించమని మునిని వేడు కొని
ఫలితం లేని పరిస్థితిలో సూర్యుణ్ణి ఉదయించ వద్దని ఆఙ్ఞాపిస్తుంది.
సూర్యుడు ఉదయించక, సమస్త లోకాలూ జీవాలూ తల్లడిల్లుతాయి.
అప్పుడు త్రిమూర్తులు సతీ సమేతులై వేంచేసి,సుమతిని ఒప్పించి
సూర్యోదయ మయ్యేలా చేసి, చనిపోయిన కౌశికుణ్ణి పునర్జీవితుణ్ణి చేస్తారు.
ఆ సినిమా ప్రభావంతొ మొదట సమస్యను తేటగీతిలొ పూరించాను.
రిప్లయితొలగించండికాని మిత్రులకు సుమతిని పూర్తిగా చూపించాలని పించింది.
అందుచే సీసం వ్రాయ సాహసించాను ప్రప్రధమంగా.
మరి మిత్రులూ గురువులూ
మంచి చెడులు చెప్పి
మనః స్ఫూర్తిగా
మంగళా శాసనము జేయుడని
మనవి.
*సీ*
రిప్లయితొలగించండికష్ట సుఖము లందు - కలనైన నిలనైన ,
తక్క పతిని , నన్యు - దలప దామె !
పతి పాద సేవయె - పరమ భాగ్యంబని
నెన్నడు దలపోయు - నెలత యామె !
పణముల గణములు - తృణమని యెంచుచు
మగని ముదము గోరు - మగువ యామె !
సాటి సతుల లోన - సరిసాటి లేనట్టి
సొగసు సొంపుల మేటి - సుదతి ! సుమతి !
*తేగీ*
గాలి హోరెత్తు , వర్షంపు - కాళ రాత్రి
పతిని , వెలయాలి చెంతకు - పంపు కతన
ముదము గంపను మోసెడి - ముదిత గనరె !
స్వర్ణ సింహాస నమ్మున - శ్వాన మమరె !
వసంత కిశోర్ మిత్రవర్యా ! మంగళం !!జయమంగళం !!! అత్యద్భుతం. బ్రహ్మాండమైన పూరణ. నిన్న రాత్రి ( మీకు పగలు ) గురువుగారుతో మీకు మంచి పూరణ లొస్తాయని చెప్పాను. మిత్రులందఱూ అందమైన పూరణలు చేసారు. కాని మీ పూరణ అదిరింది. గురువుగారు కూడా యిలాంటి పూరణ వస్తుందని ఊహించి యుండరు.హృదయపూర్వక అభినందనలు. మీరు గెంతులేసి నాట్యము చేసుంటారు యీ సీస పద్యము వ్రాసి.
రిప్లయితొలగించండిగురువు గారిచ్చిన సమస్య కు 'సుమతి శిరస్సు పై కౌశికుడి' పోలిక అద్భుతం, వసంత కిషోర్ గారూ.
రిప్లయితొలగించండి- బాలు మంత్రిప్రగడ
మిస్సన్న గారూ, మీ పూరణలు రెండూ 'మధురం'.
రిప్లయితొలగించండి- బాలు మంత్రిప్రగడ
గురువుగారూ కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండివసంత కిషోర్ గారూ చేరి పోతున్నారూ మీరూ చేరిపోతున్నారూ
సుప్రసిద్ధ కవుల చెంత చేరిపోతున్నారూ! అభినందనలు.
మంత్రిప్రగాదవారూ ధన్యవాదాలు.
పీతంబార్ గారూ మీ పూరణ సహజంగా ప్రస్తుత కాలోచితంగా ఉంది.
తప్పుకు క్షంతవ్యుణ్ణి. మంత్రిప్రగడ వారూ.
రిప్లయితొలగించండికవి మిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఇంట్లో బంధువుల కోలాహలంతో ప్రొద్దున బ్లాగు చూసే అవకాశం లేకపోయింది. ఇప్పుడే ఒక మిత్రుని ఇంట్లో నెట్ తెరిచి, ముందు ఈనాటి సమస్యా పూరణం, ప్రహేళిక పోస్ట్ చేసి, వ్యాఖ్యలు చూస్తున్నాను. ఇక్కడా తీరిగ్గా వ్యాఖ్యలు పెట్టే అవకాశం లేదు. మా మిత్రుని కొడుకు నా వైపు గుర్రుగా చూస్తున్నాడు.
అందరి పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అందరికీ అభినందనలు.
వసంత్ కిశోర్ గారి "సుమతి కథ" అలరించింది.
విడివిడిగా వ్యాఖ్యానించే సమయం లేదు. మన్నించండి.
మూర్తిగారూ ధన్య వాదములు . సరి గానే ఊహించారు !
రిప్లయితొలగించండిబాలు మంత్రిప్రగడ గారికి ధన్య వాదములు.
మిస్సన్న మహాశయులకు ధన్య వాదములు.
అయ్యా !
నన్ను పెద్దల్లో కలిపేయకండి.
శిశువును గదా !
మీ మీ
ఉత్సాహ
ప్రోత్సాహములు
శంకరార్యు గరుణ
దీనికి గారణం.
మిస్సన్నగారూ, కంసుణ్ణి నేరుగా చెప్పకుండా
రిప్లయితొలగించండిచెప్పడం చాలా బాగుంది. కృష్ణుడనడం కన్నా
ప్రజలనడం బాగుందనిపించింది..అంచేత నా
దృష్టిలో మొదటిది మొదటిదే.
హనుమంతరావు గారూ కృతజ్ఞతలండీ.
రిప్లయితొలగించండిస్వర్ణ సింహసనమ్మను వర్ణ చిత్ర
రిప్లయితొలగించండి'వాలు పోస్టరు' గాలికి వాలి పోగ
కుక్క యొక్కటి పైనెక్కె చక్కగాను
"స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె! "
తే.గీ:
రిప్లయితొలగించండిబతుకు జెడినట్టి దానికే బలిమి గలిగె
ధర్మ మన్నది యెరుగని దాన గుణము
మాన యవమానములనెల్ల మరిచి మొరిగి
*స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె*
బొక్కకోసమాశ పడిన నక్కలాగ
బిక్కు బిక్కున జూసెను బిడియమొదలి
ఊర కుక్కల జమసేసి యున్నతముగ
*స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె*
న్యాయమును నమ్మకుండి యన్యాయములను
ప్రోత్సహించియు నడిచెడి పొగరుబోతు
మూర్ఖ గుణములు గల్గియు మురికి నేడు
*స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె*
మాంస ముద్దలకలవాటు మరిగినట్టి
మద బలముచేత గులికెడి మంద బుద్ది
మంచి తనమున వంచన మాయజేసి
*స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె*
పగటి వేశమేసి నటన పలకరింపు
చీకటి బడగ తనదంటు చిందులాట
లోకమంతయు నమ్మించి లోభియగుచు
*స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె*