16, జనవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 199 (భామకు చీరేల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
భామకు చీరేలనయ్య పదుగురు చూడన్.

27 కామెంట్‌లు:

 1. సోమా వారపు సంతలొ
  రామా చిలుకొకటి గోరె రంగుల చీరెన్!
  దోమా చీమకు గొల్లా
  భామకు చీరేలనయ్య పదుగురు చూడన్ !!!

  రిప్లయితొలగించండి
 2. కామము కట్టలు త్రెంచుక
  నీమమ్ములు కట్టుబాట్లు నింగికి చేరన్
  ఏమా చేష్టలు? తెరపై
  భామకు చీరేలనయ్య పదుగురు చూడన్!

  రిప్లయితొలగించండి
 3. మామా యేవురి భార్యగు
  భామకు చీరేలనయ్య పదుగురు చూడన్
  మేమే వస్త్రాప హరణ
  మామెకు జరిపింతు మనెను ఆ రారాజే!

  రిప్లయితొలగించండి
 4. హేమంతపు మంచు కురిసి
  ధూమము గగనమ్ముఁగప్పె తూరుపు దిక్కున్
  ద్యౌమణి కనలేము, పగటి
  భామకు చీరేలనయ్య పదుగురు చూడన్.

  రిప్లయితొలగించండి
 5. మామనుఁ గూడిరల గగన
  సీమనుఁ దారలు మెఱయుచు చీకటి దొలగన్;
  ధామఁపు నా చందురు పెద
  భామకు చీరేలనయ్య పదుగురు చూడన్.

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు.

  పీతాంబర ధరా! చాలా బావుంది.కానీ.......
  చీరలు లేని భామలు
  చాలామంది ఉన్నారు మీ దగ్గర.భాగోదు...కొన్ని
  చీరలు కొనివ్వండి స్వామీ!

  మిస్సన్న మహాశయా! చించేసారు ! పూరణను (చీరల్ని)
  వాళ్ళు కట్టేదే బెత్తెడు !
  మీరు కోపంతో అది కూడా చించేస్తే ఎలా ?
  చూడ గలమా ! కొంచెమైనా ఉంచండి బాబూ !

  మీరు రాజకీయాలు విడచి
  (నా) పురాణాల మీద పడ్డా రేమిటి ?
  ద్రౌపదీ వస్త్రాపహరణం చక్కగా చేసారు , కానీ

  పూరణ(పురాణ) హరణమే ???!!!
  ప్చ్ !బాలేదు !

  జి.యస్.జీ !
  శీతాకాల సూర్యోదయ వర్ణనతో
  మాకు వణుకు పుట్టించారు .బావుంది!

  రవిగారూ ! బావుంది !
  మరి మిగతా భామల సంగతేంటి ?
  మీరేమన్నా పంపేరా చీరలు వారికి !

  రిప్లయితొలగించండి
 7. 01)
  _________________________________________

  యామిని యోషా వివసన
  ధామము నొందింప , రాజు ! - దరహాసమునన్
  మోము విరియు , చెంగలువల
  భామకు చీరేలనయ్య పదుగురు చూడన్.
  __________________________________________

  రిప్లయితొలగించండి
 8. 02)
  _________________________________________

  ప్రేముడి దంపతు లిద్దరు
  హోమము జుట్టిన తదుపరి - హొంతను గనరే
  మోమెత్తి , మింట ! మునివరు
  భామకు చీరేలనయ్య - పదుగురు చూడన్.
  __________________________________________

  మునివరు భామ = వసిష్ఠుని భార్య = అరుంధతి
  __________________________________________

  రిప్లయితొలగించండి
 9. సోముని శిరమ్ము డిగుచును
  సామంబుగ ధరణి జేరె సలిలము దానై
  కోమలము కట్టబడునే
  భామకు చీరేల నయ్య పదుగురు చూడన్ !!!

  రిప్లయితొలగించండి
 10. చేమంతి పూసె ముంగిట
  హేమంతపు ఋతువుగాన హిమమే కురియన్ !
  ధామమున కులుకు చిలుక
  భామకు చీరేల నయ్య పదుగురు చూడన్ !

  రిప్లయితొలగించండి
 11. రాజేశ్వరి గారు నమస్కారం .మీ పూరణ మూడవ పాదంలో "ల " చేర్చితే బావుంటుంది
  "దామమున కులుకు చిలుకల భామకు" గణం కుడా సరి పోతుంది.పూరణ బాగుంది,

  రిప్లయితొలగించండి
 12. వసంత్ కిశోర్ గారు, చెంగలువల భామకు వలువలేలని అడిగి సార్థక నామధేయులనిపించుకున్నారు. చాలా బావుంది పూరణ.

  రాజేశ్వరమ్మ గారు పద్యరచనలో పదును దేలుతున్నారండి. అభినందనలు.

  మిస్సన్న గారు సినిమా భామల మీద విసిరిన సెటైర్ రంజుగా ఉంది. ఇదే ఆలోచన నాకూ వచ్చింది, అయితే నా బండి లేటు.

  రిప్లయితొలగించండి
 13. మంద పీతాంబర్ గారూ,
  వ్యావహారిక బాషా దీర్ఘాలతో పద్యానికి ఒక రకమైన ఊపు తెచ్చారు. బాగుంది. అభినందనలు.
  రాజేశ్వరి గారి పద్యానికి సవరణ సూచించారంటే మీరు కవి మిత్రుల పూరణలను వసంత్ కిశోర్ గారి లాగే విశ్లేషణా దృష్టితో చూస్తున్నారన్న మాట! సంతోషం.

  మిస్సన్న గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  రెండవ పూరణలో "భార్య + అగు = భార్య యగు" అని యడాగమం వస్తుంది. సంధి లేదు.
  "మామా! యేవురి సతి యగు" అంటే సరి.

  జిగురు సత్యనారాయణ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.

  రవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  వసంత్ కిశోర్ గారూ,
  కవి మిత్రుల పూరణలపై మీ విశ్లేషణలు, ప్రశంసలు, చెణుకులు అలరిస్తున్నాయి. ధన్యవాదాలు.
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  చిలుక భామను ఆశ్రయించారు. బాగుంది. అభినందనలు.
  పీతాంబర్ గారి సవరణ గమనించారా?
  "కులుకు చిలుకల" కంటే "కులుకెడి చిలుక" బాగుంటుందేమో!

  రిప్లయితొలగించండి
 14. రవి గారూ,
  కవి మిత్రుల పూరణలను విశేషిస్తూ అభినందించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 15. మూర్తిగారూ !
  మీ గంగావతరణం ముదావహం.

  కోమలాన్ని కట్టడం
  డాక్టర్లకు వీలు కాదేమో గానీ
  మా ఇంజనీర్లకు సాద్యమే !
  లేకపోతే ఇన్ని ఆనకట్టలూ ప్రాజెక్టులూ వచ్చేవేనా ?

  రాజేశ్వరక్కాయ్ !
  చిలుకాకు పచ్చ చీర కట్టిన
  మీ చిలుక భామకు
  వేరే చీరెందుకూ ! బావుంది !

  రిప్లయితొలగించండి
 16. మీ అందరి అభిమానములకు నా హృదయ పూర్వక వందనములు + కృతజ్ఞతలు
  నెను అసలు ప్రతి రోజు నా పద్యం లొ ఎన్ని గణ దోషాలు ఉన్నాయొ భావంలొ మరెన్ని తప్పులు దొర్లాయొ అన్న భయంతొ ఒపెన్ చేస్తాను .ఒకొ రొజు నాకు తెలియ కుండానె మీ అందరు ఇంత ఆనందాన్ని కలిగించి ప్రొత్స హించి ఉక్కిరిబిక్క్రి చేస్తున్నందుకు నేనెంతొ ఋణ పడి ఉన్నాను మరొక్క సారి కృతజ్ఞతలు .

  రిప్లయితొలగించండి
 17. నామంబేలయ? పిలువన్
  ఆమనిఁ పికమేల కూయు? అలరించుటకే
  మామిడి యెందుకు? తినుటకు
  భామకు చీరేలనయ్య? పదుగురు చూడన్

  రిప్లయితొలగించండి
 18. మురళి మోహన్ గారు మీ పూరణ చాలా చక్కగా సమస్యకు సరి పోయింది

  రిప్లయితొలగించండి
 19. ఏమిది కప్పకు చీరెను!
  ఏ మహనీయుడు లిఖించె నీ చిత్రమునే!
  కామాక్షి, నగ్న సుందరి!
  భామకు చీరేలనయ్య, పదుగురు చూడన్!

  రిప్లయితొలగించండి
 20. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సుందరమైన పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. గోముగ పచ్చటి వర్ణము,
  భామల మించినది గొల్లభామౌ నటనన్
  భూమిని యలరించెడి యా
  భామకు చీరేలనయ్య పదుగురు చూడన్

  గొల్లభామ = ఆకు పురుగు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "గొల్లభామయె కాదా। భామిని నలలించెడి..." అనండి.

   తొలగించండి
 22. రోమున పుట్టి పెరిగి మన
  భూమికి విచ్చేసి ముద్దు ముచ్చట మీరన్
  గోముగ కుర్తీ నూనిన
  భామకు చీరేలనయ్య పదుగురు చూడన్

  రిప్లయితొలగించండి