8, జనవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 192 (పాలే సజ్జనుల నెల్ల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
పాలే సజ్జనుల నెల్లఁ బతితులఁ జేయున్.

15 కామెంట్‌లు:

  1. ఏలే నృపులకు, చెడుసల
    హాలే చేటగు,యశముకు హానిని గూర్చున్!
    మేలే జేయని, కసి,కో
    పాలే సజ్జనుల నెల్ల బతితుల జేయున్!

    రిప్లయితొలగించండి
  2. లేలేత వయసులో ప్రీ-
    మేలా తలి దండ్రి నుసురు బెట్టుట కానీ
    ఔలే! అతి నమ్మకమే పా-
    పా!లే! సజ్జనుల నెల్లఁ బతితులఁ జేయున్!

    రిప్లయితొలగించండి
  3. మిత్రులకు విజ్ఞప్తి.నా పద్యంలో యతి దోషం ఉంది. సవరించిన పద్యాన్ని మళ్ళా వ్రాస్తాను. క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి
  4. మేలగు నాయకులెవ్వరు
    చాలక డబ్బది యొసగెడి సైతానైనా
    చాలను మనవోటరు పా
    పాలే సజ్జనుల నెల్ల బతితుల జేయున్!

    రిప్లయితొలగించండి
  5. అలిగిన వానిని దోషము
    కలిగిన మరి బుజ్జగించి గారము తోడన్
    సలిపెడి ఉయ్యాలల జం
    పాలే సజ్జనుల నెల్లఁ బతితులఁ జేయున్.

    రిప్లయితొలగించండి
  6. సమస్య గురువుతో మొదలైతే నేను పూరణ పాదాలను లఘువుతో మొదలు పెట్టినాను. ముందుగా గమనించ లేదు. వీలైతే సరి చెసి మరల Post చేస్తా.

    రిప్లయితొలగించండి
  7. పాలేయని పొరబడి త్రాగకు
    కాలుష్యపు కుడితి త్రాగి గోవులు సైతం !
    కాలనేమి కలికాల మహిమలు
    పాలే సజ్జనుల నెల్లఁ బతితులఁ జేయున్ !

    రిప్లయితొలగించండి
  8. లేలేత వయసులో ప్రీ-
    మేలా తలి దండ్రు లంద దేలా పంత-
    మ్మౌలే! అతి నమ్మకమే పా-
    పా!లే! సజ్జనుల నెల్లఁ బతితులఁ జేయున్!

    రిప్లయితొలగించండి
  9. కాలున్ దువ్వకు మలుకను
    కేలున్ నవగొనకు వలదు క్రీడలు,హింసల్
    వేలున్ జూపకు మిల శా
    పాలే సజ్జనుల నెల్లఁ బతితులఁ జేయున్ !

    రిప్లయితొలగించండి
  10. శ్రీ కంది శంకరయ్య గారికి ,
    నమస్తే.
    నేను మీ బ్లాగ్ యిటీవల నుంచే చూస్తున్నాను. చాలా బాగుంది. మెదడుకు మంచి మేత. నాకు ప్రాచీన సాహిత్యం అంటే చాలా అభిమానం, కొద్ది ప్రవేశం ఉన్నాయి. పద్యాలు వ్రాయడం నాకు చాలా ఇష్టం. కొన్ని ఖండ కావ్యాలు రాసుకున్నాను కానీ ప్రకటించలేదు, ప్రచురించలేదు. ఆత్మానందం కోసం వ్రాసుకున్నవి.
    సమస్యాపూరణం లో చాలా ఆసక్తి వుంది.అయితే సమస్యలను సృస్టించ గలనే కానీ, పూరించ లేక పోతున్నాను. పూరణా చాతుర్యం అలవరచుకోవడంలో మీరు సూచనలు ఇస్తే కృతజ్ఞుడిని.నేను చేసి ఉంచిన కొన్ని సమస్యలను మీ బ్లాగ్ కి పంపమంటే పంపుతాను. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ,

    భవదీయుడు,
    అందవోలు రామ మోహన్

    రిప్లయితొలగించండి
  11. మంద పీతాంబర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "యశముకు" అన్నారు. అది "యశమునకు" అని ఉండాలి.
    "హాలే చేటగు, యశమున కవి హాని నిడున్" అంటే బాగుంటుందేమో?

    మిస్సన్న గారూ,
    సవరించాక మీ పూరణ సలక్షణంగా ఉంది. ఔలే! మీ అన్నిటికీ సమర్థులు. బాగుంది. అభినందనలు.

    హరి గారూ,
    మీ పూరణ బాగుందండీ. అభినందనలు.

    జిగురు సత్యనారాయణ గారూ,
    సవరించిన పద్యాన్ని పోస్ట్ చేస్తా మన్నారు. ఇంకా పంపలేదు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మంచి భావం. కాని 1వ, 3వ పాదాలలో గణదోషం, రండవ పాదంలో యతిదోషం ఉన్నాయి. నా సవరణ ......
    పాలని పొరబడి త్రాగకు
    కాలుష్యపు కుడితి త్రాగగా గోవులు నీ
    కాలోచిత మహిమలతో
    పాలే సజ్జనుల నెల్ల పతితుల జేయున్.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    ఎ. రామ్మోహన్ గారూ,
    "శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. బ్లాగు నచ్చినందుకు సంతోషం.
    పూరణా చాతుర్యం అలవరచుకోవడం కోసం "ట్రెయినింగ్" అవసరం లేదు. ఆసక్తి ఉండి, కవి మిత్రుల పూరణలను అర్థం చేసుకుంటూ పోతే మెలకువలు తెలిసిపోతాయి. మీరూ మొదలు పెట్టవచ్చు. విజయోస్తు!
    మీ దగ్గర ఉన్న సమస్యలను నాకు మెయిల్ చెయ్యండి. సంతోషంగా స్వీకరిస్తాను. మీ మెయిల్ కోసం ఎదురు చూస్తుంటాను.

    రిప్లయితొలగించండి
  12. నాలుగు బిలియను రూకలు
    మేలుగ నీ పాలగునని మెచ్చెడియా ఈ-
    మైలుల వందల వేల ట
    పాలే సజ్జనుల నెల్లఁ బతితులఁ జేయున్

    రిప్లయితొలగించండి
  13. ప్రభాకర శాస్త్రి గారూ,
    ఫేక్ మెయిళ్ళను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. మహాత్మా గాంధి ఉవాచ


    మేలగు మేకవి త్రాగుడు!
    చాలించుండావు పాలు చవటల్లారా!
    నాలుగు చటాకు లావుల
    పాలే సజ్జనుల నెల్లఁ బతితులఁ జేయున్

    రిప్లయితొలగించండి