11, జనవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 194 ( చీమ తుమ్మెను )

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చీమ తుమ్మెను బెదరెను సింహగణము.

39 కామెంట్‌లు:

  1. జగను నవ్విన, నేడ్చిన, సభను చేయ,
    క్రొత్త పార్టీని బెట్టిన కూడ భయమె
    ఘన చరిత్రను కల్గిన కాంగ్రె సునకు!
    చీమ తుమ్మెను బెదరెను సింహగణము.

    రిప్లయితొలగించండి
  2. గురువు గారూ నమస్సులు :

    ఉరగ శవమును దండ్రిపై నునుచు విభుని
    నోప లేకను శృంగియు శాప మీయ
    మూడు లోకము లదిరెను ముప్పు నెఱిగి
    చీమ తుమ్మెను బెదరెను సిం హ గణము

    రిప్లయితొలగించండి
  3. మిస్సన్నగారూ చాలా బాగుంది.

    వసంత కిశోర్ గారి గురించి నేను కూడా ఎదురు చూస్తున్నాను.
    చంద్రశేఖర్ గారూ మధ్య మధ్యలో ఒక పద్యము అందించండి!

    రిప్లయితొలగించండి
  4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంమంగళవారం, జనవరి 11, 2011 11:10:00 AM

    మిస్సన్న గారూ,
    మీ పూరణ సందర్భోచితమూ మరియూ అద్భుతం.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. చీమ పెరుగన్నమును తిని సేదదీరె
    నంత లోపుగా జరిగెను వింత యొకటి
    చీమ తుమ్మెను, బెదరెను సింహగణము
    అదిరిపడి నిద్ర మేల్కొనెనంత చీమ!

    రిప్లయితొలగించండి
  7. మంత్రిప్రగడ వారూ ధన్యవాదాలు.
    గన్నవరపు వారూ మీ పూరణ బాగుంది కానీ
    నాకొక్క సందేహం. శృంగి చీమా లేక చిరుతపులా అని.

    రిప్లయితొలగించండి
  8. మిత్రులకు మ్రొక్కులు
    సదస్యులకు సలాములు
    విఙ్ఞులకు వినయాంజలులు
    అందరికీ వందనములు.

    మూడు దినములుగా
    మిత్ర దర్శనానికి దూరమయ్యాను
    మిత్రులంతా మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న మహాశయా !
    సమకాలీన రాజకీయాలతో
    సమస్యలు
    శృతి మించుతుంటే , వాటితో
    సమస్యా పూరణం
    సాధించడంలో
    శంకరాభరణం
    సదస్యు లెవ్వరూ మీకు
    సాటి రారనుట
    సత్యము,సత్యము ,సత్యము.
    సమస్యను (జ) గన్నుతో పేల్చారు.
    భళా ! మేలు భళా !

    మూర్తిగారూ!
    శృంగిని తోడ్కొని వచ్చి
    సమస్యకు
    శృంగభంగం చేసారు.
    భళి భళి!

    రిప్లయితొలగించండి
  10. మరి నేనేం జెయ్యను ???
    దుశ్శల పతిని అడ్డం పెడతాను.
    చూడండి.
    01)
    ____________________________________

    గురుడు పన్నిన వ్యూహంబు - గూల్చు వేళ
    బాలు నభిమన్యు గాపాడు - వారి పాలి
    సైంహికేయుడు గాడొకొ ! - సైంధవుండు !
    చీమ తుమ్మెను ! బెదరెను సింహగణము.
    ____________________________________
    గురుడు = ద్రోణుడు
    వ్యూహము = పద్మ వ్యూహము
    సైంహికేయుడు = రాహువు
    _____________________________________

    రిప్లయితొలగించండి
  11. హరీజీ ! మేమంతా
    జగను , శృంగి , సైంధవుడు
    మొదలైన వారిని
    అడ్డం వేసుకొంటే గాని
    సాధించ లేని దానిని
    మీరు సునాయాసంగా దాటేసారు
    కలలో నైతేనేం !!!
    చీమ తుమ్ముకే , సింహ గణం బెదరేలా చేసారు.
    భళి భళీ ! మేలు భళీ !

    రిప్లయితొలగించండి
  12. వసంత్ గారు,

    ఏదో, లక్కీగా అలా తట్టింది సార్!

    శంకరయ్యసారు రోజురోజుకీ పట్టు బిగించేస్తున్నారు మరి!

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. 02)
    ____________________________________

    హరుని తపమున మెప్పించె - నంబ ! మరల
    కక్ష దీరగ, వెలసి , శి - ఖండి యయ్యె !
    తాత గూలుట గాంచెను - తనివి దీర !
    చీమ తుమ్మెను ! బెదరెను సింహగణము.
    ____________________________________

    తాత = భీష్ముడు
    ____________________________________

    రిప్లయితొలగించండి
  14. 03)
    ____________________________________

    శంకరాచార్యు కెదురొచ్చె - శ్వపచు డొకడు
    చిక్కు ప్రశ్నల వేధించె - చిత్త మలర !
    దైన్యపడి రంత వాదము - ధరణిసురులు !
    చీమ తుమ్మెను ! బెదరెను సింహగణము.
    _____________________________________

    రిప్లయితొలగించండి
  15. ఎమి యాంటన? జలుబున యేమిఁజేసె?
    ఏమిఁజేసె పిల్లులు కుక్క యెదురు రాగ?
    బాల కృష్ణ చిత్రంబేమి చాల హిట్టు?
    గురు లఘువులేమగు వరుస కూడినంత?
    చీమ, తుమ్మెను, బెదరెను, సింహ,గణము.

    (యాంటన = Ant అనగా)

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్నగారూ! చీమైనా మరీ ముక్కులో దూరితే
    ఎంత సింహానికైనా మరి తుమ్మురాదా...అందరూ
    చెప్పినట్టు సందర్భోచితం...మా లాంటివాళ్ళక్కూడా
    అర్థమయే విధంగా వుంది...అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. ఈగ మరచెను తన పేరు యిల్లు యలుక
    దోమ కెంతటి ధైర్యంబు దంతి జేర ?
    భామ జేరెను ప్రియునెంతొ భక్తి మీర !
    చీమ తుమ్మెను బెదరెను సిం హగణము !

    రిప్లయితొలగించండి
  18. 04)
    _____________________________________

    రహిత మాయెను లంకిణి - రాత్రి వేళ
    వీగి పోయిరి రాక్షస - వీర వరులు
    వహ్ని పాలాయె , వానరు - వలన లంక !
    చీమ తుమ్మెను ! బెదరెను సింహగణము.
    _____________________________________

    రిప్లయితొలగించండి
  19. జి.యస్.జీ !

    చీమ - తుమ్మెను - బెదరెను - సింహ - గణము.

    సమస్య నలా విడదీసి
    వి డి వి డి గా పొ డి పొ డి చే సె య్యా లి.
    హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ ....................!!!
    మీకు రెండు వీరతాళ్ళు !!

    రిప్లయితొలగించండి
  20. హనుమంతరావు గారూ నమస్కారాలు.
    సింహానిది మరీ డోర్ర ముక్కు అయిపోయింది.
    ప్రతీదీ లోపలకంటా దూరిపోవడమే.
    బహుశా వయసు ప్రభావం అయిఉంటుంది.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. 05)
    _____________________________________

    దసర మామూలు కొరకు మా - తణుకు లోన
    లైను మేనొచ్చి యడిగిన - లేదనంగ
    వీధి యంతయు జీకట్లు - వెల్లి విరిసె
    చీమ తుమ్మెను బెదరెను సిం హగణము !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  22. నాడు రాజనారాయణ న్యాయ మడుగ
    తీర్పు నిచ్చిరి చెవులకు దియ్య గాను
    ఇందిరమ్మకు సెగలయ్యె డెంద మందు
    చీమ తుమ్మెను బెదరెను సింహ గణము

    రిప్లయితొలగించండి
  23. హరి గారూ మీ చీమ కల బాగుంది. మిస్సన్న గారూ శృంగి కుట్టడు,కరవడు. వాడు చీమ కాదు,చిరుత కాదు, నేను శృంగా, శిఖండా అనుకొని శృంగిని యెన్నుకొన్నా. వసంత కిశోర్ గారి గురించి మనుష్యలను పంపిద్దామా అనుకొంటుంటే వారే గురువు గారు చెప్పినట్లు సమీరం లాగ వచ్చారు. అయ్యా మీ ఆఖరి పూరణ బ్రహ్మాండం . పండగ మామూళ్ళు యిచ్చేయండి,లైను మానుకి ,లేకపోతే దీపాల మాట దేముడెరుగు, కంప్యూటర్లో పద్యాలు కొట్టడం కుదరదు.

    రిప్లయితొలగించండి
  24. 06)
    _______________________________________

    చిత్ర రాజము దిలకించి - చేర వచ్చె
    ఊరి పొలిమేర నున్నట్టి - ఒలికిమిట్ట
    పిల్లి కూతకు భీతిల్లె - బృంద మంత
    చీమ తుమ్మెను ! బెదరెను సింహగణము.
    _______________________________________

    రిప్లయితొలగించండి
  25. తక్షకుడు చుట్టుకొన్న
    ఇంద్రుడు బ్రతికి పోయాడు గాని
    రాజనారాయణ పట్టుకున్న
    ఇందిర మాత్రం బందీ అయ్యింది.

    మూర్తి గారూ బాగుంది!

    రిప్లయితొలగించండి
  26. 07)
    _______________________________________

    విద్య లేనట్టి , వాడొట్టి - వింత పశువు
    విధి వశము నాయె , దుదకు - విద్య మంత్రి
    వేది కెక్కెను వేదులు - వెరగు జెంద !
    చీమ తుమ్మెను ! బెదరెను సింహగణము.
    ________________________________________

    రిప్లయితొలగించండి
  27. 08)
    _______________________________________

    ఇంతి , మునిపత్ని , ననసూయ - నెంచ గోరి

    విందు నర్థించె , వేల్పులు - వింత షరతు !!!

    పడతి మువ్వుర మార్చెను - పాపలు గను !

    చీమ తుమ్మెను ! బెదరెను సింహగణము.
    _______________________________________

    రిప్లయితొలగించండి
  28. 09)
    _______________________________________

    వింత జేష్టల దిరుగుచు - వీధు లందు

    వెర్రి వాడు , వాలము బట్టి - వెంట బడగ

    పరుగు వెట్టిరి ప్రజలంత - భయము తోడ !

    చీమ తుమ్మెను ! బెదరెను సింహగణము.

    ________________________________________

    రిప్లయితొలగించండి
  29. 10)

    _________________________________________

    అపుడు నేజూస్తి యమగోల - యన్న సిన్మ !


    యముని భయపెట్టె , నాంధ్రుల - యన్నగారు

    నరకమున స్ట్రైకు ప్రకటించి - నయము గాను !

    చీమ తుమ్మెను ! బెదరెను సింహగణము.

    ________________________________________

    రిప్లయితొలగించండి
  30. వసంత సమీరమా మీరు లేకపోమి కొద్ది రోజులుగా కడుంగడు నుక్కపోతతో బాధ నొందితిమి.
    ఇప్పుడు చల్ల గాలికి సేద తీరితిమి.
    ఆర్యా మీరంతగా ముమ్మారు బల్లగుద్ది చెప్పిన నేమన గలము?
    మీ చేయియును, బల్లయును బహు జాగ్రత్తగా చూచుకొనుడని తప్ప.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  31. నరసింహ మూర్తి గారూ మీ పద్యం బాగున్నది.

    రిప్లయితొలగించండి
  32. మిస్సన్న గారూ,
    అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అందుకు నిదర్శనం కవి మిత్రుల ప్రశంసలే. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి ఐతిహ్యంతో చక్కగా పూరించారు. అభినందనలు.

    హరి గారూ,
    సమస్యా పూరణలో చంత్కారాన్ని మెరిపించడంలో సమ్ర్థులు మీరు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    మీ పునరాగమనం సంతోషదాయకం. మీ పది పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    తొమ్మిదవ పూరణలో "వెర్రివాడు వాలము బట్టి" అన్నచోట "వెర్రి కరవాలమును బట్టి" అంటే బాగుంటుంది. "వెర్రి" అన్నా "వెర్రివాడు" అనే అర్థం.

    రిప్లయితొలగించండి
  33. జిగురు సత్యనారాయణ గారూ,
    మీ ప్రశ్నోత్తరాల పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    "ఏమి యాంటన?" కొద్దిగా తికమక పెట్టింది. "ఏది హీనాంగి?" అంటే ఎలా ఉంటుంది? హీనాంగి అంటే చీమ.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    పద్యం నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చాలా బాగుందండీ మీ పూరణ. అభినందనలు.

    హనుమంత రావు గారూ,
    స్వాగతం. సమస్యా పూరణలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాగే కవిమిత్రుల పూరణలను చదువుతూ వారిని ప్రోత్సహించ వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  34. శ్రీ శంకరయ్యగార్కి నమస్కారం..మీరు బ్లాగుని చక్కగా నిర్వహిస్తున్నారు. అభినందనలు.ఛందస్సు గురించి వ్రాసినదాంట్లో ఇది వరలో మీరు ఆటవెలది యెలా వ్రాయాలో క్రొత్తవాళ్ళకు సూచనలిచ్చినట్లు గుర్తు. అది చూద్దామంటే మరల దొరక లేదు..నేను వ్రాసేద్దామనికాదు.ప్రయత్నించగలనేమో నని..ఆ వివరాలు యెలా చూడాలో కొంచెం తెలియపర్చగలరా?

    రిప్లయితొలగించండి
  35. హనుమంత రావు గారూ,
    ధన్యవాదాలు.
    నాకు గుర్తున్నవరకు నేను ఇంత వరకు 'ఆటవెలది' లక్షణాన్ని బ్లాగులో పెట్టలేదు. త్వరలోనే 'ఛందస్సు'శీర్షిక ప్రారంభిస్తున్నాను. అప్పుడు వివరంగా చెపుతాను.

    రిప్లయితొలగించండి
  36. అడవి దారిన నడచుచు నర్భకుండు
    అనుకరించెను పొలీసు ' హా ర్ను సౌండు '
    హడలి పోయిరి పరుగిడి రన్నలచట
    "చీమ తుమ్మెను, బెదరెను సింహగణము."

    రిప్లయితొలగించండి
  37. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంచి పోలికతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. వేతనమ్ములహరియించువిధముగాంచి
    ఉద్యమించిగనేకమై ,నుర్విలోన
    పంచసభ్యులకమిటీయు ,వంచనమున
    చీమతమ్మెను ,బెదరెనుసింహగణము

    రిప్లయితొలగించండి