19, జనవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 202 (భీష్ముఁడు శిఖండిని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
భీష్ముఁడు శిఖండిని వరించి పెండ్లియాడె.

33 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు.

  01)

  ___________________________________


  గంగ పుత్రు డెవరు ? వాని - కంటు నెవడు ?

  రుక్మి సోదరి లేఖేల - కృష్ణు కంపె ?


  ఇందుమౌళి వలచి , పార్వ - తేమి జేసె ?


  భీష్ముఁడు శిఖండిని వరించి - పెండ్లి యాడె.

  _____________________________________

  రిప్లయితొలగించండి
 2. దుర్యోధనుడు :

  ఎదిరి పోరక రణమందు నేల బడెనొ
  భీష్ముడు శిఖండిని ; వరించి పెండ్లి యాడె
  పాండు పుత్రుల విజయము వమ్ము సేయ
  మొనను గురుభూమి గైకొను,ఘనుడ ! కర్ణ!

  ( మొన= సేన )

  రిప్లయితొలగించండి
 3. వశంత కిశోర్ జీ ! క్రమాలంకారములొ మీ పద్యము మనోహరముగా ఉంది. మీ భావోద్రేకము అర్ధ రాత్రి పిమ్మట పెల్లుబుకుతొంది మాట. మేఘాలు వర్షించడానికి ఓ సమయమని ఉంటొందా ?

  రిప్లయితొలగించండి
 4. వందకోట్ల జనులుగూడి భరతభువిని
  ఎన్నికలలోన గెలిపించిరెవరు వారు?
  వారు మగ, ఆడ కానట్టివారు; చూడ
  భీష్ముఁడు శిఖండిని వరించి పెండ్లియాడె!

  రిప్లయితొలగించండి
 5. యుద్దములు పలు జేసిన యోధు డతడు
  అస్త్ర సన్యాసమును జేసె నరయ జూసి
  భీష్ముడు శిఖండిని ! వరించి పెండ్లి యాడె
  హరిని, భీష్మకుని తనయ హరిణి మురిసి!

  రిప్లయితొలగించండి
 6. నా పూరణ చివరి పాదంలో చిన్న చేసాను గమనింప గలరు .
  "హరిని భీష్మకుని తనయ, హరియు మురిసె!"

  రిప్లయితొలగించండి
 7. మూర్తిగారూ ! కురుక్షేత్ర యుద్ధాన్నే దించేసారు.బాగుంది
  మొనను కురుభూమి......సరి యనుకుంటాను.
  గురు భూమి---అంటే అర్థం కూడా మారి పోతోంది

  హరీజీ ! మీ పద్యం బాగానే ఉంది .
  కానీ.....

  పీతాంబర ధరా ! మీ పద్యం
  సవరించాక సొగసు సంతరించుకుంది.

  రిప్లయితొలగించండి
 8. సమస్య సార్వజనీనమై యుంటే దేనికైనా అన్వయింపవచ్చు.
  అదే వ్యక్తి గతమైతే .....కొంచెం కష్ట మౌతుంది.
  అయినా nationalise చెయ్యడానికి ప్రయత్నించాను
  చూడండి
  02)
  _________________________________________

  మాట తప్పని మహనీయు - మారు పేరు ?*****[భీష్ముడు]
  తిక్త నాయకు,నేరీతి - తిట్ట వచ్చు ?*********[శిఖండి(య)ని]
  నేటి యువతియు ,యువకుని - నియతి నచ్చ:*[వరించి పెండ్లి యాడె]
  [భీష్ముడు] [శిఖండి(య)ని] [వరించి పెండ్లి యాడె]
  ___________________________________________

  రిప్లయితొలగించండి
 9. అర్థ శాస్త్రమునకు మేటి అరయఁ గొప్ప
  యొజ్జ మన్మోహనుండను సజ్జనుండు
  కాంగిరేసున జేరెను గాదె! యకట!
  భీష్ముఁడు శిఖండిని వరించి పెండ్లియాడె!

  రిప్లయితొలగించండి
 10. రవి గారూ ! అదిరింది .
  మీకు రెండు వీర తాళ్ళు.
  (ప్రస్తుతానికైతే నా దగ్గర లేవు
  వచ్చాక సమర్పిస్తా)

  రిప్లయితొలగించండి
 11. రవి గారూ అభినందనలు. చాలా బాగుంది మీ పూరణ.

  రిప్లయితొలగించండి
 12. రవి గారి పూరణ గొప్పగా ఉంది .ఎవరి ఉహలకు అందని భావం హాట్స్ ఆఫ్

  రిప్లయితొలగించండి
 13. ధర్మజుని కిచ్చిన వరము తలచి నంత
  నస్త్ర సన్యాసమును జేసె ననిని జూచి
  భీష్ముఁడు శిఖండిని,వరించి పెండ్లియాడె
  నపజ యమును ధర్మనిరతు డగుట జేసి.

  రిప్లయితొలగించండి
 14. హరి గారూ మీ భావం అక్షర సత్యం. చాలా బాగుంది మీ పూరణ.

  రిప్లయితొలగించండి
 15. ధర్మజుని కిచ్చిన వరము తలచి నంత
  నస్త్ర సన్యాసమును జేసె ననిని యోధ
  భీష్ముఁడు, శిఖండిని వరించి పెండ్లియాడె
  జయము, తీర నాతని గత జన్మ పగలు

  రిప్లయితొలగించండి
 16. అటూ,ఇటూ ఎటూ కాని వారిని వరించి అష్టకష్టాలు పడుతున్న ప్రజల పాట్లను పూరణలో ధ్వనింప జేసిన హరిగారు ప్రశంసార్హులు.

  రిప్లయితొలగించండి
 17. మిస్సన్న మహాశయా !బాగు! బాగు!
  సందర్భం మార్చ కుండా
  సమస్యను పూరించారు.

  హరీజీ ! మిస్సన్న గారి
  వ్యాఖ్య చూసాక గాని
  నా కర్థం కాలే.
  బహు బాగు!

  రిప్లయితొలగించండి
 18. 03)

  _____________________________________

  వీర విక్రమ విఖ్యాత- విజయు డకట !
  గోవు గొనిపోవు ,కౌరవు, - కూల్చు కొరకు
  భీరువు రథము నడిపెను - పేడి రూపు !
  భీష్ముఁడు శిఖండిని వరించి పెండ్లియాడె.

  ______________________________________
  భీరువు = పిరికివాడైన ఉత్తరుడు
  ______________________________________
  _____________________________________

  రిప్లయితొలగించండి
 19. 04)
  _______________________________________

  దైవ వశమున పుత్రుతో - దార నమ్మె !
  బాహు , పరిచర్య జేసెను - బాని సగుట
  సత్యవాది హరిశ్చంద్ర - చక్రవర్తి !
  భీష్ముఁడు ,శిఖండిని వరించి - పెండ్లియాడె.
  ________________________________________

  బాహు = వీర బాహునకు
  ________________________________________

  రిప్లయితొలగించండి
 20. మిస్సన్న గారు, మీరు కిషొర్ గారు చెప్పినట్టు right context లో పూరించారు. చాలా బాగుంది. ఈ రోజు అందరి పూరణలు వైవిధ్య భరితంగా ఉన్నాయి.

  వసంత్ కిషోర్ గారు! మీ చివరి పద్యం భావం అర్థం కాలేదు.

  రిప్లయితొలగించండి
 21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 22. కిషోర్ గారు, నేను వ్యాఖ్య పెట్టే లోపే మీరు నాలుగో పద్యం వేసేశారు. నేననన్నది మీ మూడో పద్యం గురించి!

  రిప్లయితొలగించండి
 23. హరీజీ ! సమస్యలు వ్యక్తి గతంగా ఉంటే
  (అంటే ఈ రోజు పేర్లు వాడ బడ్డాయి.)
  అందుచేత ఉదయం నుంచీ అందరి ఆలోచనలూ
  బీష్ముడికీ , శిఖండికీ ఎలా పెళ్ళి చెయ్యాలా అనే?
  పెళ్ళి చెయ్యలేం గనుక ముక్కలు చేసో మరొకటి చేసో
  ఏదో రకంగా సమస్యను సాధించాలని.

  మొదట మీరూ తరువాత రవిగారూ
  ఈ సమస్యను సార్వజనీనం ( generalise )
  చేసేసారు.కానీ రవి గారి పూరణ లో ఉన్న
  స్వచ్ఛత( clarity ) మీ దాన్లో లోపించింది
  అనడం కంటే ,మా ఆలోచనా విధానం వేరుగా
  ఉండడం వల్ల(మీరు ప్రశ్న రూపంగా కదూ
  పూరించారు అది చాలా వరకూ పక్క దారి పట్టించింది)
  మిమ్మల్ని పట్టు(catch )కో లేక పోయాం.
  నా (1) వ పూరణలోవలె మీరూ చేస్తున్నారు
  అనుకోవడమే అసలు పొరపాటు.

  రవి గారి పూరణ లో సంక్లిష్టత లేదు .
  చాలా స్పష్టంగా ఉంది.
  పైగా సమస్య సార్వజనీనమై పోయింది.
  అంటే భీష్ముడూ శిఖండీ మాయమైపోయి
  ఒక భావన ఉదయించింది.అదే
  "సమర్థుడు అసమర్థుణ్ణి ఆశ్రయించడం"

  మీ పూరణను మిస్సన్న గారి వ్యాఖ్యచదివాక
  చదివితే చాలా స్పష్టంగా అర్థమైంది.


  ప్రజలు శిఖండి వంటి నేతల్ని ఎన్నుకోవడం(మీది)
  మన్మోహన్ కాంగ్రెసులో జేరడం(రవి)
  అర్జునుడు ఉత్తరుని రధం తోలడం(నాది-3)
  హరిశ్చంద్రుడు వీరబాహునికి దాస్యం చెయ్యడం(నాది-4)

  ఇలాంటి ఉదాహరణలు వందల కొద్దీ దొరుకుతాయి.

  రిప్లయితొలగించండి
 24. మిత్రుల అందఱి పూరణలు బాగున్నాయి. రవి గారి పూరణ అదిరింది. మిస్సన్న గారి రెండవ పూరణ అద్భుతంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 25. మీ అందరి పూరణలు చదువు తుంటే ఎంత బాగున్నాయొ అమ్మో ! అటు పౌరాణికం ఇటు రాజకీయం ప్చ్ ! నా కలానికి ఊ.....హూ. ....! అంత బలం లేదు.అందుకే చుప్......చాప్ !

  రిప్లయితొలగించండి
 26. రండి రాజక్క! చెప్పుడీ రమ్యమైన
  బిల్లు క్లింటను బుష్షులు బిన్ను తోడ
  కూర్మి సేయుచు తల గోకు కొరివి గాధ
  భీష్ముఁడు శిఖండిని వరించి పెండ్లి యాడ !

  ( బిన్ను = బిన్ లాడెన్ )

  రిప్లయితొలగించండి
 27. కవి మిత్రులకు వందనం.

  ఈ రోజు మేము హైదరాబాదుకు షిఫ్ట్ అవుతున్నాము. సామానులు సర్దుకొనడం, ప్యాకింగు తదితర పనులతో సమయం లేక మీ పూరణలను వ్యాఖ్యానించలేక పోతున్నాను.
  పూరణలు పంపిన కవులకు అభినందనలు.
  విశ్లేషించిన మిత్రులకు ధన్యవాదాలు.
  రేపు నా వ్యాఖ్యలను పెడతాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 28. గురువు గారూ మీ ఇంటి బదిలీ సునాయాసంగా జరగాలని,
  మీకు క్రొత్త నివాసం అన్ని విధాలా అనుకూలంగా ఉండి
  మీవ్యాపకాలకు మరింత ప్రోత్శాన్ని ఇవ్వాలని మా ఆకాంక్ష.

  నరసింహ మూర్తి గారూ ధన్య వాదాలు.

  రాజెశ్వరి గారూ మీరు అలా భావించనక్కర లెదు.
  ఎందుకంటే మీరు పద్య రచనలో, నెను ఈ బ్లాగులో ప్రవేశించి-
  నప్పటి కంటే, చాలా పరిణతి సాధించారు. మీ పూరణలు
  ఒక్కొక్క సారి మీవేనా అనిపిస్తూంటాయి.
  ఒకసారి గురువుగారు చెప్పినట్లు అభ్యాసం ఎలాటి వారినైనా
  మేధావంతులుగా చేస్తుంది. మీ ప్రయత్నం కొనసాగించండి.

  అలాగే మంద పీతాంబర్ గారు కూడా నెను ఈ బ్లాగులో ప్రవేశించి-
  నప్పటి కంటే, అద్బుతమైన ప్రగతి సాధించారు. ఆయన పద్యాలు
  చాలా మనోహరంగా ఉంటున్నాయి.

  రిప్లయితొలగించండి
 29. హరీజీ !
  మీ సందేహం తీరిందో లేదో
  చెప్పారు గారు ?

  రిప్లయితొలగించండి