13, జనవరి 2011, గురువారం

ప్రహేళిక - 38

ఎవరీ మాతృమూర్తి?
తే.గీ.
వారధియు, నిశాపుష్పము, బంక, వంద,
కుటజములు త్ర్యక్షర పదము లట! ద్వితీయ
వర్ణములఁ జూడఁగా మన భరతమాత
కెనయగు మరొక్క మాత - తా నెవరొ గనుఁడు.

మనందరికీ మాతృమూర్తి అయిన ఈమె ఎవరు?

13 కామెంట్‌లు:

  1. వారధి = వంతెన
    నిశాపుష్పము= కలువ
    బంక =జుగురు
    వంద = శతము
    కుటజములు= మల్లిక.

    తెలుగుతల్లి.

    రిప్లయితొలగించండి
  2. బాలు మంత్రిప్రగడగురువారం, జనవరి 13, 2011 12:20:00 PM

    తెలుగుతల్లి
    వారధి - వంతెన
    నిశాపుష్పము - కలువ
    బంక - జిగురు
    వంద - శతము
    కుటజములు - మల్లిలు (మల్లెలు?)
    - బాలు మంత్రిప్రగడ

    రిప్లయితొలగించండి
  3. వంతెన ,కలువ,జిగురు,శాతము /శతము,మల్లియ = తెలుగు తల్లి

    రిప్లయితొలగించండి
  4. వంతెన
    కలువ
    జిగురు
    శతము
    ?
    తెలుగుతల్లి

    రిప్లయితొలగించండి
  5. తెలుగు తల్లి

    వం'తె 'న , నిశాపుష్పము???, జి 'గు 'రు , శ 'త 'ము, మ 'ల్లి 'లు

    అయినా ఈ పద్యాన్ని నిషేదించాలి. అమె మీ ఓరుగల్లు వారికి తల్లి గాదని ఒక రాజకీయవేత్త చెప్పారే :)

    రిప్లయితొలగించండి
  6. వంతెన, కలువ (?),జిగురు, శతకము, మల్లియ
    తెలుగుతల్లి/ తెనుఁగుతల్లి

    రిప్లయితొలగించండి
  7. వంతెన
    కలువ
    జిగురు
    శతము
    మల్లిక

    తెలుగు తల్లి

    రిప్లయితొలగించండి
  8. వంతెన
    కలువ
    జిగురు
    శతము
    మల్లిక

    తెలుగు తల్లి
    vasant.kishore@gmail.com

    రిప్లయితొలగించండి
  9. గురువుగారూ నమస్కారము.
    వంతెన,కలువ,జిగురు,శాతము,మల్లిక.
    మా 'తెలుగుతల్లి' కీ మల్లె పూదండ.

    రిప్లయితొలగించండి
  10. వంతెన
    కలువ
    జిగురు
    శతము
    మల్లియ

    తెలుగు తల్లి

    రిప్లయితొలగించండి
  11. వంతెన , కలువ ,జిగురు, శతము ,మల్లియలు = జవాబు = " తెలుగు తల్లి "

    రిప్లయితొలగించండి
  12. వంతెన
    కలువ
    జిగురు
    శతము
    మల్లియ/మల్లిక

    తెలుగుతల్లి

    రిప్లయితొలగించండి