ఈ కావ్యం పేరేమిటి?
సీ.తార పేరున నున్న వారపత్రిక యేది?
వ్యాధితోఁ బీడింపఁబడు నెవండు?
ఓటమికి గురైన నీటు జ్ఞానం బేది?ఆరవ తిథిని యే మని పిలుతురు?
యంత్రంబునకుఁ గల యన్య నామం బేది?పలుకుకు పర్యాయపద మ దేది?
పల్లె లందుండు సూపరు బజా రది యేది?భార్యను భరియించువాఁ డెవండు?
తే.గీ.దీపమును వెలిగింతురు దేనితోడ?
ఏది సాధింప మునులు తపింతు రెపుడు?
ద్వ్యక్షర పదంబు లన్నియు ప్రథమ వర్ణ
ములు దెపిపెడి ప్రముఖ కావ్యమును గనుండు.
రెండు పేర్లున్న ఆ ప్రముఖ కావ్యం ఏమిటో తెలిసికొని ఒక పేరు చెప్పండి.
స్వారోచిస మనుచరిత్రము
రిప్లయితొలగించండిజ్యోతి గారూ,
రిప్లయితొలగించండిమరీ ఇంత స్పీడా? సంతోషం! కానీ .....
మీ సమాధానంలో 4,7,8,9 అక్షరాలు తప్పు.
మరోసారి ప్రయత్నించండి.
విజయోస్తు!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్వారోచిష మనుసంభవము
రిప్లయితొలగించండిఅవును కదా తప్పైంది. స్వారోచిష మనుసంభవము..
రిప్లయితొలగించండితార పేరున నున్న వారపత్రిక యేది? - స్వాతి
రిప్లయితొలగించండివ్యాధితోఁ బీడింపఁబడు నెవండు? - రోగి
ఓటమికి గురైన నీటు జ్ఞానం బేది? - చిత్తు (చిత్తం ?)
ఆరవ తిథిని యే మని పిలుతురు? - షష్ఠి
యంత్రంబునకుఁ గల యన్య నామం బేది? - మర
పలుకుకు పర్యాయపద మ దేది? - నుడి
పల్లె లందుండు సూపరు బజా రది యేది? - సంత
భార్యను భరియించువాఁ డెవండు? - భర్త
దీపమును వెలిగింతురు దేనితోడ? - వత్తి
ఏది సాధింప మునులు తపింతు రెపుడు? - ముక్తి
ప్రథమ వర్ణములు దెపిపెడి ప్రముఖ కావ్యము - స్వారోచిషమనుసంభవము
మరో ప్రహేళిక కావాలి.. ఇలాగే కాస్త సులువుగా ఉండాలి సుమా...:)
రిప్లయితొలగించండిగురువు గారూ ! ఫలితాలు ముందే ప్రకటించేస్తె మా బోటివాళ్ళకు రాయడానికి ఉండదు కదా ? పైగా మీకు పగలు మాకు రాత్రి.ఉదయం చూసే సరికి ఫలితాలు స్వాగతం." సమస్య ," ఫర్వాలేదు ." గడి,ప్రహేళిక " రాయలేక పోతున్నాము.దయచేసి మాకు కుడా రాయడానికి అవకాశం కల్పించ గలరు.
రిప్లయితొలగించండిజ్యోతి గారూ,
రిప్లయితొలగించండిమరో ప్రహేళిక ఇచ్చాను. సులువుగా ఉందో, కఠినంగా ఉందో మీరే చెప్పాలి.
రాజేశ్వరి నేదునూరి గారూ,
వ్యాఖ్యలను "మాడరేషన్"లో పెడితే ఆ సమస్య పోతుంది. కాని సమస్యా పూరణంలో వ్యాఖ్యలు వెంట వెంటనే కనిపించక కవి మిత్రులు తమలో తాము చర్చించుకొనే అవకాశం పోతుంది. చూద్దాం ... ఈ రోజు "మాడరేషన్" పెడుతున్నాను. ఎలాగూ మీరంతా కొనిచ్చిన "సిస్టం"పైన సర్వాధికారాలు నావే గనుక ఎప్పటి కప్పుడు మెయిల్ బాక్స్ చూసి వ్యాఖ్యలను ప్రచురిస్తూ ఉంటాను.
శంకరార్యా !
రిప్లయితొలగించండిఈ "మాడరేషన్" ఏమిటో ??? ఏమీ బాగా లేదు .
మా post కూడా మాకు కనుపించడం లేదు.
కావాలంటే ,వీలైతే " ప్రహేళిక " కొక్క దానికే
పరిమితం చెయ్యండి.
లేదంటే పాత పద్ధతే ఉంచండి.
ఈ రోజు మాకు మిత్ర దర్శనం కరువై, చాలా వెలితిగా ఉంది.
మిత్రులను విడ దియ్యడం ?????
మహా పాపం సుమా !
పాపం శమించు గాక !!!