26, జనవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 208 (గాడిదలకుఁ దెలియు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్.

38 కామెంట్‌లు:

 1. బూడిద సౌఖ్యము దెలియును
  గాడిదలకు!! దెలియు కుసుమ గంధపు విలువల్
  వాడిన వారికె!!తత్వము
  కాడికి పోవగ దెలియును కలిమిలొ గాకన్ !!!

  రిప్లయితొలగించండి
 2. గాడిదలని హీనముగా
  పాడియె దలపంగ? నేడు పలువురు నేతల్
  చూడగ ఖరనందనులే!
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్.

  రిప్లయితొలగించండి
 3. బాడుగకు బండి లాగుట
  గాడిదలకుఁ దెలియు; కుసుమ గంధపు విలువల్
  చేడియల సహజ గుణములు
  సూడిదలుగ నీయ దగును సుమ బాలలకున్ !!

  రిప్లయితొలగించండి
 4. మంద పీతాంబర్ గారూ,
  మంచి విరుపుతో సమస్యను పూరించారు. అభినందనలు.
  "కలిమిలొ గాకన్" అన్నారు. "లో"ను హ్రస్వం చేసి "లొ" అనరాదు. ఇది చాలా మంది చేసే పొరపాటే. "కలిమిని గాకన్" అంటే సరిపోఉంది.

  మిస్సన్న గారూ,

  ఆడిన మాటలు దప్పిన
  గాడిదకొడు కనుచుఁ దిట్టఁగా విని "యయ్యో!
  వీడా నా కొక కొడు" కని
  గాడిద యేడ్చెన్ గదన్న ఘనసంపన్నా!
  అన్న చాటుపద్యాన్ని గుర్తుకు తెచ్చే మంచి పూరణ నందించారు. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. గురువు గారూ ధన్యవాదాలు.
  మరొక్కటి.

  మేడలని మిన్నకుండరు
  బీడులనుచు విడచి పోరు బీదల భూముల్
  గాడిద కొడుకులు పెక్కురు
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్.

  రిప్లయితొలగించండి
 6. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  అదరగొట్టేసారండీ ఈ పూరణతో. మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. మిస్సన్న గారూ,
  ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తున్న ఈ పూరణకూడ ఉదాత్తంగా ఉంది. అభినందనీయులు మీరు.

  రిప్లయితొలగించండి
 8. గురువుగారూ నమస్కారములు, ధన్యవాదములు. ఇప్పుడిప్పుడే జ్ఞానోదయ మవుతున్నాది!
  మిస్సన్నగారూ గురువు గారు చెప్పినట్లు గాడిదలతో నేతలను పోల్చి గాడిదలకు తీరని అన్యాయము చేస్తున్నారు !

  రిప్లయితొలగించండి
 9. పాడెకు ప్రాణము వచ్చును
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్
  త్రాడే పాముగ మారును
  ఆడేటి అబద్ధములకు హద్దులు గలవే!!

  రిప్లయితొలగించండి
 10. నరసింహ మూర్తి గారూ! ఔనుస్మీ! గాడిదలకు అన్యాయం చేశాను కదా!
  మీ పూరణ మాత్రం సుమసౌరభాలను గుబాళిస్తోంది.

  రిప్లయితొలగించండి
 11. సత్యనారాయణగారూ!
  భలే పద్యం చెప్పేసి అబద్ధాలని తేల్చేశారుగా!

  రిప్లయితొలగించండి
 12. నరసింహ మూర్తి గారూ గాడిదలకు నేను చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నం చేశాను.

  గాడిద శీతల దేవత
  కీడే లేనట్టి తేరు, యిలలో దానిన్
  కూడదు నేతకు పోల్చగ
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్.

  రిప్లయితొలగించండి
 13. చూడగ మనసున దోచును
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్;
  గోడకు వేసిన పోస్టరు
  వీడదు కత్రినది యైన బిరబిర దినగన్!

  రిప్లయితొలగించండి
 14. నంది ఏంకరయ్య says:

  January 26, 2011 at 2:11 am
  గీత దాటని అయిడి డబ్లిన్లో ఉందన్న
  బ్లాగు మాటలు నమ్మి బాగు బాగు
  అన్నజనులు కూడ బకరాలు అవ్వగా
  ప్రియను చూడుమిపుడు దయ్యమయ్యె

  రిప్లయితొలగించండి
 15. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంబుధవారం, జనవరి 26, 2011 2:04:00 PM

  పూరణలు గాడిదల మీదే అయినా, అన్నీ కుసుమ గంధ పరిమళాలని చల్లుతున్నాయి.
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 16. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ .....
  మొదటిసారి మీకు పూరణ పంపుచున్నాను. ఆమోదమైనచో స్వీకరించగలరు. పంపేవిధానం ఇదేనా తెలుపగలరు.

  ఈడును జూడకనే పూ
  బోడుల,బాలికలపైన పొగరుతొ యాసిడ్
  దాడులు జేసెడి యేమ
  గ్గాడిదలకు దెలియు కుసుమ గంధపు విలువల్?

  గోలి హనుమచ్ఛాస్త్రి
  గుంటూరు

  రిప్లయితొలగించండి
 17. జిగురు సత్యనారాయణ గారూ,
  అబద్ధాలతో పూరించి మెప్పించారు. ఇప్పటికే "మందాకిని" గారి అభినందనలను అందుకున్నారు. సంతోషం!

  మిస్సన్న గారూ,
  మీ మూడవ పద్యం కూడ బాగుంది. అభినందనలు.

  హరి గారూ,
  ఇంతకూ కత్రీనా ఖైఫ్ యోజనగంధి లాంటి సుమగంధి అంటారు? సరె! అందుకేనేమో కొత్త మల్లీశ్వరిలో వెంకటేశ్ ఆమె వెంట పడ్డాడు. ఆవిడ చిత్రాల్లో నేను చూసింది అదొక్కటే. అదీ ఇంట్లో సిడి ప్లేయర్లో.
  మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. కిషొర్ మహోదయుల పద్య ప్రవాహం ఇంకా ప్రారంభం కాలేదేమో!

  రిప్లయితొలగించండి
 19. అయ్యా, అజ్ఞాత గారూ,
  నా పేరును వక్రీకరించి మీరు రాసిన పద్యంలో ఏం చెప్ప దలచుకున్నారో అర్థం కాలేదు. దూషణ, భూషణ, తిరస్కారాలకు అతీతుణ్ణి నేను. ఇంకా నయం ... నంది అన్నారు, మరొకటి అనలేదు. సంతోషం!
  మీరు ఆటవెలది రాసారని అర్థం అవుతోంది. కొన్ని లోపాలున్నాయి. మొదటి పాదంలో "గీత దాట నయిడి డబ్లిన్లొ ఉందన్న" అన్నది అర్థం అయితే ఆ పాదాన్నీ సవరించే వాణ్ణి. ఇక మిగిలిన మూడు పాదాలకు నా సవరణ ....
  .......................................................
  బ్లాగు నుడులు నమ్మి బాగు బాగు
  అన్న జనులు కూడ అవ్వరా బకరాలు
  ప్రియను జూడు మిపుడు ప్రేత మయ్యె.

  రిప్లయితొలగించండి
 20. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  "శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం. చక్కని పూరణను పంపించారు. అభినందనలు.
  "మగ్గాడిదలు" మగ గాడిద లయినా గణదోషం లేదు.
  వ్యాఖ్యలను ఎలా పంపాలో వివరిస్తూ మీకు మెయిల్ పెట్టాను.

  రిప్లయితొలగించండి
 21. వీడని మాత్సర్యమునన్
  పాడిగ పద్యముల నేర్పు పండితవరుపై
  గాడిని తప్పి వదరు యే
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్?

  రిప్లయితొలగించండి
 22. మిస్సన్న గారి మూడు పద్యాలు అందంగా బాగున్నాయి. మూడవ పద్యముతో గాడిదలకు జరిగిన అన్యాయాన్ని తీర్చారు. గోలి హనుమఛ్చాస్త్రి గారు ఆమ్ల దాడులు చేసే గాడిదలు గురించి ప్రస్తావించారు. బాగుంది.
  అజ్ఞాత గారూ, గురువు గారు ఆయన బ్లాగును మాడరేషన్ లేకుండా తెరచి ఉంచి నందులకైనా ఆయనను,బ్లాగును, గౌరవించాలి కదండీ? ఆయన ఎప్పుడూ గీత దాట లేదు. అభిప్రాయ భేదాలు ఉండ వచ్చు,కాని మనమంతా ఒకరి నొకరు గౌరవించుకోవడము మన ధర్మము. మీకు అందులకు కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 23. గురువు గారూ, నమస్కారములు. సభా మర్యాద గీత యింత వరకు తప్ప లేదు. కాని నాకెప్పుడూ అనుమానమే. మాడరేషను చాలా అవసరము. మీకు వీలయినప్పుడు వ్యాఖ్యలు పోస్ట్ చేయ వచ్చు. కాని వాటి పరిశీలన అవసరము.

  రిప్లయితొలగించండి
 24. వృధాన్యర్థ భంగము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్? - భర్తృహరి.

  రిప్లయితొలగించండి
 25. అయ్యా కంది శంకరయ్యగారూ! మీకు, రవిగారికీ, గన్నవరపు నరసింహమూర్తిగారికీ కోపం తెప్పించినందులకు క్షంతవ్యుణ్ణి. మన బ్లాగ్లోకంలో జరుగుతున్న విషయాలు మీ దృష్టికి తీసుకురావాలన్న తాపత్రయంతో పెట్టిన కామెంటు అది. గీతాచార్య, ప్రియా అయ్యంగార్, సృజనా రామానుజన్ మొదలైన పేర్లు ఇప్పుడు బ్లాగుల్లో మారుమ్రోగుతున్నాయి. ఈ క్రింది లంకె చూడండి మీకు అర్థం అవుతుంది.
  http://priyadayyamgaaru.wordpress.com/2011/01/25/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%8a%e0%b0%95-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%ae%e0%b1%88%e0%b0%a8-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%80/#respond

  రిప్లయితొలగించండి
 26. సమయము సందర్భము లేకను వృధాన్యర్థ భంగము గావించెడు వారలెవ్వరొ యెరుంగన్ శక్యమే యేరికిన్?

  రిప్లయితొలగించండి
 27. వేడెదమో చాకలి, మా
  కాడికి ఆ జీన్సు తేకు, కంపరమౌ! పూ
  బోడుల చీరలె ఇంపగు !
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్.

  నెలలు తరబడి ఉతకకుండా చమట, ఊళ్ళో మట్టీ, మోసుకు తిరిగే అబ్బాయిల జీన్సు పాంట్లు నీ చాకలి మోటలో నెత్తుకుని రాకయ్య, 'భరించ 'లేకపోతున్నాము. దానికన్నా, పెర్ఫ్యూములు, సెంట్లు, పౌడర్లు గట్రా దట్టించిన వారివి కానీ లేదా తలలో పూలూ, కాళ్ళకు పసుపూ, పారాణి పెట్టుకునే ఆడవారి బట్టలు ఉతకడానికి తెచ్చుకో, భేషుగ్గా ఉంటుంది అని గాడిద మనోగతం అన్న మాట.


  వేడెదమో చాకలి, పూ
  బోడుల వస్త్రములు దెమ్ము, పుణ్యంబౌ! మా
  కాడికి తేకోయ్ జీన్సులు !
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్.

  రిప్లయితొలగించండి
 28. ఏడడుగులు నడచి తుదకు
  వేడుకలు మించి కొసరుచు విడాకులు కోరన్ !
  బీడుల దిరిగెడి కంచర
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్ !
  ---------------------------------------
  మేడల కులికెడి వారలు
  త్రాడును పామని బ్రమసి దడుసు కొనంగన్ !
  నీడల జాడకు భయపడు
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్ !

  రిప్లయితొలగించండి
 29. గోలి హనుమచ్ఛాస్త్రి
  నా పూరణను మెచ్చుకొని నన్ను ప్రొత్సహించిన వారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 30. అజ్ఞాత గారూ,
  క్షమించండి. విషయం తెలియక అపార్థం చేసికొన్నాను. మీరిచ్చిన లింకు చూసి అసలు సంగతి తెలుసుకున్నాను. మీ పేరడీ వ్యాఖ్యలు బాగున్నాయి. నా బ్లాగులో వ్యాఖ్య పెట్టినప్పుడే ఆ లింకు ఇచ్చి ఉంటే అపార్థాలకు తావు ఉండేది కాదు కదా?

  రిప్లయితొలగించండి
 31. సనత్ శ్రీపతి గారూ,
  గాడిదల మనోగతాన్ని రెండు పద్యాల్లో చక్కగా ఆవిష్కరించారు. పూరణలు బాగున్నాయి. అభినందనలు.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పద్యం రెండవ పాదాన్ని " వేడుకలను మించి కొసరి విడిపోఁ గోరన్" అనీ, రెండవ పద్యం రెండవ పాదంలో "పామనుచు" అని సవరిస్తే గణదోషం తొలగిపోతుంది.

  రిప్లయితొలగించండి
 32. నెట్ లేక లేటయ్యింది.
  ఏమీ అనుకోకండి అయ్యలూ!
  _________________________________

  కుసుమ గంధపు విలువలే గాదు
  కరుణా గారవములు గూడా
  గాలిగాడికి తెలుసునని
  తెలుసు కోండి సాములూ!
  _________________________________

  వసుదేవుడు కాళ్ళట్టీసు కుంటే
  సమయం సందర్భం గ్రహించి
  అరవకుండా
  ఇంగితాన్ని ప్రదర్శించిన గాడిదకు
  కుసుమ గంధపు విలువ
  తెలీదని అనుకోగలమా, సాములూ!

  01)
  _________________________________

  నాడు పరమాత్ము , గావను;
  వేడిన వసుదేవుని మొఱ - విని ; చెరసాలన్
  పాడుట మానెను గాదా !
  గాడిదలకు దెలియు ; కుసుమ - గంధపు విలువల్!
  __________________________________

  పాడుట = ఓండ్ర పెట్టుట
  __________________________________

  రోజంతా తిని తిరగడం తప్ప
  వేరే పనేదీ చెయ్యని
  సోమరిపోతుల కంటే
  కాడిని మెడ మీద వేసుకొని
  గాడిద బరువులు మోసే గాడిద
  ఎంతో గొప్పది గదా !
  దానికి కుసుమ గంధం
  తెలియదందుమా!!
  ఏమంటారు సాములూ!

  02)
  ___________________________________

  కాడిని మోసెడు గాడిద
  జూడకయా , హీనముగను ! - సోమరి పోతుల్ !
  గాడిదల కన్న మిన్నయె ???
  గాడిదలకు దెలియు ; కుసుమ - గంధపు విలువల్!
  ____________________________________

  పగలంతా యజమానికి సేవ జేసి
  దొంగలొచ్చినా అరవకుండా
  కాపలా కుక్క తిని పడుకుంటే
  దానితో వాదించి లాభంలేక
  తానే ఓంఢ్ర పెట్టి యజమానిని
  లేప యత్నించి
  కుక్క కన్నా విశ్వాసం చూపించిన
  గాడిదకు కుసుమ గంధం విలువ తెలీదంటే
  నే నొల్లకోను , సాములూ! చిత్త గించండి!

  03)
  ____________________________________

  ఊడిగము జేసి , చాకలి
  వాడిల్లు గాచు శునకపు - వాదన చేదై
  గాఢ నిదుర మేలుకొలుపు
  గాడిదలకు దెలియు ; కుసుమ - గంధపు విలువల్!
  ____________________________________

  రిప్లయితొలగించండి
 33. ఆడెడి పాడెడి వారలు
  వేడుచు పూజ్యసభ లోన విచ్చేయంగన్
  వేడిన నోరెత్త రెటుల
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్?

  రిప్లయితొలగించండి
 34. వాడల వోట్లకు తిరుగుచు
  గూడుల కంపుల నెరుగుచు గుఫ్ఫన ముక్కున్
  ఓడగ పరిపరి కాంగ్రెసు
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్

  రిప్లయితొలగించండి
 35. పీడకలలుగను వాడికి
  మూఢాలున్నట్టి నాడు ముడిపెట్టంగన్!!
  జాడను జెప్పక తిరిగెడి
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్!!

  రిప్లయితొలగించండి
 36. కం.
  ఆడియు దప్పని గోవులు
  వీడవు ధర్మమ్మునెపుడు విజ్ఞత గలుగన్ !
  చూడంగను నే విధమున
  గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్!!

  రిప్లయితొలగించండి