చదువు విధానము - ఆకుపచ్చ రంగు చేపలోని కన్నువద్ద గల (ప) తో మొదలు బెట్టాలి. తోక దగ్గిర భక్తుల తోటి ఆపి భక్తుల కోర్కె దీర్చుమా అని చదువు కోవాలి. ఆవిధముగా గులాబీ రంగు, కాషాయరంగు చేపల లోని అక్షరాలు చదువు కోవాలి. అప్పటికి మూడు పాదాలు అవుతాయి. చివరిగా వృత్తములోని కరివదనుండ అని చదువు కోవాలి. దీనిలో విశేషము 3 పాదములలోని చివరి అక్షరము (మా) ఆఖరి పాదములో 3 సార్లు వస్తుంది. పరుల దనూజుడా యరయు భక్తుల, భక్తుల గోర్కె దీర్చుమా హరుని శరీరజా, జవురు యంగద, యంగద బాపి గాచుమా, సురవర పూజితా యిడుము శోభను, శోభను జూపి యేలుమా, కరి వదనుండ మా జనుల గాచుచు మాకు ప్రపత్తి నివ్వుమా.
భావము - పార్వతి పుత్రా! భక్తులను రక్షించు. భక్తుల కోర్కె దీర్చు. శివుని పుత్రుడా! తొలగించు దు:ఖము. ఆపద బాపి కాచుము. దేవతల పూజిత! అందము నిడుము. కాంతి నిచ్చి యేలుమా. ఏనుగు ముఖము గలవాడ! మా ప్రజలను గాచి రక్షణ నిడుము.
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారు వారి కుడ్యముపై ప్రచురించిన ఘటికాయంత్రబంధము స్ఫూర్తితో కూర్చబడినది. వారికి ధన్యవాద సహస్ర నమస్కారములు. కుండలీకరణములలోని 12 (క) అక్షరములకు గడియారము మధ్యలోనున్న (క) వర్తిస్తుంది. మొత్తము 84 వర్ణములు. ఈ 12 (క) కారములను తీసివేస్తే, మిగిలిన 72 లో కొన్ని ద్వితీయ వలయములో నుంచగా మిగిలినవి చుట్టు నున్న ప్రధమ వలయములో నమర్చబడినవి