3, డిసెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2535 (మది మెచ్చిన సుందరాంగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్"

87 కామెంట్‌లు:

  1. ఇదిగిదిగో కానుక యి
    చ్చెదననుచును మభ్యపెట్టి చెల్లింపనియా
    హృదయేశుని వైఖరి గని
    మది మెచ్చిన సుందరాంగి మర్కటమయ్యెన్.

    రిప్లయితొలగించండి
  2. ఇది ముద్రా రాక్షసమే!
    సుదతుల్! పదిమంది మెచ్చు సుందర వదనల్!
    చదువురు సవరణ తోడన్:
    "మది మెచ్చిన సుందరాంగి మరకత మయ్యెన్!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. అదురహో అప్పుతచ్చు !


      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ముద్రారాక్షస పూరణ బాగుంది. కాని సమస్యపాదం ఏదీ? దానిని రెండవ పాదంగా పెడితే సరిపోతుంది. "చదువుడు" అనండి.

      తొలగించండి
    3. 🙏🙏🙏

      ఇది ముద్రా రాక్షసమే:
      "మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్";
      చదువుడు సవరణ తోడన్:
      "మది మెచ్చిన సుందరాంగి మరకత మయ్యెన్!"

      తొలగించండి
    4. 🙏🙏🙏


      ఈ జోకు మునిమాణిక్యం నరసింహా రావు గారి "కాంతం కథలు" లోనిదనుకుంటా... చిన్నప్పుడు చదివినట్లు గుర్తు...

      తొలగించండి
  3. కదలను మెదలను చెదరను
    వదలను నిన్నని ప్రతినలు పలికిన పతికిన్
    ముదితయె సంతును కనగా
    మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్ .

    రిప్లయితొలగించండి
  4. ఎద దోచిన జవరాలని
    పదిలముగా ముఖ కితాబు బాసలు తెలుపన్
    యెదుటబడి పరిణయ మనగ
    మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ముఖపుస్తక ప్రేమ గురించిన మీ పూరణ బాగున్నది. 'ముఖ కితాబు' దుష్టసమాసం కదా? 'తెలుపన్ + ఎదుట = తెలుప నెదుట, తెలుప న్నెదుట' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
    2. ఎద దోచిన జవరాలని
      పదిలముగా ముఖ పుస్తి బాసలు తెలుప
      న్నెదుటబడి పరిణయ మనగ
      మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్

      తొలగించండి
  5. చెదరనియేకాగ్రతతో
    ముదముగ గీయంగ చెలియ బొమ్మను నేనే
    యిదియేమిటి గురుదేవా
    మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్?

    రిప్లయితొలగించండి
  6. అది పుంజికస్థల మొదట
    యదిగో తాపసి శపింప నంజన యయ్యెన్
    విధి వశమున మరి కేసరి
    మది మెచ్చిన సుందరాంగి మర్కటమయ్యెన్!!

    రిప్లయితొలగించండి


  7. ఇదిగిది గో జూ వెళ్ళెద
    మిదిగో రమ్మా జిలేబి ! మించగ ఝంపా
    క దరువు, గానన్ వాటిన్,
    మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. చెదరని వలపు ను జూపుచు
    వదలక ప్రేమించ వనిత వక్ర పుబుద్ది
    న్నేదురుగ గని నంత న్ ద ను
    మది మెచ్చిన సుందరాం గి మర్క్తట మయ్యే న్

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    అది యేమా పదబంధము
    కదలవు కవితలకు మరిగి కానే సతి నం
    చదురంగ చించ బరుగిడు
    మది మెచ్చిన సుందరాంగి మర్కటమయ్యెన్!

    చదివిన బుద్ధికి లలనల
    హృది మెచ్చగ మాటలాడు హేలను గనెనో
    "పది రోజులప్రేమా!"నే
    మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్!

    వదలక జూచిన నారుల
    కెదురుగ కుడి కన్ను గొట్టు కేవల ఋజ నా
    సదనంబున శాంతిని గొనె
    మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్!


    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    హృదయేశ్వరుడే నిత్యము
    మధుశాలకె యంకితమవ మానిని ముదమున్
    యదుపును జేసెడు వేళన
    మదిదోచిన సుందరాంగి మర్కట మయ్యెన్

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముదమునన్+అదుపును = ముదమున నదుపును, ముదమున న్నదుపు' అవుతుంది. యడాగమం రాదు కదా!

      తొలగించండి
    2. వదనేందుబింబ ! నిను నే
      నిదిగో ! యీ దినమలంకరించెద ననుచున్
      ముదమార దిద్ది చూచితి !
      మదిదోచిన సుందరాంగి మర్కటమయ్యెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. అదిగో బాపూ గారట
      నిదె నేనిటనుండి గీయ నింతుల బొమ్మల్
      పిదపఁ గన వాటినహహా !
      మది మెచ్చిన సుందరాంగి , మర్కటమయ్యెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    4. శాస్త్రి గారూ,
      'హృదయేశ్వరుడే నిత్యము...' పూరణ విరించి గారిది కదా!

      తొలగించండి
    5. అవును సార్!

      తప్పు తప్పు!!

      విరించి గారికీ, మైలవరపు వారికీ, గురువు గారికీ పదివేల క్షమాపణలు!

      🥀🥀🥀

      తొలగించండి
    6. మైలవరపు వారి సవరణతో:

      అదె బాపు గారట , మరియు
      నిదె నేనిటనుండి గీయ నింతుల బొమ్మల్
      పిదపఁ గన వాటినహహా !
      మది మెచ్చిన సుందరాంగి , మర్కటమయ్యెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    7. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    8. శ్రీ శాస్త్రి గారూ.. అంత పెద్ద మాట ఎందుకండీ.? రేపు నా పద్యానికి వారి పేరు పెడితే సరిపోయేది కదా.. అంతా సాహితీ మిత్రులం.. ఇటువంటివి సామాన్యమే.. అందునా మీరు మా పద్యాలను పంపిస్తూ నిస్వార్థంగా సరస్వతీ సమారాధన చేస్తున్నారు.. మీకు ధన్యవాదాలు..... మురళీకృష్ణ

      తొలగించండి


    9. నాదో ఉడతా భక్తి స
      భాదరణల గాంచినట్టి పద్యము లన్నో
      మాదిరి వాత్సాపుల నుం
      డీ దిగుమతి జేయగన్ చిడిముడి జిలేబీ :)

      జిలేబి

      తొలగించండి
  11. కదలక నిలబడ ప్రేయసి,
    పదిలముగా నామెరూపు పటమును గీయన్
    అదికుదరక విధివక్రత
    మదిదోచిన సుందరాంగి మర్కటమయ్యెన్

    రిప్లయితొలగించండి
  12. ఎదురుగ నిలబడ సుతునిది
    మదిదోచిన సుందరాంగి,మర్కటమయ్యెన్
    అదుపును గోల్పోయినత్త
    అదనపు కట్నపు పిపాస నావిరి కాగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మూడవ పాదంలో మూడవ గణం జగణమయింది. అక్కడ "అదుపును గోల్పడి యత్తయె" అనండి. అలాగే "పిపాస యావిరి కాగన్" అనండి.

      తొలగించండి
  13. కుదుపను రక్కసుబాల్పడె
    మదిమెచ్చిన సుందరాంగి,మర్కటమయ్యెన్
    సదమల మిత్రుడు గుదిగొని
    వెదుకగ సతిని,కదనమున పేరిణిగాగన్
    కుదుప= మోసము
    పేరిణి= కవచము




    రిప్లయితొలగించండి
  14. హృదిలో కలలో మెదలుచు
    మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్
    గుదిబండగ నయ్యెన్ నా
    కది తలమించిన బరువని కలలో తెల్సెన్

    రిప్లయితొలగించండి

  15. కొత్తగా కొన్న ఐఫోను డమాలే డమాలు :)


    ముదముగ యైఫో నుకొనన్
    కుదురుగ పనిచేయక సరకు డమాలవ్వ
    న్నదవద మగడిని గీరుచు
    మది మెచ్చిన సుందరాంగి, మర్కట మయ్యెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. ఐఫోను ప్రాబ్లెమ్సు ఇంతింత గాదయా :)



    గదయిత్నువట జిలేబికి
    ముదముగ కొన్న చరవాణి ముంగటి లోనే
    యదవద క్రాషవ్వంగన్
    మదిమెచ్చిన సుందరాంగి, మర్కట మయ్యెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ముదముగ నైఫోను కొనన్" అనండి.
      'గదయిత్నువట... యదవద...' ?

      తొలగించండి

    2. గదయిత్నువు - ప్రేమికుడు కామికుడు
      అదవద వెంటనే వెనువెంటనే

      ఆంధ్రభారతి ఉవాచ

      సావేజిత
      జిలేబి

      తొలగించండి
  17. హృదయాలను దోచెడి నటి
    యెదురాయెను కనులముందె,యిప్పటి వరకున్ ముదమారగ నాతండే
    మది మెచ్చిన సుందరాంగి మర్కటమయ్యెన్

    రిప్లయితొలగించండి
  18. ముదముగ బయాల్జి ఛాత్రిని
    మదిలో ప్రేమించి మెచ్చి మనువాడంగన్
    గదిలో బల్లిని చూడగ
    మది మెచ్చిన సుందరాంగి మర్కట
    మయ్యెన్

    రిప్లయితొలగించండి
  19. ఎదురుగ ఫకీరును గనగ
    నదురుచు శిష్యుండు బాల నాగమ నడగన్
    ఇదిగో జూడుమురా! నా
    మదిమెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్!!!


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జూడు మనగ' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  20. ముదముగ పై పై మెరుగులు
    విదితమ్ముగ నెదను నిలువ వేడుకతోడన్
    ముదితను బెండ్లాడగ తా
    మది మెచ్చిన సుందరాంగి, మర్కట మయ్యెన్ :)

    రిప్లయితొలగించండి
  21. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: అప్సరసలలో, గొప్ప అందగత్తెగా పేరుపొందిన పుంజికస్థల, శాపవశమున భూలోకంలో కోతిగా, అంజనాదేవిగా జన్మించిన సందర్భం. ( ఆమెయే ఆంజనేయునికి జన్మ నిచ్చింది) {వాల్మీకి రామాయణం, కిష్కింధాకాండ, 66 వ సర్గ, 8 మరియు 9 శ్లోకములలో నున్న విషయము}


    అదె చూడు *పుంజికస్థల*,
    మొదట గనగ *నప్సరస*, యిపుడు శాపముచే
    నిదె *యంజన*, యౌ, నందరు
    *మది మెచ్చిన సుందరాంగి, మర్కట మయ్యెన్.*

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
  22. ఉదయించెడు చంద్రుని వలె
    మది దోచెను యౌవనమున మైమరపించెన్
    ముదిమియె పైబడ నకటా !
    "మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్"

    రిప్లయితొలగించండి
  23. సదనమ్మును వీడి చని బ
    హు దినము లయ్యె సురుచిర కృశోదరియే నా
    దు దురపు మనస్సు, కలఁ గన
    మది మెచ్చిన సుందరాంగి, మర్కట మయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సమస్య లో “సుందరాంగి” ముద్రణ దోషము దొర్లినది.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      ధన్యవాదాలు. సవరించాను.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  24. కుదురుగ ఘటోత్కచుడటన్
    బెదరించ వధువుగ మారి వేడుకఁ జేయన్
    సుదతి శశిరేఖ లక్ష్మణు
    మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్!

    రిప్లయితొలగించండి
  25. ఎదలోనప్రేమకలిగెను సుదతిని నాటకమునందుచూడగ పిదపన్ గదిలోనికేగి కనుగొన మది మెచ్చిన సుందరాంగి మర్కటమాయెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మేకప్ లేకుండా చూస్తే అంతే కదా!
      బాగున్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  26. గురుదేవులకు పద నమస్కారములు . కొత్త android cell కొన్నాను . trail కోసము ప0 పి0 స్తున్నాను క్షమి౦చాలి.

    రిప్లయితొలగించండి
  27. గురుదేవులకు పద నమస్కారములు . కొత్త android cell కొన్నాను . trail కోసము ప0 పి0 స్తున్నాను క్షమి౦చాలి.

    రిప్లయితొలగించండి
  28. కదలని శిల్పపుటందము
    చదువరి,నేర్పరిగ మంచిచైతన్య నిధిన్
    అదనపు కట్నము గోరగ?
    మదిమెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్|

    రిప్లయితొలగించండి
  29. పదవులపై మమకారము
    వదలక ప్రత్యర్థి వైపు పరుగులు బెట్టెన్
    వదలెను సొమ్ములు నాశలు
    మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్.

    రిప్లయితొలగించండి
  30. అది వడ్డాది కళాత్మక
    ముదితను బోలఁగ భ్రమపడి పుస్తెను కట్టన్
    కదురుగ నిలువదు నా దరి
    మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్

    రిప్లయితొలగించండి
  31. గురువు గారికి నమస్సులు.
    సుదతిన్ నల్లని భామయు
    యదనిండా మమత పొంగె యశ్వoతునికిన్.
    మదనాo కితుడై, కలలో
    మది మెచ్చిన సుందరాంగి మర్కట మయ్యెన్.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యదనిండా'...?

      తొలగించండి


  32. ఎదలో నిలిచిన ప్రేయసి

    ముదమారగ తన్ను గాంచి మోదంబందన్

    హృదయేశ్వరి యెటులున్నను

    మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్.


    మధువును గ్రోలిన వానికి

    మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్

    వదలక వెంటబడి తిరిగి

    పదపదె విసిగింప చెంప పగులం గొట్టెన్.


    సదమల మతితో చేరిన

    మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్

    వదలని మోహము చూపగ

    సొదయనుకొనుచుపరిగెత్తె సుందరు డపుడే.

    రిప్లయితొలగించండి
  33. మొన్న టి ఆర్ యస్ నాయకుడు భార్యను కొట్టుట పై
    మది నిండిన కలుషము,నా
    మది మెచ్చిన సుందరాగి మర్కట మయ్యెన్
    గుది గొన్న కోపమున తా
    చదివెను తన స్ధాయి మరచి సన్నాసి వలెన్.

    రిప్లయితొలగించండి