9, డిసెంబర్ 2017, శనివారం

సమస్య - 2541 (కుట్మలదంతీ కలిగెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై" 
(లేదా...)
"కుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్"
(ఒకానొక అవధానంలో ఇచ్చిన సమస్య)

104 కామెంట్‌లు:

 1. "కుట్మల/దంతీ/ నీపయిఁ/గోరిక/గల్గెన్"/

  సార్!

  ఇది కంద పద్య పాదము కాదేమో! మూడవ గణము "భ" గణమైనది.

  "కుట్మలదంతీ తమపయిఁ గోరిక గల్గెన్"?

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. లిట్మసు టెస్టుర నాకిది
   ఖట్మలువై నామనమ్ము కరచితి వకటా!
   ఫట్మట యనంగ నాహృది
   కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై!

   ఖట్మలు = నల్లి
   లిట్మసు టెస్టు = litmus test
   (ఆంధ్ర భారతి)

   తొలగించండి
  2. శాస్త్రి గారూ నమస్సులు. ఆకాశవాణి వారు సమస్య ఇచ్చినచో దయచేసి తెలుపగలరు.

   తొలగించండి
  3. శాస్త్రి గారూ నమస్సులు. ఆకాశవాణి వారు సమస్య ఇచ్చినచో దయచేసి తెలుపగలరు.

   తొలగించండి
  4. కంది వారు ఉవాచ:

   ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారి ఈనాటి సమస్యాపూరణం కార్యక్రమంలో మన సమూహానికి చెందిన క్రింది మిత్రుల (మిత్రురాండ్ర) పూరణలు, పేర్లు చదువబడ్డాయి.
   ౧. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
   ౨. వి.యస్.ఎన్. మూర్తి గారు
   ౩. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు
   ౪. కొనకళ్ళ ఫణీంద్ర రావు
   ౫. చంద్రమౌళి రామారావు
   ౬. గండూరి లక్ష్మినారాయణ గారు
   ౭. గుఱ్ఱం జనార్దన రావు గారు
   ౮. కంది శంకరయ్య గారు
   *మాచవోలు శ్రీధర రావు గారు
   *గుఱ్ఱం సీతాదేవి గారు
   *డా. బల్లూరి ఉమాదేవి గారు
   *చంద్రమౌళి సూర్యనారాయణ గారు
   *శ్రీహర్ష గారు
   *సి. రామమోహన్ గారు
   *బొగ్గరం ఉమాకాంత ప్రసాద్ గారు
   *నేదునూరి రాజేశ్వరి గారు
   *బండకాడి అంజయ్య గారు
   *కె. ఈశ్వరప్ప గారు
   సమయాభావం వల్ల * చిహ్నం ఉన్నవారి పూరణలు కాకుండా కేవలం వారి పేర్లను మాత్రం చదివారు.
   *********************************************
   వచ్చేవారం కోసం సమస్య....
   "ఘనమై వెల్గు తెలుంగు తేజము తెలంగాణమ్మునం దంతటన్"
   *********************************************

   తొలగించండి
  5. ఈ వివరణ కూడా విన్నాను నా చెవిటి చెవులతో:

   "...తెలంగాణము అంటే తెలుగు భూమి అని అర్ధము... కేవలం ఒక ప్రాంతమే కాదు..."

   సందర్భం:

   రానున్న "ప్రపంచ తెలుగు మహా సభలు"...

   తొలగించండి

  6. ఇది సమస్యే అంటారా :)

   సమస్య అనుకుంటే ఇప్పట్లో తెలుగు తేజము "తెలంగాణము " లో లేదనుకోవాలిస్మీ :)

   జెకె :)

   "
   పృచ్ఛకుడు అడిగిన ' సమస్య ' యొక్క భావం చాలా అసంగతంగా, అసంబద్ధంగా, అసందర్భంగా, వుంటుంది"


   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  7. పోనిద్దురూ! ఇలాటి "సమస్య" కాని యథార్థాల వృత్త పాదాలు గతంలో చాలా ఇవ్వ బడినవి కదా శంకరాభరణం పూర్వ పుటలలో!

   తొలగించండి


  8. వినగన్ గానము లెల్ల వీధుల జనుల్ వేవేళ  కీర్తించుచున్,  
   సినిమా పాటల కైపులన్ మనసులో చిత్రమ్ము గానిల్పుచున్ 
   మన సామాన్యులు మాటలాడ రమణీ మత్తేభ పద్యమ్ములన్
   ఘనమై వెల్గు తెలుంగు తేజము  తెలంగాణమ్ము నందంతటన్ !

   జిలేబి

   తొలగించండి
 3. ఖాట్మండూ పట్టణమున
  కుట్మల రాజిత వనమున కూర్చొని యుండన్
  ఫట్మని నీచూపుతగుల
  కుట్మల దంతీ తమపయిఁ గోరిక గల్గెన్

  రిప్లయితొలగించండి


 4. చట్మని‌ చెప్పెను పోరడు
  కుట్మలదంతీ ! జిలేబి! గోరిక గల్గెన్,
  తట్మని నచ్చిన చెప్మా !
  కట్మల్లామల బిలిచెద కసమస వలదోయ్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. పట్మని కొట్ట చచ్చెదరు వైరులు| కీచక నామమన్నచో
  కుట్మల రౌరవంబె మరి| కోమలి|సుందరి|నన్ను మించునే
  రాట్మహినందు లేడిట విరాటుడు లెక్కయె చూడ నాకునో
  కుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారు! ఢన్యవాదములు

   "రాట్మహి" ప్రయోగము అనుమానముగా ఉన్నది, కాన సవరణతో...
   రాట్ + మరి = రాట్మరి

   పట్మని కొట్ట చచ్చెదరు వైరులు| కీచక నామమన్నచో
   కుట్మల రౌరవంబె మరి| కోమలి|సుందరి|నన్ను మించునే
   రాట్మరి లేడు లేడిట విరాటుడు లెక్కయె చూడ నాకునో
   కుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్||

   తొలగించండి
 6. కట్మల్ మామలు దొంగలు
  కుట్మల ములవంటి పూల కొనగో టనుద్రుంపన్
  ఛట్మని తప్పుకు దిరుగుచు
  కుట్మల దంతీ నినుగన గోరిక గల్గెన్

  రిప్లయితొలగించండి
 7. నట్మయమగు వాక్కు లనకు ;
  పట్మని యిపుడే పలికెద పట్టుగ వినుమా !
  చిట్పట లాడకు నాపై ;
  కుట్మలదంతీ ! తమపయి గొరిక గల్గెన్ .

  రిప్లయితొలగించండి

 8. చట్మని చెప్పె మత్తు గొని, చక్కని చుక్కను చూడ, సుందరీ!
  కుట్మలదంతి! నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్
  మట్మట లాడ కోయి భయ మయ్యెను సూవె ! కుమారి రా దరిన్,
  పట్మని రమ్మ, పెండ్లి సయి పట్టుగ చేసుకొనన్ జిలేబియా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. మైలవరపు వారి పూరణ

  లలనా ! మురిపించితివే !
  కులుకుల వయ్యారి ! కుంద *కుట్మలదంతీ* !
  *కలిగెను గోరిక నీపై* !
  వలపులు చిలికింపరావె వారిజనయనా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అడురహో !అదురహో !

   కవి గాంచినది రవి గాంచునా అని ఊరికే అన్నారా !

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  2. 🙏🙏పద్యప్రశంసకు శతాధిక వందనములు.. అందరికీ

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  3. కోట రాజశేఖర్ గారి పూరణ

   సందర్భం :: కీచకుడు , మదిరకోసం దాసి వేషంలో తన మందిరానికి వచ్చిన పాండవపత్ని పాంచాలిని జూచి మోహించి , ఓ సుందరాంగీ! పరుల భార్యవైన నిన్ను కోరుకొంటే కుట్మలం (నరకం) లభిస్తుంది. ఐనా సరే నిన్ను పొందకుండా వదలను. నీవు అటు తిరిగితే అప్సరసవు. ఇటు తిరిగితే రతీదేవివి. నా మదన తాపాన్ని తీర్చమని నిన్ను వేడుకొంటున్నాను. ఓ కుట్మలదంతీ (మొగ్గలవంటి పలువరుస గలదానా) నీతో సుఖపడాలని నామనసులో కోరికలు మొలకలెత్తుతున్నాయి. అని విన్నవించుకొనే సందర్భం.

   కుట్మల మబ్బు నన్న, నిను గూడక మానను, కీచకుండ, నీ
   వట్మరలంగ నప్సరసవై కనిపింతువు, సుందరాంగి ! నీ
   విట్మరలంగ నా రతివి, యిప్పుడె తాపము దీర్చ వేడెదన్,
   *కుట్మలదంతి ! నీ పయిన కోరిక లీరిక లెత్తె నా మదిన్.*

   కోట రాజశేఖర్ నెల్లూరు.

   తొలగించండి

  4. కోట వారి సమస్యా పూరణలను చక్కగా చదివి యూ ట్యూబ్ ద్వారా ఇస్తున్నారండి ; వాయ్స్ కోట రాజశేఖర్ గారిదేనా ?


   http://naidu9962.blogspot.com/2017/12/2.html

   తొలగించండి
  5. మైలవరపు వారి స్పందన

   ట్మా ప్రాసను అవలీలగా అధిగమించి అద్భుతపూరణలనందించిన సాహితీ మిత్రులు సర్వశ్రీ ప్రభాకరశాస్త్రి.. శేషఫణి శర్మ.. విఠల్... శ్రీ హర్ష.. అంజయ్య.. విరించి(2పద్యాలు)... జనార్దనరావు.. గారలకు అభినందనలు.. నమోనమః 🙏🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  6. జిలేబీ గారూ! ఇది చూడండి:

   https://youtu.be/0GiRZcsg4oQ

   తొలగించండి
  7. మైలవరపు వారి స్పందన


   వైవిధ్యం గా ల కార ప్రాస తో మురిపించిన శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ.. ASN రెడ్డి.. మైనంపాటి వరప్రసాద్.. మేడిచర్ల హరి.. విరించి గారలకు 🙏🙏👏👏

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి

  8. అద్భుతః !

   కలమూ గళమూ కోటగ
   వెలసిరి యూట్యూబులోన వెలుగై వారే
   లలితమగు పద్యముల రే
   డు లబ్జుగన్ రాజశేఖరులు గనుమమ్మా !


   చీర్స్
   జిలేబి

   తొలగించండి
 10. పట్మని విరిసెడు నవ్వుల
  ఛట్మనుచు వెలుగు జనించె ఝల్లన మనసే
  తట్మట జూపులజిక్కితి
  కుట్మల దంతీ కలిగెను గోరిక నీపై

  రిప్లయితొలగించండి
 11. పట్మని విరిసెడు నవ్వుల
  ఛట్మనుచు వెలుగు జనించె ఝల్లన మనసే
  తట్మట జూపులజిక్కితి
  కుట్మల దంతీ కలిగెను గోరిక నీపై

  రిప్లయితొలగించండి
 12. మిలమిల మెరసెడి తనువును
  కులుకుల నడకలుఁ గలిగిన కుట్మలదంతీ
  కలిగెను గోరిక నీపై
  విలవిలమనె నా హృదయము విరహముతోడన్

  రిప్లయితొలగించండి
 13. గేట్మను ను నెట్టి బరుగున
  బాట్మన్ దరిచేరి ముద్దు పడతుక బెట్టన్
  బాట్మన్ ముదముగ పలికెను
  కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై"
  క్రికెట్ లో ౩౦౦ పరుగులు చేసిన బాట్ మెన్ ను గాంచి స్టేడియము లోకి జొచ్చుకొచ్చి 16 వత్సరముల పడతి ముద్దు బెట్టెనని భావన


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అయ్యా! మీరు నుడివిన ముద్దు "అబ్బాస్ ఆలి బేగ్" కి దొరికినది (1960 లో బాంబేలో):


   "During a break in India's second innings, when Baig walked to the pavilion along with Ramnath Kenny, he was kissed on his cheek by a young woman spectator,[7] becoming the first Indian cricketer to be kissed on the field.[14] Vijay Merchant who was commentating then remarked "I wonder where all these enterprising young ladies were when I was scoring my hundreds and two hundreds."[15] A painting called "The Kissing of Abbas Ali Baig", depicting the incident was featured in Salman Rushdie’s novel The Moor's Last Sigh (1995)"

   https://en.m.wikipedia.org/wiki/Abbas_Ali_Baig

   తొలగించండి
  2. గురుతుల్యులు శాస్త్రి గారికి నమస్కారములు ఆవును. నేను నా చిన్నప్పుడు విన్నాను. అది గురుతుకు తెచ్చుకొని ఈ పద్యము వ్రాశాను.

   తొలగించండి
 14. కలలను నేకనుచుంటిని
  కులమును గూర్చియు తలంచ కుట్మలదంతీ
  కలిగెను గోరిక నీపై
  నిలలో నాసతిగ రమ్ము యింపగు మనకున్

  రిప్లయితొలగించండి
 15. మైలవరపు వారి వృత్త పూరణ

  ఎట్మురిపించితీవు హృదయేశ్వరి ! వేసితివీవు *క్రీము బి*...
  *స్కెట్మరి* చిక్కిపోయినది చిత్తము చీమ వలెన్ మనోహరీ !
  *నెట్మరి* రాకపోయె నిను నే తిలకింపగ స్కైపునందునన్ !
  కుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరికలెత్తె నా మదిన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 16. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  భార్యకు ఇంగ్లీషు నేర్పే క్రమంలో :

  01)

  _____________________

  ఫుట్మేట్ పై నుండి కదలి (foot mat)
  కాట్మీదకు వచ్చి నన్ను - కరుణించుటకై (cot)
  పుట్మీ నీ కౌగిలిలో (put me)
  కుట్మలదంతీ కలిగెను - గోరిక నీపై !
  _____________________

  రిప్లయితొలగించండి
 17. కోట రాజశేఖర్ గారి బాటలో
  కీచకుడు సైరంధ్రితో (యే కాముకుడైనా కావచ్చు)

  కుట్మలము గల్గెనేనీ
  కుట్మలసజ్జిత యరాళకుంతల నేని
  న్నెట్మది దొలగించగలను?
  కుట్మలదంతీ కలిగెను కోరికనీపై!
  కుట్మలము = ఒక విధమైన నరకము

  రిప్లయితొలగించండి
 18. కుట్మల దంతినా కనుము కుట్మల మెట్టిదొ యంచు చెంపపై
  ఫట్మని యొక్క టిచ్చినది భళ్ళున రాలగ పండ్లు ఖిన్నుడై
  ఛట్మని చెంప రాసుకొని జారెను వాడిక కూయ డెన్నడున్
  కుట్మలదంతి!నీ పయిన కోరిక లీరికలెత్తె నామదిన్.

  రిప్లయితొలగించండి
 19. కుట్మల దంతీ! వినుమిది
  యట్మోస్టుగ నిన్ను నేనె యారాధింతున్
  లిట్మసు టెస్టుకు వెరవను
  "కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై"

  రిప్లయితొలగించండి
 20. కుట్మలమంటే నరకం అని కూడా అర్ధం ఉంది.

  రిప్లయితొలగించండి
 21. చిట్మిళ్ళ పాయసమ్మును
  ఖాట్మాండున యిచ్చినట్టి కలికివి గాదే
  జట్మలునకు పుత్రికవగు
  కుట్మల దంతు కలిగెను గోరిక నీపై.

  రిప్లయితొలగించండి
 22. ఛ ట్ మని చూచిన తోడ నె
  ఫట్ మని మనము న ముద మును వలపు ను పొం గెన్
  త ట్ మని పొందాల ను కొను
  కు ట్ మల దంతీ కలి గెను కోరిక నీపై

  రిప్లయితొలగించండి
 23. ఖాట్మండు నుండి నీవే
  చాట్మని ఫేస్బుక్కులోన చాటింగిడుచున్
  జూట్మిల్ వద్దకు రమ్మన
  కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై.

  రిప్లయితొలగించండి
 24. జట్మలు బిడ్డవై యిలను జన్మము నందిన సుందరాంగి వే
  చిట్మిల పాయసమ్ము బహు చిక్కటి పాలన యిచ్చినట్టి యో
  కుట్మల దంతి నీపయిన గోరిక లీరికలెత్తె నా మదిన్
  కుట్మల రాజితమ్మిటకు కోమలి రమ్మిక ప్రేమమీరగన్

  రిప్లయితొలగించండి
 25. అట్మరలిన నీవేగా
  యిట్మరలిన నీవె గాదె!యిటు జూడుము నే
  నెట్మరలుదు నేమందును?
  కుట్మల దంతీ!కలిగెను కోరిక నీపై!

  రిప్లయితొలగించండి
 26. ఫట్మని నీ తొలిచూపుకు
  మట్మాయమ్మాయె చింత మన్మథు రాణీ!
  యెట్మరువను నీ రూపము
  కుట్మలదంతీ! కలిగెను గోరిక నీపై

  రిప్లయితొలగించండి
 27. ఫట్మని పళ్ళు నూరకుము పాడవుసుమ్మటు దంతరాజముల్
  యిట్మనియార్డరొచ్చినను యిచ్చెద నీకిటు బూర్తి సొమ్ముబిల్
  కట్మని నాన్నపంపె గజగామిని దానిని నీకు యిచ్చెదన్
  కుట్మల దంతి నీపయిన గోరిక లీరికలెత్తె నా మదిన్

  రిప్లయితొలగించండి
 28. చెట్మని చెప్పిన నన్నిటు
  ఫట్మని గొట్టెదవొ యేమొ పళ్ళవి రాలన్
  కట్మనగ ధనము లేదిక
  కుట్మలదంతీ! కలిగెను గోరిక నీపై

  రిప్లయితొలగించండి
 29. కుట్మలనాథుడైన నను గూడిన వారిని తాకలేడు వౌ
  షట్మని వేద వాక్కులను సాధన జేయుచు చక్రి గూర్చి శ్రౌ
  షట్మను యాగ కర్తలను జంపుచు నుండితి రాముడెంత యో
  కుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఫణి కుమార్ గారు చాలా బాగుంది.
   వౌషట్టని, శ్రౌషట్టను సాధువులు. “అను” తప్ప “మ” తో వచ్చే పదములు వాడండి. అప్పుడు సరిపోతుంది.
   సంధి. 52.
   అనుకరణంబునం దుదిహల్లునకు ద్విర్వచనం బగు.
   కింతత్‌ + అనియె = కింతత్తనియె
   కస్త్వమ్‌ + అనియె = కస్త్వమ్మనియె

   తొలగించండి
  2. కుట్మలనాథుడైన నను గూడిన వారిని తాకలేడు వౌ
   షట్మొదలైన మంత్రముల సాధన జేయుచు చక్రి గూర్చి శ్రౌ
   షట్మహినచ్చువారి గని జంపుచు నుండితి రాముడెంత యో
   కుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్

   పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. సవరణ పరిశీలింప మనవి.

   తొలగించండి
  3. “మహినచ్చు వారు” అర్థము కాలేదు. మహిని నిష్టపడు వారనియా ?
   శ్రౌషట్ + మహి =శ్రౌషణ్మహి యగును. సంస్కృత సంధి చెయ్యాలి.

   తొలగించండి
  4. షట్మదినిచ్చువారి గని జంపుచు నుండితి రాముడెంత యో

   పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. ఇది కూడా తప్పైనచో అన్యధా శరణం నాస్తి. త్వమేవ శరణం మమ. మీరే సరి చేయాలి.

   తొలగించండి
  5. నేననుకున్నదే మీరు ప్రయోగించినారు. చాలా బాగుంది. శ్రౌషట్మది నెంచు వారి నంటే యింకా బాగుంటుంది.

   తొలగించండి
  6. కుట్మలనాథుడైన నను గూడిన వారిని తాకలేడు వౌ
   షట్మొదలైన మంత్రముల సాధన జేయుచు చక్రి గూర్చి శ్రౌ
   షట్మదినెంచువారి గని జంపుచు నుండితి రాముడెంత యో
   కుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్

   కామేశ్వరరావు గారూ ధన్యవాదములు.

   తొలగించండి
 30. బ్యాట్మింటన్ కోర్టు దరిని
  మాట్మాటికి గంతులేయు మగువను గనుచున్
  ఖాట్మండున పండితుడనె
  కుట్మలదంతీ కలిగెను గోరిక నీపై

  నిన్నటి సమస్యకు నా పూరణ

  అవిరళ తపమున వరమిడి
  యవనికి దిగినట్టి గంగ నా శివుడుంచ
  న్నవగతమవ , నా పార్వతి
  సవతిని గని సీత మిగుల సంతసమందెన్

  రిప్లయితొలగించండి
 31. కుట్మల్మామకు భయపడ!
  కుట్మలమగు బాధకోర్తు కునలయనేత్రీ!
  మట్మాయమయ్యె నితరులు
  కుట్మలదంతీ కలిగెనుఁగోరిక నీపై.
  కుట్మల్మామ=police.
  కుట్మలమగు బాధ=నరక యాతన

  రిప్లయితొలగించండి
 32. కుట్మల మనంగ మొగ్గయుఁ
  గుట్మల మనఁగ నరకమ్ము కూడ సువదనా
  కుట్మలము సేరుటకు ననఁ
  గుట్మలదంతీ కలిగెను గోరిక నీపై


  ఫట్మరపించి తీవు నను భామరొ సంధ్య యొకింత లేదు వౌ
  షట్మునిగెం దటాకమున శ్రద్ధ నశించెను బూజలందునం
  గుట్మల మేఁగ నిశ్చయము ఘోరపు దుస్సహ పాప చింతలం
  గుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరిక లెత్తె నామదిన్

  [ఫట్ వౌషట్ మంత్రములు విస్మరించబడినవి.]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూజ్యులు కామేశ్వరరావు గారికి వందనములు. మీ పూరణ ఎప్పటి వలెనే అత్యద్భుతంగా నున్నది.

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ మీరు సరస్వతీ ఉపాసకులే.

   తొలగించండి
  3. ఫణి కుమార్ గారు, మిస్సన్న గారు మీ యభిమానమునకు నా కన్నులు చెమర్చుచున్నవి. మీ యుభయులకు నమస్సులు.ధన్యవాదములును.
   రామాయణ, భాగవత, భారత పఠనోపార్జిత మహిమయని నా నమ్మకము.

   తొలగించండి
  4. మీ నాలుకపై సరస్వతీ దేవి నాట్యమాడుతున్నదండీ. పాండిత్యం ఆవిడ కరుణతోనే సాధ్యం.

   తొలగించండి
  5. అవును కామేశ్వర రావు గారూ. లోగడ కూడా మీరదే చెప్పారు. సాక్షాద్వేద ప్రతిబింబాలైన రామాయణాదులను పఠించాలనే జిజ్ఞాస కలగడానికి కూడా పూర్వజన్మసుకృతం ఉండాలి. నమస్సులు.

   తొలగించండి
  6. పూజ్యులు కామేశ్వరరావు గారికి ప్రణామాలు! ధార్మికజీవనము గడుపువారికి ధన్యత తప్పక కలుగుననుటలో సందేహమేమున్నది?
   వారి చిత్తమందు గౌరి,రసనయందు వాణి,గృహము నందు లక్ష్మి తప్పక వసించును! ఆ ముగురమ్మల అనుగ్రహము మీపై యున్నదని భావిస్తూ వందన శతములు!

   తొలగించండి
  7. డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు. మీ నోటి చలువన నా త్ర్యంబానుగ్రహమున్న ధన్యుఁడనే.

   తొలగించండి
 33. కుట్మలదంతి ! నీ పయిన కోరిక లేరిక లయ్యె ‌నా మదిన్

  కుట్మల మౌ గదా బ్రతుకు కూరిమి (న్) నాదరి లేకయున్నచో

  చిట్మట లాడ నేల ? వెస జేర్చుము వెచ్చని నీ నిష౦గధిన్

  కుట్మల మైన నీ వలపు కోరిక c బుష్పిత మే నొనర్చెదన్

  కుట్మలము = మొగ్గ , నరకము | నిష౦గధి = కౌగిలి | చిట్మటలాడు = చిటపటలాడు |

  కుట్మలమైన = మొగ్గ దొడిగిన.

  రిప్లయితొలగించండి
 34. కుట్మలదంతి ! నీ పయిన కోరిక లేరిక లయ్యె ‌నా మదిన్

  కుట్మల మౌ గదా బ్రతుకు కూరిమి (న్) నాదరి లేకయున్నచో

  చిట్మట లాడ నేల ? వెస జేర్చుము వెచ్చని నీ నిష౦గధిన్

  కుట్మల మైన నీ వలపు కోరిక c బుష్పిత మే నొనర్చెదన్

  కుట్మలము = మొగ్గ , నరకము | నిష౦గధి = కౌగిలి | చిట్మటలాడు = చిటపటలాడు |

  కుట్మలమైన = మొగ్గ దొడిగిన.

  రిప్లయితొలగించండి
 35. రె౦డవ పాదము సవరణ

  కుట్మల మౌ గదా బ్రతుకు కూరిమి(న్) నా దరి నీవు లేనిచో

  రిప్లయితొలగించండి
 36. ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారి ఈనాటి సమస్యాపూరణం కార్యక్రమంలో మన సమూహానికి చెందిన క్రింది మిత్రుల (మిత్రురాండ్ర) పూరణలు, పేర్లు చదువబడ్డాయి.
  ౧. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
  ౨. వి.యస్.ఎన్. మూర్తి గారు
  ౩. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు
  ౪. కొనకళ్ళ ఫణీంద్ర రావు
  ౫. చంద్రమౌళి రామారావు
  ౬. గండూరి లక్ష్మినారాయణ గారు
  ౭. గుఱ్ఱం జనార్దన రావు గారు
  ౮. కంది శంకరయ్య గారు
  *మాచవోలు శ్రీధర రావు గారు
  *గుఱ్ఱం సీతాదేవి గారు
  *డా. బల్లూరి ఉమాదేవి గారు
  *చంద్రమౌళి సూర్యనారాయణ గారు
  *శ్రీహర్ష గారు
  *సి. రామమోహన్ గారు
  *బొగ్గరం ఉమాకాంత ప్రసాద్ గారు
  *నేదునూరి రాజేశ్వరి గారు
  *బండకాడి అంజయ్య గారు
  *కె. ఈశ్వరప్ప గారు
  సమయాభావం వల్ల * చిహ్నం ఉన్నవారి పూరణలు కాకుండా కేవలం వారి పేర్లను మాత్రం చదివారు.
  *********************************************
  వచ్చేవారం కోసం సమస్య....
  "ఘనమై వెల్గు తెలుంగు తేజము తెలంగాణమ్మునం దంతటన్"
  *********************************************

  రిప్లయితొలగించండి
 37. పట్మని కాంచితిన్ విజయవాడపురమ్మున నిన్నుపెండ్లిలో
  పట్మటలోన శీఘ్రముగ పట్టితి నడ్రసు పద్మలోచనా
  రాట్మహలందు నావిడిది రమ్మటకున్ వెస పెండ్లియాడెదన్
  కుట్మలదంతి! నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్

  రిప్లయితొలగించండి
 38. నిన్నటి పూరణలు
  అవనిజ వివాహ వేళల

  శివునర్ధాంగిని కొలుచుచు శివమును కోరెన్

  శివసతి చెంతనె గల సతి

  సవతిని గని సీత మిగుల సంతస మందెన్.


  భవనము వీడిన మైథిలి

  జవమున పతితోడ తాను సాగెను వనికిన్

  నవగృహమున తమి తోడ ర

  సవతిని గని సీత మిగుల సంతస మందెన్.

  ప్రత్యుత్తరంతొలగించు

  రిప్లయితొలగించండి


 39. కలలో సైతము హొయలును

  కులుకును జూడగ మురియుచు కుట్మలదంతీ

  కలిగెను కోరిక నీపై

  వలపులఝరిలో నముంచ త్వరగా రావే.


  కలికీ రమ్మిటు నెదపై

  కొలువుండగ సతతమిటుల కుట్మలదంతీ

  కలిగెను కోరిక నీపై

  వలదొర వేసెడి శరముల బాపగ వడిగా!  రిప్లయితొలగించండి
 40. ఫట్మని చెంపమీద పలుభంగుల కొట్టితెవీవె కాని నా
  తట్మరి చూడనోపగలదానివె యోహృదయేశ్వరీ మనం
  బెట్మురుపింతువో వదలనెంతయుగాని నిశీధివాకిటన్
  కుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్

  రిప్లయితొలగించండి
 41. ను, లు, రు ల యుత్వమునకే లోపము. టు లోని యుత్వమునకు లోపము రాదు.
  ప్రకీర్ణ.16.
  పదాంతంబు లయి యసంయుక్తంబు లయిన ను లు రు ల యుత్వంబునకు
  లోపంబు బహుళంబుగ నగు.
  ఇందు నురుల కుత్వలోపంబు ప్రాయికంబుగ హల్పరకంబులకుఁ జూపట్టెడు.
  మ్రాన్పడె - మినువడె - మిన్వడె - వత్తురు వారు - వత్తుర్వారు - కారుకొనియె - కార్కొనియె - రాములు - రాముల్‌ - వనములు - వనముల్‌.

  రిప్లయితొలగించండి
 42. కల హంస వోలె నీవటు
  కులుకుచు నాట్యమ్ము సేయ,కుట్మల దంతీ!
  కలిగెను గోరిక నీపై
  వలరాజును,జాబిలియును వ్యధలను బెట్టన్

  రిప్లయితొలగించండి
 43. అట్మరలన్ కపోలమను యద్దము జూపెను నన్ను నాకు నీ
  విట్మరలన్ మనోహరఁపు టీక్షనమందున నీదు వాడనై
  ఫట్మని జిక్కితిన్ వలపు వాటున కోలుకొనంగ నైతి నే
  కుట్మలదంతి! నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్!!

  రిప్లయితొలగించండి
 44. ఇవాళ చాలా సంతోషముగా ఉన్నది. గురువు గారు మన మీద కఠిన మైన ప్రాస గల సమస్య బంతిని విసిరారు. ప్రతి కవి తన యొక్క బ్యాటుతో బౌండరీలు చేసారు. నేను చిస్నంతవరకు ఇవాళ వాఖ్యలు ఎక్కువ వాచ్చినాయి అనుకుంటున్నాను. 92 వాఖ్యలు ఇంకా గురువు గారు వారి వాఖ్యలు పెట్టలేదు. పెడితే 184 అయ్యేవి. గురువు గారు చూస్తే ఇంకా ఆనందించే వారు . అబ్బ ఎంత ఆనందము ఇంతవరకు నేను ఆఖరి పాదము మాత్రమే పురిమ్చాలి అని అనుకునే వాడిని. ఆ వాక్యమును మధ్యలో కలిపి ఇంకొక పద్యము కింద కుడా మార్చవచ్చు అని ఈ రోజు తెలిసింది. శ్రీ మైలవరపు గారి స్ప్పుర్తి తో నేను ప్రయతిస్తాను. వారికి ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 45. -------------------దశావతారాలు----- తిరుపతి వేంకటకవులు !--------------------

  ఒకసారి తిరుపతి వేంకటకవులు వినుకొండలో అష్టావధానం చేస్తుండగా వర్ణన అనే ఒక అంశంలో భాగంగా ఒకాయన అడిగాడు, 'అయ్యా, దశావతారాలను గురించి వర్ణించండి'.
  పది అవతారాలు. అలాగే దానికేం? వీళ్ళు ఏ ఉత్పలమాలో, చంపకమాలో లేకపోతే సీసపద్యంలో చెప్పుకోవచ్చు కదా అని మొదలు పెట్టాలనుకున్నారు. ఎందుకు? విస్తీర్ణం కలిగిన వృత్తాలు కదా!
  'అయ్యా! అయితే ఒక చిన్న విన్నపం. కంద పద్యంలో చెప్పాలి' అన్నారు.
  దశావతారాలు ఒకొటొకటి చెప్పుకుంటూ లెక్కపెట్టుకుంటేనే కందానికి ఎన్ని అక్షరాలు కావాలో ఆ అక్షరాలను దాటిపోతుంది.
  సరే! వెంకటశాస్త్రి గారు 'జలచర ఢులి కిరి నరహరి' మొదలుపెట్టారు. ఒక పాదం అయిపోయింది నాలుగవతారాలతో. పృచ్ఛకుడు ఆపాడు. 'ఏమండోయ్ నా కోరిక ఇంకా మీరు పూర్తిగా వినలే'దన్నాడు. 'అయ్యా! దశావతారాలు కందపద్యంలో చెప్తున్నాము కదా, జలచర ఢులి కిరి నరహరి.. అర్థం చెప్తాము' అంటే, 'అయ్యా! ఆగండి. ఆ పద్యంలో మా అధ్యక్షుడు పరబ్రహ్మ శాస్త్రిగారి పేరు కూడా ఉండాలండి' చెప్పాడు పృచ్ఛకుడు. మళ్ళీ ఇదేం మెలిక అనుకుంటూ ‘ఏం పర్వాలేదులే చెప్పుకుందాం’అనుకున్నారు.
  జలచర ఢులి కిరి నరహరి
  కలిత వటు త్రివిధ రామ..
  మూడు రామావతారాల గురించి 'త్రివిధ రామ' అని వచ్చింది. అరే వీళ్ళు దాటేసుకుంటున్నారే అనిపించింది పృచ్ఛకుడికి. జలచరం - మీనావతారం, ఢులి - కూర్మావతారం, కిరి - వరాహావతారం. నరహరి - నృసింహావతారం, నాలుగు అవతారాలను మొదటి పాదంలో పెట్టేశారు. మూడు గణాలలో. రెండవ పాదంలోకి వచ్చేటప్పటికి కలిత వటు, ఆయన ఎవరు? వామనావతారం. త్రివిధ రామః - రామో రామశ్చ రామశ్చ - పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు. మూడు రామావతారాలను 'త్రివిధరామ' లో ఇరికించారు. 'అయ్యా! మాట' అన్నాడు పృచ్ఛకుడు, మళ్ళీ చెయ్యెత్తి. 'దాన్లో మీ ఇద్దరి పేర్లు కూడా ఉండాలి'. సరే దానికేముందని,
  క. జలచర ఢులి కిరి నరహరి
  కలిత వటు త్రివిధ రామ కల్కులు బుద్ధుం
  డిల తిరుపతి వేంకటశా
  స్త్రులను పరబ్రహ్మశాస్త్రిఁ జూతురు పేర్మిన్.

  అదీ వారి పాండిత్యం
  ------------------------శుభరాత్రి------------------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. బాగుందండీ !

   శ్రీకృష్ణ పరమాత్ముల వారిని వదిలేసారు లా వుంది. లేకుంటే వారు కూడా వున్నారా ఈ పద్యంలో ?


   జిలేబి

   తొలగించండి
  2. బాగుంది. భాగవతం ప్రకారము శ్రీకృష్ణుడు దశావతాంర్గతుడు కాడు. బలరాముడు ఆ స్థానములో ఉంటాడు. 'కృష్ణస్తు భగవాన్ స్వయం' ఆ పది అవతారములు కృష్ణుడు మాత్రము స్వయంగా భగవంతుడే ఆని. అందుకే వారు అట్లన్నారు.

   తొలగించండి
 46. కుట్మల దంతీ!నిజమిది
  కుట్మలమే నీవులేని కుంభిని జూడన్
  కట్మల మామల సాక్షిగ
  కుట్మల దంతీ కలిగెను కోరిక నీపై.
  ***)()(***
  కట్మలమామలు = పోలీసోళ్ళు
  ("ఆంధ్రభారతి"-తెలుగు నిఘంటువు)

  రిప్లయితొలగించండి
 47. కవిమిత్రులకు నమస్సులు.
  మొన్న సిద్దిపేటలో అష్టకాల వారి అష్టావధానానికి, నిన్న కూకట్‍పల్లిలో తాతా సందీప్ శర్మ గారి అష్టావధానానికి వెళ్ళడం వల్ల రెండు రోజులు పూరణలను పరిశీలించలేకపోయాను. వీలైతే ఈ సాయంత్రం వరకు ఈ రెండు రోజుల పూరణలను సమీక్షిస్తాను. ఆలస్యానికి మన్నించండి.

  రిప్లయితొలగించండి
 48. జలజోద్భవరాజ్ఞీ ! కవి
  కులజననీ ! కలువకంటి ! *కుట్మలదంతీ !
  కలిగెను గోరిక నీపై* !
  పలుకుల పూజలనుఁ జేతు పదములనిడవే !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విశ్వనాథ శర్మ గారూ,
   'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
   సమస్యాపాదాన్ని స్థానాంతరంలో ప్రయోగించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 49. ఛట్మని నిన్నుజూడగనె చచ్చెను నామది నీరసమ్ముతో
  ఫట్మన నాడు లీతలను ఫంకెను నాదగు గుండెకాయనున్
  ఝట్మని కళ్ళు మూయగనె జంకును గింకును కోలుపోవగా
  కుట్మలదంతి నీ పయినఁ గోరిక లీరికలెత్తె నామదిన్!

  రిప్లయితొలగించండి