10, డిసెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2542 (అమ్మా యని పిలువని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"అమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

94 కామెంట్‌లు:

 1. మిత్రులందఱకు నమస్సులు!

  [నిస్స్వార్థంతోఁ దల్లినిఁ బిలిచెడివాఁడే పూజ్యుఁడు! స్వార్థంతోఁ బిలిచెడివాఁడు పూజ్యుఁ డెట్లగును?]

  "అమ్మా భారతి! వరముల
  నిమ్మా! నా కవితఁ బదుగు రెన్నియు, నన్నున్
  సమ్మానింపఁగఁ జేయవె
  యమ్మా!" యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్!!

  రిప్లయితొలగించండి

 2. నేటి జమానా

  కిమ్మన కుండు జిలేబీ !
  నిమ్మది లేదనిన చెప్పు నిన్నా వృద్ధా
  శ్రమ్మందుచేర్చె దన్ రా
  రమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిమ్మది'...? అది 'నెమ్మది' అనుకుంటాను.

   తొలగించండి
 3. మమ్మీ డాడీ సంస్కృతి
  సొమ్మూ సోకుల విలువలు సోపానములై
  వమ్మవగ మాతృభాషణ
  యమ్మాయని పిలువని సుతుడతి పూజ్యుడగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "వమ్మవగ మాతృభాషణ
   మమ్మాయని పిలువ" గా చదువ ప్రార్ధన!

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సొమ్మూ' అనడం వ్యావహారికం. "సొమ్ముల సోకుల..." అనండి.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా!మమ్మీ డాడీకి ప్రాసగా అలా దొర్లింది! సవరిస్తాను.

   తొలగించండి
 4. ఇమ్మహి నీచుండెవడన
  నమ్మా యని పిలువని సుతు, దతి పూజ్యుడగున్
  దమ్ముము తప్పక పడతుల
  నమ్మగ భావించువాడె యవనినగాదే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   దమ్ముము - దమ్మము... టైపాటు. '...యవనిని గాదే' అనండి.

   తొలగించండి
 5. సొమ్ములు గంపెడు నిధులను
  కొమ్మన కోతిని కొరివిని, కోడలి గుమ్మన్
  తెమ్మను కలియుగ పూతన
  నమ్మా! యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "పెళ్ళామే బెల్లమూ, తల్లీ తండ్రీ అల్లమూ"

   తొలగించండి


  2. పెళ్ళామే బెల్లమ్మోయ్
   తల్లీ తండ్రీ జిలేబి యల్లమ్మోయీ
   కొల్లాయివారి కిమ్మా
   జల్లను కమ్మంచుచీర చాందిని కిమ్మా :)

   జిలేబి

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  4. 🙏🙏🙏

   **************************************

   జిలేబి గారూ:

   "ఆకులు రాలెడి కాలపు
   నాకేమిటి కావలెనిక! నాంచక చెపురా!
   కాకియొ? కోకిల? కావలె
   నీకీ కొంపన నికపయి? నిర్వీర్యుండా!"

   తొలగించండి
 6. సమ్మతి గాంతలు బిడ్డల
  "మమ్మీ యనియే పిలువుదు; మరచిన దెబ్బల్
  సుమ్మీ!" యని బోధింపగ
  "నమ్మా!"యని పిలువని సుతు డతిపూజ్యు డగున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పిలువుదు - పిలువుడు'... టైపాటు అనుకుంటాను.

   తొలగించండి
 7. ఫ్రహ్లాద చరిత్ర:-

  కిమ్మనడు గిరుల ద్రోసిన
  చిమ్మదు కన్నీరు గదలచే మొత్తిన స
  ర్పమ్ములతో కఱిపించిన
  నమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్||

  రిప్లయితొలగించండి
 8. ఇమ్మహి జన్మింపగ నే
  నమ్మా నాన్నలు భరింప నంతట వార్థ
  క్యమ్మున వారలు భారం
  బమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁడగున్

  రిప్లయితొలగించండి
 9. కమ్మని పాలను త్రాగిన
  నెమ్మిని నీయొడిని మరచి నీమము లేకన్
  పొమ్మిక యాశ్రమ మునకని
  యమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్

  రిప్లయితొలగించండి
 10. అమ్మాయితోడ కట్నపు
  సొమ్ములు దండిగ గొనకొని, సురతియెలేకన్
  యిమ్ముము యింకను సొమ్మున
  త్తమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అయ్యా! నమస్సులు!

   నిన్నటి మీ పూరణపై వ్యాఖ్యను చూడండి వీలుంటే...

   తొలగించండి
  2. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లేక' అన్నది కళ. ద్రుతాంతం కాదు. మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  3. గురుతుల్యులు శాస్త్రి గారు నమస్కారములు నా చిన్న తనంలో ఆ ముద్దు గురించి విన్నాను. అది గురుతుకు వచ్చి ఈ పద్యము వ్రాశాను.

   తొలగించండి
 11. సమ్మోహించుచు భార్యను
  అమ్మను సైతము మరచెడి యవసర మలరన్
  నెమ్మది పరచుచు నమ్మది
  నమ్మాయని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్ ౹౹
  (అమ్మాయని = ఆ + మాయని)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మాయను' అనడం సాధువు. ఒకవేళ 'మాయ+అని' అనుకుంటే సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి
 12. అమ్మా యని తమళ ప్రజలు
  కమ్మగ పిలువ జయలలిత కాటికి బోయెన్
  దిమ్మర శశికళ నిప్పుడు
  అమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్"

  రిప్లయితొలగించండి
 13. మమ్మీ డాడీ పలుకులు
  సమ్మతమై యోప్పు నట్టి సంస్కృతి పెరిగెన్
  కమ్మని తెలు గు ను నేర్వని
  అమ్మా యని పిలువ ని సు తు డ తి పూజ్యం డ గు న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యోప్పు - యొప్పు'...టైపాటు.

   తొలగించండి
 14. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  "పాండురంగ మహాత్మ్యం" లో పుండరీకుడు :
  01)
  _____________________

  కమ్మెను మదమే కనులకు
  నమ్మక దైవంబు నిలను, - నమ్మితి నరులన్
  చిమ్మితి కాసుల నీల్గున
  కుమ్మితి నెదురాడు వారి - గ్రూరత్వమునన్

  వమ్మొనరించితి నాశల
  గుమ్మల వ్యామోహ మందు - కూలితి సాంతమ్
  కమ్మని భార్యను విడచితి
  నమ్మను దొంగగను జేస్తి - నన్యాయముగా !

  అమ్మితి నమ్మా సొమ్ముల (ఆస్తి)
  పొమ్మంటిని యింటి నుండి - పూజ్యుల మిమ్మున్ !
  కమ్మెను పాపము; క్షమియిం
  చమ్మా, యని పిలువని సుతుఁ - డతిపూజ్యుఁ డగున్ !
  _____________________

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వసంత కిశోర్ గారూ,
   ప్రస్తావనా పద్యాలతో కూడిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సాంతమ్' అని హలంతంగా, 'చేస్తి' అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.

   తొలగించండి
 15. సొమ్ములు లాగుచు సోకుల
  ఇమ్ముగ నింగ్లీషు భాష నిచ్చెడు బడిలో
  మమ్మీ యనుటే ముఖ్యము
  అమ్మాయని పిలువనిసుతుడతిపూజ్యుడగున్

  రిప్లయితొలగించండి
 16. మైలవరపు వారి పూరణ

  మమ్మిక బాధింపకు , గే..
  హమ్మిది యిరుకయ్యె ! బేరమాడితి ! పదవే !
  యిమ్ముగ వృద్ధాశ్రమమున..
  కమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 17. ఒక విద్యార్థి ఆవేదన.

  ముమ్మాటికీ పోటీలో
  సుమ్మా నే గెల్తు నన్ను జోకొట్టకుమీ!
  పొమ్మా నిద్రా!మరి రా
  కమ్మా యని పిలువని నుతుడతి పూజ్యడగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   నిద్రను పిలువని సుతుడంటూ మీరు చేసిన పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 18. ఇమ్మహి కనబడు దైవమె
  యమ్మేగా యెంచి చూడ నందరికెపుడున్
  నమ్మరె?సత్యమిది;యెటుల
  యమ్మాయని పిలువని సుతుడతి పూజ్యుడగున్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   సమస్యను ప్రశ్నగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 19. క్రమ్మఁగఁ జీకటి బ్రతుకున
  నెమ్మది గొనుచుఁ దలిదండ్రి నిడి కావడి, భా
  రమ్మైతిరిగా నాన్నా!
  యమ్మా !యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్

  రిప్లయితొలగించండి
 20. ఇమ్ముగ దేశము నే దో
  షమ్మును లేకుండ నేలు క్ష్మాపతి యైన
  న్నమ్మను నెన్నడు దోషం
  బమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్

  రిప్లయితొలగించండి
 21. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

  ఇమ్మహి స్వార్థమ్ము గోరు , చేకోదరుల సుప్రగతి - సు

  ఖమ్ముల గా౦క్షి౦చ నట్టి ఖలుడు తల్లి కడుపు చేటు ||

  అమ్మ ! యో ధనలక్ష్మి ! నాదు ననుజున కిడుము రానీయ

  కమ్మా యని పిలువని సుతు డతి మూర్ఖు డగును నిజ మిది ! !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ ఛందోవైవిధ్యంతో బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 22. గురుమూర్తి ఆచారి
  ,,,,,,,, ,,,,,

  గురువు గారికి పాద నమస్కారములు :-- వాక్యా౦తము మరియు పాదా౦తము ఐన౦దున

  మూడవ పాదాది య౦దు స౦ధి చేయ లేదు . క్షమి౦చ గలరు .

  రిప్లయితొలగించండి
 23. కమ్మని తెలుగున బిలువుము
  అమ్మాయని, పిలువని సుతుడతిపూజ్యుడగున్
  నిమ్మహి యాంగ్లపదమ్ముల
  మమ్మీ యని సంతసముగ మహిలో నెపుడున్!!!

  అమ్మయె భారంబనుకుని
  నెమ్మనమున సుంతకూడ నీతియె లేకన్
  పొమ్మిక వృద్ధాశ్రమమున
  కమ్మా !యని పిలువని సుతుఁడతి పూజ్యుడగున్!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శైలజ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'తెలుగుననె పిలువు। డమ్మాయని... పూజ్యుడగు। న్నిమ్మహి...' అనండి.

   తొలగించండి
 24. కోట రాజశేఖర్ గారి పూరణ

  సందర్భం :: కైకమ్మ శ్రీరాముని అడవికి పంపిన విషయం తెలిసికొన్న భరతుడు , అమ్మను సమీపించి , ఓ రామారీ !(రామునికి శత్రువా !) నీవు నాకు తల్లివే కాదు. నేను నీకు కొడుకునే కాదు. నిన్ను అమ్మా అని పిలిచిన కుమారుడు పాపాత్ముడౌతాడు. నిన్ను అమ్మా అని పిలువని కుమారుడు లోకంలో పూజింపబడతాడు. అని నిష్ఠూరంగా మాట్లాడే సందర్భం.

  అమ్మవె ? రామారీ ? నిను
  అమ్మా ! యని పిలిచిన సుతు డతి పాపియె. కై
  కమ్మా! రాక్షసి ! యిల నిను
  *అమ్మా ! యని పిలువని సుతు డతి పూజ్యుడగున్.*

  కోట రాజశేఖర్ నెల్లూరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. నిను అమ్మా అని విసంధిగా వ్రాయవచ్చా అని సందేహము గురువుగారూ.

   తొలగించండి
  3. 'నిను నమ్మా' అనడం సాధువు. అక్కడ విసంధిగా వ్రాయడాన్ని నేను దోషంగా భావించను. కాని 'నేను + అమ్మా' అన్నపుడు 'నేనమ్మా' అని సంధి నిత్యం. అక్కడ 'నేను అమ్మా' అని వ్రాస్తే నేను దోషంగా గణిస్తాను.

   తొలగించండి
 25. కోట రాజశేఖర్ గారి రెండవ పూరణ

  సందర్భం :: మన కందరికీ తండ్రి శ్రీ హరి అని భావించాలి. ఈ లోకమును మాయ (జగత్ మిథ్యా) అని భావించాలి. ఋషి వలె జీవించాలి. నెమ్మదిగా మాయను తరిమివేయాలి. *అమ్మాయని* అంటే ఆ మాయని మన దగ్గరకు పిలవకుండా ఉండాలి. అటువంటి వాడే యోగిగా గొప్పగా పూజింపబడతాడు. అని గురువు శిష్యునికి తత్వోపదేశం చేసే సందర్భం.

  నమ్ముము తండ్రిగ శ్రీ హరి,
  నిమ్మహిఁ దలపుము మాయగ, ఋషి వలె మనుమా,
  నెమ్మది మాయను తరుముచు,
  *అమ్మాయని పిలువని సుతు డతి పూజ్యుండౌ.*

  కోట రాజశేఖర్ నెల్లూరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మాయను' అనడం సాధువు కదా?

   తొలగించండి
 26. రిప్లయిలు
  1. అసభ్య పద జాల ప్రయోగము సత్కవుల కభినందనీయము కాదు.

   తొలగించండి
  2. సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. కాని మిత్రులు చెప్పినట్లు అశ్లీలద్యోతకమైన పద ప్రయోగం వర్జనీయం.

   తొలగించండి
  3. ధన్యవాదములు..నా పూరణ తొలగిస్తున్నాను..దోషాన్ని సవరించినందుకు మరోమారు ధన్యవాదములు

   తొలగించండి
 27. అమ్మయని పిలిచియును తా
  నమ్మకు కబళమ్ము నిడని యసురునికంటెన్
  నెమ్మది తల్లిని సాకుచు
  నమ్మాయని పిలువని సుతు డతిపూజ్యుడగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నాకు తెలిసిన వ్యక్తి ఒక డుండేవాడు వరంగల్లులో. తల్లిని బాగానే చూసుకొనేవాడు కాని అమ్మా అని ఎన్నడూ పిలిచేవాడు కాదు. అంతెందుకు మా అక్కయ్య స్కూల్లో చదువుకొనే రోజుల్లో మా నాన్న ఎందుకో కొట్టాడట. అప్పటినుండి చాలా సంవత్సరాలు (తాను అమ్మమ్మ అయ్యేదాక) 'నాన్నా' అని పిలువలేదు. చివరి రోజుల్లొ పిలిచిందనుకోండి!

   తొలగించండి
 28. పమ్మఁగ గౌరవ మది చి
  త్తమ్మునఁ దలచంగ నన్య తరుణీ మణులన్
  సమ్మతముగఁ, నిజ కాంతను
  నమ్మా యని పిలువని, సుతుఁ డతి పూజ్యుఁ డగున్

  [సుతుఁడు = రాజు]

  రిప్లయితొలగించండి
 29. అమ్మే యశోదనువిధా
  నమ్మే కంసవధ జరిపె|”నల్లని కృష్ణుం
  డమ్మ దరిలేదుగనుకే
  అమ్మాయని పిలువని సుతుడతి” పూజ్యుడగున్
  2.సమ్మతితో స్వాతంత్ర్యము
  నమ్మకమున గాంధి,శాంతి నలుగక దెచ్చెన్
  అమ్మనుజుండనలేదే|
  అమ్మాయని పిలువని సుతుడతి పూజ్యుడగున్|
  .
  రిప్లయితొలగించండి
 30. ఇమ్మహినిఁ గరతలామల
  కమ్మును జేయుచు విభవముఁ గైకొను మార్గం
  బిమ్మిట నాకై జగముల
  అమ్మా ! యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్ !!

  రిప్లయితొలగించండి
 31. ఇమ్మునుఁ బొందడు భువిలో
  నమ్మా యని పిలువని సుతుఁ, డతిపూజ్యుఁ డగున్
  సమ్మానముపొందునుతా
  నిమ్మహి తలిదండ్రి కెపుదు హితమును చేయన్

  రిప్లయితొలగించండి
 32. నెమ్మది తో జీవిత క
  ష్టమ్ముల నిల నెదరు శక్తి జగదాంబిడఁగన్
  సొమ్ముయు, సోకు సుఖము లీ
  యమ్మా! యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. 'జగదంబ యిడన్... సొమ్మును...' అనండి.
   జగదాంబ... అనడం సాధువు కాదు. జగత్+అంబ= జగదంబ.

   తొలగించండి
  3. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
   నెమ్మది తో జీవిత క
   ష్టమ్ముల నిల నెదరు శక్తి జగదంబ యిడఁగన్
   సొమ్ముయు, సోకు సుఖము లీ
   యమ్మా! యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్

   తొలగించండి
 33. ఇమ్మహిలో దుష్టుడనగా
  నమ్మాయని పిలువని సుతు,డతి పూజ్యుడగు
  న్నమ్మాయనిపర స్త్రీలను
  నిమ్ముగ పిలిచెడి సుజనుడె నిలలో గనుమా!

  అమ్మా నాన్నలె దైవము
  లిమ్మహిలో ననుచు సతము నిష్టము తోడన్
  పొమ్మన కెప్పుడు భారం
  బమ్మా యని పిలువని సుతు డతి పూజ్యుడగున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   వాట్సప్ సమూహంలో నా సూచనను గమనించండి.

   తొలగించండి
 34. అమ్మా యను కైకను తా
  నమ్మా యని బిల్చు మరొక యమ్మ సుమిత్ర
  న్నిమ్ముగ నెప్పుడు నో పి
  న్నమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్.

  రిప్లయితొలగించండి
 35. అ మ్మాయధారి యూరున
  నమ్మాయిలు బూతులాడు టతి సహజమ్మౌ
  అమ్మను పట్టుక రా ! నీ
  యమ్మా ! యని పిలువని సుతు డతి పూజ్యుడగున్

  రిప్లయితొలగించండి
 36. *సమ్మార్జనీప్రహారం*
  *బిమ్మా సత్కవులమంచు నిటవేదికఁబ*
  *ద్యమ్ములసమస్య యిదియట*
  *"యమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్"*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  **************************************
  **************************************

  రిప్లయితొలగించండి