పైన వివరించినట్లు నడచుకొనేటటువంటి భార్య మనసు తెలిసికొని, ఎన్నడూ ఆమెను నొప్పించకుండా, ఆమెకు అన్నివిధాలా సేవ చేసే భర్త, ప్రతిజన్మలోనూ తరిస్తాడు అని చెప్పే సందర్భం.
కార్యేషు యోగీ – పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్షః – కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి. రూపేచ కృష్ణః – రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే) ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. క్షమయా తు రామః – ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి. భోజ్యేషు తృప్తః – భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. సుఖదుఃఖ మిత్రం – సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు – ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.)
ఆర్యా! చక్కని పూరణతోబాటు పురుషులెలా ఉండాలో చెప్పే గొప్పవిషయాన్ని కూడ వివరించారు.అభినందనలు,ధన్యవాదములు! పితృస్వామ్యవ్యవస్థ కదా,యిటువంటివి బయటికి రానీయరు!
నా అసలు పేరు పంతుల సన్యాసిరావు. కానీ,మరో పేరయిన విఠలుడు "విట్టుబాబు"గా మారి బంధుజనాల్లోనూ, స్నేహగణాల్లోనూ పరిచయం. భాగ్యనగర పట్నవాసంలో కొంతమంది సన్నిబాబు అనికూడా పిలుస్తారు. ఓ పదేళ్ళుగా ఉద్యోగ నిమిత్తము చెన్నపట్నంలో నివశిస్తున్నాను.
ఈమధ్యనే కొందరు మిత్రుల ప్రోత్సాహంతో పద్యరచన ప్రారంభించాను. ఇప్పటిదాకా "తెలుగు" మకుటంతో ఓ 50 పైగా పద్యాలను తేటగీతి, అక్కడక్కడ ఆటవెలదులతోను రాశాను. అలాగే ఆటవెలదులలో "సన్నిబాబు మాట సందెపూట" అనే మకుటంతో ఏవో నాకు తోచిన కొన్ని భావాలను ఓ 35 పద్యాలవరకు ప్రదర్శించాను. వాటిని వీలువెంబడి నా బ్లాగు https://jayabhaskaraputhra.blogspot.in/?m=1 లో పెడుతున్నాను. పెద్దలు పూజ్యులు గురుతుల్యులగు మీరందరూ నా బ్లాగును సందర్శించి తమ సలహాలతో నన్ను సన్మార్గంలో ప్రయాణింపజేయగలరని నా ప్రార్థన. 🙏
ధైర్యము జెప్పుచున్ మిగుల తాలిమి పెంచుచు కష్టసాధ్యమౌ కార్యములందు గొప్ప సహకారము జేయుచు జీవితంబులో శౌర్యముతోడ నెల్లపుడు జక్కగ జీవన యాత్ర నడ్పు స ద్భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్"
సందర్భము: ఒక ధార్మికుడైన భర్త అనాథ శరణాలయాన్ని నెలకొల్పి భార్య తరించడంకోసం సేవా కార్యక్రమాన్ని భార్య కప్పగించడం. తానూ తరించడం. ============================== ధైర్యముగా ననాథలకు తాను నివాసము నేర్పరించు.. స త్కార్య ధురంధరుండు పతి- దానికి చక్కని రోజువారిదౌ చర్య రచించి యా పనులు సల్పి తరింపగ నప్పగించు నా భార్యకు సేవఁ జేయ... భువి భర్త తరించును జన్మ జన్మకున్
భార్యను సగముగ దాల్చుచు
రిప్లయితొలగించండినార్యవిభుండు పరమశివు డద్భుతఘనమౌ
చర్యగ జూపెను; గావున
భార్యను సేవించునట్టి భర్త తరించున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికార్యేషు దాసుడగుచును
రిప్లయితొలగించండిసూర్యోదయమవగ లేచి శూరత్వమ్మున్
ధైర్యము తోడను, సాఫ్ట్ వేర్
భార్యను సేవించునట్టి భర్త తరించున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అవగ' అన్నది సాధువు కాదు. "సూర్యోదయమందె లేచి..." అనండి.
సూర్యుని రాక నెరుంగని
రిప్లయితొలగించండిభార్యను సేవించు నట్టి భర్త తరించున్
కార్యా చరణము జేయగ
కార్యేషు భర్తగ తలంచి కాఫీ కలుపన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి👏👏👏👏
తొలగించండి* కార్యమ్ముల భర్త వోలె కాఫీ కలుపన్
సూర్యుని రాక నెరుంగని
తొలగించండిభార్యను సేవించు నట్టి భర్త తరించున్
కార్యా చరణము జేయగ
కార్యమ్ముల భర్త వోలె కాఫీ కలుపన్
అక్కయ్యా,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
GPS vaarU !
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికార్యాలయ భారంబును
రిప్లయితొలగించండిశౌర్యంబున మోసివచ్చు సతికిన్ ప్రియమౌ
చర్యగ అనురాగముతో
"భార్యను సేవించునట్టి భర్త తరించున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆర్యా! అయ్యరు గారూ,
భార్యను సేవించునట్టి భర్త తరించున్,
సూర్యుడట పొద్దు పొడిచెను
కార్యములమొదలెడ కప్పు కాఫీ తెండూ :)
జిలేబి
ఆర్యా! అయ్యరు గారూ,
తొలగించండిభార్యను సేవించునట్టి భర్త తరించున్,
సూర్యుడట ప్రొద్దు గ్రుంకెను
కార్యములను కట్టిపెట్టి కంచము తెండూ :)
జిలేబీ గారి పూరణ, ప్రభాకర శాస్త్రి గారి పేరడీ రెండూ బాగున్నవి. అభినందనలు (ఇద్దరికీ)!
తొలగించండి
రిప్లయితొలగించండిభార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్
సూర్యుడు పొద్దు జేర్చెనయ,చొక్కము ఫిల్టరు కాఫి తేదగున్!
ఆర్య! జిలేబిపల్కువినుడయ్య నిజమ్మిదియేకదయ్య! సౌ
కర్యముగాను కైపదపు కైపుల చూడగ నాకు సాయమై
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిశౌర్యము వైరులందు , సరసమ్మనగా శయనమ్మునందు , గాం..
భీర్యము చర్చలందు, మురిపించుట మాటలఁ గాంతయందునన్
ధైర్యముగా నొనర్చె మన దైవము కృష్ణుడు
సత్యయందిటుల్
భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
సత్యావిధేయుడైన శ్రీకృష్ణునిపై మైలవరపు వారి పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆర్యుడయిన , *సురవాణ్యా* ..
తొలగించండి*చార్యుడయిన* భార్య యెదుట సామాన్యుండే !
కార్యము సాధించుటలో
భార్యను సేవించునట్టి భర్త తరించున్ !!
మైలవరపు మురళీకృష్ణ
*సురవాణ్యాచార్యుడు*😃
వెంకటగిరి
ఒక భార్య మనోగతం.....
రిప్లయితొలగించండికార్యాకార్య విచక్షణుఁ
డార్యజన విధేయుఁడును నయాచారుఁడు చా
తుర్యమ్మున విష్ణుప్రియ
భార్యను సేవించునట్టి భర్త తరించున్.
అద్భుతమైన పూరణమాచార్యా! నమస్సులు! మీ ఆరోగ్యం మెరుగుగాయున్నదని తలంచెదను! త్వరితగతిని కోలుకోవలెనని ఆకాంక్షిం చెదను!
తొలగించండివిష్ణుపియ -విష్ణుప్రియభార్య: మనోహరమైన శబ్దవిన్యాసం .
తొలగించండిధన్యవాదాలు.
తొలగించండిఇంకా పూర్తిగా కోలుకోలేదు. జ్వరం మిగిల్చిన నీరసం, జలుబు, దగ్గు ఇంకా ఉన్నవి.
అవధాని శ్రీ మెట్రామశర్మ గారి పూరణ.....
రిప్లయితొలగించండినిర్యదమంద ప్రేమరస నీరధి యోగ విధాన వారధిన్
ధైర్యము స్థైర్యమున్ మరియు ధన్యత గూర్చెడు శాంభవిన్ మహీ
ధుర్యుఁడు రాజు కొల్వ సిరితోఁ దులదూగును గాన శంభు శో
భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్.
కః కార్యాలయమునసేవల
రిప్లయితొలగించండిధైర్యముతోడుతను చేయు దారను గనుచున్
సూర్యోదయకాఫీనిడి
భార్యను సేవించునట్టి భర్త తరించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి. శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య :: 2558
*భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్.*
సందర్భము :: ధర్మపత్ని గురించి నీతిశాస్త్రంలో ఇలా చెప్పియున్నారు.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపే చ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ।
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మయుక్తా కులధర్మపత్నీ।।
పైన వివరించినట్లు నడచుకొనేటటువంటి భార్య మనసు తెలిసికొని, ఎన్నడూ ఆమెను నొప్పించకుండా, ఆమెకు అన్నివిధాలా సేవ చేసే భర్త, ప్రతిజన్మలోనూ తరిస్తాడు అని చెప్పే సందర్భం.
కార్యము లందు *దాసి*, వర గౌరవ *మంత్రి* యు యోచనన్, మహై
శ్వర్యద *లక్ష్మి* రూపమున, భవ్య *ధరిత్రి* క్షమా గుణాన, తా
నార్యయు *మాత* భోజనము నందున, శయ్యల *రంభ* యైన యా
*భార్యకు సేవఁ జేయ, భువి భర్త తరించును జన్మజన్మకున్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (28.12.2017)
కార్యేషుదాసీ... శ్లోకానికి అనువాద రూపంగా మీరు చేసిన పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికార్యములన్నియున్ సఫల ఖ్యాతిని బొందగ కాపురంబునన్
రిప్లయితొలగించండిధైర్యముజూపి కష్టముల ధాటి భరించుచు నైక్యగీతిమా
ధుర్యపుదేనెలన్ ముదము దోసిలిద్రాగుచు భార్యభర్తకున్,
భార్యకు సేవజేయ భువిభర్త, తరించును జన్మజన్మకున్
కార్యములన్నియున్ సఫల ఖ్యాతిని బొందగ కాపురంబునన్
రిప్లయితొలగించండిధైర్యముజూపి కష్టముల ధాటి భరించుచు నైక్యగీతిమా
ధుర్యపుదేనెలన్ ముదము దోసిలిద్రాగుచు భార్యభర్తకున్,
భార్యకు సేవజేయ భువిభర్త, తరించును జన్మజన్మకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభార్యా భర్తల బంధము
రిప్లయితొలగించండికార్యాచరణ oబునందు గని పించవలె న్
భార్య యు జబ్బు న పడగా
భార్యను సేవించు నట్టి భర్తతరించు న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపర్యనుయోగము బొందడు
భార్యను సేవించునట్టి భర్త, తరించు
న్నీర్యము గూడన్ జీవన
పర్యంతమ్మాతడౌ సఫలతను గనుచున్ !
ಜಿಲೇಬಿ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పర్యనుయోగము, ఈర్యము' అన్న రెండు క్రొత్త పదాలు తెలిసాయి.
భార్యాభర్తలు జీవన
రిప్లయితొలగించండికార్యపు రథమునకమరిన కాండములగుచో
భార్యకొలువంగ భర్తను
భార్యను సేవించునట్టి భర్తతరించున్
కాండము = అశ్వము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికార్యములందు దాసి, కడుఁ గమ్మని భోజన మిచ్చు తల్లి, యా
రిప్లయితొలగించండిహార్యము నందు రంభ నిభ, హర్షముతోడుత పల్కు శబ్ద మా
ధుర్యము, నత్తమామలను తోషముతో గను సుందరాంగియౌ
భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్
తొలగించండిಅದ್ಭುತಃ
ಜಿಲೇಬಿ
జిలేబీ గారన్నట్టు నిజంగా అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. జిలేబి గారికి ధన్యవాదములు.
తొలగించండిఆర్యులు నుడివిన గతి పరి
రిప్లయితొలగించండిచర్యలనే చేసి చేసి సహనము తోడన్
ధైర్యము నిచ్చియు నలసిన
"భార్యను సేవించునట్టి భర్త తరించున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆర్యా! చక్కగ వ్రతమను
రిప్లయితొలగించండికార్యము జేయంగనెంచ కావలె నాలున్
మర్యాదగ ప్రక్కననిడి
భార్యను - సేవించునట్టి భర్త తరించున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికార్యము జక్కబెట్టుచును గంటికి నింటికి దీపమౌనటుల్
రిప్లయితొలగించండియార్యుల బాటనే జనుచు నత్తయు మామయు సంతసింపగన్
స్థైర్యము ధైర్యమున్గలుగ జేసియు నిత్యము,డస్సినట్టి యా
"భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అటుల్+ఆర్యుల' అన్నపుడు యడాగమం రాదు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపర్యవసానమ్మిదియే
తొలగించండికార్యాలయ పదవిబొంద కనక,వచోచా
తుర్యమున మంత్రివర్యుల
భార్యను సేవించునట్టి భర్తతరించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కనక'...?
బంగారముతోనూ వాక్చాతుర్యముతోనూ యని గురుదేవా!
తొలగించండిఅపుడు కనక వచోచాతుర్యముల అని ఉండాలనుకుం టాను! సవరిస్తానండీ!
తొలగించండిభార్యయె షట్కర్మల పరి
రిప్లయితొలగించండిచర్యలనిడ గైకొని తనుషట్కర్మలతో
కార్యాచరణము నెంచుచు
భార్యను సేవించునట్టి భర్త తరించున్
(స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు…పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది..
కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు
(కామందక నీతిశాస్త్రం)
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః
కార్యేషు యోగీ – పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
కరణేషు దక్షః – కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
రూపేచ కృష్ణః – రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే) ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.
క్షమయా తు రామః – ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
భోజ్యేషు తృప్తః – భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
సుఖదుఃఖ మిత్రం – సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు – ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.)
ఆర్యా! చక్కని పూరణతోబాటు పురుషులెలా ఉండాలో చెప్పే గొప్పవిషయాన్ని కూడ వివరించారు.అభినందనలు,ధన్యవాదములు! పితృస్వామ్యవ్యవస్థ కదా,యిటువంటివి బయటికి రానీయరు!
తొలగించండిఅక్కయ్యగారూ ధన్యవాదములు 🙏🙏🙏
తొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిచక్కని పూరణతో పాటు మంచి శ్లోకాన్ని అందించారు. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిశౌర్యులతో కలసి మెలసి
రిప్లయితొలగించండిచౌర్యము జేయగ దొరకిన సరసపు మదిరన్;
స్థైర్యముతో తరలించగ
భార్యను; సేవించునట్టి భర్త తరించున్ 🥂
stag party!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ stag party అంటే ఏమిటో నాకు తెలియదు!
భార్యలకు వీడ్కోలు చెప్పి కేవలం భర్తలు, బ్రహ్మచారులూ కలిసి చేసుకునే మందు పార్టీ.
తొలగించండిstag = (మగ) దుప్పి
doe = (ఆడ) జింక
🙏🙏🙏
ఆర్యా! భ్రూణగ నుండియు
రిప్లయితొలగించండికార్యములను జేయతాను కటకట పడుచున్
పర్యంకమునందుండెడు
భార్యను సేవించు నట్టిభర్త తరించున్!!!
ధైర్యము నీయుచు సతతము
కార్యము లన్నియు సఫలత గావగ ధర నై
శ్వర్యములనిడెడు శ్రీహరి
భార్యను సేవించునట్టి భర్త తరించున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిభార్యలు కొల్వులొనర్చుచు
రిప్లయితొలగించండిశౌర్యముగ సహాయములను సఖులకు జేయన్
భార్యల సేవలు ధర్మమె
భార్యను సేవించునట్టి భర్త తరించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధైర్యంబుగ పతి జీవన
రిప్లయితొలగించండిపర్యంతము తోడునిల్చి పాశముగను స
త్కార్యంబులఁ సహచరియౌ
"భార్యను సేవించునట్టి భర్త తరించున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆచార్యులకు ప్రణామములు.
రిప్లయితొలగించండినా పరిచయం -
నా అసలు పేరు పంతుల సన్యాసిరావు.
కానీ,మరో పేరయిన విఠలుడు "విట్టుబాబు"గా మారి బంధుజనాల్లోనూ, స్నేహగణాల్లోనూ పరిచయం. భాగ్యనగర పట్నవాసంలో కొంతమంది సన్నిబాబు అనికూడా పిలుస్తారు. ఓ పదేళ్ళుగా ఉద్యోగ నిమిత్తము చెన్నపట్నంలో నివశిస్తున్నాను.
ఈమధ్యనే కొందరు మిత్రుల ప్రోత్సాహంతో పద్యరచన ప్రారంభించాను. ఇప్పటిదాకా "తెలుగు" మకుటంతో ఓ 50 పైగా పద్యాలను తేటగీతి, అక్కడక్కడ ఆటవెలదులతోను రాశాను. అలాగే ఆటవెలదులలో "సన్నిబాబు మాట సందెపూట" అనే మకుటంతో ఏవో నాకు తోచిన కొన్ని భావాలను ఓ 35 పద్యాలవరకు ప్రదర్శించాను. వాటిని వీలువెంబడి నా బ్లాగు https://jayabhaskaraputhra.blogspot.in/?m=1 లో పెడుతున్నాను. పెద్దలు పూజ్యులు గురుతుల్యులగు మీరందరూ నా బ్లాగును సందర్శించి తమ సలహాలతో నన్ను సన్మార్గంలో ప్రయాణింపజేయగలరని నా ప్రార్థన.
🙏
పద్యరచనా ప్రావీణ్యతా ప్రాప్తిరస్తు! మీకు ఎల్లప్పుడు నా సహకారం, బ్లాగు మిత్రుల తోడ్పాటు తప్పక ఉంటుంది. స్వస్తి!
తొలగించండిధన్యవాదాలు ఆచార్యా!
తొలగించండిఅందరూ తప్పక తమ అభిప్రాయములను తెలియజేయగలరు. ధన్యవాదములు
తొలగించండి🙏
భార్యావిధేయుడు...🙂
రిప్లయితొలగించండిచర్యలు తప్పవయ్య సహచారిణి ప్రేమను కొల్లగొట్టగ
న్నార్యుడ!నిద్రలేచి వడి! యన్నము కూరలు చేయగావలెన్
సూర్యుని తోడమేల్కొనెడి సుందరికింపుగ కాఫినిచ్చి, వే
ధైర్యము తోడ పిల్లలను తామురిపించి తయారు జేసినా
చార్యుడ!వేడియిడ్డెనలు సాంబరు తోడుత తెచ్చియిచ్చి,సౌం
దర్యకు సాయమందువిరి దండల తోడజిలేబి నీవలెన్
*"భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్"*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆర్యుడు భర్తయంచు ముదమారగనాతని సేవజేయుచున్
రిప్లయితొలగించండిభార్యలుగ్రాలినారు మును,బాపురె కాలము మారెగా, శిరో
ధార్యము పత్నిమాటయని తద్దయునర్థము నేడిదే కదా!
భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్
భార్యగ ప్రాయమ్మున పరి
రిప్లయితొలగించండిచర్యలతోసేవజేయు సతి రుగ్మతతో
ధైర్యము కోల్పడినప్పుడు
భార్యను సేవించునట్టి భర్త తరించున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికార్యాలయమున దక్షత భార్యాలయమున చతురత ప్రాజ్ఞత జూప న్నార్యుల మెప్పును బొందుచు భార్యను సేవించు నట్టి భర్త తరించున్.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భార్యాలయమున'...? అంటే ఇల్లు భార్యపేరున ఉన్నదా?
భార్యాభర్తలుజగతిని
రిప్లయితొలగించండినార్యులెగదయెల్లరకునునాలోచింపన్
భార్యలుదరించునటులనె
భార్యనుసేవించునట్టిభర్తతరించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిడా.బల్లూరి ఉమాదేవి 28/12/17.
రిప్లయితొలగించండిఆర్యావర్తము నందున
కార్యము లందున పతికట ఘనముగ సేవల్
ధుర్యమువలెను చేసెడి
భార్యను సేవించు నట్టి భర్త తరించున్
రిప్లయితొలగించండిఆర్యావర్తము నందున
కార్యము లందున పతికట ఘనముగ సేవల్
ధుర్యమువలెను చేసెడి
భార్యను సేవించు నట్టి భర్త తరించున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణదోషం. "ధుర్యమ్ము వలెను జేయుచు" అనండి.
ఆర్యు లనిరి నిజపతి పరి
రిప్లయితొలగించండిచర్యల మది వడసి సంతసము నెవ్వని స
ద్భార్యా మణి కాలాత్మ ని
భార్యను సేవించు నట్టి భర్త తరించున్
[కాలాత్మ నిభ+ ఆర్య; ఆర్య = పార్వతీ దేవి]
శౌర్యము ధైర్య సాహస ససద్గుణ సంచయ సంయుతమ్ము చా
తుర్య సమాహితమ్ముగను దుర్జయ పాలన నుద్ధరించ స
త్కార్య పరంపరా ధృత వదాన్యుఁడు ధాత్రికి విష్ణుదేవు స
ద్భార్యకు సేవఁ జేయ భువిభర్త తరించును జన్మజన్మకున్
[భువి భర్త = రాజు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'ససద్గుణ'... 'లసద్గుణ' అయితే?
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. మీ సవరణ లసత్చంద్రికా నిభ ప్రభాసమానముగా నున్నది. ధన్యవాదములు.
తొలగించండిభార్యయె యెల్లప్పుడు పరి
రిప్లయితొలగించండిచర్యలు చేయంగ కలుగు శాంతి దలచుకన్
భార్య "యనారోగ్య" మ్మన
"భార్యను సేవించునట్టి భర్త తరించున్"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...దలచుకన్'...?
ఆర్యులుఁ బల్కిరిట్లు పతి యన్నను దైవ సమంబటంచు నా
రిప్లయితొలగించండిభార్యకు, సేవఁ జేయ భువి భర్త తరించును! జన్మజన్మకున్
భార్యగ నీమయే దొరకు భాగ్యము నందఁగ చింతజేసి నౌ
దార్యము తోడ సాయమిడఁ దారయుఁ గోరును భర్తగా తనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,
ధుర్యత తోడ విష్ణువు వధూటికి - లక్ష్మికి వక్ష మందు సౌ
కర్యపు స్థావరం బిడె | నగస్త్యుడు గౌరికి దేహ మందు మా
ధుర్య సరాగ భావనముతో సగ మిచ్చె | ద్రిమూర్తులే యటుల్
భార్యకు బ్రేమ సంహిత ప్రబర్హ మొసంగగ దుఛ్ఛ మానవుల్
క్రౌర్యము తోడ హీనముగ గాంతు | రవశ్యము కల్గు వేళ యౌ
దార్యము తాలిమిం గలిగి దార కుపస్థితి జేయగా వలెన్ |
భార్యకు సేవ జేయ భువి భర్త తరంచును జన్మజన్మకున్
{ ధుర్యత = భరించు సహనము ; అగస్త్యుడు = శివుడు ;
ప్రబర్హము = ప్రాధాన్యత. ; ప్రేమసంహిత ప్రబర్హము = ప్రేమతో
అనుసంధింప బడిన ప్రాధాన్యత ; ఉపస్థితి = ఉపచారము ; }
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధైర్యము వీడని నిజసతి
రిప్లయితొలగించండిశౌర్యము నింపుకొన నాదిశక్తియె తానై
కార్యముల చక్క బెట్టన్
భార్యను సేవించునట్టి భర్త తరించున్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశౌర్యము జూపి నొంచి తన శత్రుల యుద్ధము నందు, పాలనన్
రిప్లయితొలగించండిక్రౌర్యము వీడి, పౌరులను కంటికి రెప్పను వోలె యుక్తమౌ
చర్యల గాచుచున్ సతము, శాంభవి కార్యకు చంద్రమౌళికిన్
భార్యకు సేవఁ జేయ భువిభర్త తరించును జన్మజన్మకున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శాంభవి కార్యకు'...?
'శాంభవికి+ఆర్యకు' అనియా మీ భావం? బాగుంది.
తొలగించండిఅవును గురువుగారూ. ధన్యవాదాలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభార్యనుజూచుగావుతనుభార్యనువోలెనుగాకమాతగా
రిప్లయితొలగించండినార్యుడునాతడెప్పుడునునాలినిబ్రేమనుజూచుచున్సదా
భార్యకుసేవజేయుచుభువిభర్తతరించునుజన్మజన్మకున్
భార్యయుభర్తయున్గలిసిభార్గవియీశులవోలెయుండనొప్పగున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణదోషం. "సేవ జేయ భువి భర్త...' అనండి.
భార్యకు భర్తే దైవము
రిప్లయితొలగించండికార్యమ్ముల యందు శక్తి కాంతా మణి యే
ఆర్యులు దెలిపిరి హరునికి
భార్యను సేవించు నట్టి భర్త తరించున్ !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భర్తయె' అనండి. భర్త+ఎ అన్నపుడు సంధి లేదు.
ధైర్యము జెప్పుచున్ మిగుల తాలిమి పెంచుచు కష్టసాధ్యమౌ
రిప్లయితొలగించండికార్యములందు గొప్ప సహకారము జేయుచు జీవితంబులో
శౌర్యముతోడ నెల్లపుడు జక్కగ జీవన యాత్ర నడ్పు స
ద్భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిJJK బాపూజీ గారికి,
రిప్లయితొలగించండినాకు ఓ వాట్సాపు గుంపులో ఈ మెసేజ్ వచ్చింది..
-----------------------------------------
ఎవరు పుారించారో కానీ అద్భుతంగా పూరించారు!!
సమస్య:
యేసు - మేరి- సిలువ - చర్చి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ శ్రీకృష్ణుని స్తుతిస్తూ పద్యం.
పూరణ:
(యశోదమ్మ గోపకాంతలతో}
పాడియే సుపుత్రుని గూర్చి పలుకనిట్లు?
తప్పు;మీయుల్ల మేరీతి నొప్పుకొనియె?
మంచి భాసిలు వట్టి యమాయకుండు;
చాలులెండమ్మ చర్చింప జాణలార!
(తెలుగు లో మాట్లాడదాం, తెలుగు వాడి గా జీవిద్దాము)
----------–-----------------------------
నేను ఇక్కడ మీ పూరణని స్క్రీన్‌షాట్ తీసి పంపించా...☺️
గురువుగారూ..
రిప్లయితొలగించండిబాపూజీ గారికి ఈ విషయం తెలుపాలని మీ బ్లాగుని మీ అనుమతి అడగకనే మాధ్యమంగా ఉపయోగించుకున్నాను. అన్యధా భావించవలదని ప్రార్థన
రిప్లయితొలగించండిసందర్భము: ఒక ధార్మికుడైన భర్త అనాథ శరణాలయాన్ని నెలకొల్పి భార్య తరించడంకోసం సేవా కార్యక్రమాన్ని భార్య కప్పగించడం. తానూ తరించడం.
==============================
ధైర్యముగా ననాథలకు
తాను నివాసము నేర్పరించు.. స
త్కార్య ధురంధరుండు పతి-
దానికి చక్కని రోజువారిదౌ
చర్య రచించి యా పనులు
సల్పి తరింపగ నప్పగించు నా
భార్యకు సేవఁ జేయ... భువి
భర్త తరించును జన్మ జన్మకున్
✒~ డా.వెలుదండ సత్యనారాయణ
విట్టుబాబుగారూ!మా సహాయం మీ కెప్పుడూ వుంటుంది.
రిప్లయితొలగించండిపద్యవిద్యా ప్రాప్తిరస్తు!
~డా.వెలుదండ సత్యనారాయణ
ధన్యవాదాలండీ!
తొలగించండి🙏
https://jayabhaskaraputhra.blogspot.in/?m=1
భార్య రమకు శ్రీహరి పరి
రిప్లయితొలగించండిచర్యలు సల్పుచు నరులకు సందేశమిడెన్
భార్య విలువ గుర్తెఱుగుచు
భార్యను సేవించునట్టి భర్త తరించున్
dear sir nice blog and telugu content very good sir
రిప్లయితొలగించండిLatest Telugu News
సూర్యుడు లేవకుండగనె చూరున బూజుల నూడ్చి వేయుచున్
రిప్లయితొలగించండికార్యములన్నియున్ జరిపి కాఫియు దోసెయు చక్కబెట్టుచున్
ధైర్యము తోడనే కుదిపి దారను లేపుచు సాఫ్టువేరుదౌ
భార్యకు సేవఁ జేయ భువి భర్త తరించును జన్మజన్మకున్
ఆర్యులు చీదరింతురుగ హైరణ నొందుచు పోటుగాడిలన్
రిప్లయితొలగించండిభార్యకు సేవఁ జేయ;...భువి భర్త తరించును జన్మజన్మకున్
భార్యను పుట్టినింటికిట బంగరు తెమ్మని మాటిమాటికిన్
శౌర్యము తోడ పంపుచును జంకులు లేకయె వంటవార్పులన్