7, డిసెంబర్ 2017, గురువారం

సమస్య - 2539 (రావణుఁడు ప్రియాత్మజుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రావణుఁడు ప్రియాత్మజుండు రఘురామునకున్"
(లేదా...)
"రావణుఁ డాత్మజుండు రఘురామునకున్ సఖుఁ డా బలారికిన్"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

107 కామెంట్‌లు:

  1. సార్! టైపాటు!

    "రావణుఁడు ప్రియాత్మజుండు రఘురామునకున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      టైపాటు ఎక్కడుంది? ఎన్నిసార్లు పరిశీలించినా నేనిచ్చిన సమస్యకు, మీరిచ్చిన పద్యపాదానికి భేదం కనిపించడం లేదు. దయచేసి తెలియజేయండి.

      తొలగించండి
    2. "రావణుఁడు ప్రియాత్మజుండు రాఘురామునకున్"

      ... "రాఘు"...బదులు "రఘు"

      తొలగించండి
    3. ధన్యవాదాలు. సవరించాను.
      ఎన్నిసార్లు చదివినా ఆ తప్పు నా దృష్టికి రాలేదు. పట్టి పట్టి ఒక్కొక్క అక్షరం పరిశీలించినా ఆ దోషాన్ని గుర్తించలేదు.

      తొలగించండి
  2. ఏవిధముగ బరికించిన
    నేవీరులకున్ జరుగని యీ భీకరమౌ
    యావహమే జరిగెనుగద
    "రావణుఁడు, ప్రియాత్మజుండు రఘురామునకున్"
    ****)()(****
    (యుద్ధానంతరము ఇరువైపుల మిగిలిన
    వీరులు ఈవిధంగా అనుకుని ఉంటారు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రియాత్మజుండు' అన్నదానికి అన్వయం? ఇరువైపుల మిగిలిన వీరులు కాకుండా, ఆకాశంనుండి చూస్తున్న దశరథుడు అనుకొన్నట్లుగా చెప్తే అన్వయం కుదురుతుందేమో? ఎందుకంటే యుద్ధానంతరం దేవతలతో పాటు దశరథుడు కూడా వచ్చి రాముని ఆశ్వరించాడు.

      తొలగించండి
    2. నేనూహించిన విధముగనే అడిగారు.మాఅక్క గారి మరణ వార్త విని ప్రయాణంలో ఉన్నాను.నాపూరణలో సరియైన అన్వయము,సమన్వయమున్నవని నా భావన.సాపేక్ష సుదీర్ఘ వివరణ అవసరం.ఈమెయిల్ లో తర్వాత తెలిపెదను.

      తొలగించండి
    3. "రాఘు రాముడనే "టైపాటు వల్ల సందేహం!

      తొలగించండి
  3. ఆవలి రామాయణమున
    పూవులలో పెరిగినట్టి పుత్రుడు లవుడౌ;
    కేవలము వైరి రణమున
    రావణుఁడు; ప్రియాత్మజుండు రఘురామునకున్

    ...ఇంతకంటే చాత గాదు సార్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      కొంత అన్వయక్లిష్టత ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    2. స్వల్ప అడ్జస్ట్ మాడి :)


      ఆవల వైకుంఠంబున
      పూవులలో పెరిగి కొలిచె పురుషోత్తముడిన్!
      కేవలము వైరి రణమున, 
      రావణుఁడు, ప్రియాత్మజుండు రఘురామునకున్!

      తొలగించండి
    3. ఆవుకు దూడయె కొడుకౌ,
      కావలి వానికిక తండ్రి కామందేగా!
      ఆ విష్ణువునకు బంటౌ
      రావణుఁడు ప్రియాత్మజుండు రఘురామునకున్ :)

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. అది 'టైపాటు ' కాదేమో ! ఏ సుగంధియో, తరళమో, ఉత్సాహ వృత్తమో కావచ్చునేమో! అనే సందేహం మొదట కలిగింది)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      అది కందపాదం కాదని మీకెందుకు సందేహం వచ్చింది?

      తొలగించండి
  5. సేవకుడు జయుడు సుతసము
    డా విష్ణునకు; సనకాదు లాగ్రహమందన్
    జావగ బుట్టిన దైత్యుడు,
    రావణుడు, ప్రియాత్మజుండు రఘురామునకున్.

    రిప్లయితొలగించండి
  6. రావణుని తండ్రి అయిన విశ్రవసుఁడు, అతని భార్య కైకసితో పలికిన మాటలు:-

    దేవీ కైకసి! చూడుము
    పావన చరితుండు పరమ భక్తుండిటులన్
    చావగ వైరిగ మారెను
    రావణుఁడు ప్రియాత్మజుండు రఘురామునకున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      చక్కని అన్వయంతో మంచి పూరణ చెప్పినారు. అభినందనలు.

      తొలగించండి
  7. డా.పిట్టా
    భావము పెంపొందుటకే
    చేవలకును బంధమల్లి చింతించుటకే
    చావుల పైశాచిక కథ
    రావణుడు ప్రియాత్మజుండు రఘురామునకున్

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    ఏ విధి " తల తమ్ముండౌ
    చేవగ నా తోక బావ చేష్టల మెలగున్?"(సామెత యిలా:తల తమ్ముడు ,తోక బామ్మర్ది)
    చావుల బ్రతుకుల బంధాల్:
    రావణుడు ప్రియాత్మజుండు రఘురామునికిన్!

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    రావణుడాత్మజుండు బలరాముడు రాముని యట్లె నింక మై
    రావణుడొక్కడుండె తలరాతలు దప్పగ"తిమ్మి బమ్మియౌ"
    కావు నిజమ్ము లోకమున గాంచిన బంధము లెల్ల మాయలే
    "రావణు డాత్మజుండు రఘురామునకున్ సఖుడా బలారికిన్!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'చేవలకును... చేవగ'...?

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      ఆర్యా."చేవ॥ ధైర్యము శ.ర: చేవజచ్చిన॥బలహీనమైన;బంధుత్వాలు బలం జూపుకొనుటకే పూర్వ కాలంలో నెరపే వారుగదా!

      తొలగించండి


  10. ఆ వైకుంఠంబందున
    సేవల గర్వాటుగాను చేసెన్నాపై,
    భావంబు రాక్షసుడవగ
    రావణుడు, ప్రియాత్మజుండు రఘురామునికిన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. ఆ విశ్రవసు సుతుడెవడు
    పావని యేవరుస జెప్పు వాయువు నకునా
    పావని సీతెవ్వని సతి
    రావణుఁడు, ప్రియాత్మజుండు , రఘురామునకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      'సీత+ఎవ్వని' అన్నపుడు సంధి లేదు. "సీత యెవని సతి" అనండి.

      తొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    పావన రామ శరాహతిఁ
    గావలె దగ్ధమ్ము ! , స్వల్పకాలమె యయినన్
    చేవఁ గొని యెదురు నిలిచిరి
    రావణుఁడు , ప్రియాత్మజుండు , రాఘురామునకున్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. పావనియగు కైకసికిన్
    రావణుఁడు ప్రియాత్మజుండు, రఘురామునకున్
    చేవగలగుతమ్మునిగా
    నావిర్భవమొందెనుభువి నా యహిపతియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేవగలుగు'...టైపాటు.

      తొలగించండి
  14. శ్రీవత్సలాంఛనుని పుర
    సేవకులు జయ,విజయులు రుసీసుల చేతన్
    ఆవేశముగ సడిబడగ,
    "రావణుఁడు ప్రియాత్మజుండు రఘురామునకున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రుసీసుల'...? అది "ఋషీశుల" అనుకుంటాను.

      తొలగించండి
  15. భావింప గ దుష్ టు డె వ రు ?
    పావని సుతుడైన ల వు డు పరి కిం పం గా
    నే వావి యగునె వ రి కి న్ ?
    రావణుడు -ప్రియాత్మ జుoడురఘురాముని కి న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. పావనమౌ సీతను గొనె
    గావరమే యతిశయింప గఠినాత్ముండై
    యావహమున నోడెను గద!
    రావణుడు! ప్రియాత్మజుండు రఘురామునకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని 'ప్రియాత్మజుండు'కు అన్వయం?

      తొలగించండి
  17. పావన విశ్రవసునికా
    రావణుడు ప్రియాత్మజుండు, రఘురామునకున్
    కేవల విరోధుడాయెను
    కైవల్యము జేరగోరు కాంక్షను జూపన్

    రిప్లయితొలగించండి
  18. లావగు శౌర్యము ధైర్యము
    మావని సవనాశ్వవమ్ము మరలింపంగా
    చేవను భండనఘోషిత
    రావణుడు ప్రియాత్మజుండు రఘురామునకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు నమస్సులు!ఆర్భాటముగా యుద్ధాన్ని ప్రకటించినవాడని భావన!తప్పయిన సవరించగలరు!
      లవకుశ సినిమాలో "లేరు కుశలవుల సాటి సరివీరులు ధారుణిలో" పాట స్ఫూర్తితో!
      మావని యనుటలో తమనుతాము గౌరవించుకొనుట యని!(Royal We)

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని 'భండన ఘోషిత రావణుడు'కు అన్వయం?

      తొలగించండి
    3. గురువుగారూ! భండనఘోషిత రావణుడు రామపుత్రుడు కుశుడే! పైన వివరణ యిచ్చితిని చూడ ప్రార్ధన!

      తొలగించండి
    4. అంటే ఇక్కడ 'పెద్ద రావము చేసినవాడు' అని వ్యుత్పత్త్యర్థం తీసుకోమంటారా?

      తొలగించండి
    5. అవును గురువర్యా! సరయిన పూరణయేనా?

      తొలగించండి


  19. ఆ వనమాలి సేవలను తావుల దప్పగ భావమై యిలన్
    రావణుఁ డాత్మజుండు రఘురామునకున్ ! సఖుఁడా! బలారికి
    న్నా వనధీశులా చిరికి, నాకపు రేడుగ నిల్చె నాతడే !
    కైవశ మున్గనెన్ భువిని కామితుడై, పరమాత్మ లీలగన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చిరికి' అర్థం కాలేదు.

      తొలగించండి

    2. చిరి - అగ్ని
      ఆంధ్రభారతి ఉవాచ
      ఇంద్రునికి, వరుణునికి, అగ్నికి ....

      సరియేనాండి ?

      జిలేబి

      తొలగించండి
  20. సేవకుని కొసఁగి వరము
    న్నా వైకుంఠమ్ము వీడి హరి దిగె నరుడై
    పావని సీతను దాకని
    రావణుఁడు ప్రియాత్మజుండు రాఘురామునకున్

    రిప్లయితొలగించండి
  21. భావింప విశ్వవసునకు
    రావణుడు ప్రియాత్మజుండు, రఘురామునకున్
    దావరులగు తనయులుగన్
    పావనముగ జననమొందె నాలవకుశులే!!!


    ఆవైదేహిని సడపెన్ ?
    రావణునకు నింద్రజిత్తు? , లక్ష్మణు డిలలో
    భావింప నెవరి యనుజుడు?
    రావణుఁడు, ప్రియాత్మజుండు,రఘురామునకున్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'జనన మొంది రాలవకుశులే' అనండి.

      తొలగించండి
  22. ఆవనిత సీత గొనెనెవ
    డావీర కిశోరము కుశు డరయగ నెవడో?
    యీ వివరము లెరిగింపుము!
    రావణుడు;ప్రియాత్మజుడు రఘురామునకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    పావని జా‌నకిన్ గొనిన పాలసు డెవ్వడు ? చిన్ని కుశు౦డు మారుతీ

    సేవితమూర్తి కేమగును ? స్నిగ్ధత తోడ విభీషణు౦డు స౦

    సేవ యొనర్చె నెవ్వరి ? కమేయుడు భాస్కరు డెవ్వరో గదా ?

    రావణు | డాత్మజు౦డు | రఘురామునకున్ | సఖు డా బలారికిన్ |


    { స్నిగ్ధత = మిత్రత్వము ; భాస్కరుడు = సూర్యుడు , అగ్నిదేవుడు }

    సూర్యుడు కాని అగ్నిదేవుడు కాని ఎవరో ఒకరు బలారి మిత్రునిగా

    చెప్పాను .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  24. సవరి౦చిన మొదటి పాదము ==

    పావని జానకిన్ గొనిన పాలసు డెవ్వడొ ? యా కుశు౦డు మారుతీ

    రిప్లయితొలగించండి
  25. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: సీతమ్మకు కలిగిన కవలపిల్లలలో ఒకడు, లవునికి అన్న, ఐనటువంటి *కుశుడు* తన పేర *కుశస్థలి* అనే పట్టణాన్ని నిర్మించినవాడై , శ్రీరామ నిర్యాణం తరువాత, నిర్జీవంగా మారిన *అయోధ్యకు, మరల జీవకళ వచ్చేవిధంగా పరిపాలన చేస్తూ*, ఇంద్రునికి శత్రువైన దుర్జయుడు అనే రాక్షసుని సంహరించాడు. యుద్ధభూమిలో శత్రువులను పారిపోయేటట్లు చేసే ఆ *కుశుడు*
    *శ్రీ రఘురామునికి కుమారుడు. అంతేకాదు బలుడు అనే రాక్షసునికి శత్రువైన ఇంద్రునికి సఖుడు* అని చెప్పే సందర్భం.

    పావనుడున్, *కుశస్థలి* ని పాలన జేసినవా *డయోధ్య* కున్
    జీవదు డైనవా డిల నజేయుడు, దుర్జయు జంపె నింద్రునిన్
    గావ, *కుశుండు* శ్రీ *లవుని కగ్రజుడు* న్, రణ మందు శత్రు వి
    *ద్రావణు, డాత్మజుండు రఘురామునకున్, సఖు డా బలారికిన్.*

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
  26. భావము పల్లవింపగను పంకజనాభుడు సన్నుతింపగన్
    పావనుడైన కశ్యపుని భామకు మేటి బలాన్వితుండుయౌ
    ధీవరుడా సురారియగు, తీరుగ వాలికి సోదరుండు తా
    రావణుఁ డాత్మజుండు రఘురామునకున్ ! సఖుఁడా! బలారికి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ భావం అవగతం కాలేదు. దయచేది వివరించండి.

      తొలగించండి
    2. రావణుఁ డాత్మజుండు, రఘురామునకున్ ! సఖుఁడా! బలారికిన్

      తొలగించండి
  27. పలికె నివ్విధి నొజ్జతో పరమశుంఠ
    పరగ నాకిది తెల్వదా గురువుగారు!
    దశరధుని కొడుకు రాముండు తరచిజూడ
    రావణుడు;ప్రియాత్మజుడు రఘురామునకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మొద్దబ్బాయి పలుకులుగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శంకరార్యా !
      సమస్యా పాదం కందం
      మొదటి మూడు పాదములూ తేటగీతి
      మూడవ పాదంలో గణ దోషం
      గమనించ గలరు

      తొలగించండి
  28. పావన రఘు వంశవర మ
    హా వనధి శశాంక సన్ని భాసమ వీరుం
    డా వినయ కుశుం డరి వి
    ద్రావణుఁడు ప్రియాత్మజుండు రఘురామునకున్


    రావణుఁ, డాత్మజుండు, రఘురామునకున్ సఖుఁ డా, బలారికిన్
    వావిరి కంటకుండు భువిఁ బన్నుగ పద్మజ వంశ సంభవుల్
    రావణు క్రూర కర్మమున రాక్షసు లెల్లరు నాశనంబవన్
    ధీవర రామ మిత్రుఁ డయి తేఱెను మూడవ వాఁ డొకం డిఁకన్

    [రఘురామ సఖుఁడు = విభీషణుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      అద్భుతమైన పూరణలు. ముఖ్యంగా రావణ, మేఘనాద, విభిషణులకు ప్రస్తావించిన రెండవ పూరణ అనితర సాధ్యం. అభినందనలు.

      తొలగించండి
  29. భూవరపుత్రి నెత్తుకొని పోయిన దెవ్వడు? శ్రీ కుశాఖ్యుడై
    భూవలయమ్ము నేలి రహి బొందిన వీరుడు రామమూర్తి కే
    వావిని నొప్పు? నా గుహు డెవండు? శచీసతి భార్య యేరికౌ
    రావణుఁ, డాత్మజుండు, రఘురామునకున్ సఖుఁ డా, బలారికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  30. ఆవన జాక్షి కైకసికి నబ్జజు వంశముఁ బుట్టె నెవ్వరో?
    తావిలు విద్యనేర్పె ముని దావము నెవ్వరి కిచ్చతోడుతన్?
    పావని సీతపుత్రు డిల బాంధవ మెవ్వరి తో డసల్పెనో?
    రావణుఁ డాత్మజుండు, రఘు రామున కున్, సఖుఁ డా బలారికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  31. ఆవిశ్వవసున కిలలో

    రావణుఁడు ప్రియాత్మజుండు,రాఘురామునకు

    న్నావలజకుసుత లెవరన

    నీవసుధన్ లవకుశులని నింపుగ వినుమా.

    వల =భూమి

    వలజ=సీత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "ఆ విశ్వవసువున కిలన్" అనండి.

      తొలగించండి
    2. వలజ యనిన భూమి. వలజాజ / వలజ సుత యన సీత యగును.
      రావణుని తండ్రి విశ్రవసువు / విశ్రవసుఁడు.

      తొలగించండి
  32. జీవన యానమె శివుడనె
    దైవం బయ్యును హనుమను దగ్గర జేర్చేన్
    దీవెన లొసగెను శబరియె
    రావణుడు॥ ప్రియాత్మ జున్దు॥ రఘు రామునికిన్ !

    రిప్లయితొలగించండి
  33. ఆవిజయుడు జయ లందున ,
    పావని జనకజనుబట్టు పాపాత్మునిగా
    సేవా నిరతుండొకడయె
    రావణుఁడు; ప్రియాత్మజుండు రఘురామునకున్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కాయము బెంచి యసురునిగ
    వాయసమటు వాగు వాడు ' వైస్రాయి' యవ
    న్నా యమునకు భటుడనె వై
    స్రాయలకున్ దెలుఁగు రాదు రసముం గ్రోలన్

    రిప్లయితొలగించండి
  34. కుశుని ప్రస్తావన.......
    (శ్రీకోట రాజశేఖర్ గారి బాటలో........ )

    ధీవరయుక్తుడై బలవితీర్ణత దుర్జయు సంహరించి సం
    భావిత రాజ్యలక్ష్మికి శుభంబును గూర్చి ప్రశస్త శస్త్ర వి
    ద్యావరసింహుడై చెలఁగు యాజిని భీకర దుష్ట శత్రు వి
    ద్రావణుఁ డాత్మజుండు రఘురామునకున్ సఖుఁ డా బలారికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  35. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆవల వైకుంఠములో
    శ్రీవత్సునిగా వెలిగెడి శ్రీరామునకున్
    కావలి వాడౌ జయుడీ
    రావణుడు ప్రియాత్మజుండు రఘురామునకున్

    రిప్లయితొలగించండి
  36. రావము తోడ భీతిగొను రాక్షస యుధ్ధము జేయు వీరుడున్
    రావణు డాత్మజుండు, రఘు రామునకున్ సఖుడా బలారికిన్
    సేవకు డంజనీ సుతుడు, సేనల ద్రొక్కుచు జీల్చి జంపగన్
    భావముతో విభీషణుడు బంధము తెంచుకొ జేరె రామునిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామమోహన్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెంచుకొ' అనడం సాధువు కాదు. 'బంధము ద్రెంచియు' అనండి.

      తొలగించండి
  37. ఆవల రామగాథ విన నాతృత జూపుచు బాల్యమిత్రుడున్
    గోవెల జేరవచ్చి నవకోమలి వైపున చూపు నిల్పుచున్
    లేవక సాంతమున్ గనియె! ప్రీతిగ నంత్యము నందు నిట్లనెన్
    "రావణుఁ డాత్మజుండు రఘురామునకున్ సఖుఁ డా బలారికిన్! "

    రిప్లయితొలగించండి
  38. గురువు గారికి నమస్సులు.
    పావనినిహరిo చిదెవరు?
    శ్రీవారు మెచ్చిన మనుజుడు ,శీలుడు ఎవరున్ ?
    సేవకుడు హనుమ ఎవరికిన్?
    రావణుడు ,ప్రియాత్మజుండు,రఘురామునకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      "పావనిని హరించె నెవరు" అనండి.
      రెండవ పాదంలో గణదోషం. సవరించండి. "సేవకు డెవరికి మారుతి" అనండి.

      తొలగించండి
  39. మైలవరపు వారి పూరణ


    శ్రీ విషకంఠు పాదములఁ సేవనమే దినచర్య యంచు దా
    భావనజేయువాడు వర వైణికుడల్ల పులస్త్య బ్రహ్మకున్
    రావణుడాత్మజుండు .., సఖుడా రాఘురామునకున్ ? బలారికిన్ ?
    పావని జానకిన్ చెరను బట్టుటనాతడె వధ్యుడయ్యెడిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  40. అందరికీ వందనములు

    అందరి పూరణలూ అలరించు చున్నవి

    అలరించ నున్నవి

    1)
    కావగ వచ్చిన హరియే

    కావలులగు జయవిజయుల - కారుణ్య ముతో

    కావున కాదన నౌనే

    రావణుడు ప్రియాత్మజుండు - రఘురామునకున్


    2)

    పావన వైకుంఠము విడి

    పావనులగు జయవిజయుల - బాధల బాపన్

    కావగ వచ్చెను కావున

    రావణుడు ప్రియాత్మజుండు - రఘురామునకున్


    3)

    దీవెన లందుచు నిరతము

    సేవించెడు జయవిజయుల - సేవల బొందన్

    చావునె వరముగ నిడుటన్

    రావణుడు ప్రియాత్మజుండు - రఘు రామునకున్


    4)

    కావలివారును భక్తులు

    దేవతలగు జయ విజయుల - ధ్యేయము దీర్చన్

    ఆవాసము విడి వచ్చుట;

    రావణుడు ప్రియాత్మజుండు - రఘురామునకున్

    5)

    సేవకులకు, సేవితులకు

    పావనులకు, రాక్షసులకు - పాపాత్ములకున్

    కావలి హరియే కావున

    రావణుడు ప్రియాత్మజుండు - రఘు రామునకున్


    6)

    కావలి ; భూ, ద్యో, జలముల

    నావాసము గల్గు వార్కి - నా శ్రీహరియే

    కావున కాదన గలమా

    రావణుడు ప్రియాత్మజుండు - రఘురామునకున్

    రిప్లయితొలగించండి
  41. ఆవహ మందున తుదకున్
    జావు వరించినను వారు శౌర్యము తోడన్
    లావగు ప్రతి ఘటన నిడిరి
    "రావణుఁడు, ప్రియాత్మజుండు రఘురామునకున్"

    రిప్లయితొలగించండి
  42. దేవుడ! కైకసమ్మకిట తెల్పుము నెవ్వరు నాత్మజుండొకో?...
    దేవుడ! వాలితమ్ముడిట తెల్పుము శ్రీరఘురాముకేమగున్?...
    దేవుడ! గౌతముండిటను తెల్పుము శాపము నేరికిచ్చెనో?...
    రావణుఁ డాత్మజుండు;...రఘురామునకున్ సఖుఁ డా;...బలారికిన్;...
    దేవుడ! థేంక్సువాంక్సురహ తెల్పెద నీకుర ఫోనెప్ఫ్రెండుగా 😊

    రిప్లయితొలగించండి