31, డిసెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2560 (దౌర్భాగ్యంబుల నిచ్చి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే"
(లేదా...)
"దౌర్భాగ్యంబుల నిచ్చి ప్రోవగదరా దామోదరా సత్కృపన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారు ఇచ్చిన సమస్య)

51 కామెంట్‌లు:

  1. ఆర్భాటమ్ములు లేకయె
    యర్భకులెవరైన వేడ నానందముగ
    నిర్భయ మిచ్చియు నరులకు*
    దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే"
    (* ఇచ్చియున్+అరులకు =ఇచ్చియు నరులకు)

    రిప్లయితొలగించండి


  2. అర్భకులగాచు వాడే
    ఆర్భాటమ్ములను జేయ నడచుచు మన యం
    తర్భూతమ్మై వెలయుచు
    దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. నిర్భరమౌ ధైర్యముతో
    నిర్భటమగు భక్తి యున్న నిశ్చయముంగ
    న్నర్భకులు కుచేలులకున్
    దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే!

    రిప్లయితొలగించండి


  4. ఆర్భాటమ్ములవేలరామ!మనసున్ ధారాళమైవెల్గుమా
    దౌర్భాగ్యంబుల నిచ్చి ప్రోవగదరా దామోదరా సత్కృపన్
    దుర్భిక్షమ్ములనిమ్మ రామ! సయి హద్దుల్మీర కన్నే దృష
    ద్గర్భమ్మై నిను గొల్వ మేలు మదిసత్సంగమ్ములన్జేయగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్భాట "దృషద్గర్భము"
      దుర్భరమై నాదు మనము దొల్చ జిలేబీ!
      అర్భకుడన్నే రీతిన
      దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే?

      తొలగించండి
  5. ఆర్భటి మార్చెన్ జ్యేష్ఠయ
    దౌర్భాగ్యము నిచ్చి;బ్రోచు దామోదరుడే
    యర్భకు నన్నున్ బ్రీతిగ
    నిర్భాగ్యు నెపుడును కరుణ నిండిన కనులన్.

    రిప్లయితొలగించండి
  6. అర్భకులకు నిడు హరి కడు
    దౌర్భాగ్యము;నిచ్చి ప్రోచు దామోదరుడే
    నిర్భయము,సంపదలు నే
    యార్భాటమ్ములు సలుపని యాశ్రిత తతికిన్!

    రిప్లయితొలగించండి
  7. ఆర్భాటము లెందుకు యం
    తర్భాగమె జీవనమున దారుణ బాధల్
    నిర్భయమున హరిని గొలువు
    "దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిర్బంధము పాలబడిన
      యర్భకులను నాతడేగ ఆర్తిన గాచున్
      నిర్భీతిగ జీవింపుము
      "దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే"

      తొలగించండి
  8. నిర్భయమగు ముక్తి కొరకు
    దుర్భరమగు తపము సల్పు ధూర్తుని నైనన్
    నిర్భరమగు ప్రీతి విరియ
    దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే!

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    శ్రీరామాయణముపై రమణానందుని ప్రేలాపనల నేపథ్యంలో....

    దర్భల్ నాకిన పాములట్లు ఖలులై ద్వంద్వమ్ములౌ జిహ్వలన్
    స్వర్భానుల్ మన దివ్యరామకథపై వాల్మీకిపై దుర్మతిన్
    దుర్భాషల్ పలుకంగ చక్రహతితో ద్రుంచంగ రారా ! హరీ !
    దౌర్భాగ్యంబుల ., నిచ్చి ప్రోవగదరా ! దామోదరా ! సత్కృపన్
    స్వర్భోగప్రద *సామవేద సుధలన్ , చాగంటి వాగ్ధారలన్* !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిర్భర భక్తినిఁ గొలిచిన
      స్వర్భోగములిచ్చును., శిశుపాలుని వోలెన్
      దుర్భాషలాడఁ జూచిన
      దౌర్భాగ్యమునిచ్చి ప్రోచు దామోదరుడే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. అధ్భుతమైన పూరణలండీ!అభినందనలు!

      తొలగించండి
    3. ధన్యవాదాలండీ.. శ్రీమతి సీతాదేవి గారికి కూడా అందించండి.. నమోనమః 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  10. ఆర్బాట oబగు పూజకు
    దౌర్భాగ్య ము నిచ్చి ప్రోచు దామోదరు డే
    అర్భకు లై వేడుకొన గ
    నిర్భర కరుణాళువ గు చు నిల్చును గావన్

    రిప్లయితొలగించండి
  11. కందం
    దుర్భరమౌ శాపమ్మని
    నిర్భాగ్యులు జయ విజయులు నియతిన్ గోరన్
    గర్భ విరోధపు జన్మల
    దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుడే!

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య 2560
    *దౌర్భాగ్యంబుల నిచ్చి ప్రోవ గదరా దామోదరా సత్కృపన్.*

    సందర్భం :: నవ విధ భక్తిమార్గాలలో ఆత్మనివేదనకు ఉదాహరణగా నిల్చిన బలిచక్రవర్తి , తన సర్వస్వాన్ని వామనమూర్తికి సమర్పించుకోగా , గరుత్మంతుడు బలిని వరుణపాశంతో బంధిస్తాడు. అప్పుడు బలిని బంధించడం న్యాయమేనా ? అని బలికి తాతయైన ప్రహ్లాదుడు, బలికి భార్యయైన వింధ్యావళి, బ్రహ్మదేవుడు వామనమూర్తిని అడుగుతారు. అప్పుడు సమాధానం చెబుతూ
    *ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని*
    *యఖిలవిత్తంబు నే నపహరింతు* దుర్గతిని కూడా కలిగిస్తాను. అని తత్వాన్ని బోధించాడు వామనమూర్తి. అందువలన ఓ దామోదరా! నాకు కూడా ఆ కష్టాల నిచ్చి కృపతో నన్ను రక్షించు అని ఒక భక్తుడు విన్నవించుకొనే సందర్భం.

    నిర్భాగ్యున్ , బలిచక్రవర్తి , నిటులన్ నీ విట్లు బంధించు సం
    దర్భం బే మని , బ్రహ్మదేవు డడుగన్ , *తత్వమ్ము బోధించుచున్*
    *దౌర్భాగ్యమ్ముల నిత్తు నంటి విల భక్తశ్రేణి బ్రోవంగ ; నా
    *దౌర్భాగ్యమ్ముల నిచ్చి బ్రోవగదరా దామోదరా ! సత్కృపన్.*
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (31.12.2017)

    రిప్లయితొలగించండి
  13. దుర్బలురను కడు దీనుల
    నర్భకులను బ్రోవ రాడె యాదేవుండున్
    ఆర్భాటమ్ములె ప్రియమగు
    దౌర్భాగ్యము నిచ్చి బ్రోచు దామోదరుడే.
    *****
    (అష్టకష్టాలు పడుతున్న ఒక భక్తుని మనోగతము,నిష్టూరము)

    రిప్లయితొలగించండి
  14. కః దుర్భరులైన తులువలకు
    దౌర్భాగ్యము నిచ్చి, ప్రోచు దామోదరుఁడే
    దుర్భర దరిద్ర జనులను
    నిర్భయముగ బ్రతుకు నట్లు నిరతము జగతిన్

    రిప్లయితొలగించండి
  15. దుర్భరమౌ పశుపాశవి
    నిర్భంధిత జనులబ్రోవ నిజమహిమల సం
    దర్భహితముగ కృపచే
    దౌర్భాగ్యములిచ్చి ప్రోచు దామోదరుడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ డా. సీతా దేవి గారు. సుత దార పశు బంధములలో మానవుడు మునుగు చుంటాడు.
      పశు పాశము కంటె సుత దార పాశము మిన్న కదా!
      సుతదార సు / నిర్బంధిత యనిన నెట్లుండును?
      “హితమ్ముగ” అనండి లేకపోతే గణ దోషము.

      తొలగించండి
    2. పూజ్యులు గురుతుల్యులు కామేశ్వరరావుగారికి నమఃపూర్వక ధన్యవాదములు! తప్పక సవరిస్తాను! మీవంటి పెద్దలు సూచనలం దిచుటయే మాకు మహద్భాగ్యము!

      తొలగించండి
    3. దుర్భరమౌ సుతదార సు
      నిర్భందితజనులబ్రోవ నిజమహిమల సం
      దర్భహితమ్ముగ కృపచే
      దౌర్భాగ్యములిచ్చి ప్రోచు దామోదరుడే!

      తొలగించండి
    4. పెద్దలు కామేశ్వర రావు గారి మెచ్చుకోళ్ళు పొందిన సీతాదేవిగారికి అభినందనలు.

      తొలగించండి
  16. అర్భక భక్తులను దటి
    ద్గర్భ వినీలాంగుఁడు దివ దాన నిరతినిన్
    నిర్భర నరకము నాపఁగ
    దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుఁడే


    గర్భంబందున నుండి పంచజను లాక్రందింతురే ధాత్రి సం
    దర్భభ్రాజిత పూజ లందుకొని సత్సామర్థ్య సంప్రీతినిన్
    నిర్భాగ్యక్షత భక్త లోకమునకున్ నిశ్శేష లక్ష్మిన్ వినా
    దౌర్భాగ్యంబుల, నిచ్చి ప్రోవగదరా దామోదరా సత్కృపన్

    రిప్లయితొలగించండి
  17. అర్భక కుచేలునకు తా
    దౌర్భాగ్యము నిచ్చి, ప్రోచు దామోదరుఁడే
    యార్భాటముతో సిరి ప్రా
    దుర్భావము జేసె నింట తుదకన వినమే !

    నిన్నటి దత్తపది కి నా పూరణ

    పాక శాస్త్రము నా మూల పఠన జేసి
    స్వాతి శయమున కలిగింప షడ్రుచు లను
    చిందు లేసిరి పలువురు చిత్త మలర
    నమృహస్తమె నీదని యనిరి దినుచు

    రిప్లయితొలగించండి
  18. ఆర్భాటంబుననుండక
    నిర్భయముగసేవజేయనిర్మలమదితో
    న్నర్భకులౌ దీనులకిల
    దౌర్భాగ్యమునిచ్చిప్రోచుదామోదరుడే

    రిప్లయితొలగించండి
  19. ఆర్భాటంబుగ జీవితంబు గడపన్నర్దించితిన్ పాదముల్
    దౌర్బల్యమ్మును బాయజేసి,కృపతో తగ్గించి దీనత్వమున్
    దౌర్భాగ్యంబుల, నిచ్చి బ్రోవగదరా దామోదరా సత్కృపన్
    నిర్భీతిన్, శుభసంపదల్ నొసగి ప్రణేశా ప్రమోదంబునన్

    రిప్లయితొలగించండి
  20. ఆర్భాటంబుగ జీవితంబు గడపన్నర్దించితిన్ పాదముల్
    దౌర్బల్యమ్మును బాయజేసి,కృపతో తగ్గించి దీనత్వమున్
    దౌర్భాగ్యంబుల, నిచ్చి బ్రోవగదరా దామోదరా సత్కృపన్
    నిర్భీతిన్, శుభసంపదల్ నొసగి ప్రణేశా ప్రమోదంబునన్

    రిప్లయితొలగించండి
  21. ఆర్భాటముగా పూజలు
    దౌర్భాగ్యము నిచ్చు ,ప్రాచువాడె దామోదరుడే
    నిర్భాగ్యులకు సంపద
    నిర్భీతియు,మతియు,గతియు,నీతిగుణములన్

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. దుర్భాషలాడు గుణమే
      దౌర్భాగ్యము; నిచ్చి ప్రోచు దామోదరుఁడే
      ఆర్భాటము లేకిల సం
      దర్భా నుగుణమున నరుఁకు దయతో శుభముల్!

      తొలగించండి
  23. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

    ఆర్భాటమ్ముగ గానిపించెడు నసత్యావాదకున్ జేరగా ,

    దుర్భావ క్రియు ధూర్తమానవుని దుర్బోధకున్ గొల్వగా =

    దౌర్భాగ్యమ్ముల నిచ్చు | బ్రోవ గదరా దామోదరా ! సత్కృపన్ >

    నిర్భాగ్య స్థితి నున్న దీనుని ననున్ నీవే సదా | మానసాం

    తర్భాగంబున భక్తి . వేడుకొనెదన్ దాక్షిణ్య రత్నాకరా !

    చేరగా = ఆశ్రయించగా

    రిప్లయితొలగించండి
  24. కుంతీదేవి మనోగతము
    ఆర్భాటమ్మగు భోగభాగ్యములతో నానందసందోహమున్
    నిర్భీతిన్ జరియింతుమేమొ యిలపై నిన్నెప్డు స్మరించకే
    దుర్భావమ్ముల బారద్రోలి నికపై దోషంబులేకే సదా
    దౌర్భాగ్యమ్ములనిచ్చి బ్రోవగదరా దామోదరా సత్కృపన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడడవ పాదము చివరలో నిన్నెప్డు భావించకే యని
      మూడవ పాదములో దోషంబులేకన్ సదా యని స్వీకరించ ప్రార్ధన!
      సవరణలను సూచించిన శ్రీ కోట రాజశేఖర్ గారికి ధన్యవాదములతో!!

      తొలగించండి
    2. “లేక” ఇది వ్యతిరేక క్త్వార్థమైన క “లేకన్” ద్రుతాంతము గా ప్రయోగ మసాధువు. తినక, వండక యిత్యాదులలో ద్రుత ముండదు.

      తొలగించండి
    3. లేకయే, లేకే రెండును సాధువులే.
      నొప్పికోడక+ఉపతాపము= నొప్పికోడకుపతాపము భా. ఆ. 3-219
      యుక్తులను జేసి పడయంగ నోప కలసి. భా. స. 1. 136

      తొలగించండి
    4. పెద్దలకు నమస్సులు, ధన్యవాదములు!!
      ఆర్భాటమ్మగు భోగభాగ్యములతో నానందసందోహమున్
      నిర్భీతిన్ జరింతుమేమొనిలపై నిన్నెప్డుభావించకే
      దుర్భావమ్ముల పారద్రోలినికపై దోషంబులేకే సదా
      దౌర్భాగ్యమ్ములనిచ్చి బ్రోవగదరా దామోదరా సత్కృపన్ !

      తొలగించండి
  25. ఆర్భాటంబున గాక కీర్తనలు సర్వంబంచు తావేడినన్
    దుర్భిక్షంబును నింపె|దాసునకు సంతోషంబులేనట్లుగన్
    నిర్భేద్యంబగు జీవితంబిడుచు సాన్నిధ్యాన శ్రీరాముడే
    దౌర్భాగ్యంబుల నిచ్చి ప్రోవగదరా|దామోదరా సత్కృపన్

    రిప్లయితొలగించండి
  26. ఆర్భాటములను చేయుచు
    నిర్భీతిగ జనులదోచు నేతలకెల్లన్
    నిర్భయుడగు హరి సతతము
    దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుడే.

    రిప్లయితొలగించండి
  27. దౌర్భాగ్యపు సంసారపు
    టార్భాటముజిక్కి మోక్షమతిదూరమ్మౌ
    నిర్భాగ్యుల దయజూపుచు
    దౌర్భాగ్యము నిచ్చి ప్రోచు దామోదరుడే

    రిప్లయితొలగించండి
  28. నిర్భాగ్యుండయి కూడ నేరను ప్రభూ నిన్ దక్క నే నన్యమున్
    దుర్భావంబుల సోకనీ కనినచో తోడై సిరుల్ రాల్చుచున్
    ఆర్భాటమ్ముల జేసి పూజలనుచు న్నాహార్యముల్ జూపినన్
    దౌర్భాగ్యంబుల నిచ్చి ప్రోవగదరా దామోదరా సత్కృపన్.

    రిప్లయితొలగించండి
  29. నిర్భాగ్యున కొసగడు హరి
    దౌర్భాగ్యము! నిచ్చి బ్రోచు దామోదరుడే
    నిర్భీతిని సంపదల
    న్నార్భాటముగ కురిపించు నాశీస్సులిలన్!

    రిప్లయితొలగించండి
  30. శార్దూలవిక్రీడితము
    నిర్భాగ్యాంబుధిఁ జిక్క సేవకులు మౌనీశుల్ ప్రకోపంబునన్
    దుర్భాష్యమ్ముల శాపమివ్వఁ గని యాందోళించు నవ్వారికి
    న్నిర్భీతిన్ త్వరితమ్ము నంద తమ సాన్నిధ్యమ్ము వైరమ్మునన్!
    దౌర్భాగ్యంబుల నిచ్చి ప్రోవగదరా దామోదరా సత్కృపన్!

    రిప్లయితొలగించండి
  31. ...సమస్య
    దౌర్భాగ్యము నిచ్చి.. ప్రోచు దామోదరుడే!
    సందర్భము: చెడుమాటలు మాట్లాడడం కొందరి కెంతో ప్రీతికరం.వాళ్ళకు దౌర్భాగ్యము కలుగుతుంది

    దుర్భాషా ప్రియులై సం

    దర్భము లేకుండ వాగు దర్పోద్ధతులౌ

    నర్భకులకు మూర్ఖులకును

    దౌర్భాగ్యము నిచ్చి... ప్రోచు

    దామోదరుడే..

    ✒~ డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  32. దర్భల్ బూనుచు వచ్చితీవు గద శ్రాద్ధంబున్నిడన్ నాకిటన్
    నిర్భాగ్యుండను నిద్రలేదు జగనున్ నిర్వీర్యుడై దల్చగా
    గర్భమ్మందున దాచియున్న నిధులన్,..గారాబుగా ద్రోలుచున్
    దౌర్భాగ్యంబుల;..నిచ్చి ప్రోవగదరా దామోదరా సత్కృపన్

    దామోదరుడు = నరేంద్ర "దామోదర" దాసు "మోడి"

    రిప్లయితొలగించండి