పరాయి భాషల మోజులో తెలుగు భాష కనుమరుగవుతుందేమోనన్న భయం అక్కరలేదు. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా వందల తెలుగు పుస్తకాలు వెలువడుతున్నాయన్న విషయం వింటూనే వున్నాం. అంతా మన చేతిలోనే వుంది. కొత్త తరానికి భాషావిలువలు నేర్పే బాధ్యత మనదే...🙏🏻
తే.గీ. ఆటలకును లేదంతము, పాట తేరు సాగుచుండు నెప్పుడు భువి జాగు లేక బాట వీడునన్న భయపు మాటలేల తెలుగు సభల వెలిగెజూడు తేనెలమ్మ!
చిందులు వేయుచున్ జనుల చిత్తము దోచెను గొప్పగా కళా బృందపు యాట పాటలును, పెద్దలు మెచ్చుచు నాడు మాటలు న్నందరి డెందము గెలిచె హాస్యపు బాటన బల్కుచుండ నా నందము వెల్లువెత్తనది నందన మయ్యెసభాంతరమ్మటన్.
గురువు గారికి నమస్సులు. ఆట వెలదులను చెప్పగ పాటను మరిపించగలను పామరులను నీ బాటన పయనించుట కే మాటలు పద్దియ ములౌ సమాధిక కళగన్ పెద్దలు పోచి రాజు కామేశ్వరరావు గారు పూరణ పరిశీలించి సరిచేయ ప్రార్థన.
గురువు గారు మేము దూరంగా ఉన్నాము కానీ తమరు దగ్గర నుండి చూస్తూ ఉంటారు. అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ పద్య రచన తోట వరకు మాకు బాట వేసిన మీకు పాదాభివందనములు. తే గీ బాట వేయగ గురువులు తోటవరకు మాట శాసనమని నమ్మి మరులు గొనుచు ఆటలాడుచు వ్రాసిన నాటవెలది పాట వలె సాగిపోయెను తేట గీతి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఆటా పాటల లోనన్
రిప్లయితొలగించుమాటా మాటలు కలుపుచు మలుపులు తిరిగెన్
దీటుగ ప్రపంచ మంతటి
బాటలు మన తెలుగు వార్వి భాగ్యనగరికిన్!
పాటలంబైన కాంతులు పరిడవిల్లె;
రిప్లయితొలగించుబాటమీరని మరియాద బయలువెడలె;
మాటకందని మమతలు మదుల పొంగె;
ఆంధ్రభారతి తెలగాణ నాటలాద.
4 వ పాదంలో నాటలాడ అని , 1 వ పాదంలో పరిఢవిల్లె అని చదువ మనవి.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఆటగ మొదలిడి రిసభలు
రిప్లయితొలగించుపాటలు పద్యముల విందు బహుఘన మంటన్
మాటలు పిలుపుల సొగసుల
బాటయె రహదారి కాదు వంకర టింకర్
రిప్లయితొలగించుప్రతి మాటలో తెలంగా
ణ తీరుగన్నాటలాడె నౌరా యనగన్
స్తుతమాయెన్ పాటలతో
డ తెలుగు పూబాట కోడెరౌతు జిలేబీ !
జిలేబి
కోడెరౌతు మాట కొండంత ధైర్యమ్ము
తొలగించుకోడెరౌతు పాట కోమలమ్ము
కోడెరౌతు ఆట కోదండరామమ్ము
కోడెరౌతు బాట గోలుకొండ
తొలగించుసారస్వత సభ లోనన్
పారించెన్ పద్యములను ఫాలాక్షుండ
య్యా! రామశర్మకున్ స
త్కారము ఘనముగ జిలేబి గావించెనయా !
జిలేబి
ఆటల పాటల తోడన్
రిప్లయితొలగించుబాటవముగ సభలు విరిసె వైభవమొప్పన్
మాటల కందని రీతిన
మేటిగ సాగెను విబుధులు మేల్మేలనగన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించు"ఆటలనాడుకొంటిమట నక్షరపంక్తుల తేటతెల్గులో
పాటలు పాడినట్లని" ప్రపంచ తెనుంగు మహాసభల్ గనన్
బాటను పట్టినారదిగొ ! స్వర్గము వీడుచు పాతకాలపున్
మాటలు ముచ్చటించుకొన మాన్యులు పూర్వకవీంద్రదిక్కరుల్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఆటంకము లేకుండను
రిప్లయితొలగించుపాటవమున సాగె సభలు వైభవ మొప్పన్
మేటిగ వేసిరి బాటలు
మాటలతో తెలుగు కచట మహిమాన్వితులే.
ఆట పాట లతో సభ లల రు చుండ
రిప్లయితొలగించుమాట లన్నియు తెలుగు లో మహి త మైన
బాట వేయగబూన నా భాగ్యమను చు
సంత సించె ను తెలుగమ్మ సంబర ము న
ఆటలు కావవి జూడగ
రిప్లయితొలగించుపాటవమున తెలుగు సభలు పండుగ రీతిన్
బాటలు మేటిగ పరువగ
మాటల కందని విధముగ మహిలో జరుపన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఆట పాటలందు అచ్చమైన తెలుగు
రిప్లయితొలగించుబాట వెడలె నిటుల భాగ్యనగరి
మాట దెలుప మనకు చాటగా తన ప్రభ
ఆటవెలది నందు అమరెనిటుల
మాటలు నేర్చిననేతలు
రిప్లయితొలగించుపాటలబొగడెడి తెలుగును బాటించినచో
నాటగమారక సభలవి
బాటనుమార్చును చదువుల భవితవ్యమునన్
సభలు సంబురాలకే పరిమితం కాకుంటేనే ధన్యత!
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం :: దత్తపది (127)
రిప్లయితొలగించుఇచ్చిన పదాలు :: ఆట , పాట , బాట , మాట
కోట రాజశేఖర్ గారి పూరణ
సందర్భం :: ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహించే ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారి బాట బంగారు బాట అని చెప్పే సందర్భం.
ఛందస్సు :: మత్తకోకిల పద్యం.
*ఆట* లాడిన రీతి, తెల్గు మహా సభల్ నడిపించుగా,
*పాట* బాడిన రీతి, కైతల బండి వెల్గుచు నుండగా,
*మాట* నిల్పుచు, ముఖ్యమంత్రిగ మాన్యు డయ్యె, జగాన నీ
*బాట* జూడగ *చంద్రశేఖరు బాట బంగరు బాట యౌ.*
కోట రాజశేఖర్ నెల్లూరు.
తెలుగుపదాలనల్లికల తేనెలుజారెడు తీయధారలన్
రిప్లయితొలగించుజిలుగుల నింపమహాసభ జేతలమైతిమి నాటలాడుచున్
చెలువము మీరగపాటలు చిందులు వేసెడు బాటపట్టగా
వెలుగులుపంచెడు రీతిన వీనులవిందగు మాటలందునన్
తెలుగుపదాలనల్లికల తేనెలుజారెడు తీయధారలన్
రిప్లయితొలగించుజిలుగుల నింపమహాసభ జేతలమైతిమి నాటలాడుచున్
చెలువము మీరగపాటలు చిందులు వేసెడు బాటపట్టగా
వెలుగులుపంచెడు రీతిన వీనులవిందగు మాటలందునన్
నాదు భాష కర్ణాట భాషాదు లందు
రిప్లయితొలగించుఘనము తేట తెనుఁగు పాటవ నినదమ్ము
పడను మోమాటము వొగడఁ గడిఁదిగ నిఁక
నేలఁ దడఁబా టవని నింప నింక నీకు
[కర్ణాట భాష = చెవులలో నింపుగ తిరుగు భాష]
పరాయి భాషల మోజులో తెలుగు భాష కనుమరుగవుతుందేమోనన్న భయం అక్కరలేదు. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా వందల తెలుగు పుస్తకాలు వెలువడుతున్నాయన్న విషయం వింటూనే వున్నాం. అంతా మన చేతిలోనే వుంది. కొత్త తరానికి భాషావిలువలు నేర్పే బాధ్యత మనదే...🙏🏻
రిప్లయితొలగించుతే.గీ.
ఆటలకును లేదంతము, పాట తేరు
సాగుచుండు నెప్పుడు భువి జాగు లేక
బాట వీడునన్న భయపు మాటలేల
తెలుగు సభల వెలిగెజూడు తేనెలమ్మ!
ఆట యగున్ తెలుంగుసభలాడగ నేతలు రాజనీతితో,
రిప్లయితొలగించుపాటలు పద్యముల్ కథలు భవ్యముగా వినిపించి వేదిపై
బాటయె వాసినొంద కవివర్యులకెల్లరకున్, వివాదపున్
మాటల వార్తలే ప్రజకు మంచివినోదములైదురోజులున్
చిందులు వేయుచున్ జనుల చిత్తము దోచెను గొప్పగా కళా
రిప్లయితొలగించుబృందపు యాట పాటలును, పెద్దలు మెచ్చుచు నాడు మాటలు
న్నందరి డెందము గెలిచె హాస్యపు బాటన బల్కుచుండ నా
నందము వెల్లువెత్తనది నందన మయ్యెసభాంతరమ్మటన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించునా “శ్రీమదాంధ్ర సుందర కాండ” సప్తచత్వారింశ సర్గమున నేటి పద్యములలో నొకటి.
తొలగించుధ్వనియించెం భువి దద్దఱిల్లి నిలిచెన్ భానుండు హీనద్యుతిన్
ఘనుఁ డా వాయువు వీవ నొల్లఁడు మహా గ్రావాళి కంపించె నెం
డెను వారాశి నభమ్ము మ్రోఁగెఁ గడుఁ గాఠిణ్యేద్ధ చిత్తుల్ దశా
నన పుత్రానిల నందన ద్వయపు టానర్తమ్ము వీక్షించఁగన్
మూలము:
రరాస భూమిర్న తతాప భానుమా
న్వవౌ న వాయుః ప్రచాచల చాచలః.
కపేః కుమారస్య చ వీక్ష్య సంయుగం
ననాద చ ద్యౌరుదధిశ్చ చుక్షుభే৷৷5.47.13৷৷
ఆటపాటల తోడుత నందరచట
రిప్లయితొలగించుమాతృ భాషను పొగడుచు మాటలాడి
తెలుగు భాష యీ జగతిలో వెలుగులీన
బాట చూపిరి మనతెల్గు ప్రజలకచట
ఆటలునాడు పిల్లలయి నద్భుత రీతిగ నాంద్రవర్యులే
రిప్లయితొలగించుమాటల మాధురీ ప్రతిభ మంగళ దాయకమందు బంచుచున్
పాటలు పద్యముల్ నుడువు పండితవర్యుల సూక్తిరత్నముల్
బాటగ తెల్గుతేజము ప్రపంచ మహాసభలందుబంచుటౌ|
ఆటలునాడు పిల్లలయి నద్భుత రీతిగ నాంద్రవర్యులే
రిప్లయితొలగించుమాటల మాధురీ ప్రతిభ మంగళ దాయకమందు బంచుచున్
పాటలు పద్యముల్ నుడువు పండితవర్యుల సూక్తిరత్నముల్
బాటగ తెల్గుతేజము ప్రపంచ మహాసభలందుబంచుటౌ|
ఉత్పలమాల
రిప్లయితొలగించుపట్టిన బాట వీడడని బల్కుచు నుత్తము గూర్చి శేఖరుల్
జెట్టిగ నంకురార్పణముఁ జేయఁ బ్రపంచ మహాసభాలికిన్
దట్టదె చంద్రబాబుకును దల్లి తెలుంగను మాట? వేడుకల్
జుట్టిన నాట పాటలవి శోభలె? రాజుకు మచ్చ కాదొకో ?
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించుఆట వెలదులను చెప్పగ
పాటను మరిపించగలను పామరులను నీ
బాటన పయనించుట కే
మాటలు పద్దియ ములౌ సమాధిక కళగన్
పెద్దలు పోచి రాజు కామేశ్వరరావు గారు పూరణ పరిశీలించి సరిచేయ ప్రార్థన.
ఆటలందున మువ్వలందెల రవళులు
రిప్లయితొలగించువీనులవిందు గావించురీతి
తెలుగు మాటల సొబగు తీరుగా విలసిల్లు
వక్తల మాధుర్య వచన సరళి
బాటకిర్వంకల పరిమళ సుమరాజి
పళ్ళెరమ్ముల దాల్చు పలుకరింపు
పల్లెపాటల జానపద భంగిమలయందు
పరవశించిన నాట్యపాటవమ్ము
నేల నాలుగు చెరగుల నేలినట్టి
తెలుగు మాధుర్య సరస సందీప్తులకును
తెల్లబోయిన పరభాష తల్లడిల్ల
పంచె తృప్తిని తెలుగు ప్రపంచ సభలు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుగురువు గారు మేము దూరంగా ఉన్నాము కానీ తమరు దగ్గర నుండి చూస్తూ ఉంటారు. అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ పద్య రచన తోట వరకు మాకు బాట వేసిన మీకు పాదాభివందనములు.
రిప్లయితొలగించుతే గీ
బాట వేయగ గురువులు తోటవరకు
మాట శాసనమని నమ్మి మరులు గొనుచు
ఆటలాడుచు వ్రాసిన నాటవెలది
పాట వలె సాగిపోయెను తేట గీతి.
ఆటలవోలె పద్యముల నాడుచు పాడుచు సృష్టిచేసి యా
రిప్లయితొలగించుపాటల పల్లవిన్ జొరిపి భావ గభీరత బెంపుజేయ పూ
బాటగ తెల్గుపద్యములు పండిత పామర రంజకంబులై
మాటల మూటలై మిగిలె మాన్యత నొంది మహాసభన్ భళీ !!
ఆట దినమ్ములైదు,తెగులౌను తెలుంగు తొలంగునాపయిన్
రిప్లయితొలగించుపాటలు పాతవే మరల బాడుదురాడుదురౌర!నాటకాల్
బాటలుగానమాసనిసి రాకకు వేడుకలట్లు,వట్టివౌ
మాటలనాడ దిట్టలగు మాయల మాంత్రికశోభలీ సభల్.
...చంద్రమౌళి రామారావు,
బాపట్ల.
ఆట లాడి నట్టు లాహ్లాద కరముగ
రిప్లయితొలగించుపాట మధుర మొప్ప పాడి నటుల
పూల బాట లోన పోవు చందముననె
మంచి సభలు జరుపు మాట వింటి.
దత్తపది స్వార్థ రహితముగా :
రిప్లయితొలగించు******)()(*****
ఆటవికమగు దశ నధిగ మించియు,పొర
పాటనునది సుంత బరగ నీక
మాట పడకయె మొగ మాటపడక,నగు
బాటనునది లేక పండె సభలు!
ఆటంకములెదురైనను
రిప్లయితొలగించుపాటగ మురిపించు తెలుగు బలుకుచు సభలన్
బాటలు వేయుము సుకవీ!
మాటల నినదించు తెలుగు మాధుర్యమ్మున్!!!
రిప్లయితొలగించుఆటలు, పాటలు, పస గల
మాటలతో తెలుగు సభలు మైమరిపించెన్
బాటలు వేసెను తెలుగుకు
మేటిగ వెలుగొందు విధము మేదిననెపుడున్
రిప్లయితొలగించుఆటలతో కడు మధురపు
పాటలతో సభలు వైభవంబుగ జరిగెన్
మాట మధువగు తెలుగు గ్రహ
పాటును వీడి యభివృద్ధి బాటల నడిచెన్
రిప్లయితొలగించుఆటగదరా శివాయని
పాటల పూబాట వేసె ఫాలాక్షునికిన్
మాటల భరణి జిలేబీ
కోటల గట్టెన్ భళిభళి కోకనదునికిన్ !
జిలేబి