5, డిసెంబర్ 2017, మంగళవారం

సమస్య - 2537 (వేంకటపతికి భామలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వేంకటపతికి భామలు వేయిమంది"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

90 కామెంట్‌లు:

  1. స్వామి బ్రహ్మోత్సవాలకు సంబరముగ
    నాడి పాడిరి భక్తిని యద్భుతముగ
    తీరుగ ముడుపులిడి మ్రొక్కు దీర్చు కొనిరి
    వేంకట పతికి భామలు వేయి మంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      వేలకొలది భామలు మ్రొక్కు తీర్చుకున్నారన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భక్తిని నద్భుతముగ/ భక్తితో నద్భుతముగ" అనండి.

      తొలగించండి
  2. రామున కొకతే ధరణిజ భామ సీత;
    కృష్ణునికి వేన వేలుగ గృహిణు లైరి;
    విష్ణుని యవతారమ్మైన విమల హృదయ
    వేంకటపతికి భామలు వేయిమంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వేంకటపతికి ఇద్దరే కదా భామలు! "విష్ణుని యవతార మనుచు వినతు లిడిరి। వేంకటపతికి భామలు..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. సార్!

      “దశావతారాల లోని అందరి భార్యల సంఖ్య కలుపుకుంటే”...అని నా భావము...

      తొలగించండి
  3. ఒక్క సతితోన వేగంగ నోర్వ లేక
    మ్రొక్కు చుందురు జనులెల్ల ముక్తి కొఱకు
    యెదను వైశాల్య మెంతేని పదిల పఱచె
    వేంకట పతికి భామలు వేయి మంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కొఱకు నెదను..." అనండి.

      తొలగించండి
    2. ఒక్క సతితోన వేగంగ నోర్వ లేక
      మ్రొక్కు చుందురు జనులెల్ల ముక్తి కొఱకు
      నెదను వైశాల్య మెంతేని పదిల పఱచె
      వేంకట పతికి భామలు వేయి మంది

      తొలగించండి
  4. చెలియ పద్మావతీదేవి చెట్టపట్టు
    సరసవరునకు కైసేత సలుపగ తిరు
    వేంకటపతికి భామలు వేయిమంది
    కార్యమగ్నలుగ నయిరి కమ్రరీతి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      సేవాకార్యమగ్నులైన భామల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. అర్చకుండు సహస్రనామార్చనంబు
    ప్రీతిగ సలుప నెవ్వరి పేర్లవి యని
    పిల్లడడుగ దేవుని సతి పేర్లివి యన
    తెలిసి తెలియని పిల్లడు పలికె నిటుల
    వేంకటపతికి భామలు వేయిమంది!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారు,
      అర్చకుడు చేసిన సహస్రనామార్చన లక్ష్మీదేవిదా? అయితే మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      "నామార్చనమున। శ్రీసతిని గొల్వ నెవ్వరి..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  6. ఆర్తిదొలగించు వేళల నమృతకరుడు
    పాపరాశిని గాల్చగ పావకుండు
    పద్మజ మదినిదోచిన భానుడనెడి
    వేంకటపతికి భామలు వేయిమంది!

    భామలు = సూర్యకిరణములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్తినడగించు వేళల నమృతకరుడుగా చదువ ప్రార్ధన!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      వేంకట శబ్దానికి ఉన్న 'పాపనాశకుడు' అన్న అర్థాన్ని అన్వయించుకుంటే సూర్యుని ప్రస్తావనతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  7. పురుషుడొక్కడె! పరమాత్మ !పూవుబోడి
    తెలుసు కొనవమ్మ యెల్లరు తెమ్మరవలె
    వీచు పడతుకల మతని వెనుక సూవె,
    వేంకటపతికి భామలు వేయిమంది !

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    ఇంటికిని చుట్టములు రాగ యింతి దయన
    వారికన్నపానాదులు వరలుచుండు
    జగమునకు తిండి వడ్డించ జాలునట్టి
    వేంకటపతికి భామలు వేయిమంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "రాగ నింతి దయను.." అనండి.

      తొలగించండి
  9. రామున కొకతే సతి యిద్దరందురుగద
    వేంకటపతికి, భామలు వేయిమంది
    వాసు దేవునకనుచును భక్త జనులు
    విశ్వసింతురు గాదుటే విశ్వమందు

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    పాపముల కూరగాయలు పట్టికోయ
    కోరికల వంటలందించి కూర్మి నెరపు
    సందడే సందడట కొండ చరియలందు
    వేంకటపతికి భామలు వేయి మంది!(వేంకట రమణా,గో.(ఓ.ఓ.ఓ)విందా!!)

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    వే.ధ.వ అంటే వేయి సం॥లు ధనముతో వర్ధిల్లు మని అనుకునే విద్యార్థుల భాష్యం మార్చుకున్న వైనము:
    "వేధవ"నునట్టి మాష్టారు "వేభవ" నగ
    పిల్ల లెల్లరు విస్మయ(నాశ్చర్య)బేల లైరి
    "వేయి భార్యల వర్ధిల్ల వీలు గదర
    వేంకటపతికి భామలు వేయి మంది" అని ఒక మొద్దబ్బాయి సమాధానం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'విస్మయ బేలలు' దుష్టసమాసం.

      తొలగించండి
    2. డా.పిట్టా
      (...)లోని "విస్మయ"కూడా దుష్టురాలేనా?ఛందస్సుకు కుదిరింది మరి,ఆర్యా.

      తొలగించండి
  12. కలిని వైకుంఠ మైయొప్పు నిలను గాన
    నిందు వసియించు భాగ్యమ్ము నిమ్మటంచు
    మ్రొక్కు చుండిరి చక్కని చుక్క లదిగొ
    వేంకటపతికి భామలు వేయిమంది.

    మ్రొక్కుబడులను ముడుపులన్ లెక్కపెట్ట
    మాకు నవకాశ మీయవే మహితతేజ
    యనుచు మ్రొక్కుచు నుండిర త్యధిక భక్తి
    వేంకటపతికి భామలు వేయిమంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. రామునికి భార్య యొక్కతే రమణి సీత,
    సతులు శ్రీదేవి భూదేవి సరస గతిని
    వేoకట పతికి , భామలు వేయిమంది
    కన్న అధికముగవలచె వెన్న దొంగ
    నందరును ముదమునిడెడు నాట్య మాడి

    రిప్లయితొలగించండి
  14. ఇద్దరందురు భార్యలు నెంచి దెలుప
    వెంకటపతికి !భామలు వేయి మంది
    ఉత్సవాలలొ నాడిరి యున్న తాన
    భక్తి తత్వాన రక్తిగా శక్తి యుతులు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఉత్సవాలలో... అనండి. లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి


  15. చెంగట యిరువురయ్యిరి చెంగలువగ
    వేంకటపతికి; భామలు వేయిమంది
    యంబరమణికి ; కాంతుల కంతు లేదు
    విను జిలేబియ వినువీధి విభుని దాయె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చెంగట నిరువు" రనండి.

      తొలగించండి
  16. స్వామి తిరువీధి విహరించు సమయమందు
    కన్నులారగ తిలకించి కాంక్షదీర
    చేరిరచ్చట భక్తిగ సేవజేయ
    వేంకట పతికి భామలు వేయిమంది!

    రిప్లయితొలగించండి
  17. ఉత్సవం బుల వేళ లోనుత్స హించి
    వేంకట పతికి భామలు వేయి మంది
    యాడి పాడు చు భక్తులైయ ల రు చుండ
    కన్నుల కు విందు సేయ దే కమ్మ గాను

    రిప్లయితొలగించండి
  18. (ఇక్కడ వేంకటపతి అను రచయితకు జరిగిన సన్మానము ప్రస్తావింపఁబడినది)

    అబలు రైనట్టి స్త్రీలపై యాగడముల
    ఖండనము సేయు వ్యాసముల్ మెండుగాను
    వ్రాయ సన్మానమును జేయ వచ్చినారు
    వేంకటపతికి భామలు వేయిమంది.

    రిప్లయితొలగించండి
  19. డా..ఎన్.వి.ఎన్.చారి 9866610429
    ప్రకృతి పురుష సంభావనం బైన సృష్టి
    యందు పరమాత్మ సతులైన వాత్మ లన్ని
    ఙ్ఞాన దృష్టిలో వేవేలు గాన,కాదు
    వేంకటపతికి భామలు వేయిమంది

    రిప్లయితొలగించండి
  20. మైలవరపు వారి పూరణ

    తిరువేంకటాధీశ ! దిక్కు నీవే యంచు
    మ్రొక్కి నడచి కొండనెక్కువారు !

    కోనేటిరాయడా ! గోవింద! గోవింద
    యని పుష్కరిణిని జేరి మునుగువారు!

    వైకుంఠవాసుడా ! వరమిమ్ము మాకంచు
    నంచితభక్తి దర్శించువారు !

    వాసుదేవా! యంచు వాహనశోభలన్
    గనులార తృప్తిగా గనెడివారు !

    ధరణి బ్రహ్మోత్సవమ్ములు దనరుచుండ
    రమ్యనాట్యాల మంగళారతులనిడిరి
    మాడవీథుల నూరేగు మహితుడైన
    వేంకటపతికి భామలు వేయిమంది"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి



  21. ఎక్కగోరుచు గిన్నీసు బుక్కులోన
    మ్రొక్కు దీర్చగ నెంచుచు నొక్కచోట
    తలల నీలాలనిచ్చిరి తన్మయమున
    వేంకటపతికి, భామలు వేయిమంది.

    రిప్లయితొలగించండి
  22. పద్మ సంభవునకు భామ వాణి యొకతె!
    భవుని కిద్దరు భామలు !! పద్మనాభు
    డఖిల జీవులగావ ననంతు డయిన
    వేంకటపతికి, భామలు వేయిమంది !!!

    రిప్లయితొలగించండి
  23. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    వే౦కటపతికి భామలు వేయి మ౦ది

    కాదు గద ! యలవేలు మ౦గమ్మ మరియు

    జనని పద్మావతీదేవి ; సత్కవీ౦ద్ర !

    కోరికలపూలు జల్లుచు కొలుచునట్టి

    మానినీమణుల్ వేలాది మ౦ది గలరు

    రిప్లయితొలగించండి
  24. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: *శ్రీవారి 24 సేవలు*

    వెదుక *బ్రహ్మాండాన
    వేంకటేశ్వరునికి*
    *సాటి దేవుడు లేడు* సత్య మనగ,
    వర *సుప్రభాతసేవ* యు,
    *విశ్వరూపద**ర్శనము*, *తోమాలసేవ*, *నిజ పాద*
    *దర్శనము* ను, *నష్టదళ పాదపద్మాల*
    *యర్చన*, *నిత్యకల్యాణము*, ఘన
    *బ్రహ్మోత్సవాల్*, *తిరుప్పావడ సేవ*, *వ*
    *సంతోత్సవము*, *విశేష మగు పూజ*,
    *డోలోత్సవము*, గన *పూలంగి సేవ* యు,
    *నూంజలి సేవ* యు, *నుట్టి యుత్స*
    *వము* ను, *పవిత్రోత్సవము*, *పుష్పయాగము*
    *తిరువీధి యుత్సవ* దివ్య సేవ,
    ఘన *తిరుమంజనము* ను, *శుక్రవారాభి**షేకము*, *కనుల దర్శించు సేవ*,
    అమల *సహస్ర నామార్చనము*, *సహస్ర*
    *కలశాభిషేక*, *మేకాంత సేవ*,
    లనెడి పలుసేవ లలరెడు, నందులోన

    *శేషశాయి కలంకార సేవలందు*,
    కూర్మి నొక్కొక్క దీప మొక్కొక్క భామ
    యన, సహస్ర దీపములతో నర్చ జేయ,
    *వేంకటపతికి భామలు వేయిమంది.*

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
  25. వేంకటపతి కి భామలు వేయిమంది
    వేయిమందియ ,పదునాఱు వేలమంది
    భామలమగడు ,నరయగభక్త కోటి
    కిసులభుండు ను, వరదుడు భాసురుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో ప్రాసయతి తప్పింది. "భక్తకొటి। సులభుడును వరదుడును భాసురు డనఘుడు" అందామా?

      తొలగించండి
  26. నగుచు శ్రీదేవి భూదేవి నడుమ నున్న
    వేంకటపతికి భామలువేయిమంది
    కలసి కోలాట మాడుచు కదము త్రొక్కి
    దీప కాంతుల నాడుచు ధూప మిడిరి

    రిప్లయితొలగించండి
  27. అంకమున నునిచి సుతుని శంక లేక
    యంకఁ బతి నిలుచుచు నుండ బింకము లగు
    సంకటముల వేడెడి భక్త జనులు మించి
    వేంకటపతికి భామలు వేయిమంది

    రిప్లయితొలగించండి
  28. వ్రాయు గోవింద నామాల వహుల బట్టి
    సన్నుతించుచు స్వామికిశరణులిడుచు
    ఎక్కుచుండిరి కొండలన్ మ్రొక్కుదీర్చ
    వేంకటపతికి, భామలు వేయిమంది!!!

    వహి= పుస్తకము

    రిప్లయితొలగించండి
  29. ఎడమచేతివాటమ్ముతోనెదురులేని
    స్పిన్ను బౌలరుగా పెద్ద పేరుగాంచ
    పెళ్ళి చేసుకొనమనుచు వినతులిచ్చె
    వేంకటపతికి భామలు వేయిమంది
    (ఒకప్పటి  స్పిన్ బౌలర్ వేంకటపతిరాజు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వినతులిచ్చె' అన్నది ఏకవచనం. అక్కడ "వేడుకొనిరి" అనండి.

      తొలగించండి
  30. అన్నమయ్యెయె మున్నుతానల్లినట్టి
    కీర్తనలు యింతులై ఘనకీర్తి నొంది
    చెలగి శ్రీదేవి భూదేవి చెంతజేర
    వేంకటపతికి భామలు వేయిమంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కీర్తనలు+ఇంతులై' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "కీర్తనము లింతులై..." అనండి.

      తొలగించండి
  31. హరి యలంకార ప్రియుడని విరులఁ దెచ్చి
    వేల మాలలె గాక తోమాలలల్లి
    చేర్చ నానంద నిలయమ్ము కూర్చు వారు
    వేంకట పతికి భామలు వేయిమంది

    రిప్లయితొలగించండి
  32. ప్రముఖ నటుడు వేంకట పతి పత్రికలకు
    పరిణయము కొర కీయగా ప్రకటనలను
    వెల్లు వెత్తగ పంపిరి వినతులెన్నొ
    "వేంకటపతికి భామలు వేయిమంది"

    రిప్లయితొలగించండి
  33. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వేంకటపతికి భామలు వేయిమంది
    నిలువు దోపిడి నిచ్చుచు కొలిచి నంత
    నంజలించితి నేనున్ను యాప్రభువుకు
    యాపదల నుండి కడతేర్చు నచ్యుతునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈరోజు తెలుగు మహాసభల కార్యాలయంలో మీకు పంపిస్తున్న ఆహ్వానాన్ని చూశాను.

      తొలగించండి
    2. రాజారావు గారి పూరణలో నాకు తోచిన విషయాలు ప్రస్తావిస్తున్నాను. "నేనున్ను యాప్రభువుకు
      యాపదల నుండి"
      అన్న పదసమూహ మేమీ బాగా లేదు. మొదట నేనున్న అన్నది సుష్టువు కా దనుకుంటాను. ఈ మధ్య అనవసరమైన అసందర్భమైన నకారద్విత్వప్రయోగాలు కొల్లలుగా వ్రాస్తున్నారు ఆధునిక కవులూ అభ్యాసకులూ! అపైన వెంటనే వచ్చిన యడాగమద్వయం కూడా దోషయుక్తమే. తెలుగు మహాసభల సందర్భంగా ఆహ్వానం అందుకొంటున్న వారి నుండి యిట్టి పూరణ ఆలోచనీయం. ఈ పద్యాన్ని శంకరయ్య గారు సరిగా పరిశీలించి యుండవలసిందని నా అభిప్రాయం. బాగుండకపోవటానికి నా ఉద్దేశంలో యేవి కారణాలో చెప్పాను కాని ఈపద్యం నిర్దుష్టం అని పండితాభిప్రాయం ఐతే కావచ్చునేమో. నేనేమీ పండితుడను కాను కాబట్టి యట్టి పక్షంలో క్షంతవ్యుడను.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. శ్రీ శ్యామలరావు గారికి నమస్కారములు. మీ పరిశీలన అద్భుతం. మీ అభ్యంతరాలు నిజమే. నాదే పొరబాటు. "నేనున్ను" అనది సాధువు కాదు. అలాగే యడాగమం గూడా తప్పే. పూర్తిగా ఇది పొరబాటే. దానిని మార్చాను. గమనించండి. మీ సూచనలనందించండి. మార్చిన పద్యాన్ని పరిశీలించండి.

      వేంకటపతికి భామలు వేయిమంది
      నిలువు దోపిడి నిచ్చుచు కొలిచి నంత
      నంజలించితి భక్తితో నా ప్రభువుకు
      నాపదల నుండి కడతేర్చు నచ్యుతునకు

      తొలగించండి
    5. రాజారావు గారూ, మీరు తిరుగవ్రాసిన పద్యపాఠం బాగుంది. కొలిచినంత యనునది కొలువగాంచి యని మార్చితే మరింతగా శోభిల్లవచ్చునేమో.

      తొలగించండి
    6. మీరన్నది నిజమే. మీ సూచన పాటిస్తాను.

      తొలగించండి
    7. శ్యామల రావు గారూ,
      ధన్యవాదాలు.
      ********
      రాజారావు గారూ,
      ప్రభునకు... అని ఉండాలి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  34. సంకటములు బాపి సతము శాంతి నొసగు
    వెంకటపతికి భామలు వేయిమంది
    భక్తి శ్రద్ధలతోడను పగలు రేయి
    కొలుచు చుందురు ముదమున కువలయమున.

    వెంకటపతికి భామలు వేయి మంది
    చేరి నీరాజనము లిచ్చి చింత దీర్చు
    మనుచు వేడుకొనుచు నుందు రార్తి తోడ
    భక్తవత్సలుడౌ హరిన్ వసుధ యందు.

    మూడవ యుగము నందున ముదిత సీత
    యొకతె యాలియయ్యె నుగద యుత్సుకతన
    నిరువురు సతులై మురిసిరి యిద్ధరణిన
    వెంకటపతికి,భామలు వేయిమంది
    కొలువ కృష్ణుడు ముదమందె గోకులాన.

    రిప్లయితొలగించండి
  35. సేవికలు వేల్పు వెలదులు సిరికి,గాన
    సిరికిభర్తయై చెలగిన తిరుమలగిరి
    వేంకటపతికి,భామలు వేయిమంది
    దినదినమ్మును సేవి౦తు రనఘులార

    రిప్లయితొలగించండి
  36. తేః ద్వాపరమునందు కృష్ణుడౌ ధరణి విభుడు
    వేంకటపతికి భామలు వేయిమంది
    సత్యయుగమున లక్ష్మియే జాని సుమ్ము
    త్రేతయుగమందు దేవేరి సీత యయ్యె

    రిప్లయితొలగించండి