6, డిసెంబర్ 2017, బుధవారం

సమస్య - 2538 (రాయలకున్ దెలుఁగు రాదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రాయలకున్ దెలుఁగు రాదు రసముం గ్రోలన్"
(లేదా...)
"రాయల వారికిన్ దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగన్"
(బులుసు శ్రీరామమూర్తి అవధాని గారు పూరించిన సమస్య)

114 కామెంట్‌లు:

 1. మాయని వ్యంగ్యపద్యముల మంజులభంగిని సత్కవుల్బల్క,
  తీయనితెల్గుపల్కుబడితేనెలు పారగ మాటిమాటికిన్,
  పేయసు వంటివారటులె పెద్దగు కన్నుల జూచుచుండిరా
  రాయల,వారికిన్ దెలుగు రాదుగదా!రసమున్ గ్రహింపగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదం చివర గణదోషం. "మంజులభంగి కవుల్ వచింపగా" అందామా?

   తొలగించండి
 2. ప్రాయము నందున నాంగ్లము
  వ్రాయుట పలుకుటయు నేర్చి భారత భాషల్
  ఛాయగ తెలియని యభినవ
  రాయలకున్ దెలుఁగు రాదు రసముం గ్రోలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ అభినవ రాయల పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 3. ఓయి తియతీపి గద కవి
  రాయలకున్ దెలుఁగు; రాదు రసముం గ్రోలన్,
  మీయయ్యరుకున్నైనన్
  నీయవ్వారముల నోర్చి నిలిచిరి గదవే :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగుంది. కాకుంటే కొన్ని వ్యావహారిక పదాలున్నాయి.

   తొలగించండి
  2. నవ్వాప జాలని కవిత
   సవ్వాలుకు మించియుండి సవ్వడి సేయన్
   తువ్వాలు గట్టి మీతో
   యవ్వారము సేయువారు యాడ జిలేబీ?

   యవ్వారము = జగడం

   తొలగించండి


  3. జీపీయెస్ వారు కూడా యవ్వారానికొచ్చేసారు :)


   చీర్స్
   జిలేబి

   తొలగించండి
 4. హాయిని గొలిపెను గదరా!
  తీయగ ; విసుగు మన దరికి ; తేనెలు గురియున్,
  కోయిల పలుకుల సమౌ;
  రాయలకున్ దెలుఁగు రాదు రసముం గ్రోలన్"
  **)(**
  అన్వయము :
  హాయిని గొలిపెను గదరా రాయలకున్ దెలుగు;
  విసుగు మన దరికి రాదు తేనెలు గురియున్;
  కోయిల పలుకుల సమమౌ,రసమును గ్రోలన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   'సమమౌ' అని ఉండాలి కదా!
   మీరు క్రమాలంకార పూరణ చేసినపుడు చివరిపాదంలో కామాలు పెట్టండి (రాయలకున్ దెలుగు; రాదు; రసముం గ్రోలన్). లేకుంటే అర్థం కాకుండాపోయే ప్రమాదం ఉంది.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  3. ధన్యవాదాలార్యా !"సవరణ" (సమమౌ)వాట్సాప్ లో చేసి బ్లాగులో మరిచాను. సమస్యాపాదంలో కామాలు రెండింటిలోనూ మరిచాను.

   తొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరించ నున్నవి !

  శ్రీకృష్ణదేవరాయల సభలో :

  01)
  _______________________________

  తీయని తెల్గు పద్య ఝరి - దేల్చు చు ముంచుచు నష్టదిగ్గజాల్
  హాయిని గూర్చుచున్ మిగుల - నాదర మందుచు కీర్తి దెచ్చిరే
  రాయల వారికిన్ ! దెలుఁగు - రాదు గదా రసమున్ గ్రహింపగన్
  సాయము కోసమై సభను - సాగిలు చుండు విదేశి వారికిన్ !
  వాయస మొప్పునే పికపు - పాటల, నాటల, మంజు భాషణన్ ?
  _______________________________

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  బోయకు బక్షుల వేటయె
  ఆయాంగ్లేయులవి కనులు నాస్తుల పై,నా
  డాయముగొని బడవేసిన
  రాయల1కున్ దెలుగు రాదు రసమున్ గ్రోలన్!
  (1.రాయడు ,రాయలు,రాజులు,ఆంగ్లేయ పాలక వర్గ అధికారి,అధికారులకు)

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  పాయలు తెల్గు, కన్నడము భాషలు సంస్కృత నామ పాదుకున్
  బోయగ నీరు,వృక్షమయె పూసిన పూలు ఫలమ్ములై చన
  న్నీ యమగోల యేల? రస నిష్ఫల వాద మముక్తమాల్యదా
  "రాయలవారికిన్ దెలుగు రాదు గదా రసమున్ గ్రహించగన్"

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  గ్రహింపగన్, సమస్యా పాదములో ఒప్పుగా జేర్చ మనవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'నామ పాదు' దుష్టసమాసం.

   తొలగించండి
  2. డా.పిట్టా
   "సంస్కృతమన్న పాదుకున్"అని చదువ ప్రార్థన,ఆర్యా}

   తొలగించండి

 9. సుబ్బారావు గారే శరణ్యం :)


  న్యాయము గాదు కంది వర ! నాణ్యము గా జనులెల్ల నేలుచున్
  స్వీయము గాను కావ్య ముల చిప్పిలు తెల్గున గూర్చె నాతడే !
  తా యెలమిన్గనన్ తెలుగు దైన్యము వీడక నిల్చె నయ్య! యే
  రాయల వారికిన్ దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగన్?

  సావేజిత
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   తప్పించుకొని వెక్కిరించే విధానాన్ని సుబ్బారావు గారు బాగానే నేర్పుతున్నారు అందరికీ!

   తొలగించండి
 10. మాయా మర్మము లెరుగని
  రాయలకున్ దెలుఁగు రాదు రసముం గ్రోలన్
  వేయి యుగంబులు గడచిన
  శ్రేయము తరగదు కావ్య శేముషి యనగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ భావం అర్థం కాలేదు.
   చివరి పాదంలో గణదోషం. "శ్రేయమ్మె తరుగదు కావ్య..." అనండి.

   తొలగించండి
  2. మాయా మర్మము లెరుగని
   రాయలకున్ దెలుఁగు రాదు , రసముం గ్రోలన్
   ధ్యేయము తెలుగును లెస్సను
   శ్రేయమ్ము తరగదు కావ్య శేముషి యనగన్

   తొలగించండి
 11. ఆయాంగ్లేయుం డిట్లనె
  జ్ఞేయం బో పౌరులార! నిజభాషలలో
  నాయన లెస్సనె(లెస్సు)వినరే
  రాయలకున్ దెలుఁగు రాదు రసముం గ్రోలన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. రాయలరాజ్యమందు మది రంజిలజేయుచు కావ్యరాజముల్
  తీయనిసాహితీఝరుల దేనెలుపారగతెన్గుభాషలో
  కాయగపండువెన్నెలలు, కాంచక, పల్కెదవేలనో కవీ!
  రాయలవారికిన్ తెలుగురాదుకదా రసమున్ గ్రహింపగన్

  రిప్లయితొలగించండి
 13. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  రాయంచకు రాదునడక
  కోయిలకున్ పాట రాదు కుదిరిన కోతల్
  గోయను నెమలికి నాట్యము
  రాయలకున్ తెలుగు రాదు రసమున్ గ్రోలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   కోతలరాయుని మాటలుగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. 1రాయల వేషా న నొక డు
  రాయల వలె నటన యందు రాణించె గదా
  వ్రాయు ట చదు వు ట నేర్వని
  రాయల కు న్ తెలుగు రాదు రసము లు గ్రోలన్

  రిప్లయితొలగించండి
 15. మైలవరపు వారి పూరణ

  మాయని తెనుంగు చిరునా..
  మా యన మా రాయలొకడె మహిలో గన ., న...
  న్యాయము గదరా ! యిట్లన
  " రాయలకున్ తెలుగు రాదు రసమును గ్రోలన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మైలవరపు వారు కూడా సుబ్బారావు గారి పంథా లోకి వెళ్ళిపోయారివ్వాళ :)


   జిలేబి

   తొలగించండి
  2. మైలవరపు వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 16. మా అయ్యరు గారికి తెలుగే రాదు ఎట్లా పరిచయం చెయ్యడం ? :)


  స్వీయముపొత్తముల్ చదువ చింతయులేదు! విభావ మెట్లయా
  జేయుట! నామగండనుచు చెప్పుట యెట్లు, కవీశ శంకరా,
  రాయల వారికిన్? దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగ
  న్నీయనయత్నముల్ గనడు నిండుసభాస్థలి యయ్యెగాదయా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హాయన హాయ్ హాయనుచును
   కూయగ నాంగ్లంబునందు కోయిలరీతిన్
   సోయగ మనియెడు కోతల
   రాయలకున్ దెలుగురాదు రసముం గ్రోలన్

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ ఆత్మాశ్రయ పూరణ బాగున్నది. అభినందనలు.
   ********
   సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  3. అయ్యో!జిలేబి వగవకు
   మయ్యరులందరు సతులకు ననుకూలురవన్
   నయ్యది నెంతయు వింతగు
   యియ్యది సహజము సుఖమును నింతుల పట్లన్

   ఆయనకు కూడ తెలుగువస్తే మీకవిత్వంలో తప్పులు వెదుకుతారు , కనుక రాకపోవడమే సుఖం!
   ఏమంటారు? వంటవచ్చిన మగడు వంటలో వంకలు వెదకినట్లు!

   తొలగించండి
  4. "...సతులకు ననుకూలురుగా। నయ్యది యెంతయు వింతగు । నియ్యది..." అనండి.

   తొలగించండి
  5. ధన్యవాదములు గురుదేవా! సవరింతును.


   అయ్యో జిలేబి! వగవకు
   మయ్యరులందరు సతులకు ననుకూలురుగా
   నయ్యది యెంతయు వింతగు
   నియ్యది సహజము సుఖమును నింతులపట్లన్ !

   తొలగించండి


  6. సీతాదేవి గారు :)

   అదురహో !

   వంట యిలాఖా మా అయ్యరుగారిది :)
   మనదంతా పెత్తనమే :)

   http://funzilebi.blogspot.com/2013/05/blog-post.html

   చీర్స్
   జిలేబి

   తొలగించండి
 17. ఆయన వర్గము వారని
  రాయలనుచు పేరు చివర వ్రాయుట వరకే
  సీయోల్ నివాసికి నరస
  రాయలకున్ దెలుఁగు రాదు రసముం గ్రోలన్!

  రిప్లయితొలగించండి
 18. మాయని కీర్తి మిగిల్చెను
  రాయలకున్ దెలుగు , రాదు రసముల గ్రోల
  న్నీ యాధునికుల కాంగ్లపు
  మాయన మునిగిన సమాజ మందున గనన్

  రిప్లయితొలగించండి
 19. కోట రాజశేఖర్ గారి పూరణ

  సందర్భం :: *ఆంధ్రభోజుడు* అని ప్రసిద్ధి జెందిన శ్రీ కృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యద గ్రంథ రచనకు కారణం చెబుతూ, ‘’శ్రీకాకుళాంధ్రదేవుడు కలలో కనిపించి నీవు మదాలసచరిత్ర వంటి ఎన్నో గ్రంథములను సంస్కృత భాషలో వ్రాసినావు. తెలుగు నీకు కష్టం కాదు గదా. గోదాదేవిని గురించి తెలుగులో ఒక గ్రంథాన్ని వ్రాయి.’’ అని చెప్పినట్లుగా గ్రంథారంభంలో వ్రాసికొన్న సందర్భం.

  శ్రీయుతు *డాంధ్రదేవు* డనె ‘’ *కృష్ణ నృపాలక!* *సంస్కృతమ్మునన్*
  మాయని కీర్తి వ్రాసితివి మాన్య *మదాలస* ముఖ్య గ్రంథముల్,
  వ్రాయుము తెల్గునన్ కృతిని , వ్రాయనిచో ప్రజ లందు రిట్లు ‘ *శ్రీ*
  *రాయల వారికిన్ తెలుగు రాదు గదా, రసమున్ గ్రహింపగన్.*’

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
 20. గురుమూర్తి ఆచారి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,

  రాయలు దిగ్గజమ్ము లన రాజిలు సత్కవివర్యులన్ సభన్

  జేయగ బోషణమ్ము , బ్రతిషేధ మొనర్చిరి > శ్వేతకాయు లౌ

  రా ! యలవారికిన్ దెనుగు రాదు గదా రసమున్ గ్రహి౦పగన్ |

  కోయిల పాట కాకములకున్ రుచియి౦చునె , యె౦చిచూడగా ! !

  { ప్రతిషేధము = అవహేళనము }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   "ఔరా! యల వారికిన్" అంటూ వైవిధ్యమైన విరుపుతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  2. గురుమూర్తి గారు ! చక్కని పూరణ ! అభినందనలు !వాట్సాప్ "శంకరాభరణం" గ్రూప్ లో ప్రచురించటాని కనుమతిస్తారా?

   తొలగించండి
  3. గొప్ప విరుపు!!అభినందనలు ఆచారిగారూ!!

   తొలగించండి
  4. జనార్దన రావు గారూ,
   ఇక్కడి పూరణలను అక్కడ, అక్కడి పూరణలను ఇక్కడ పెట్టడంలో ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. ప్రకటించవచ్చు.

   తొలగించండి
 21. ఊయల లూగినట్టు లొహొహోయని మెప్పుల బొందగా దగున్
  రాయల వారికిన్ ; దెలుగు రాదుగదా రసమున్ గ్రహింపగన్
  మాయని మచ్చ దెచ్చుచును మాటికి వాడుచు నన్య భాషలన్
  హేయము జేయుచున్ దెనుగు హీనము జేసెడి నట్టివారికిన్.

  రిప్లయితొలగించండి
 22. ఆయన యౌత్తరాహు డట ఆ సభ మెచ్చెడి వేళ విష్ణుచి
  త్తీయము నాత డేమొ మరి తెల్ల మొగమ్మున జూచి యంతలో
  ధీయుత వందనమ్ము లని దిగ్గున లేచెను, నవ్వు పుట్టె నా
  రాయలవారికిన్, తెలుగు రాదుకదా రసమున్ గ్రహింపగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మిస్సన్న గారూ,
   మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
   మీరు పంపిన అవధాని గారి పూరణను సేవ్ చేసుకోలేదు. పొరపాటున మీ మెయిల్ డిలేట్ అయింది. వీలైతే ఆ పద్యాన్ని ఇక్కడ పోస్ట్ చేయండి.

   తొలగించండి
  2. తప్పకుండా గురువు గారు.

   శ్రీయుతు డాంధ్రభోజుడు వచించి రచించిన యట్టి'విష్ణుచి

   త్తీయము' కావ్య మష్టకవి దిగ్గజముల్ వినగా పఠింప చై

   నీయులు వచ్చిరా సభకు నిర్మల రీతిని చూచుచుండిరా

   రాయల----వారికిన్ తెలుగు రాదు కదా రసమున్ గ్రహింపగన్ .

   తొలగించండి
 23. ఊయల నాడె రాయసపు యోజన జేసెడు రాజహంసయౌ
  రాయలవారికిన్ దెలుగు రాదు గదా రసమున్ గ్రహింపగన్
  గేయము రాదువానికను గేలగు మాటలు మూర్ఘులందురున్
  వాయము శుష్కవాదనలు వారు రసజ్ఞులు దేవరాయలున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామమోహన్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురుమూర్తి ఆచారి
   ,,,,,,,,,,,,,

   గురువు గారికి , జనార్ధనరావు గారికి మరియు శ్రీమతి సీతాదేవి గారికి

   నమస్క్తారములు -- ధన్యవాదములు

   తొలగించండి
 24. మాయలమాటలెయీయవి
  రాయలకున్దెనుగురాదురసమున్ర్గోల
  న్నాయతరీతినినరయగ
  రాయలెయిలమేటికవియ రమణా!వింటే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఈరోజు బ్లాగులో రెండు మూడు సార్లు మీ ప్రస్తావన వచ్చింది. ఒకసారి పై నున్న వ్యాఖ్యలను పరిశీలించండి.

   తొలగించండి
 25. మా యన్నను శ్రీనాథునిఁ
  బ్రాయముననె సంస్కృతాంధ్ర భాషల లోనన్
  రాయనిఁ బొగడఁగ యవనపు
  రాయలకున్ దెలుఁగు రాదు రసముం గ్రోలన్


  శ్రేయము గోరి యింపుగను స్వీయ మనోజ్ఞ వరాంధ్ర భాషకున్
  హాయన మందు నొక్కపరి యాంధ్ర మహాసభ నుత్సహించిరే
  యాయె మహాప్రమాద మిట నాయతి థీంద్రులఁ జూడ వేగమున్
  రా యల వారికిన్ దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణలలో తప్పకుండా ఏదో ఒక విశేషం, వైవిధ్యం ఉండడం సాధారణం. అలాగే ఈనాటి పూరణలలో కూడా ఉన్నాయని నమ్ముతున్నాను.
   అయితే మొదటి పూరణలో 'రాయనిఁ బొగడఁగ' అన్నది, రెండవ పూరణలో 'రా యల వారికిన్' నాకు దురవగాహంగా ఉన్నాయి. దయచేసి వివరించండి.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   సంస్కృతాంధ్ర భాషల లోనన్ రాయఁడు, కవిసార్వభౌముని యని నాభావము.

   చూడ రా వేగమున్ అల వారికి ( అతిథి పుంగవులకు) నని నాభావము.
   పొరపాటున తెలుగు భాష రాని వారిని ముఖ్యాతిథులుగ పిలిచారని భావము.
   ఎంత వరకు కృతకృత్యుఁడ నయ్యానో తెలుప గోర్తాను.

   తొలగించండి
 26. రాయల వారికి న్ దెలుగు రాదు గదా రసమున్ గ్రహింపగన్
  మాయని మచ్చగా బలుక మాన్యుల కెట్లుగ దోచె నోగదా
  రాయల వారనంగ నిల రాశిగబోసిన మేటి రత్నమే
  యాయనఘున్సదా తమిని హర్షము తోడన బ్రస్తుతించెదన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మాన్యుల కెట్టుల దోచెనో' అనండి, బాగుంటుంది.

   తొలగించండి
 27. స్త్రీయందు జాలి చూపిన
  రాయల పై పద్యములను వ్రాసితి చదువన్
  తీయగ నా రాం మోహన్
  రాయలకున్ దెలుఁగు రాదు రసమున్ గ్రోలన్ "
  (రాజా రాం మోహన్ రాయ్ పై ఒక కవి పద్యాలు రాశాడు కానీ ఆయనకి తెలుగు రాదని , ఆస్వాదించలేడని బాధపడినట్లు ఊహ)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధనికొండ వారూ,
   మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 28. గురువు గారికి నమస్సులు.
  సోయగమునకవితతెలుసు
  రాయలకున్, తెలుగు రాదు రసమున్ గ్రోలున్
  ప్రాయపు బిడ్డయు నాంద్రుని
  మాయని మమతలు విదేశి మాటకు సుమతీ.

  రిప్లయితొలగించండి
 29. గురువులు శ్రీకంది శంకరార్యులకు వందనములు.

  శ్రేయముగూర్చ సత్కృతినజేయముగా లిఖియించి జూపె తాఁ
  ధీయుతుడై వచో భవ సుధీయుతుడై - సుగమంబు గాదె యా
  రాయల వారికిన్ దెలుఁగు, రాదు గదా రసమున్ గ్రహింపగన్
  సాయములేక తత్కృతి విషంబుల గాంచ నిఘంటు లేమిచేఁ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
   బహుకాల దర్శనం... సంతోషం!
   ఆముక్తమాల్యదలోని ప్రౌఢత్వాన్ని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 30. పూయరు పువ్వుల గంధము
  గాయకునికి కంఠమెవరు గల్పించరుగా
  మాయగ లక్ష్యమునమ్మిన
  రాయలకున్ తెలుగు రాదు|రసమున్గ్రోలన్|
  2.గాయములంది వేణువట గాలియు నూదగ గానమాధురీ
  ధ్యేయముబంచు నట్లుగ|”విధేయత నిండిన నష్ట దిగ్గజాల్
  శ్రేయము నందు నిల్పగనె?శీఘ్రమెనబ్బె కవిత్వ శక్తితో
  రాయలవారికిన్|తెలుగు రాదుగదా?రసమున్ గ్రహింపగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పద్యాలు బాగున్నవి. కాని సమస్య పరిష్కారమే అర్థం కాలేదు.

   తొలగించండి


 31. తీయని తేనెయు నయ్యెను

  రాయలకున్ తెలుగు,రాదురసముం గ్రోలన్

  తీయని తెలుగును వీడుచు

  బాయక నాంగ్లము పఠించు వారల కిలలోన్.


  హాయిని గూర్చుచు నుండెను

  రాయలకున్ తెలుగు ,రాదురసముం గ్రోలన్

  రోయుచు నాంధ్రమును సతము

  ఛీయను వారలకు నెపుడు జీవిత మందున్.

  రిప్లయితొలగించండి
 32. నామటుకునేనువ్రాయుదు
  నేమియునేజెప్పలేదెయెవరికిస్వామీ!
  నామాదిరిగావారలు
  దాముగనేవ్రాయుచుండెతమతమశైలిన్

  రిప్లయితొలగించండి
 33. తీయని తెలుంగు పాటల
  కోయిల కూజితము వోలె కూరిమి పాడన్
  హాయిని పొందె. మరాఠీ
  రాయలకున్,తెలుగు రాదు రసము౦ గ్రోలన్

  రిప్లయితొలగించండి
 34. రాయల వంశపు తిరుమల
  రాయలకున్, దెలుఁగు రాదు రసముం గ్రోలన్
  చేయడు తెలుంగు భాషకు
  నాయన సేవనములెప్డు నధిక నెనరుతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 35. గురుదేవులకు వినమ్రవందనములు
  శ్రీ కృష్ణ దేవరాయలకు తెలుగు రాదు అనేవారు కర్ణాటక యందు చాలామంది ఉన్నారు. అలాగే తెలుగు కవులను పోషించిన శ్రీ కృష్ణదేవరాయలకు జన్మదినాచారణ ఎందుకు అనేవారు ఉన్నారు.
  కం. మాయని మచ్చయగును మరి
  రాయలకున్ తెలుగు రాదురసముం గ్రోలన్
  తీయగ బలికిన వాడికి,
  రాయల పద్యములు చదువ రమ్యతదెలియున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరప్రసాద్ గారూ,
   నేనూ విన్నాను కొంత.
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 36. తీయని తెల్గులోన కడుతీరుగ వ్రాయ వచించె విష్ణువే
  రాయల వారికిన్, దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగన్
  ధ్యేయము సొమ్ముపైనిలిపి తెన్గును నేర్వక జీవితమ్మునన్
  పాయక నాంగ్లభాష చిఱుప్రాయము నుండియు నేర్చువారికిన్

  రిప్లయితొలగించండి
 37. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సోయగమౌ నాంధ్రమ్మును
  రోయుచు పరభాషయందు రొల్లుచు కవిగా
  ఱేయుచు నుండెడి కుహనా
  రాయలకున్ దెలుగు రాదు రసముం గ్రోలన్

  రిప్లయితొలగించండి
 38. కోట రాజశేఖర్ గారి రెండవ పూరణ


  {అవధాన విద్యాగురువరేణ్యులగు *శ్రీ నరాల రామారెడ్డి గారు* సూచించిన విరుపుతో}


  సందర్భం :: శ్రీ కృష్ణదేవరాయల వారిని, దర్శించుకొనేందుకు వచ్చిన విదేశీయులైన పారశీకులు, భువనవిజయ సభలో ఉన్న పెద్దన, తిమ్మన, ధూర్జటి, మల్లన, రామభద్రుడు, సూరన, భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణుడు అనే అష్టదిగ్గజ కవులు వినిపించే తెలుగు పద్యాలు అర్థంకాక, ఆశ్చర్యంతో ముక్కున వేలు వేసికొన్న సందర్భం.

  ధీయుతులైన *పెద్దన* యు, *తిమ్మన*, *ధూర్జటి*, *రామభద్రుడున్*,
  శ్రీయుత *భట్టు*, *మల్లన* యు, శిష్టుడు *సూరన*, *రామకృష్ణుడున్*,
  హాయిగ పద్యముల్ జదువ , నచ్చెరు వందిరి పారశీకు లౌ
  *రా ! యల వారికిన్ తెలుగు రాదు కదా , రసమున్ గ్రహింపగన్.*

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
 39. గురువులను క్షమించవలసినదిగాగోరుచున్నాను

  రిప్లయితొలగించండి
 40. మైలవరపు వారి పూరణ

  గాయము జేయు బాసకు , శకార షకార సకార భేదమున్
  జేయదు., వర్గమందునను జెప్ప ద్వితీయ చతుర్థ వర్ణముల్
  వాయియె రాదు ! యాంకరను భామినికామెత బల్కు బాసలో
  రాయల వారికిన్ దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగన్ !!

  ( యాంకర్.. అన్యదేశ్యపదం)

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 41. తీయని భావమున్ మలచి తేనియ లూరెడు తెన్గు భాషతో
  వ్రాయఁగ నొక్క పండితుఁడు భల్ భళిరాయని తెల్లవారల
  న్నూయల లూపు కొల్వునకు నొప్పెద వన్న వచించె నిట్లు "వై
  స్రాయల వారికిన్ దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగన్!

  (వైస్రాయ్ ని గౌరవవాచకంతో పండితుడు వైస్రాయల వారికి అన్నాడు)

  రిప్లయితొలగించండి
 42. ప్రాయమునందునన్ విడిచి భాషయు వ్రాతయు మాటయున్నొహో!
  సాయము సంధ్యయున్ విధిగ షౌకగు నాంధ్రసదస్సులందునన్
  ప్రేయసి వెంబడిన్ తగిలి భేషగు కోతల నింద్రుడౌ మహా
  రాయల వారికిన్ దెలుఁగు రాదు గదా రసమున్ గ్రహింపగన్

  రిప్లయితొలగించండి
 43. తీయగ లెస్స యేలననె తీరుగ వ్రాయుట చేతగాకనా
  రాయల వారికిన్ దెలుఁగు?;... రాదు గదా రసమున్ గ్రహింపగన్
  పోయెగ నోటిలోననహ ప్రొద్దున పూటను నాముదమ్ముతో!...
  చేయర దీటుగా విరుపు చిక్కులు విప్పగ కైపదమ్ములన్!

  రిప్లయితొలగించండి