15, డిసెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2547 (తెలుఁగు తెలుఁగని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె"
(లేదా...)
"తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే"

44 కామెంట్‌లు:

  1. పలుకు పలుకున తేనియ లొలుకు భాష
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ, దగునె
    తెలుగు పలుకులు పలుకక కులుకు లొలుకు
    ఆంగ్ల పలుకులు పలుకుట హాని కాదె!

    రిప్లయితొలగించండి
  2. దేశ భాషల నన్నిట తెలుగు లెస్స!
    తల్లి లేనిదె భువిలోన పిల్ల లెచట?
    వట్టి మాటల నిట్టివి కట్టి పెట్టు:
    "తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె?"


    ...ఇంత కన్నా చేత కాదు సార్! సమస్యయే సరిగా అర్ధం కాలేదు 😄

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. దేశ భాషల నన్నిట తెలుగు లెస్స!
      తల్లి లేనిదె భువిలోన పిల్ల లెచట?
      తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగు! నె
      పమువ లదు; వట్టి మాటల పలుక వలదు !

      తొలగించండి
  3. "తెలుగు పలుకు లనంగను వలవదు మరి
    వేదముల కొలదియగనె పేర్కొనుండు
    తెలుగు తెలు "గని ధీవరుల్ వలుక;దగునె
    సభల మనబాస పలుచన సలుపుటెల్ల?

    రిప్లయితొలగించండి
  4. తేనె కురిపించు పదముల తీయ దనము
    కవులు పండితు లల్లెడి కావ్య వనము.
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ , దగునె
    యితర భాషల మోజున వెతను బడగ

    రిప్లయితొలగించండి
  5. తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే
    పలుకులు భారతీ కరవిపంచిన మ్రోగెను సస్వరంబుగన్
    పలికిన పల్కు పల్కు పలు భావములందున పంచదారగా
    జలజల జాలు వారిన విశారద భాషయె తెల్గు కావునన్||

    పలుకుటొప్పున్ + ఏ పలుకులు = పల్కుటొప్పునేపలుకులు

    రిప్లయితొలగించండి
  6. దేశ భాషల లో కడుఁ దియ్యన మన
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ, దగునె
    తనివితో పరభాషను తగులుకొనుట
    మాత్రుభాష వీడ వలదు ఛాత్రులార

    రిప్లయితొలగించండి
  7. కులుకులు మారినంత ఘన కోకిల కంఠము మారిపోవునా
    కలుపుల దెచ్చి చేర్చినవి కాలము తో పర రాజ్య పాలనల్
    అలకువ లున్న నేమి మన యాద్యుల భాషను తార్చి యుంచమే
    తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే

    రిప్లయితొలగించండి
  8. భాష లందు న మేటి యై పరి ఢ విల్లి
    మధుర సుధ వోలె వెలుగొందు మాన్యభాష
    తెలుగు తెలుగని ధీ వ రు ల్ పలు క ;;దగు నె
    తెలుగు సభల కు వెళ్ళక నలు క బూన

    రిప్లయితొలగించండి


  9. కలిగె మన్నన గద తెల గాణ మందు
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగు! నె
    వముల కిక తావు లేదు! సభాస్థలిగ ర
    బీంద్ర భవనము సయి జిలేబీయమయ్యె !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ

    ఘనముగా తెల్గు వెలుగగా *కల్వకుంట్ల*
    *చంద్రశేఖరరావు* విశాల మతిని
    సభల నడిపించి చూపె !., ప్రసంగమునకె
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె ?!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    తెలుగు సరస్వతీప్రతిమ ., తేజము దానికి సంస్కృతంబు , పూ..
    ర్వులు కవిసార్వభౌములె యపూర్వముగా దగ మేళవించినా
    రిల కవితాప్రపంచపు విరించులు.,
    సంస్కృతహీనమైనదే
    తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే !?

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,

    పదునగు , భావ నిష్ఫలపు , వ్యర్ధ నిరర్థక శబ్ద పుష్టితోన్

    బదములు లేక వ్రాయవలె బద్యములన్ గవు లెల్ల రౌ ననన్ |

    బద కఠిన ప్రయోగము నొనర్పగ వచ్చును , కాని భావమే

    తుదకు స్ఫుటమ్ముగా మనకు దోచనిచో నుపయుక్త ముండునే ?

    రిప్లయితొలగించండి


  12. తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పు! నే
    తెలుగు జిలేబు లూర మజ తెల్పెద పబ్బము నేడు మాన్యులా
    ర; లుకలుకల్ మరేల నయ! రండి! సభాస్థలి యెల్బియెస్నటన్
    కలిసెద మయ్య యెల్లరును గట్టెద మయ్య ప్రణాళికల్ భళా!


    స్వాగతం సుస్వాగతం
    ఫ్రమ్ యెల్బీయెస్
    జిలేబి
    సైనింగ్ ఆఫ్ (ఆన్ :))


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబిగారూ! మీరు హైదరాబాదులో ఉన్నారా?
      గురువుగారు ఈ నాలుగురోజులు అందుబాటులో ఉండరేమో!

      తొలగించండి
  13. తెలుఁగు తెలుఁగని ధీవరుల్ పలుకఁదగునె!
    తెలుఁగు వెలుగని పామరుల్ కలలుఁగనగ
    నౌర!పాశ్చాత్యు లీ భాష నాదరింప
    వేద గీర్వాణముల్ వినిపించు నంధు!!

    రిప్లయితొలగించండి
  14. తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పు, నే
    తెలుఁగు పదమ్మురాయలకు దేవుని దర్శన మిచ్చి బ్రోచె నా
    తెలుఁగుకు కూడె దుర్గతిట తెల్గు ధరిత్రిఁ బరాయి భాషతో,
    వెలుగ తెలుంగు సంతతము పెద్దలు తొడ్పడ దొడ్డ మేలగున్

    రిప్లయితొలగించండి
  15. కోట రాజశేఖర్ గారి పూరణ *

    సందర్భం :: శుభలేఖను ఇయ్యడానికి ఒక ఇంటిముందు నిలబడి, ఒక చిన్నబిడ్డ కనిపిస్తే, మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉంటే పిలువమ్మా! అని అనగానే, వాళ్లు లేరని, మమ్మీ డాడీ ఉన్నారని, వాళ్లను పిలుస్తానని, ఆ చిన్నబిడ్డ పలుకుతూ ఉంటే, మన తెలుగు వెలిగిపోతూ ఉందని, భారత *దేశభాష లందు తెలుగు లెస్స* అని తెలుగు తెలుగు తెలుగు అని అన్నీ తెలిసిన పెద్దలు ఘోషించడం సమంజసమేనా ? అని ప్రశ్నించే సందర్భం.

    నిలిచితి నింటిముందు, గణనీయముగా శుభలేఖ నీయగా,
    పిలువుము నాన్న నమ్మ నని ప్రేమగ జెప్పగ, లేరటంచు తా
    బలుకుచు, మమ్మి డాడి గలవారని, బిల్చెద నంచు, బిడ్డయే
    పలుకగ, తెల్గు వెల్గె నని, భారత భాషల తెల్గు లెస్స యౌ,
    *తెలుగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే ?*

    కోట రాజశేఖర్ నెల్లూరు

    రిప్లయితొలగించండి
  16. తలచిరి తల్లిదండ్రులిటు తప్పక బిడ్డ విదేశమందునన్
    నిలిచి ధనమ్ము తెచ్చునని నిత్యము నెంచగనేటికక్కటా
    కలలవి కల్లలైచనెను గంటములెత్తుచు ముక్తకంఠులై
    తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పు, నే

    రిప్లయితొలగించండి
  17. వెలుగులుజిమ్మిసంస్కృతికివేదికయైనతెలుంగుభాషనే
    కలుగునత్రొక్కిపాలకులు గౌరవమిచ్చిరి నాంగ్లభాషకున్
    మెలఁకువ వచ్చినేకముగ మేఘములన్ భువిదించురీతిగా
    తెలుఁగుతెలుంగుతెల్గనిసుధీవరులెల్లరు బల్కుటొప్పునే?..

    రిప్లయితొలగించండి
  18. పాఠశాలలనాంగ్లంపు భాష వెలిగి
    కాసులను కూడబెట్టంగ కడుపుగొట్టె
    పాడు సర్కారటంచును బల్కెనొకడు
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ పలుకఁదగునె!

    రిప్లయితొలగించండి
  19. ఆంగ్లభాషకు ప్రాధాన్యమధికమిచ్చి
    మాతృ భాష మాధుర్యము మరచిపోయి
    ప్రభుత ప్రాచుర్యము కొరకు ప్రాకులాడ
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె

    రిప్లయితొలగించండి

  20. అవసరంబైన వేళల యందె గాక
    సర్వవేళల యందును సంతసాన
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ, దగునె
    వలదు మాతృభాష యనుట వాసియౌనె.

    ఇతర భాషల పైనున్న యిచ్ఛ తోడ
    పరుల భాషల నేర్చుచున్ వాసిగాను
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె
    ల్లపుడు మంచిదే యౌగదా యవని యందు.

    రిప్లయితొలగించండి
  21. అన్నిభాషలగంటెనునరయతెలుగు
    శ్రేష్ఠమైనదియెంతయోచేవకలది
    తెలుగుతెలుగనిధీవరుల్ వలుకదగునె
    బలుకవచ్చునుహాయిగదెలుగునుడువు

    రిప్లయితొలగించండి
  22. పిలువగ మమ్మి డాడి యని పిల్లల గట్టడి జేయ బోక మో
    జులు వడి యాంగ్ల మాధ్యమము చుట్టును ద్రిప్పి తెనుంగు సంస్కృతిన్
    జులుకన సేయ జోద్యముగ జూచుచు తీరికవేళ నయ్యయో
    తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే?

    రిప్లయితొలగించండి
  23. రాయలసభలో కర్ణాట మరియు నితర భాషా కవివరుల వేదన........

    పలుకుల తల్లికిన్ గనఁగ భాషలవన్నియు బిడ్డలౌను యే
    వెలితియు చూపనోపదు కవిత్వము యందరి సొమ్ముగాదె మా
    కిల కరనాటదేశమున నివ్విధి గాంచగఁ కృష్ణరాణృపా
    తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే

    రిప్లయితొలగించండి
  24. తెలుగు తెలుగని ధీవరుల్ పలుక! దగునె
    తల్లి భాష మరువ నెంచి తప్పుకొనుట!
    మాధ్యమంబెద్ది యైనను మన చదువుల
    భాషగ తెలుగు వెలుగంగ వలయు నెపుడు!

    గురువర్యులకు నమస్సులు. నిన్నటి, మొన్నటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.
    ముదమును గొల్పెడి పదములె
    గద కావలె పద్దెమునకు ఘనతను గూర్చన్
    అదను, పదను నోచుకొనని
    పదములు లేకుండ వ్రాయవలె బద్యములన్!

    రిప్లయితొలగించండి
  25. అల యమరాలయంబున సురావళి గ్రోలు దివౌకసాన్నమున్ ,

    జలజజు సన్నిధానమున శారద మీటు విపంచికాధ్వనిన్

    దలపగజేయుగా తెను గనంగ | యదార్థ మి కందుచేతనే

    తెలుగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరు బల్కు | టొప్పునే

    పలువలరాయుడా ! తెనుగు భాషిల కూరక వచ్చిరాని కూ

    తల c బరభాషలో వదర ? దండుగ - చాలుర యూరకుండుమా


    { అమరాలయము = స్వర్గము ; దివౌకసాన్నము = అమృతము ;

    తలపగజేయు = ఙ్ఞప్తికిదెచ్చు ; పలువ = తులువ ; }

    రిప్లయితొలగించండి
  26. కొలువున మాతృభాష తగు గుర్తొన గూడెడు లక్ష్యమెంచకన్
    పిలుపిడి యీ మహా సభల వేడుక జేయుచు నిర్వహించుచున్
    బలమగు చిత్తశుద్ధి విడి భాషకు నావల యూతమీయకన్
    తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే?

    రిప్లయితొలగించండి
  27. ఈ ప్రపంచ మహా సభ లెల్ల దీర్చి 
    యైదు రోజులాడంబర మంద జూచి 
    పిదప చిత్తశుద్ధియె లేక వేడుకనుచు
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె?

    రిప్లయితొలగించండి
  28. పరుల పాలనయందున బడులలోన
    మొదలుపెట్టిన చదువులు మోసులెత్తి
    మ్రానులై నేటియువతను మార్చివేసె
    వలస వెళ్ళుట కనువైన వాక్కునేర్చి
    మాతృభాషను మరచిన మలితరంబు
    గనుచు నెట్లు ఘోషింపను గల్గునార్య?
    తెలుగు తెలుగని ధీవరుల్ వలుకదగునె?

    ఆంగ్ల భాషాపదములవి యతిశయించె
    ప్రజల నాల్కల యాంగ్లము ప్రబలజొచ్చె
    తెలుగు కవులకావ్యములందె వెలుగుచుండె
    బ్రతుకునీయని భాషది బ్రతుకుటెట్లు?
    తెలుగు తెలుగని ధీవరుల్ వలుకదగునె?

    రిప్లయితొలగించండి
  29. తెలుగు తెలుగని ధీవరుల్ వలుకదగునె?
    “మాతృభాషయు తోటలో మాటువేసి
    కలుపు మొక్కల నాంగ్లమ్ము కలతబెంచ?
    తీసివేయక ఫలితమ్ము తీరుమారు”
    రక్షణార్థమే పలుకులు కక్ష గాదు
    ౨ తెలుగు తెలుంగు తెల్గని సుధీవరులెల్లరుబల్కు టొప్పునే?
    తెలుగన?లెస్స|రాయాలన ,ధీక్షగనేర్చెను”బ్రౌను నాంగ్లుడై|
    నిలిపెను వేదసారమును నిత్యము|నన్నయభారతమ్మునన్
    తెలిపెను భక్తిభావనల దీప్తిని పోతన గ్రంధకర్తయై|
    .




    రిప్లయితొలగించండి
  30. పలుక తొలి పలుకును నొక లలిత సుకవి
    తెలుఁగునఁ గులికి కిలకిల కలవరమున
    వలదు వలదింక వడి వడిఁ దలఁగు తలఁగు
    తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె


    లలితము భార తావని చెలంగును మిక్కిలి పెక్కు భాషలం
    దలరును నిత్యమున్ మత వితాన సుసంహిత భాసితమ్ముగం
    జెలువపు టన్య భాషఁ గవి శేఖరుఁ డొక్కఁడు వల్కి నంతటం
    దెలుఁగు తెలుంగు తెల్గని సు ధీ వరు లెల్లరుఁ బల్కు టొప్పునే

    రిప్లయితొలగించండి
  31. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా నిర్వహిస్తున్న మెట్రామశర్మ గారి శతావధానంలో పృచ్ఛకుడిగా వచ్చాను.
    ఐదు రోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను.
    ఈ ఐదు రోజులు మీ పూరణలను సమీక్షించలేను.
    దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  32. సార్! చాలా సంతోషం! ఐదు రోజులూ ఆనందంగా గడపండి... నేను ఇక్కడ తోక విప్పేస్తాను!

    🐒🐒🐒

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. చాలా సంతోషం సార్ !
      మీ లీవు సమయములోన మీ యనుమడ నే
      వాలంబిప్పెద నయ్యా
      జాలము లోనన్ జిలేబి సాయము గానన్ :)

      జిలేబి

      తొలగించండి
  33. బాబోయ్ కొత్త (కపివరులు)కవివరులను చూస్తే భయమేస్తోంది

    రిప్లయితొలగించండి
  34. పలుకు తేనెల కురిపించు బాసనుచును,
    దేశభాష లన్నిటనుకీర్తిని వహించె
    తెలుగు తెలుగని,ధీవరుల్ పలుక,దగునె
    యితర దేశభాషల మెచ్చినుతులజేయ

    రిప్లయితొలగించండి
  35. ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభ శుభాకాంక్షలు
    అందరికీ

    రిప్లయితొలగించండి

  36. దేశ భాషలందున కడు తీపి భాష
    మధువు నిడు భాష మిక్కిలి మధుర భాష
    తెలుగు తెలుగని ధీవరుల్ పలుక,దగునె
    తెలుగు విడనాడి పరభాష పలుకులెంచ

    రిప్లయితొలగించండి
  37. అలుగుచు నర్ధసున్నలని హైరన నొందుచు మాతృభాషనున్
    పలుకుట కష్టమయ్యెనని పండిత మండిత సంస్కృతమ్ములన్
    ములుగుచు నేను మొత్తుకొన ముచ్చట తీరగ లెస్సవింటినే:👇
    "తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే"

    రిప్లయితొలగించండి