19, డిసెంబర్ 2017, మంగళవారం

సమస్య - 2547 (తెలుఁగు సభలకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తెలుఁగు సభలకు నేగువారలు మొరకులె"
(లేదా...)
"లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేగెడువారు మూర్ఖులే"

50 కామెంట్‌లు:

 1. కలిమి కూర్చెడి వారలు ఖలులు గారు!
  కలము గైకొను వారలు కవులు గారు!
  పొలము దున్నెడి వారలు మొరటు వారె?
  తెలుఁగు సభలకు నేగువారలు మొరకులె?

  రిప్లయితొలగించండి
 2. కలకలలాడు మోములను కమ్మని సంస్కృతి కందళింపగా;
  మిలమిలలాడు దుస్తులవి మెచ్చులు గొల్పగ నెల్లవారికిన్;
  తెలియక రేబవళ్ళు;పెనుదీవన లందగ తల్లిసేవకై
  లలిని బ్రపంచతెల్గుసభలన్ గన నేగెడువారు మూర్ఖులే?

  రిప్లయితొలగించండి


 3. జిలుగు వెలుగుల చీర్సును చెప్పు దురకొ
  తెలుఁగు సభలకు నేగువారలు; మొరకులె
  వలదు వలదను వారలు వట్టి మాట
  ల లుక లుకలాడు వారు లలన జిలేబి‌!

  జిలేబి

  రిప్లయితొలగించండి

 4. కలిగిన వారి శోభ కని కాన్కలు ముట్టగ పట్ట గోరుచున్
  పలువుర పైరవీల కర వ్రాతల సాయము గోరి
  గొప్పగా
  పిలపుల దేవురించి కడు వేడ్కలు తీరగ కీర్తి కండువా
  లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేగెడువారు మూర్ఖులే"

  రిప్లయితొలగించండి

 5. రాజకీయము నాడగ రచ్చ బండ
  నెక్క , వారి రసజ్ఞత తక్కువౌన?
  లలిత కళలమాధుర్యము చిలికి పంచు
  తెలుగు సభలకు నేగువారలు మొరకలె?

  రిప్లయితొలగించండి


 6. కలకల పట్టుచీరలన గాన్పడు ఠీవి జిలేబులూరగన్
  లలినిఁ బ్రపంచ తెల్గుసభలన్ గన నేగెడువారు;మూర్ఖులే
  వలదు తెలుంగు వందియలు వట్టి ముఖస్తుతులవ్వి, గోపతిన్
  తలచు సభాస్థలీయనుచు తంగము చూపెడు వారకో గనన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. తెలుగు సభలకు నేగువారలు మొరకులె
  యనుచు మూఢచిత్తులిలన యన్ననేమి
  సజ్జనుడెవండు మెచ్చడీ జగతియందు
  గార్ధభములు శ్రీగంధ సుగంధ తావి
  విలువ నెఱగని చందమీ విశ్వమందు.

  రిప్లయితొలగించండి
 8. లలితకళావిలాస పరిలబ్ధ యశోవిభవాభిరామ సం
  కలిత మనోజ్ఞ కావ్యశతకద్యుతి శోభిత సత్కవీంద్ర సం
  ఘ లసదనూన వేదికగఁ గన్నుల పండుగఁ జేయ వేనవేల్
  లలినిఁ బ్రపంచ తెల్గు సభలం గన వచ్చినవారు మూర్ఖులే?"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుదీర్ఘసమాససంశోభితమైన, శ్రవణపేయమైన పూరణమీది శంకరార్యా!

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అద్భుతమైన పద్యరత్నము నందించితిరి. మహదానందమైనది. ధన్యవాదములు.

   తొలగించండి
  3. లలితకళా విలాసమైన పూరణ గురువుగారిది.

   తొలగించండి
  4. అద్భుతమైన పూరణ గురుదేవా!నమశ్శతములు!

   తొలగించండి
  5. నిందలు స్పర్ధలు లేనిది
   కందివరులదగు కపర్ది గళమాలికయే
   నందనము తల్లితెలుగుకు
   సుందరముగ నొకటిజేయ సుకవీశ్వరులన్
   మనకు రోజూ ప్రపంచ కవిసమ్మేళనమే!

   తొలగించండి
 9. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

  పలుగురు సత్కవీ౦ద్రులును ప్రాఙ్ఞులు పౌరులు స౦స్కరి౦పగా

  వెలుగు పురోభివృద్ధియును , విద్యయు , స౦స్కృతి తేజరిల్లగా

  తెలుగు రథ౦బు సాగు గద దివ్యపథ౦బున జైజయధ్ధ్వనిన్ |

  లలిని ప్రప౦చ తెల్గు సభలన్ గన నేగెడు వారు మూర్ఖులే ?

  రిప్లయితొలగించండి
 10. తెలుగు విభవ మ్ముచాటగా దీక్ష బూని
  సభలు జరుపు ట తెలియ గా సరసులేల్ల
  తెలుగు సభల కు నేగు వారలు మొర కు లె ?
  తెలిసి వెళ్ళని వారినే తెగ డ వలయు

  రిప్లయితొలగించండి
 11. డా ఎన్ వి ఎన్ చారి 9866610429
  విలసిత కాంతి పుంజముగ విశ్వ మునందు తెనుంగు వెలుంగు చుండగా
  తలపుల తల్పులన్ తెరచి తన్మయ చిత్తులు విశ్వ సోదరుల్
  తెలుగు సుపర్వ మోదమున దేల,నసూయ కల్మష. చింతనన్
  లలిని బ్రపంచ తెల్గు సభలం గన వచ్చిన వారు మూర్ఖులే

  రిప్లయితొలగించండి
 12. ఒరుల విభవము జూచియు నోర్వ లేక
  పరుల బాధల కెపుడు సంబరము నంది
  లేని వైఫల్య ములనెన్నొ పూని జూడ
  తెలుగు సభలకు నేగువారలు మొరకులె.

  రిప్లయితొలగించండి
 13. మైలవరపు వారి పూరణ

  అమ్మ యొడిలోన మురియుచు నాటలాడ
  బిలుపు లేదని భీష్మించి బింకమేల ?
  ధర సహస్రశతాష్టావధానిలసిత
  తెలుఁగు సభలకు నేగువారలు మొరకులె ?

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 14. తేటగీతి
  తెలుగు మాతృభాషగ గల్గ తీరి వచ్చి
  భాష ఔన్నత్యము దెలిసి పరవశించు
  విదుర ప్రాంతీయతను దల్చి విషముఁ గ్రక్కఁ
  దెలుఁగు సభలకు నేగువారలు మొరకులె.

  రిప్లయితొలగించండి
 15. ఇళ్ళ లోన “యమ్మా” యని ఎవరు బిలుచు
  చుండె, నేడు మమ్మీ యనుచు పిలిపించు
  కొను వారలే ఘనులట, కొట్టు చుండె
  పాఠ శాలలో బిడ్డల్నిబలుక దెలుగు ,
  సచివులెవరైన బిడ్డలన్ సాగ నంప
  బోరు తెలుగు బడికి, కవి కోరు కొనును
  తన బిడ్డవిదేశాన ఘనత నొందు
  చుండ వలెనని. పూజారి జూచు చుండు
  నమెరికా పిల్ల వాడిని .నటులు ,చిత్ర
  జగము వారు ,గర్షకులు, సగటు వారు,
  వారు వీరని యేల?నెవ్వారు ఐన
  కోరు పరదేశ జదువులు, గోరు అన్య
  భాషలన్ ,పైకి దెల్పును భాష గాచ
  వలయు నని,ఆశయంబులు కలిగి యున్న
  నేమి ఫలము, యాచరణపు లేమి తోడ
  వెలుగు చుండె నేటి జనము, వెర్రి దోడ
  తెలుఁగు సభలకు నేగువారలు మొరకులె  రిప్లయితొలగించండి
 16. కోట రాజశేఖర్ గారి పూరణలు

  సందర్భం :: ప్రస్తుతం భాగ్యనగరంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభలకు కవులు ,పండితులు ,మేటి అవధానులు ,కళాకోవిదులు ,ప్రముఖ నేతలు ,ఎందరో మహానుభావులు వెళ్తున్నారు. తెలుగు తల్లికి పూజ చేయడానికి వెళ్ల్తూ ఉన్న వారందరూ మూర్ఖులా? కానే కాదు. వారు తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు అని చెప్పే సందర్భం.

  అల కవి పండితుల్ ,బహు సహస్ర వధానులు ,ముఖ్య నేతలై
  యలరెడు వక్తలున్ ,ఘనులు నష్ట వధాన శతావధానులున్,
  పలు కళలందు కోవిదులు ,భారతికిన్ పదపూజ సేయగా
  లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేగెడి వారు మూర్ఖులే ?


  మరొకవిధంగా రెండవపూరణ

  క్షమాగుణం లేకుండా కోపంగా మాట్లాడటం సరికాదు. ఐతే ప్రపంచ తెలుగు సభలకు , ప్రక్కనే ఉన్న పెద్దలను పిలవలేదనే బాధతో ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు.

  పిలిచిరె యాంధ్ర రాష్ట్రమున పెద్ద యనం దగు చంద్రబాబునే ?
  పిలిచిరె రామలింగ సుకవీశ్వరు పేరడి జొన్నవిత్తులన్ ?
  పలుచన జేసి రాంధ్రులను , బల్కెద కోపముతోడ , నాంధ్రులై
  లలిని ప్రపంచ తెల్గు సభలన్ గన నేగెడి వారు మూర్ఖులే.

  కోట రాజశేఖర్ నెల్లూరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అదురహో కోట వారు నమో నమః


   జిలేబి

   తొలగించండి
  2. అదురహో యటంచు నానందమును దెల్పె
   గద *జిలేబి* , వినుతి ముదము గొల్పె ,
   నేటి పద్యకవుల మేటిగా నను నిల్పె ,
   నాదు హృదయ మిపుడు నతులు సల్పె.
   కోట రాజశేఖర్

   తొలగించండి
 17. నాకు వచ్చిన ఆలోచన ఇక్కడ పంచుకుంటున్నాను.
  దానికి పద్యరూపం ఇవ్వడం మాత్రం చేతకాదు. క్షమించండి.
  తెలుగు వారయి ఉండి కూడా ఇంట్లో భార్యా పిల్లలతోనూ, పరిచయస్తులతోనూ
  ఎల్లప్పుడూ ఆంగ్ల భాషలోనే సంభాషణములాడేవారు..
  పిల్లలకు తేట తెలుగన్న వాసన రవ్వంత కూడా తగలకుండగ చేయువారు...
  ఉన్న పదవి వలన ఆహ్వానము రాగా ...ఘనమగు
  తెలుఁగు సభలకు నేగువారలు మొరకులె....

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ యూహ కు పద్య రూపము:

   తెలుగు కులమ్ము నం దకట తీరుగఁ బుట్టియు స్వీయ మందిర
   మ్ముల నిజ దార పుత్రక సమూహము తోడుత సంత తాంగ్ల వా
   క్కుల నుడువంగఁ దేట తెనుఁగుం దెగనాఁడు వరాధి నాథులే
   లలినిఁ బ్రపంచ తెల్గు సభలం గన వచ్చిన, వారు మూర్ఖులే

   తొలగించండి
  2. ఆఖరి (సమస్యా) పాదము:
   లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేఁగెడు,వారు మూర్ఖులే

   తొలగించండి
  3. సరస్వతీ పుత్రులులకు నమోవాకములు!

   తొలగించండి
  4. సీతా దేవి గారు నమస్సులు. మన మందఱము జగన్మాత సంతానమే.

   తొలగించండి
  5. నమస్కారమండి. మీరు కూడా వృత్తమున పూరించ గలరు.

   తొలగించండి
 18. పిలువని యాగమున్ గనఁగ వెళ్లచుఁ దా నవమానముల్ గొనెన్
  లలితయె! చంద్రబాబు నొక రాష్ట్రము నేలెడు ముఖ్యమంత్రిగన్
  పిలుపది యంద కున్న నెటు వెళ్లునె? గారవమందలేనిదౌ
  లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేగెడువారు మూర్ఖులే!

  రిప్లయితొలగించండి
 19. రిప్లయిలు
  1. జూదము తగదు వ్యసనము సుమ్ము చెఱచుఁ
   గులము ధనము మానమ్మును గువలయమున
   వినుమ నా మాట యని పల్కెఁ బెంచుచు రయి
   తెలుఁగు సభలకు నేఁగువారలు మొఱకులె.

   [రయితు+ఎలుఁగు= రయి తెలుఁగు; సభ = జూదము]


   పండిత గణ మండితమయ్యుఁ బామర జన
   లాలితమ్ము ప్రభు గణ విలసిత మయ్య
   సందియ మొకింత లేకయె చనుము వేగ
   తెలుఁగు సభలకు, నేఁగువారలు మొఱకులె?


   లలిత తరంపు భావములు లాలిత శబ్ద సుసంహితమ్ము సం
   కలిత సమాస భూషితము కావ్య వరవ్రజ రాజితమ్ము భూ
   వలయము నందు నీ తెనుఁగు భాష ఘనంబ తలంప నల్పమే!
   లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేఁగెడువారు మూర్ఖులే?

   తొలగించండి
 20. డా ఎన్ వి ఎన్ చారి 9866610429[19/12, 12:36] Nvn Chary: డా ఎన్ వి ఎన్ చారి 9866610429
  విలసిత కాంతి పుంజముగ విశ్వ మునందు తెనుంగు దీప్తులీనగన్
  తలపుల తల్పులన్ తెరచి తన్మయ చిత్తులు విశ్వ సోదరుల్
  తెలుగు సుపర్వ మోదమున దేల,నసూయ కల్మష. చింతనన్
  లలిని బ్రపంచ తెల్గు సభలం గన వచ్చిన వారు మూర్ఖులే

  సమస్య చివరి పాదం

  రిప్లయితొలగించండి
 21. పిలువరు సాటి రాష్ట్రమున పెద్దను, భాషకు బట్టుకొమ్మలై
  వెలసిన తోటి ప్రాంతపు కవీశుల నెన్నరు, జాతి కీర్తియై
  వెలిగిన రామునిన్ స్మృతిని బెట్టరు, కాని జగచ్ఛదస్సనే
  పిలుపున స్వాభిమానమును వీడి యసూయను జూపు తావులో
  లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేగెడువారు మూర్ఖులే.

  రిప్లయితొలగించండి
 22. తెలుగు విలువను దెలుపుచు వెలుగు సభకు
  పండితులమని దంభముల్ బల్కు చుండి
  పరుగులెత్తి పురస్కార పటము పొంద
  తెలుఁగు సభలకు నేగువారలు మొరకులె

  లలితకళల్ మనోజ్ఞయుత లాస్యము గానము వేషభూషలున్
  సలలిత మాధురీ గతిని సాగెడు తెల్గు సభన్ ప్రశస్తమౌ
  పలు యవధానముల్ గనక పండిత వర్యుల పంక్తి నిల్వగా
  లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేగెడువారు మూర్ఖులే

  రిప్లయితొలగించండి
 23. కలయగఁ జూడ నల్దిశలు కావ్యరసామృతవీచికాసుగం
  ధలసదలంకృతాతిథివదాన్యహృదంబుజముల్ ప్రమోద మొం
  ద లవము నైన లేదనుచుఁ దప్పులు బట్టగ చోద్యమే యగున్
  "లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేగెడువారు మూర్ఖులే ? "

  రిప్లయితొలగించండి
 24. .సంతసంబును సాకెడిసభలయందు
  “అర్థమవ్వక భోజన మాశకొరకు
  తెలుగు సభలకునేగువారలు మొరకులె”|
  “విలువ దెలసినవారికి విశ్వమదియె|
  2.విలువలు బంచ నెంచగల విజ్ఞుల పాటల పద్యమాలికల్
  మొలచిన ?”మానసంబునకుమొగ్గలుబంచెడి గంధ బంధమే
  లలిని ప్రపంచ తెల్గు సభలన్ గన నేగెడి వారు”|”మూర్ఖులే
  మలిన మనస్కులై తనకు మాలిన ధర్మమునెంచు వంచకుల్”.

  .

  రిప్లయితొలగించండి
 25. పలుకులలోనతేనియలుపాటలలోపలుపల్లెవాసనల్
  వెలుగులజిమ్ముకావ్యములువీనులవిందగుశబ్దసంపదల్
  గలిగినభాషతెల్గునకుకట్టగపట్టమురాజధానిలో
  లలినిఁప్రపంచతెల్గుసభలన్గననేగెడువారుమూర్ఖులే?

  రిప్లయితొలగించండి
 26. గురువు గారికి నమస్సులు.
  తెలుగు పలుకులు తెలగాణ తేనె లొలుకు
  వెలుగు నిచ్చును మనభాష ,వేద భాష
  గౌర వాది డం బం కోరి ,కుటిల మతులు
  తెలుగు సభలకు నేగువారలు మొరకలె.

  రిప్లయితొలగించండి
 27. గౌ కు కు యతి సరిపోదని నా భావన. కావున కుటిల మతులుకు బదులుగా కాశి సుతులు గా మార్చడమైనది.

  రిప్లయితొలగించండి
 28. విలువగు వస్త్రము, పత్రము
  కలుగు పురస్కృతుల పైన కాంక్షలడరగా
  పలు చెత్త కవితలనుగొని
  తెలుఁగు సభలకు నేగువారలు మొరకులె

  రిప్లయితొలగించండి
 29. విలువనెరింగి సంతతము విశ్వమునందున నెల్లవారికిన్
  తెలుప తెలుంగు గొప్ప కడుఁ దెల్లముగా మదిలోన తోరమౌ
  లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేగెడువారు మూర్ఖులే?
  కలుగును ఖ్యాతి నిక్కముగ కమ్మని తెల్గును గూర్చి చెప్పినన్

  రిప్లయితొలగించండి
 30. కలమును పట్టి యొక్కటియు కందము వృత్తము సీసపద్యమున్
  గలగల వ్రాయ జాలకయె గండరగండుడ నేనటంచుచున్
  పిలుపులు రాక నొచ్చుకొని బిచ్చము గోరెడు యాయవారమున్
  లలినిఁ బ్రపంచ తెల్గు సభలన్ గన నేగెడువారు మూర్ఖులే!

  రిప్లయితొలగించండి