18, డిసెంబర్ 2017, సోమవారం

సమస్య - 2549 (పిడికిటఁ గనుఁగొంటి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్"
(లేదా...)
"పిడికిలిలోన నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్"

64 కామెంట్‌లు:

  1. అడిగిననే చిత్రములను
    గుడుగుడుమని జూపునట్టి గూగులు లోనన్
    బడుగగు చరవాణినిగొని
    పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్!

    రిప్లయితొలగించండి
  2. (ప్రళయకవితను,ప్రణయకవితను సృజించగల శ్రీశ్రీ కవీంద్రుని గురించి)
    ఎడయక ఠీవితోడ తలయెత్తుచు సాగెడి రౌద్రగీతముల్,
    తడిసిన గుండె నుండి విడి తద్దయు పొంగెడి ప్రేమగీతికల్,
    వడివడి వ్రాయగల్గు కవివౌ "సిరిరంగపు శ్రీనివాస!"నీ
    పిడికిలిలోన నాకు గనిపించె దివాకర చంద్రబింబముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అధ్భుతమ్ బాపూజీగారూ! అభినందనలు!

      తొలగించండి
    2. అడిగిన తక్షణ మన్నిటి
      దడబడకయె చూపును గద ధారుణి సెల్ ఫోన్!
      విడువక యుండగ నదినా
      పిడికిట;గనుగొంటి సూర్య విధు బింబములన్.

      తొలగించండి
    3. బాపూజీ గారి పూరణకు స్పందన:

      కమనీయం , రమణీయం , గణనీయం

      ...కోట రాజశేఖర్

      తొలగించండి
    4. శాస్త్రి గారికి , సీతాదేవి గారికి , రాజశేఖర్ గారికి ధన్యవాదములు.

      తొలగించండి
    5. అలా వ్రాయడం వారికే సాధ్యం..
      ఇలా ఊహించడం వీరికే సాధ్యం..
      ఉత్తమమైన పద్యం... శ్రీ జె జె కె బాపూజీ గారికి నమోవాకములు......🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి


    6. కమనీయం గణనీయం
      రమణీయం పూరణమ్ము రసికుల హృదయ
      మ్ము మరిమరి తాకెనయ్యా !
      సుమధుర కైపద జిగేలు సుమమై వెలసెన్ !

      జిలేబి

      తొలగించండి
  3. కడుదయగల శ్రీనాధుడు
    గుడిలోపల శంఖచక్ర గుదియధరుండై
    కుడియెడమల కాంతులెగయ
    పిడికిట గనుగొంటి సూర్యవిధుబింబములన్ !

    శంఖచక్రాలే విధుసూర్య బింబాలు!

    పడమటి దేశములోగల
    కొడుకును నిశివీధులందు కూడగ స్కైపున్
    కడువింతగ చరవాణిని
    పిడికిట గనుగొంటి సూర్యవిధుబింబములన్ !

    నా వెనుక విధు, అతని వెనుక సూర్యబింబములను!

    రిప్లయితొలగించండి
  4. విడివిడి చిత్రములు గొనుచు
    వడివడి యడుగుల నడచుచు బడికిని రాగన్
    తడిక దడి తగిలి జారగ
    పిడికిటఁ, గనుఁగొంటి సూర్య విధు బింబములన్

    రిప్లయితొలగించండి


  5. నుడువన్ జిలేబి గురువులు
    పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్
    వడవడ వణుకుచు చలిలో
    వడకుమలన్ యోగరాజు వరమై నేడే !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. వడివడి గాను చేరితిని వారధి యైప్రభు వున్ గనన్ మదిన్
    వడకుమలన్! జిలేబి బడబాగ్నులు హృత్కమలంబు లన్విడన్
    గడగడ లాడు శీతమున గట్టిగ యత్నము జేయగన్ సుమా,
    పిడికిలిలోన నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కడు కష్టమున నెరింగితి
      తడబడుచున్ వడకుమలకు తాత్పర్యమ్మున్
      కడకున్ జిలేబి వహవా!
      పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్ 😂

      తొలగించండి


    2. అదురహో జీపీయెస్ నమో నమః


      వడివడి ప్రభాక రుండొ
      చ్చి డిగనురుకులన్ జిలేబి చేర్చగ కందం
      బు ఢమ ఢమ శబ్ధములతో
      పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్!


      జిలేబి

      తొలగించండి
  7. అడిగిన తోడ నె చిత్రము
    కడు వడి బాపూ కరణి గ కమ్మగ గీయన్
    తడ యక దాని ని గొనగా
    బిడికి ట గను గొంటి సూర్య విధు బింబ ము ల న్

    రిప్లయితొలగించండి
  8. పడుకున్న వేళ పట్టెను
    నడుమని వెళ్ళితిని మర్ధనాకొరకై యా
    గడసరి తైలముతో రా
    పిడికిట గనుగొంటి సూర్య విధు బింబములన్

    రిప్లయితొలగించండి
  9. గడసరి దౌ చర వాణిన
    వడివడిగా మీట నొక్కి పాటవమందున్
    బుడుగొక్కడు చూపగ నే
    పిడికిటఁ గనుగొంటి సూర్య విధు బింబములన్.

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    మా మనుమడు నా చేతిలో :

    01)
    ____________________________

    అడుగులు తడబడు బుడతడు/మనుమడు
    కడు వడిగా గీకి యెడమ - కరమున కలము
    న్నడుగగ చెప్పు మిదేమని ?
    పిడికిటఁ గనుఁగొంటి సూర్య - విధు బింబములన్ !
    ____________________________

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    దైత్యద్వయ సంభాషణ...

    మెడఁబట్టి పిసుకుచుండగ
    దడపుట్టెను , యూపిరాడదయ్యెను, హనుమం
    తుడదె నను యొడిసి పట్టగ
    పిడికిటఁ ., గనుఁగొంటి సూర్య విధు బింబములన్" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    మడిసిన దైత్యులిద్దరు యమస్థలికేగుచునుండ , నందునొ...
    క్కడు దన మిత్రునిన్ బలికె " గాంచితి రా ! హనుమత్ప్రతాపమున్ !
    దడదడ పుట్టె , కుత్తుకను దానట బట్టినవేళఁ జిక్కగా
    పిడికిలిలోన , నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్ " !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎడదను కౌస్తుభమ్ము , మురిపించు దుకూలము , దాల్చియున్ గదన్
      పిడికిలిలోన , నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్
      కడు కమనీయనేత్రములుగాగ కిరీటము కాంతులీన , యొ..
      ప్పెడు హరిమూర్తి స్వప్నమున విశ్వవిరాడ్రమణీయరూపమై !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. యశోద... వసుదేవునితో తన అనుభవాన్ని పంచుకొంటోంది.. ఇలా 👇.....

      అడిగితి నోరు చూపుమని యల్లరి కృష్ణునిఁ , గట్టెఁ బట్టియున్
      పిడికిలిలోన., నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్
      వెడ నుడుపంక్తియున్ సకల విశ్వము ! నేనది గాంచి భ్రాంతిలో
      బడి కలయో ! మరేమొ యిది వైష్ణవమాయయొ ? యంచు నెంచితిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మనోహరమైన పూరణ!!మురళీకృష్ణులు గదా!యెప్పుడూ బృందావన యోచనలే!!

      తొలగించండి
  12. బుడబుడ మాటలాడి కడుపుబ్బగ నవ్వులు కుర్పి చల్లగా
    నడిగిన బొమ్మ చేతవడి నందక పోయిన కాళ్లు తన్నుచున్
    విడవక చెయ్య పట్టి సెల వివ్వడు పౌత్రుడు ! వాని సేవలో
    పిడికిలిలోన నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్"

    రిప్లయితొలగించండి
  13. గడుసరి మరదలు సరసత
    కుడియెడమల చేతులుంచి గుప్పిటమూయన్
    జడబిళ్ళల దాచుచు నే
    పిడికిట గనుగొంటి సూర్యవిధుబింబములన్ !

    రిప్లయితొలగించండి
  14. పిడికిలి మూసియు చూడగ
    కడువడి గనె నీదు మోము కనబడగ వెలుం
    గెడి శశి,సూర్యు లిరువురును
    "పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్"

    రిప్లయితొలగించండి
  15. కడివెడు రంగులైయ్యె మఱి కావలె నింకను తాత ! నంచున్
    అడుగచు నుండ మామనుమడద్వికుడున్ తన చిత్రరాజముల్
    మడిచిన కాగితంబులను మాకును విప్పుచు జూపనెంచగా
    "పిడికిలిలోన నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్"

    రిప్లయితొలగించండి
  16. పొడగను సూర్యుని చంద్రుని
    నిడితిని గోరింట తోడ నిమ్ముగననుచున్
    పిడికిళ్ళు తెరచెనాచెలి
    పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్

    రిప్లయితొలగించండి
  17. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: దక్షుని యజ్ఞానికి వెళ్లిన సతీదేవి , అచ్చట తన తండ్రి , తన భర్తయైన శివుని దూషించడం సహింపలేక , యోగాగ్నిని కల్పించుకొని తన శరీరమును దహింపజేసికొనినది. అందులకు ఉగ్రుడైన శివుడు వీరభద్రుని సృష్టింపగా , అతడు దక్షయజ్ఞ ధ్వంసం చేస్తూ, దక్షుని పక్షంలో ఉన్న సూర్యుడు చంద్రుడు మొదలైనవారిని , తన పిడికిటిలో పట్టి నలిపివేసే సందర్భం.

    నుడివెద *దక్షయజ్ఞ* మన నొప్పెడి చిత్రము జూడ, నందులో
    ‘’వడి జనె *వీరభద్రు* డట ధ్వంసము జేయగ *దక్షయజ్ఞము* న్,
    తడబడకుండ దక్షుని పథమ్మున నుండిన దేవతావళిన్
    పిడికిట బట్టినాడు కనిపించిన వారల, నుగ్రరూపు , డా
    *పిడికిలి లోన నాకు కనిపించె దివాకర చంద్ర బింబముల్.*

    కోట రాజశేఖర్ నెల్లూరు.

    రిప్లయితొలగించండి
  18. కడు ముదమందుచున్నొసగె కన్నుల కింపగుస్మార్టుఫోనునున్
    వడి జనకుండు ప్రేమమున వన్నెల చిన్నెల దృశ్యపూరముల్
    సుడులు తిరింగి దృష్టికిని చోద్యము గొల్పగ వ్రేల గీటగన్
    "పిడికిలిలోన నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్

    రిప్లయితొలగించండి
  19. పిడికెడు నర్ఘ్యము విడచితి
    కడు వేడుక తోడ రాత్రి గంగ మునిగితిన్
    తడిసిన పిడికిలి జూడగ
    "పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్"

    రిప్లయితొలగించండి
  20. పడతుక నొక్కతె మనమున
    కడుముదముగ నిలిపికొనుచు కాంక్షను దెలుపన్
    వడినామె సమ్మతింపగ
    పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్

    రిప్లయితొలగించండి
  21. కడు విడ్డూరము విమలపు
    టుడువులఁ గొని నంతట పరమోత్సుకతన్ నే
    నడరుచుఁ బవలును రేయినిఁ
    బిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్

    [ఉడువు = నీరు ]


    అడవుల యందు వింతలను నారయ వచ్చును విశ్వమంతటం
    గడలు కొనంగ వన్య మృగ కాయము వృక్ష లతా వితానముల్
    బెడఁగెడు నేత్ర యుగ్మమున వెల్గుల తోడ మహా నగమ్ము దా
    పిడి కిలి లోన నాకుఁ గనిపించె దివాకర చంద్ర బింబముల్

    [దాపిడి = సమీపము; కిలి = చిలుక]

    రిప్లయితొలగించండి
  22. అడిగితి హస్తపు శాస్త్రిని:
    "పడిశెము నాకెపుడు తగ్గు పండిత వర్యా?" ...
    "సడలింపుము ముష్టి"...యనగ
    పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్

    సూర్య చంద్ర బింబములు = sun and moon mounds in palmistry

    రిప్లయితొలగించండి
  23. పరమేశ్వరుడు మోహినీ రూపంలో నున్న విష్ణువు తో...
    కందం.
    మడతల నీ నడుమున్ గొన
    బిడికిటఁ, గనుఁగొంటి సూర్య విధు బింబములన్ 
    బొడజూపఁగ నీ కనులన్! 
    బిడియమ్మేలా? సరసపు విందుకు రావే!

    రిప్లయితొలగించండి
  24. బుడిబుడి నడకలబుడతడు
    తడబడుచునునడుగులనిడి దడదడ నీటిన్
    విడువక నరచేత గొనిన
    పిడికిట గనుగొంటి సూర్యవిధుబింబములన్ {సూర్యుని ప్రతిబింబముటిలోచూడగా}

    రిప్లయితొలగించండి
  25. 1). కం||
    పడుచు కు తలపై నిడుకొన
    వడి గా రవి చంద్ర నగలు పసిడివి చేసెన్,
    కడు సుందర మగు నవిగొని
    పిడికిట కనుగొంటి సూర్య విధు బింబములన్

    2). కం||
    బుడిబుడి యడుగుల బుడతడు
    గడు బ్రియము న నురికి రాగ కరమున నెత్తీ,
    కుడి యెడమ కనుల గని నా
    పిడికిట కనుగొంటి సూర్య విధు బింబములన్

    రిప్లయితొలగించండి
  26. కొడుకుల జూచెదవా యని
    బుడుతడు చరవాణి బట్టి ముంగిట తన చూ
    పుడు వేలును గదుపగ నా
    పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్

    నిన్నటి దత్తపది కి నా పూరణ

    మాతృభాషను బొగడుచు మాట లాడి
    వెలుగు పూబాటయే మన తెలుగుటంచు
    నాట పాటల జూపిరి యాంధ్ర కళలు
    రాష్ట్ర రాష్ట్రేత రాంధ్రులు రక్తి గదుర

    రిప్లయితొలగించండి
  27. పరమేశ్వరుడు మోహినీ రూపంలో నున్న విష్ణువు తో..

    తడబడ జేయ దానవులు తన్మయ మందుచు వేల్పుబోనము
    న్నడిగిరె? నీదు సోయగపుటంచున దేలగ సింహమధ్యపున్
    మడతల మీటుచున్ కనుల మైకము వీడగ జిక్కబట్టగన్
    పిడికిలిలోన, నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్!

    రిప్లయితొలగించండి
  28. బుడిబుడినడకల తోడను
    కడువడుగా వృద్ధి చెందు కన్నయ్యఁ గనన్
    దృఢ హస్తపు రేఖలలో
    పిడికిటఁ గనుఁగొంటి సూర్య విధు బింబములన్

    రిప్లయితొలగించండి
  29. కడుసిగ్గున ననవతయగు
    మృడాని ముఖపద్మమెత్తి మృగధరమౌళే
    కడువేడుక నుడివె సతీ!
    పిడికిట గనుగొంటి సూర్యవిధు బింబములన్ !

    తాటంకయుగళీభూత తపనోడుప మండలా!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవివర్యులు మురళీకృష్ణగారూ! నా భాషాసామర్ధ్య మింతవరకే!ఈ మనోహర భావాన్ని మీ పద్యంలో ప్రకటించవలసినదిగా ప్రార్ధన! నమస్సులు!!

      తొలగించండి
    2. శ్రీమతి సీతాదేవి గారూ ...
      మీ కందపద్యం బాగుందండీ... అయినా మీ కోరిక ననుసరించి మీ ఉదాత్తమైన భావనను నా మాటల్లో....

      ఎడమొగమేల! దేహముననే సగమిచ్చితి గౌరి ! కోపమా!
      నుడువవె!నాకటంచు తపనోడుపమండలకర్ణభూష నీ
      శుడు బ్రదిమాలి నెమ్మొగము జూడగ గడ్డము బట్టి నిల్పగా
      పిడికిలిలోన ., నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్ !!

      తొలగించండి
    3. మురళీకృష్ణగారూ!నమశ్శతములు!అందమైన చిత్రీకరణ!అడుగగానే సహృదయముతో వ్రాశారు!ధన్యవాదములు!!
      అవధానులు కనుక అడగవచ్చుననుకొన్నాను!

      తొలగించండి
    4. మనోజ్ఞమైన భావం మీది.. ఇక పద్యరచన ఈశ్వరవిలాసం.. మంచి పద్యం వ్రాసే భాగ్యం దక్కించినందుకు కృతజ్ఞతలు.... నమోనమః... మురళీకృష్ణ

      తొలగించండి
    5. మృడాని యొక్క ముఖపద్మము మృడానీముఖపద్మమౌతుంది.గమనించగలరని నివేదన

      తొలగించండి
    6. విశ్వనాధ శర్మగారూ!ధన్యవాదములండీ!సవరణ కష్టమవుతుందేమో!భావాన్ని మాత్రమే గ్రహించ ప్రార్ధన!

      అలాగే మొదటి పాదములో అవనతకు బదులు అనవత అని టైపుదోషము కూడ జరిగినది!
      అందుకు కూడ క్షమార్పణలు! మా గురువర్యులు శలవులో ఉన్నందున దోషసవరణ జరుగలేదు.
      ధన్యవాదములు,నమస్సులు!

      తొలగించండి
    7. కడుసిగ్గున నవనతయగు
      పడతుక ముఖపద్మమెత్తి పరమేశ్వరుడే
      కడువేడుక నుడివె సతీ!
      పిడికిట గనుగొంటి సూర్యవిధుబింబములన్ !

      తొలగించండి
    8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  30. తడయక లోని కేగుటకు తావును జూపని నన్ను మారుతీ
    పిడికిటి పోటు నేయుటకు పెద్దగ దేహము బెంచి లిప్తలో
    నుడుగణవీధి నిండి కరమున్ బిగియింపగ కాలు వోలె నీ
    పిడికిలిలోన నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్.

    రిప్లయితొలగించండి
  31. అడరిన కోపము ముడిచిన
    పిదికిట కనుగొంటి! సూర్య విధు బింబములన్
    విడివడని సందె వేళల
    కడు సంతసమున మురియుచు గాంచితి నిచటన్!

    రిప్లయితొలగించండి
  32. గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.

    పద్దెపు యాటలాడ నిట పండితు లందఱు వేదికల్ గొనన్
    విద్దెల ప్రాభవమ్ము లిల వేడుక చేసెడి మాటలన్ననన్
    ముద్దుగ నాట పాటల ప్రమోదము గూర్చెడి వారలున్ సదా
    సిద్ధము మేమనన్ తెనుగు సేద్యము శోభిలె బాటలన్నిటన్!

    రిప్లయితొలగించండి
  33. పడుకొని చూచుచుండగ నభమ్మున తారలు చంద్రబింబమున్
    కొడుకటు వచ్చి చూపెను ఖగోళపు చిత్ర విచిత్ర వింతలన్
    వడివడి చేతి స్మార్టు చరవాణిని త్రిప్పుచు త్రిప్పుచు గొప్పగా...
    పిడికిలిలోన నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్

    రిప్లయితొలగించండి
  34. ****
    "వడివడి చేతి స్మార్టు చరవాణిని త్రిప్పుచు త్రిప్పుచుండగా"

    రిప్లయితొలగించండి
  35. అడుగగ వోట్లనిమ్మనుచు హాయిగ నిచ్చుచు మేకబిర్యనిన్
    బడుగుల సేవకోరుచును భారత భూమిని వృధ్ధిజేయుటన్...
    కడకిక మెచ్చి చూడగను కన్నులు విప్పుచు హస్తమందునన్
    పిడికిలిలోన నాకుఁ గనుపించె దివాకర చంద్ర బింబముల్

    రిప్లయితొలగించండి