13, డిసెంబర్ 2017, బుధవారం

సమస్య - 2545 (వెన్నెలయే చెలి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్"
(లేదా...)
"వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

89 కామెంట్‌లు:

  1. ఎన్నో దినమ్ము లాయెను
    వన్నెల చెలికాని రామి వలపులు రేపన్
    గన్నెలను మరులు గొలిపెడి
    వెన్నెలయే చెలి తనువును వెచ్చగ జేసెన్.

    రిప్లయితొలగించండి
  2. ఎన్నగ గృష్ణరాయధరణీశుడు వైరులపాలి మృత్యువై
    కన్నుల క్రోధవీక్షణలు గమ్యము జేర్పగ దారిచూపగా
    నన్నులమిన్న వీడి రణయాత్రకు సాగగ దిర్మలాంబకున్
    వెన్నెలరేయియే తనువు వెచ్చగ జేసెను సుందరాంగికిన్.

    రిప్లయితొలగించండి
  3. చెన్నై సముద్ర తటమున
    కన్నులనే వేడి గాడ్పు కాల్చుచు నుండన్
    పన్నుగ వేసవి పున్నమి
    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్ :)

    రిప్లయితొలగించండి
  4. అన్నుల మిన్నను గోరుచు
    చెన్నపురిని యున్న బావ చెన్నుడు వేగన్
    పున్నమి రేయిని రాగనె
    “వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెన్నపురిని నున్న...' అనండి.

      తొలగించండి
  5. పున్నమి వేళ వచ్చెనని పూర్తిగ శీతల కాలమందునన్
    మిన్నగ పవ్వలించె చలి మీరిన లెక్కయు లేక మేడపై
    క్రన్నన వచ్చెనా జ్వరము కర్కశమై రసదృష్టి లేకయే
    వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్||

    రిప్లయితొలగించండి


  6. మొన్నటి నుండీ చూస్తు
    న్నాన్నండీ కవివరా! మన సదనమందున్
    పున్నమియే కైపదమై
    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నాళ్ళైనను కవులను
      వెన్నుని రాధల విరహము విసిగించదులే
      మొన్నయు నిన్నయు నేడును
      వెన్నెలయే! చెలి! తనువును వెచ్చఁగఁ జేసెన్

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ అధిక్షేపాత్మక పూరణ బాగున్నది. అభినందనలు.
      కాకుంటే కొన్ని వ్యావహారిక పదాలు దొర్లాయి.
      *****
      ప్రభాకర శాస్త్రి గారూ,
      జిలేబీ గారి అధిక్షేపానికి సమాధాన రూపమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  7. కన్నడి రాసలీల కథ గానము జేసిరి మేలుగన్ భళా
    యన్నులమిన్న నాట్యములయా! పరిణాయకుడయ్యె తోడుగన్
    కన్నులవించిజోదు సయి కార్ముక మున్ మరి యెక్కుపెట్టగన్
    వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁజేసెను సుందరాంగికిన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పరిణాయకుడు, కన్నుల వించిజోదు'... ఎక్కడ దొరుకుతాయండీ మీకీ పదాలు?!

      తొలగించండి
    2. హృదయమునను మనమందున
      పదములలో కరములందు బహుభద్రముగా
      పెదవులలో రసనములో
      వదనమున జిలేబి యాంధ్ర భారతి దాచెన్!

      తొలగించండి
    3. ఆహా!మైలవరపుగారి శిష్యరికంలో అన్నయ్యలోని కవి బయటికి వస్తున్నాడు!!

      తొలగించండి


    4. जीपीयेस् जी नमोनमः !


      కంది వారు
      అందరికి ఆంధ్రభారతి యే అంతరాత్మ :)


      నెనరులు

      జిలేబి

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    మున్నెన్నడిట్లు లేదే !
    కన్నయ్యను గనక కనులు కాయలు గాచెన్ !
    విన్నావా ! విరహమ్మున
    వెన్నెలయే చెలి ! తనువును వెచ్చగ జేసెన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నియునాతడంచు హృదయమ్మున నమ్మిన రాధ ప్రేమసం..
      పన్న , మనోహరున్ వెదకి , మాయల కృష్ణుని పొందు పొందలే...
      దెన్నగ నింగినందున జ్వలించుచు నుండగ శీతభానుడున్
      వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. వెన్నుడునాలపించ మది వీణలు మీటుచు వేణుగానమున్
    చెన్నువ మీరగా యమున చెంతన కృష్ణుని కౌగిలింతలో
    అన్నులమిన్నకామనలు హాయినిబొందెడి క్రీడలందునన్
    వెన్నెలరేయియే తనువు వెచ్చగ జేసెను సుందరాంగికిన్

    రిప్లయితొలగించండి
  10. కన్నులు కాయలు కాయ గ
    అన్నుల మిన్న చెలి కాని యాగమన ము కై
    యున్న నిరీక్షఫలించగ
    వెన్నెల యే చెలి తనువు ను వెచ్చగ చే సె న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆగమనమునకై' అనడం సాధువు. "ఆగమనము దా। నెన్ని నిరీక్షింపగ..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  11. ఎన్ని దివసమ్ములయ్యెన్
    కన్నయ్య విజయము జేసి, కలువలరాయా
    అన్నువ బాధను దెలుపుము
    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్

    సత్యభామ వద్ద ఉన్న కృష్ణుడు రాలేదని జాంబవంతి చంద్రునికి మొర బెట్టుకొనుట

    రిప్లయితొలగించండి
  12. అన్నుల మిన్నగు రాధకు
    వెన్నునికై యెదురుజూచు విరహము లోనన్
    మిన్నున కురిసెడు పున్నమి
    వెన్నెలయే చెలి, తనువును వెచ్చగ జేసెన్!!!

    రిప్లయితొలగించండి


  13. మూన్నాళ్ళుగ వింజామర
    వెన్నెలయే! చెలి,తనువును వెచ్చఁగఁ జేసెన్!
    విన్నానమ్మ యనూష్కా !
    వెన్నంటి విరాటు కొహిలి వేడిమి యటనే :)


    ಜಿಲೇಬಿ

    రిప్లయితొలగించండి
  14. శకుంతలా దుష్యంతుల వృత్తాంతము
    అన్నెముపున్నెము నెరుగని
    కన్నియను వరించిదాను గాంధర్వమునన్
    పన్నుగ పురమునకేగగ
    వెన్నెలయే చెలితనువును వెచ్చగజేసెన్

    రిప్లయితొలగించండి
  15. మన్నించుము స్పృశియించితి
    నిన్ననుమతి యడుగకుండనే నీ మేనున్
    నన్నింత రెచ్చ గొట్టెను
    వెన్నెలయే చెలి! తనువును వెచ్చగ జేసెన్

    రిప్లయితొలగించండి
  16. ఎన్నని యూసులుఁ జెప్పిన
    నన్నిల దుష్యంతరాజు నమ్మిక తోడ
    న్నెన్నఁగ గాంధర్వమునన్
    వెన్నెలయే చెలి! తనువును వెచ్చఁగఁ జేసెన్!

    రిప్లయితొలగించండి
  17. పొన్నల మధ్యను నక్కిన
    వెన్నుడె చెన్నుగ ప్రియసఖి వెన్నున చఱచన్
    కన్నయ్యను వెన్నంటిన
    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    సందులందు కల్లు సారాయి గంజాయి
    బారులందు దొరకు బీరు గాక
    చక్రి క్రీడి కిడిన చక్కని గీత సా
    రమ్ముఁ గ్రోల జబ్బు రాదు దరికి"

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి మరో పూరణ


    సర్వస్వతంత్ర కవిలోకాన్ని విమర్శించే.. అరసికుని అంతరంగం....

    కన్నులట యుత్పలమ్ములు
    నెన్నడుమన గగనమంట ! నిశి శశి గాల్చున్
    వెన్నెల మంటలనందురు !
    వెన్నెల యే చెలి తనువును వెచ్చగ జేసెన్ ?!

    ( *అది అనుభవైకవేద్యం*... *లాజిక్కులు పనికిరావు*)... అని నా సమాధానం...

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ పూరణ ఉత్కృష్టంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మైలవరపువారూ! బహుచక్కని పూరణ!అభినందనలు!

      మీ సమాధానాన్ని నామాటలలో.మీరనుమతిస్తేనే సుమా!

      కన్నులవి యుత్పలమ్ములె
      నెన్నడుమే గగనమౌను నేర్పుగ జూడన్
      పున్నాగపూవు నాసిక
      కన్నారగ గాంచు కవికి కావ్యము గూర్చన్ !

      తొలగించండి
    3. వావ్... అద్భుతమ్ 🙏🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    4. 👆కవిశేఖరులకందరికీ అంకితమ్ 🙏🙏🙏🙏మురళీకృష్ణ

      అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః
      యథాస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే !!

      ఎన్నగ కావ్యలోకము సృజించిన సత్కవి *సృష్టికర్త* ! స్వే......
      చ్ఛన్ నినదించు తద్గళము ! శాంతగభీరము ! వాని కల్పనో..
      త్పన్నజగమ్ము దిమ్మినొక బమ్మిని జేయగ గల్గు , భావసం...
      పన్నుడు, సాహితీ రస పిపాసులకున్ ప్రప వంటివాడు దా
      క్రన్నన యూహజేసియు సరస్వతికిన్ గళసీమ దండ దా
      ల్పన్ నవరాగరంజిత విలాసముగా నగు , వాని నెవ్వరే
      మన్నను సృష్టి శాశ్వతమనంతమలౌకికతృప్తినిచ్చు , ని
      న్నున్ నను భావవీచికలనోలలనాడగజేయు ,
      నాతడే
      వెన్నెల చల్లనౌననును , వేరొకచో పెనుమంట యంచు న...
      మ్మన్ నిజమే యనంగనను , మట్టిని స్వర్ణమటంచు మెచ్చ ప..
      ల్కన్ నిపుణుండు , శాబ్దిక సులక్షణశోభిత తజ్జగమ్మునం...
      దన్నులమిన్న తాను విరహమ్మున మ్రగ్గుచునుండ గాంచుమా
      వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. కంది శంకరయ్య గారు:

      మైలవరపు వారూ,
      అవధానులనిపించుకున్నారు. అత్యద్బుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  19. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: ఎన్నడూ విడిచి యుండని ప్రియుడు, దూరంగా వెళ్తే, ప్రేయసి ఆ ప్రియుని గుణములనే తలచుకొంటూ సంతోషపడుతూ ఉంటుంది. చంద్రుడు (రోహిణీ నక్షత్రం కోసం) వెళ్లిపోగా తార తనను వదలి వెళ్లిన సుధాంశుని గుణములను తలచుకొంటూ, వెన్నెలను కనులారా దర్శిస్తూ, చంద్రుడు తన కౌగిలిలోనే ఉన్నట్లు భావన చేస్తూ, సంతోషిస్తూ ఉండగా , ప్రియుని తేజస్సుతో నిండిన రాత్రి , అంటే ఆ వెన్నెలరేయి సుందరాంగియైన ఆ తార శరీరానికి వెచ్చదనాన్ని కలిగించింది. అని చెప్పే సందర్భం.

    ఎన్నడు వీడనట్టి ప్రియు డేగగ, ప్రేయసి తద్గుణమ్మునే
    యెన్నుచు సంతసించు ; శశి యేగగ రోహిణి జేర , వెన్నెలన్
    కన్నుల జూచుచున్, ప్రియుని కౌగిలి నున్నటు లెంచె తార , యా
    *వెన్నెల రేయియే తనువు వెచ్చగ జేసెను సుందరాంగికిన్.*

    *కోట రాజశేఖర్ నెల్లూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా, ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. వైవిధ్యమైన పూరణ రాజశేఖర్ గారూ!సాధారణంగా విరహములో వెన్నెల విరోధిగా భావింప బడుతుంది! కాని మీరు మిత్రత్వం చూపారు!అభినందనలు!నమస్సులు!!

      తొలగించండి
  20. పున్నమిరేడుజారిపడిముద్దుమొగాన మకాము బెట్టెనో
    యెన్నడురానిభావనలుయెందుకుమానసమందుబుట్టెనో
    సన్ననిపూలబాణములు చక్కిలిగింతలు బెట్టెనందుకే
    వెన్నెలరేయియేతనువువెచ్చగజేసెనుసుందరాంగికిన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారూ,
      పున్నమిరేడు జారిపడి ముద్దుమొగాన మకాము పెట్టాడా? మధురమైన భావన! మనోహరమైన పూరణ. అభినందనలు.
      'భావనలు+ఎందుకు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "భావన లివెందుకు..." అందామా?

      తొలగించండి
    2. చక్కని పూరణ! పీతాంబర్ గారూ!అభినందనలు!

      తొలగించండి
  21. నిన్ననె వచ్చెను పెనిమిటి
    పన్నాగముఁ జొరబడంగ పన్నిరి శత్రుల్
    సన్నద్ధమై రమ్మన
    వెన్నెలయే చెలి! తనువును వెచ్చఁగఁ జేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "సన్నద్ధమగుచు రమ్మన" అందామా?

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. టైపాటు సవరణతో
      నిన్ననె వచ్చెను పెనిమిటి
      పన్నాగముఁ జొరబడంగ పన్నిరి శత్రుల్
      సన్నద్ధమ్మై రమ్మన
      వెన్నెలయే చెలి! తనువును వెచ్చఁగఁ జేసెన్

      తొలగించండి
  22. చిన్నతనమ్మునుండి మదిఁ చేరి చెలంగెడి బావ భర్తయై
    యున్నత విద్యకై వెడల నుత్తరదేశము, రాత్రివేళలన్
    క్రన్నన వచ్చి చెంతకును కంతుడు నల్లరి పెట్టుచుండగా
    వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్

    రిప్లయితొలగించండి
  23. సున్నితగాత్రకు కష్టము
    వెన్నెలయే ; చెలి తనువును వెచ్చగ జేసెన్
    నిన్నటి గాడుపు నేడీ
    సన్నని మారుతము వీవ శాంతిని బొందెన్
    (అమె వెన్నెలకి కూడా కంది పోతుంది అని ఒక అతిశయోక్తి వాడుకలో ఉన్నది)

    రిప్లయితొలగించండి
  24. . ఎన్నాళ్ళీవిరహంబను
    కొన్నప్పుడు?మగడులేక కోర్కెలు బెరుగన్|
    కన్నియలా బడుకొనగా?
    వెన్నెల యేచెలి తనువును వెచ్చగ జేసెన్|
    2.పున్నమికాంతి,గాలి,యెద పుత్తడి తాళియునొక్క?పాన్పుపై|
    అన్నులమిన్న వాల్ జడల కంటిన పువ్వులు నవ్వుచుండగా|
    కన్నులదాగి గాంచకను కౌగిలి జేరని కాంతుడుండగా?
    వెన్నెల రేయియే తనువు వెచ్చగ జేసెను సుందరాంగికిన్|
    .




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. కన్ననిఁ గానని దినమున
    సున్నితపుఁ బఱుపు గఱుక గుచు వెతల నిచ్చెన్
    సన్న వలువ బరు వయ్యెను
    వెన్నెల యే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్


    పన్నుగ భామలందఱును బన్నగ మర్దను గూడి సల్పఁగం
    జెన్నగు నాట్య కేళిని విచిత్రముగన్ హరి మాయ మయ్యెనే
    కన్నని దివ్య విగ్రహముఁ గన్నులఁ గాంచఁగ లేక వేదనన్
    వెన్నెల రేయియే తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


  26. కన్నులు కాయగ వేచెను

    కన్నియ యచ్చో ప్రియతము కాంతుని కొరకై

    అన్నన్న నిరాశ మిగిలె

    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్.


    కన్నయ్యేతెంచుననుచు

    అన్నులమిన్నయు ముదమున నాశావహయై

    సన్నిధి చేరగ చల్లని

    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  27. కన్నుల నిండుగన్ బ్రియుని గాంచగలేక విరక్తిజెంది తాఁ
    ఖిన్నతఁ మేడపైన తమకించుచు నుండఁగఁ గొమ్మ మాటునన్
    క్రన్నన నా శుకాళి బహుశ్రావ్య మనోహర గీతికంబులన్
    వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్

    గురువుగారూ "బహుశ్రావ్యం"అనేది కొంచము సందేహము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
      'బహుశ్రావ్య' మన్నపుడు నేను వ్యక్తిగతంగా 'హు'ను గురువుగానే భావిస్తాను. రేఫసంశ్లిష్టాక్షరానికి ముందున్న పూర్వపదాంతాక్షరం గురువుగాను, లఘువు గాను స్వీకరించే సంప్రదాయం కొనసాగుతున్నది. కనుక దోషం లేదు. అంతగా దోషమనుకుంటే 'కడు శ్రావ్య...' అనవచ్చు.

      తొలగించండి
    2. మీసూచన ప్రకారము కడుశ్రావ్యమనే పదాన్ని స్వీకరిస్తున్నాను గురువుగారు. లాక్షణికులు హు ను గురువు గానే చేస్తారు. ఎందుకో ఈసారి సందేహము వేసింది. ధన్యోస్మి

      తొలగించండి
  28. .
    పున్నమి రేయిన సఖుడౌ
    వెన్నుని జాడల నరయక విరహము తోడన్
    కన్నుల నీరది నిండగ
    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్.

    విన్నకథలెల్ల నిజమని
    వెన్నుడు గోపికలవెంట విహరించుటయున్
    కన్నంతనె దుఃఖముతో
    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  29. మన్నన వీడి కీచకుడు మానిని వెంటఁ బడంగ మోహియై
    తిన్నఁగఁ జంపగన్ వలలుఁ దీర్చుచు నర్తనశాల నందునన్
    చెన్నుగ భర్తకున్ తనదు చీరనుఁ దాకి ధరింప జేయగన్
    వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్

    రిప్లయితొలగించండి
  30. క్రన్నన కోపగృహమ్మున
    విన్నాణపు సత్య కుమిలి విలపించన్
    కన్నయ చిరు నగవులనెడి
    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  31. గురుదేవులకు వినమ్రవందనములు .
    రాధ కన్నయ్య కొరకు వేచి యుండగ, కన్నయ్య ఎంతకూ రాక పోయేసరికి...
    కం
    కన్నయ్యను కోరి నిలువ కాంతలు ముదమున్
    కన్నయ్య వెడలెనంత కాంతలతోడన్,
    పున్నమి మరి పలుకరించ పొంకమలర యా
    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      మీ పూరణకు కందపద్య లక్షణాలు లేవు. ఇది ఏ ఛందస్సు? మీ పద్యానికి నేనిచ్చిన కందరూపం...
      కన్నయ్యను కోరి నిలువ
      కన్నయ్యయె వెడలెనంత కాంతలతోడన్,
      పున్నమియె పలుకరించగ
      వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్.

      తొలగించండి
    2. గురుదేవులకు వినమ్రవందనములు
      సవరణకు ధన్యవాదములు
      శ్రీ నేమాని గురుదేవులు వ్రాసారు అప్పుడు నేనుకూడా అడిగాను, కందం ఇలా కూడా వ్రాయ వచ్చుఁ అన్నారు .

      తొలగించండి

  32. ఎన్నో బాసలు చేయగ
    నన్నులమిన్నయును నమ్మి యవనీపతికిన్
    క్రన్నన మనమర్పింపగ
    వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్.

    రిప్లయితొలగించండి
  33. అన్నులమిన్నగ పున్నమి
    వెన్నెల రేయినలరారు ప్రేమపుబెళుకున్
    రువ్విన వెన్నుడి గన్నుల
    వెన్నెలయే చెలి తనువుని వెచ్చఁగఁజేసెన్ !!

    @ మీ పాండురంగడు *
    ౧౩/౧౨/౨౦౧౭

    రిప్లయితొలగించండి
  34. కన్నియ వీనులన్ మురియ కన్నడి వేణువు సోకినంతనే
    పన్నుగ మానసంబునను వందల వీణలు మారుమ్రోగగా
    పున్నమి రాత్రివేళ వపువూగుచు త్రుళ్ళుచు నాట్యమాడుచో
    వెన్నెలరేయియే తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్

    రిప్లయితొలగించండి
  35. కన్నుల పండుగై విరిసి కన్నియ హృత్తులు కొల్లగొట్టుగా
    వెన్నెలరేయియే!;...తనువు వెచ్చఁగఁ జేసెను సుందరాంగికిన్
    పన్నుగ క్రొత్తవత్సరపు పార్టిలు జేయుచు నాట్యమాడుచున్
    మొన్నను నిన్ననున్ తినగ ముప్పది క్రీములు భాగ్యనగ్రిలో

    రిప్లయితొలగించండి