తోడికోడలు పుత్రులు తన పుత్రులే అని కుంతి సంతసిల్లెనని వ్రాద్దామనుకొని తోడికోడలికి సరియైన పదం తెలియక మిమ్మల్ని అడిగితిని. మంచి పదం తెలియ జేశారు. ఇప్పుడే వ్హాట్సప్ లో డాక్టర్ వెలుదండ సత్యనారాయణ గారు ప్రచురించిన ఈ పూరణ చూడండి:
ఎంత విశాల శీలమొ! య దెంతటి ప్రేమ గుణంబొ గాని యా వంత యసూయ లేదు- తన యాతకు నూర్వురు పుత్రు లైరటం చెంతయు బ్రీతి నందరిని జేరుచు బల్కెను- వందనంబు లా కుంతికి వంద - మంది కొడుకుల్ జనియించిన బొందె మోదమున్
✒~ డా. వెలుదండ సత్య నారాయణ 4-12-17 """"""""""""""""""""""""""""""""""""""""""""""""""""" యాత= తోడి కోడలు(గాంధారి)
సంతు గలిగెను మువ్వురు సంతసముగ గుంతికి, శతసుతుల్ గల్గ సంతసిల్లె . నింతి గాంధారి,యిరువురి ని గన మాద్రి, సంతసించె పాండు నృపతి యంతు లేక మిత్రులకు నమస్కారములు. ఈ రోజు నేను వ్రాసిన మత్య్స బంధము గురువు గారు బ్లాగులో పెట్టారు. వారికి ధన్యవాదములు. పరిసీలిమ్చి మీ అభిప్రాయములు తెలుప ప్రార్ధన
సందర్భం :: ధృతరాష్ట్రుని భార్య గాంధారి, వ్యాసభగవానుని వరంతో, గర్భమును ధరించింది. ఒక సంవత్సరం గడిచినా, ఆమెకు ప్రసవం కాలేదు. కుంతీదేవికి కొడుకు పుట్టినాడని తెలిసికొని, అసూయపడి బాధతో, ఆమె తన గర్భమును తన చేతులతో తానే కొట్టుకొంటూ యేడ్చింది. ఆ తరువాత తనకు వందమంది కుమారులు ఒక కుమార్తె కలిగితే ఆ గాంధారి సంతోషపడిన సందర్భం.
మాద్రి తనయులిరువురును,భాను వరము తోడి కర్ణుబొందె, తనసుతులు నలుగురు కుంతికి,శత సుతుల్ గల్గ సంతసిల్లె శకుని సోదరి ,చరితన సరస హృదయ. గురువు గారు చివరి పాదము మార్చి పూరించడమైనది. నమః పూర్వక ధన్యవాదములు.
చింత తీరగ పాండవుల్ చెంత నుండ,
రిప్లయితొలగించుపంత మెంతయు లేకయె కొంత శాంతి,
సంతసము లేక కౌరవులంత మొంద,
కుంతికి, శతసుతుల్, గల్గ సంతసిల్లె
...సార్!
అన్వయం అష్టావక్రమైనది...కానీ, తేటగీతిలో ప్రాస, ప్రాస యతి, సాధించితిని... పాస్ చేయ ప్రార్ధన!
తొలగించుజీపీయెస్ వారికి
వెల్కం బెక బెక తేటగీతి హైకూలకు :)
తేటగీతి హై, కూలు :)
పాసుమార్కుల వేయుడు పట్టు బట్టి
వాసి గన తేట గీతిని ప్రాస యతుల
వేసి చక్కగా యత్నము జేసి నాడ
రాసులన రాసెదనిక వరముగ రాగ !
ఆల్ ది బెష్టు తో
సావేజిత
జిలేబి
జిలేబీ గారూ:
తొలగించుధన్యవాదములు! నాకు వరసలు కట్టడం రాదు కానీ, కుంతికి దుర్యోధనాది కౌరవులు ఏమవుతారు? ఒక రకమైన సుతులేనా?
తొలగించుయాతపుత్రుడనవచ్చనుకుంటా :)
జిలేబి
తొలగించుయాత - తోడికోడలు
పుత్రుడు - కుమారుడు
కుంతికి దుర్యోధనాదులు యాతపుత్రులు :)
జిలేబి
🙏🙏🙏
తొలగించుప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించుకొంత అన్వయలోపం ఉన్నా మీ పూరణ ప్రాసక్రీడతో అందంగా ఉన్నది. అభినందనలు.
నమో నమః
తొలగించు🙏🙏🙏
జిలేబీ గారూ:
తొలగించుతోడికోడలు పుత్రులు తన పుత్రులే అని కుంతి సంతసిల్లెనని వ్రాద్దామనుకొని తోడికోడలికి సరియైన పదం తెలియక మిమ్మల్ని
అడిగితిని. మంచి పదం తెలియ జేశారు. ఇప్పుడే వ్హాట్సప్ లో డాక్టర్ వెలుదండ సత్యనారాయణ గారు ప్రచురించిన ఈ పూరణ చూడండి:
**************************************
సందర్భము: విశాల హృదయము గలిగిన కుంతి మందికి (ఇతరులకు) కొడుకులు పుట్టినంతనే యెంతయో సంతోషించుట..
=============================
ఎంత విశాల శీలమొ! య దెంతటి ప్రేమ గుణంబొ గాని యా
వంత యసూయ లేదు- తన యాతకు నూర్వురు పుత్రు లైరటం
చెంతయు బ్రీతి నందరిని జేరుచు బల్కెను- వందనంబు లా
కుంతికి వంద - మంది కొడుకుల్ జనియించిన బొందె మోదమున్
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
4-12-17
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
యాత= తోడి కోడలు(గాంధారి)
తొలగించుఅదురహో ! జీపీయెస్ వారు
యాతపుత్రులని మీరిక రాయొచ్చు :)
జిలేబి
కాల దోషం :(
తొలగించుఏవురు సుతులు జన్మించి రెవ్వరికిని?;
రిప్లయితొలగించువింత ! గాంధారి గనెగదా ! విధివశమున;
సీత ,రాముడే భర్తగా చెంత తనకు;
"కుంతికి ; శతసుతుల్ ; గల్గ సంతసిల్లె"
జనార్దన రావు గారూ,
తొలగించుమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
పంచ పాండవు లందరు వరము వలన
రిప్లయితొలగించుకుంతికి , శతసుతుల్ గల్గ సంత సిల్లె
తపము జేయగ గాంధారి తనరు మదిని
నింగి నంటిన మోదంబు పొంగి పొరలె
అక్కయ్యా,
తొలగించువిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పాండవుల్ గల్గిరి..." అనండి. బాగుంటుంది.
పంచ పాండవుల్ గల్గిరి వరము వలన
తొలగించుకుంతికి , శతసుతుల్ గల్గ సంత సిల్లె
తపము జేయగ గాంధారి తనరు మదిని
నింగి నంటిన మోదంబు పొంగి పొరలె
ఇంతిగ నంధరాజునకు, నిమ్ముగ కోడలు కౌరవంబునన్,
రిప్లయితొలగించుగంతలు గట్టె పంతమున గాదిలి సౌబలి పావనంబుగన్!
చింతను బొందె కానుపది శ్రీఘ్రము గాకయె, తోడికోడలై
కుంతికి, వందమంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదమున్!!
సత్యనారాయణ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎంత ద్రావితి వోగదా యీత కల్లు!
రిప్లయితొలగించుపనికి రానట్టి మాటలు పలుక నేల?
యేడ పాండు విభుని సతి జూడగాను
కుంతికి శతసుతుల్ గల్గ సంతసిల్లె?
జనార్దన రావు గారూ,
తొలగించుమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
మాద్రి సుతుల దన సుతుల మమతగ గని
రిప్లయితొలగించుతన్మయత్వము మదిలొన తరగ లెత్తె
గుంతికి ;శత సుతుల్ గల్గ సంతసిల్లె
సాధ్వి గాంధారి పతి జూచి సరభసమున .
నాల్గవ పాదంలొ 'జూచి 'బదులుగ 'దాకి 'అని చదువగలరు .
రిప్లయితొలగించుబాపూజీ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించుఅయిదుగురు పుత్రులు కలిగి రాయె మాత
కుంతికి ; శతసుతుల్ గల్గ సంతసిల్లె
తల్లి గాంధారి ! కథలను తరచిజూచి
రయ్య కాలపు తీరుల రమ్యముగను !
జిలేబి
రిప్లయితొలగించువింత కథాస్రవంతియది ! వీరులు పాండుకుమారు లయ్యిరా
కుంతికి; వందమంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదము
న్నెంతయు సౌబలేయి! సయి నెమ్మిగ యుండిరి వైపరీత్యమై
కొంతయు యచ్చిరాక విధి కోరల మగ్గిరి! భారతమ్మదే !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"నెమ్మిగ నుండిరి... కొంతయు నచ్చి రాక..." అనండి.
డా.పిట్టా
రిప్లయితొలగించుపంచ సుతులు కుంతిికి పాండు భరత నృపతి
కెంత బలశాలురను లెక్క సుంత జేయ
ఒకని కిరువది కౌరవు లోరి!బిగిని
కుంతికి శత సుతుల్ గల్గ సంతసిల్లె
ఇంతికి గోవు పాలవలె నిద్దరు ముగ్గురు నైదు సంతనన్
వంతల గంత ధారికిక వందట పుత్ర బలమ్మునెంచగా
వింతగ బంచ వింశతికి వీరుడదొక్కడు గాగ దార్ఢ్యతన్
కుంతికి వందమంది కొడుకుల్ జనియించిన బొందె మోదమున్!!
డా.పిట్టా
రిప్లయితొలగించుఎంతకు సాహితీ ప్రతిభ నిట్టుల మెచ్చరు పాత పాటలన్
వింతగ బాడగా వలయు వీరుల గాథలు క్రిందు మీదుగన్
ఇంతకు మార్క్సు వాదులకె యెన్నియొ శ్రీలు(శ్రీశ్రీకివలె)గడంగ వ్రాయుమా
"కుంతికి వంద మంద కొడుకుల్ జనియించిన బొందె మోదమున్"
ఇంతకు సంప్రదాయ యుతు "డిట్లసుతన్"గనె మార్చి మార్చి యా
పొంతన కోప కారకము ,పోరది యెందుకు? మెప్పు కోసమే!
ఎంతకు రాని సద్యశము నిట్టుల గొట్టగ జూడు మొదలిడన్,
"కుంతికి వందమంది కొడుకుల్ జనియించిన బొందె మోదమున్!"
డా. పిట్టా వారూ,
తొలగించుమీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
చివరి పూరణ మూడవ పాదంలో 'మొదలిడన్' అన్నచోట గణదోషం. సవరించండి.
డా.పిట్టా
తొలగించు"గొట్టగ జూడ వ్రాయుమా" తో సరిచేసినాను .కృతజ్ఞతలు,ఆర్యా,
సంతు గలిగెను మువ్వురు సంతసముగ
రిప్లయితొలగించుగుంతికి, శతసుతుల్ గల్గ సంతసిల్లె .
నింతి గాంధారి,యిరువురి ని గన మాద్రి,
సంతసించె పాండు నృపతి యంతు లేక
మిత్రులకు నమస్కారములు. ఈ రోజు నేను వ్రాసిన మత్య్స బంధము గురువు గారు బ్లాగులో పెట్టారు. వారికి ధన్యవాదములు. పరిసీలిమ్చి మీ అభిప్రాయములు తెలుప ప్రార్ధన
పూసపాటి వారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించుగంతలు కట్టుకున్న తన కాంతయు పుత్రుల నిచ్చెనంచు నూ
రంతయు చాటి చెప్ప దృత రాష్ట్రుడు
గర్వము మీరనింతికి
న్నంతయు వింతయే యనుచునా శకునక్కయు చేరవేయగా
కుంతికి, వంద మంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదమున్
చారి గారూ,
తొలగించుమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
శూరులేవురు గల్గిరి సూనులింతి
రిప్లయితొలగించుకుంతికి, శతసుతుల్ గల్గ సంతసిల్లె
ధృతరాష్ట్రుడు కరమగు తృప్తితోడ
సురనదీ సూనుని కనులు మెరుగులీనె
అన్నపరెడ్డి వారూ,
తొలగించుచక్కని పూరణ. అభినందనలు.
ధృతరాష్ట్రుని... అన్నచోట గణదోషం. సవరించండి.
సవరించిన పూరణ
తొలగించుశూరులేవురు గల్గిరి సూనులింతి
కుంతికి, శతసుతుల్ గల్గ సంతసిల్లె
కౌరవ పతి తా కనుగొని గయమునందు
సురనదీ సూనుని కనులు మెరుగులీనె
అన్నపరెడ్డి వారూ,
తొలగించుసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాండవు లయిదు గు రు సుతుల్ పాండు సతి కి
రిప్లయితొలగించుకుంతి కి ;శత సుతుల్ గల్గ సంత సిల్ల్లే
తల్లి గాంధారి విజయoబు తనదె నను చు
పొంగి పోయెను గర్వాన పుడమి యందు
రాజేశ్వర రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తనదె యనుచు.... అనండి.
మైలవరపు వారి పూరణలు
రిప్లయితొలగించుధర్మరాడ్భీమపార్థులు తనయులైరి
కుంతికి., శతసుతుల్ గల్గ సంతసించె
మాత గాంధారి., మురిసెను మాద్రి సుతుల
నకుల సహదేవులను గని సుకవి ! వినుమ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అంతక వాయుదేవ విబుధాధిపులన్ భజియింప బుత్రులై
రంతనె ధర్మజుండు ననిలాత్మజుడింద్రజుడున్ మహాబలుల్
కుంతికి ., వందమంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదమున్
భ్రాంతిని మున్గి తాను ధృతరాష్ట్రుని భార్య యజేయులంచనన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించుమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
యమునివరమున జనియించె నగ్రజుండు
రిప్లయితొలగించుభీముడర్జునులు గలిగె వెంటవెంట
కుంతికి,శతసుతుల్ గల్గిసంతసిల్లె
ముదిత గాంధారి తనతప్పుముప్పుదొలగ!
సీతాదేవి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"భీము డర్జునుల్ గల్గిరి" ఆనండి.
ధన్యవాదములు గురుదేవా! సవరించెదను!
తొలగించుయాత సుతునంద గాంధారి యాతన బడి
రిప్లయితొలగించువగచి గర్భచ్యుతికి తానె పాల్పడంగ
వ్యాసుఁ డుద్ధరించిన వార్త లందఁగ నట
కుంతికి, శతసుతుల్ గల్గ సంతసిల్లె!
సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోట రాజశేఖర్ గారి పూరణ
రిప్లయితొలగించుసందర్భం :: ధృతరాష్ట్రుని భార్య గాంధారి, వ్యాసభగవానుని వరంతో, గర్భమును ధరించింది. ఒక సంవత్సరం గడిచినా, ఆమెకు ప్రసవం కాలేదు. కుంతీదేవికి కొడుకు పుట్టినాడని తెలిసికొని, అసూయపడి బాధతో, ఆమె తన గర్భమును తన చేతులతో తానే కొట్టుకొంటూ యేడ్చింది. ఆ తరువాత తనకు వందమంది కుమారులు ఒక కుమార్తె కలిగితే ఆ గాంధారి సంతోషపడిన సందర్భం.
*కాంత యసూయ నందినది, గర్భిణియౌ ధృతరాష్ట్రుపత్ని, ని
శ్చింతను వీడి,గర్భమును చేతుల గొట్టుచు నేడ్చె నిట్టులన్,
*’’సంతస మిచ్చునట్టి వర సంతతి గల్గెను ముందుగానె యా*
*కుంతికి’’* ; *వందమంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదమున్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.*
కోట రాజశేఖర్ గారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పొంతన గల్గ యింతులకు పుట్టిరి ముద్దుగ పంచ పాండవుల్
రిప్లయితొలగించుకుంతికి, వంద మంది కొడుకుల్ జనియించిన బొందె మోదమున్
ఇంతియ మాద్రియున్, మురిసె నిందఱు, రాజులు సంత సించగా
అంతటి గొప్పకార్యమని అందరు యాడుచు పాడిరచ్చటన్
రామ మోహన్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...గల్గ నింతులకు... మొదము। న్నింతియ... మురియ నిందఱు.. సంతసించగా। నంతటి... కార్యమని యందరు నాడుచు..' అనండి.
నమస్కారములు. సంతోషమండీ. సరిజేసుకున్నాను. భవదీయుడు రామో
తొలగించుసంతసమొప్ప మౌని పరిచర్యలొనర్పగడెందమందు తా
రిప్లయితొలగించునెంతయుబొంగుచున్ వరమునియ్యగ బుట్టిరి మువ్వురౌ సుతుల్
కుంతికి,వంద మంది కొడుకుల్ జనియించిన బొందె మోదమున్
సంతతమా నృపాలుడును సంతును గాంచికృతార్థ చిత్తుడై
మువ్వురౌ సు
ధర్మరాజును భీముండు నర్జునుండు
రిప్లయితొలగించుమౌని వరమున బుట్టిరి మాన్యచరిత
తనర గాంధారియును వేడ్క వినుతముగను
కుంతికి, శతసుతుల్ గల్గ సంతసిల్లె!
భాస్కరమ్మ గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మైలవరపు వారి మరో పూరణ
రిప్లయితొలగించుగాంధారీ హృదయం....
ఇంతుల మధ్య నిట్టివగు నీసు నసూయలు సాజముల్ గదా !
పంతము బట్టి గర్భమును వ్రయ్యలు సేసుకొనంగ , వ్యాసుడ...
ల్లంతనె రక్షజేయగ నిజాత్మజులన్ గని., స్వీయవైభవం...
బెంతయొ గొప్పదంచు , పిలిపించియు బంటును బంపి జెప్పగా
కుంతికి., వందమంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదమున్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించుగాంధారీ హృదయాన్ని చక్కగా ఆవిష్కరించిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సంతును బొంద దైవముల సఖ్యతఁ గూడఁగ చింత తీరగన్
రిప్లయితొలగించుకుంతికి, వందమంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదమున్
వింతగ నొక్కపిండమదె వేడుక జేయఁగ వ్యాస దీవనన్
గంతలు కన్నులన్ తడువఁగా ధృతరాష్ట్రుని పత్ని వంతుగన్
సహదేవుడు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా 🙏
తొలగించుచాలబాగున్నదండీ! అభినందనలు!!
రిప్లయితొలగించుధన్యవాదములండీ
తొలగించుధర్మ శక్ర వాయువుల సదమల చరితు
రిప్లయితొలగించుల దయఁ గలిగి మిక్కుటముగ లలిత వదన
తరుణి కంత తొంబది యేడు తక్కువగను
గుంతికి శతసుతుల్ గల్గ సంతసిల్లె
వింతగ భీమ జన్మదిన వేళన పుట్టిన యా సుయోధను
న్నంతటఁ దక్కినట్టి యనుజావలిఁ గూడి క్రమమ్ము నందు నా
యింతికి సౌబలేయికి, నహీన బలుం డుదయించ భీముఁ డా
కుంతికి, వందమంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదమున్
[భీముఁడు, దుర్యోధనుఁడు నొక్క రోజునే జన్మించితిరి.]
కామేశ్వర రావు గారూ,
రిప్లయితొలగించుమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
అద్భుతమైన వృత్తపూరణ ఆర్యా! నమస్సులు!!
తొలగించుపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించుడా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.
యమను వాయువు నింద్రుల నంశ తోడ
రిప్లయితొలగించుమువ్వురు సుతులు జనియించె ముచ్చటగను
కుంతికి, శతసుతుల్ గల్గ సంతసిల్లె
సాధ్వి గాంధారిధృతరాష్ట్ర జంపతులకు!!!
శైలజ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యముడు వాయువు... మువురు సుతులు జన్మించిరి...' అనండి.
సూర్య వరమున కర్ణుడు సుతుడు గలిగె
రిప్లయితొలగించుకుంతికి|శతసుతుల్ గల్గ సంతసిల్లె
ధార్తరాష్ట్రుడు గర్వాన దక్షులనుచు
ధర్మ మెరిగిన గ్రుడ్డిగా ధరను నిలచె|
2.చింతిల సూర్యమంత్రమున చెంతకు జేర్చె కుమారి గోరకే|
వింతగ పుత్రునిన్ తనకు”|వీరుడు శూరుడు కర్ణుడాతడే
కుంతికి|”వందమంది కొడుకుల్ జనియించిన బొందె మోదమున్
పంతముధార్తరాష్ట్రునకు పైబడ?గెల్వగయుద్దమందునన్.
ఈశ్వరప్ప గారూ,
తొలగించుమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించుమాద్రి తనయులిరువురును,భాను వరము
తోడి కర్ణుబొందె, తనసుతులు నలుగురు
కుంతికి,శత సుతుల్ గల్గ సంతసిల్లె
దార్థ రాష్ట్రునకున్ సంపదగద వినుము.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధార్తరాష్ట్రుడంటే ధృతరాష్ట్రుని కొడుకు. చివరిపాదాన్ని సవరించండి.
యముడు,వాయువు,వాసవు నంశ లందు
రిప్లయితొలగించుమువురు పుత్రులు కలిగిరి ముదము నొంద
కుంతికి,శతసుతుల్ కల్గ సంతసిల్లె
నంధనృపతి, కౌరవులన బరగిరి
తిమ్మాజీ రావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో గణ యతి దోషాలు. సవరించండి.
గురుదేవులకు వందనములు సవరించిన పద్యముప్రస్తుతి
తొలగించుయముడు,వాయువు,వాసవు నంశ లందు
మువురు పుత్రులు కలిగిరి ముదము నొంద
కుంతికి,శతసుతుల్ కల్గ సంతసిల్లె
నంధభూపతి, కౌరవులన బరగిరి
పంచ పాండవుల్ పుత్రులై ప్రభవ మొంద
రిప్లయితొలగించుకుంతికి, శతసుతుల్ గల్గ సంతసిల్లె
సాధ్వి గాంధారి; వారల చావుజూచి
కడమ నవసాన కాలాన కానకేగె
కృష్ణారావు గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదివెను య౦.టెక్. | కడు చ
రిప్లయితొలగించుక్కదనమున మెరిసె | మరియును , కట్నము దెచ్చెన్
గద యని పె౦డ్లాడితి | ఛీ !
మది మెచ్చిన సు౦దరా౦గి మర్కట మయ్యెన్
గురుమూర్తి గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించువరప్రభావాన పుట్టిరి పాండవులట
కుంతికి,శతసుతుల్ కల్గ సంతసిల్లె
సుబల సుత,జనులెల్లరు చోద్య మనుచు
నుండ పతియును మురిసెతా నుర్వియందు.
భువిని భానుడెవరికిచ్చె పుత్ర సంతు
మత్సరమున కడుపుడుగ మానిని కట
నెప్పుడేమయ్యె దెలుపుము నెమ్మదిగను
కుంతికి,శతసుతుల్ కల్గ సంతసిల్లె.
మాద్రి తనయులిరువురును,భాను వరము
రిప్లయితొలగించుతోడి కర్ణుబొందె, తనసుతులు నలుగురు
కుంతికి,శత సుతుల్ గల్గ సంతసిల్లె
శకుని సోదరి ,చరితన సరస హృదయ.
గురువు గారు చివరి పాదము మార్చి పూరించడమైనది.
నమః పూర్వక ధన్యవాదములు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించుశత సుతులు గల్గఁ గాను విచారణమ్ము
చేయుచున్న శకుంతంపు స్థితినిఁ గాంచి,
దైవమే వర మిడె! నింకఁ దత్క్షణమె శ
కుంతికి శత సుతుల్ గల్గ సంతసిల్లె!
[శకుంతి = పక్షి, పులుఁగు, శకుంతము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుగురువు గారు మా కు భా కు యతి చెల్లదా?దయచేసి తెల్పుడు
రిప్లయితొలగించు’భా’కు - ’మా’కు యతిమైత్రి చెల్లదు. కానీ,’మా’కు - ’oభా’కు యతిమైత్రి చెల్లును. అనగా, బిందుపూర్వక ప, ఫ, బ, భ లకును మకును యతిమైత్రి చెల్లును.
తొలగించుగంతులు వేసి భీముడట కమ్మగ పుట్టెను వాయువేల్పుకున్
రిప్లయితొలగించుకుంతికి;...వందమంది కొడుకుల్ జనియించినఁ బొందె మోదమున్
సంతులు కల్గ పిన్నికట చక్కగ నాడుచు గ్రుద్దగానహా!...
చింతలు హెచ్చె పృచ్ఛకుడ చిక్కులు లేవని పూరణమ్ములన్?