21, డిసెంబర్ 2017, గురువారం

సమస్య - 2552 (బడి యనంగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"బడి యనంగఁ బ్రజలు భయపడుదురు"
(లేదా...)
"బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్రభీతాత్ములై"

118 కామెంట్‌లు:

  1. పలుకుబడి దెలిపెడి ప్రతిభుడౌ పంతులయ్య
    వ్రాతబడిని నేర్పు పంతులమ్మ
    గాంచి మొక్కగలరు; కాని చేత
    బడి యనంగ బ్రజలు భయపడుదురు.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. దయ్యములను నమ్మి కయ్యమ్ము లాడుచు,
      భూతములను నమ్మి కోతలనక,
      నాటు వైద్యములను నమ్ముచు మరి;...చాత
      బడి యనంగఁ బ్రజలు భయపడుదురు!


      ...సమస్య తేటగీతి కాదు, ఆటవెలది పాదమని సూచించిన సీతా దేవి గారికి ధన్యవాదములు...

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చాతబడి' మాండలికం. "చేతబడి" అనడం సాధువు.

      తొలగించండి
    3. దుర్వారోగ్రభీతాత్ములు అనగా అర్ధం దయచేసి తెలుపగలరు

      తొలగించండి
  3. ఆంగ్ల పదము బలుక యదళించు పంతులు
    తెలుగు భాష వినగ తెగులు రాగ
    బెత్త మెత్తి కొట్టి బెదిరించు గావున
    బడి యనంగఁ బ్రజలు భయ పడుదురు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...బలుక నదలించు...' ఆనండి.

      తొలగించండి
    2. ఆంగ్ల పదము బలుక నదలించు పంతులు
      తెలుగు భాష వినగ తెగులు రాగ
      బెత్త మెత్తి కొట్టి బెదిరించు గావున
      బడి యనంగఁ బ్రజలు భయ పడుదురు

      తొలగించండి
  4. బుడిబుడి నడకల్ల బుడుతలు వడివడి
    పరుగిడి చదువుకొన బడికిరాగ
    వడవడ వడకించు బరువగు రుసుముల
    బడియన బ్రజలు భయపడుదురు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ లఘుప్రాధాన్య పూరణ బాగున్నది. అభినందనలు.
      'నడకల్ల' అనడం గ్రామ్యం. అక్కడ 'నడకలను' అనండి. "బడికి జనగ... వడ కిడుచు" అంటే సర్వలఘు పూరణగా అవుతుంది కదా! కేవలం సమస్యలోని 'నం' ఒక్కటే గురువవుతుంది.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ!అద్భుతమైన సవరణ!రాత్రివేళ అంతకన్న తోచలేదు!
      సవరించిన పూరణ:
      బుడిబుడి నడకలను బుడుతలు వడివడి
      పరుగిడి చదువుకొన బడికిజనగ
      వడవడ వడకిడుచు బరువగు రుసుముల
      బడియనంగ బ్రజలు భయపడుదురు

      తొలగించండి
  5. సకల సుఖము లిచ్చి శాంతిని గూర్చెడి
    ప్రభుత యనగ జనులు ప్రస్తు తింత్రు
    పుడమి యందననిశపు నిరంకుశపుటేలు
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్యం గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యందు ననిశపు'...టైపాటు!

      తొలగించండి


  6. గుడి యనంగ భయము గుంగిలి యౌ చేత
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు,
    వదల రమ్మ భయము వంకర టింకర
    బతుకనగ జిలేబి‌ భయము భయము !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గుంగిలి' కోసం ఆంధ్రభారతి తలుపు తట్టవలసి వచ్చింది!

      తొలగించండి

  7. గుడిలోని వాడు మన వెంబడే ఉన్నాడంటే భయమే భయము :)

    గుడిలో నన్గలడమ్మ! మీ హృదయమున్ గూడై గలండీశుడే,
    సడిజే యున్ మది లోన నమ్ముము సుమా ! సారంగపాణిన్ గనన్
    పడి గా పుల్పడి వేచి యుందురు సభాప్రాంగమ్ము నందమ్మ, వెం
    బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్రభీతాత్ములై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. జిలేబిగారూ అత్యుత్తమమైన పూరణ!! అభినందనలు!!

      తొలగించండి

    3. కంది వారికి సీతా దేవి గారికి

      నమో నమః

      చీర్సు సహిత
      జిలేబి

      తొలగించండి
  8. అక్రమార్జనంబె యతిసౌఖ్యదంబైన
    నేటి కాలమందు నిష్ఠ గలుగు
    ధర్మ మార్గమందు తమకందు నట్టి రా
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. సకల శాస్త్ర ములను జదివిన ఫలమేమి
    మూఢ నమ్మకముల వీడరైరి
    పల్లె పట్న మనక పరికింప గన్ జేత
    బడియనంగ బ్రజలు భయపడుదురు.

    రిప్లయితొలగించండి
  10. కార్పొరేటు విద్య కంగారు పుట్టించి
    విద్యలందు స్పర్ధ విషముఁ జిమ్మ
    నాత్మహత్య లెంచ నపురూప సంతతి
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు.

    రిప్లయితొలగించండి
  11. పదవినడ్డుపెట్టి ప్రజలను దోచుచూ
    వక్ర పథమున ధనవంతులైరి!
    స్వార్దపరుల యొక్క చవకబారు పలుకు
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు!

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    స్వార్థబుద్ధిఁ గల్గి , ప్రజల ధనమ్మును
    కోట్ల కోట్ల కొలది కొల్లగొట్టి
    నన్ను నమ్ముమనెడు నయవంచకుల యేలు...
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  13. ప్రాణముండి నపుడు పండగ జేయుచు
    వలపు మాటలెన్నొ పలుకుచుండి,
    ప్రాణమూడి శవము పండబెట్టగ; యెత్తు
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు :)

    "భార్యా బిభ్యతి తస్మిన్ కాయే"

    రిప్లయితొలగించండి
  14. ఎట్టి వారి నైన గట్టి పట్టు ద ల తో
    తమదు పనులు జరుపు దక్షులై న
    రాజ కీ య మందు రాటు దేలు పలుకు
    బడి యన oగప్రజలు భయ పడు దు రు

    రిప్లయితొలగించండి
  15. ప్రాణ మున్న మనిషి ప్రక్క జేరు జనము ,
    మరణ మొందినట్టి మనిషి చెంత
    చేర బోరు యెవరు , జారు కొందురు , ఎత్తు
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు
    ఎత్తు బడి = శవమును స్మశానము వరకు తరలించుట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పంట చేలు నెండె పసవీడి వసివాడి
      బోసిపోయె పసరు పురుగుఁబట్ట
      తగ్గపోవునింక తప్పదుగద రాలు
      బడియనంగ ప్రజలు భయపడుదురు

      తొలగించండి
    2. పూసపాటి వారూ,
      ఎత్తుబడితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...బోరు+ఎవరు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "...బో రెవరును" ఆనండి.
      *****
      ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ 'రాలుబడి' పూరణ ముందే చూసి ఉంటే నా 'దిగుబడి' పూరణను పెట్టేవాణ్ణి కాదు సుమా!

      తొలగించండి
  16. మత్తేభవిక్రీడితము
    పుడమిన్ సంతతి బాగుకై చదువు ప్రాముఖ్యమ్ము గుర్తించుచున్
    కడు పేరొందిన పాఠశాల లని రొక్కమ్మెల్ల చెల్లించినన్
    సుడిలో దూకిన రీతి స్పర్ధకు సుతుల్ శోకాంబుధిన్ ముంచగన్
    బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్రభీతాత్ములై!

    రిప్లయితొలగించండి
  17. మరణ బాధ జనుల మండ్రాడ జేయును
    బ్రాణ మనిన బ్రజకు బరమ ప్రీతి
    కడచి వెళ్ళ వలయు కడ యమ భటులవెం
    బడి యనంగ బ్రజలు భయపడుదురు.

    రిప్లయితొలగించండి
  18. పాలనమ్ముకంటె స్వప్రయోజనముల
    కొరకు గద్దెనెక్కుమొరకులెల్ల
    చేయుచట్టములన సిగ్గుమాలిన యేలు
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. ఆంగ్లవిద్యనెంతొ నాసక్తిబఠియించి
      యన్నిశాఖలందు నడుగులిడుచు
      మాతృభాషయైన మనతెలుగు పలుకు
      బడియనంగ బ్రజలు భయపడుదురు

      విద్యతప్ప మరొక వేడుకలేకుండ
      వెన్నువిరుగగొట్ట పన్నుగాను
      కాసులు కడుదండి కఠినశిక్షణనిచ్చు
      బడియనంగ బ్రజలు భయపడుదురు


      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ తాజా పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. కష్టకాలమందు కంటబడనివారు
    ఐకమత్యమనుచునదరగొట్టి
    కులపురుసుముతలకునెలకింతయనుకట్టు
    బడియనంగఁబ్రజలుభయపడుదురు..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారూ,
      కట్టుబడితో మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.
      'వారు+ఐకమత్య'మన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "కంటబడనివార। లైకమత్య మనుచు..." అనండి.

      తొలగించండి
  21. 1)
    సాగవలయును జనసంక్షేమ కార్యమ్ము
    లనుచు నెన్నుకొనినయట్టి ప్రభుత
    రకరకముల పన్ను లిక పెంచగ నగు ని
    బ్బడి యనంగ బ్రజలు భయపడుదురు.
    2)
    పల్లెలందు మిగుల వాణిజ్యపంటల
    పైన పెరిగె మక్కువయె ధనమును
    దెచ్చు ననుచుఁ; దగ్గుఁ దిండిగింజల సాగు
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు.

    రిప్లయితొలగించండి
  22. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య

    *బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్రభీతాత్ములై.*

    సందర్భము :: సర్కారు బడులలో చదివినవారు మానసిక వికాసంతో మహోన్నతమైన స్థానాలలో విరాజిల్లుతున్నారు. ఇతరములైన బడులలో చదివేవారు విపరీతమైన మానసిక ఒత్తిడులకు లోనౌతున్నారు. వారిలో కొంతమంది ఆత్మహత్య చేసికొనడం మేలనే ఆలోచనకు వస్తున్నారు. కాబట్టి భద్రత లేని ఆ బడి అంటే ప్రజలు భయపడుతున్నారు అని చెప్పే సందర్భం.

    వడి సర్కారుబడిన్ ప్రవేశమె సదా భద్రమ్ము జేకూర్చు, నా
    బడియే వాణికి నాలయ , మ్మచటనే వర్ధిల్లు విజ్ఞాన ; మొ
    త్తిడి గల్గించు యమాలయా లితరముల్ , తీవ్రమ్ములౌ నేరముల్
    బడులన్ గొన్నిట నాత్మహత్య లమరున్ ; భద్రమ్ము గానట్టి యా
    *బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్ర భీతాత్ములై.*
    కోట రాజశేఖర్ నెల్లూరు. (21.12.2017)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక నమస్కారములు. కోట రాజశేఖర్

      తొలగించండి

  23. [21/12, 09:09] Nvn Chary: బడులెన్నోరకముల్ మహిన్నిచట సంభాషింపగా మాన్య రా
    బడులన్నన్ప్రజలు నెంతయో తమదు సద్భాగ్యంబుగా నెంతు రా
    బడికిన్ ముందుగ "చేత"జేర్చుచునుదౌర్భాగ్యంబులన్ జేయ నా
    బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్ర భీతాత్ములై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఎన్వీయెన్ చారి గారూ,
      రాబడి, చేతబడులతో మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "బడులన్నన్ బ్రజ లెంతయో..." అనండి.

      తొలగించండి
  24. భారతమునఁ గలరు పాలకులు ఘనులు
    కొంద ఱపరులు కడు క్రూరులు మును
    రాముని వలెఁ గాక రావణు సరి యేలు
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు


    కడ తేరుం ద్వరితమ్ముగన్ వెతలు నాఁ గల్పించి రీ నాయకుల్
    బడుగుల్ జీవన మెట్లొనర్తు రకటా భారమ్ము తోరంబ కా
    యఁడు దేవుండును భారతమ్ము నిఁక నాహారాది మూల్యమ్ము లి
    బ్బడి యన్నంతఁ బ్రజల్ వడంకెదరు దుర్వారోగ్ర భీతాత్ములై

    [ఇబ్బడి = రెట్టింపు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  25. ** గు రు మూ ర్తి ఆ చా రి **
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    వడి ద్రవ్యార్జన సేయ నెంచుచు వణిగ్వ్యాపార సంరంభులై

    పడిగాపుల్ బడుచుంద్రు లాభము గడింపంగ | న్నదృష్టాన రా

    బడి రాగా పరితుష్టి వృష్టి బడి రాభస్యార్ద్రు లౌ చుంద్రు | లో

    బడి యున్నంత బ్రజల్ వడంకెదరు దుర్వారోగ్ర భీతాత్ము లై


    పరితుష్టి = సంతృప్తి ; రాభస్యము = ఆనందము ;

    పరితుష్టి వృష్టి బడి రాభస్యార్ద్ర లౌ చుంద్రు = సంతృప్తి -

    వర్షమున బడి ఆనందము చేత ఆర్ద్రు లవుదురు ;

    రాబడి = ఆదాయము ; లోబడి = నష్టము ;

    లోపడు = లోబడు = తక్కువ యగు ;

    లోబడి యున్నంత = నష్ట పడి యున్నంత

    రిప్లయితొలగించండి
  26. ధరలు మండిపోవ ధరణిలో జూడగ
    కొనగ దేని నైన వణుకుబుట్టి
    భారమవగ బ్రతుకు ప్రతి దినమున, కొను
    బడి యనంగ ప్రజలు భయపడుదురు!!!

    జ్ఞానమెంత యున్న జగతిలో జనులకు
    మూఢులగును గాదె ముప్పురాగ
    మూఢనమ్మకముల వీడుకొనక జేత
    బడి యనంగ ప్రజలు భయపడుదురు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "మూఢు లగుదురు గద" అనండి.

      తొలగించండి
  27. చట్టములె యనుంగు చుట్టము లనెదరు
    పాప కర్మ సేయ బాధ పడరు
    క్షుద్ర విద్య యనెడి ముద్ర వడిన చేత
    బడి యనంగ బ్రజలు భయ పడుదురు!

    రిప్లయితొలగించండి
  28. అగ్గలమగు జలముఁ దగ్గు పొలము దిగు
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు
    కూరగాయల ధర కూడ పెరుగునని
    తమకుటుంబ భరముఁ దలచిమదిని

    రిప్లయితొలగించండి
  29. చదువు గొనెడివాడు సంస్కారవంతుడా?
    అమ్మునట్టి గురువు డధికు డగున?
    నమ్ముకొనిన కొడుకు నట్టేట ముంచగ?
    బడియనంగ బ్రజలు భయపడుదురు|
    2.సాదముంచు రైతుపంట సాగురాక ముంచగా|
    వేదనాన వానలేక వెతలు గల్గ దుఖమే
    మోదమొసగు రైతు పంట ముఖ్య మైన దెండగా?
    రాదు పెట్టు “బడియనంగ ప్రజలు భయపడుదురు”గా| {సాదము=అన్నము}
    3.బడిలో దైవము వంటి సద్ గురువు సద్భావంబు లేనట్లుగా
    గడుపన్ జూసియు బాలబాలికల సాక్ష్యంబైన దుర్మార్గుడై
    చడియున్ చప్పిడి లేని కృత్యముల లజ్జాలక్ష్య భావంబుకున్
    బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్ర భీతాత్ములై|


    .

    రిప్లయితొలగించండి
  30. కడుఁ గష్టంబులకోర్చిసంపద భువిన్ కల్పించి తా బ్యాంకులో
    నిడగా క్రొత్తప్రభుత్వనాయకులు తగ్గించంగ వడ్డీ లడా
    వడిగా పద్ధతిమార్పుఁ జేసి, యిపుడీ వార్థక్యమున్ తగ్గు రా
    బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్రభీతాత్ములై

    రిప్లయితొలగించండి
  31. మైలవరపు వారి పూరణ

    నడుముల్ పుస్తక భార నమ్రములు , జ్ఞానంబన్న శూన్యంబునౌ !
    దడ బుట్టించెడి శుల్కముల్ , సతత విద్యాభ్యాసనోత్పన్న ధీ..
    జడతన్ పిల్లలు చచ్చుచుండిరకటా ! సంఘమ్మునన్ కార్పొరేట్
    బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్రభీతాత్ములై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణ గారూ,
      కార్పోరేట్ స్కూళ్ళను గురించిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  32. పర్వతమ్ము వంటి బరువైన కాయమ్ము
    చింత నిప్పులల్లె చీపికళ్ళు
    బుగ్గ కత్తిగాటు బుర్ర మీసాల సాం
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సాంబ డనంగ... అనడం సాధువు కదా!

      తొలగించండి
  33. మ్రొక్కుకొనగ నాడు మోకరిల్లుచు దాను
    నిలువు దోపిడిత్తు నిక్కమనుచు
    వడ్డితోడగొనెడు వానికిచ్చెడి మొక్కు
    బడియనంగ బ్రజలు భయపడెదరు

    రిప్లయితొలగించండి


  34. ఏమండీ కంది వారు

    ఈ క్రింది పద్యపాదం సమస్యా పూరణకు ఉపయుక్తమా చూడండి


    గుండ్రాడాచిన పెండ్లి కేమిటయ జిక్కున్ గష్టముష్టింపచా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ఉండ్రా యోరి దురాత్మక!
      యిండ్రా ప్రాసమ్ము కవుల కియ్యఁ దగున? "

      :(

      తొలగించండి
    2. ఉండ్రాని యడవిలోపల
      గుండ్రాయై యున్నయట్టి కోమలిపై కో
      దండ్రాము పదము సోకిన
      గుండ్రాతికి కాళ్ళువచ్చి గునగున నడిచెన్

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      ఇది మనుచరిత్రలోని పద్యం. "తండ్రీ నాకు ననుగ్రహింపగదె..." అని ప్రారంభమౌతుంది.

      తొలగించండి
    4. శా. తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
      గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
      దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
      గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా! మను.5.17

      తొలగించండి

    5. పోచిరాజు వారికి

      ధన్యవాదములు

      ఈ పద్యమర్థమేమిటండి ?


      జిలేబి

      తొలగించండి
  35. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నెఱిని వీడు చుండి నీచత్వ మెంచుచు
    సతము కష్టపఱచు చర్యలుంచు
    వాని హీనమైన పలుచనౌ పాలనా
    బడి యనంగ బ్రజలు భయపడుదురు

    రిప్లయితొలగించండి
  36. విడువన్ వానయె పోటు లెత్తెనపుడున్
    భీమాకృతిన్ దాల్చుచున్
    వడగండ్లన్నట రాల్చుచున్ మిగుల భీభత్సమ్ము సృష్టింపగన్
    పుడమే సంద్రముగాను మారుతరి, యబ్బో యా పొలంగట్ల వెం
    బడియన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్ర భీతాత్ములై

    రిప్లయితొలగించండి
  37. దేహ దారుఢ్యమున్ గల్గి దిటవు లైన
    యాట గాండ్రకె సరిపోవు నాటయదియె
    కాళ్ళు చేతులు విరుగుచున్ గాయమగు క
    బడి యనంగ బ్రజలు భయ పడుదురు కద.

    రిప్లయితొలగించండి
  38. సందర్భము:- బకుని గఱించి కుంతికి ప్రజల ఆవేదన.

    నిత్యమంపునాహారము నేలరాలె
    ననుచు బకుడిట వచ్చెను నదిగొ వెంట
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు"నిట
    వాడినుండిక రక్షించు వారలెవరొ !

    రిప్లయితొలగించండి
  39. గురువు గారికి నమస్సులు.
    తడబడక గుడికెళద ము శుభము బడయ
    నాట,పాట,వీణ నాశయమగు
    యువతకున్ క
    లియుగ యుక్తి క్రియాహీన
    బడియనంగ బ్రజలు భయపడుదురు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసింప దగినదే. కాని పద్యం నడక కొద్దిగా కుంటుబడింది. 'క్రియాహీన బడి' అనడం దుష్టసమాసం.

      తొలగించండి


  40. 1.ఇంటి కార్యమందు నించుక యాపద

    లొడము చుండ నెపుడు నుర్వి యందు

    జడుపు వలన కల్గు శంక నదియు చేత

    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు.


    2.పరుల మాట వినుచు భయభ్రాంతు లగుచు

    కీడు కలగినంత ఖిన్ను లగుచు

    కానివారు చేయు కార్య మనుచు చేత

    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు.


    3.ప్రజల సొమ్ములెల్ల బాగుగా దోచుచు

    కల్లి బొల్లి మాట లెల్ల పల్కి

    చాటు చేయ మోము జగతియందున పెట్టు

    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు.


    4.అయ్యవార్లు లేక నాటస్థలము లేక

    త్రాగవలయునన్న తగిన నాటి

    వసతి లేక నడుప బడుచున్న సర్కారు

    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు.


    5.వేలకొద్ది డబ్బు వెచ్చించి బడి చేర్చ

    హంగు పొంగు లుండి నసలు చదువు

    యనెడి మాట లేక నాడంబరమ్మున్న

    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ అయిదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. "భయవిహ్వలు లగుచు" ఆనండి.

      తొలగించండి

  41. 6.పంట పండు ననుచు వాసియౌ విత్తులన్
    నాట నవనియందు నయముగాను
    పండకున్న సతము బాధపడుచు సాగు
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు.

    7.చదువు తప్ప వేరు సంగతి చెప్పక
    పగలు రేయి రుద్ద బాల లెల్ల
    మథన పడుచు నుండ మహిలోన ప్రైవేటు
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు

    రిప్లయితొలగించండి
  42. ఆ॥వె॥
    లంచమన్నవాని లాగి తన్నెదన్నన
    ప్రభుత నియతి తోడ రాజ్యమేల
    బల్ల క్రింద నుండి పైకమ్ము తోడి రా
    బడి యనంగఁ బ్రజలు భయపడుదురు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అనంత కృష్ణ గారూ,
      మిమ్మల్ని నా బ్లాగులో చూడడం మహదానందాన్ని కలిగించింది.
      బల్ల క్రింది రాబడిని గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      తన్నెదనన్న.... టైపాటు!

      తొలగించండి
  43. ఒడిలో పాపను పెట్టినంత చనగా ఓక్ రిడ్జి స్కూల్ కున్ వడీ
    వడిగా స్కూలుకు పోయెదన్నిడుము నాబైక్ నాకు నేడే యనన్
    బుడుగుల్ సీతల ప్రేమపాట విని హృత్పోటుల్ సతాయించగా
    బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్ర భీతాత్ములై ...

    రిప్లయితొలగించండి
  44. నడి మధ్యాహ్నపు కాల మందునను దానమ్మివ్వ సర్కారిటన్
    వడిగా భోజన మిత్తుమంచు దయతో పంపండి పిల్లల్ననన్
    కడకున్ క్రుళ్ళిన నుల్లిపాయలను దుర్గంధమ్మునన్ పంచగా
    బడి యన్నంత ప్రజల్ వడంకెదరు దుర్వారోగ్రభీతాత్ములై!

    రిప్లయితొలగించండి