29, డిసెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2559 (ఏకాదశి నాటి పూజ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ఏకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్"
(లేదా...)
"ఎలమిన్ గష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే"

79 కామెంట్‌లు:

  1. ఆకార పుష్టి తోడను
    చీకాకుల వ్యాధులెన్నొ చీదర పెట్ట
    న్నాకలి కోర్వక మెక్కగ
    నేకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్ :)

    రిప్లయితొలగించండి
  2. ఆకారము శివుడే యని
    ప్రాకారము చుట్టి వచ్చి భక్తిని కొలువన్
    సాకల్య మొందక విసుగున
    ఏకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "విసుగ। నేకాదశి..." అనండి.

      తొలగించండి
    2. ఆకారము శివుడే యని
      ప్రాకారము చుట్టి వచ్చి భక్తిని కొలువన్
      సాకల్య మొందక విసిగ
      నేకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్

      తొలగించండి
  3. ఏకైకు డంబరీషుడు;
    లోకైకశుభంకరమధురోహారోహుం;
    డాకులు డాయెన్ మునిచే;
    నేకాదశి నాటి పూజ లిడుముల గూర్చున్.



    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    *తస్మాత్ జాగ్రత ! జాగ్రత !*

    పలుకన్ నేర్వని వారు , భాగవత శబ్దజ్ఞానశూన్యుల్ మహా
    బలమౌ భారతదేశ సంస్కృతిని దెబ్బందీయగా నెంచి దు..
    ర్బలులై చర్చల పల్కుచుండిరిటు వక్రంబౌ గతిన్ "ద్రుంచు మీ...
    కెలమిన్ , కష్టములెన్నొ గూర్చును గదా యేకాదశీ పూజలే !"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    ఏ కారణమున బలికితి..
    వేకాదశి నాటి పూజలిడుములఁ గూర్చున్
    మీకని , పొరబడితివి ! కా
    నే కాదది ! సౌఖ్యమబ్బు ! నిక్కము బాబూ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ఉపాధ్యాయుడు.... విద్యార్థితో .. 👇

      తొలి నే జెప్పినదేమి ? *గూల్చు* నని యెంతో చక్కగా ! ., *గూర్చు* నం..
      చిల వ్రాయన్ బెను దోసమయ్యె ! భడవా ! సృష్టించె కల్లోలమున్ !
      తలనొప్పిన్ కలిగించితీవు !సరిదిద్దన్ వీలు గాదయ్యె ! నె.....
      ట్లెలమిన్ గష్టము లెన్నొ *కూర్చును* గదా యేకాదశీ పూజలే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


  5. ఆకాశంబున తిరిగెడు
    కాకవెలుగు చలువ వార కాల తిథులనన్
    ఓ కాలాంతకుడా! యే
    యేకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. ఇలలో నెన్నగ రానిభో గముల నేయేరీతులన్ పొందగా
    కలలో నైనను గాంచలేని విధమున్ కాగల్గ నర్ధంబులన్
    బలిమిన్ జేయగ దైవమే మనకు సౌభాగ్యమ్ము లందించగా
    ఎలమిన్ గష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే

    రిప్లయితొలగించండి


  7. విలువల్ దప్పి జనుల్తలిర్చి మగువా వీగారి బోవన్ సుమా
    యెలమిన్ గష్టము లెన్నొ కూర్చును గదా !యేకాదశీ పూజలే
    యలతల్ జేర్చవు సూవె! చింత వలదే! యావత్తు శోభించునౌ!
    లలనా!కాలపుపోకడన్తిథులగున్ లాస్యంబులా యద్రిదౌ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య 2559
    *ఎలమిన్ కష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే.*

    సందర్భం :: తిథు లన్నింటిలో ఏకాదశి తిథి చాలా పవిత్రమైనది. ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఎంతో శ్రేష్ఠమైనది. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ రంగని ఆలయంలో ఉత్తర ద్వారదర్శనం, స్వర్గద్వార ప్రవేశాన్ని సిద్ధింపజేస్తుందని శాస్త్రంలో చెప్పబడింది.
    శాస్త్రంలో చెప్పినట్లు విధులను ఆచరించకపోతే సుఖము, సిద్ధి, ఉత్తమగతి లభింపవని గీతాచార్యుడు
    . య శ్శాస్త్ర విధి ముత్సృజ్య
    వర్తతే కామకారతః।
    న స సిద్ధి మవాప్నోతి
    న సుఖం న పరాం గతిమ్।।
    అని చెప్పియున్నాడు. కాబట్టి ఏకాదశి పూజలలో శాస్త్ర విధులను వదలివేసి, కుత్సితమైన బుద్ధితో వ్యవహరిస్తే, ఆ పూజలే కష్టాలను కలిగిస్తాయని తెలియజెప్పే సందర్భం.

    ఇలలో నీ వుపవాస ముండి, శుచివై, యెంతేని భక్త్యున్నతిన్
    ఫలిత మ్మందుట మేలు, శాస్త్ర విధులన్ బాటించుచున్ శ్రద్ధతో,
    తొలి యేకాదశి వంటి పుణ్య తిథులందున్ ; మందిర మ్మేగి లో
    పల శ్రీరంగని ద్వారదర్శనమునన్, వైకుంఠ యేకాదశిన్
    బలిమిన్ కుత్సితబుద్ధి శాస్త్ర విధులన్ వర్జించి , వర్తింపగా
    *నెలమిన్, కష్టము లెన్నొ గూర్చును గదా యేకాదశీ పూజలే.*
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (29.12.2017)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
      'వైకుంఠ+ఏకాదశి = వైకుంఠైకాదశి' అవుతుంది కదా! ఇక్కడి యడాగమం విషయంలో సందేహం. తెలుగు సంప్రదాయం ప్రకారం పుంప్వాదేశ, టుగామమాలు వచ్చి "వైంకుంఠపు టేకాదశి' కావాలి కదా? సందేహాన్ని తీర్చవలసిందిగా మనవి.

      తొలగించండి
    2. {సవరణతో} మీ సూచనతో పొరపాటును సరిదిద్దుకొని , మరల పంపుతున్నానండీ శ్రీ కందిశంకరయ్య గురువర్యా! ప్రణామాలు. క్షంతవ్యోఽహం.
      మీ కోట రాజశేఖర్.

      గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
      సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య 2559
      *ఎలమిన్ కష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే.*

      సందర్భం :: తిథు లన్నింటిలో ఏకాదశి తిథి చాలా పవిత్రమైనది. ఏకాదశి తిథి రోజున ఉపవాసం ఎంతో శ్రేష్ఠమైనది. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ రంగని ఆలయంలో ఉత్తర ద్వారదర్శనం, స్వర్గద్వార ప్రవేశాన్ని సిద్ధింపజేస్తుందని శాస్త్రంలో చెప్పబడింది.
      శాస్త్రంలో చెప్పినట్లు విధులను ఆచరించకపోతే సుఖము, సిద్ధి, ఉత్తమగతి లభింపవని గీతాచార్యుడు
      . య శ్శాస్త్ర విధి ముత్సృజ్య
      వర్తతే కామకారతః।
      న స సిద్ధి మవాప్నోతి
      న సుఖం న పరాం గతిమ్।।
      అని చెప్పియున్నాడు. కాబట్టి ఏకాదశి పూజలలో శాస్త్ర విధులను వదలివేసి, కుత్సితమైన బుద్ధితో వ్యవహరిస్తే, ఆ పూజలే కష్టాలను కలిగిస్తాయని తెలియజెప్పే సందర్భం.

      ఇలలో నీ వుపవాస ముండి, శుచివై, యెంతేని భక్త్యున్నతిన్
      ఫలిత మ్మందుట మేలు, శాస్త్ర విధులన్ బాటించుచున్ శ్రద్ధతో,
      తొలి యేకాదశి వంటి పుణ్య తిథులందున్ ; మందిర మ్మేగి లో
      పల శ్రీరంగని ద్వారదర్శనమునన్, వైకుంఠ వాసున్ గనన్,
      బలిమిన్ కుత్సితబుద్ధి శాస్త్ర విధులన్ వర్జించి , వర్తింపగా
      *నెలమిన్, కష్టము లెన్నొ గూర్చును గదా యేకాదశీ పూజలే.*
      *కోట రాజశేఖర్ నెల్లూరు.*
      {ఎలమిన్=సంతోషముతో}(29.12.2017)

      తొలగించండి
  9. ఏకాగ్రత తోడ గోలిచి
    చీకాకు ల దూర ముంచి శివుని భజి oపన్
    లోకానభక్తి కే విధి
    న్నేకా ద శి నాటి పూజ లి డు ము ల గూర్చు న్ ?

    రిప్లయితొలగించండి
  10. పోకార్చును పాపమ్ముల
    నేకాదశినాటి పూజ;లిడుముల గూర్చున్
    చేకూర వినోదములను
    కాకాసురవైరి మరచి కైపునదేలన్ !

    రిప్లయితొలగించండి
  11. కలుషంబై మది కాని భావములతో కాఠిన్యమే రూపమై
    పలుకుల్ సమ్మెట దెబ్బలై తరచుగా పాపంబులన్ జేయుచున్
    పలికెన్ బాపడు పోవు దోషమని యార్భాటమ్ముగా జేసిన
    న్నెలమిన్ గష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే.

    రిప్లయితొలగించండి
  12. శ్రీకరు ని దయనొ సగు విను
    మేకాదశి నాటి పూజ, లిడుములఁ గూర్చున్
    మీకు యశౌచదినములo
    దాకాలునిబూజ సేయ,దప్పిద ముగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మీకు నశౌచ.." అనండి.
      చివరిపాదంలోని అఖండయతి వినసొంపుగా లేదు. "సేయ నది తప్పు కదా" అందామా?

      తొలగించండి
  13. లోకములో జనులెందరొ
    సాకల్యము నమ్ముచుండ సఫలమ్మనుచు న్నేకతమున,నెవ్విధి మరి
    యేకాదశి నాటి పూజ లిడుముల గూర్చున్?

    రిప్లయితొలగించండి
  14. ఏకార్యములే లేకను
    స్వీకారము పొట్టలోన్ కి జేసెడు వార్కిన్
    ఆకలితో నుపవాసం
    బేకాదశి నాటి పూజలిడుములఁ గూర్చున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "స్వీకారము పొట్టలోన జేయు నరులకున్" అనండి. 'లోన్ కి' సాధువు కాదు.

      తొలగించండి
  15. సౌకర్యమ్ముల కాంక్షయు
    రూకల సంపాదననెడి రుగ్మత తోడన్
    వ్యాకులమగు చిత్తముతో
    నేకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  16. ఆకలి రాజ్యపు పేదల
    పాకెట్టులు కొట్టి కట్టి పదియంతస్తుల్
    కాకాలు పట్టి నేతల
    కేకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  17. ఏకాదశి తిధి యనగను
    లోకేశుండి ష్ట పడును లోకము కంటెన్
    జీకాకులతో జరిపెడి
    యే కాదశి నాటి పూజ లిడుమల గూర్చున్

    రిప్లయితొలగించండి
  18. లోకుల ముంచుచు సతతము
    చీకాకును కలుగ జేసి చిత్తము లోన
    న్నేకాగ్రత లేకుండెడి
    యేకాదశి నాటి పూజ లిడుముల గూర్చున్

    రిప్లయితొలగించండి
  19. యాచకుల ఆవేదన:

    ఆకలితో నుపవాసము
    పోకార్చును పాపమనఁగ ముక్కోటికి కూ
    రాకైన నిండ్ల దొరకక
    యేకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్

    రిప్లయితొలగించండి
  20. ఏ కాలమ్మున నైనను
    లోకాలకుఁ గీడు సేయు రూక్షపుఁ బూజల్
    నీకేల వలదు క్షుద్రపు
    టేకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్


    జల భారమ్మగు బట్ట లూనవలె నిశ్శంకన్ సశాస్త్రమ్ముగన్
    వలదన్నన్ సహియించ నేర్వవలె క్షుద్బాధన్ దినం బంతయున్
    వలి నీటన్ మునుగంగ నోర్వవలెఁ దా బ్రాహ్మంపుఁ గాలమ్ములో
    యెలమిం గష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'కాలమ్ములో నెలమిం...' అని ఉండాలి కదా!

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. అవునండి. బ్రాహ్మంపుఁ గాలమ్మునే పాఠమును బ్రాహ్మంపుఁ గాలమ్ములో గా మార్చినప్పుడు యె ని మార్చడము మఱచితిని.

      తొలగించండి
  21. మత్తేభవిక్రీడితము
    తొలఁగున్ పాపములంచు నా మగఁడు సద్బుద్ధిన్ భజించంగ కో
    వెలకున్ జాగరణమ్మటంచుఁ జనెఁ, దా పేకాట సాగించి చే
    తులఁ బోగొట్టె ధనమ్ము వేలనుచు నాందోళించి పోకార్చగ
    న్నెలమిన్, గష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే?

    రిప్లయితొలగించండి
  22. పలికెన్ భార్యనుజూచి భర్త యిటులన్ పల్మారుప్రేమమ్ముతో
    లలనా!నీవతిసౌకుమార్యవు గదా లావింతయున్ లేదికన్
    ఫలముల్ వే దిని యెట్టులుండెదవొకో పాపమ్మురానిమ్మికన్
    న్నెలమిన్, గష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే?


    రిప్లయితొలగించండి
  23. కొడుకు ప్రహ్లాదునితో లీలావతి పలకులు
    ఓ కొడుక నీదు తండ్రికి
    వైకుంఠ నివాసుడకట వైరియె కాదా
    ప్రాకటముగ నీ సలిపెడు
    యేకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్

    రిప్లయితొలగించండి


  24. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    " ప్రపంచములో అందరికి దేవుడు యేసు ప్రభువే . యేసు పాదములే

    పట్టండి . ఏ పూజలు చేయకండి " అంటూ ఒక క్రిస్టియన్

    మతప్రచారకుడు మైకు లో ఇలా అరుస్తూ ఉన్నాడు .
    ---------------------------------------------------------------------------------


    సిలువన్ మ్రొక్కుము " పాతకుండ " | మన యేసే " ఉత్తముం డౌ " | జగం

    బుల కెల్లన్ " ప్రభు " వాయనే | కడిగి తోమున్ " పాపముల్ " రక్త ధా

    రల జిందించుచు | నాత్మలో నెపుడు గొల్వన్ , యేసు నే విశ్వసిం

    ప లభించున్ " పరలోకమే " | యితర దైవా లేలనో | మూర్ఖ పూ

    జల జేయ న్నిక లాభమే | వదలుమా చాదస్తమున్ | బాపి నీ

    యెలమిన్ , గష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే

    సలుపన్ | " ప్రార్థన " సేయుగా సిలువకున్ " చర్చిన్ " బ్రవేశింపుమా ! !


    ఇది కేవలము పద్యపూరణ . క్రిస్టియన్స్ అపార్థము చేసుకొన వలదు
    :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: ::::::::::::::::::::::




    రిప్లయితొలగించండి
  25. శ్రీకాంతుని కోవెలలో నాకాంతను కలసికొనెడి యానందముతో సోకిన మదను శరమ్ముల
    నేకాదశి నాటిపూజ లిడుముల గూర్చున్

    రిప్లయితొలగించండి
  26. ఏ కారణమో జూపుచు
    నాకారోగ్యంబుగాదు, నమ్మక మటులే
    లేకున్న దనుచు , బలిమిని
    ఏకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్

    నిన్నటి సమస్యకు న పూరణ

    సూర్యోదయమున మ్రొక్కుచు
    కార్యాచరణమున మంత్రిగా నయి పతికిన్
    పర్యంకమునన్ రంభగు
    భార్యను సేవించునట్టి భర్త తరించున్

    రిప్లయితొలగించండి
  27. సాకార మందజేయును
    ఏకాదసి నాటి పూజ॥లిడుముల గూర్చున్
    లోకేశుని సేవింపక
    లోకుల కే సాయపడక లోభిగ మారన్ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...జేయును+ఏకాదశి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా! "...జేయు। న్నేకాదశి..." అనవచ్చు.

      తొలగించండి
  28. సమస్య
    ఏకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్
    **************************************
    సందర్భము: ఏకాదశినాడు ఎవరి యిళ్ళలోను వంటలు చేయలేదు.భిక్షుకులకు కష్టాలే!
    ==============================

    " ఏకాదశి.... వంటలు లే

    వే!...కావున వెడలవయ్య..
    వేరొక యెడకున్!...

    నీ కేమి?".. యందు, రర్థుల

    కేకాదశి నాటి పూజ
    లిడుములఁ గూర్చున్

    మరొక పూరణము:

    " మాకే వంటలు లేవే!

    మీ కేమిటి పెట్టగలము
    మే?" మన వినుచున్

    చీకాకుపడు బికారుల

    కేకాదశి నాటి పూజ
    లిడుములఁ గూర్చున్

    ✒~ డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  29. సందర్భము: ఏకాదశినాడు కఠినమైన ఉపవాసాన్ని మించింది లే దనే వారి సంగతి..

    ప్రాకట మగు నుపవాసము

    గా కిం కే గొప్ప పూజ
    గల దనుకొనరా,

    దాకలికి తాళ జాలని

    యేకాదశి నాటి పూజ
    లిడుములఁ గూర్చున్

    ✒~ డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  30. సమస్య
    ఏకాదశి నాటి పూజ లిడుములఁ గూర్చున్
    సందర్భము: ఏకాదశినాడు ఉపవాసం పేరిట తోచినన్ని అల్పాహారాలు తిందా మనుకునే వారి సంగతి..

    " ఏకాదశి యుపవాసము...��

    నా కిడ్లీల్ చా లిరువది
    నాలుగు పూరీ

    లే కద! ఎనిమిది పం" డ్లన

    నేకాదశి నాటి పూజ
    లిడుములఁ గూర్చున్

    ✒~ డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  31. శోకము దీర్చు శుభములిడు
    నేకాదశి నాటి పూజ లిడుముల గూర్చున్
    భీకరమగు కార్యములన్
    లోకుల హింసింప జూచెడు నరుల కెల్లన్!

    రిప్లయితొలగించండి
  32. ఏకాగ్రతతో సతతము వీడక
    నేకొరతయులేకపూజ నిత్యము చేయన్
    శ్రీకాంతు డుండనింకెటు
    నేకాదశినాటిపూజ, లిడుములగూర్చున్

    రిప్లయితొలగించండి
  33. శోకములనుబాపునిలను
    నేకాదశినాటిపూజ, లిడుములగూర్చున్
    చేకొనగ పాపపు పనుల
    నేకారణమున నయినను నిలలో గనుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'వీడక' తొలగించండి.

      తొలగించండి
  34. సాకారమగును చేసెడి
    "ఏకాదశి నాటి పూజ; లిడుములఁ గూర్చున్"
    శోకములఁ దృంచు; శుభముల్
    చేకూర్చు; సుఖములఁ గలుగజేయును జూడన్

    రిప్లయితొలగించండి
  35. ఇడుము అనగా వేదన చింత అని అర్ధమనే భావనతో
    "ఇడుముల గూర్చున్ శోకముల దృంచు" అని అన్నాను గురువుగారూ. ఇలా అన్వయానికి అవకాశముండదంటారా గురువుగారూ..

    రిప్లయితొలగించండి
  36. 1). కం||
    లోకేశునిమదినుంచక
    నేకాదశినాటిపూజ లిడుముల గూర్చున్
    నీకైసెప్పితి తనయా
    ఏకాలమునైననీవు నిది మరువకుమా||

    2). కం||
    ఏకాదశి యుపవాసము
    నాకేలని తిన్నవాని నయముగ రోగాల్
    దాకు, నుపవాసముండని
    యేకాదశినాటిపూజ లిడుముల గూర్చున్||
    3). కం||
    శ్రీకాంతునిగని నే, గుడి
    ప్రాకారము దాటిరాగ, పరిపరి విధముల్
    నా కొంటె మనంబుండిన
    నేకాదశి నాటి పూజ లిడుముల గూర్చున్

    శ్రీకాంతుఁడు అనే పేరుగల మనిషి
    4). కం||
    ఆకొన్న వారికిలలో
    శ్రీకాంతుండన్నమిడక, సిరిగలవాడై
    యేకాంతమ్ముగ జరిపిన
    నేకాదశినాటి పూజ లిడుముల గూర్చున్


    ముమ్మడి

    రిప్లయితొలగించండి
  37. చలిలో స్నానము జేయుటన్ మునుగుచున్ చన్నీళ్ళ కాల్వల్లలో
    తులసీ తీర్థము త్రాగుటన్ విడిచి ప్రీతుల్ కాఫి తేనీరులన్
    ఫలముల్ మేయుట, వీడుచున్ విరివి తాపమ్మిచ్చు బిర్యానుల
    న్నెలమిన్ గష్టము లెన్నొ కూర్చును గదా యేకాదశీ పూజలే

    రిప్లయితొలగించండి
  38. కులమున్ గోత్రము లెన్నకే టికటులన్ గుప్పించ విద్వాన్లకే
    యెలమిన్ గష్టము లెన్నొ కూర్చును గదా;...యేకాదశీ పూజలే
    కలుగన్ జేయును నాస్తి పాస్తులను కాకాల్బట్ట వెన్నున్నకున్
    తిలకించించును గాలివాటులనిటన్ తీర్థమ్ము బోనమ్ముతో

    రిప్లయితొలగించండి