చేపూరి వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి. "పదసంపద యదనపు టానందమిచ్చి యలరింపవలెన్" అనండి. 'అదుపుతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "పొదుపుగ నదుపున" అనండి.
హృదయము దాకగన్ వలయు హృద్యపు రీతిని పద్యమల్లినన్ మదికిని హాయి గూర్చి పది మందికి మంచిని పంచగన్ వలెన్ చదివెడి వారి కించుక యసంగత మన్నది లేక వ్యర్థమౌ పదములు లేని పద్యములను వ్రాయవలెన్ కవులెల్లరౌననన్.
సందర్భము :: కవికి దోషజ్ఞుడు అనే పేరు కూడా ఉంది. కవి ఏ యే పదములు దోషభూయిష్టములో తెలిసికొని వాటిని ప్రయోగించకుండా ఉండాలి. పరుషము, గ్రామ్యము, నిరర్థకము, అప్రయుక్తము, అసమర్థము, క్లిష్టము, అప్రతీతికము, అప్రయోజకము, అపుష్టార్థము, గూఢార్థకము మొదలైనవి పదములకు సంబంధించిన దోషములు. కాబట్టి కవి యిటువంటి దుష్టపదములను వాడకుండా, ఉత్తమ పద్య రచన చేస్తూ, అందరి ప్రశంసలను పొందాలి. అని తెలియజెప్పే సందర్భం.
ఇది *పరుషమ్ము*, *గ్రామ్య* మిది, యిద్ది *నిరర్థక*, *మప్రయుక్త* మి య్యది, *యసమర్థ* మౌ గనగ, నియ్యది *క్లిష్టము*, *నప్రతీతిక* మ్మిది యగు, *నప్రయోజనము* నిద్ది, *యపుష్టము*, *గూఢ* మెన్నగా నిది, యివి *దోషముల్* గనుక నెన్నడు వీటిని వాడరాదు. దు *ష్పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌ ననన్.*
భావము: ప్రొద్దున్నే మంచి పూలతోటలో కూర్చొని చక్కని చమక్కులు వున్న పద్యములెన్నో చదివాను కాని మనస్సు చంపుకొని అమృతముకురువనటువంటి పద్యములు వ్రాయటమును ఓర్చి బొత్తిగా సోగాసులేని పద్యాలను కవులు ఖచ్చితంగా వ్రాయాలా అన్న భావనలో వ్రాసిన పద్యం . ఆశీర్వదిస్తారని కవికులానికి నమస్కరించి వ్రాసిన పద్యము. note : ఇక్కడ దమము యనగా సొగసులు అని అర్ధము.
చదివినయంతనే ఎదల చల్లగ సోకెడి రీతియుండగా,
రిప్లయితొలగించండిపెదవులనుండి నాల్కపయి పెల్లుగ నాట్యమొనర్చు నట్లుగా,
సదమలవృత్తి నెల్లపుడు చక్కగ సంఘము మెచ్చ,నెట్టి దుష్
పదములులేని పద్యముల వ్రాయవలెన్ కవులెల్ల రౌనన్.
చివరిపాదంలో రౌననన్-అని చదువ మనవి.
రిప్లయితొలగించండిబాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముదమును గూర్చెడి గాథల
రిప్లయితొలగించండిసదమల భావపు రసముల చక్కని సుధగా
విదితమగుచు వ్యర్థములగు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్.
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎదయెదనే మురిపించుచు
రిప్లయితొలగించండికదలించుచు హృదయములను గవులౌననగన్
చదువరులకును వివాదా
స్పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదువుట కింపుగ నుండుచు
రిప్లయితొలగించండిమదిలో హాయిని గొలిపెడి మాన్యపు కవితల్
పదుగురు నొచ్చు యసభ్యపు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికదనము జిలేబి ఛందము,
కుదరదు యిష్టమగు చాళి గూర్చన్! గానన్
సదనమున వ్యావహారిక
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కుదరదు+ఇష్టమగు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "కుదురునె యిష్టమగు" అందామా?
సుదతీ జిలేబి వినుమా!
తొలగించండిపదిలము నిడకుండ మమ్ము పలు కలతలతో
కుదిలించి మొట్టు వింతౌ
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్!
🙏🙏🙏
తొలగించండిఔరా! జీపీయెస్! మా
పై రయ్యన కందమొకటి పరుగెత్తించా
రే!రామ రామ! వేయుము
వారికి కందంబొకటి గబగబ జిలేబీ :)
ధన్యవాదాలండీ జీపీయెస్ వారు
జిలేబి
రిప్లయితొలగించండిసదనము శంకరార్యులది ! చక్కటి ఛందపు పుష్ప మాలికల్
కుదురుగ ఠావుకొన్న యిలు; కూరిమి గాంచుచు వ్యావహారికా
పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్
కదనము కైపదమ్ములది ! కాకలుదేఱనకో జిలేబియా !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వ్యావహారిక పదములు' అనడం సాధువు.
"కూరిమిగా వ్యవహార గ్రామ్యమౌ" అంటే ఎలా ఉంటుంది?
తొలగించండి
తొలగించండికంది వారు
నమో నమః
బాగుంటుందండీ
నెనరుల తో
ప్రపంచ తెలుగు మహా సభల జిలేబి :)
చదువరుల మదినిదోచగ
రిప్లయితొలగించండిమృదువగు పదజాలములను మేలగురీతిన్
కుదురుగ గూర్చుచు వ్యర్ధపు
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్ !
సదనమునందలి విఙ్ఞుల
హృదయము లాకట్టుకొనగ హేలగకవులే
విదళితమగు పరభాషా
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్ !
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పదిలములైన భావములు,భాసుర సంస్తుత సత్పవర్తనల్,
రిప్లయితొలగించండిమృదు మధురోహ సంజనిత మేదుర నవ్య కళా విలాసముల్
పదపడి జాలువారగ,నపాయముఁగూర్చెడు చెడ్డబుద్ధి కా
స్పదములు లేని పద్యములు వ్రాయవలెన్ కవులెల్లరౌనన్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండిస ద మల చిత్తము గల్గియు
రిప్లయితొలగించండిముద మున నంద రు ను మెచ్చ మోహన భావo
బది కుదురు నట్లు వ్యర్థ పు
బద ములు లేకుండ వ్రాయ వలె బద్యము ల న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిబెదిరించుచు పదములతో
వదరుతనము జూపినంత పద్యమ్మౌనే ?
పదుగురిని నిందజేసెడి
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ముదితలు చల్ల జిల్కగను మువ్వల కృష్ణుడుఁ బట్ట కవ్వమున్
తొలగించండియదుకుల కాంతలందరును నాతని యల్లరి దెల్పగా యశో...
ద దన కుమారునిన్ బిలిచి దండన జేసినయట్టులందమౌ
పదములనేర్చి గూర్చనొక పద్దెము చాలు ! నిరర్థకమ్ములౌ
పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పదములు సకలముగ్రాంథిక
రిప్లయితొలగించండిపదములొ వాడుక పదములొ వ్రాయ రుచిరమౌ
పది వాడుక పది గ్రాంథిక
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్
ధనికొండ వారూ,
తొలగించండివ్యావహారిక, గ్రాంధిక పదసంకీర్ణాన్ని అధిక్షేపిస్తూ మీరు చెప్పిన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సదమల హృదయము తోడను
రిప్లయితొలగించండిచదువరులకు హాయి నిచ్చు చందనము వలెన్
పదుగురు దూషణ జేసెడి
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్
అక్కయ్యా,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
అక్కయ్యగారూ!మీ పద్యాలు చందనమువలె చల్లగా సుగంధభరితంగా ఉంటాయి!నమస్సులు!
తొలగించండిగురువులకు సీతాదేవి గారికీ ధన్య వాదములు
తొలగించండి
రిప్లయితొలగించండిపదుగురు మెచ్చవలెన్ కై
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
పదపడి పరుగెత్తవలెన్
హృదయస్పందనల రవళి హృత్సారమ్మై !
జిలేబి
రిప్లయితొలగించండిహృదయపు కుహురము తెరచుచు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
పదుగురి గుండియలన్ తా
కి దుముకవలె గంగవలె సఖి కవన మదియే!
జిలేబి
రిప్లయితొలగించండిపదరకు! యీపదముల్లా
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
పదపద పో యనని గురువు
లు!దంగవకు! కుదురుగన్ తెలుపు కందివరుల్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ తాజా మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'పదముల్లా'...? 'పదములవలె' అనియా మీ భావం? 'డంగగు' ప్రయోగం ఉంది. కాని 'దంగగు'?
చదువరులకు పదసంపద
రిప్లయితొలగించండిఅదనపు ఆనందమిచ్చి అలరింపవలెన్
పొదుపుగ నదుపుతొ, వ్యర్దపు
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్
చేపూరి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి. "పదసంపద యదనపు టానందమిచ్చి యలరింపవలెన్" అనండి. 'అదుపుతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "పొదుపుగ నదుపున" అనండి.
హృదయము దాకగన్ వలయు హృద్యపు రీతిని పద్యమల్లినన్
రిప్లయితొలగించండిమదికిని హాయి గూర్చి పది మందికి మంచిని పంచగన్ వలెన్
చదివెడి వారి కించుక యసంగత మన్నది లేక వ్యర్థమౌ
పదములు లేని పద్యములను వ్రాయవలెన్ కవులెల్లరౌననన్.
జనార్దన రావు గారూ,
తొలగించండిపద్యం ఎలా ఉండాలో మనోహరంగా వర్ణించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
పదునగు నాయుధసమమౌ
రిప్లయితొలగించండిపదముల పరుషముగవాడ పంకిలమౌనే
మదినొచ్చెడు పరదూషణ
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్
తిట్టు కవిత్వము వంటివి వద్దని!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా!నమస్సులు!
తొలగించండిముదమునుగూర్చిభక్తులకుముక్తిపదంబిడుదివ్యభావనల్
రిప్లయితొలగించండిపదిలముజేయగాతగును ప్రాజ్ఞులుపండితులెల్లమెచ్చగా
యదవదమైయనర్థమగుయన్యులకర్థముగానివ్యర్థమౌ
పదములులేనిపద్యములవ్రాయవలెన్ కవులెల్లరౌననన్.
పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పొదుపుగ మాటలు వాడుచు
రిప్లయితొలగించండినదనముగనలంకరణములద్దుచు యతులన్
కుదిరించుటకోసమధిక
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్
సూర్యనారాయణ గారూ,
తొలగించండివ్యర్థపదాలను వర్జించాలంటూ మీరు చెప్పిన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు మాష్టారు
తొలగించండిముదముగ వ్రాయువేళలను మ్రొక్కుడు ముందుగ వాణికిన్ కళా
రిప్లయితొలగించండిహృదయులు సంతసిల్లునటులొప్పుగ వాక్యములందగింపగన్
పదిలములౌ సుధాక్షరపు పంక్తుల గూర్పుడసభ్యమైన ష
ట్పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవులెల్లరౌననన్
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'షట్పదము' లనడంలో మీ భావం?
సుధలొలికే అక్షరాల మీద అసభ్య పదములనే తుమ్మెదలు వ్రాలకుండా అని భావము
తొలగించండికోట రాజశేఖర్ గారి పూరణ
రిప్లయితొలగించండిసందర్భము :: కవికి దోషజ్ఞుడు అనే పేరు కూడా ఉంది. కవి ఏ యే పదములు దోషభూయిష్టములో తెలిసికొని వాటిని ప్రయోగించకుండా ఉండాలి. పరుషము, గ్రామ్యము, నిరర్థకము, అప్రయుక్తము, అసమర్థము, క్లిష్టము, అప్రతీతికము, అప్రయోజకము, అపుష్టార్థము, గూఢార్థకము మొదలైనవి పదములకు సంబంధించిన దోషములు. కాబట్టి కవి యిటువంటి దుష్టపదములను వాడకుండా, ఉత్తమ పద్య రచన చేస్తూ, అందరి ప్రశంసలను పొందాలి. అని తెలియజెప్పే సందర్భం.
ఇది *పరుషమ్ము*, *గ్రామ్య* మిది, యిద్ది *నిరర్థక*, *మప్రయుక్త* మి
య్యది, *యసమర్థ* మౌ గనగ, నియ్యది *క్లిష్టము*, *నప్రతీతిక*
మ్మిది యగు, *నప్రయోజనము* నిద్ది, *యపుష్టము*, *గూఢ* మెన్నగా
నిది, యివి *దోషముల్* గనుక నెన్నడు వీటిని వాడరాదు. దు
*ష్పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌ ననన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.*
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిపదదోషాలను పద్యబద్ధం చేసి చెప్పిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
అద్భుతమైన పూరణ!పద్యాలలో యేయేదోషాలు ఉండకూడదో సమగ్రంగా వివరించారు! మావంటి విద్యార్ధులకు చక్కని పాఠము!ధన్యవాదములు!నమస్సులు!
తొలగించండిషట్పదము=తుమ్మెద
రిప్లయితొలగించండిఆ పదాన్ని ప్రయోగించడంలో మీ ఆంతర్యం ఏమిటి అని ప్రశ్న!
తొలగించండిముదమార బద్య కవితను
రిప్లయితొలగించండివిదితమ్ముగ వ్రాయువేళ విద్యాంసులు సొం
పొదవెడు వాక్యమ్ముల దు
ష్పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
పదిలముగనెట్టి, దౌష్ట్యపు
రిప్లయితొలగించండిపదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్
పదిమందికినుపయోగ
మ్మొదవును వాటివలన సతముర్వీతలమున్
సదమలమానసమ్మునను సాగుచు నిత్యము సంతసమ్ముతో
రిప్లయితొలగించండిమధురపు భావజాలమున, మానవనైజ మెరింగి సర్వదా
పదుగురి బాధలన్ కనుచు బాధ్యతతోడుత నెట్టివౌ వృథా
పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు, లెల్ల రౌననన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు. అసనారె
తొలగించండిచదివిన వెంటనే యెదకు చక్కగ భావము హత్తుకోవలెన్
రిప్లయితొలగించండిమది రసవాహినిన్ మునిగి మైమర పొంది రమించి పోవలెన్
ముదమున శయ్యపై పలుకుబోడి సుఖించగ కంటకమ్ములౌ
పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్.
మిస్సన్న గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదములండీ.
తొలగించండిసదయను తెలుంగు బాసను
రిప్లయితొలగించండిపదిలముగా కావ్యములను వ్రాయగనెంచన్
కుదురుగ నున్నను ఆంగ్లపు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మదికిన్వెతలనుగూర్చెడు
రిప్లయితొలగించండిపదములులేకుండవ్రాయవలెపద్యములన్
ముదమున్బొందుదురుగదా
పదములలాలిత్యముండపండితులెపుడున్
సుదతీ వినుమా వ్యర్థపు
రిప్లయితొలగించండిపదములు లేకుండ వ్రాయవలె పద్యములన్
ముదమున పదుగురు మెచ్చిన
నదికలకాలము నిలుచును నవనీ స్థలిలో.
పదములు తెలుగున గలవని
నెదలో నెరుగుచు సతతము నింపగు రీతిన్
సదమల మదితోడను దు
ష్పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్.
సుదతీ వినుమా వ్యర్థపు
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్
ముదమున పదుగురు మెచ్చిన
నదికలకాలము నిలుచును నవనీ స్థలిలో.
పదుగురు పద్య మనంగన్
రిప్లయితొలగించండిబెదరుచు పరుగిడుచునుండ, పెద్ద కవులునున్
పద గంభీరత జూపెడి
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్
బెదరుచు పరుగిడు యువకుల
మది పొంగగ మృదు పదఝరి మధుర కవితలన్
కుదురుగ దుష్కృత కవనపు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్
.పదనిస లేకను పాటల
రిప్లయితొలగించండికదలికలే సాధ్యమగున?”కవివర గణముల్
వదలగ సాద్యంబగునా
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్”?{కానిపని}
2.పెదవిని దాట గక్షరము పృచ్చకు డుంచు నిషేదపాజ్ఞచే
అదరక పూర్తి జేయ?గని అష్టవధానమునందు|యూహగా
కుదురుగ పద్యమల్లితిని కూర్పుగ,నేర్పుగ తీర్పురీతిగా
పదములు లేని పద్యముల వ్రాయ?వలెన్ కవులెల్లరౌననన్. {నిషేదాక్షరిపదములు లేకుండ}
.
సదమల భావజాల విలసత్కవనంబున సత్యదూర దు
రిప్లయితొలగించండిర్మద మిళితాగ్ర భాషణము మాన్యతలేమి వచో సమూహముల్
పదఁపడి ధర్మధూషణము పండిత ధిక్కృతికెల్లఁ జూడ నా
స్పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపదుగురకు నచ్చినట్లుగ
రిప్లయితొలగించండిముదముగ మరితెలుగులోన పూనికతోడన్
మృదుమధురంబుగ ,తొచ్చెపు
పదములు లేకుండ వ్రాయవలెఁ పద్యములన్!!!
రిప్లయితొలగించండికదలించవలెను కవులు సు
పదములతోడను కలమును వడిగా నిచటన్
బుధులెల్లరు మెచ్చగ దు
ష్పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్.
హృదయము లోపలి భావము
రిప్లయితొలగించండిపదుగురి మెప్పందునట్లు పదములు వాడ
న్నదిరా పద్యమనన్ దు
ష్పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్.
మృదు మధుర భావ సలలిత
రిప్లయితొలగించండిపద సంహితమై నిగూఢ భావ సహితమున్
ముదమార విమర్శల కా
స్పదములు లేకుండ వ్రాయ వలెఁ బద్యములన్
పదనగు మాటలెందుకు విపర్యపు ధోరణి మాని యింపుగన్
ముద మొనరించు భావముల ముద్దుగ సుద్దులు సెప్పగా వలెన్
సదసున సభ్య లెల్లరకుఁ జక్షువు లందుఁ బఠింప నించుకం
బద, ములు లేని పద్యముల వ్రాయ వలెం గవు లెల్ల రౌననన్
ముదమార బాలకృష్ణుఁడు
రిప్లయితొలగించండిపదముల దోగాడి తల్లి పాలికిఁ జనుటన్
మృదు మధురమ్ముగఁ దడబడు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్
పదుగురి మదిని బడల్చెడి
రిప్లయితొలగించండిపదములు లేకుండ వ్రాయ వలెఁబద్యములన్
ముదమున మదిని విదనొసగు
పదములు జోడించి వ్రాయ వలెఁబద్యములన్!!
@ మీ పాండురంగడు *
౧౪/౧౨/౨౦౧౭
మదిలో మెదిలెడి భావము
రిప్లయితొలగించండిపదిలము జేయంగ వలయు బద్యము తోడన్ ,
హృదయము కలవర బెట్టెడి
పదములు లేకుండ వ్రాయ వలె బద్యములన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
సదమల రీతి నైషధపు సత్కృతితో కవిసార్వభౌముడున్
రిప్లయితొలగించండిబుధజను లొప్పు భాగవత ప్రోదిని పోతన కీర్తినందగన్
మదిచెడు పిచ్చి వ్రాతలవి మాన్యత నీయక వాణికౌను బా
ష్పదములు, లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్
హృదిలో గల్గిన భావముల్
రిప్లయితొలగించండిపదిలమగు తేట తెనుగున పలువురు పొగడన్
వదనం బువిచ్చు తిట్టగు
పదములు లేకుండ వ్రాయవలె బ ద్యములం
చం.ఉదయమెలేచిజేరితి సుదర్శనమైనసుమాలతోటలో
తొలగించండిచదివితికావ్యమాలలచమక్కులనీలుసుగంధపద్యముల్
మధనముచెందెనామదిసుధారసమొల్కనిపద్యభావమో
ప,దములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్?
భావము: ప్రొద్దున్నే మంచి పూలతోటలో కూర్చొని చక్కని చమక్కులు వున్న పద్యములెన్నో చదివాను కాని మనస్సు చంపుకొని అమృతముకురువనటువంటి పద్యములు వ్రాయటమును ఓర్చి బొత్తిగా సోగాసులేని పద్యాలను కవులు ఖచ్చితంగా వ్రాయాలా అన్న భావనలో వ్రాసిన పద్యం . ఆశీర్వదిస్తారని కవికులానికి నమస్కరించి వ్రాసిన పద్యము.
note : ఇక్కడ దమము యనగా సొగసులు అని అర్ధము.
పదుగురు మెచ్చని రీతుల్
రిప్లయితొలగించండిమది బాధించెడు వికార మలినపు కథలున్
పదశాస్త్రవిరోధములగు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్"
చదువ మది కడు మురియవలె
రిప్లయితొలగించండికద పండిత పామరులకు కవనములనగన్!
హృది మరువక నిది కఠినపు
పదములు లేకుండ వ్రాయవలె పద్యములన్!
చదువుట కింపు కావ్యములు చక్కెరకేళి రసాల రీతిగా
రిప్లయితొలగించండిపదుగురు మెచ్చి భేషనెడి భావము శైలియు ధారలీనుచున్
వదలుచు నీచదూషణలు వ్యంగ్యపు వృత్తులగూడు దౌష్ట్యమౌ
పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్
కుదురుచు పద్యమందునను గుమ్మడి తీగకు పూలవంటివౌ
రిప్లయితొలగించండిపదుగురు పాడగల్గుచును పాఠకులెల్లరు మెచ్చునట్లుగా...
వదరుచు భండనమ్ములను భండన భీముని బొబ్బరింతలౌ
పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్