30, డిసెంబర్ 2017, శనివారం

దత్తపది - 129 (హస్త-చిత్త-స్వాతి-మూల)

హస్త - చిత్త - స్వాతి - మూల
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
షడ్రసోపేత భోజనాన్ని వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో రాంభట్ల వేంకటరామ శర్మ గారు ఇచ్చిన దత్తపది)

87 కామెంట్‌లు:

  1. అమ్మయె స్వహస్తముల జేయ నాదరువుల
    చిత్త మలర జేయు నవియౌ కొత్త రుచుల
    చేయ తనవంతు సాయము చెల్లి స్వాతి
    కంద మూలములును జేర విందు లోన
    నారగించితి మయ్యమే మందరమును.

    రిప్లయితొలగించండి
  2. మూలము విందున భోజ్యము
    హేలగ వండిన కుదరదు చిత్త సుద్ధియున్
    చాలదు రుచులకు హస్తవాసి
    మేలగు స్వాతిచి నుకువలె మీగడ పెరుగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      రెండవ, మూడవ పాదాలలో గణదోషం. సవరించండి. (రెండవ పాదంలో యతి కూడా తప్పింది).

      తొలగించండి
    2. మూలము విందున భోజ్యము
      చిలికించగ రుచుల నన్ని చిత్తము తోడన్
      హేలగ వండిన హస్తము
      మేలగు స్వాతిచి నుకువలె మీగడ పెరుగే

      తొలగించండి
  3. మూలపాత్రను బాయస మొదవజేసి,
    చిత్తమలరగ కూరల చెంత నుంచి,
    హస్తములు బిండివంటల నందగింప,
    స్వాతి- కృష్ణుల బువ్వపుబంతి జరిగె.

    రిప్లయితొలగించండి
  4. మా తనయ స్వాతి వంటలు మధురమయ్య
    కందమూలము,బిర్యాని కమ్మగుంది
    చిత్తరువు చెందుటేలనో చిత్తగించు
    అభయహస్తంబు నిచ్చెద నారగించు!

    రిప్లయితొలగించండి
  5. హ| స్తవనీయమీ వంటలదిరిపోయె
    పాకము మురిపించిత్తడి పాత్రలందు
    లడ్లు హ్రస్వాతిమధురమౌ లలనమందు
    చూడ నామూలమానంద సుందరమ్ము

    మురిపించు + ఇత్తడి = మురిపించిత్తడి
    హ్రస్వ + అతి మధురమౌ = హ్రస్వాతిమధురమౌ

    రిప్లయితొలగించండి
  6. చిత్త సుద్ధిగ జేసిన కొత్త రుచులు
    హస్త వాసిని మించిన యమృత మనుచు
    సంత సించుచు తినగమా స్వాతి వంట
    ముచ్చటించగ బామ్మలు మూల మంట

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చిత్తశుద్ధి.. టైపాటు...

      తొలగించండి


  7. మా అయ్యరు గారి గురించి చెబ్తే షడ్రసోపేతమైనట్టే వంట యిలాకా వారిచే కాబట్టి :)

    కృతహస్తుండయ్యరు మూ
    ల తత్వము నెరిగినవాడు లక్షణముగ వం
    ట తనదగు రీతి చిత్తము
    న తరించుచు చేయువాడు నమ్ముము స్వాతీ !


    బత్తళిగ మూల మయ్యరు
    వత్తాసుపలుకుల నేను హస్తము కలుపన్
    చిత్తపు కైపుల్ స్వాతీ
    మెత్తని సున్నుండలున్ను మేల్మి జిలేబీల్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      హస్తను హస్తుడు.. అనరాదనుకుంటాను.

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    దత్తపది..

    *హస్త - చిత్త - స్వాతి - మూల

    అన్యార్థాలలో..... విందు భోజనం
    స్వేచ్ఛాఛందస్సు...

    విందున్ గూర్చియు షడ్రసాన్వితముగా , బిల్వంగ నస్మత్సుహృ..
    త్సందోహ స్తవనీయమైన గతి , నాస్వాదింపగా నాల్కలున్
    చిందుల్ వేసె , భుజించినంత కలిగెన్ చిత్తన్మయత్వంబు ! మా...
    కందెన్ స్వాతిశయంపు భోజనము మేమా మూల కూర్చుండినన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏🙏🙏

      సూపర్ బ్రహ్మాండంగా ఉంది...

      😊😊😊

      తొలగించండి
    2. ఆహ! స్తవనీయమైన పద్యాలను నేనీరోజు చిత్తుగా ఓడిపోయి ఓ మూల కూచుని ఆస్వాదిస్తున్నానుగా!!!

      😊😊😊

      తొలగించండి
    3. మైలవరపు వారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారు:

      మీ మాటలలోనే దత్తపది ఇమిడిపోయింది.. 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  9. అమ్మ హస్తాన వండిన నాకు కూర
    నత్త మెచ్చియు భుజియిoచె చిత్త మల ర
    నచ్చ లేదని స్వాతి యు నొ చ్చుకొ న గ
    మూల నుంచగ నది యేమొ మురిగి పోయె

    రిప్లయితొలగించండి
  10. రాత్రి సమస్య ప్రత్కక్షమవగానే 'స్వాతిశయం'పదబంధం కొరకు "ఆంధ్రభారతి"నిఘంటువు చూచాను. అయితే అటువంటి దేమీ లేదని సమాధానం వచ్చింది. మీరు వాడటం చూచాను.పూరణ బాగున్నది. అభినందనలు! అది ఏ నిఘంటువులో నున్నదీ తెలుప ప్రార్థన!

    రిప్లయితొలగించండి
  11. హస్తమందు నమరు నావడ, బొబ్బట్లు
    మూలకమ్ము కూర బూరెలడ్లు
    చింతచిగురుపప్పు చిత్తమునలరింప
    సంతసముగ జరిగె స్వాతి బెండ్లి!!!

    మూలకము= ముల్లంగి

    రిప్లయితొలగించండి
  12. స్వాతిశయమున తెల్గుభోజనము దినుడు
    ఆహ!స్తవనీయ మైయుండు నారు రుచుల
    చిత్తమందున మరువరు జిహ్వ రుచుల
    మొత్తమారోగ్య కరమౌను మూలబడరు.

    రిప్లయితొలగించండి
  13. *చిత్త*ము మెచ్చువంటలను జేయుచు నెల్లరి మెప్పుబొందు మా
    యత్తయొకామె*స్వాతి*వడియమ్ములుపప్పును,పిండివంటలున్
    క్రొత్త రకాల పచ్చడులు,కొబ్బరి*మూల*ముయైన పాకముల్
    మొత్తము*హస్త*వాసిగను మోదముగా రుచులొల్కనొండదే

    రిప్లయితొలగించండి
  14. డా.ఎన్.వి.ఎన్.చారి
    అమ్మ హస్తంపు వంటయే యమృత మగును
    పప్పు కించిత్తగు ఘృతము పచ్చి పులుసు
    స్వాదు చిత్రాన్నముల స్వాతి శయము
    తినుచు మామూల నెడి వాడు తిక్క మనిషి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  15. పేదవాని షడ్రసోపేత భోజనమిదే..

    స్వాతి జిప్పలోని శౌక్తికేయము వోలె
    హస్తమందు నన్న ,మందు కూర
    నింత ఆవబద్ద నీమూల దధియుండె
    చిత్తగించి దినుమ శ్రీనివాస!!!

    రిప్లయితొలగించండి
  16. మూలమూర్తియె పచనపు భువనమందు
    స్వాతిశయమున వండగ స్వాదురుచుల
    షడ్రసోపేత యశనము చక్కగాను
    చిత్తరువునైతి సతినహ!స్తరిని గాంచి!

    స్తరి= ఆవిరి,భాష్పము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      షడ్రసోపేత + అశనము... అన్నప్పుడు సవర్ణదీర్ఘ సంధి. లేదా 'షడ్రసోపేతపు టశనము' అవుతుంది. "షడ్రసోపేతమౌ విందు" అనవచ్చు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువర్యా!సవరించెదను!

      తొలగించండి
  17. స్వాతివండెనుజక్కటివంటకములు
    షడ్రుచులతోడనలరారెజిత్తమునకు
    బ్రేవుమనగనుదిందునునవియయిపుడు
    హస్తవాసియేమూలమ్మునట్టమునకు

    రిప్లయితొలగించండి


  18. శ్రీమాన్యంబగు హస్తవాసియనగన్ శ్రీవారి పాకమ్మహో
    మామాటల్వలె చిత్రమయ్యెను సుమా మావారి భోజ్యమ్మహో
    తోమాలిత్తునువారికిప్పుడిటనే తొంగిళ్ళ తో స్వాతియై!
    యామూలాగ్రముగా జిలేబి కవితా సారస్వతంబై సదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. శతావధానంలో శ్రీ జి.యం. రామశర్మ గారి పూరణ....

    సుమధుర హస్తభోజనము సూరివరేణ్యుల పద్యమట్లుగన్
    సుమనస చిత్తవంతులకు శుభ్రరుచుల్ పచరించుచుండఁగా
    నమరెడి స్వాతిముత్య మనునట్టి మనంబున నిచ్చు విందులే
    యమృతము కన్న మిన్నయగు నయ్యదె మూలము ప్రాణశక్తికిన్.

    రిప్లయితొలగించండి
  20. రాతిచిప్పయందు రాగి కంచిత్తడి
    పాత్రలందు వండె పప్పు పులుసు
    మామిడూరగాయ మామూలయా యనె
    నుగ గృహస్త నా తనూజ స్వాతి౹౹

    రిప్లయితొలగించండి
  21. దేహస్తంభన గంధ యు
    తాహార స్వాతిథేయ సామర సద్భా
    మా హస్త కృ తాశన చి
    త్తాహా రామూల రుచిక రాన్నముఁ గనరే

    [సు+ ఆతిథేయ: అతిథికి బాగుగ యోగ్యమైనది; స+అమర: బంగారము తో కూడినది]

    రిప్లయితొలగించండి
  22. చిత్తమున స్వాతిశయమును చితిన గూల్చి
    హస్తముల మోడ్చి మూలపుటమ్మకు నిడ
    షడ్రుచుల నివేదనము, నా కిటుల కలుగ
    జేయు సుఖ సంతసములను, సేమములను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. షడ్రుచుల విందునిడ స్వాతిశయము గలిగె
      నిటను; స్వహస్తముల జేయఁ వడ్డనమును,
      చిత్తమున సంతసమ్మున చెలువ మలరె;
      స్వజనఁ మదిమూల నద్భుత శాంతి కలిగె!

      తొలగించండి
    2. స్వాతిశయమున విందని వచ్చిరిచట
      మూలమైనది మరచినారిలను జనులు
      చిత్తమందున దలచుచు చిన్న బోయె
      హస్తమందు పళ్ళెముజూచి విస్తరిటుల

      తొలగించండి
    3. హస్తమున వడ్డనము జేయ గన్నము యల
      కందమూలపు గూరలు కానుపించ
      స్వాతిశయమున వండిన నేతి పాయ
      సములు చిత్తగించి దినుడు ప్రముఖులార!

      * హస్తము - హస్తాకారపు గరిటె

      తొలగించండి
    4. మీ పూరణ లన్నీ బాగున్నవి.
      కొన్ని లోపాలు... ప్రయాణంలో ఉండి వివరంగా తెలియ జేయలేను. ఒకసారి పరిశీలించండి.

      తొలగించండి
  23. పప్పు దప్పళముల పదనుగా వండితి
    .....గుత్తి వంకాయను కూర గాను
    అరటి వేపుడు వేచి యాపైన గోంగూర
    .....పచ్చడి జేసితి బాగుగాను
    పాయసాన్నము జీడిపప్పులతో వండి
    .....పులిహార పచ్చగా కలిపినాను
    బూరెలు తీయగా గారెలు కమ్మగా
    .....అప్పడాల్ వడియాలు నన్న మింక

    ఇది స్వహస్త పాకమే మీరు నమ్మండి
    చిత్త మైన విందు చేసి నాడ
    స్వాతిశయము కాదు వంట వచ్చును నాకు
    మూలకారణ మిది ముదిత యలిగె.

    రిప్లయితొలగించండి
  24. కళ్లముందర పప్పు పచ్చడి కందమూలపు కూరలున్
    పళ్లెమంద ప్రహస్తమందున పాలకవ్వయు గారెలున్
    కొళ్లచారుయు గడ్డ తైరుయుఁ గోరి పెట్టెడు చిత్తమే
    పళ్లు, కిల్లియు నైసు క్రీములు పంచ స్వాతిశయమ్మున
    న్నుళ్లమందున షడ్రసమ్ముల నొప్పు బోజ్యమె విందుగా!

    రిప్లయితొలగించండి


  25. ఏమండీ జీపీయెస్ వారు

    ఆకాశవాణి సమస్యా పూరణ విశేషము లేమిటి‌?
    వచ్చే వారపు సమస్య ఏమిటో తెలుసునా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావుగారు ఉవాచ:

      ఈమారు కూడా ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం వారి సమస్యా పూరణలో బ్లాగు లోని,వాట్సాప్ గ్రూప్ లోని కవిమిత్రుల పేర్లే ఎక్కువగా వినబడినవి. అంరికీ అభినందనలు!

      తదపరి ఆకాశవాణి, హైదరాబాద్ వారిసమస్య: "జన్యంబే గద కార్య సాధకము సౌజన్యాగ్ర గణ్యాళికిన్." (జన్యము = యుధ్ధము)

      తొలగించండి


    2. మాన్యంబెయ్యది కాదు ? రావడి, సభామర్యాద లేకుండనౌ
      జన్యంబే గద; కార్య సాధకము సౌజన్యాగ్ర గణ్యాళికిన్
      విన్యాసమ్ముగదా! సచేతనులకున్ విన్నాణ వీధిన్ భళా
      సన్యాసాశ్రమమేలయమ్మ రమణీ సాహిత్య లోకంబునన్!


      జిలేబి

      తొలగించండి
  26. హస్త వాసిగ పిండి ।వంటలు నంద జేయగ నాలుకే
    విస్తుపోయెను ।మూలమేమని విందునన్ రుచి నందగా
    పస్తు వీడిన చిత్త మందున పాలకోవ్వన యిష్టమే
    విస్తరించగ వంట వాసన విస్తుపోయెను స్వాతి యే ?

    రిప్లయితొలగించండి
  27. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    ( భార్యా భర్తల మధ్య సంభాషణ )



    స్వాతి ! యీనాడు చక్కని పాయసమును

    జీడి పప్పును వేయుచు చేయు మీవు ,

    కాంతు > త్వ ధ్ధ స్త పాక లాఘవము ‌ననుచు

    నడుగ చిత్తము ప్రభు ! యని యతివ పలికె


    మరియు దంశ మూలపు చారు మరువ కుండ

    చేయవే స్వాతి ! మిగుల రుచికరముగ న

    నంగ చిత్తము ప్రభు ! యని నాతి పలికె


    త్వ ధ్ధ స్త. ను నీ హస్త అని స్వీకరించవచ్చు
    ...................................

    { త్వత్ + హస్త. = త్వ ధ్ధ స్త ; పాక లాఘవము = వంటలో నేర్పు ;

    త్వత్ హస్త పాక లాఘవము = నీ చేతి వంట నేర్పు ;

    దంశ మూలము = మునగ ; దంశ మూలపు చారు =

    మునగ సాంబారు ; చిత్తము ప్రభు = ఆమె భర్తతో సరదాగ అనిన

    మాట }


    రిప్లయితొలగించండి
  28. ఆమె హస్తపు వంటక మమృత సమము
    చిత్తమును సంతతమలర జేయు సుమ్ము
    స్వాతిశయము కాదు నిజము పలుకుచుంటి
    అత్తగారి శిక్షణ మూలమనుట వింటి

    రిప్లయితొలగించండి
  29. కవిమిత్రులకు నమస్కృతులు.
    గద్వాల ప్రయాణంలో ఉన్నాను. రేపు వెలుదండ వారి సిడిల ఆవిష్కరణోత్సవం ఉంది. దానికి ప్రేక్షకుడిగా వెళ్తున్నాను.
    రేపు కూడా ప్రయాణంలో వ్యస్తుణ్ణై ఉంటాను.
    మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారూ!నమస్సులు!మీ ఆరోగ్యం గురించి మీశిష్యుల కొరకై నా శ్రద్ధవహించ ప్రార్ధన! పూర్తిగా కోలుకోకమునుపే ప్రయాణములు తగునా!ఈ చలికాలమునందు?అన్యధా భావించవలదు!ధన్యవాదములు!

      తొలగించండి
    2. చింతించ వలదు. ఈ ఉదయం నేనూ, నా సుపుత్రుడు, సార్ ని కలిసి వచ్చాము. కోలుకున్నారు చాలా వరకు. వారి Blogger Profile లో Interests చూడండి. "యాత్రలు" కూడా ఉన్నది.

      శుభం!!!

      తొలగించండి
  30. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: దత్తపది ఇచ్చిన పదాలు :: *హస్త* *చిత్త* *స్వాతి* * *మూల*
    పై పదాలను స్వార్థం (నక్షత్రములు అనే అర్థం) లో ఉపయోగించకుండా అన్యార్థం (వేఱే అర్థం) లో ఉపయోగించాలి.
    విషయము :: షడ్రసోపేతమైన భోజనం.
    ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా సరే పద్యం వ్రాయవచ్చు.

    సందర్భము :: ప్రతి ఒక్కరికీ అమ్మ చేతి వంట కమ్మగా ఉంటుంది. షడ్రసోపేతమైన భోజనము అంటే భోజనంలో మధురము (తీపు) ,ఆమ్లము (పులుపు) ,లవణము (ఉప్పు), తిక్తము (చేదు) ,కటువు (కారము) , కషాయము (ఒగరు) అనే ఆరు రుచులు తప్పనిసరిగా ఉండాలి. మన మనసు నాలుగు రుచులను మాత్రమే కోరుకొంటుంది. అలా కాకుండా చేదు ఒగరు అనే రెండు రుచులను కూడా కోరుకోవాలి. షడ్రసములను సమపాళ్లలో కలిగియున్న భోజనమే షడ్రసోపేతమైన భోజనం అవుతుంది. అదే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది అని వివరించే సందర్భం.
    . *మత్తకోకిల వృత్తం*
    అన్ని వంటల నమ్మగారి సు *హస్త* వాసియె కమ్మనౌ,
    నెన్న *చిత్త* ము తీపు కారము నెప్డు నుప్పును కోరుగా,
    ఉన్న చే దొగ రున్నచో పులు పున్న *స్వాతి* శయమ్మగున్,
    మిన్న షడ్రస *మూల* మౌ గద మేటి భోజన మిద్దియే.
    కోట రాజశేఖర్ నెల్లూరు. (30.12.2017)

    రిప్లయితొలగించండి
  31. అమ్మ హస్తము సోక నే యన్న మైన
    షడ్రసోపేత మౌనని స్వాతిశయము
    తోడ చిత్త గించెడి వాడ! చూడ నిలను
    ముదము గొన తల్లి ప్రేమయే మూల మగును!

    రిప్లయితొలగించండి



  32. స్వాతి వండె వంట బహురుచి కరముగ

    పరుల చిత్తమలర వాసిగాను

    భగిని హస్త రుచియు బహుబాగు యని యన్న/యనుచన్న

    మూలకూరుచుండి మురిసి తినియె.

    రిప్లయితొలగించండి
  33. అన్నదానంలో...విందు

    దాతలందరు ప్రేమమీరగ దానమివ్వగ హస్తముల్
    స్వాతిముత్యపు రంగు పుల్ముకు స్వాగతించగ నన్నమే
    నేతి వంటలు చిత్తమందున నిండి నాల్కల పిల్వగా
    మూతులన్నియు ముర్సె నక్కట మూల మూలకు పంక్తిలో
    ఖ్యాతి గాంచెను షడ్రసంబుల నన్నదానము ప్రీతిగా

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  34. నేటి పూరణల విందు బాగున్నది.పూర్ణాల విందు లాగున్నది.ఏలోటు లేదు.ఉన్నా అది హ్రస్వాతిహ్రస్వము.

    రిప్లయితొలగించండి