20, డిసెంబర్ 2017, బుధవారం

సమస్య - 2551 (దమయంతినిఁ బెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్"

68 కామెంట్‌లు:

 1. అమలుడు, ధర్మము తోడ
  న్నమరుల దూతగ చరించె నద్భుత రీతిన్;
  కమనీయ హృదయుడు, నలుడు,
  దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నలుడు 'ధర్మసుతు' డెట్లా అయ్యాడో చిన్న వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది.
   పోచిరాజు కామేశ్వర రావు గారి పూరణను ఒకసారి పరిశీలించండి.

   తొలగించండి
  2. పోచిరాజు వారి ప్రావీణ్యం నాకెక్కడిది సార్! "ధర్మము" అనే పదాన్ని మొదటి పాదంలో వాడాను కదా, సరిపోతుందనుకున్నాను. ఏదో ఒకటి, అర్ధరాత్రి కిట్టింపు :)

   తొలగించండి
 2. (క్రమాలంకారం)
  "సుమధురవచనుడు నిషధుం
  డమలుం డెవ్వరి వివాహమాడెను చెపుమా ?
  కమలనయన ద్రౌపదినో?"
  "దమయంతిని;బెండ్లియాడె ధర్మసుతు డొగిన్."

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. సుమధుర సుందరుడు నలుడు
   దమయంతినిఁ బెండ్లియాడె , ధర్మ సుతుఁ డొగిన్
   రమణీయ ద్రుపద తనయని
   సమతా భావమును దలచి సతిగా పొందెన్

   తొలగించండి
  2. అక్కయ్యా,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినండనలు.
   'తనయను' అనండి.

   తొలగించండి
  3. సుమధుర సుందరుడు నలుడు
   దమయంతినిఁ బెండ్లియాడె , ధర్మ సుతుఁ డొగిన్
   రమణీయ ద్రుపద తనయను
   సమతా భావమును దలచి సతిగా పొందెన్

   తొలగించండి
 4. మైలవరపువారి పూరణ

  సుమతిని ద్రుపదతనూజను
  క్షమాగుణమునందు జనకజాతను , ననురా..
  గమున గన భీమరాట్సుత
  దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరళీకృష్ణ గారు! సధ్యఃస్ఫూర్తితో మీరు జేసిన పూరణ ప్రశంసనీయము. 1971లో ఇంగ్లీషు గ్రామర్ లో నేర్చుకున్న ఒక అంశం గుర్తుకు వచ్చింది. I like the Shakespeare of India = I like Kalidasa.{Kalidasa is called the Shakespeare of India} అభినందనలు!!!

   తొలగించండి
  2. మైలవరపు వారూ,
   మీ పూరణ ప్రశస్తంగా, ఔత్సాహక పద్యకవులకు మార్గదర్శకంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 5. కమనీయ హృదయు డు నలు డు
  దమయంతి ని పెండ్లి యాడె ;ధర్మ సు తు డో గి న్
  విమలాత్మ జ ద్రుప దు సు త న్
  ద మ కం బు న పెండ్లి యాడె తల్లి యె కోర న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "విమలాత్మ ద్రుపదుని సుతన్" అనండి.

   తొలగించండి


 6. కమలనయనుండు నలుడౌ
  దమయంతినిఁ బెండ్లియాడె; ధర్మసుతుఁ డొగిన్
  కమలముఖి ద్రౌపదిని పెం
  డ్లముగ బడసెగద జనని దురాయిగ సుదతీ !


  ಜಿಲೇಬಿ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కమలనయనుండగు నలుడు' అనండి.

   తొలగించండి
 7. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య

  *దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్.*

  సందర్భం :: శమము దమము అనే గుణముల పోలికలో దమయంతితో సమానురాలైన ద్రౌపదిని ధర్మరాజు పెండ్లాడిన సందర్భం.

  రమణిని , పాంచాలిని , సతి ,
  నమలను , ద్రౌపదిని , సుందరాంగిని , కృష్ణన్ ,
  శమ దమ గుణముల పోలిక
  *దమయంతిని పెండ్లియాడె ధర్మసుతు డొగిన్.*
  కోట రాజశేఖర్ నెల్లూరు. (20.12.2017)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోట రాజశేఖర్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. సవరణతో
   రమణిని, పాంచాలిని, సతి
   నమలను, ద్రౌపదిని, సుందరాంగిని, కృష్ణన్,
   శమ దమ గుణ గణ నిర్జిత
   దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతు డొగిన్.
   కోట రాజశేఖర్ నెల్లూరు.

   తొలగించండి
 8. నమతుడు!,వగలాడు!నలుడు
  దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్
  సుముఖము తో దృపద మగని
  కొమరితను వరించె దల్లి కోర్కెను దీర్చన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ద్రుపదనృపుని' అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 9. కమనీయముగ నిషదపతి
  దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్
  విమలమగు మనసుతోడను
  కమలనయన యాజ్ఞసేని కరమును బట్టెన్

  రిప్లయితొలగించండి
 10. కమనీయమ్ముగ నలుడే
  దమయంతిని బెండ్లియాడె;ధర్మ సుతుడొగిన్
  తమకైదూళ్ళే చాలని
  సమయోచితముగ నుడివెను సంధి కొరకునై.

  రిప్లయితొలగించండి
 11. సముడా సమవర్తిసుతుకు
  శమదమముల,సాధువాది, సరసతతోడ
  న్నమలిన చరితుడు నలుడా
  దమయంతిని బెండ్లియాడె,ధర్మసుతుడొగిన్ !!

  ధర్మసుతుడు = ధర్మాత్ముడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సముడు సమవర్తి సుతునకు గా చదువ ప్రార్ధన!

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ధర్మసుతు'నకు అన్వయం?

   తొలగించండి
 12. సుమతిఁ గులధర్మపత్నిగ
  తమ తల్లిని గౌరవించి ద్రౌపది నొప్పన్
  కొమరార నామెలో గని
  దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ద్రౌపది యొప్పన్' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
   సుమతిఁ గులధర్మపత్నిగ
   తమ తల్లిని గౌరవించి ద్రౌపది యొప్పన్
   కొమరార నామెలో గని
   దమయంతినిఁ బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్.

   🌸గుండా వేంకట సుబ్బ సహదేవుడు 🌸

   తొలగించండి
 13. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

  విమలచరితుడు నలనృపతి

  దమయంతిని బెండ్లియాడె | ధర్మసుతు డొగిన్

  రమణిన్ ద్రోవదినిన్ వివ

  హము జేసుకొనె గద జనని యానతి గొనుచున్

  రిప్లయితొలగించండి
 14. గురువు గారికి నమస్సులు.
  సమయోచితముగ నలుడు
  దమయంతిని పెండ్లియాడె,ధర్మసుతు డొగిన్
  తమకున్ రాజ్యము సమమున
  విమలమతినపం చుమున్ రవి యునిచ్చు శుభముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదం సంతృప్తికరంగా లేదు. "విమలమతిన్ విన్నవించె విజ్ఞుండగుటన్" అందామా?

   తొలగించండి
  2. గురువు గారికి వినమ్ర పూర్వక ధన్యవాదములు.సాక్షి పత్రికలో మీరు మోన్నటి రోజు శతావధాన ములో పాల్గొన్న వార్త చాలా సంతోషము కలింగించింది. టీవీ లో కూడా కొంత సేపు 2 నిముషాలు కార్యక్రమం ప్రసారమయినది.

   తొలగించండి
 15. ప్రమదముగ స్వయంవరమున
  క్రమమున బెండ్లాడె నలుడు కాంతామణియౌ
  విమలాంగి ద్రౌపదిని తా
  దమయంతినిఁ, బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్

  రిప్లయితొలగించండి
 16. క్రమముగ సురలను మెప్పిం
  చి మహారాజు నిషధ ధవ శేఖరుఁడు పరా
  క్రమ నలుఁడు వీరసేనుని,
  దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్

  [ధర్మసుతుఁడు = న్యాయమైన కొడుకు/ ఔరస పుత్రుఁడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   విశిష్టాన్వయంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
  3. ఆర్యా నస్కారములు!!గురువుగారు విశిష్టాన్వయమని చెప్పేవరకూ నాకు అన్వయమర్ధము కాలేదు!నలుని తండ్రి పేరు తెలియకపోవడమే కారణము!
   ప్రశస్తమైన పూరణ!మీరు అందులకే సరస్వతీ పుత్రులనదగినవారు!నమస్సులు!

   తొలగించండి
  4. డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు. మహాభారతములో నారణ్య పర్వములో ద్వితీయాశ్వాసములో నలోపాఖ్యానము కలదు. కవిసార్వభౌముని శృంగార నైషధము కూడ నలుని చరిత్రయే.
   ఆంధ్రభారతి లో కూడా వివరములను సంక్షిప్తముగా నరయ వచ్చును.

   తొలగించండి
 17. సుమనోహర మూర్తి నలుడు
  దమయంతినిఁ బెండ్లియాడె, ధర్మసుతుఁ డొగిన్
  రమణి ద్రుపద తనయఁ మరియు
  ప్రమోదమున దేవికలను బరిణయ మాడెన్.

  రిప్లయితొలగించండి
 18. సమతను నెఱపుచు ధర్మము
  నమఱగ జేయుచు నలుండె యాద్యుండయ్యెన్
  మమకారము విరియ రమణి
  దమయంతిని బెండ్లి యాడె ధర్మసుతు డొగిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ధర్మసుతునకు అన్వయం?

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్సులు.ధర్మము నమరింప జేయుట లో ఆద్యుడైన ఇతడు ధర్మ దేవతకు సుతుని వంటి వాడని భావించాను.

   తొలగించండి
 19. "విమలయశుడు నలు డెటులన్
  దమయంతినిఁ బెండ్లియాడె?" ధర్మసుతుఁ డొగిన్
  "కమనీయమైన నాకథ
  ను మునివర ! దెలియగ జెప్ప"నుచు నడి గెనటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విశ్వనాథ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదాన్ని ...నమలచరిత! మునివర! తెలియఁగఁ జెప్పు" మనెన్..... అంటే వినసొంపుగా ఉంటుందని నా భావన. ఏమంటారు?

   తొలగించండి
 20. తమిగొని చేబట్టె నలుడు
  దమయంతినిఁ ; బెండ్లియాడె ధర్మసుతుఁ డొగిన్
  దమ తల్లి యాజ్ఞ నిడగా
  క్రమముగ ననుజులకు తోడ నా ద్రౌపది నే

  రిప్లయితొలగించండి
 21. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

  విమలచరితుడు నలనృపతి

  దమయంతిని బెండ్లియాడె | ధర్మసుతు డొగిన్

  రమణిన్ ద్రోవదినిన్ వివ

  హము జేసుకొనె గద జనని యానతి గొనుచున్

  రిప్లయితొలగించండి
 22. రిప్లయిలు
  1. గురుమూర్తి గారూ,
   మీ పూరణ అన్ని విధాల సరిగానే ఉన్నది కదా! ఎందుకు తొలగించమంటున్నారు?

   తొలగించండి
 23. రమణుడు నిషిధాధిపతియె
  దమయంతిని బెండ్లి యాడె! ధర్మ సుతు డొగిన్
  కమనీయంబగు నటు లా
  యమ ద్రోవదిని మనువాడె యౌవన మొప్పన్!

  రిప్లయితొలగించండి
 24. . “క్షమనే నమ్మియునలుడట
  దమయంతిని పెండ్లియాడె”|”ధర్మసుతు డొగిన్
  సమమే స్వయంవరమున
  తమతల్లియు నాజ్ఞయందు ద్రౌపది పతియౌ”|

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "స్వయంవరమునన్" అంటే సరి!

   తొలగించండి
 25. సముడు సమవర్తి సుతునకు సమరవీరు
  డౌనలుడు దమయంతిని బెండ్లియాడె;
  ధర్మసుతుడొగిన్ వరియించె ద్రౌపదియగు
  యాఙ్ఞసేనిని జనయిత్రి యాఙ్ఞమేర

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   కంద పాద సమస్యకు మీ తేటగీతి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గురువుగారికి నమస్సులు! ధన్యవాదములు!ఒక పొరపాటు
   జరిగినది. రెండవ పాదంలో యతి తప్పింది. సవరించిన పూరణ:

   నైషధప్రబంధ వరుడు నలుడు సమర
   వీరుడా దమయంతిని బెండ్లియాడె;
   ధర్మసుతుడొగిన్ వరియించె ద్రౌపదియగు
   యాఙ్ఞసేనిని జనయిత్రి యాఙ్ఞమేర!

   తొలగించండి
 26. మమతలు పెనవేయ నలుడు
  దమయంతిని బెండ్లియాడె, ధర్మసుతుఁడొగిన్
  కమలాక్షి సత్యసంధను
  ప్రమదంబుగ కట్టుకొనెను ప్రజనిక కోరన్!!!

  ప్రజనిక = తల్లి

  రిప్లయితొలగించండి


 27. సముచితముగనిషధపతియు

  దమయంతినిఁ బెండ్లియాడె ,ధర్మసుతుఁ డొగిన్

  మమతలు మాలల తోడను

  సుమ దరహాసముజూపు సుదతిని గనియెన్.

  2అమరులు మెచ్చిన నలుడట

  దమయంతినిఁ బెండ్లియాడె ,ధర్మసుతుఁ డొగిన్

  విమలంబగు మది తోడను

  నమ కోరికపై ద్రుపదజ నాలిగ గొనియెన్.

  రిప్లయితొలగించండి