11, డిసెంబర్ 2017, సోమవారం

సమస్య - 2543 (పున్నమి దినమయ్యెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా"
(లేదా...)
"పున్నమి వేళ యయ్యె నికఁ బూర్తిగఁ జంద్రుఁడు మాయమయ్యెడిన్"
(శారదా విజయోల్లాసం వారికి ధన్యవాదాలతో...)

97 కామెంట్‌లు:

 1. పన్నుగ చంద్ర గ్రహణము
  మిన్నున సంధ్యా సమయము మీరక రాగా
  కన్నియలార! కనుండిట
  పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. https://sites.google.com/site/astronomyintanzania/previousmonthsnightskies/lunar-eclipse-at-sunset-this-saturday

   తొలగించండి
  2. గురువు గారు టై పాటు పున్నమి వేళ యయ్యె నికఁ బూర్తిగఁ జంద్రుఁడు మామమయ్యెడిన్"
   మామమయ్యెడిన్" మాయ ఉండాలి గదా మామ అని పడ్డది

   తొలగించండి


  3. మాయంబవలే మామ సు
   మా!యేమండి టయిపాట? మా సందేహం
   బాయెన్ !మాయామయ జగ
   మాయెను పున్నమి సమయము మహిమాన్వితమై !

   జిలేబి

   తొలగించండి
  4. ప్రభాకర శాస్త్రి గారూ,
   గ్రహణవ్యాజంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   *******
   పూసపాటివారూ, జిలేబీ గారూ,
   టైపాటు సవరించాను. ధన్యవాదాలు.

   తొలగించండి
 2. మన్నిక దీపావళినిశి
  నెన్నెన్నియొ బాణసంచ నేర్పడ గాల్చన్
  చెన్నుగ వెలుగులు నిండెను;
  పున్నమిదినమయ్యెను శశి పొడగట్టడుగా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   దీపాల వెలుగు పున్నమి రాత్రిని తలపించిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. మిన్నున ఘనమాలికలవి
  క్రన్నన గ్రమ్మగ కడలిని కల్లోలముతో
  కన్నుల కింపగు కార్తిక
  పున్నమియయ్యును శశి పొడగట్టడుగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పున్నమిదినమయ్యును శశిపొడగట్టడుగా!

   తొలగించండి
  2. సీతాదేవి గారు!చక్కని పూరణ!అభినందనలు!

   తొలగించండి
  3. గురువుగారూ!పున్నమిదినమయ్యెను కన్న దినమయ్యును సరియైనదనుకొందును?

   తొలగించండి
  4. ధన్యవాదములు జనార్ధనరావుగారూ!

   తొలగించండి
  5. సీతాదేవి గారూ,
   మబ్బులు క్రమ్మిన కార్తిక పూర్ణిమ విషయంగా మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
   అయ్యెను, అయ్యును... ఎలా అన్నా సరిపోతుంది. కాని ఇప్పటికే వివిధ మాధ్యమాలలో ఇది ప్రకటింపబడింది. ఇప్పుడు మార్చడం కుదరదు.

   తొలగించండి
 4. అన్నా! మబ్బులు ముసిరెను
  మిన్నగ వర్షమె కురిసెను మెరుపుల తోడన్
  యెన్నగ నదియే శ్రావణ
  పున్నమి దినమయ్యెను, శశి పొడగట్టడుగా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "తోడ| న్నెన్నగ..." అనండి. అక్కడ యడాగమం రాదు.

   తొలగించండి
 5. కొన్ని దినములు గడిచె యా
  మిన్ను తుఫాను కతమునను మేఘావృతమై
  యున్నది,కావున నేమో
  "పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   తుఫాను విషయంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "గడచె నా| మిన్ను.." అనండి.

   తొలగించండి
  2. ఆర్యా ! అభినందనకు, సూచనకు ధన్య వాదాలు !

   తొలగించండి
 6. కొన్నిదినమ్ములే పెరుగు కొన్నిదినమ్ములు సూపు క్షీణతన్
  వెన్నెల కాయునొక్కపరి వెల్గులఁ జిమ్మక పోవునొక్కచో
  వన్నెలు చింద నేటికిని పక్షము రోజుల ముందరే గదా
  పున్నమి వేళ యయ్యె, నికఁ బూర్తిగఁ జంద్రుఁడు మాయమయ్యెడిన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   విరుపుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 7. ( చంద్రునికి రోహిణి పైగల అధిక ప్రేమకు పున్నమి రోజున ఆమెతోనే ఉండుటచే మిగిలిన దక్షపుత్రికలకు కనబడడు అని దుఃఖిస్తున్నట్లు భావనతో)

  వెన్నెల కాంతులు వెల్గుచు
  పున్నమి దినమయ్యెను, శశి పొడఁగట్టఁడుగా
  అన్నుల మిన్నగు రోహిణి
  నెన్నుచు బోవు ననుచుమది నేడ్చెను రిక్కల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలసుబ్రహ్మణ్యం గారూ,
   చక్కని పూరణ. అభినందనలు.
   'మిన్న+అగు' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి


 8. మిన్నంటెనోయి ప్రేమా!
  పున్నమి దినమయ్యెను; శశి పొడఁగట్టఁడుగా!
  అన్నుల మిన్నగ చేరగ
  కన్నడిని, జిలేబి వేచి కాచెన్ కన్నుల్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. జీపీయెస్ వారు

   నమో నమః   జిలేబి

   తొలగించండి
  2. కన్నులు చెమ్మగిలెనులే...
   పున్నమి దినమయ్యెను; శశి పొడఁగట్టఁడుగా
   పన్నుగ వెండితెరపయిన
   కన్నియలారా! కపూరు కన్నులు మూసెన్!

   తొలగించండి
  3. (శశి కపూర్ మార్గశిర పున్నమి నాడు మరణించెను ;)

   తొలగించండి
  4. జిలేబీ గారూ,
   ప్రభాకర శాస్త్రి గారూ,
   శశికపూర్ మరణం విషయంగా మీ ఇద్దరి పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  5. అన్నయ్యా!చెమరించెన్
   గన్నులు గనినంతనీదు కైమోడ్పులనే
   యన్నుల మిన్నల మనముల
   చెన్నుగ దోచిన శశికది చేల్వగుకాన్కే!

   శశికపూర్ కు చక్కని నివాళి!

   తొలగించండి
 9. కన్నుల విందుగ మెరిసెడి
  వెన్నెల కాంతులకు మురిసి వేడుక జూడన్
  చిన్నది పరవశ మందున
  పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా

  రిప్లయితొలగించండి


 10. కన్నులు కాచెనమ్మ సయి కన్నడు గాన్పడ డమ్మ మాలినీ
  పున్నమివేళయయ్యె నికఁబూర్తిగఁజంద్రుఁడు‌ మాయమయ్యెడిన్
  వన్నువ గాన వచ్చె గద! వాహిని యై పొరలెన్ జిలేబియా
  యన్నులు మిన్నగాను పిరియమ్ము సదా యవనారి కై మదిన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. మైలవరపు వారి పూరణ

  కన్నుల కలువల కాతడె
  పున్నమి శశి నాకు , ముగ్ధమోహన కృష్ణుం..
  డెన్నగ , రాడేమే ? ఈ
  పున్నమి దినమయ్యెను *శశి* పొడఁగట్టఁడుగా !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. నన్ను దహించుచుంటివిది న్యాయమొకో ! విరహాగ్ని తోడుగా
   వెన్నెలఱేడ ! లేడిచట వేణుధరుండు ! రవంత తాలుమం
   చన్న , దయారసాన్వితుడునై గని రాధను దాగె మబ్బులన్
   పున్నమి వేళ యయ్యె నికఁ బూర్తిగఁ జంద్రుఁడు మాయమయ్యెడిన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. మురళీకృష్ణగారూ! బృందావన దర్శనం చేయించారు!నమోనమః!

   తొలగించండి
 12. వెన్నెలలు చిన్నబోయెను
  కన్నుగవను కప్పి వేయ కౌగిలి యందున్
  చెన్నుగ నల్లని కురులే
  పున్నమిదినమయ్యెను శశిపొడగట్టడుగా

  రిప్లయితొలగించండి
 13. వెన్నెల వెలుగు లు నిండ గ
  పున్నమి దిన మయ్యేను ;శశి పొడ గట్టడు గా
  మిన్న oతట కమ్ము కొని యె
  నె న్న డు గన రాని మబ్బు లె oతయు మెండై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. వెన్నెల కాసెను జగతిని
  పున్నమి దినమయ్యెను,శశి పొడగట్టడుగా
  మిన్నున మబ్బులు మూగగ
  పున్నాగమ్ముల మనముల మురిపెము దోచన్!!!

  రిప్లయితొలగించండి
 15. నిన్న మరి వచ్చె నార్డరు
  చిన్నకొడుకునకు దుబాయిఁ జేరమని వేగన్
  అన్నా ! వెళ్ళెడు రోజగు
  "పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా"
  * శశి కుమరునిపేరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విశ్వనాథ శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం చివర గణదోషం. "...జేరగ వేగన్" అంటే సరి!

   తొలగించండి
 16. సవరణతో:
  కొన్ని దినములు గడిచె నా
  మిన్ను తుఫాను కతమునను మేఘావృతమై
  యున్నది,కావున నేమో
  "పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా"

  రిప్లయితొలగించండి
 17. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


  { ముసుగులో నున్న నీ ముఖము గని చ౦ద్రుడు చిన్నబుచ్చుకొని

  మేఘము చాటున దాగెను . ఇక d i r e c t గా చూచిన ఈ

  ప్రప౦చమునే శాశ్వతముగా విడిచి పారిపోవును చెలీ ! }


  పున్నమి వేళ యయ్యె నిక బూర్తిగ జ౦ద్రుడు మాయమయ్యెడిన్

  విన్నదనమ్ముచే మొయిలు వీధిని డాగుచు | నో ప్రియా౦గనా !

  చెన్నుగ వెల్గు నీదయిన జిల్గు ముసు౦గున నున్న నాస్యమున్

  దిన్నగ జూచిన౦త , జగతిన్ విడి పారును శాశ్వత౦బుగా ! !

  ( తిన్నగ = D I r e c t. గా }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   సమస్యాపాదంతో పద్యాన్ని ప్రారంభించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 18. కన్నట్టి తల్లి పశువై
  చిన్నారిని పెనము పైన చేర్చఁగ కాలన్
  ఖిన్నుండై కిరి దాగెనొ?
  పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా?

  రిప్లయితొలగించండి
 19. కోట రాజశేఖర్ గారి పూరణ

  సందర్భం :: చంద్రుడు, తన ఇరవైయేడు మంది భార్యలలో, రోహిణీ నక్షత్రమును మాత్రమే ఎక్కువగా ఆదరిస్తున్నాడని, మామయైన దక్షుడు *చంద్రునికి క్షయరోగం కలుగుగాక* అని శాప మిచ్చినాడు. *భవిష్యత్తులో ఏమేమి జరుగుతాయో క్రమంగా తెలియజేయండి, అన్న ప్రశ్నకు దివ్యదృష్టి ఉన్న నారద మహర్షి, సమాధానం చెప్పే సందర్భం గా ఊహించవచ్చు.

  ఎన్న శపింపగా దగునె? యీ క్షయరోగము గల్గ నంచు, నా
  సన్నుని, దక్షు గాంచి, ప్రతిశాప మొసంగును, క్షీణరూపుడై
  *పున్నమి వేళ యయ్యెనని పూర్తిగ చంద్రుడు మాయమయ్యెడిన్,*
  చెన్ను దొలంగ, లోకము నశించును, వర్షము లుండ వింక, నే
  మన్నను పంటలుండ విక, మాన్యత చంద్రుని రాక గోరుచున్
  మున్ను మహౌషధీ చయము బూజ్యత వేయుచు నబ్ధి జిల్కగా,
  మన్నన వచ్చు చంద్రు *డను మైత్రిని బ్రహ్మయు,* నట్లు చేయ, నా
  పన్న జనాళి గావ, శశి వచ్చును రెండవ మారు సోముడై.

  కోట రాజశేఖర్ నెల్లూరు

  రిప్లయితొలగించండి
 20. కన్నుల శుక్లము లొచ్చెన్.
  అన్నా!నాకన్ని నల్లనై కన్పట్టున్.
  మన్నించి చూచి చెప్పుము.
  పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టడుగా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   నేత్రరోగ పీడితుని మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వచ్చెన్' అన్నదాన్ని 'ఒచ్చెన్' అనరాదు. "కన్నులకు వచ్చె శుక్లము। లన్నా..." అనండి.

   తొలగించండి
 21. పన్నుగనేడు చంద్రునికి పట్టును తా గ్రహణమ్మటంచు పె
  ర్కొన్నది కాలసూచికము కొద్దగకాదది పూర్తిపట్టగున్
  కన్నులు విచ్చి చూచినను కాంతులులేవు విహాయసమ్మునన్
  పున్నమి వేళ యయ్యెనని పూర్తిగ చంద్రుడు మాయమయ్యెడిన్,*

  రిప్లయితొలగించండి
 22. సన్నగ మొదలై వర్షము
  మిన్నును మన్నును కలువగ మెరుపుల తోడన్
  విన్నది నిండగ నకటా
  పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టడుగా

  రిప్లయితొలగించండి
 23. అన్నుల మిన్నా మిన్నున
  వెన్నెల వన్నెలను మున్న వీక్షింపంగం
  జన్నునె కన్నుల నెన్నఁగఁ
  బున్నమి! దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా

  [పున్నమి : ఈ పేరున నొక యింతి; దినము = పగలు]


  ఎన్నఁగఁ గాల చోదితులె యివ్వసుధాతల మందు నెవ్వరుం
  గిన్నర దేవ గాయక సుకీర్తిత మానవ దేవ దైత్యులుం
  గ్రన్నన రాహు వీ శశినిఁ గ్రౌర్యము వూని గ్రసించుఁ జూడుమా
  పున్నమి వేళ యయ్యె నిఁకఁ బూర్తిగఁ జంద్రుఁడు మాయమయ్యెడిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 24. మిన్నగ జేసి యత్నము శ్రమించి కనుంగొన బీయుషమ్ము దా
  బన్నుగ మోహినీ విధము బన్ని సుధన్ సురలందు బంచగా
  గ్రన్నన నచ్యుతుం డసుర కాండము తీ రిటు లాయె మిత్రమా
  పున్నమి వేళ యయ్యె నికఁ బూర్తిగఁ జంద్రుఁడు మాయమయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
 25. ఎన్నడు కార్తీక దివియ
  లన్నులు బెట్టును ,దెలుపుము నగరము దినమున్
  మిన్నున యేమి జరుగునో
  పున్నమి దినమయ్యెను, శశి పొడఁగట్టఁడుగా,

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కార్తీక దివియ' దుష్టసమాసం. "కార్తికపు దివియ" అనవచ్చు. 'అన్నులు'...? "మిన్నున నేమి" అని ఉండాలి.

   తొలగించండి
 26. అన్నా!వింతేమున్నది?
  యెన్నగ యేమాసమయిన నెవ్వరికైనన్
  వెన్నుని ప్రియమగు నాడది
  పున్నమిదినమయ్యెను,శశిపొడగట్టడుగా

  పున్నమిదినము = పున్నమి పగలు సమయము

  రిప్లయితొలగించండి
 27. అన్నులమిన్న హసించుచు
  కన్నులముందునకువచ్చి కౌగిలిఁ జేర్చన్
  అన్నడిరేతిరి గదిలో
  పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా

  రిప్లయితొలగించండి
 28. అన్నులమిన్న నీసొగసు నాకసమందునచందమామకా?
  కొన్నమగండు రాడనుచు కోర్కెలుదీర్చని చల్లగాలికా?
  పున్నమి వేళయయ్యె|నికబూర్తిగ జంద్రుడుమాయమయ్యెడిన్|
  అన్నిట జూడగా గ్రహణ మంటగ?భర్తయు లేక సౌఖ్యమా?
  2.నిన్నటి దినమున్ చంద్రుడు
  పున్నమి దినమయ్యెను “శశి”పొడగట్టడుగా
  డన్నది నిజమా?పతియే
  నిన్నంటక వేరుబదుట నేర్పరి తనమా? {చంద్రడు,శశి పతిసతులు}
  .

  రిప్లయితొలగించండి
 29. వన్నెల చిన్నదాన నెలబాలుడు వ్యోమము నందు జేరె నే
  డెన్న ద్వితీయ సత్యమిది యింపెసలారగ నూలుపోగుతో
  క్రన్ననరమ్ము చూచెదము రమ్యసుజీవన మందు దాన నో
  పున్నమి! వేళ యయ్యె నికఁ బూర్తిగఁ జంద్రుఁడు మాయమయ్యెడిన్.

  రిప్లయితొలగించండి
 30. మొన్న త్రయోదశి గదరా !
  నిన్న చతుర్దశి నిశిశశి నింగిని వెలిగెన్
  కన్నా ! గ్రహణము నేడయె
  పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా

  నిన్నటి సమస్యకు నా పూరణ

  కమ్మని పాలను తల్లిడ
  నెమ్మది గా త్రాగి పెరిగి నీచుండగుచున్
  రమ్మని వృద్ధాశ్రమమున
  కమ్మా! యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్

  రిప్లయితొలగించండి


 31. మీ పూరణ బాగున్నది
  కైపద శంకరు పలుకుల కందము పలుకున్
  తా పర్యవేక్షకుండై
  సౌపానముల వెలయించె ఛందంబునకున్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి 32. చిన్నా వినుమయ్యా

  పున్నమి దినమయ్యెను శశి పొడఁగట్టఁడుగా

  నిన్నటి నుండియె  విడువక

  మిన్నున నురుములు మెరుపులు మెండుగ నిండెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఉమాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలొ గణదోషం. "చిన్నా వినుమయ్యా యీ..." అందామా?

   తొలగించండి
 33. సన్నుతి సేయగా వలయు సద్గురు పత్నిని మాతవోలె,లే
  కున్ననధోగత౦చెరిగియున్మదనార్తి రమింప నేగె నా
  యన్నులమిన్నతారను బృహస్పతిపత్నిని మబ్బుచాటునన్
  పున్నమివేళ యయ్యె నికఁ బూర్తిగఁ జంద్రుఁడు మాయమయ్యెడిన్

  రిప్లయితొలగించండి
 34. ఎన్నగ చీకటి రేయిని
  వన్నెల దీపాల కాంతి వర్ధిల జేయన్
  కన్నులు మిఱుమిట్లు గొనగ
  పున్నమి దినమయ్యెను! శశి పొడగట్టడుగా!

  గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.
  ధన్యవాదములు.
  క్రమ్మగ నాంగ్లపు మోహము
  కమ్మని తెలుగు విడ నేడు గౌరవ మనగన్
  మమ్మిని జేయుచు తల్లిని
  యమ్మా యని పిలువని సుతుడతి పూజ్యుడగున్!

  రిప్లయితొలగించండి
 35. పన్నులు తగ్గించ మనగ
  తన్నులతో త్రోసి జైలు తలుపులు మూయన్,
  పొన్నారి గాంధి తాతకు
  పున్నమి దినమయ్యెను! శశి పొడఁగట్టఁడుగా!

  రిప్లయితొలగించండి
 36. కోట రాజశేఖర్ రెండవ పూరణ

  *అవధాన విద్యా గురువులగుశ్రీ నరాల రామారెడ్డి గారి ఊహకు పద్యరూపం.*

  సందర్భం :: నూతన వరుడు నూతన వధువుతో
  ఓ చంద్రముఖీ! అన్నులమిన్నా! నీ అధరామృతాన్ని
  నీ వన్నె చిన్నెలను, ఆస్వాదించేందుకు వచ్చినాను.
  వెన్నెల వేళ అయ్యిందని నాకు కోరిక చెలరేగుతుండగా,
  గాలికి కదలిన నీ శిరోజాలు గుంపుగా నీ ముఖంపై చేరుకోగా,
  నేను చూడాలనుకున్న నీ ముఖచంద్రుడు మాయమైపోతున్నాడు, అని చమత్కరించే సందర్భం.

  అన్నులమిన్న! చంద్రముఖి! యానగ నీ యధరామృతమ్ము, నీ
  వన్నెలు గ్రోల, వచ్చితిని, వాయుహతమ్ములు నీ శిరోజముల్,
  చెన్నగు నీదు మోముపయి చేరెను గుంపుగ, కోర్కె రేగెగా
  *పున్నమ వేళయయ్యెనని; పూర్తిగ చంద్రుడు మాయమయ్యెడిన్.*

  కోట రాజశేఖర్ నెల్లూరు.

  రిప్లయితొలగించండి
 37. చిన్నది నచ్చి చందురుని చేనికి రమ్మని సైగచేయగన్
  చెన్నుగ దాని వెంటబడ చేరుము పున్నమరేయి తన్ననన్
  గన్నుల నిద్దురే మఱచి కాచుకు కూర్చొని చేను చేరెడున్
  పున్నమి వేళ యయ్యె నికఁ బూర్తిగఁ జంద్రుఁడు మాయమయ్యెడిన్!

  రిప్లయితొలగించండి
 38. వెన్నెల రాక కోసమిట వేచెద హాయిగ వచ్చు రూఢిగా
  పున్నమి వేళ యయ్యె నికఁ బూర్తిగఁ జంద్రుఁడు;...మాయమయ్యెడిన్
  కన్నుల లోన నీరములు కారపు కూరలు నత్తగారితో
  పన్నుగ పారిపోవగను ప్రక్కన నూరికి పెండ్లివంటకై...

  రిప్లయితొలగించండి