26, డిసెంబర్ 2017, మంగళవారం

సమస్య - 2556 (విల్లది రామునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే"
(లేదా...)
"విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే"

123 కామెంట్‌లు:

  1. మల్లెల గంధమునే వెద
    జల్లెడు బంధము రఘుపతి జానకి నడుమన్
    వెల్లువ జగమంత పరిఢ
    విల్లది రామునకు నైన విరువ దరమ్మే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      జగమంతా పరిఢవిల్లే వెల్లువ వంటి సీతారాముల బంధం ఎవరికైనా విరువరానిదే కదా! చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  2. జల్లులు సంధ్యన కురియుచు
    మెల్లిగ సూర్యుండు రాగ మేఘము లందున్
    చల్లగ నగుపడు నింద్రుని
    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే

    ఇంద్రుని విల్లు = ఇంద్ర ధనుస్సు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మెల్లి మెల్లిగా : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
      adv.
      Very gently, gradually

      తొలగించండి
    2. ప్రభాకర శస్త్రి గారూ,
      ఇంద్రధనుస్సుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంధ్యను' అనండి. అదంతాలకు 'ను' చేరుతుంది. 'న' కాదు.
      'మెల్లగ' అనడం సాధువు. ఆంధ్రభారతిలో ఉన్నా బ్రౌణ్యం, శ్రీహరి నిఘంటువు, తెలుగు వ్యుత్పత్తికోశాలను ప్రమాణంగా తీసుకొనరాదు. ఇవి వ్యావహారిక, మాండలికాలకు కూడా అర్థలిచ్చాయి. గ్రాంధిక పదాలకు శబ్దరత్నాకరమే ప్రమాణం.

      తొలగించండి
    3. సార్!

      ముందు "మెల్లగ" అనే వ్రాసితిని. ఎందుకో "మెల్ల కన్ను" గుర్తొచ్చి అపశబ్దంలా తోచినది :)

      తొలగించండి
  3. తెల్లని దొరయని పిలువగ
    చల్లని రాఘవుని ప్రేమ సాకల్య మవనన్
    జల్లను జానకి మదిలో
    విల్లది రామునకు నైన విఱువ దరమ్మే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      ప్రేమ అనే విల్లు అని మీ తాత్పర్యమా? బాగుంది.
      రెండవ పాదం చివర గణదోషం. "సాకల్యముగా" అనండి.

      తొలగించండి
  4. విల్లును విరచిజనకసుత
    యుల్లము గెల్చిన ఘనుండు యోధుండనురం
    జిల్లెడు సీతముఖపు కను
    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్యం గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.
      సాధారణంగా కనుబొమ్మను విల్లుతో పోలుస్తారు. మీరు కన్నునే విల్లు అన్నారు.

      తొలగించండి
    2. గురువు గారికి నమస్సులు. “నుడి విల్లు” వ్రాయ బోయి పొరబాటున కనువిల్లు వ్రాసితిని. మన్నించవలెను. సరరించిన తరువాత

      విల్లును విరచిజనకసుత
      యుల్లము గెల్చిన ఘనుండు యోధుండనురం
      జిల్లెడు సీతముఖపు నుడి
      విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే

      తొలగించండి
  5. కల్లా కపటము లేకను
    చల్లని హేమాద్రి పైన సాకల్యముగ
    న్నుల్లము రంజిల్లు శివుని
    విల్లది రామునకు నైన విఱువఁ దరమ్మే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగున్నది. కాని రాముడు విరిచింది శివుని విల్లునే కదా! మరి దానిని విరువలేడనడం?

      తొలగించండి
    2. 'కల్లాకపటము' అనడం వ్యావహారికం. "కల్లయు కపటము" అనండి.

      తొలగించండి


  6. అల్లన మెల్లన మన్మధు
    జల్లన బాణమును వేయ జానకి రాము
    న్నుల్లము పొంగె జిలేబీ,
    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👌👌👌

      *న్నుల్లము పొంగగ , పుండ్రపు
      విల్లది ?

      తొలగించండి


    2. అదురహో జీపీయెస్ వారు


      జల్లనె మహీజ యుల్లము
      నల్లని వాడట ధనువున నారిని మీటన్ !
      విల్లది జిలేబి పుండ్రపు
      విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే!

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      చెఱకు విల్లుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. నల్లని పిల్లడు ; వీడా
    ప్రల్లదుడయి మాయల విలు భంగము జేసెన్ ?
    జెల్లదు ; మద్గురువగు హరు
    విల్లది ; రామునకు నైన విరువ దరమ్మే ?
    (పరశురాముడు రౌద్రంతో పలుకుతున్నాడు .)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      సుమ సుకుమారుని వలె కనిపిస్తున్న రాముని చూచి పరశురాముడు సందేహించాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈ సందర్భంగా కరుణశ్రీ గారి ఈ పద్యాన్ని గుర్తుకు తెచ్చుకొందాం...
      ఫెల్లుమనె విల్లు, గంటలు ఘల్లుమనె, గు
      భిల్లుమనె గుండె నృపులకు, జల్లుమనియె
      జానకీదేహ మొక నిమేషమ్మునందె
      నయము జయమును భయము విస్మయము గదుర.

      తొలగించండి


  8. అల్లన నేలచూలి యనఘా రఘురామునిగాంచెనమ్మరో!
    నల్లనిమేనికాంతి హరి నారిని మీటగ నించువింటిచెం
    చల్లన మిట్టకోల సయి చక్కగ మీటె మహీజకమ్మ! పూ
    విల్లది రాఘవుండయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పూవిల్లుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అనఘా.. అన్నది సంబోధనగా స్వీకరిస్తే అన్వయం కుదరదు. 'అనఘు+ఆ' అనుకుంటే అక్కడ "అనఘు నా" అవుతుంది.

      తొలగించండి


    2. కందివారు

      కులాసాయేనా ?

      నెనరులు సవరణకు
      మనసా అంటే సరిపోతుందా?


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      'మనసా' అంటే సరిపోతుంది.
      జ్వరం తగ్గింది. జలుబు, దగ్గు, ఒంటినొప్పులు ఉన్నాయి. కోలుకుంటున్నాను. ధన్యవాదాలు!

      తొలగించండి
  9. తెల్లముఖమ్ముల వేసిర
    టెల్లరు రాజన్యులచట యిదిగాంచుచు తా
    నుల్లముఁ లక్ష్మణుడు దలచె
    విల్లది రామునకు నైన విరవదరమ్మే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      లక్ష్మణిని సందేహంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని అలా సందేహించినట్లు రామాయణంలో లేదు. అంతేకాదు రాముని సామర్థ్యంపై అతనికి అపారమైన నమ్మకం. అక్కడ "తా। ముల్లమున సభికు లనిరిటు.." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  10. ఎల్లలు దాటుచు రఘుపతి
    యిల్లాలిని వెదుకఁ బోవు దృఢ సంకల్ప
    మ్మల్లిన హనుమ హృదయమను
    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే?

    రిప్లయితొలగించండి
  11. ఇవియే సుమములయ్య యువనారి! బ్రోచుము సతతము మమ్ముల శరణు తోడ,
    సూరీ!వసుధన మిమ్మేరీతి గొలచినన్ గాచు చుందువుగదా కరుణ నిడుచు,
    చర్చించ వలదని, యర్చించవలె గడు భక్తితో ననుచు నీ పామరునకు
    దెలిపితివట, నోరసిలు వలదు సతము నన్ను, విడువకు మా వెన్నదొంగ,
    కైట భాంతకా!గోపాల!కంభు ధరుడ!
    దేవకీ నందన!మురారి! దేవ దేవ!
    శ్యామ సుందరా! గిరిధరా! శైల ధరుడ!
    ఆహిరిపువు !నిన్ను గొలుతుము యనవరతము .
    గురువు గారు నమస్కారము నిన్నటి పూరాణము ఒక్క సారి చూడండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ దత్తపది పూరణ బాగున్నది. అభినందనలు.
      'యువనారి'...? 'కొలుతుము+అనవరము' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "..గొలిచెద మనవరతము" అనండి.

      తొలగించండి
  12. అల్లనమూడులోకములహ్లాదతనిచ్చుచుసృష్టికార్యమున్
    యుల్లమునందునన్నిలిపి యోగ్యత బెంచెడు వేళ యందు పూ
    విల్లును శంబరారి శర వేగము నాటగ మానసమ్మునన్
    విల్లది,రాఘవుండయిన విక్రముడై విఱవంగజాలునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ,
      శంబరారి పూవిల్లుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కార్యమున్+ఉల్లము' అన్నపుడు యడాగమం రాదు. "కార్యము। న్నుల్లము.." అనండి.

      తొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    చెలికత్తె... జానకితో

    ఎల్లరు వచ్చిరి, మూటలు
    ముల్లెలు సర్దిరి తమతమ మొగములు జూపన్
    జెల్లక ! సఖి ! గమనింపగ
    విల్లది రామునకునైన విరువ దరమ్మే ?!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎల్ల జగమ్ములెవ్వని యహీనకృపారస దృష్టిచే విరా..
      జిల్లుచునుండె నాతడన శ్రీహరి ! రామునిగా జనించె, నా
      విల్లది రాఘవుండయిన విక్రముడై విరువంగ జాలు ! నే
      యెల్లలు లేని శక్తి., నతడిప్పుడు శిష్యుడు గాన మౌనికిన్
      దొల్లి నమస్కరించి , గొని , తూచియు ద్రుంచె వినీతుడై గనన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. రఘువంశ రాజన్యులు...

      ఎల్లరు జనరంజకులై
      చల్లగ నిర్మించిరిల యశమ్మను గృహమున్ !
      తెల్లనిదౌ శాంతికి నెల..
      విల్లది! రామునకునైన విరువ దరమ్మే ?!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  14. తల్లీసు తు లను బం ధ ము
    చెల్లు ను గద గట్టి దగు చు చే వ గ నుండన్
    మల్లె ల మొల్ల ల వి రి హరి
    వి ల్లది rరాముని కైనను వి రు వ ద రమేన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      హరివిల్లుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తల్లీసుతులు' అనడం సాధువు కాదు. "తల్లి సుతుల యనుబంధము" అనండి.

      తొలగించండి
  15. చల్లని చూపుల జానకి
    యుల్లము నందునను నిలచి యూష్మము పెంచన్
    తల్లడపరచు మరుని పూ
    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మరుని పూవిల్లుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. ఉల్లమున దలచె నిట్టుల
    చల్లగ నారావణుండు జనకునిసభలో
    తెల్లనిదొర పరమేశుని
    విల్లది రామునకునైన విఱువఁ దఱమ్మే?!!!

    రిప్లయితొలగించండి
  17. ఉల్లము నందున యూహల
    జల్లులు గురు వంగ ?మనసు చంచల మందున్
    కల్లోలపు జానకి హరి
    విల్లది రామునకు నైన విరువ దరమ్మే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      హరివిల్లుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..నందున నూహల... గురియంగ..." ఆనండి.

      తొలగించండి
  18. ఉల్లముఝల్లన జానకి
    భల్లున భవువిల్లువిరచె బహుసొంపుగనే
    తెల్లని మన్మథు పూవుల
    విల్లది రామునకునైన విరువదరమ్మే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      హరకార్ముకాన్ని విరిచిన రాముడు స్మరకార్ముకాన్ని విరువ గలడా అంటూ మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువర్యా!నమస్సులు!

      తొలగించండి
  19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య 2556
    *విల్లది రాఘవుం డయిన విక్రముడై విఱువంగఁ జాలునే ?*

    సందర్భం :: కోదండ రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టి (విఱిచి) సీతాదేవిని గెలుచుకొన్నాడు. విష్ణుధనుస్సును ఎక్కుపెట్టి పరశురాముని గెలిచినాడు. ఆకాశంలో ఏడు రంగులతో అందంగా ఉన్నట్లు తోచే ఇంద్రధనుస్సును మాత్రం రాఘవుడైనా సరే ఏమీ చేయలేడు. అంటే ఆ ఇంద్రధనుస్సును విఱువలేడు. ఎక్కుపెట్టలేడు, కనీసం పట్టుకొనలేడు. చూచి ఆనందించడం తప్ప మరేమీ చేయలేడు అని మిథిలా నగర పౌరుడు తన ప్రక్కన ఉన్న వానితో చెప్పే సందర్భం.

    అల్లన జానకిన్ గెలువ, హాయిగఁ ద్రుంచె మహేశు చాపమున్,
    మెల్లగ భార్గవున్ గెలువ, మించుచు నెత్తెను విష్ణు చాపమున్,
    వల్లభుడైన రాముడు, సువర్ణములన్ విలసిల్లు వజ్రిదౌ
    *విల్లది రాఘవుండయిన, విక్రముడై విఱువంగఁ జాలునే ?*
    కోట రాజశేఖర్ నెల్లూరు. (26.12.2017)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      ఇంద్రధనుస్సుతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులు శ్రీ కంది శంకరయ్య గారికి భక్తిపూర్వక ప్రణామాలు. కోట రాజశేఖర్.

      తొలగించండి
  20. చల్లని సాయం సమయము
    మెల్లగ తుంపరలజల్లు, మిన్నున జూడన్
    అల్లన మరి విరిసిన హరి
    విల్లది, రామునకునైన విరువదరమ్మే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      హరివిల్లుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మిన్నున గనగా। నల్లన..." అనండి. (లేదా "జూడ। న్నల్లన.." అని కూడ అనవచ్చు).

      తొలగించండి
  21. దొంగ రాముడికి క్షమాపణలతో సరదా పూరణ


    కొల్లలు కొల్లలు ధనమును
    పిల్లలు లేరని వగచుచు ప్రియమగు తనదౌ
    పిల్లికి నిచ్చిన లిఖితపు
    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే!

    https://www.google.co.in/amp/s/amp.theguardian.com/world/2011/dec/09/italian-cat-inherits-fortune

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీలునామాలు మళ్ళీమళ్ళీ వ్రాయవచ్చనుకుంటా!కాని చమత్కారం బాగున్నది!!

      తొలగించండి
    2. ఆ విల్లును వ్రాసిన వ్యక్తి 94 ఏళ్ళ ముసిలిది :)

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారు,
      వీలునామాతో మీ పూరణ చమత్కార భరితమై అలరించింది. అభినందనలు.

      తొలగించండి
  22. కల్లయుఁగాదు కార్ముకపు.
    జల్లులు కన్బొమలు సీత సౌందర్యంబు.
    న్నల్లన పెంపొందింపగ.
    విల్లది రామునకునైన విఱువ తరమ్మే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "కల్ల యెటుల కార్ముకపుం। జల్లులు..." అనండి.

      తొలగించండి
  23. ఉల్లము లోన పూవిలుతుఁ డూష్మముఁ బెంచగ సంధ్యవేళలో
    తెల్లని చీర తాను కడు తీరుగ గట్టి మహీజ చంద్రునిన్
    చల్లని వెన్నెలందునను చక్కగ చేరగ, కామదేవు పూ
    విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే?

    రిప్లయితొలగించండి
  24. ఎల్లరి మెచ్చుకోలునది హెచ్చుగ పొందిన శ్వేత సౌధమే
    తెల్లనిదౌ సిమెంటు నను తీరిచి దిద్దిన దాభవంతియే
    కొల్లలు సమ్మటల్ కలసి కొట్టిన కూలునె నాగరాజ రా
    "విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే"
    (దృఢమైన వైట్ సిమెంట్ తో కట్ట బడినది నాగరాజరావు గారిల్లు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్ధనరావుగారూ! మీ సిమెంటు ప్రచారపద్యం చాల సరదాగా ఉన్నది!

      తొలగించండి
    2. జనార్దన రావు గారూ,
      నాగరాజరావు గారి ఇంటి దృఢత్వాన్ని గురించిన మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  25. విల్లును విఱిచియె రాముం
    డల్లదె యాసీతమాతనా హ్వా నించె
    న్ను ల్ల ము లోనికి గ ద మఱి
    విల్లది రామునకునైన విఱువ దరమ్మే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      పద్యం బాగున్నది. మరి మీరు ప్రస్తావించినది ఏ విల్లును?

      తొలగించండి



  26. మెల్లగ మదిలో వలపుల

    ఝల్లది రేగగ విడువక సతతమ్మచ్చో

    అల్లదె గనుమా మదనుని

    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మదనుని విల్లుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. "జల్లది కురియగ..." ఆనండి.

      తొలగించండి
  27. తల్లడపడంగ నేలనొ
    చల్లని రఘురామ సూర్యజ సుమైత్రి విరా
    జిల్లదె నిత్యంబై ప్రభ
    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే


    తల్లిని జానకీ సతిని దానవ నాథుఁడు సంగ్రహించఁ దా
    నుల్లము నందుఁ దల్లడిలి యూఱట సెందఁడు రామచంద్రుఁడే
    చెల్లరె శూలి చాపమ! విచిత్రముగన్ ఘనుఁ డంగ హీను పూ
    విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్యా! మీ కందపద్యపూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా యున్నది!నమస్సులు!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.

      తొలగించండి
  28. అల్లదిగో తెచ్చిరి యని
    యెల్లరు సభలోని వారు విస్మయమెచ్చ
    న్నుల్లము నందను కొనిరిటు
    "విల్లది రామునకునైన విరువ దరమ్మే?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
      "విస్మయ మంద। న్నుల్లము..." అనండి.

      తొలగించండి
    2. ఓహో... "విస్మయము + ఎచ్చన్" అన్నారా? బాగుంది.

      తొలగించండి
  29. పుల్లసరోజనేత్రి భువిపుత్రిని రాముడు పూలతోటలో
    నుల్లమురంజిలంగ గన నొప్పుగ నాపియు రాముజూడగన్
    మెల్లగనేగుదెంచె నెలమిన్ మదనుండటు లిక్షుకాండపున్
    విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే"

    రిప్లయితొలగించండి
  30. అల్లన నేగుచుండ మిథిలా పురి నంగన లందు రయ్యయో
    మల్లియ వీడు లేత సుకుమారుడు రాజున కెట్టు లొప్పునో
    యుల్ల మదిట్టి కార్యమున నోపునె పల్లవ హస్త మీశుదౌ
    విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మిథిలాంగనల మాటలుగా మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  31. అల్ల పరశురాముండనె
    మెల్లగ శివు విల్లు విరచి మెరయుట తగునే
    తెల్లముగ నాదు దృఢమౌ

    విల్లది రామునకునైన విరువ దరమ్మే?

    రిప్లయితొలగించండి
  32. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,

    మొన్నటి పూరణ


    శ్రీరామాయణ వీధినాటకములో శ్రీరామ - లంకేశ్వరుల్

    హోరాహోరి సుదీర్ఘ రాగము లనన్ ఒన్స్ మోర్లు హోరెత్తె నౌ

    రౌరా ! యొండొరులున్ రణాంకమున పద్యాస్త్రాలు సంధించుటన్

    ప్రారంభించగ , నొక్క ప్రేక్షకుడు సంభాషించె నీరీతిగా ‌ :--

    పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నెలా యనిన్ ?

    పౌరుష్యం బగు వాక్కులే ధరణి తీక్ష్ణంబైన శస్త్రంబు లౌ !

    { అనన్ = స్టేజిపై పాడగా ; రణాంకమున = యుధ్ధ సీనులో ;

    పౌరష్యంబగు = పరుష మగు ; }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ (మొన్నటి) పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  33. స్వయం వరంలో,సీతా దేవితో ఓ చెలికత్తె " శివధనుస్సు ఎత్తలేక రాజులందరు విఫలమవుతున్నారు కదా, మరి రామచంద్రుడు విల్లునెత్తగలడా" అని సందేహించి నప్పుడు సీతామాత సమాధానం చెప్పిన సందర్భం...

    *"విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే"*
    మల్లియ! యంచు నొక్క చెలి,మాతను సీతను పృచ్ఛసేయగా
    మెల్లగ సిగ్గుతో పలికె మేనది పొంగుచు పల్లవించ తా..
    "వల్లభు డాతడే కనుము వంచును ద్రుంచును పెళ్ళుపెళ్లనన్"

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      సమస్యను మొదటి పాదంగా చేసిన మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీహర్షగారూ!చాలబాగుందండీ పద్యం ! చివరిపాదం వంచును ద్రుంచును ఫెళ్ళు ఫెళ్ళునన్ శబ్దపరంగా మనోహరం గా ఉండడమేగాక
      సీతాదేవికి రాముని శక్తినందుగల ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తున్నది!అభినందనలు!

      తొలగించండి
    3. అమ్మా మీ ప్రసంశకు ధన్యుడను,నమస్సులు

      తొలగించండి
  34. ఎల్లరి సంశయమ్ములు నశించఁగఁ జొచ్చుచు నగ్నగుండమున్
    జల్లగఁ దేలె సీత! యొక చాకలి మాటకు నిండుచూళికిన్
    మళ్లి యరణ్య వాసమన మ్రాన్పడ నా భ్రుకుటిన్ దృశించెడున్
    విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..నగ్నికుండము'... టైపాటు!(అగ్నిగుండము - దుష్టసమాసం). 'నిండుచూళి' సాధువు కాదు. "నిండు గర్భిణిన్" అనండి. 'మళ్లి' అన్నది వ్యావహారికం.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన :

      ఉత్పలమాల
      ఎల్లరి సంశయమ్ములు నశించఁగఁ జొచ్చుచు నగ్నికుండమున్
      జల్లగఁ దేలె సీత! యొక చాకలి మాటకు నిండుగర్భిణిన్
      భల్లున జేర్చనంప వనవాసమునన్ భ్రుకుటిన్ దృశించెడున్
      విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే?

      తొలగించండి
  35. అల్లన రాజులు దలచిరి
    విల్లది రామునకునైన విరువ దరమ్మే
    చల్లగ దీవించె నుమా
    వల్లభుడతడిని భువిజకు వరునిగ జేయన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యస్వీయార్ గారూ, (మీ పూర్తి పేరు తెలియజేయండి)
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  36. గురువు గారికి నమస్సులు.
    పల్లవ పాణియు కోర్కెలు
    చల్లగ నుండును సహజమె జగమున సుమతీ.
    ఎల్లరి నాశల ఇంద్రుని
    విల్లది రామునకు నైన విరువ దరమ్మే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొద్ది సవరణ....
      పల్లవ పాణుల కోర్కెలు
      చల్లగ నుండును సహజమె జగమున సుమతీ.
      యెల్లరి యాశల నింద్రుని
      విల్లది రామునకు నైన విరువ దరమ్మే.

      తొలగించండి
  37. కొల్లలు రాజులు రా - నా
    యుల్లము రంజిల్ల విల్లు నొక్కరె యైనన్
    మెల్లగ నెత్తిరె చెలి ? యీ
    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే

    నిన్నటి దత్తపది కి నా పూరణ

    సమర మేరీ తినైనను సాగనీక
    సభను చర్చించి భాగము జ్ఞాతుల కిడ
    శాంతి భాసిలు వసుధను చాలు ననగ
    బట్ట పాడి యే సుంతైన వాని నచట ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      (నిన్నటి దత్తపదిలో 'భారతార్థం' అని కాకుండా 'శ్రీకృష్ణ స్తుతి' చేయమన్నాను కదా?

      తొలగించండి
  38. దెల్లని ఖమణి తొలిదెశన,
    నల్లని జలదము బడమట, నక్షత్ర పధమున్
    యుల్లమ్ము పొంగెడి రతనపు
    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే


    ఆర్యా చూడుము “ఆ ఇంద్ర ధనస్సు” యనుచు పర్ణ శాలాలో భర్త తో సీత చెప్పు సందర్భము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తెల్లని...తొలిదెసను' అనండి. రెండవ పాదంలో గణదోషం. "నక్షత్రగతిన్" అందామా? (గతి = మార్గము).

      తొలగించండి
  39. మిత్రులందఱకు నమస్సులు!

    [విశ్వామిత్రుని వెంట స్వయంవర సభామంటపమం దడుగిడిన శ్రీరామునిఁ గాంచిన సభాసదు లెల్లఱుఁ దమలోఁ దామనుకున్న సందర్భము]

    ’అల్లదె రామచంద్రుఁ డిఁక నా ముని వెంటను వచ్చె! నాతఁడో
    నల్లనుఁ ద్రావు తాటక నణంచిన బల్లిదుఁ! డిందుమౌళిదౌ
    వి ల్లది! రాఘవుండ యినవిక్రముఁడై విఱువంగఁ జాలు! నే
    నుల్ల మెలర్పఁ గందు నిదె యుర్విజఁ బెండిలియాడ నాతనిన్’

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      విలక్షణమైన విరుపుతో మధురమైన పూరణ చెప్పారు. ఔత్సాహికులకు మార్గదర్శకం మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  40. పంచవటిలో ఓ చల్లని సాయంకాలం చిరుజల్లులు కురియుచుండగా, సీతారాములు ప్రేమాతిశయమున ముచ్చటలాడుకొను సమయాన....

    అల్లన హరివిల్లును గని
    భళ్ళున నవ్వాపుకొనుచు పరిహాసముగా
    మెల్లన సీతనె స్వామీ!
    "విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ, (మీ అసలు పేరు తెలియజేయండి)
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారూ
      భళ్ళున నవ్వాపుకొనుచు(నవ్వి+ఆపుకొనుచు) అనొచ్చా అని అనుమానం వచ్చి మళ్ళీ ఇలా రాశా

      అల్లన హరివిల్లు విరియ
      వల్లభు గని చిరునగవున పరిహాసముగా
      మెల్లన సీతనె స్వామీ!
      "విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే"

      తొలగించండి
  41. చల్లని గాలులతో చిరు
    జల్లులు కురియంగ నింద్ర చాపము వెలసె
    న్నల్లదిగో నింగిని,హరి
    విల్లది రామునకు నైన విరువ దరమ్మే?

    రిప్లయితొలగించండి

  42. వి ల్లది రాఘవుం డయిన
    విక్రముడై విఱువంగజాలునే!
    **************************************
    సందర్భము: శివాజ్ఞ లేనిదే
    చీమైనను కుట్టదు అని లోకోక్తి.
    అటువంటి శివ సంకల్పము లేకపోయినచో రాముడు శివధనుర్భంగము చేయగలుగునా!

    ఎల్ల శరీర ధారులకు
    నిం పగు నాత్మ శివుం డటన్నచోఁ
    జెల్లు, "శివాజ్ఞ లేనపుడు
    చీమయినన్ మరి కుట్టజాలునే
    యెల్లపు" డంచు లోన స్మరి
    యించి నుతింపని వేళ శూలిదౌ
    వి ల్లది రాఘవుం డయిన
    విక్రముడై విఱువంగ జాలునే!

    సమస్య:

    విల్లది రామునకునైన విఱువఁ దరమ్మే!

    సందర్భము: హరివిల్లు(ఇంద్ర ధనుస్సు)ను రాముడైనను విఱువజాలడు కదా!

    మెల్లని చిఱు జల్లులతో
    చల్లని నీరెండ యొక్కసారి కలియగా...
    నుల్లము రంజిల్లెడి హరి
    వి, ల్లది రామునకునైన విఱువఁ దరమ్మే!

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

    రిప్లయితొలగించండి
  43. చల్లనిగాలివీచినదొజాబిలివెన్నెలవేడిజేసెనో
    మల్లెలదండబట్టుకొనమైకముగ్రమ్మెనొసుందరాంగికిన్
    నల్లనివానిపద్మనయనంబులచెంగటవాలినట్టిపూ
    విల్లది,రాఘవుండయినవిక్రముడైవిఱువంగజాలునే!

    రిప్లయితొలగించండి
  44. చల్లని చినుకుల గని హరి
    విల్లును గని సీత నవ్వి విభుతో ననియెన్
    "విల్లుల విరువ ఘనమె ! హరి
    విల్లది రామునకునైన విరువ దరమ్మే ! "

    రిప్లయితొలగించండి
  45. కం:-
    తెల్లని మదితలపులనిడి
    చల్లని చూపుల వెలుగును జల్లగముదమున్
    నెల్లది జగమేలు విభుని
    విల్లది! రామునకునైన విఱువఁ దరమ్మే ? !!

    @ మీ పాండురంగడు *
    ౨౭/౧౨/౨౦౧౭

    రిప్లయితొలగించండి
  46. నల్లని మబ్బులీ నభము నంతయు కన్నుల విందుజేయగా
    చల్లని గాలులీ క్షణము జల్లగ వానలు సంతసంబుగా
    మెల్లగ తూరుపున్ విరియు మేలగు వన్నెల నింద్రుఁదైన దా
    విల్లది రాఘవుం డయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే?

    రిప్లయితొలగించండి
  47. విల్లది త్రుంచెగా నతడు వీరుడు రుద్రుడు భైరవుండుదౌ
    కొల్లలు కొల్లలౌనసుర కోటుల హృత్తులు చీల్చినాడుగా
    చెల్లియొ చెల్లకో పసిడి జింకను తెమ్మను జానకమ్మదౌ
    విల్లది రాఘవుండయిన విక్రముఁడై విఱువంగఁ జాలునే? :)

    విల్లు = will (సంకల్పం)

    రిప్లయితొలగించండి