2, డిసెంబర్ 2017, శనివారం

ఘటికా బంధ చంపక మాల వృత్తము

శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారు వారి కుడ్యముపై ప్రచురించిన ఘటికాయంత్రబంధము స్ఫూర్తితో కూర్చబడినది. వారికి ధన్యవాద సహస్ర  నమస్కారములు. కుండలీకరణములలోని 12 (క) అక్షరములకు గడియారము మధ్యలోనున్న (క) వర్తిస్తుంది. మొత్తము 84 వర్ణములు. ఈ 12 (క)  కారములను తీసివేస్తే, మిగిలిన 72 లో కొన్ని ద్వితీయ  వలయములో   నుంచగా మిగిలినవి చుట్టు నున్న ప్రధమ     వలయములో నమర్చబడినవి

(క){రి}వదనుండు (క)న్ను వలె గాచు, (క)పర్ది శమించు(క)ష్టముల్,
పరుల, (క)రాళి , కన్యక,  (క)పాలి,  యొసంగు (క)టాక్ష వీక్షణల్,
(క)రుణ ఘటిల్ల (క)ర్త శుభ కాంత (క)బ్బము విదుర్చు (క)ల్పముల్
సిరుల (క)ళిoగ యిచ్చు సి{రి} శ్రేష్టు సమంబుగ యుర్వి నెపుడున్.

- పూసపాటి కృష్ణ సూర్య కుమార్

6 కామెంట్‌లు:


  1. పూసపాటి వారు,

    మీ ఘటికా యంత్ర బంధ చంపక మాల వృత్తము బాగున్నది !


    పరిపరి కైపు పద్యముల పట్టి పరిశ్రమ జేసి పట్టుగన్
    గరిమ, పదమ్ము లన్ కలుప గాను జిలేబి, పదౌచితీయముల్
    పరుగులు వారు, పాటిగొని పట్టి పవాకము గాను పద్ధతై
    దొరలు, పరాంగవమ్ము సరి దోచును చంపకమాలయై భళా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ధన్యవాదాలండి పూసపాటివారు

      జిలేబి వారి పై చంపకమాల ఘటికా యంత్ర బంధ యత్నము సరియేనా ? తెలుపగలరు

      జిలేబి

      తొలగించండి
  2. డా.పిట్టా
    వీరావేశమె తండ్రియు
    తీరా తల్లియును వెదకి దెచ్చిరె కన్యన్?
    మీరెను పెద్దల యాజ్ఞను
    శ్రీరాముండపహరించె సీతా దేవిన్!

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టా
    పూత యశస్వి యూర్మిలకు పొందును బాపియు భార్య సౌఖ్యమున్
    చేతల తానె బొందె, నట శీలమె? గర్భము లోన్లవ కుశుల్
    ఆ తలమందె యేర్పడిరి అప్పటి లక్ష్మణు కన్న యన్నయై1
    సీతను దొంగిలించెగద శ్రీరఘు రాముడు దండకాటవిన్!(1.Big brotherly attitude తో)

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    పై 2 పూరణలు సమస్యకు చేర్చి చదువ ప్రార్థితుడను.

    రిప్లయితొలగించండి