25, డిసెంబర్ 2017, సోమవారం

దత్తపది - 128 (మేరీ-యేసు-సిలువ-చర్చి)

మేరీ - యేసు - సిలువ - చర్చి
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
శ్రీకృష్ణుని స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

66 కామెంట్‌లు:

  1. (యశోదమ్మ గోపకాంతలతో}
    పాడియే సుపుత్రుని గూర్చి పలుకనిట్లు?
    తప్పు;మీయుల్ల మేరీతి నొప్పుకొనియె?
    మంచి భాసిలు వట్టి యమాయకుండు;
    చాలులెండమ్మ చర్చింప చానలార!

    రిప్లయితొలగించండి
  2. బాపూజీగారికి ధన్యవాదాలతో!

    చేరి యేసుందరు మనంబు చింతజేయు?
    కోరి గోకులమ్మేరీతి గొల్చువాని?
    మదనుతీరుగ భాసిలు వదనమేది?
    చారు చందన చర్చిత జలదమేది?
    వెదుక వ్రేపల్లెనలరారు వేణుధరుడు!

    అవే అన్యార్ధపదాలు స్ఫురించినా యే ఛందంలో వ్రాద్దామా అని ఆలోచిస్తుండగా మీ పద్యం చూసి అనుసరించడమైనది!








    రిప్లయితొలగించండి
  3. కృష్ణుని రాయబారమునకు పంపుతూ ధర్మరాజు పలికిన మాటలు:-

    సమరమేరీతి సమకూర్చు శాంతి ప్రజకు
    సంధియే సుకార్యము చూడ చక్రి| నిజము
    గాసిలు వసుధాధీశులు కయ్యమైన
    దేవ| చందన చర్చిత దేహ| కృష్ణ||

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. గోప కాంతలు నినుకోరి కొసరి కొసరి
      ఉల్ల మలరించ భాసిలు వల్లె యనగ
      సుంద రంబని మురిసియే సుదతు లంత
      చర్చి చేయంగ నీలీల చక్క నయ్య

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. యేసుమముల పూజించిన
      వాసిగ భాసిలు వటంచు భామల మదిలో
      దోసిట చందన చర్చిత
      మీసాటి కొలువంగ నింక మే మేరీతిన్

      తొలగించండి


  6. చందన చర్చిత కార్మొగి
    లందపు మేనిగలవాడు లక్ష్మీపతియే !
    సుందర వదనము భాసిలు!
    వందన మే రీతి నిడుదు వనమాలి! నమో !


    శుభోదయం


    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. భాసిలు వసతిగ శ్రీనిల
    యే! సుమమొప్పారు ముఖమయే! యవనారీ,
    శ్రీసుమ చందన చర్చిత
    మే సంహతి! లలితకుసుమ మే రీతి, నమో !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. కదన మేరీతి శుభకర కార్యమగును
    సంధియే సుమతులుమెచ్చు , సవ్యముగను
    నీవు చర్చించి సంధిని నిలుపు మంటి
    శాంతి వాసిలు వసుధయె స్వర్గమవదె.

    (ధర్మజుడు కృష్ణునితో పలికిన మాటలు)

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశం :: దత్తపది (సంఖ్య-128)
    ఇచ్చిన పదాలు :: *మేరీ* *యేసు* *సిలువ* *చర్చి*
    ఏ ఛందస్సులోనైనా పద్యం వ్రాయవచ్చు.
    విషయం :: శ్రీ కృష్ణ స్తుతి

    పూరణ :: చందస్సు :: మత్తేభ విక్రీడితము

    సందర్భము :: హే కృష్ణా ! *’’ఆపద మాయయే , ఇక మీకు అంతా సుఖమే’’* అంటూ భక్తులైన దేవకీ వసుదేవులను ఎలా కాపాడినావో , అలాగే కరుణతో నన్ను కూడా కాపాడవయ్యా. సుగుణాలవాలా! నీ లీలలను గురించి నా మనస్సులో నేనే చర్చించుకొంటూ ఉంటాను. నీ సాయుజ్యమునే కోరుకొంటున్నాను. దయతో నన్ను రక్షించవయ్యా అని భక్తుడు ప్రార్థించే సందర్భం.

    ముద *మేరీ* తిని గూర్చినావొ వసుదేవున్ దేవకిన్ బ్రోచి ‘’యా
    పద మా *యే, సు* ఖ మింక’’ నంచు, కరుణన్ భద్రమ్ము నా కి మ్మటుల్,
    సదయా! సద్గుణ రాశి భా *సిలు వ* రా! సాయుజ్యమున్ గోరి నా
    యెద *చర్చిం* చెద నీదు లీలల నికన్ హే కృష్ణ ! రక్షింపుమా.
    కోట రాజశేఖర్ నెల్లూరు. (25.12.2017)

    రిప్లయితొలగించండి
  10. దేవ!నీరూప మేరీతి తెలియ గలుగు
    దే సుఖములను కోరబోనిపుడు నేను
    వరద!కొనియాడి గాసిలు వరము దప్ప!
    నీదు ఘనతది చర్చింప లేదు నేర్పు.

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    సువిశాలంబగు కృష్ణ తత్త్వమదియే సుజ్ఞానమౌ ! దాని గో...
    రి వచోవైభవమొప్ప గోపగణమే రీతిన్ ప్రశంసించెనో
    యవలోకింపగ నద్ది భాసిలు వరాత్మానందమై ! గాన కే....
    శవగాథల్ పఠియించి , వాడె గతి యంచర్చించుడీ ముక్తికై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీకృష్ణగారూ!నమస్సులు! కృష్ణతత్వాన్ని ప్రశంసిస్తూ మీపూరణ చాలచక్కగానున్నది.
      అయితే కేశవుడిని విరవడం వలన చిన్న అపశబ్దమేర్పడినది! మాధవ అంటే బాగుంటుందేమో యోచించ ప్రార్ధన!

      తొలగించండి
    2. ఇవియే సుమములు కవివర!
      రవి భాసిలు వరకు నీదు రాజ్యమ్మిదియే!
      చవిగొన మేరీతి యనుచు
      భువిలో చర్చించ గలరె మురళీ కృష్ణా?

      తొలగించండి
    3. శ్రీమతి సీతాదేవి గారికి నమస్సులు.... అది అపశబ్దమువలె భాసించు సుశబ్దమే.. అంత ఇబ్బంది కాదు ఛందస్సులో...యతిస్థానసంబద్ధం కూడాను.. మా.. ధవ అంటే యతికి అతకదు..
      అయినను ఆ విరుపు మీకు రుచింపలేదు.. పోనీ మరొక పాఠాంతరం...అవధరించండి...


      సువిశాలంబగు కృష్ణ తత్త్వమదియే సుజ్ఞానమౌ ! దాని గో...
      రి వచోవైభవమొప్ప గోపగణమే రీతిన్ ప్రశంసించెనో
      యవలోకింపగ నద్ది భాసిలు వరాత్మానందమై ! గాన సం...
      స్తవనీయున్ భజియించి , వాడె గతి యంచర్చించుడీ ముక్తికై !!


      ధన్యవాదాలండీ......... మురళీకృష్ణ


      తొలగించండి
    4. మురళీకష్ణగారూ!ఇప్పుడు ప్రశస్తముగ నున్నదండీ!నేను ప్రాసచూసితిని గాని యతిని గుర్తించలేదు!ధన్యవాదములు,నమస్సులు!

      తొలగించండి
  12. దేవ!నీరూప మేరీతి తెలియ గలుగు
    దే సుఖములను కోరబోనిపుడు నేను
    వరద!కొనియాడి గాసిలు వరము దప్ప!
    నీదు ఘనతది చర్చింప లేదు నేర్పు. శౌరి! చందన చర్చిత చారు వదన! (సీతాదేవి గారికి ధన్యవాదాలతో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందుకంటే "చర్చింప లేదు"లో చర్చి లేదు."చర్చిం" ఉన్నది. కానీ "చందన చర్చిత"లో చర్చి ఉన్నది.విద్వత్కవి పండిత సభలో "చర్చింప"ను విజ్ఞులొప్పరు."ర్చి" అక్షరము పూర్ణానుస్వారంతో కూడి ఉన్నది.సున్నను విడదీయకూడదు.మీ ప్రయోగాన్ని వాడుకున్నందుకే ధన్యవాదాలు తెలిపాను.

      తొలగించండి


  13. శ్రీలక్ష్మీనిలయే! సుమాంజలి! నమో! శ్రీవల్లభా! వేంకటే
    శా!లంకారి!అనంత!భాసిలు వనేశా!శ్యామ! కంసారి! గో
    పాలా!చందనచర్చితాంగ కపిలా! పర్జన్య! నక్షత్ర నే
    మీ!లావణ్యము నీది గాద నమనమ్మేరీతి నిత్తున్నకో !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. తే.గీ.
    సాధ్యమేరీతి పొగడ న సాధువులను
    కోరియే సుఖములు శిష్య కోటి జేర్చు
    గాసిలు వరము లేమిచ్చు కపట వేషి
    అదియు చర్చింప దగునయ్య ననఘు లార

    రిప్లయితొలగించండి
  15. తే.గీ.
    సాధ్యమేరీతి పొగడ న సాధువులను
    కోరియే సుఖములు శిష్య కోటి జేర్చు
    గాసిలు వరము లేమిచ్చు కపట వేషి
    అదియు చర్చింప దగునయ్య ననఘు లార

    రిప్లయితొలగించండి
  16. భూరి చర్చించ దెలిసెనీ శౌరియే సు
    ఖంబు లిడునని;కాన చక్రధరు నన్ను
    గావుమేరీతి గైనను గారవమున
    భాసిలు వదన! హరి నిన్ను భక్తి గొలుతు

    రిప్లయితొలగించండి
  17. ఇవియే సుమములయ్య యువనారి! బ్రోచుము సతతము మమ్ముల శరణు తోడ,
    సూరీ!వసుధన మిమ్మేరీతి గొలచినన్ గాచు చుందువుగదా కరుణ నిడుచు,
    చర్చించ వలదని, యర్చించవలె గడు భక్తితో ననుచు నీ పామరునకు
    దెలిపితివట, నోరసిలు వలదు సతము నన్ను, విడువకు మా వెన్నదొంగ,
    కైట భాంతకా!గోపాల!కంభు ధరుడ!
    దేవకీ నందన!మురారి! దేవ దేవ!
    శ్యామ సుందరా! గిరిధరా! శైల ధరుడ!
    ఆహిరిపువు !నిన్ను గొలుతుము యనవరతము .

    రిప్లయితొలగించండి
  18. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    ** గురుభ్యో నమః *

    ఇంటర్ నెట్ లేనందున మొన్నటి పూరణ. పంపిస్తున్నాను .
    క్షమించండి


    ప్రతివాడు బీటెక్కు పాసయి తా నొక

    యింజనీర్ అగుచు గడించ నెంచు

    ప్రతివాడు మెడిసిను పాసయి వైద్యు డై

    డబ్బు కుప్ప పయి డొర్లగ దలంచు

    ప్రతివాడు ఠీవిగా ఫారిను పోయి వి

    లాసవంతముగ దా బ్రతుక దలచు

    ప్రతివాడు ఆంగ్లము పఠియించు చుద్యోగ

    జీవిత పథము కాంక్షించు చుండు


    " నేడు ఇంగిలీషు నేర్వని వారలు ,

    తెలుగు చదువు వారు దేహి యనరె "

    యనెడు భావ మున్న జనులను మార్చుము

    జనని ! నీవె , వాణి ! శారదాంబ !

    ( ఇంగ్లీషు పదాలకు తెనుగు పదాలకు మద్య సంధి చేయ లేదు )


    **----------------------------------------------------------------------------------**


    " తెలుగు బఠింప జీవన భృతిన్ గొనుచున్ బ్రతుకంగ సాధ్యమే ?

    తెలుగు బఠించు వార లిక దేహి యటంచును చేయి చాపరే ?

    తెలుగు బఠింప నే డుపగతిన్ మన మొంది సుఖంబుగా మనన్

    గలమె " యటంచు యోచన మొనర్చుట నెంతయు సాజ మౌ కదా !


    తెలుగు మహత్తరంబయిన తియ్యని భాష యటంచు నూరకన్

    బలికిన లాభమే ? తెనుగు పాఠ్యము లందున దండిగా

    సిలబసు పెంచి చక్కనగు శిక్షణ నీ గల యట్టి మంచి యొ

    జ్జల నియమించుచున్ బఠనశాలల నాంధ్రమయంబు జేయగా

    వలె | నిక తెన్గు భాష జదువన్ + అనుయోక్తగ నుండు భాగ్యమే

    కలుగు ! తరించు జన్మ ! బ్రతుకంగల మం చొక ధైర్యశక్తి లో

    గలిగిన తెల్గు తప్పక వికాసము నొందు | ని కా దిన మెప్డు వచ్చునో !

    ( అనుయోక్త. = అధ్యాపకుడు )

    రిప్లయితొలగించండి
  19. తర*మే రీ*జనుఁజూడ చక్రి దయరాదా వేదనల్ బాపగన్
    పరమాత్ముండవుఁగాదె* యే సు*మతితో ప్రార్ధించినానో నినున్
    వరమై చేరితి నిన్ను గా*సిలు వ*చో వాక్యంబులాలింపుమా
    శరణంబంటిని రుక్మిణీపతి ననున్* చర్చిం*పకన్ఁబ్రోవుమా

    రిప్లయితొలగించండి
  20. చందన చర్చిత నీలేం
    దిందిర విధి భాసిలు వర దేహుఁడు హరియే
    నంద సుతుఁడు మమ్మే రీ
    తిం దడయక యే సుగతులఁ దేర్చఁ గలండో!

    రిప్లయితొలగించండి
  21. కాలమేరీతిసాగునోగాలమెరుక
    పాడియేసుయోధన!గృష్ఞబంధనమ్ము
    భాసిలువదనుడాతడువరదుడుగద
    యింకచర్చింపకేదియునిమ్ముపాలు

    రిప్లయితొలగించండి
  22. గురువు గారికి నమస్సులు.
    నీ రూప మేరీ తినకన
    నారూఢిగ యే సుమతుల నారాధన తో
    నౌరా హరి భాసిలు వ
    రా రాధాడ్యా కొలుతును రాజా యదుశ్రీ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరి పాదము రాజా నుండి మార్చడమైనది. ఈ క్రింది విధంగా చదువ మనవి.
      రాచర్చింపన్.

      తొలగించండి
  23. సంధి యే సుఖము ల నిచ్చు స ర్వులకు ను
    యుధ్ధ మే రిపు త తి కెల్లనొసగు బాధ
    లి ట్లు గాసిలు వల దంచు న చ్యు తుండు
    కొ లు వు నందు న చర్చించి పలుకనట్టి
    కృష్ణునుతియిoచె భీష్ముడు కేలు మోద్చి

    రిప్లయితొలగించండి
  24. సరియే సుందరరూప కృష్ణ కనగా స్వర్గాదిపుండైన నీ
    చరితమ్మున్ వినుతింపగా బ్రతుకునున్ సాగింతుమేరీతి నీ
    చరణమ్ముల్ విడనాడి భాసిలువచస్సున్నీదు సౌజన్యమే
    తరి చర్చించినగాని మోక్ష పధమున్ దర్శింపగా జాలునే

    రిప్లయితొలగించండి
  25. దత్తపది
    *******
    మేరీ, యేసు,చర్చి..సిలువ.
    ††††††††††††††

    సత్యమేరీతిసైచుదుష్కృత్యములను
    ధర్మనిరతియేసుజనహితమ్ము,పార్థ
    వలదుచర్చించశత్రుసంహారమిపుడు
    జేయభాసిలువరలునుశ్రేయమెపుడు...

    రిప్లయితొలగించండి
  26. విను (మేరీ)తిగ గొలిచిన
    గని నిజ మది(యే సు)చారు కావ్యంబని యా
    మనమున భా(సిలు వ)రమిడ
    జను చందన (చర్చి)తాంగ! శౌరీ!జేజే.

    రిప్లయితొలగించండి
  27. కనగా భాసిలు వజ్ర దేహుడు మహా కారుణ్య కాశమ్ముతో
    చొనిపెన్ గాభువి శాంతినిండ నదియే సుజ్ఞానమౌ గీతగా
    వినుమేరీతిగ నైన మాధవుమదిన్ వేడంగ రక్షించుగా
    జనులన్ బ్రోవగ వాడె దిక్కుగదరా చర్చింప నేముండురా!

    రిప్లయితొలగించండి
  28. డాఎన్.వి.ఎన్.చారి
    మెరియన్ కృష్ణుడు గోపకన్యక మన "మ్మేరీ"తి నుప్పొంగెనో
    హరి"యే సు"స్తవనీయుడౌచు శతృ సంహారంబుగావింపగా
    నరుడై భా"సిలు వ"ర్ధిష్ణుండునయె నా నందాంగనా పుత్రుగన్
    మరియా చందన "చర్చి"తున్ మదిని సమ్మానింతు సద్భక్తితో

    రిప్లయితొలగించండి
  29. సౌఖ్య మేరీతిగూర్తువో?సాధురక్ష|
    యే సుభగ పెనిమిటనుచు యెంతురెల్ల
    భాసిలు వసుదేవ తనయబాలకృష్ణ|
    చరిత చర్చించ తరమౌన?దురితదూర| {సుభగ=తులసి}

    రిప్లయితొలగించండి
  30. మేమే రీతిని నిన్ను పొందెదము స్వామీ! గోపికావల్లభా!
    యేమీ కామొకొ? నీదు వార, మలుకా? యేసుప్రియో దాచెనా?
    యామమ్ముల్ గతియించు, గాసిలు వరాస్యా! డెందముల్ కోరి నీ
    ప్రేమల్, రమ్మిక చాలు త్వత్స్పృశపు చర్చిక్యమ్ము మా మేలకున్.

    రిప్లయితొలగించండి
  31. డాఎన్.వి.ఎన్.చారి
    మెరియన్ కృష్ణుడు గోపకన్యక మన "మ్మేరీ"తి నుప్పొంగెనో
    హరి"యే సు"స్తవనీయుడౌచు శతృ సంహారంబుగావింపగా
    నరుడై భా"సిలు వా"రి జాక్షునతనిన్ నందాంగనా పుత్రుగన్
    మరియా చందన "చర్చి"తున్ మదిని సమ్మానింతు సద్భక్తితో

    రిప్లయితొలగించండి
  32. డాఎన్.వి.ఎన్.చారి
    మెరియన్ కృష్ణుడు గోపకన్యక మన "మ్మేరీ"తి నుప్పొంగెనో
    హరి"యే సు"స్తవనీయుడౌచు శతృ సంహారంబుగావింపగా
    నరుడై భా"సిలు వా"రి జాక్షునతనిన్ నందాంగనా పుత్రుగన్
    మరియా చందన "చర్చి"తున్ మదిని సమ్మానింతు సద్భక్తితో

    రిప్లయితొలగించండి


  33. కయ్యమేరీతిగాశుభకార్యమవదు

    మనదియేసుపథమ్మని మాధవుండు

    యెరుగు  చర్చింపనవసర మేమి లేదు

    గాసిలువలసినపనిలేదు కాచు నతడు

    రిప్లయితొలగించండి
  34. కవిమిత్రులకు నమస్కృతులు.
    జ్వరం తగ్గింది. దాని ప్రభావం వల్ల నీరసంగా ఉంది. అందులోను తప్పని ఒక ప్రయాణం వల్ల అలసిపోయి ఉన్నాయి. రేపటినుండి అందరి పద్యాలను తప్పక సమీక్షిస్తాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  35. తేటగీతి
    బంధమే రీతిఁ దప్పించ పార్థుని గతి
    గీతయే సుగమనమున గెలువఁ జెప్పి
    ధరను మేమెల్ల భాసిలు వరము నిడఁగ
    చందనంపు చర్చితము గోవింద! మాకు

    రిప్లయితొలగించండి
  36. asnreddy
    సతతమేరీతి గా పూజ సలిపిన మది
    నుల్లసిలు వరద! మురారి! యురగశయన!
    పాడియే సురవందిత! చూడ రావు
    మదిని చర్చించి చూపుము మాకు దారి

    రిప్లయితొలగించండి

  37. పొగడజాల మే రీతి నిన్ పుణ్య పురుష!
    ......
    మాయయే సురలన్ గ్రమ్మ మానవులము
    ........
    మేము భాసిలు వదనులమే! మహాత్మ!
    .........
    సకల లోకేశ! చందన చర్చిత! హరి!
    ......
    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

    రిప్లయితొలగించండి
  38. సందర్భము: పాండవులు కృష్ణునితో
    మొరపెట్టుకొనుట

    తరమే రీఢ భరింప మాకుఁ గలిగెన్
    తండ్రీ! కనన్ లేవొ! యే
    సుర విద్వేషులొ వీరు వెంటబడిరే!
    చోద్యంబునై శాంతమై
    స్థిరమై భాసిలు వంశ మిద్ది యెపుడో!
    శ్రీ గంధ సచ్చర్చితా!
    వర గోపాలక లోక పాలక! కృపా
    వారాశి రాకా శశీ!

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
    రీఢ=అవమానము

    రిప్లయితొలగించండి
  39. సందర్భం: పాండవులు కృష్ణునితో
    మొర పెట్టుకొనుట

    తరమే రీఢ భరింప! యే

    సుర విద్వేషులొ కౌరవుల్--

    స్థిరమై భాసిలు వంశ మె

    ప్డు రహిన్? చందన చర్చితా!

    రీఢ = అవమానము
    కొత్త వృత్తము. స్వీయ కల్పితము.
    సభర గణాలు..

    రిప్లయితొలగించండి


  40. ఏసు భాషితమే రీతి నీడెదవు న
    చటను చర్చించు కృష్ణ! విషయముఁ దెల్పు
    ప్రాజ్ఞులుద్భాసిలు వచః ప్రభావమీర
    దౌత్యమీవుగావించుము ధర్మమూర్తి !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశ్వనాథ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఈడెదవు, ప్రభావము+ఈర'...?

      తొలగించండి