తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాప, రే తల సమయంబులో వెతల తామిక కష్టము చెంద నీయకన్ తెలుగు మహా సభన్ జరిపి తేజము నింపెను చంద్ర శేఖరుం డలుక యదేల నీకు కవి! రాధనమున్ గొను మయ్య శంకరా!
సందర్భము :: తెలుగు చదివే వాళ్లను ప్రశంసించి , వాళ్లను గొప్ప ఉద్యోగాలలో నిలిపి , ప్రతి ప్రాథమిక పాఠశాలలో తెలుగు బోధించేందుకు తప్పనిసరిగా ఒక తెలుగు పండితుని నియమించి , తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తామని వాగ్దానాలు చేసే నేతల యొక్క మాటలు మిన్న చేతలు సున్న. కాబట్టే మన తెలుగు రాష్ట్రంలో పూర్తిగా తెలుగు బోధించే ఓరియంటల్ కళాశాలలు కొన్ని మూతబడ్డాయి. ఇక తెలుగు చదివేవారు దేహి అని చేయి జాపక ఏమి చేస్తారు ? అని ప్రశ్నించే సందర్భం.
పలికెను తెల్గు నేత యిటు ‘’ పట్టము గట్టెద తెల్గు భాషకే, తెలుగు పఠించు వారల నుతింతు , గురూత్తమ కార్య రాశి వా రల నియమింతు , సత్య మిక ప్రాథమిక మ్మగు పాఠశాలలన్ నిలిపెద తెల్గు’’ నంచు , గన నేతల చేతలు సున్న, గావునన్, *తెలుగుఁ బఠించు వార, లిక దేహి యటంచును చేయి జాపరే ?* కోట రాజశేఖర్ నెల్లూరు. (22.12.2017)
భంగ్యంతరము (పాదాల క్రమము మార్చి) : విశ్వ భాష లందు విలువైనది తెలుగు తెలుగు జదువు వారు దేహి యనరె? మరల తెలుగు నేల మరుజన్మ నొకపరి తెలుగు తీపితీపి తేనెలూరు.
సీ: పిన్నతనము నందె పెద్దలు నేర్పగా నీతి పద్యములైన నేర్చి యుండి చాలినంతగనైన సంస్కృతమ్మును నేర్చి పంచకావ్యములైన పఠన జేసి భారతమ్మును మరి భాగవతమ్మును రామాయణముల సారస్య మెరిగి ఆధునికకవీంద్రులందు ప్రసిద్ధులౌ వారల రీతులన్ భళిగ నెరిగి ఆ.వె: విద్య కలిగి యిచ్చు విబుధుడే యుండిన తెలుగు చదువు వారు దేహి యనరె ! విద్య నేర్వనట్టి విద్య నేర్పగ లేని పంతులున్న తెలుగు బాగు పడునె !
తెలుగు పఠించు వారలికదేహియటంచును జేయి జాపరే స్థలమున,భావికాలమున సంస్కృతి సంపద కాలవాలమై సలలితమై సుధాసహిత స్వాగత తోరణమై చెలంగు మా పలుకుల ధార,శారదకు బంగరు వన్నెల చంద్రహారమై
కవుల కావ్య వనము కాంతులు విరియంగ
రిప్లయితొలగించండిధరణి పులక రించి తనరు మదిని
భాష తీయ దనము బహురీతు లనుగ్రోలి
తెలుఁగుఁ జదువు వారు దేహి యనరె
అక్కయ్యా,
తొలగించండిపద్యం అద్భుతంగా ఉంది. కాని ఎవరిని దేహి అంటారో స్పష్టంగా చెప్పలేదు.
అంతటి వరము కోరేది భగవంతుడిననేది సృష్టమని నా అభిప్రాయం. ఆర్యులేమంటారో?
తొలగించండికవుల కావ్య వనము కాంతులు విరియంగ
తొలగించండిధరణి పులక రించి తనరు మదిని
భాష తీయ దనము వాగ్దేవి కృపయని
తెలుఁగుఁ జదువు వారు దేహి యనరె
"ఇవ్వు"మనరె తెలుగు నిష్టముగ పలుకుచు
రిప్లయితొలగించండితెలుగు జదువువారు,"దేహి" యనరె
సంస్కృతమును జదువు ఛాత్రులు దేవుని
మ్రోల మ్రొక్కువేళ మోకరిల్లి!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "..నిష్టముగ బలికి" అనండి.
ఉభయభాషాపప్రావీణ్యం పద్యం బాగుందండీ..
తొలగించండిధన్యవాదములు గురుదేవా!సవరించెదను!నమోనమః!
తొలగించండిధన్యవాదములు మురళీకృష్ణగారూ!
తొలగించండి"ఇవ్వు"మనరె తెలుగు నిష్టముగబలికి
తొలగించండితెలుగు జదువువారు,"దేహి"యనరె
సంస్కృతమును జదువు ఛాత్రులు దేవుని
మ్రోల మ్రొక్కువేళ మోకరిల్లి!
కడుపు కాలినపుడు కందలుండి మనకు
రిప్లయితొలగించండిరోస మొచ్చినపుడు సీసములును
చంక లెగరు వేయ చంపకములు నుండ
తెలుఁగుఁ జదువువారు దేహి యనరె :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిబాగున్నది మీ పద్యం. మరి ఇన్ని ఉండి ఎందుకు దేహి అంటారో స్పష్టంగా చెప్పలేదు.
'వచ్చి'ని 'ఒచ్చి' అనరాదు. "రోస మొందినపుడు" అనండి.
"సార్!
తొలగించండి"అనరె" అనే పదము "అనరే" కి abbreviation గా తీసుకున్నాను...
"తెలుగు బటించువారలిక దేహి యటంచును జేయి జాపరే!
రిప్లయితొలగించండినలుగుటలేమొ తప్పవిక; నమ్ముడు మాదగు మాటలింక;"నం
చలసట లేక వాగిరదె యర్భకధూర్తులు కొంతమంది;యా
మలయసమీరతుల్యుడగు మాన్యుని నమ్ముడు "చంద్రశేఖరున్".
"
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...బఠించు'... టైపాటు.
దక్షత తెలియంగ "ద"కునేత్వమిచ్చియు
రిప్లయితొలగించండిహల్లు "హ"కును గుడిని నద్ది, కలిపి
చదువమని పలికిన సరిగ సరసముగ
తెలుఁగుఁ జదువువారు "దేహి" యనరె||
సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
వర్ణక్రమంతో పూరణ భేష్...
తొలగించండిమంచి పూరణ సత్యనారాయణగారూ!
తొలగించండిలాకేత్వమియ్య నేరడు
దాకును కొమ్మియ్యడట్టి దాత
పద్యం గుర్తొచ్చింది!
పద్యం పూర్తి పాఠము తెలియదు. ఎవరికైనా తెలిస్తే తెలుప ప్రార్ధన!
ఆ పద్యము అళయ సింగరార్య విరచిత "సంస్కృతాంధ్రచాటువులు"గ్రంథము నుండేమోనని అనిపిస్తున్నది. చూచి చెబుతాను.
తొలగించండి"చేకొని రాయని బాచడు
తొలగించండికాకాలు గుణించు పిన్నకాలము నాడే
‘ లా’ కేత్వమీయనేరడు
‘ దా’ కును కొమ్మీయ డట్టి ధన్యుడు కలడే”
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/april15/sahityamlo_chatuvulu.html
చాలచాల ధన్యవాదములన్నయ్యా! రాయని భాస్కరమంత్రిని పరిచయం చేసినందుకు!
తొలగించండినెల్లూరు రెడ్లు గొప్పదాతలు!యెవరో రెడ్డిగారు పోయినప్పుడు ఆయన్ని పొగుడుతూ ఈ పాదము వ్రాశారు.నాకు చాలనచ్చి గుర్తుండి పోయింది!
రాయని భాస్కరునిపై మరొక చాటువు.... (ఎప్పుడో చిన్నప్పుడు కంఠస్థం చేసింది!)
తొలగించండి"సరి బేసై రిపుడేల భాస్కరులు భాషానాథ?" "శిష్యా! వసుం
ధర నందొక్కఁడు మంత్రి యెయ్యె" "వినుకొండన్ రామయామాత్య భా
స్కరుఁడో?" "యౌ" "నయితే సహస్రకరశాఖ ల్లే" "వవే యున్నవే
తిరమై దానముఁ జేయుచో రిపుల హేతిన్ వ్రేయుచో వ్రాయుచో"
రిప్లయితొలగించండిఅలుక వలదయ కవి ! యమ్మహనీయుడు
తెలుఁగుఁ జదువువారు దేహి యన, రె
పరెప మనుచు వెతలు పడనీయకన్ జేసె
భళి తెలుగు మహా సభ నెఱ వేర్చి!
జిలేబి
రిప్లయితొలగించండితెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాప, రే
తల సమయంబులో వెతల తామిక కష్టము చెంద నీయకన్
తెలుగు మహా సభన్ జరిపి తేజము నింపెను చంద్ర శేఖరుం
డలుక యదేల నీకు కవి! రాధనమున్ గొను మయ్య శంకరా!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఘనత తోడ వ్రాయు కావ్యములెన్నియో
రిప్లయితొలగించండితెలుగు చదువు వారు , దేహి యనరె
యన్య భాష వారు నమలు పరచినచో
తెలుగు యంగి యనుచు సెలవు నిడిన
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెలుగు+అంగి' అన్నపుడు యడాగమం రాదు. "తెలుగె యంగి" అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండితెలుగన పాలకుండ., కడు తీయని చక్కెర సంస్కృతంబు ., ని...
ర్మలముగ మేళవించి, రసమాధురులన్ గొన , శబ్దపుష్టి వే...
వెలుగుల వెల్గు తెల్గు కనువిందగు., భారతిఁ జేరి మ్రొక్కుచున్
తెలుఁగుఁ బఠించువారలిక *దేహి* యటంచును జేయిఁ జాపరే !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండితెలుగు పాలలో గీర్వాణ శర్కర... ఇక రసమాధురికి, శబ్దపుష్టికి కొదవెక్కడ? ఎంతటి పండితుడైనా వాణీదేవిని దేహి అనవలసిందే కదా! అత్యద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిअद्भुतः
जिलेबी
అధ్భుతమైన పద్యరాజము! లలిత రసాలసాల నవపల్లవ కోమల తెలుగు! మీ పద్యరచనా శైలి పోతనవలె లలితంగా ఉంటుంది!నమోనమః!
తొలగించండిMAILAVARAPU VARIKI NAMO NAMAHA
తొలగించండిమైలవరపు వారి మరొక పూరణ
తొలగించండికల్వకుంట్ల వారి గంభీర వచనమ్ము..
లాలకింపలేదె ! అతివ ! నమ్ము !
వెలుగు జిలుగులొలుకు తెలగాణదేశాన
తెలుగు ! జదువువారు దేహియనరె !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిమరో అదురహో !
జిలేబి
మైలవరపు వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శ్రీహర్ష గారి స్పందన
తొలగించండి🙏
*పలికిన మీదునోట వడి పాన్కము పోసెదనయ్య కృష్ణుడా!*
*చిలికిన మీదు చేతులకు సేమము కల్గు వధాన వర్యుడా*
*తెలుగున సంస్కృతాన తమ తేజము జూడగ సవ్యసాచిదే*
*తలతును కొంత మాకదియె దానము జేసిన పుణ్యమబ్బదా!
*🙏
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మైలవరపు వారి మరొక పూరణ
తొలగించండిThey = వారలు (దే)
He = అతడు (హి)
*వారలతడటండ్రు* వరుసగా తీయగా
తెలుఁగు జదువువారు ! *దే.. హి*.. యనరె
యాంగ్లమాధ్యముమున అరకొర నేర్చుచో !
మాతృభాష పంచు మధురసుధలు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
సంఘ హితము గోరి సామాన్యులు ను మెచ్చ
రిప్లయితొలగించండిపెక్కు గ్రంధ ము ల ను మిక్కుట ముగ
రచన జేయ గోరు ర సి కావ తం సు లౌ
తెలుగు జదు వు వారు దేహి యన రె
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదువులమ్మ కెన్న సంతతి యగుగాన.
రిప్లయితొలగించండిపద్యవిద్యలందు ప్రగతిగాంచి.
నలువరాణిని చరణంబుల పట్టచు.
తెలుగుఁజదువువారు దేహియనరె
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పట్టుచు'...టైపాటు.
ధన్యవాదాలు ప్రసాదరావు
తొలగించండిఆంగ్లభాషయందు వ్యామోహమున జేసి
రిప్లయితొలగించండితండ్రి యెక్క డిట్లు తనయునకును
పలుకుచుండు నెప్పు డిలలోన సత్పుత్ర!
తెలుఁగుఁ జదువువారు దేహి యనరె.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురుమూర్తి ఆచారి
తొలగించండి,,,,,,, ,,,,,,
శ్రీమతి సీతాదేవి గారు మీ పద్యము ఉన్నతమై అలరించు చున్నది
ధన్యవాదములార్యా!నమస్సులు!
తొలగించండిపలికెను పోతనార్యుడట పావన భావన కృష్ణమూర్తి లీ
రిప్లయితొలగించండిలలను వికాసమొందగ విలాసము నిండుచు మానసమ్ములన్
తెలుగు పఠించు వారలిక దేహి యటంచును జేయి జాపరే
సులభము ముక్తిగోరిపురుషోత్తము ముంగిట మోకరిల్లుచున్
చేపూరి శీరామ్ గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ.వె.
రిప్లయితొలగించండిజిలుగులనమెరికనుఁ జేయిపట్టినడిగి,
నేను ఘనుడనాంగ్లమ్మును నేర్చినాడ
"తెలుఁగుఁ జదువువారు దేహి యనరె"
యనుచు నిందించు వారిది యల్పబుద్ధి.
విశ్వనాథ శర్మ గారూ,
తొలగించండిఆటవెలది సమస్యకు తేటగీతి వ్రాశారు. సరే... తేటగీతిగానే చూద్దాం.
మొదటి పాదంలో యతి తప్పింది. "జిలుగుల నమెరిక నడిగి చేయిపట్టి" అనండి. మూడవ పాదంలో గణదోషం. "తివిరి తెలుఁగుఁ జదువువారు దేహి యనరె" అంటే సరి!
ధన్రవాదములు. పొరబాటును గుర్తించలేదు. మీరన్నట్లు మారుస్తాను.🙏🙏
తొలగించండితేటతెనుగులోన తీయతేనెలు జారు
రిప్లయితొలగించండిభాగవతము జదివి భక్తులంత
ముదము దేవదేవు మోక్షము గోరుచు
తెలుగు చదువు వారు దేహి యనరె
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండి. సమస్యాపూరణ :: నేటి సమస్య
*తెలుఁగు బఠించు వార, లిక దేహి యటంచును జేయిఁ జాపరే ?*
సందర్భము :: తెలుగు చదివే వాళ్లను ప్రశంసించి , వాళ్లను గొప్ప ఉద్యోగాలలో నిలిపి , ప్రతి ప్రాథమిక పాఠశాలలో తెలుగు బోధించేందుకు తప్పనిసరిగా ఒక తెలుగు పండితుని నియమించి , తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తామని వాగ్దానాలు చేసే నేతల యొక్క మాటలు మిన్న చేతలు సున్న. కాబట్టే మన తెలుగు రాష్ట్రంలో పూర్తిగా తెలుగు బోధించే ఓరియంటల్ కళాశాలలు కొన్ని మూతబడ్డాయి. ఇక తెలుగు చదివేవారు దేహి అని చేయి జాపక ఏమి చేస్తారు ? అని ప్రశ్నించే సందర్భం.
పలికెను తెల్గు నేత యిటు ‘’ పట్టము గట్టెద తెల్గు భాషకే,
తెలుగు పఠించు వారల నుతింతు , గురూత్తమ కార్య రాశి వా
రల నియమింతు , సత్య మిక ప్రాథమిక మ్మగు పాఠశాలలన్
నిలిపెద తెల్గు’’ నంచు , గన నేతల చేతలు సున్న, గావునన్,
*తెలుగుఁ బఠించు వార, లిక దేహి యటంచును చేయి జాపరే ?*
కోట రాజశేఖర్ నెల్లూరు. (22.12.2017)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిసత్యమును వచించితిరి అవధానిగారూ!నమోనమః!
రిప్లయితొలగించండిశ్రీమతి సీతాదేవి గారూ! చాలా సంతోషమమ్మా. ప్రణామాలు.
తొలగించండిగురువు గారికి మనస్సులు.
రిప్లయితొలగించండిసకల శాస్త్ర విషయ సారమె రుగుదురు
తెలుగు జదువు వారు,ద్రోహి యనరె
నేకళలను సరిగ నేర్వని వారిని.
విద్య రాని వాడు వింత పశువు!
నేర్వని కి బదులుగా నేర్పని గా చదువ మనవి.
రిప్లయితొలగించండివెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిదేహి యనరె... అన్నదానిని "ద్రోహి యనరె" అన్నారు. దానితో సమస్యయే మారిపోయింది. సవరించండి.
సవరించిన పద్యం
రిప్లయితొలగించండికోరు వరము లిచ్చు గోవిందుబ్రార్థించి
వరములిమ్మనంద్రు భక్తితోడ
తెలుగు జదువువారు, దేహి యనరెజూడ
సంస్కృతముపఠించు ఛాత్రులంత
విరించి గారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
విశ్వ భాష లందు విలువైనది తెలుగు
రిప్లయితొలగించండితెలుగు తీపితీపి తేనెలూరు
మరల తెలుగు నేల మరుజన్మ నొకపరి
తెలుగు జదువు వారు దేహి యనరె?
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మరుజన్మ నొందగ" అంటే అన్వయం కుదురుతుంది.
ఆర్యా!మీ సూచన సమంజసము గా నున్నది.ధన్యవాదాలు!
తొలగించండిఅన్నమయ్య పాట నర్థమ్ము నెఱుగంగ
రిప్లయితొలగించండిపదకవితల సుధల నొదవు నచ్చ
తెలుగు చదువు వారు దేహి యనరె? యో ని
ఘంటువును వివరముకై తపించి
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శక్తి నీయ మనుచు సర్వేశు గొలుచును
రిప్లయితొలగించండితెలుగు జదువు వారు, దేహి యనరె
సంస్కృతమును బలుకు చదువరులెల్లరు
కృపను గోరు వేళ కేలుమోడ్చి…!!!
తెలుగు సొబగు లెల్ల తెలుసు కొందురిలను
తెలుగు జదువువారు, దేహి యనరె
యాంగ్లమాధ్యమమున నభ్యసించుటజేత
తెలుగు వారలైన బలుక తెలుగు!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"శక్తి నొసగు మనుచు" ఆనండి.
భంగ్యంతరము (పాదాల క్రమము మార్చి) : విశ్వ భాష లందు విలువైనది తెలుగు
రిప్లయితొలగించండితెలుగు జదువు వారు దేహి యనరె?
మరల తెలుగు నేల మరుజన్మ నొకపరి
తెలుగు తీపితీపి తేనెలూరు.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ భంగ్యంతర పూరణ బాగున్నది. అభినందనలు.
ఆ.వె.
రిప్లయితొలగించండితెలుగు చదువుజదివి తెఱగంటిరేడులు
తెలుగు భాష నెడపె తెల్లబోవ
తెచ్చిరాంగ్ల భాష తికమకల నడుమ
తెలుగు జదువువారు దేహి యనరె ?
@ మీ పాండురంగడు *
౨౨/౧౨/౨౦౧౭
పాండురంగా రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెఱగంటి'...?
తెఱగంటిరేడు.ఇంద్రుడు..రాజు 🙏🙏🙏
తొలగించండిలలిత లలితమైన లాస్యంపురీతుల
రిప్లయితొలగించండికవన సుధలనొల్కు కావ్య రచన
లలవడంగ పలుకులమ్మని ప్రార్థించి
తెలుగు జదువువారు దేహి యనరె ?
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొద్దిమందిమాత్రమిధ్ధరణిగలరు
రిప్లయితొలగించండితెలుగుజదువువారు,దేహియనరె
భిక్షగోరువారువీధివీధితిరిగి
కర్మఫలముతప్పదేరికైన
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వ్యాస శంకర నిభ పండిత గురుదేవ
రిప్లయితొలగించండిపాద పద్మములకు భక్తి నెఱఁగి
పటిమ తర సు శబ్ద భావ ప్రవిమలంపుఁ
దెలుఁగుఁ , జదువువారు, దేహి యనరె
[చదువు వారు = చదువుకొనెడి వారు]
ఇల నిఁక జన్మ రాహితికి నెల్లరు నిత్యము నార్తి జెందుచుం
బలుమఱు మానసమ్మునను బన్నుగఁ గొల్చుచుఁ దన్మయమ్మునన్
సలలిత మోక్ష మీయ మని శార్ఙ్గి సునామము లెల్లఁ బ్రీతి గొం
తెలుఁగుఁ బఠించు వార లిఁక దేహి యటంచును జేయిఁ జాపరే
[గొంతు+ఎలుఁగు = గొంతెలుఁగు; కంఠధ్వని]
అమోఘము!మీకు మీరే సాటి!నమోవాకములు!
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా రెండవ పూరణలోని విరుపులు మెరుపులే! అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిడా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.
సీ: పిన్నతనము నందె పెద్దలు నేర్పగా
రిప్లయితొలగించండినీతి పద్యములైన నేర్చి యుండి
చాలినంతగనైన సంస్కృతమ్మును నేర్చి
పంచకావ్యములైన పఠన జేసి
భారతమ్మును మరి భాగవతమ్మును
రామాయణముల సారస్య మెరిగి
ఆధునికకవీంద్రులందు ప్రసిద్ధులౌ
వారల రీతులన్ భళిగ నెరిగి
ఆ.వె: విద్య కలిగి యిచ్చు విబుధుడే యుండిన
తెలుగు చదువు వారు దేహి యనరె !
విద్య నేర్వనట్టి విద్య నేర్పగ లేని
పంతులున్న తెలుగు బాగు పడునె !
ధనికొండ వారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
జిలుగు వరూధినీ సొగసు చిత్రణ పెద్దన పంచ మెచ్చుచున్
రిప్లయితొలగించండికలికి ధరించి మాల హరి కంఠముజేర్చిన కావ్యమాధురుల్
విలసిత 'పాండురంగ' కృతి వేడుక! భూషణు శ్లేష చిందులున్
పులకల నైషధంపు కృతి మోదముఁ గూర్చగ దప్పి దీరకన్
దెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే?
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా 🙏
తొలగించండిశ్రీమైలవరపు వారి అమూల్యమైన సవరణతో
జిలుగు వరూధినీ ప్రణయ చిత్రణ పెద్దన పంచ మెచ్చుచున్
కలికి ధరించి మాల హరి కంఠముజేర్చిన కావ్యమాధురుల్
విలసిత 'పాండురంగ' కృతి వేడుక! భూషణు శ్లేష చిందులున్
పులకల నైషధంపు కృతి మోదముఁ గూర్చగ దప్పి దీరకన్
దెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే?
✍️ గుండా వేంకట సుబ్బ సహదేవుడు
తెలుగుమహాసభల్ముగిసెతెల్గుజిలుంగులు
రిప్లయితొలగించండివిశ్వమంతటన్
వెలుగులజిమ్మెభాషపలువేదికలందుప్రతిధ్వనించుచున్
తెలుగునుప్రస్తుతింపగనెతీరునెకోర్కెలుకొల్వురానిచో
తెలుఁగుపఠించువారలికదేహియటంచునుజేయిఁజాపరే
పీతాంబర్ గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
తెలుగు పఠించు వారలికదేహియటంచును జేయి జాపరే
రిప్లయితొలగించండిస్థలమున,భావికాలమున సంస్కృతి సంపద కాలవాలమై
సలలితమై సుధాసహిత స్వాగత తోరణమై చెలంగు మా
పలుకుల ధార,శారదకు బంగరు వన్నెల చంద్రహారమై
భాస్కరమ్మ గారూ,
తొలగించండివిరుపుతో విశేషార్థాన్ని సాధించి చక్కని పూరణ చేశారు. అభినందనలు.
పద్యవిద్యలోన ప్రావీణ్యమును బొంద
రిప్లయితొలగించండిననవరతము మదిని నర్థిగలుగ
గురువువద్దకేగి కూర్మితోడ నుతించి
తెలుఁగుఁ జదువువారు, దేహి యనరె?
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సలలితమైన తెల్గునకు సమ్మతి పట్టము గట్టెదంచు తా
రిప్లయితొలగించండితెలుపగ ముఖ్యమంత్రి కడుఁ దెల్లముగా సభలోన, నిచ్చతో
తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే
విలువగు పండితోత్తముల వీడునకేగి కరమ్ము దీక్షతో
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
. మాతృభాషయందు మమకారమున్నట్టి
రిప్లయితొలగించండితెలుగు జదువువారు దేహి యనరె
అన్యభాష మరియు నాంగ్లమ్ము నేర్వగ
యిష్టబడరు భాషనష్ట మనుచు|
2.తెలుగును సంస్కరించుటకు తేజము నింపగ ముఖ్యమంత్రియే
పలికెను వేదికందున ప్రపంచమహాసభలందు బాల్యమున్
తెలుగు బఠించువారలిక దేహియటంచును జేయి జాపరే
తెలిసిన బాలబాలికలు దీప్తిని బెంచనివేరు భాషలున్.
.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఘన గుడింతములను కఱప గలుగుదురు
తెలుగు జదువు వారు; దేహి యనరె
వాటి కొఱకు నితర భాషలధ్యేతలు?
తెలుగు వెలుగు గాంచి నిలుగు మోయి!
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమ్మభాష కెపుడు నాంగ్లమే సవతియౌ!
రిప్లయితొలగించండిసవతి సంస్కరణలు సాగ నీక
తెలుగు జదువు వారు !దేహియనరె సంతు
సవతి ప్రేమ జూప?భవిత యగున!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమృతమంది నట్టి యక్షరముల లోన
రిప్లయితొలగించండిమలచ బడ్డ కావ్య మదురిమలను
పఠన సేయ నాంధ్ర భారతిని దలచి
తెలుగు జదువు వారు దేహి యనరె!
"తెలుగు జదువు వారు దేహి యనరె" యన
సందియముల వీడి సకల జనులు
మాతృ భాష లోనె మాటలాడ దగును!
అవసరముల కొఱకె యన్య భాష!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తెలివిని మాలి యాంగ్లమను దెయ్యపు బానిసలై, తమంతగా
రిప్లయితొలగించండిపలుకక తీయతేనె యగు భాషను, పిన్నల కిండ్లనైన నా
సలలితమైన నెన్నుడుల జక్కగ జెప్పక భావి నేర్వగన్
తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దయ్యము' సాధువు. 'దెయ్యము' గ్రామ్యం.
పెద్దనార్యుని చదివి ముద్దరాలు వరూధి
రిప్లయితొలగించండిని వగలు సొబగు కని వివశు లయిన
తెలుగు జదువు వారు, "దేహి యనరె"యామె
యధర సుధల గ్రోల నాత్ర పడుచు
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
***********
రిప్లయితొలగించండితెలుగు భాష లోని తీపి గ్రోలి మురిసె
తెలుగు జదువువారు ; దేహి యనరె
తెలుగు నేర్పు మనుచు ,తెలుగు కమ్మదనము
తెలియగ ,పర భాష పలుకు వారు!
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర్తృపదం 'చదువువారు' బహువచనం, క్రియాపదం 'మురిసె' ఏకవచనం. "తీపి గ్రోలెద రెల్ల। తెలుగు జదువువారు...." అందామా?
ఆ.వె
రిప్లయితొలగించండిమంచి తెలిసి మసలు మాన్యులౌదురిలను
తెలుఁగుఁ జదువువారు, దేహి యనరె
జనులు పరుల భాష జదివి పొరుగు దేశ
మరగి పొట్ట చేత బట్టి మతులు చెడగ
నాగ మల్లేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. "...మరిగి పొట్ట కొఱకు మతులు చెడగ" అందామా?
పొరుగు భాష మోజు పెరిగెను జగతిన
రిప్లయితొలగించండితల్లి భాషజదవ తరిగిపోగ
మమ్మి డాడియనుచు మనుజులు తిరగాడ
తెలుగుజదువు వారుదేహియనరె
కలుగగ నెప్పుడాకలియు కందల జాతుల కూరలుండగా
రిప్లయితొలగించండిఛలమున పూలు తెమ్మనగ చంపకలుత్పల మాలలుండగా
బలిమికి నౌషధమ్మికను బాలల ప్రౌడుల శాస్త్రముండగా
తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే!
ములుగుచు డబ్బు లేదనుచు పుత్రుని జేయగ పండితుండుగా
రిప్లయితొలగించండితెలుగు మహాసదస్సులని తెల్గుల నేతలు డప్పుకొట్టగా
పిలుపులు రాక పండితులు వృత్తులు కోరగ నీసడించగా
తెలుఁగుఁ బఠించువారలిక దేహి యటంచును జేయిఁ జాపరే!