27, డిసెంబర్ 2017, బుధవారం

సమస్య - 2557 (సవతినిఁ జూచి సీత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సవతినిఁ గని సీత మిగుల సంతస మందెన్"
(లేదా...)
"సవతినిఁ జూచి సీత కడు సంతస మందెను రాము తోడుతన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో పైడి హరినాథరావు గారు ఇచ్చిన సమస్య)

57 కామెంట్‌లు:

  1. నవవధువే కదలెనయో
    ధ్య వరుడు శ్రీరామువెంట నచ్చోటను తా
    నవలామణి గైక, విలా
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్

    రిప్లయితొలగించండి
  2. సార్! ఈ సమస్య ఇటీవలే ఇవ్వబడినది:

    "సమస్య - 2540 (సవతిని గని సీత...)
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
    "సవతిని గని సీత మిగుల సంతసమందెన్"
    (లేదా...)
    "సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నెమ్మదిన్"
    (ఒకానొక అవధానంలో ఇచ్చిన సమస్య)"

    http://kandishankaraiah.blogspot.in/2017/12/2540.html?m=1

    రిప్లయితొలగించండి
  3. దవమున వనవాస మపుడు
    సవనమునకు బిల్చునటుల సాగుచు నుండన్
    శివసతి గౌరికి వరుసౌ
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్.
    (గౌరికి సవతి = గంగ; ఇక్కడ ఒక సెలయేరు)


    రిప్లయితొలగించండి
  4. అవధులు మీరగ ముదమే
    వివాహ మాడిన తనపతి వెంట జని వెసన్
    నవ వధువుగ ; పతి యింట ర
    "సవతిని గని సీత మిగుల సంతసమందెన్"
    (రసవతి = వంటిల్లు)

    రిప్లయితొలగించండి
  5. సవనము సేయగ రాముడు
    సవిధము నందున గనకపు సతినే నిలుప
    న్నవనిజ రహస్యగతితో
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్ .

    రిప్లయితొలగించండి
  6. (శ్రీరాముని అశ్వమేధయాగ సందర్భం)

    భువిలో రాజ్యము బెంచగ
    భవభయ హరుడౌ రఘుపతి బంగరు సీతన్
    నవహయ మేధమున నిలుప
    సవతినిఁ గని సీత మిగుల సంతస మందెన్

    రిప్లయితొలగించండి
  7. యవనీ తలమున నిద్దరు
    సువధాన కళలకునెపుడు సునయన మగుదుర్
    భువనైకనోద్ధత రమా
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్
    గురువు గారికి నమస్సులు.

    రిప్లయితొలగించండి
  8. చవిగొని రాముని తమికొని...
    చెవులను నభమును దునుమగ చిందుల తోడన్
    నవరసము లొలుకు మానస
    సవతినిఁ గని సీత మిగుల సంతస మందెన్ :)

    నభము = ముక్కు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కిట్టించితి నేనెటులో
      పట్టింపులు లేవు నాకు పదహీనుడ; నన్
      తిట్టించును పాత పలుకు,
      పుట్టించగ క్రొత్త రీతి భువిలో తరమా?

      తొలగించండి
    2. *దట్టించితిరే టిట్టీల్*
      *పట్టుగలదుతమకు భాషపై పద జలధీ*
      *తిట్టెదరెవ్వరు పట్టును*
      *పట్టముగట్టెదరు శాస్త్రి పలుకలకెపుడున్*
      🙏🙏🙏

      తొలగించండి
    3. సార్!

      నా పూరణలో శూర్పణఖను సీత తన "మానస సవతి" గా భావించి నవ్వినదని ఊహించితిని. దీనికి పలువిధముల అభ్యంతరములు పండితులు చూపెదరేమో!

      "మానస సవతి" దుష్ట సమాసము. నిజమే; కానీ శూర్పణఖ దుష్టురాలే కదా :)

      ఆ రాక్షసి "సవతి" ఎటులైనది? పెండ్లి అవలేదు గదా?

      సరి సరి. ప్రాణము లేని తన రూపములోనే ఉన్న బంగరు
      బొమ్మను సీత సవతిగా భావించినదని పలువురు కవులు నుడివిరి కదా!

      శూర్పణఖ తన భర్తనే కామించి, తనపైనే దాడి చేసినది కదా! సవతులు చేయు పనులివియే కదా!

      ఎందుకైనా మంచిదని "మానస" సవతి అన్నాను.

      **********************

      శ్లో!!

      మన ఏవ మనుష్యాణాం!
      కారణం బంధమోక్షయోః!
      బంధాయ విషయాసక్తం
      ముక్త్యైః నిర్విషయం స్మృతమ్!!

      మైత్ర్యుపనిషత్ ౬-౩౦

      **************************

      ఒక్క వీర తాడు ప్లీజ్!

      తొలగించండి

    4. దుష్టుల పలుకులను గూడ కవివరులు శిష్టసమాసములోనే రాయవలెనని యింతకు మునుపు శంకరాభరణ ద్వారపాలకులు శ్రీమాన్ శ్యామలీయం వారు చెప్పినట్టు గుర్తు :)

      నారాయణ ! నారాయణ!


      జిలేబి

      తొలగించండి
  9. వివరము తెలియక జానకి
    సవనము జేయంగ నెట్లు ? సందే హించెన్
    ప్రవరుడె యనినమ్మి బంగరు
    సవతినిఁ గని సీత సంతస మందెన్

    ఇక్కడ ప్రవరుడు = శ్రేష్టుడు

    రిప్లయితొలగించండి


  10. కువకువ లాడెడు పక్షుల
    నవనవ లాడెడు వనముల నవ్యపు కైపున్
    ప్రవహించు నదిని, పార్వతి
    సవతినిఁ గని సీత మిగుల సంతస మందెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవతులెచట పార్వతికని
      కవివరులిట నవ్వి పోరె! గంగ జిలేబీ
      స్తవనీయమైన కన్నియ
      చవిగొని శిరమున వసించు సరసపు రీతిన్!

      తొలగించండి


    2. ఆంధ్ర భారతి తెలిపిన పలుకు - యివపు
      గుబ్బలి కొమరి సవతి యగునయ గంగ !


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  11. *కందం*
    ధవుసహిత దానవోదర
    ప్రవాస జీవితఁపు వెతలఁ బారన్ ద్రోలన్
    నవ జీవనమందించిన
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్

    (సీత = ఆకాశగంగ)

    గజాసురుని కథ నేపథ్యంలో

    రిప్లయితొలగించండి
  12. రవళించిన సందేహము
    అవనిజ మనమున చెరిగెను యాగమునందున్
    ప్రవిమల స్వర్ణప్రతిమన
    సవతిని గనిసీత మిగుల సంతసమందెన్

    రిప్లయితొలగించండి
  13. అవిరళ హాయిబొందుచు విహారమునన్ పతి రామచంద్రుతో
    యవనిజ కౌగిలింతల సుహాస వికాస ప్రకాశమందునన్
    వివిధ సుఖాల దేలుచు ప్రవీణత,స్నానము గోర పార్వతీ
    సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నమ్మదిన్

    రిప్లయితొలగించండి


  14. అవధాని వారు పైడి వారిని ఉద్దేశించి :)



    కవివర! శంకరాభరణ కావ్యులు మక్కువ గాను పూర్తి గాం
    చివదిలి నారటన్ గద విచిత్రము! కైపదమిద్ది మీరునా
    కు వసతి గామరొక్క పరి గూర్చిరి!పట్టపుదేవి, సాథికిన్
    సవతినిఁ జూచి సీత కడు సంతసమందెనురాము తోడుతన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులారా,
    శుభోదయం!
    ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా జరిగిన శతావధానంలో పృచ్ఛకుడిగా ఉన్నాను కదా! ఈరోజు నుండి ఆ అవధానంలో పృచ్ఛకులు అడిగిన సమస్యలను వరుసగా ఇస్తున్నాను.
    ఈనాటి సమస్య గతంలో ఇచ్చినదే అని మిత్రులు తెలియజేశారు. (నా మతిమరుపు సంగతి మీకు విదితమే కదా!) ఇప్పటికే కొందరు పూరణలను పంపించారు కనుక మార్చే అవకాశం లేదు. గతంలో చేసిన వాటికి భిన్నంగా ప్రయత్నించండి. స్వస్తి!

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    నవసుధల జిందు బలుకుల
    సవివరముగ దెల్ప ద్రిజట స్వప్నమ్మును, దా...
    నవ కాంతను మధు దరహా...
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్ !

    ( గతంలో ఈ సమస్యను వృత్తపద్యంలో *రాక్షసీ విలాసవతిని* అని నేను పూరించినపుడు మాన్యులు శ్రీ నరాల రామారెడ్డి గారు దరహాసవతి... మందహాసవతి... ఇత్యాది పదప్రయోగం కూడా సముచితమే అని మంచి సూచన చేసినారు.. వారికి నమస్సులతో....🙏... మురళీకృష్ణ )

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రవిమల శంకరాభరణ పావన వాహిని పారుచుండగా
      కవులును సాహితీ ప్రియులు గాంచి పునీతులు గాగ మున్గ ., భా...
      వ విలసితాబ్జజాంగన శుభంకరయౌ మతి , నిట్టి శబ్దహా......
      సవతినిఁ జూచి సీత కడు సంతస మందెను రాము తోడుతన్ !

      ( శబ్దమే హాసము గా గలది... భారతి )

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  17. ఇది అశోకవనంలో హనుమను చూసిన సందర్భములోనూ, వాల్మీకి ఆశ్రమములో నివసించు సందర్భములోనూ సరిపోతుందనిపించింది.

    అవనీసుత అవ్వనమున
    నివసించగ రాముఁ వీడి నిరతము చింతన్
    పవన తనయుడగు హనుమను,
    సవతినిఁ గని సీత మిగుల సంతస మందెన్

    (భక్తులు తమను స్త్రీగనూ భగవంతుని తమ ప్రభువుగానూ ఊహించుకుంటారు కదా!)

    రిప్లయితొలగించండి
  18. భువి లో న సూయ పడు సతి
    సవతి ని గని ;సీత మిగుల సంత స మందె న్
    దివి కే గెరావణుడని వి
    ని వి ర హ మునరామ చంద్రుని ద లంచి మది న్

    రిప్లయితొలగించండి
  19. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    అవనిజ సీత జూచి త్రిజటాసురి పల్కె నశోక మూర్తియై
    వివరముగాగ చెప్పెదనువీనుల విందు గ నాదు స్వప్నమున్
    రవికుల శ్రేష్టుడాఖలుని రావణుజంపె ను నమ్ము మన్న హా
    స వతిని జూతి సీత కడు సంతసమొందెను మెచ్చినమ్మదిన్
    (హాస వతి )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. This is my first attempt at writing a telugu poem and I used chandam software to check if all the rules are ok. My attempt is to tell that Sita's joy is for seeing her mother-in-law and not because of the celebrations or the number of people who are walking around to see Rama & Sita.

      శ్రవనా నందము కాదది
      కవాతు సేసే అయొధ్య కాంచనులు గాదు
      అవనిన మరిదుల అమ్మకు
      సవతిని గని సీత మిగుల సంతస మందెన్

      తొలగించండి
  20. శివశివ !యెంతమాట!విను శ్రీరఘురామునికేకపత్ని యా
    యవనిజ మాత్రమేసుమ! పరాంగన మోమును జూడడెన్నడున్
    గవివర!ధర్మమాతడని గర్వముగా జగమంత జెప్ప!నే
    *"సవతినిఁ జూచి సీత కడు సంతస మందెను రాము తోడుతన్"*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  21. అవనీనాథుని తోడుత
    నవవథువుగ నత్తయింట నడుగిడువేళన్
    నవనతయై కైకేయీ
    సవతినిగని సీత మిగులసంతసమొందెన్

    రిప్లయితొలగించండి
  22. ధవునిది బాణమొక్కటని దప్పని మాటయు నొక్కటే యనన్
    చివరకు నొక్క కాంత నెద జేర్చెడు వాడుగ తన్ను దీర్చి జాం
    బవమున నశ్వమేథమున పావనమంద సువర్ణ రూపమౌ
    సవతిని గాంచి సీత కడు సంతసమొందెను రాము తోడుతన్

    రిప్లయితొలగించండి
  23. దివినుండి భువికి దిగి యా
    భవుని శిరము నందు నిల్చు పావన గంగ
    న్నవలో కించుచు పార్వతి
    సవతినిఁ గని సీత మిగుల సంతస మందెన్

    శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
    మొన్నటి దత్తపది పూరణ పైన నా వివరణ
    సమస్త జీవులను కాపాడే శ్రీ మహా విష్ణువు శ్రీకృష్ణునిగా అవతార
    మంది కౌరవ నాశనాన్ని ఆపడానికి పాండవ దూతగా వచ్చి మహా
    సంగ్రామాన్ని ఆపుటకు . శాంతిని నిల్పుటకు యత్నించగా అతనిని
    బంధించడం దుర్మార్గం కదా ! ఆ మహనీయుని యత్నాన్ని వర్ణించడం
    శ్రీకృష్ణ స్తుతి అన్నది నా అభిప్రాయం

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. పవనుని ప్రకోపమున దా
      శివతేజము దాల్చి సుతునజేయుని గనగా
      ధవళాంగుని ముద్దుగొనెడు
      సవతినిగని సీతమిగుల సంతసమొందెన్

      ధవళాంగుడు యిక్కడ శివుడుకాదు, సుబ్రహ్మణ్యుడే!
      సీత ఆకాశగంగ

      తొలగించండి
  25. . సవరణతో గమనింప ప్రార్థన
    గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య 2557
    *సవతినిఁ జూచి సీత కడు సంతస మందెను రాము తోడుతన్.*

    సందర్భం :: సీతాదేవి పితృవాక్య పరిపాలకుడైన తన భర్త శ్రీరామునితో కలసి వనవాసం చేస్తూ , అడవిలో ఉన్న మహర్షులను దర్శిస్తూ , అత్రి అనసూయలు ఉండే ఆశ్రమంలో ప్రవేశించింది. సాధ్వి అనసూయ అడుగగా తన వివాహ విషయాన్ని వివరించి ఆమె చెప్పిన సతీధర్మములను గుఱించి శ్రద్ధగా వినినది. ఆ సమయంలో మందహాసవతి యైన ఆ అనసూయను జూచి , సీత ఎంతో సంతోషించింది అని చెప్పే సందర్భం.

    ‘’శివుని ధనుస్సు నెక్కిడెను, చిత్తము దోచెను, పెండ్లియాడె ప్రా
    భవమున’’ నంచుఁ బల్కుచు, వివాహము గూరిచి విన్నవింతు నం
    చు, వినయశీల యౌచు , ననసూయను, సాధ్విని, మాన్య, మందహా
    *సవతినిఁ జూచి , సీత కడు సంతస మందెను రాము తోడుతన్.*
    కోట రాజశేఖర్ నెల్లూరు. (27.12.2017)

    రిప్లయితొలగించండి
  26. : నవలామణి కచ్చోటను
    ప్రవహించెడు దేవనదిని రాముడు జూపన్
    అవనిన గల యా పార్వతి
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్


    : అవధానియె చెప్పె సతికి
    కవితయె తన మొదటి భార్య, కడుప్రేమంచున్
    నవరస ములనొలుకెడు తన
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్

    రిప్లయితొలగించండి
  27. లవలేశమైన తాను క
    లవర పడవలదని తన కల నుడివిన సుశీ
    ల, విభీషణ తనయ, బరవ
    సవతినిఁ గని సీత మిగుల సంతస మందెన్.

    రిప్లయితొలగించండి
  28. శివధనువు విరిచె రాముం
    డవనిజ బెండ్లాడె మిగులనానందముగన్
    దివినాడునచ్చర విలా
    సవతినిగని సీత మిగుల సంతసమొందెన్

    రిప్లయితొలగించండి
  29. శివుని ధనుస్సు తా విరువచెందె ముదమ్మునుతల్లులెల్లరున్
    భువనములే నుతించగను భూమిజజేకొని రానయోధ్యకున్
    ప్రవిమల చిత్తయై మురిసె భామిని రాముని తల్లియామెకున్
    *సవతిని గాంచి, సీత కడు సంతస మొందెను మెచ్చి నెమ్మదిన్.*

    రిప్లయితొలగించండి
  30. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    " ఆ ధు ని క - సీత "


    పవమానరా విటీవలనె పరిణయమాడె గీత యను

    యువతిని | స్కూటి పయి జనుచున్న గీతకు సంభవించె

    నవుర ! దుర్ఘటన | మంత వికలాంగయై పోయె | ద్వితీయ

    వివహము జేసుకొ మ్మనుచు వేడ , నాతడు సీత యన్న

    ప్రవిమల సౌశీల్యము గల. బాలను పెండ్లాడగా న

    నవరత మక్కకు సేవన మొనర్చె , గౌరవించె బతి

    ని వినయ గుణవతి యగుచు , నిత్య మెల్లరు గొనియాడ |

    సవతిని గని సీత మిగుల సంతస మందెన్ మనమున ! ! !

    రిప్లయితొలగించండి
  31. శివునితలపైనను నిలచి
    దవళాంబుజ పత్రనేత్రి, తనువున సగమై
    నివసించు శివానిని, తన
    సవతినిఁ గని సీత మిగుల సంతస మందెన్

    రిప్లయితొలగించండి
  32. భవితకు కార్తిక దీపో
    త్చవమున భక్తియు వెలుగగ!ధార్మిక తత్వo
    బు వనితలకు శివుడును కైలా
    సవతిని గని ?సీతమిగుల సంతస మందెన్

    రిప్లయితొలగించండి
  33. సమస్య
    సవతినిఁ జూచి సీత కడు సంతస మందెను రాముతోడుతన్

    సందర్భము:
    విలాసవతియైన శూర్పణఖ ముక్కు చెవులుఁ గోయ లక్ష్మణుడు సంసిద్ధు డగుట జూచి సీతారాములు సంతోషించుట

    కువ కువ లాడు యౌవనము
    కొంపలు ముంచును, మోహ మెక్కువై
    చివరకుఁ జూడు- రావణుని
    చెల్లికి రాముని మాట మేరకున్
    చెవులును ముక్కు గోతు ననె,
    ఛీ యనె, లక్ష్మణమూర్తి యా విలా
    సవతిని జూచి... సీత కడు
    సంతస మందెను రాము తోడుతన్

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

    రిప్లయితొలగించండి
  34. అవనిజ వెతలున్నను భృశ
    ము విపిన రాజమ్ముఁ గంద మూల నిచయ సా
    ర్తవ పద్మాకర సువిలా
    స వతినిఁ, గని సీత మిగుల సంతస మందెన్

    [స+ఆర్తవ = సార్తవ: కందమూలములు, పుష్పములతోఁ గూడిన సరస్సులతో గూడిన నడవినిఁ గాంచి సీత సంతోషించెను]


    అవని సురుండు సంయమి వరాత్రి సునాముని ధర్మపత్నినిం
    బ్రవిమల చిత్త కంటక నివారిణి మూల ఫలప్రదాయినిన్
    సవినయ భక్తి తత్పరత సత్యనసూయ తపో విలాస భా
    స వతినిఁ జూచి సీత కడు సంతస మందెను రాము తోడుతన్

    [అనసూయా దేవి పది సంవత్సరములు క్షామమేర్పడి నప్పుడు మూల ఫలములు సృజియించి లోకములను రక్షించెను. గంగా తోయమును కూడా ప్రవహింప జేసిన మహా పతివ్రత. ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 8/12/2017 నాటి పూరణలు:

      శివుని ఘన తేజము వడం
      గ వారి నిడ ననుమతించి గౌరి శరవణో
      ద్భవునిఁ దనయునిగ నీయఁగ
      సవతిని గని సీత మిగుల సంతసమందెన్

      [సీత =గంగా దేవి]


      వివిధ సుఘోర వాక్కులను భీతిలఁ జేయ మహోగ్ర రక్కసుల్
      కవిసి యిలాతనూజ నటఁ గందుచు నుండఁగ నంత స్వప్నపుం
      బ్రవిమల గాథ నంతయును బల్కిన యా త్రిజటా సతిన్ విలా
      స వతినిఁ గాంచి సీత కడు సంతస మొందెను మెచ్చి నెమ్మదిన్

      తొలగించండి
  35. రవికుల తిలకుని యాగ
    మ్మవనీ తలమందు తనదు యాకృతి తోడన్
    ప్రవిభాసిల, శిల్పమె యౌ
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్!

    రిప్లయితొలగించండి
  36. గురుదేవులకు వినమ్రవందనములు
    కలియుగ సీతను కష్టముల పాలు జేసిన వాడిని నిజమైన కథ
    ----------------------------
    తనను విడచి పతియె బోవ తరుణి తోడ
    మోజు తీరినంతను నామె మోక్షపురిని
    నికర వ్యధలు జూప సవతినిగని సీత
    మిగుల సంతస మందెను మెచ్చు కొనుచు!
    మోక్షపురి =కంచి, వాని కథ కంచికి జేరినది కావున మోక్షపురి వాడానండి.

    రిప్లయితొలగించండి
  37. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న కొద్దిగా మెరుగు పడిందనుకొన్న ఆరోగ్యం ఈరోజు మళ్ళీ క్షీణించింది. పోయిందనుకున్న జ్వరం తిరిగివచ్చింది. అందువల్ల ఈనాటి మీ పూరణలను సమీక్షించలేకపోయాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆరోగ్యం జాగ్రత్త గురువు గారూ!
      త్వరగా నయమవ్వాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను..

      తొలగించండి
    2. మీ ఆరోగ్యం జాగ్రత్త గురువు గారూ!
      త్వరగా నయమవ్వాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నాను..

      తొలగించండి
    3. విశ్రాంతి తీసుకోవలసిందిగా గురుదేవులకు మనవి.

      తొలగించండి
  38. సమస్య:సవతిని గని సీత మిగుల సంతస మందెన్
    సందర్భము:
    రాముని సరసన స్వర్ణసీతను చూచింది సీత. సవతి కాని సవతి అనుకున్నది. ఐతేనేం బొమ్మనే కదా అని సంతోషించింది.
    ==============================
    ధవునికి సరసన నొదుగుచు

    నవనవలాడెడు పసిండి
    నాతిని, సీతన్,

    సవతి యనగ రానిది యగు

    సవతినిఁ గని సీత మిగుల
    సంతస మందెన్

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

    రిప్లయితొలగించండి
  39. గురువు గారు తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తూ...

    రిప్లయితొలగించండి