8, డిసెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2540 (సవతిని గని సీత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సవతిని గని సీత మిగుల సంతసమందెన్"
(లేదా...)
"సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నెమ్మదిన్"
(ఒకానొక అవధానంలో ఇచ్చిన సమస్య)

80 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. అవనిజ కోరిక మేరవ
      నవాసపు నివాసమందు నాణ్యత తోడన్
      సువిశాల నిర్మితమగు ర
      సవతిని గని సీత మిగుల సంతసమందెన్
      (రసవతి=వంటఇల్లు)

      తొలగించండి
    2. బాలసుబ్రహణ్య శర్మ గారూ,
      మీ వంటింటి పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. భవుని శిరమున గంగట
    సవతిని గని, సీత మిగుల సంతస మందె
    న్నవనిని మెచ్చగ తనపతి
    హవనము నందైన గాని హాటక ప్రతిమన్
    -------------------------------
    హాటక ప్రతిమ = బంగారు ప్రతిమ

    రిప్లయితొలగించండి
  3. సువదన మండోదరిని
    న్నవిరళ పతిభక్తి జూపు నారీమణి యా
    జవరాలు ధన్యమాలిని
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్

    🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. రావణునకు మండోదరి, ధన్యమాలిని యే గాక చిరంగి అనబడు మూడవ భార్య కూడా ఉండినదని కృత్తివాస రామాయణములోనూ, (బహుశా) కంబ రామాయణములోనూ, చెప్పబడినదని వినికిడి. వాల్మీకి రామాయణములో లేదట. ఈమె చిత్రసేనుడనే గంధర్వుని కూతురు. రామ భక్తురాలు. ఈమెకు రావణునితో వీరబాహు అనే కుమారుడు ఉండెనట... నావన్నీ 'ట' 'ట' లే...

      https://gpsastry.blogspot.in/2013/09/raavans-third-wife.html?m=0

      తొలగించండి
  4. రవికులమందు మెట్టి రఘురాముని పట్టిన పుణ్యశీలికిన్
    నవవిథ భంగిమల్ సలిపి నాట్యముతోడ ముదంబు గూర్చె నా
    టవెలది చెన్ను చిందెడి మిటారి సరాగ తలోదరిన్ విలా
    సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చె నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మనోహరమైన పూరణ. అభినందనలు.
      (మీ పూరణను ముందు చూసి ఉంటే నా పూరణను ఇక్కడ పెట్టేవాణ్ణి కాదు).

      తొలగించండి
  5. అవధులు మీరగ ముదమే
    వివాహ మాడిన తనపతి వెంట జని వెసన్
    నవ వధువుగ ; పతి యింట ర
    "సవతిని గని సీత మిగుల సంతసమందెన్"
    (రసవతి = వంటిల్లు)

    రిప్లయితొలగించండి
  6. (వసంతోదయం)
    జవజవ శిశిరము వనమున
    జవజీవములను హరించె ; చైత్రము రాగా
    చివురుల నవవనమధుమా
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మధుమాసవతితో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. డా.పిట్టా
    (సీత చిత్రలేఖన కళా పారంగతురాలు.లంక నుండి వచ్చిన పిదప రావణుని చిత్రమును గీయగా రాముడు చూచినాడు.అప్పటికామె గర్భవతి. రావణుని వంటి సంతానం గలిగే అవకాశమున్నది.ఆమె మనస్సును మరలించుటకై రాముడు సీతను హఠాత్తుగా వనంలో వదలినాడు.ఆ విషాదంతో ఆమె లోని మునుపటి భావం మరుగు పడింది.వాల్మీకి యాశ్రమంలో రాముని వంటి పుత్రుల నిద్దరిని కన్నది.)

    కవనమె చిత్రీకరణము
    కవలుకొనన్ సీత చాలగా సృష్టించెన్
    వివరముగా తనవలె చిత
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్!
    కవలుకొను॥వేదాది పఠనమునందు కొంత సామ్యముచే నొకటి విడివడి మరి యొకటి వచ్చి కలియు శ.ర ;
    చిత॥చేర్చ బడిన శ.ర

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    ఒక ఊహ:
    అవనిజ పూల మొక్కలకు నందగ నీరును గూర్చు కుంటలో
    వివరముగా తనంత యగు వే తన రూపపు నీడ జూచి తా
    నవనొక సీత; సీత నటనౌ నొక బింబము, ముద్దు ముచ్చటై
    సవతిని గాంచి సీత కడు సంతస మొందెను మెచ్చి నెమ్మదిన్!
    (ఇది రా..లో లేదు.కల్పితమే)

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా నుండి
    ఆర్యా, తమ అవధాన కళా సేవకై మీకు అభినందనలు.శనివారపు మీ పాత్ర విజయవంతంగా నుండాలని ఆశిస్తూ,Congrats!

    రిప్లయితొలగించండి
  10. ప్రవిమలముగ శిరమెక్కగ
    త్రివేణి తాను, సగమయ్యె స్థిరమగు మదితో
    శివవల్లభ శీఘ్రమ్ముగ,
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శివవల్లభ పార్వతికిన్' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.

      తొలగించండి
    3. ప్రవిమలముగ శిరమెక్కగ
      త్రివేణి తాను, సగమయ్యె స్థిరమగు మదితో
      శివవల్లభ పార్వతికిన్
      సవతిని గని,సీత మిగుల సంతసమందెన్

      తొలగించండి
  11. రిప్లయిలు


    1. రవళించుచు పరుగిడుచుం
      డె,వనములకు తావునిచ్చి, డెందంబరయ
      న్నవనినట,కప్పుటైదువ
      సవతిని గని, సీత మిగుల సంతసమందెన్ !

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. అవనిజ క శో క వని లో
    నువిద లు రక్షణ గ నుండ నూరడి ను డు ల న్
    జ వ రా ల్ త్రిజ ట పలు క సర
    సవతి ని గని సీత మిగుల సంత స మందె న్

    రిప్లయితొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    అవలీలగ భుజబలమున
    శివధనువును ద్రుంచగలుగు శ్రీరామునిదౌ
    ప్రవిమల వర ధైర్యశ్రీన్
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  14. భువనజనానందముగా
    ధవుని సభామంటపమునఁ దగ నాడిన నా
    ట్యవిశారదయైన విలా
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్.

    రిప్లయితొలగించండి
  15. దవమున ముని భాషణమున
    నవిఘ్నముగ నశ్వమేథ యాగమలర జాం
    బవమౌ తన రూపముగల
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్!

    రిప్లయితొలగించండి

  16. లవలవ శబ్ద మాయెనట ! లావుగ చీలగ దోని, యగ్రమాం
    సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నెమ్మదిన్,
    కువలయ మై పటుత్వమున కూర్మిగ గాంచెడు రాము నాత్మజున్
    లవముగ చూడ గాను సయి లావుగ దోచె సుమా మదిన్ భళా !

    అగ్రమాంస - హృదయము
    వతి - దీపము
    అగ్రమాంసవతి - హృదయపు దీపము

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
  17. డాఎన్.వి.ఎన్.చారి 9866610429
    అవిమల ప్రేమ సెలంగ ము
    ని వాకిటను జేర జూచి నెయ్యముతో గౌ
    రవమున బిల్చు దయా మా
    నస వతి గని సీత మిగుల సంతసమందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారు 4 వ పాదము ప్రాస భంగము ఒక్కసారి పరిశీలించండి

      తొలగించండి
    2. చారి గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      పూసపాటి వారు చెప్పినట్లు చివరి పాదంలో ప్రాస తప్పింది. సమస్య పాదాన్ని మార్చకూడదు.

      తొలగించండి
  18. రవళించిన సందేహము
    అవనిజ మనమున చెరిగెను యాగమునందున్
    ప్రవిమల స్వర్ణప్రతిమన
    సవతిని గనిసీత మిగుల సంతసమందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సందేహ। మ్మవనిజ...' అనండి. విసంధిగా వ్రాయరాదు.

      తొలగించండి
  19. అవమాన దూషణంబులు
    నవినయమును జూపు దానవాంగనల కెడన్
    ఛవిగల త్రిజటను సువిలా
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్

    రిప్లయితొలగించండి
  20. కువకువ లాడెడు బక్షుల
    సవడుల తోనుండు బర్ణ శాలయు, బొంతన్
    కువలాయిక సహిత నగజ
    సవతిని,గని సీత మిగుల సంతస మొందెన్
    నగజ సవతి = గంగ

    రిప్లయితొలగించండి
  21. దవములలో నివసించగ
    ప్రవిమలమగు తీరమునకు పయనంబగుచున్
    భువి,యివపుగుబ్బలితనయ
    సవతిని, గని సీత మిగుల సంతసమందెన్!!!

    ఇవపుగుబ్బలితనయసవతి = గంగ(గంగానది)

    నవలలు చిత్రములందున
    కవనమ్ముల వర్ణనవలె కమనీయంబౌ
    భవనము నందు గల తన ర
    సవతిని, గని సీత మిగుల సంతసమందెన్!!!

    సీత పేరుగల వనిత , రసవతి = వంటఇల్లు

    రిప్లయితొలగించండి
  22. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,



    నవ వధు వైన సీత పయన౦బయి యొక్క ద్విచక్రవాహనా

    న వెడలె | నయ్యొ ! యామె చరణద్వయి , దుర్ఘటనమ్ము స౦భవి౦

    ప వికల మయ్యె | సా౦త్వ మిడి భర్తకు " నీవు పునర్వివాహ మొ౦

    ద వలయు ". న౦చు వేడుకొనినన్ విని యాతడు శీఘ్రమే పున

    ర్వివహము నొ౦దె | చక్కని వివేకము శీలము గల్గినట్టి రె౦

    డవ సతి మ౦చిసేవల నొనర్చెను వారల | కట్టి వేళలో :--

    సవతిని గా౦చి సీత కడు స౦తస మ౦దెను మెచ్చి నెమ్మదిన్

    { సా౦త్వ మిడి = ఓదార్చి : వివహము = వివాహము : }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      ఆధునిక సీతపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. నవ వధువైన జానకి వినమ్ర శిరస్కగ వెంబడించ రా
    ఘవుడు పురమ్ములో జనని కైకకు మ్రొక్కగ నామెయున్ సుఖీ
    భవ యని యాశిషమ్ము లిడి భద్ర మటంచును పల్క నత్తకున్
    సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నెమ్మదిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      'అత్తకు సవతి'ని ప్రస్తావించిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. చాలా చక్కని భావనతో మనోజ్ఞంగా వ్రాసారు సర్...

      తొలగించండి
  24. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం:: జనక మహారాజు యజ్ఞం చేయడానికి భూమిని దున్నుచుండగా ఉద్భవించి, శివధనుస్సును యెక్కుపెట్టిన శ్రీరాముని భర్తగా వరించి, తండ్రియైన దశరథుని మాటకోసం వనవాసం చేయదలచిన తన భర్తను యెన్నడూ వదలిపెట్టకుండా, భర్తతోపాటు తాను కూడా అడవికి వెళ్లి, గుహుని మాటననుసరించి, గంగానదిని దాటగోరి, గౌరీదేవికి సవతియైన గంగను చూస్తూ, సీతాదేవి యెంతో సంతోషపడింది. అని చెప్పే సందర్భం.

    అవని జనించి జానకిగ, నా శివకార్ముక మెత్త రామునిన్
    ధవునిగ గాంచి, యెన్నడును దాశరథిన్ విడనాడకుండ, సం
    స్తవమతి కాన కేగి, నది దాటగ నెంచి గుహోక్తి , గౌరికిన్
    *సవతిని గాంచి, సీత కడు సంతస మొందెను మెచ్చి నెమ్మదిన్.*

    కోట రాజశేఖర్ నెల్లూరు.

    రిప్లయితొలగించండి
  25. అవనిజనుల కాహారము
    సవనమువలె నందజేయు సన్నాహమునన్
    భువికేతెంచిన గిరిజా
    సవతినిగని సీత మిగుల సంతసమొందెన్

    సీత = నాగేటిచాలు

    చక్కగా భూమిని దున్నిన పిదప వర్షము వస్తే సంతోషమేగా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గిరిజా సవతి' దుష్టసమాసం. "గిరిజకు సవతిని" అనండి.

      తొలగించండి
  26. శివుని ధనుస్సు తా విరువచెందె ముదమ్మునుతల్లులెల్లరున్
    భువనములే నుతించగను భూమిజజేకొని రానయోధ్యకున్
    ప్రవిమల చిత్తయై మురిసె భామిని రాముని తల్లియామెకున్
    *సవతిని గాంచి, సీత కడు సంతస మొందెను మెచ్చి నెమ్మదిన్.*

    రిప్లయితొలగించండి
  27. శివధనువు విరిచె రాముం
    డవనిజ బెండ్లాడె మిగులనానందముగన్
    దివినాడునచ్చర విలా
    సవతినిగని సీత మిగుల సంతసమొందెన్

    రిప్లయితొలగించండి
  28. శివుని ఘన తేజము వడం
    గ వారి నిడ ననుమతించి గౌరి శరవణో
    ద్భవునిఁ దనయునిగ నీయఁగ
    సవతిని గని సీత మిగుల సంతసమందెన్

    [సీత =గంగా దేవి]


    వివిధ సుఘోర వాక్కులను భీతిలఁ జేయ మహోగ్ర రక్కసుల్
    కవిసి యిలాతనూజ నటఁ గందుచు నుండఁగ నంత స్వప్నపుం
    బ్రవిమల గాథ నంతయును బల్కిన యా త్రిజటా సతిన్ విలా
    స వతినిఁ గాంచి సీత కడు సంతస మొందెను మెచ్చి నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  29. అవిరళ హాయిబొందుచు విహారమునన్ పతి రామచంద్రుతో
    యవనిజ కౌగిలింతల సుహాస వికాస ప్రకాశమందునన్
    వివిధ సుఖాల దేలుచు ప్రవీణత,స్నానము గోర పార్వతీ
    సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నమ్మదిన్

    రిప్లయితొలగించండి
  30. మైలవరపు వారి పూరణ

    నవ ఘన నీల దేహుడదె నవ్వుచునుండెను రామమూర్తి , దా
    నవపతి మా దశాస్యుని గనన్ మరణించెనటంచు స్వప్నమున్
    వ్యవసిత బుద్ధిఁ బల్కు త్రిజటాఖ్యను , నుత్తమ రాక్షసీ విలా...
    సవతిని గాంచి సీత కడు సంతసమందెను మెచ్చి నెమ్మదిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  31. ఎవరివి నీవనియడుగకు?
    భువి నేలెడి రాజుయన్న ?భూపతి యేగా|
    కవులకు దెలియద?పుత్రిక
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్|
    2.అవిరళ శాంతచిత్తుడు దయామయ|భూపతి రామచంద్రకున్
    సవతినిగాంచి సీత కడుసంతస మొందెను|మెచ్చె నెమ్మదిన్
    పవనసుతుండు భక్తియును,బాధ్యత లందున లక్ష్మణుండుతో
    దివివరు లెంచు దీప్తి గన?తృప్తియు సాకగ?సంతసంబునన్ {భూపతి=భూమికిభర్త|గనుక}

    రిప్లయితొలగించండి
  32. అవతారాంతము నందున
    నవనిజనే తన దరికిని నాహ్వానింప
    న్నవనియె కడు వేడుకతో
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్.
    ***)()(***
    (శ్రీదేవి,భూదేవి సవతులు కద !కాదా?)

    రిప్లయితొలగించండి
  33. యవనీ తలమున నిద్దరు
    సువధాన కళలకునెపుడు సునయన మగుదుర్
    భువనైకనోద్ధత రమా
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్
    గురువు గారికి వందనములు. తిరుపతి వేంకట కవులు
    కొప్పరపు సోదర కవులు ఇలా జంట కవులు అవధాన విద్యకు కళ్ళు లాంటి వారు.ఈ జంటకవులకు ఒకరిపై ఒకరికి అభిమానము గలదు.సవతుల లాగా తగవు ఉన్నట్లు చరిత్ర గలదు.ఈ భావమును వృత్తములో పూరించి విఫలు డై నాను.మీరు సవరించిన నా పూరణలకు మరొక్కమారు నమః పూర్వక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  34. శ్రీరాముని పట్టాభిషేక సమయమున........

    ప్రవిమల శాంతమూర్తి రఘు రాముని ప్రక్కన నిల్చి రాజ్య వై
    భవ సముదాయమండలిని పండిత పామర దేవ సన్మునుల్
    ధవుఁడవు గమ్ము నీవునిక ధాత్రికిఁ రామ యటంచు బల్కఁగాఁ
    సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  35. నవశోభలు, మదనము నం
    దు,వేసవి తరుల ఛాయ.తొలకరి,శర
    న్నవకౌముది,కృతయుగ
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్

    రిప్లయితొలగించండి
  36. ధవునిది బాణమొక్కటని దప్పని మాటయు నొక్కటే యనన్
    చివరకు నొక్క కాంత నెద జేర్చెడు వాడుగ తన్ను దీర్చి జాం
    బవమున నశ్వమేథమున పావనమంద సువర్ణ రూపమౌ
    సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  37. ధవుడటనశ్వమేథనము తద్దయు ప్రీతిని చేయుచుండగా
    ప్రవిమలమైన జానకియు, బాధనుపొందగఁ గాంచి మౌనితా
    వివరణమిచ్చె భూమిజకు, వేలిమియందున పైడి బొమ్మదౌ
    సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నెమ్మదిన్

    రిప్లయితొలగించండి
  38. అవనిజ వివాహ వేళల

    శివునర్ధాంగిని కొలుచుచు శివమును కోరెన్

    శివసతి చెంతనె గల సతి

    సవతిని గని సీత మిగుల సంతస మందెన్.


    భవనము వీడిన మైథిలి

    జవమున పతితోడ తాను సాగెను వనికిన్
    నవపర్ణ శాల యందు ర
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్.
    ధవునెదపైన సిరి తా
    నెవరినిగనికినిసె చెపుమ,నిలజయు నటతా
    లవకుశులనుగని మదిలో
    సవతిని గని సీత మిగుల సంతస మందెన్.

    రిప్లయితొలగించండి
  39. నవనవలాడు యౌవనము నాట్యము జేయగ రాముజూడగా
    కువలయనేత్ర వెంటబడి క్రుళ్ళుచు త్రుళ్ళుచు చంపబోవగా
    చివరకు నాస వీనులను చీరిన మోమున కుందునా విలా సవతిని గాంచి సీత కడు సంతసమొందెను మెచ్చి నెమ్మదిన్

    రిప్లయితొలగించండి