2, డిసెంబర్ 2017, శనివారం

సమస్య - 2534 (శ్రీరాముం డపహరించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శ్రీరాముం డపహరించె సీతాదేవిన్"
(లేదా...)
"సీతను దొంగిలించెఁ గద శ్రీరఘురాముఁడు దండకాటవిన్"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

91 కామెంట్‌లు:

 1. సరోదార చరిత్రను.
  శ్రీరాముం డపహరంచె సీతాదేవి
  న్నారామ తనదటంచును
  నారీమణి మనసుదోచి నయశోభితుడై

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సార్! నమస్సులు!
   మొదటి పాదం లఘువుతో ప్రారంభమైనది...

   తొలగించండి
  2. నమన్తే శాస్త్రి గారూ అది టైపో సారొదార సరోదార కాదు మీ సూచనకు కృతజ్ఞతలు

   తొలగించండి
  3. ప్రసాద రావు గారూ,
   సీతను ఆమె మనస్సుతో పాటు రాముడు అపహరించాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. ఆరాధితసీతాపతి
  శ్రీరాముం;డపహరించె సీతాదేవిన్
  క్రూరాత్ముడు; లంకాపతి;
  దారుణముగ రావణుండు దైత్యుం డీర్ష్యన్.

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. గారాబు సోదరికి బహు
   ఘోరపరాభవ మొనర్చ ఘూర్ణితమతియై
   యారావణుండు పగతుడు
   శ్రీరాముం డపహరించె సీతాదేవిన్

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శాత్రవ శ్రీరాముండు' (శత్రువుగా రాముడు కలవాడు) అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా! అద్భుతమైన సవరణ!ముందు ద్వేషిత శ్రీరాముండు అనుకొంటిని,కాని తప్పగునేమోనని సందేహించి పగతుడంటిని.

   తొలగించండి
 4. ఆ రాజర్షికి చెంతన
  శ్రీరాముని లక్ష్మణుడను శ్రీకరముంగ
  న్నా రహదారిన గాంచగ...
  శ్రీరాముండపహరించె సీతాదేవిన్!

  ...from RK Narayan's "RamayaNa" ...page 24 (following Kamba RamayaNa)

  రిప్లయితొలగించండి
 5. గారవమున గురువాజ్ఞకు
  శ్రీరాముం , డపహరించె సీతాదేవి
  న్నారావణు డహం కృతిని
  వీరుడు రాఘవుడు నరికె వేయిశిరస్సుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గురు గొల్చెను శ్రీరాముండు...' అనండి. వేయి శిరస్సు లెక్కడివి? పదే కదా! "నరికె విమతుని శిరముల్" అంటే ఎలా ఉంటుంది?

   తొలగించండి
  2. అవునుకదా ! ఈ మధ్య నాకేదో మతి పోయింది [ అసలుంటేగా ]
   ------------------------------
   గారవమున గురు గొల్పెను
   శ్రీరాముం , డపహరించె సీతాదేవి
   న్నారావణు డహం కృతిని
   వీరుడు రాఘవుడు నరికె విమతుని శిరముల్

   తొలగించండి
 6. ప్రీతిగ కోరెరా వణుడు బిచ్చము నెత్తెడి మాయవే షమున్
  సీతను దొంగిలించెఁ గద , శ్రీ రఘురాముఁడు దండకాటవిన్
  శీతల ఛాయలన్ మరచి శేముషి యాపెఱ వానిపై పగన్
  రాతను మార్చగోరి దశకంఠుని మారణ కాండ నెవ్విధిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   కొంత అన్వయదోషం ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 7. ఏరాలంబుగ మనసుల్
  శ్రీరాముం డపహరించె, సీతాదేవిన్
  ధారాళముగ జిలేబీ,
  మా రాముని సాటి యెంత మాత్రము గలరే !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. కారణ జన్ముండు గదా
  "శ్రీరాముం డ,పహరించె సీతాదేవిన్"
  ఘోరాటవి లోన కపటి
  యారావణుడు యతి వోలె నాశ్రమమందున్

  రిప్లయితొలగించండి
 9. కవి మిత్రులకు నమస్కారములు గురువు గారు ఈ రోజు బ్లాగులో నేను వ్రాసిన చిత్రమాలిక (ఘటిక యంత్ర చిత్ర రాజము)బంధము వుంచినారు. వారికి ధన్యవాదములు. పరిశీలించి మీ అభిప్రాయములు తెలియ చేయవలసినది.

  రిప్లయితొలగించండి

 10. ఆతడు రావణుండు! తన యామి యవజ్ఞకు మారువేషమున్
  సీతను దొంగిలించెఁ గద, శ్రీరఘురాముఁడు దండకాటవి
  న్నాతురతన్ కురంగమును నాతుకకై వెనుకాడుచుండగన్!
  హా! తరమా జిలేబి విధి హాతువు తీరును మార్చగన్ సుమీ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యామి, హాతువు' పదాల అర్థాలకోసం ఆంధ్రభారతి తలుపు తట్టవలసి వచ్చింది సుమా!

   తొలగించండి
 11. ఆ రమణి జానకి పతియె
  శ్రీరాముం, డపహరించె సీతా దేవిన్
  క్రూరుం డగు దనుజుడు తా
  ఘోరాటవినుండి గాదె కుటిలాత్ముండై

  రిప్లయితొలగించండి
 12. మైలవరపు వారి పూరణ

  ఆ రావణుడట బనిపియు
  మారీచుని కనకహరిణమన , సీతయు దా
  గోరగ, విలుగొని యేగగ
  శ్రీరాముం డ ., పహరించె సీతాదేవిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూతచరిత్రుడై , పురుషపుంగవుడై, పితృవాక్య పాలనా
   ప్రీత మనస్కుడై , వనిఁ జరించి , వసించియు పర్ణశాల, భూ..
   జాతను ప్రాణతుల్య యనఁ జక్కగ జూచుచుఁ , జిత్తవృత్తితో
   సీతను దొంగిలించెఁ గద శ్రీరఘురాముఁడు దండకాటవిన్"

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 13. ఆరాధ్య దైవ ము గదా
  శ్రీరాము o;డప హరించె సీతా దేవి న్
  క్రూరు oడాలంకే శుడు
  చోరుని వలె వేష మూ ని చొరబడి కాన న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 14. గురువు గారికి నమస్సులు.శుభోదయం.
  మారుడు కొలిచిన దెవరిని?
  ధీరమణుడు దీపిత మయె దేని వలనన్?
  శ్రీరమ్యంబగు స్త్రీ యే
  శ్రీ రామండపహరించె సీతా దేవిన్.
  రెండవ పాదమునకు శ్రీకృష్ణుడు వె న్న ను ,గోపికలచీరల నపహరించి దీపిత మయినాడ ని నా భావము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం చివర గణదోషం. "దేని వలననో" అనండి.

   తొలగించండి
 15. సారస నేత్రి కుజ మదిన్
  శ్రీరాముండపహరించె, సీతాదేవిన్
  మారీచుని సాయముతో
  చోరునివలె రావణుండు చూరాడెనహో!!!

  రిప్లయితొలగించండి
 16. శూర్పణఖ సీతమ్మ తో:

  మారుని మించుచు నామది
  శ్రీరాముం డపహరించె సీతా! దేవిన్
  తీరుగ నౌదును వానికి
  నేరుపుమా! తగదటన్న నిన్నిట వదలన్.

  రిప్లయితొలగించండి
 17. ఈనాటి ఆకాశవాణి వారి సమస్యాపూరణం కార్యక్రమంలో మన సమూహంలోని క్రింది మిత్రుల పద్యాలు, పేర్లు చదువబడ్డాయి.
  బొగ్గరం ఉమాకాన్త ప్రసాద్
  చంద్రమౌళి సూర్యనారాయణ
  గుఱ్ఱం జనార్దన రావు
  బండకాడి అంజయ్య
  గుఱ్ఱం సీతాదేవి
  కంది శంకరయ్య
  మాచవోలు శ్రీధర రావు
  కె. ఈశ్వరప్ప
  కొనకళ్ళ ఫణీంద్ర రావు
  డా. బల్లూరి ఉమాదేవి
  గండూరి లక్ష్మినారాయణ
  నేదునూరి రాజేశ్వరి
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి
  జిలేబీ
  చంద్రమౌళి రామారావు
  .........
  అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. వావ్ !

   వచ్చే వారం కైపద మేమిటండి కంది వారు ?

   జిలేబి

   తొలగించండి
  2. అంతా మనవాళ్ళే! చాల సంతోషం!

   గురుదేవా!అంతా మీ ప్రోత్సాహము,మార్గదర్శనము వల్లనే!మీకు శతాధిక వందనములు!ధన్యవాదములు!

   తొలగించండి
  3. ఆకాశవాణి సమస్యకు నాపూరణ

   మెరుగుపరచ జనుల మరుగుసౌకర్యమ్ము
   స్వచ్ఛభారతమ్ము సాధనమ్ము
   పల్లెపట్టులందు మల్లెవంటి పరిస
   రాలగాంచ జీవితాలు వెలుగు!

   తొలగించండి
  4. కంది వారు ఉవాచ:

   ఆకాశవాణి, హైదరాబాదు వారి క్రొత్త సమస్య....

   *"అద్ది సువర్ణమాలికయె యైన ధనుల్ గొనరైరి నేడిటన్"*

   తొలగించండి
  5. "నేడిటన్", "గాయిటన్"...

   రెండింటినీ పూరణలో పేర్కొనుట మంచిదేమో!!!

   తొలగించండి
  6. శాస్త్రి గారూ,
   నేడిటన్, గా యిటన్... రెండింటిలో ఏది సరైనది? నేను సరిగా వినలేదనుకుంటాను.

   తొలగించండి
 18. చేతన పొంది శంకరుని జీవితమంతయు పూజసేయుచున్
  రీతిని దప్పెనో నసుర రేడుగ రావణు,మోహలాలసన్
  సీతను దొంగిలించెగద! శ్రీరఘురాముడు దండకాటవిన్
  ప్రీతిచరించునప్పుడు,పరీత విచంచల దుష్టభావనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అసుర రేడు' దుష్టసమాసం. అక్కడ "..దప్పె రాక్షసుల రేడుగ..." అనండి.

   తొలగించండి
 19. డా.ఎన్.వి.ఎన్.చారి.9866610429
  నీతిని మాలి దానవులు నిత్యము సజ్జన సాదు సంతులన్ వధిం
  చన్ తన ఘోర బాణ హతిఁ జంపుచు నుండగ రాక్షసావళిన్
  ప్రీతిగ మ్రొక్కు తాపసుల ప్రేమయె గాదె ! రాక్ష సో
  సీ ! తను దొంగిలించెఁగద శ్రీ రఘ రాముడు దండకాటవిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే.
   కాని... మొదటి పాదం చివర గణదోషం, రెండవ పాదంలో ప్రాస తప్పింది. 'రాక్షసోసీ!' అనడం సాధువు కాదు.

   తొలగించండి
 20. *సీతయె కోరగా పసుపు జింకను రాముడు దానివేటకై*
  *ప్రీతిమ నస్కుడై వెడలె వెంటనె తమ్ముడు వెంటబోవగా*
  *గీతను దాటసీత యతి కీయగ భిక్షను వాడరాతియై*
  *సీతను దొంగిలించెగద!!శ్రీరఘు రాముడు దండకాటవిన్*
  *భీతిని జెంది శోకిలెను వేదన జెందుచు సీతజాడకై*

  *తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష*

  రిప్లయితొలగించండి
 21. 02-12-2017 నాటి
  హైదరాబాద్ ఆకాశవాణి వారి సమస్యకు పూరణ:
  సమస్య : "అద్ది సువర్ణ మాలికయె యైనధనుల్ కొనరైరి గాయిటన్ !"
  ***)()(***
  పూరణ:
  పద్దెమునే సువర్ణముల బంగరు హారము రీతి నల్లినన్
  ముద్దుగ వీనులన్ దగిలి మోదము గూర్చదె హాయిహాయిగన్ !
  కొద్దిన నైన భావుకత కోరని నేరని వాడు మెచ్చునే ?
  "అద్ది సువర్ణ మాలికయె యైనధనుల్ కొనరైరి గాయిటన్ !"
  ****)()(****
  (పెద్దలకు చెప్పవలసినదేమున్నది? సువర్ణములు = మంచి అక్షరములు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్కని పూరణ!అభినందనలు!ఈ వారం సమస్యనందించినందుకు ధన్యవాదములు!

   తొలగించండి
  2. బాగుంది. 'కొద్దిగనైన...' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి


  3. సుద్ధుల చెప్పి రయ్య సయి చుక్కల చూపి ప్రభుత్వమెల్లెడన్,
   మద్దెల మోతలన్ కొనుడు మన్నిక గోల్డును బాండ్లరూపమై,
   యద్ది సువర్ణ మాలికయె యైన ధనుల్ కొనరైరి గాయిటన్,
   ముద్దుగ యర్ధహారముల మూటలగట్టి జిలేబులయ్యిరే !

   జిలేబి

   తొలగించండి
 22. ఆ రావణుడే కోరియు మారీచుని జింక రూప మాయలతో; నే మారియు వెదుక జనగ శ్రీ రాముండ ;పపహరించె సీతాదేవిన్.

  రిప్లయితొలగించండి
 23. భంగ్యంతర పూరణ: ******* మారియు జింకగ నీచుడు మారీచుడు సీతయొక్క మదినేమార్చన్ ఆరావణుడు; వెదుక జన శ్రీ రాముండ; పహరించె సీతాదేవిన్

  రిప్లయితొలగించండి
 24. ప్రత్యామ్నాయ పూరణ : * *************************ఆరుక్మిని నొప్పించియు నా రుక్మిణి నపహరించె నౌరా హరియే ! యా రాజును మెప్పించియు శ్రీ రాముండపహరించె సీతాదేవిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ త్రివిధ పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 25. వీరుండై సతిగ గొనగ
  శ్రీరాముం, డపహరించె సీతాదేవిన్
  చొరుండై లంకేశుడు
  ఘోరాజినిగూలె తుదకు కుములుచు నేలన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  ఆలమందు నబద్ధము నాడి , ధర్మ
  జుండు కుంజరమునె తాను జూచితనియె
  కాంత తనదైన , కడతేర్చు కాలమున న
  సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి

  రిప్లయితొలగించండి
 26. కోట రాజశేఖర్ గారి పూరణ

  సందర్భం :: వాలి రెండవమారు సుగ్రీవునితో యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నప్పుడు, తార వాలికి ప్రాణాపాయం కలుగుతుందని భయపడింది. అప్పుడు వాలి ఓసీ! శ్రీ రఘురాముడు సర్వభూతహితుడు, సర్వరక్షకుడు, జ్ఞాని, పూజ్యుడు, తన సుగుణములచేత మునుల మనసులను, అలాగే నా మనసును ఆకర్షించిన ధర్మమూర్తి. అందువలన పాపపుపనులు చేయడు. నన్ను చంపడు. అని ధైర్యం చెబుతున్న సందర్భం.

  పాతక మెట్లు జేయు *రఘువర్యుడు*? *చంపడు నన్ను.* *తార!* యా
  *భూతహితుండు, రక్షకుడు, పూజ్యుడు, జ్ఞానియు, ధర్మమూర్తి* నా
  చేతము దొంగిలించె, మునిచిత్తములన్ గుణరాశిచేత నో
  *సీ! తను దొంగిలించె గద, శ్రీ రఘురాముడు దండకాటవిన్.*

  *కోట రాజశేఖర్ నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
 27. కారడవి కేఁగి వడి నిం
  ద్రారి దనుజ గణ విభుఁడు దశాననుఁ డంతన్
  సారంగముఁ బట్టం జన
  శ్రీరాముం డపహరించె సీతాదేవిన్


  నాతుక రెచ్చఁ గొట్టగను నైరృత నాథుఁడు రావణుం డటన్
  సీతను దొంగిలించెఁ గద, శ్రీరఘురాముఁడు దండకాటవిన్
  భ్రాతను లక్ష్మణున్నునిచి పాఱెడు జింకను వెంబడించగన్
  భీతిలి సీత పంపగను వీరుఁడు లక్ష్మణుఁ డేగి నంతటన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు సర్వ శ్రేష్ఠంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 28. చూతును గాదె! వాని మరి సూటిగ చూపులు వాడి తూపులై
  ఘాతములయ్యె నాకునవి కావున వానిని కట్టబెట్టగన్
  జేతును విన్నపమ్ము కుజ! చెల్లదనన్ విడ నాదు చిత్త మో
  సీ! తను దొంగిలించెఁ గద శ్రీరఘురాముఁడు దండకాటవిన్!

  రిప్లయితొలగించండి
 29. మారీచుని వెంటాడగ
  శ్రీరాముం, డపహరించె సీతాదేవిన్
  మారగు రూపము తోడుత
  నారావణుఁ డా కశపు ప్రయానములోనన్

  రిప్లయితొలగించండి
 30. భ్రాతకు ముప్పువచ్చెనని బంపగ లక్ష్మణుడెళ్ళె గీతతోన్
  గీతనుదాటి బిక్షమిడ గిఱ్ఱున రావణుడున్ ప్రకోపమున్
  సీతను దొంగిలించెగద! శ్రీరఘురాముడు దండకాటవిన్
  ఘాతక రాక్షసున్ దునిమె కాన్చగ నయ్యది నాటకంబనిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామమోహన్ గారూ,
   ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు? సంతోషం!
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లక్ష్మణు డెళ్ళె, ప్రకోమున్' అనడం సాధువు కాదు. "లక్ష్మణు డేగె, ప్రకోపియై... నాటకంబుగా" అనండి.

   తొలగించండి
 31. యాతువు రావణుండు తన యర్మిలి చెల్లెలు చుప్పనాతిచే
  సీత పునీత యందము విశేషముగా విని వర్ణలింగియై
  సీతను దొంగిలించెనట.శ్రీరఘురాముడు దండకాటవిన్
  కోతులగూడి,రావణుని గూల్చె నయోనిజ దెచ్చె క్రమ్మరన్

  రిప్లయితొలగించండి
 32. ప్రీతిని కౌశికున్ దగిలి భీతిల జేసెడు యాతుధాన సం
  ఘాతములన్ హరించి ముని గౌతము పత్నిని బ్రోచి తాపస
  వ్రాతపు చిత్తపద్మముల వాతిగ, పోవుచు కేలు బట్టగా
  సీతను, దొంగిలించెఁ గద శ్రీరఘురాముఁడు దండకాటవిన్.

  ( వాతి = సూర్యుడు )

  రిప్లయితొలగించండి
 33. lప్రేరేపిత స్వయంవర
  ధీరుడు కోదండ మెత్త?దశ దిశ బెరుగన్
  కోరిక మనసున ,మనసును
  శ్రీ రాముండపహ రించె సీతా దేవిన్

  రిప్లయితొలగించండి
 34. గాతిని గొంచు బంగరపు గాత్రముతోడుతఁ గానుపించు నా
  జాతిమృగమ్ముఁ దెమ్మనుచు జానకి కోరగ రాము డేగగా
  నీతినిజాయితీ విడిచి నీచతతోడుత రావణుండు తా
  సీతను దొంగిలించెఁ గద, శ్రీరఘురాముఁడు దండకాటవిన్
  ఘాతకుడైన రక్కసు నకార్యము కన్గొని దుఃఖమొందెడిన్

  రిప్లయితొలగించండి


 35. నారాయణుడే గనుమా

  శ్రీరాముండ;పహరించె సీతాదేవి

  న్నారావణాసురుండట

  వీరుండగురాము చేత వీడెన సువులన్.


  మారీచుని వెంట పడగ

  శ్రీరాముండ;పహరించె సీతాదేవి

  న్నారక్కసుండు వనితయు

  జీరుచు నుండగ  జటాయు జీవము దీసెన్.


  మాతయు నానతివ్వ చనె మానిని తోడను రామచంద్రుడున్

  జాతుడు లక్ష్మణుండు  నట సాగ వనంబున దైత్యుడచ్చటన్

  సీతను దొంగలించె గద!శ్రీరఘురాముడు దండకాటవిన్

  నాతిని కానకన్ తిరిగె నల్దిశలన్ మది నార్తినిండగన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "జాతుడు లక్ష్మణుండు"...?

   తొలగించండి
 36. కోట రాజశేఖర్ గారి రెండవ పూరణ

  నీతిని వీడి, రావణుడు నింద్యుడునై, యతివేషధారియై,
  *సీతను దొంగిలించె గద ; శ్రీ రఘురాముడు దండకాటవిన్*
  పూతచరిత్రకై వెదకి, పూజ్య జటాయు వరోక్తి నెంచుచున్,
  భీతుని రావణాసురుని, వేగ వధింపగ నెంచె నుగ్రుడై.

  *కోట రాజశేఖర్ నెల్లూరు*

  రిప్లయితొలగించండి
 37. పాతకకార్యమగ్నుడశుభంబని యెంచక రావణుండు దా
  సీతను దొంగిలించెఁ గద , శ్రీరఘురాముఁడు దండకాటవిన్
  ప్రీతినొనర్చు భార్య కనిపింపక దుఃఖితుడయ్యె బేలయై !
  నాతియె పూరుషాళికిల నమ్ముడు ధైర్యము తోడునీడయౌ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 38. సవరించిన పద్యంతో పాటు మరో రెండు పద్యాలు.

  సవరించిన పద్యం సరిపోయేందేమో పరిశీలించగలరు.

  మాతయు నానతివ్వ చనె మానిని తోడను రామచంద్రుడున్

  ప్రీతుడు లక్ష్మణుండు నట వీడక నుండ మృగమ్ముకై చనన్

  సీతను దొంగలించె గద!శ్రీరఘురాముడు దండకాటవిన్

  నాతిని కానకన్ తిరిగె నల్దిశలన్ మది నార్తినిండగన్.


  వీరుండై విలువిరువగ

  వీరత్వము చూసినట్టి వెలదియు మదిలో

  కూరిమి చూప కనులతో

  శ్రీరాముండ;పహరించె సీతాదేవిన్.


  మారీచు నెవరు చంపిరి

  యారావణుడేమి చేసె నడవుల యందున్

  క్రూరపు బుద్ధిని చూపుచు

  శ్రీరాముండ;పహరించె సీతాదేవిన్.

  రిప్లయితొలగించండి
 39. కోతలు కోయబోకుమిట కుర్సిని కూచొని పృచ్ఛకాథమా!
  పాతక రావణాసురుడు భాసిలు సాధుగ రూపు మార్చుచున్
  సీతను దొంగిలించెఁ గద;...శ్రీరఘురాముఁడు దండకాటవిన్
  వేతను నోర్చుచున్ వెదకి వేసరి గాంచె జటాయునచ్చటన్

  రిప్లయితొలగించండి