చదువు విధానము -
ఆకుపచ్చ రంగు చేపలోని కన్నువద్ద గల (ప) తో మొదలు బెట్టాలి. తోక దగ్గిర భక్తుల తోటి ఆపి భక్తుల కోర్కె దీర్చుమా అని చదువు కోవాలి. ఆవిధముగా గులాబీ రంగు, కాషాయరంగు చేపల లోని అక్షరాలు చదువు కోవాలి. అప్పటికి మూడు పాదాలు అవుతాయి. చివరిగా వృత్తములోని కరివదనుండ అని చదువు కోవాలి. దీనిలో విశేషము 3 పాదములలోని చివరి అక్షరము (మా) ఆఖరి పాదములో 3 సార్లు వస్తుంది.
పరుల దనూజుడా యరయు భక్తుల, భక్తుల గోర్కె దీర్చుమా
హరుని శరీరజా, జవురు యంగద, యంగద బాపి గాచుమా,
సురవర పూజితా యిడుము శోభను, శోభను జూపి యేలుమా,
కరి వదనుండ మా జనుల గాచుచు మాకు ప్రపత్తి నివ్వుమా.
భావము -
పార్వతి పుత్రా! భక్తులను రక్షించు. భక్తుల కోర్కె దీర్చు. శివుని పుత్రుడా! తొలగించు దు:ఖము. ఆపద బాపి కాచుము. దేవతల పూజిత! అందము నిడుము. కాంతి నిచ్చి యేలుమా. ఏనుగు ముఖము గలవాడ! మా ప్రజలను గాచి రక్షణ నిడుము.
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
కృష్ణ సూర్య కుమార్ గారు ముక్తపద గ్రస్తముతో మనోహరముగా నున్నది మీ విశ్వ ముఖ మత్స్య త్రయ బంధ చంపకమాల. అభినందనలు.
రిప్లయితొలగించండిపరుల తనూజుఁడా ( షష్టీ తత్పురుష సమాసములో ద్రుతము లేదు, గసడదవాదేశ సంధి రాదు.) ; జవురు మంగద, నంగదఁ బాపి; అనండి.
షష్ఠీ సమాసమునం దుకార ఋకారముల కచ్చు పరమగునపుడు నుగాగమం బగు.
తొలగించండికామేశ్వర రావు గారికి శత వందనములు మీ యొక్క అమూల్యమైన సలహాల కొరకు చకోర పక్షి లా నిరీక్షిస్తున్నాను. జవురు మంగద నంగద అన్నప్పుడు బంధము సరిపోవటములేదు. జవురు యార్తిని యార్తిని బాపి అని వ్రాయవచ్చా??? అలాగే పరుల గుమారుడా అనవచ్చా సెలవు ఇవ్వండి . ధన్యవాదములు
తొలగించండిజవురు మంగద నంగద లో “యం” నకు బదులు “మం” మరియు “యం” నకు బదులు “నం” వచ్చినపు డక్షరములలో తేడా యేమున్నది?
తొలగించండి“తనూజుఁడా” లేక “కుమారుఁడా” యేదైనా యన వచ్చు సరళము గా కూడదు.
జవురుము మధ్యమ పురుష క్రియ జవురుము సంకటము లో వలె హల్లు పరమైన ము లోపమయి జవురు సంకటము. అచ్చు పరమైన ము తో సంధియై జరువుమార్తిని యవుతుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఓహో యంగద రెండు సార్లు రావాలా!
తొలగించండిఅప్పుడు “జవిరి యార్తియ యార్తియ వాపి“ అనండి.
మత్స్య యంత్రాన్ని కొట్టిన మీకు అభినందన వందనములు..
రిప్లయితొలగించండిపూసపాటివారూ! శుభాభివందనములు! మీ విశ్వముఖ మత్స్యత్రయ బంధము చాలా బాగున్నది! చివరలో నిడుము (గణం సరిపోదు), నివ్వుము (వ్యావహారికం)... అనకుండా... నీయుము ...అంటే బాగుంటుంది. అలాగే గాచుమా బదులు కావుమా అంటే బాగుంటుంది. మరోమారు అభినందనలతో...
రిప్లయితొలగించండిDHANYVADAMULU MITRAMAA SARICHESTANU.
రిప్లయితొలగించండి