మిస్సన్న గారు నమస్సులు. అయాచిత సమీక్ష లనర్థ దాయకములు కదా! కోరిన వారికి నా శక్తి మేరకు వ్యాఖ్యానించఁ బ్రయత్నించెదను. అటులనే నాపూరణల నెవరు సమీక్షించినా కృతజ్ఞుడఁను.
సందర్భము :: నన్నయ తిక్కన ఎర్రన అనే కవిత్రయం మన తెలుగువారికి ఉన్నట్లుగానే , కన్నడదేశీయులకు *పంప , పొన్న , రన్న* అనే మహాకవులు ఉన్నారు. వారిలో *పంపకవి భారత కథను విక్రమార్జునవిజయము అనే పేరుతో రచించినాడు. ఇది పంప మహాభారతం అని ప్రసిద్ధి చెందింది. కాబట్టి భారత గ్రంథ నిర్మాణంలో నన్నయభట్టు వంటి వాడు అగు పంపకవి* కన్నడంలో మేటి కావ్యాన్ని రచించినాడు అని చెప్పే సందర్భం.
ఆదికవి శబ్దశాసను డాతడె గద
రిప్లయితొలగించండినన్నయ! ; రచించెఁ గావ్యముఁ గన్నడమున
నాగచంద్రుడు గద మల్లినాథుని కథ!
విరుపు తప్పలేదిట నాకు వీలు లేక 😂
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి* కన్నడము = కర్ణాటకము
తొలగించండి(ఆంధ్ర భారతి)
GPS vaarU ! sebhashh
రిప్లయితొలగించండిఏదో ఒక కిట్టింపు!
తొలగించండి🙏🙏🙏
మిన్నగ నాతడాదికవి మేటిగ వాగనుశాసనుండుగా
తొలగించండినన్నయభట్టు!; కన్నడమునన్ రచియించెను మేటికావ్యము
న్నెన్నగ నాగచంద్రుడను నీతడు గాథను మల్లినాథునిన్;
పన్నుగ వృత్తపద్యమును భళ్ళున వ్రాసితి నవ్వబోరొకో 😂😂😂
పద్యం బాగుందండీ.. పరుగు బాగుంది.. భావం బాగుంది.. ముగింపు బాగుంది.. అభినందనలు 🙏🙏
తొలగించండిరాదు రాదని బల్కుచు వ్రాసితీవు
తొలగించండిరమ్యమగు నొకవృత్తము రాణనొప్ప
తోక విప్పెదననుచును దోవతప్పి
మెప్పుబొందగ విబుధుల మిక్కుటముగ !
అభినందనలు!!
🙏🙏🙏
తొలగించండిమన్నిక మెచ్చ పండితులు మంజులశైలిని తెన్గుబాసలో
రిప్లయితొలగించండిగన్నులగట్టు వర్ణనల గమ్మగ వ్రాసెను భారతంబునున్
నన్నయభట్టు; కన్నడమునన్ రచియించెను మేటికావ్యమున్
పొన్నరికాన పంపకవి,పొన్నడు,రన్నడు భారతంబునే.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
కన్నడమున పంపన - తెలుగులో నన్నయ :
01)
_________________________
తెలుగు భారతమను నాది - దివ్యమైన
నన్నయ రచించెఁ గావ్యముఁ ; - గన్నడమున
వ్రాసి తెలుగు వాడైన పం - పనయె గాదె
వాసి కెక్కెను నాద్యుడై - భారతమును !
_________________________
కన్నడమున పంపన - తెలుగులో నన్నయ :
రిప్లయితొలగించండి02)
_________________________
చెన్నుగ వ్రాసె భారతము - చిక్కగ చక్కగ దెల్గు భాషలో
నన్నయభట్టు! కన్నడము - రచియించెను మేటికావ్యమున్
క్షుణ్ణము వ్యాసభారతము - గోవిదు లెల్లరు మెచ్చు రీతిగన్
పన్నుగ దెల్గువాడు కవి - పంపనయే గద వాసి కెక్కగన్ !
_________________________
02అ)
తొలగించండి_________________________
చెన్నుగ వ్రాసె భారతము - చిక్కని చక్కని దెల్గు భాషలో
నన్నయభట్టు! కన్నడము - రచియించెను మేటికావ్యమున్
క్షుణ్ణము వ్యాసభారతము - గోవిదు లెల్లరు మెచ్చు రీతిగన్
పన్నుగ దెల్గువాడు కవి - పంపనయే గద వాసి కెక్కగన్ !
_________________________
http://cherukuramamohan.blogspot.in/2017/06/blog-post_21.html
రిప్లయితొలగించండిhttp://telugusaahityam-tuurpinti.blogspot.in/2010/02/blog-post_21.html
తొలగించండివ్యాస కృత మైన సంస్కృత భారతము ను
రిప్లయితొలగించండితెలుగు కను వాద మును జేసి వెలు గ లే దె
నన్నయ ;రచించె కావ్య ము గన్న డ ము న
వన్నె చిన్న ల నొ లు క నా పంప కవి యు
భారతమ్మును తెనుగున బందురముగ
రిప్లయితొలగించండినన్నయ రచించెఁ, గావ్యముఁ గన్నడమున
పంపన కవీంద్రుడు లిఖించె సొంపుగాను
పోతన భాగవతమ్మును పొలుపుమీఱ
వ్రాసె కడు భక్తితో తెల్గు భాషలోన
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివ్యాస భారతమును తెన్గు బాసయందు
నన్నయ రచించె కావ్యము , గన్నడమున
తమిళమున నననేల ? నాధారమదియె!
వ్యాసమూలమ్ము సకలమౌ వాఙ్మయమ్ము !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కన్నులముందు తెల్గు నుడికారములొప్పగ తీయతీయగా
తొలగించండివెన్నెల గాచినట్లు , నులివెచ్చని భానుడు దోచినట్లుగా
నన్నయ వ్రాసె భారతము ! నవ్వునకంటివొ ? విస్మరించితో !
నన్నయభట్టు కన్నడమునన్ రచియించెను మేటికావ్యమున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
🙏🙏🙏
తొలగించండిమిన్నగ మైలవరపు వా
రెన్నగ పూరణలు రెండు రీతిగ నిచ్చిరే!
కన్నడ కవులన్నెన్నక
నన్నయ, వ్యాసులనె, గొల్చు నయగారమునన్ :)
మైలవరపు వారి స్పందన:
తొలగించండి👏👏👏🙏( నిచ్చిరే... అంటే గణదోషం... నిడిరే.. అంటే సరిపోతుంది)
🙏🙏🙏
తొలగించండిసవరించెదను మహాప్రభో!
రిప్లయితొలగించండిఆంధ్ర భారతమును రసమయ తెలుగున
నన్నయ రచించెఁ! గావ్యముఁ గన్నడమున,
నారణప్ప రచించెను; నాటి కథలు
మేటిగ నిలిచెను జిలేబి మెచ్చుకొనుమ!
జిలేబి
రిప్లయితొలగించండిమిన్నగ వ్యాస భారతము మేటిగ తెల్గున వ్రాసె నాతడే
నన్నయభట్టు! కన్నడమునన్ రచియించెను మేటికావ్యమున్
నెన్నగ షట్పదమ్మునట నేర్పుగ నాతడు నారణప్ప యౌ !
మన్నిక గాంచె గాధలవి మానవు లన్ తగు రీతి నిల్పగన్ !
జిలేబి
నారణప్ప - కుమార వ్యాసుడన్నది కలం పేరు ; వ్యాసభారతాన్ని భామినీ షట్ఫదములోన కర్నాట భారత కథా మంజరి గ కన్నడీకరించాడు(అసంపూర్తి గా పది యాశ్వాసాలు).
పెద్దలు పండితులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారు పూరణల గుణదోష పరిశీలన చేస్తే బాగుంటుంది.
రిప్లయితొలగించండిమిస్సన్న గారు నమస్సులు. అయాచిత సమీక్ష లనర్థ దాయకములు కదా! కోరిన వారికి నా శక్తి మేరకు వ్యాఖ్యానించఁ బ్రయత్నించెదను. అటులనే నాపూరణల నెవరు సమీక్షించినా కృతజ్ఞుడఁను.
తొలగించండిపన్నుగ నాల్గుపర్వములు భారతమున్ రచియించె తెల్గునన్
రిప్లయితొలగించండినన్నయభట్టు, కన్నడమునన్ రచియించెను మేటికావ్యమున్
మున్నుడి పంపడార్మిలిని, పొందెను ఖ్యాతిని దక్షినాదిలో
మిన్నగ వ్రాసె తిక్కనయు మిక్కిలి ప్రేముడి భారతమ్ము తా(శేషభాగమున్)
పఠన సేయగ పుష్పాల పరిమళముల
రిప్లయితొలగించండిగ్రోలునట్లు, యానందాబ్ధి దేలునట్లు ;
కవన మందమౌ కస్తూరిగ బిలువబడు;
నన్నయ రచించె గావ్యము ; కన్నడమున
కోట రాజశేఖర్ గారి పూరణ
రిప్లయితొలగించండిసందర్భము :: నన్నయ తిక్కన ఎర్రన అనే కవిత్రయం మన తెలుగువారికి ఉన్నట్లుగానే , కన్నడదేశీయులకు *పంప , పొన్న , రన్న* అనే మహాకవులు ఉన్నారు. వారిలో *పంపకవి భారత కథను విక్రమార్జునవిజయము అనే పేరుతో రచించినాడు. ఇది పంప మహాభారతం అని ప్రసిద్ధి చెందింది. కాబట్టి భారత గ్రంథ నిర్మాణంలో నన్నయభట్టు వంటి వాడు అగు పంపకవి* కన్నడంలో మేటి కావ్యాన్ని రచించినాడు అని చెప్పే సందర్భం.
మున్ను వెలుంగ ‘’పంప’’ కవి, ‘’పొన్న’’ యు, ‘’రన్న’’ *కవిత్రయమ్మనన్*
*కన్నడ మందు* , *పంపకవి గ్రంథము వ్రాసెను భారతమ్మునే*
*యన్నున విక్రమార్జున జయమ్మన* , భారత గ్రంథ నిర్మితిన్
*నన్నయభట్టు , కన్నడమునన్ రచియించెను మేటి కావ్యమున్.*
(అన్నున=పరవశమ్మున)
*కోట రాజశేఖర్ నెల్లూరు.*
ఎన్నగనెల్లవారలకునింపొన గూర్పగ భారతమ్మునన్
రిప్లయితొలగించండిపన్నుగ రెండుపర్వములు పర్వమునందున యర్థభాగమున్
మున్నల పంపనార్యుడును ముచ్చట గొల్పెడి రీతి వ్రాసెగా
నన్నయభట్టు , కన్నడమునన్ రచియించెను మేటి కావ్యమున్.*
భాషలవి చాల నేర్చెను బాగుగాను
రిప్లయితొలగించండినన్నయార్యుడు ముందుగా నాణెముగను
భారతమ్మును వ్రాసియు పరగ పిదప
నన్నయ రచించెఁ! గావ్యముఁ గన్నడమున,
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
చెన్నుగ నా౦ధ్ర మ౦దున రచి౦చెను భారతగాధ మున్ను శ్రీ
నన్నయభట్టు | కన్నడమునన్ రచియి౦చెను మేటి కావ్యమున్
పన్నుగ ప౦ప నార్యు | డిక భాగవతామృతమున్ మథి౦చి పో
తన్న ధరన్ గలట్టి జను ల౦దర కిమ్ముల ప౦చియిచ్చెగా
చివరి పాదంలో జనులందరికిన్ అని చదువలెను
రిప్లయితొలగించండివ్యాస భారతమ్మును మదిఁ బన్నుగఁ బరి
రిప్లయితొలగించండికించి కన్నడ సేనాని కృష్ణశాస్త్రి
ముద్దుగ వచనమున, యాంధ్రమున రచింప
నన్నయ, రచించెఁ గావ్యముఁ గన్నడమున
[ఆచార్య. అంబళి రామకృష్ణ కృష్ణ శాస్త్రి, కన్నడ కవి, కన్నడ సేనాని బిరుదాంకితుఁడు, కన్నడ వచన భారతమును వ్రాసి కీర్తి గడించెను]
పన్నుగ సంస్కృతమ్మునను వ్యాస మహర్షి కృపార్ద్ర చిత్తుఁడై,
నన్నయభట్టు, కన్నడ మునన్, రచియించెను మేటికావ్యమున్
సన్నుతమై చెలంగె నది సత్కవు లిర్వురు పూర్తి సేయగం
బెన్నిధి ధర్మశాస్త్ర మనఁ బృథ్విని దిక్కయి మానవాళికిన్
[కన్ను అడ మును అన్;
కన్ను+అడ = కన్నడ; కన్ను = జాడ, అడ = ఆకృతి/ స్వరూపము; మును+అన్ = మునన్: ముందు చెప్పగా, అన్ = అనఁగన్;
వ్యాస మహర్షి భారత కథ జాడయు స్వరూపమును ముందు చెప్పగా]
మూడుపర్వములాంధ్రాన ముచ్చటగను
రిప్లయితొలగించండినన్నయరచించె,గావ్యముగన్నడమున
వాహయనగనుగవులెల్లపంపకవి
సరళమగురీతిదనదైన శైలితోడ
దేశ భాషల భారత తీరుఁ దెలుపు
రిప్లయితొలగించండివ్యాసము పరీక్ష నందున వ్రాయ మనఁగ
నన్నయ రచించెఁ గావ్యముఁ గన్నడమున
ననుచు సోంబేరి యొకఁడు వ్రాసెనట 'చూచి'
(కాపీ కొట్టడం కూడ సరిగా రాని వెధవాయ్)
భారతమ్మును తెలుగున భవ్యముగను
రిప్లయితొలగించండినన్నయ రచించె, గావ్యము కన్నడమున
నారణప్ప రచించెను భారతమున
బంతిపర్వముల్, తిమ్మన వ్రాసె పిదప
నేడునొకటి పర్వమ్ములు వేడుకగను!!!
భాషయేదైన యందున్న భావమొకటె
రిప్లయితొలగించండితేనొలొలికెడు పలుకుల తెలుగుయైన
కమ్మని పరిమళమొదవు కన్నడైన
వ్యాస భారతమ్మునుగొని యాంధ్రమునను
నన్నయ రచించె కావ్యము,కన్నడమున
పంపన వెలయించె మిగుల ప్రాపుగొనగ!
కన్నడంలో చాలమంది భారతాన్ని రచించినటుల ఈరోజు తెలిసినది!ధన్యవాదములు!
(కాపీ కొట్టడం కూడ సరిగా రాని వెధవాయ్)
రిప్లయితొలగించండిఉ.
నిన్నిక నేమి చేయవలె నిక్కము నాకది తోచ కున్నదే ?
తిన్నగ నీదు పత్రమును దిద్దెడు వేళను చూచినాడ నే
నన్నయభట్టు కన్నడమునన్ రచియించెను మేటికావ్యమున్?
యున్నది చూచి వ్రాయుటకు నొప్పవె సోమరి యూరబందివో?
హ హ హ భలే తిట్టారండీ!!మీరు అధ్యాపకులా?
తొలగించండి"అన్నయతిట్లు తన్నడమునన్ వచియించెను మేటిశ్రావ్యమున్"
తొలగించండి😂😂😂
ఉమాకాంత ప్రసాద్ గారి స్పందన:
తొలగించండిఅన్నియు పూర్తిగా చదివి యబ్బురమందు జవాబు
వ్రాయమం
చన్నను వ్రాయనందులకె చయ్యన కోపము వచ్చినందుకే
"అన్నయ తిట్లు తన్నడమున్ పచియించెను మేటి శ్రావ్యమున్"
తన్నుట కందకున్న తన తాపము తగ్గెడి దారి దోచకన్.
తొలగించండిఏమండీ జీపీయెస్ వారు
ప్రపంచ "తెలంగాణ" మహా సభ ల గోలలో ఆకాశవాణి సమస్యా పూరణ హుష్ కాకీ అయిపోయినట్టున్నాది ;). ఇంతకీ వచ్చే వార సమస్య ఏమిటి ?
జిలేబి
గుఱ్ఱం జనార్దన రావు గారు ఉవాచ:
తొలగించండివిరించి గారు!ఈరోజు ఆకాశవాణి Hyderabadవారి సమస్య:
"లేదను వాడె దాత మఱి లేదని చెప్పని వాడె లోభియౌ"
నా పూరణ:
పేదల నాదరించి తగు ప్రేమను జూపుటె మానవత్వమౌ
వాదన లేవి జేయకనె పాత్రత నెంచియు దానమియ్యగన్
యేదియు నడ్డబోదు తన కించుక నైనను నడ్డుపాటుయే
"లేదను వాడె దాత మఱి లేదని చెప్పని వాడె లోభియౌ"
వ్హాట్సప్ లో ఆడియో లింకు దొరికినది కానీ నాకు బొత్తిగా వినపడ లేదు. మహా ఇబ్బంది ఈ లింకులు.
తొలగించండివినికిడి:
యథావిథిగా మన శంకరాభరణం కవులూ కవయిత్రులూ డామినేట్ చేశారట...నావన్నీ "ట ట ట" లే... "అహ నా పెళ్ళంట" :)
పద్యం నచ్చిన వారందరికీ ధన్యవాదములు.
తొలగించండిసీతాదేవి అక్కయ్యగారికి నమస్కారం. నేను జలవనరులశాఖ లో డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీరు గా పనిచేస్తున్నాను. 🙏🙏🙏🙏
తొలగించండివాదన కైన సూరి, రసవత్తర మైన పదమ్ము తో భళా
లేదను వాడె ; దాత మఱి లేదని చెప్పని వాడె ; లోభియౌ
మోదము చెందడమ్మ యడిమోహము వీడడు కాటిలోననౌ
రాధనమున్ జిలేబి మధురానుభవమ్ముగు పొందగన్ దగున్!
జిలేబి
.బారతమ్మును కొన్నియుభాగములను
రిప్లయితొలగించండినన్నయ రచియించె|”గావ్యము కన్నడమున
నవయుగ కుయంపొ|వ్రాసెనుభవత కొరకు
సోమనాథ ద్విభాషకు సుందరుండు|
వ్రాసె వాల్మీకి సంస్కృత రామగాథ
రిప్లయితొలగించండిభారతమునాంధ్రమునననువాదమున్ను
"నన్నయ రచించెఁ , గావ్యముఁ గన్నడమున "
వ్రాసె పంపన, నాద్యులే వీరలిట్లు
మన్నన పొందిన చరితను
రిప్లయితొలగించండిచెన్నుగ భారతకథ గొని జిలుగు తెనుగునన్
నన్నయ రచించె గావ్యము
గన్నడమున నంతటి సొగసులు కానను సుమ్మీ
ఎన్నియొ రోజులున్ గఱచి యేడుపు రాగను చేతకాకనా
రిప్లయితొలగించండినన్నయభట్టు కన్నడమునన్;... రచియించెను మేటికావ్యమున్
పన్నుగ నాంధ్రమున్ చదివి పాడుచు నాడుచు మూడు పర్వముల్
చెన్నుగ వ్యాస భారతము చేగొని నస్యము పీల్చుచున్నహా!