1, డిసెంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2533 (సత్యమును బల్కఁడఁట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి"
(లేదా...)
"సత్యమ్మున్ గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్"

86 కామెంట్‌లు:

  1. ధనము రాజ్యము గోల్పోయి దైన్యమునను
    సతిని పుత్రుని గోల్పోవు సమయమునను
    వక్ర బుద్ధిని చేకొని "శుక్ర నీతి
    సత్యమును" బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారూ,
      కొన్ని సందర్భాలలో 'బొంకవచ్చు నఘము వొంద దధిప!' అన్న శుక్రనీతిని హరిశ్చంద్రుడు పాటించలేదన్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  2. మేరువు తలక్రిందైనను మీద బడిన
    ధారుణి రజమై పోయిన దగ్ధమైన
    భీమ సేనుడె యోడిన బీరువునక
    "సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భీమసేనుడె యోడిన బీరువునకు' అన్నదానికి హరిశ్చంద్రుని సంబంధం?

      తొలగించండి
    2. శంకరయ్య గారు! ధన్యవాదాలు! మొదటి రెండు అసంభవాలవలె మూడవదీ అసంభవమే కదా!అసంభవాలు సంభవింప వచ్చునేమో కానీ హరిశ్చంద్రుడసత్యము.పల్కుట యన్నది జరగదని భావము.ఆర్యా ! ఒక మనవి. గయుని చంపితీరుతాని శ్రీ కృష్ణుడు చెప్పిన." ధరణీ గర్భము దూరుగాక......." పద్యమును ఒకపరి పరిశీలింప మనవి.పద్యం వ్రాసిన చిలకమర్తి వారు సామాన్యమైన పండితులు కారు కదా!

      తొలగించండి
    3. బాగుంది. సమర్థమైన పూరణ. వివరణకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. నిత్యమును వాడు కూటికై నియతితోడ
    సత్యమునుఁబల్కడట;హరిశ్చంద్ర నృపతి
    సత్యమే ధర్మమని నమ్మి సంచరించె
    కాటిలో తన వారలఁగాంచిఁగూడ

    రిప్లయితొలగించండి
  4. (విశ్వామిత్రుడు వశిష్టునితో)
    అహహ!శిష్యు హరిశ్చంద్రు నవధి దాటి
    యేల నీరీతి బొగుడుదు వింతతడవు?
    ప్రతిన గావించి పలికెద పట్టు విడుము;
    సత్యమును బల్కదట హరిశ్చంద్రనృపతి.

    రిప్లయితొలగించండి
  5. రాజ రికమే బోయిన రాటు దేలి
    జగతి ఖ్యాతిని గాంచిన చక్ర వర్తి
    కాటి సుంకము గోరగ మేటి సతి క
    సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "రాజరిక మది పోయిన..." అనండి.

      తొలగించండి
    2. రాజ రికమది పోయిన రాటు దేలి
      జగతి ఖ్యాతిని గాంచిన చక్ర వర్తి
      కాటి సుంకము గోరగ మేటి సతి క
      సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి

      తొలగించండి
  6. సత్య నిష్ఠగ నుండుట జనుల కిలను
    సాధ్య పడదన్న చెలితోడ సఖుడు పలికె
    సందియంబేల యిడుముల నందియైన
    సత్య! మును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సత్యను సంబోధనగా చేయడం బాగుంది. కాని ఏమి పల్కడట? అసత్యాన్ని అన్నది పేర్కొన బడలేదు. "యిడుముల నందియును న।సత్యమును బల్కడట..." అంటే బాగుండేది.

      తొలగించండి
    2. ఆర్యా!
      నమస్కారములు.
      నా అభిప్రాయము అసత్యము కాదండి. సత్యమనియే - మును పల్కడు? అట - పలికాడు కదా అనే భావం వస్తుందని అభిప్రాయపడ్డాను.

      తొలగించండి


  7. హరినట తరుముచు వెనుక హంతకుడట!
    కావుమని శరణననగ కష్టమట ! న
    సత్యమును బల్కఁడఁట! హరిశ్చంద్ర నృపతి
    వారసుడనని యనుకొనె పారుడు గద!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    ఆలు బిడ్డలనమ్మియు , నష్టకష్ట
    ములను పొందియు కుందక , భూవరుండు
    కాటికాపరి యైన యౌ ., గాని తాన...
    సత్యమును బల్కడట హరిశ్చంద్ర నృపతి !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నక్షత్రకుడు... హరిశ్చంద్రునితో....

      నిత్యమ్మీ వ్యథ యేల ? యివ్వననుమా! నీకింక కష్టమ్ము లే...
      దత్యానందము గల్గు , రాజ్యమును భార్యాపుత్రులున్ దక్కెడిన్ !
      సత్యమ్మేమిడె నీకు ? లోకులన నష్టంబేమి ? యింతే గదా!
      సత్యమ్మున్ గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. నిత్యానందమయామరేంద్రసభ మౌనీంద్రుండు "లోకమ్మునన్
      సత్యమ్మే విధిగా దలంచును హరిశ్చంద్రుండహోరాత్రముల్ ,
      సత్యార్థమ్మసువుల్ త్యజించు" నన విశ్వామిత్రుడున్ బల్కెడిన్
      సత్యమ్మున్ గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారూ,
      మీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  9. ముత్యాలమ్మ కొమరుడు కాటికాపరి పరిచయం :)


    ముత్యాలమ్మ కుమారుడీతడు సుమా ! ముమ్మాటి కిన్బల్కడే
    సత్యమ్మున్! గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్
    సత్యమ్మున్ విడువంగవేరొకటయా ! సాధించి రే యిర్వురన్
    జాత్యమ్మౌ శివపాడు నందు పని ! సాజాత్యంబిదేనయ్యరో :)

    జిలేబి


    ముత్యాలమ్మ కుమారుడీతడు సుమా ! ముమ్మాటి కిన్బల్కడే
    సత్యమ్మున్! గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్
    సత్యమ్మున్ విడువంగవేరొకటయా ! సాధించి రే యిర్వురన్
    జాత్యమ్మౌ శివపాడు నందు పని ! సాజాత్యంబిదేనమ్మరో !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    "చరిత నే శతాబ్దంబున జనుల నేలె?
    కల్పితములు పురాణాలు కావు నిజము
    నెన్న నాదర్శ మన్నదనిత్యమౌను"1(Ideal is never realఅన్న సిద్ధాంతమున్నది)
    సత్యమును బల్కడట హరిశ్చంద్ర నృపతి!!

    రిప్లయితొలగించండి
  11. సత్య పాలన కై రాజ్య ము న్ త్యజించె
    సతి ని సుతుల ను గోల్పో యె సత్య శీలి
    కాటి కాపరి యై నను కష్ట మని య
    సత్య ము ను బల్కడ ట హరిశ్చంద్ర నృపతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,

      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. "సత్యపాలనమునకు రాజ్యము ద్యజించె" అనండి.

      తొలగించండి
  12. డా.పిట్టా
    నిత్యమ్మీధర నోర్చుటౌ బ్రతినలే నిన్ బట్టి వేధించు నే
    భత్యంబున్నిడరయ్య నీ భవితకే భంగంబు వాటింతు రా
    సత్యా సత్యములెల్ల బొమ్మ బొరుసుల్ చక్కన్ని నాణేల కా
    గత్యంబౌ నొక వ్యక్తి కాపద జుమీ౩ గాంచంగ బ్రత్యర్థియే
    నిత్యానందము నొందు సత్యమెచటన్ నిల్వంగ న్యాయంబునన్?
    సత్యమ్మున్ గలనైన బల్కడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్!

    రిప్లయితొలగించండి
  13. రాజ్య సంపద గోల్పోయి రచ్చ కెక్కి
    ఆలుబిడ్డల నంగడి న్నమ్ము కొనిన
    కాటి గాపరి యైన బెగడుపడక న
    సత్యమును బల్కడట హరిశ్చంద్ర నృపతి!!!

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా
    టైపాటుకు ఒప్పు:inconsistent qualities గా గైకొనండి,ఆర్యా,

    రిప్లయితొలగించండి
  15. ౧.
    సర్వసంపదలు చెడిన సమయమును న
    సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి
    యందు చే మనుషుల మదిఁ బొందెఘనత
    చాటె సత్యయుగపు గొప్ప జగతిలోన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. చంద్రమతిని వరించెడు సమయమందుఁ
    బల్కి 'నాతిచరామి' ని, పాట్లు బడుచు
    నాలి నమ్మగ నేమంద్రు? నన పరుల క
    సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  17. డా.ఎన్.వి.ఎన్.చారి.9866610429
    సతత సత్య దీక్షా కవచము ధరించి
    అమర ప్రభువుల నికషల నధిగమించి
    కీర్తి కాయుడ య్యా దర్శ మూర్తి తాన
    సత్యమును బల్కడట హరిశ్చంద్ర నృపతి

    రిప్లయితొలగించండి
  18. మరియొక పూరణ
    సత్య నిష్ఠోపలబ్ధ. ప్రశస్తుడతడు
    దేహ గేహాది కీర్తి ప్రతిష్ఠలెల్ల
    సతి,సుతాదుల వర్జింపజాలు నతడ
    సత్యమునుఁబల్కడట హరిశ్చంద్ర నృపుడు

    రిప్లయితొలగించండి
  19. రాజు దుష్యంతుడు బలికె రమణితో న
    సత్యమును, బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి
    కల్లబొల్లి మాటలెపుడు ఖచ్చితముగ
    ధరణిలో రాజు లెల్ల వందనము లిడగ



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి కృష్ణసూర్యకుమార్ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. సత్యమ్మే యిల హేతువౌను గదరా ! సంసారమే సాగగ
    న్నిత్యమ్మున్ భువి సర్వ కార్యములు నిర్ణీత కాలమ్మున
    న్నత్యంతాపద కల్గనీ, యనృత మాశించి ; బోనాడుచున్
    సత్యమ్మున్ ; గలనైన పల్కడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ, మూడవ పాదాలలో గణదోషం. "కార్యములనే నిర్ణీత... యనృతమే యాశించి..." అనండి.

      తొలగించండి
  21. అత్యంతమ్ము యశోదనుండు భువితానాద్యంతమున్ ధర్మమున్
    సత్యమ్మే నయనమ్ములై తనరగన్ సాధ్వీమణిన్ బుత్రునిన్
    ప్రత్యక్షమ్ముగ రాజ్యమున్ విడువగా భావ్యమ్మె మీరిట్లనన్
    సత్యమ్మున్ ; గలనైన పల్కడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  22. వినుము యలనాటి రాజుల వినుతముగను
    మేటి తా హరిశ్చంద్రుండు మాట కొరకు
    పత్నిబుత్రుల విడిచెను పరగ తాన
    సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీటూరి భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వినుము+ అలనాటి' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'వినమె యలనాటి'... అనండి.

      తొలగించండి
  23. కోట రాజశేఖర్ గారి పూరణ

    సందర్భం :: హరిశ్చంద్రుడు సంతానం లేక బాధపడుతూ, కొడుకు పుట్టినట్లయితే వానిని యాగ పశువుగా చేసి యాగం చేస్తానని వరుణుడికి మ్రొక్కుకొని, కొడుకు పుట్టిన తరువాత వరుణుడు వచ్చి అడిగినా, బిడ్డపై మమకారంతో మాటతప్పినవాడై, ఎన్ని సంవత్సరాలు గడిచినా మ్రొక్కు చెల్లించక, వరుణుని శాపంతో జలోదర వ్యాధిగ్రస్తుడైనాడు. కాబట్టి హరిశ్చంద్రుడు అసత్యవాది అని, విశ్వామిత్రుడు వాదించే సందర్భం. {దేవీభాగవతం}

    సత్యశ్రేష్ఠుల గూర్చి *దేవసభ* లో చర్చించుచుండన్, సదా
    సత్యాత్ముం డనె నా *వసిష్ఠుడు * *హరిశ్చంద్రున్* ప్రశంసించుచున్,
    నిత్యమ్మున్ సుతు గావ, బొంకి *వరుణున్* వేధించినా, డాతడే
    సత్యాత్ముం డన, తప్పటం చనెను *విశ్వామిత్రు* డీ రీతిగా
    *’’సత్యమ్మున్ కలనైన బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్.’’*

    *కోట రాజశేఖర్ నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
  24. శ్రుత్యంతమ్ములు చెప్పె నంచు గురువే సూక్ష్మమ్ములన్ దెల్పినన్
    మృత్యుగ్రార్భటి యైన మేల మయినన్ మేలంచు తానెంచినన్
    ప్రత్యర్థుల్ చెలరేగినన్ పరశువే పై వాలినన్ దాచి యే
    సత్యమ్మున్ గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'మృత్యు+ఉగ్ర' అని చూసుకుంటే "ముత్యూగ్ర" అవుతుంది. 'మృతి+ఉగ్ర' అనుకుంటే "మృత్యుగ్ర" అవుతుంది.

      తొలగించండి
    2. అవును గురువుగారూ మీరు చెప్పినట్లు ఇక్కడ మృత్యూగ్రము సవర్ణదీర్ఘసంధి అవుతుంది. పొరబాటుకు చింతిస్తున్నాను.

      తొలగించండి
  25. రాజ్య సంపద బోయెను, రాణి యొప్పె
    దాసిగ, తనయుడు గతించె, తాను మసన
    గోపుడై చరించెను గాని, కోరి తా న
    సత్యమును బల్కడట హరిశ్చంద్ర నృపతి

    రిప్లయితొలగించండి
  26. వారి జాక్షులందును నిజ బ్రాణ విత్త
    మాన భంగము లందు గోమాతృ ధరణి
    సుర వరావనమున నైన నరయ నతఁ డ
    సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి


    ప్రత్యేకమ్ముగఁ బంత మూని ముని విశ్వామిత్రుఁ డత్యున్నతిన్
    సత్యాతిక్రమణమ్ము గాంచ నృపుఁ గృఛ్రానేక సంత్రాసముల్
    కృత్యాలిం గడు బెట్టిదం బిడినఁ దా గించిత్తు మున్కున్ వినా
    సత్యమ్మున్ గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా, ఔత్సాహిక కవులకు కరదీపికలుగా నున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  27. చంద్రమతిని అమ్ముకున్నాడను కోపమ్మున జనసామాన్యపు భావన:
    శా.
    నిత్యానందపు ధర్మకార్యములకై నిర్వాహణాసక్త దా
    పత్యంబున్ పురుషార్థ సాధనకునై భార్యానువర్తుండుగన్
    నిత్యంబుండక విక్రయించు గతిఁ దా నేర్వంగఁ సొంతమ్మనన్
    సత్యమ్మున్ గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దాంపత్యంబున్..' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
    2. చిత్తము గురుదేవా. టైపాటు సవరణతో:

      చంద్రమతిని అమ్ముకున్నాడను కోపమ్మున జనసామాన్యపు భావన:
      శా.
      నిత్యానందపు ధర్మకార్యములకై నిర్వాహణాసక్త దాం
      పత్యంబున్ పురుషార్థ సాధనకునై భార్యానువర్తుండుగన్
      నిత్యంబుండక విక్రయించు గతిఁ దా నేర్వంగఁ సొంతమ్మనన్
      సత్యమ్మున్ గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్

      తొలగించండి
  28. సత్యమును పేరుగాగల సద్గుణుండు
    సత్యమును బల్కడట,హరిశ్చంద్రనృపతి
    సత్యమును నమ్మిగోల్పోగ సకలసిరులు
    సత్యమును గ్రహింపవలయు శక్తియుతులు!
    ఒక రాజకీయ నాయకుని ఉవాచ!

    రిప్లయితొలగించండి
  29. సత్యమేలెడి రాజుగా సహన సుఖమె
    పొందగల్గుచు కీర్తిని నందుకొన్న|
    “కష్ట బెట్ట నక్షత్రకు డిష్టపడు న
    సత్యమునుబల్కడట| హరిశ్చంద్ర నృపతి|
    2.సత్యంబే సహజీవనంబనుచు విశ్వాసానజీవించగా|
    “నిత్యంబందున కష్ట నష్టముల సాన్నిధ్యాన విస్వామిత్రున్
    బృత్యున్ డూహలె మార్చి వేసెగద|”పాపిష్టూహ జేకూర్చెడిన్
    సత్యమ్మున్ గలనైన బల్కడు హరిశ్చంద్రుండె ముమ్మాటికిన్|



    రిప్లయితొలగించండి
  30. కౌశికుని ఋణమును దీర్చ కాంతనమ్మి
    తనను తానమ్ము కొనెను.తనయు శవము
    కాల్చవలెనన్న కాటి సుంకమ్మడుగు, న
    సత్యమను పల్కడట హరిశ్చంద్ర నృపతి

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గాధిజుని పరీక్షకు నిల్చి కలత బడక
    సర్వసామ్రాజ్య మంతయు సాతి జేసి
    పలికినట్టి మాట నిలిపె పవరుడతడ
    సత్యమును బల్కడట హరిశ్చంద్ర నృపతి

    రిప్లయితొలగించండి


  32. వసుధలోన నెపుడు తాను వాసిగాన

    సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి

    సత్యవాక్పరిపాలన సాధనమ్ము

    కొరకు నమ్మెసతిసుతుల కువలయాన.


    2.ఆడినట్టి మాట నిలుప నవనియందు

    నాలు బిడ్డల విడుగాని యధిపుడెపుడ

    సత్యమును బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి

    యనుచు పలికె ముదమున సం యమియు తాను.


    3.సతతము పలుకగ వలెను జగతిలోన

    సత్యమును ,బల్కఁడఁట హరిశ్చంద్ర నృపతి

    యనృతమనుచు పలికె సంయమివరుండు

    నమరుల సభలో పలికెను నాదరమున.

    రిప్లయితొలగించండి
  33. గురువు గారికి నమస్సులు.
    వనిత విషయమందు ,వివాహ పద్ధతులకు
    విప్రు లందున గోవుల విపణిన రిపు
    సత్యమున బల్కడట,హరిశ్చంద్ర నృపతి
    నెపుడు నుడువును నిజములు నేస్త మాయె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      కొంత అన్వయదోషం కన్పిస్తున్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రిపు'...? 'నృపతి యెపుడు' అనండి. 'నేస్తమాయె'...?

      తొలగించండి
  34. కలియుగమ్మున్న ధర్మమ్ము కష్టమగును
    ధర్మ పరునకే ధర్మమ్ము దక్కదనుచు
    సత్యమును పల్కడట హరిశ్చంద్ర నృపతి
    వోలె నరుడెవ్వడును , కొంత బొంకు చుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ రవిప్రసాద్ గారూ,
      విలక్షణమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  35. పద్యం మొదటి పాదం లో ఆరవ అక్షరం లో ద్విత్వం పొరపాటుగా పడినది. దానిని తొలగించటం సాధ్యం కాలేదు . దానిని "కలియుగమ్మున" అని చదువుకొన గలరు.

    రిప్లయితొలగించండి
  36. హత్యల్ జేయుచు నీ యుగమ్మున సతిన్ హైరాన గావించుచున్
    ముత్యాలమ్ముచు భార్య కిచ్చినవియౌ ముద్దాడి యత్తయ్య తా
    పైత్యంబొందుచు భంగు త్రాగి విడుచున్ పండంటి పుత్రుండనున్
    సత్యమ్మున్ గలనైనఁ బల్కఁడు హరిశ్చంద్రుండు ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి