24, డిసెంబర్ 2017, ఆదివారం

సమస్య - 2555 (పోరాటముఁ జేయ శస్త్రముల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా"
(లేదా...)
"పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా యనిన్"

80 కామెంట్‌లు:

  1. చారిత్రక దృష్టాంతము
    భారత స్వాతంత్ర్య సమర ఫలితము గాదా?
    వీరోచిత యోధులకును
    పోరాటము జేయ శస్త్రముల పనియేలా?

    రిప్లయితొలగించండి
  2. Indian freedom struggle is a glaring example and a convincing evidence of war without weapons.

    రిప్లయితొలగించండి
  3. దారుణ సమరము జరుగగ
    దారకు ధవునకు నడుమన ధంధమ్మనుచున్
    బారుగ నుండగ గరిటెలు
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భట్టారం రాధాకృష్ణయ్య గారి స్పందన:

      మహత్తర గరిటెల యుద్ధం:

      ఆలికి గరిటెలు గలవిక
      శూలికి యాయుధము కంటిచూపే తానే
      లీలం బోరాడంగా
      వీలౌనని వెక్కి వెక్కి విభుడేడ్చె
      నయో!

      ఆయమ స్పూనులం గరిటెలమ్మెయి రువ్వుచునుండ నింక నే
      యాయుధముంగనుంగొనమి నచ్చట దుప్పటి గాంచిమేనిపై
      హాయిగ దాని గప్పుకొనియావిడ రువ్విన వానిజేర్చి తా
      నాయువతీ లలామపయి నాతడు రువ్వి ప్రమోదమొందెగా

      తానుగన్న తృప్తి తాత్కాలికంబయ్యె
      అబల కన్ను వాచె నతడు రువ్వ
      కాంతనంతజీరి కమ్మగ లాలించి
      కాపటమ్ముబెట్టి కౌగిలించె :)

      తొలగించండి
  4. ఆరాధ్యుడు గాంధి వెనుక
    హేరాలంబగు ప్రజ జయహిందని యనుచున్
    ధారాలంబగు దీక్షను
    పోరాటము జేయ శస్త్రముల పని యేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆరాటపడుచు స్వేచ్ఛకు
      చే రాటంబును వడకుచు చెలిమిని నొకటై
      భారతమాత సుపుత్రులు
      పోరాటము జేయ శస్త్రముల పని యేలా?

      తొలగించండి
  5. నోరూరగ దిట్టు కొనగ
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా ?
    మీరిన కోపము నందున
    నేరుగ బుట్టింటి కేగ నిలయమ్ముండన్

    రిప్లయితొలగించండి
  6. గురువు గారికి నమస్సులు.
    భారత రణరంగమ్మున
    ధీరో దాత్తులు ప్రవిమల దీప్తి చరితులై
    పోరిరి,శకునికి పాచిక
    పోరాటము జేయ,శస్త్రముల పనియేలా?

    రిప్లయితొలగించండి
  7. ధారాంగంబును మేటి కార్ముకము చేతంబూని జన్యంబునన్
    సారథ్యంబును బూని కృష్ణుడు ద్విషత్సంఘంబునన్నిల్చినన్
    సారంగంబును వీడె యర్జునుఁడు దాఁ సంబంధ వర్గంబుతో
    పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా యనిన్

    రిప్లయితొలగించండి
  8. కోరుచు స్వాతంత్ర్యమ్మును
    సారధియై గాంధి నడిపె శాంతిపథమ్మున్
    క్రూరత్వము లేకుండగ
    పోరాటము జేయ శస్త్రముల పని యేలా.

    రిప్లయితొలగించండి
  9. కోరి విజయమొందిరి కద
    వీరులు ఘన రక్త రహిత విప్లవమందున్ !
    చారిత్రక విదితంబిది
    పోరాటము జేయ శస్త్రముల పని యేలా.

    రిప్లయితొలగించండి
  10. భారమ్మైనవిదేశి పాలనల ప్రాభవ్యమ్ము తగ్గించుచున్
    పోరాడెన్ తనదైనశైలినట బాపూజీ స్వతంత్రమ్ముకై
    తీరైనట్టి నహింస, సత్యములనే దివ్యమ్ము శస్త్రాలుగా
    పోరాటమ్మును జేయ, నాయుధములన్ బూనంగ నేలాయనిన్

    రిప్లయితొలగించండి
  11. ఆరాటముతో గౌగిట
    దారన్ గొని దనివి తీర దాగిన చాలోయ్
    కోరక దుప్పటి చలితో
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా?

    రిప్లయితొలగించండి
  12. గౌరీపతి తపభంగము
    నారూఢిగ జేసి గెలుచు నార్భాటమునన్
    మారునికి పూవులుండగ
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి పద్యమండీ!👌👌
      ఐతే చిన్న మార్పు.. తపభంగం అనరాదండీ!
      గౌరీశు తపోభంగము.. అనండి చక్కగా సరిపోతుంది.🙏🙏

      ...డాక్టర్ వెలుదండ సత్యనారాయణ

      తొలగించండి
  13. మైలవరపు వారి పూరణ

    ధీరులును బాహుబలులగు
    మారుతి భీమాదులరుల మర్దించునెడన్
    వారికి పిడికిలి చాలును !
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చోరుల్ దొంగతనమ్ము సేయుటకు రాన్ జూడంగ వంటింటిలో
      కారమ్మున్ మరి కత్తిపీట దొరకంగా బోదె ! ధైర్యమ్మె యా..
      ధారమ్మౌ విజయమ్ము పొందుటకినిద్ధాత్రిన్ గనన్ సత్కవీ !
      పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా ? యనిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. నీరేజాక్ష ! మదీయపక్షముననే నీవుండగా జాలు ! నీ
      కారుణ్యమ్మన మాకు రక్షణ , కటాక్షంబే మహాభాగ్యమౌ !
      సారథ్యమ్మొనరింపు తేరుపయి కృష్ణా ! కేశవా ! నీవుగా
      పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా! యనిన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. చిటితోటి వారి పూరణ

      చేరెడు కన్నులు చాలును
      బారెడు వాల్జడయె చాలు భామకు నిలలో
      ధీరుని పురుషుని గెలువగ
      పోరాటము జేయ శస్త్రముల పని యేలా

      **************************

      మైలవరపు వారి స్పందన

      శ్రీ చిటితోటి విజయకుమార్ గారికి నమస్సులు.. మీ పద్యం మధురం... దానికి ఫాలో అప్..

      మూరెడు పూవులె చాలును
      నోరారగ ప్రేమపలుకు నుడివిన చాలున్
      సారసనేత్రలఁ గెలువగ
      పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    4. పూజ్యులు కవివర్యుల పద్యాలకు కొసమెరుపు!

      వారే వీరగు వీరే
      వారగు మనసులు కలిసిన వాదములేకన్
      వేరింటి కాపురమనుచు
      పోరాటముజేయ శస్త్రముల పనియేలా?

      నమస్సులు!

      తొలగించండి
    5. పాఠాంతరము
      ధీరత గూడుచు జీవన
      పోరాటము జేయ

      తొలగించండి
  14. 'నారాయణ 'సంకీర్తన,
    పారాయణ,నిష్ఠఁజేయ భవ్యతఁగల్గున్.
    నైరాశ్యమేల?మనమున.
    పోరాటముఁజేయ శస్త్రముల పనియేలా?

    రిప్లయితొలగించండి


  15. వారిజ నేత్రి! జిలేబీ !
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా!
    జోరుగ సమ్మార్జనియే
    వీరవనితల దళపమ్ము వినవే బాలా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. భారతమున స్వాతంత్ర్యము
    కోరగ సత్యాగ్రహంబు కూరిమి జేయన్
    చీరుచు బలికెను గాంధీ
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా"

    రిప్లయితొలగించండి
  17. మేరునగమౌచు గాంధీ
    కూరిచె సత్యాగ్రహము! గగుర్పాటునకున్
    పారిరి తెల్లలు!! స్వేచ్ఛా
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా?

    రిప్లయితొలగించండి


  18. హోరాహోరి యదేలనో! పెనిమిటిన్ హోంబట్టుతో గట్టిగా
    యేరాలమ్ముగ కట్టివేసుకొనుమా! యే మానవుండైన బా
    లా,రాధాయని వెంబడించును ధనీ! లావణ్యమే జఘ్నియౌ,
    పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా యనిన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాంబంటు నాకు తెలుసును
      కాంబంటుల్ మగుడు లెంతొ కన్నియలారా!
      సోంబంట్లు నీవు నేనును
      హోంబట్టు తెలియ జిలేబి హోరాహోరీ!

      తొలగించండి


    2. జీపీయెస్ కట్టిరిటగ
      దా పీతాంబరపు పట్టు దమ్ముల బట్టీ :)
      తాపీగా వేసుకొన
      మ్మా పిరియముగన్ జిలేబి మరియొక పట్టీ :)


      జిలేబి

      తొలగించండి


  19. హేరాలమ్ముగ తిట్టుచు
    ధారాళమ్ముగ తెగడుచు ధణధణల జిలే
    బీ, రాద్ధాంతము చేయుము
    పో! రాటముఁ జేయ శస్త్రముల పని యేలా!


    రాటము - రంపు, రచ్చ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. మీరానేనా యనుచును
    సారాంశములేని సభల సరభసముగ దా
    మేరిచి గూర్చిన మాటల
    పోరాటము జేయ శస్త్రముల పనియేలా?

    దారగ జేసుకొనెదనని
    మీరిన మాటల బ్రియుండు మెల్లగజార
    న్నారాటమునను మౌనపు
    పోరాటముజేయ శస్త్రముల పనియేలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటి పద్యంలో మీరామేమా యనుచును గా చదువ ప్రార్ధన

      తొలగించండి
    2. పోరున గెలువగలేమని
      జీరగ దాయాదులనట జెరచుచునీతిన్
      కూరిమి మాయాజూదపు
      పోరాటముజేయ శస్త్రముల పనియేలా?

      తొలగించండి
  21. నీ రమ ణుని వలపు కొరకు
    "పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా?
    నారీ! యలిగిన చో కం
    సారి యనవరతమునీదు సరసన యుండున్


    సత్యభామకు సఖి సలహా యిచ్చు సందర్భము

    రిప్లయితొలగించండి
  22. ఆరాట మె ప్రతి నిత్యము
    కోరిన వన్ని యు లభింప కొండెక్కేధర ల్
    ధీర త సాg

    రిప్లయితొలగించండి
  23. ఆరాట మె ప్రతి నిత్యము
    కోరిన వన్ని యు లభింప కొండెక్కేధర ల్
    ధీర త సాగే డు జీ వ న
    పోరాట ము జేయ శస్త్ర ము ల పని యే లా ?

    రిప్లయితొలగించండి
  24. ఆరాటముమదిరగిలిన
    నోరేఛురకత్తియౌనునొప్పిజనించున్
    దూరాటనగలరిపులకు
    పోరాటముజేయశస్త్రములపనియేలా!

    రిప్లయితొలగించండి
  25. ఆరాటమె బలమైనను
    తీరుగను సుసంఘటిత సుదృఢ దీక్షలతో
    ఘోరమ్ముల నెదురు కొనుచు
    పోరాటము జేయ శస్త్రముల పనియేలా?

    రిప్లయితొలగించండి
  26. సారా పెను భూతముపై
    ఆ రోశమ్మ సలిపె గద!యద్భుత రీతి
    న్నారాటమ్ముగ దీక్షల!
    పోరాటము జేయ శస్త్రముల పనియేలా?

    రిప్లయితొలగించండి
  27. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    . సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య 2555
    *పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా యనిన్ ?*

    సందర్భం :: కుంభసంభవుడైన అగస్త్యుడు రాక్షసులైన కాలకేయులను బయట పెట్టేందుకు అవలీలగా సముద్రాన్ని త్రాగివేశాడు. సూర్యుడు ఒకే ఒక్క చక్రం ఉన్న రథమెక్కి ఏ ఆధారం లేకుండానే ఆకాశంలో సంచరిస్తూ నిరంతరం అంధకారాన్ని అంతం చేస్తున్నాడు. శ్రీరాముడు కోతులను తోడుగా భావించి వీరుడైన రావణాసురుని సంహరించినాడు. మన్మథుడు పువ్వులను (బాణాలుగా )చల్లుతూ లోకాలను జయిస్తూ ఉన్నాడు. మహాత్మా గాంధీ సత్యము అహింస అనేవాటితోనే ఆంగ్లేయులను పారద్రోలినాడు. కాబట్టి పోరాటంలో గెలవాలంటే మహాత్ములకు ఆయుధాలు అవసరం లేదు. ధర్మబలం ఉంటే చాలు. *క్రియా సిద్ధి స్సత్వే భవతి మహతాం నోపకరణే.* అని చెప్పే సందర్భం.

    పారావారముఁ గుంభసంభవుడు శోభన్ త్రాగె , సూర్యుండు లీ
    లారంభుండుగ నింగి నేగును నిరాలంబుండుగా , రాము డా
    వీరున్ రావణుఁ జంప కోతులను భావించెన్ చమూ రాశిగా,
    పోరాడున్ సుమ రాశి నంది మరుడున్ ,
    మోదమ్మునన్ సత్యమన్
    ధారన్ గెల్చెను తెల్లవారల మహాత్మా గాంధి , యోచింపగా
    *పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా యనిన్ ?*
    కోట రాజశేఖర్ నెల్లూరు. (24.12.2017)

    రిప్లయితొలగించండి
  28. దారుణముగ పాశ్చాత్త్యులు
    భారత భువి హింస పెంచి పాలన జేయన్
    వీరుడు గాంధీ తరిమెను
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా

    నిన్నటి సమస్యకు నా పూరణ

    తిండి లేక భృతికి తిరుగాడు బాపని
    పరుల పొట్ట గొట్టి బ్రతుకు ఖలుడు
    భజన సలుప నాదు ఫణమైన దొరకు ద
    ర్బారనంగ మురిసె బాపనయ్య

    రిప్లయితొలగించండి
  29. ఆరాటమేలకవివర!
    పోరాటముజేయశస్త్రములపనియేలా
    యారయగాంధీదెచ్చెను
    పోరాటములేకయుండభువికిన్ స్వేఛ్ఛన్

    రిప్లయితొలగించండి
  30. తోరపు టస్త్రము నిచ్చెను
    ధీరుఁడు జాతిపిత గాంధి తివిరి నిజాహం
    కారముఁ జూపఁగ మౌనపుఁ
    బోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా


    ఘోరమ్మే సుమి భారతమ్మున మహద్ఘోషమ్ము నిత్యంబగున్
    నీరమ్ముం గొన నుత్సహించుచుఁ దమిన్ నిర్భీతలై ధీర లా
    వీరశ్యామల వీధి దూషణములన్ వేమారు వీక్షించమే
    పోరాటమ్మును జేయ నాయుధములం బూనంగ నేలా యనిన్

    రిప్లయితొలగించండి
  31. నీటికోసం వీధిపోరాటాలను బహుచక్కగా వర్ణించారండీ!నమస్సులు!!

    రిప్లయితొలగించండి
  32. రోజుకో యాపిల్ డాక్టరుకి దూరంగా వుంచుతుందని ఇంగ్లీషు నానుడి. అంటే ప్రకృతి మన ఆరోగ్యానికి ఏంకావాలో అన్నీ అప్పటికప్పుడు అందుబాటులోనే వుంచుతుంది. మనమే ప్రకృతికి దూరంగా పారిపోయి యాంత్రికతకు దగ్గరవ్వడమే నాగరికత అనే భ్రమలో వున్నాం. రసాయనాలతో మమేకమైన జీవితం గడుపుతూ రసాయన వైద్యానికి బానిసలమైపోతున్నాం. ప్రకృతి ప్రసాదాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటే రోగాలతో శస్త్ర చికిత్సల బారిన పడాల్సిన అవసరం వుండకపోవచ్చేమో అని నా భావన.

    ఏ ఋతువున కాఫలమును
    కారణముగ బ్రకృతిచ్చె గని గైకొనుమా!
    ఈరీతిని మనజీవన
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా!!

    రిప్లయితొలగించండి
  33. లేరాతిరి యరుదెంచియు,
    వీరావేశమున గుట్టు వీటితొ యేలా?
    తేరా తెరనిటు; దోమతొ
    పోరాటము జేయ శస్త్రముల పని యేలా?

    రిప్లయితొలగించండి
  34. లేరాతిరి యరుదెంచియు,
    వీరావేశమున గుట్టు వీటితొ యేలా?
    తేరా తెరనిటు; దోమతొ
    పోరాటము జేయ శస్త్రముల పని యేలా?

    రిప్లయితొలగించండి
  35. భారతదేశ విముక్తికి
    పోరాటముజేయ శస్త్రముల పనియేలా?
    ఆరాటమ్మున గాంధీ
    సారమ్మగు శాంతిచేత సాధించె సుమా|
    2. సారాంశమ్మగు శాంత చిత్తమున విశ్వాసాన గాంధీహితం
    పోరాటమ్మును జేయ?”సాయుధములన్ బూనంగనేలా యనిన్
    ధీరుల్ కంటెను దీక్షశక్తి యిలలో దివ్యత్వమేర్పర్చగా?
    భారం బేమియు లేక జేసెగదసర్వాభీష్ట సంధానియై|




    .

    రిప్లయితొలగించండి
  36. ఆరాటపు పురుషునితో
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా?
    తీరుగ కన్నును గీటిన
    చేరడె నాకాళ్ళకడకు చిరునగవులతో

    రిప్లయితొలగించండి
  37. కవిమిత్రులారా,
    అస్వస్థత (జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు) కారణంగా మీ పద్యాలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  38. ధీరోదాత్తుడు గాంధీ
    క్రూరులునాంగ్లేయ ప్రభుత గూల్చెను కద;య
    య్యారే!శాంతి పథమ్మున
    పోరాటము జేయ శస్త్రముల పనియేలా?

    రిప్లయితొలగించండి
  39. రారాజుల్ప్రజనేలునప్పుడొకచోరాణింపలేకుండినన్
    సారింపున్ గద దృష్టినేలుబడిపై సామాన్యులావేళలన్
    తీరౌరీతులనుద్యమంబు సలుపన్ తేజాలరేమార్పులన్
    పోరాటమ్మును జేయ నాయుధములం బూనంగ నేలా యనిన్

    రిప్లయితొలగించండి
  40. ఓరమణి పారిజాతము
    తా.రుక్మిణికిచ్చు ననుచు తాపమ్మేలా
    చేరుమిక నలుకగృహమున
    పోరాటము జేయ శస్త్రముల పనియేలా?

    రిప్లయితొలగించండి

  41. చీరలు నగలను పొందగ
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా
    ధారుణియందున జూడగ
    నారీమణులకును వేరు నాయుధ ముండున్.

    నారిగ మారెను హరియట
    పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా
    నోరగ చూసిన యంతనే
    నోరును దెరచుచుగననిరట నుర్విని యసురుల్

    రిప్లయితొలగించండి
  42. శౌరియె నరహరిగా నవ
    తారము నెత్తెను.నఖముల దనుజుని జీల్చెన్
    భూరిగ సత్త్వము గల్గిన
    పోరాటము జేయ శస్త్రముల పాని యేలా.

    రిప్లయితొలగించండి
  43. ధారుణికి మేలు జేయగ
    జారని సంకల్పబలము సాహసమున్నన్
    సారము నొసంగు నక్షర
    పోరాటముఁజేయ శస్త్రముల పనియేలా!!!

    రిప్లయితొలగించండి
  44. శ్రీరంజిల్లెడు సాహితీ కలిన బృచ్ఛించంగ నవ్వారలు
    న్నౌరౌరా! యవధాని మేటి యనెడున్ హర్షాతిరేకమ్మునన్
    ధారాళంబగు పాటవంబున సమాధానమ్ము లందించెడున్
    బోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా యనిన్?

    రిప్లయితొలగించండి
  45. కోరిన వాక్శరములతో
    శారద నాలుకనునిల్వ శంకరుడు గెల్చెన్
    పేరిమిఁ మండలమిశ్రున్
    "పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా"

    రిప్లయితొలగించండి
  46. క్రూరాంగ్లేయుల పాలనంబున మహా ఘోరాలనెన్నింటినో

    ప్రారబ్ధంబని యెంచినారు ప్రజయున్,బాపూజి ఖింన్నుండునై

    ధారాళంబుగ శాంతి యుద్ధమున స్వాతంత్ర్యంబు సాధించెగా

    పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలాయనిన్ !

    రిప్లయితొలగించండి
  47. వైరులు మానవులైనన్
    పోరగ శస్త్రములు వలయు బుద్ధిన గల నీ
    ఆరుగురు శత్రువులతో
    "పోరాటముఁ జేయ శస్త్రముల పని యేలా"

    రిప్లయితొలగించండి
  48. ఆరాట మ్మెసగంగ నింతి పతికి న్నారాత్రి వంటింటిలో
    పారావారపు తిట్ల తోడ తగవుల్ పారంగ నోరూరుచున్
    ధారాళమ్ముగ నుండ గిన్నె గరిటెల్ తండోప తండాలుగా
    పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా యనిన్?

    రిప్లయితొలగించండి
  49. లోక్ సభలో:

    నోరూరంగను మోడి చోరుడనగా నొక్కండు రాఫేలునన్...
    ఆరంభించెను తండ్రి చౌర్యమనియెన్నా జైత్లి బోఫర్సునన్...
    హోరాహోరిని జుట్లు పట్టుకొనగా హుందాను కోల్పోవుచున్...
    పోరాటమ్మును జేయ నాయుధములన్ బూనంగ నేలా యనిన్

    రిప్లయితొలగించండి