11, ఏప్రిల్ 2018, బుధవారం

సమస్య - 2648 (పండుగనాఁడును లభించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే"
(లేదా...)
"పండుగనాఁడు కూడఁ గనఁ బ్రాఁతమగండె లభించె నయ్యయో"
అవధాని ముద్దు రాజయ్య గారికి ధన్యవాదాలతో...

137 కామెంట్‌లు:

  1. కొండొక ముదితకు విరివిగ
    పండిత పుత్రుల నిడుచును ప్రారబ్ధమునన్
    నిండిన యరువది శకముల
    పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే :)

    రిప్లయితొలగించండి
  2. పండుగ దినమున పడతుల
    గుండము దొరికిన పురుషుడు కోర్కెలు దీర్చున్,
    దండగ యని తెలిపె లలన
    "పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే"
    ఒకచోట ఆచారము కలదు పండుగ నాడు స్త్రీలు తమ తమ వస్త్రము లన్ని విడిచి గుహలో దాచెదరు. మగవారు ఆ గుహలోకి వెళ్ళి వస్త్రములు చే చిక్కించుకొని వచ్చెదరు. ఆ వస్త్రము యొక్క పడతితో ఆ రోజు రతి
    సుఖము బడసెదరు. కొత్త వారితో సుఖము పొంద దలచిన ఒక స్త్రీకి తన దుస్తులు తన భర్తకే దొరికినవి
    అప్పుడు ఆమె మనోగతము

    రిప్లయితొలగించండి


  3. పండారువెన్నెలయునట
    నిండుగ కురియన్ ప్రణిధియు నిర్మలము గనన్
    గండాగొండి జిలేబికి
    పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే,

    ప్రాతమగవాడు - శివుడు

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ జిలేబీవారూ...
      ఈ గండాగొండి అంటే ఏఁవిటండీ..!?
      ☺️

      తొలగించండి

    2. గండాగొండి

      కోట రాజశేఖర్ వారి నడిగి చూడండీ :)


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ***********
      విట్టుబాబు గారూ,
      గండాగొండి = ఆరితేరిన దిట్ట (మాండలిక పదం)

      తొలగించండి
  4. పండగ రోజు యెండిన చేపలు దొరికాయని భార్య తెచ్చింది...వాటిని యెండలో ఆరబెట్టమని భర్త జీర్ణవస్త్రాన్నిస్తే వలదని కుండలో దాచుకుందట ఆ ఇల్లాలు.....


    ఎండిన చేపలు కోరగ
    పండుగ నాడును లభించె, బ్రాత మగండే
    యెండన పరచగ వలదని
    కుండన దాచెను పడంతి కూరను వండన్

    (ప్రాత.....చిరిగిన వస్త్రము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ వైవిద్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  5. కం

    మెండుగ నింటి పనులతో
    పండుగ రోజు సతమతమవగ ,పేరిమితో
    దండిగ నాదుకొనెను పతి,
    పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే"

    (....ప్రాఁత అనగా సేవకుడు...)


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  6. వండితి పిండి వంటలను బాగుగ తీయని బాదుషా లటన్
    మెండుగ జంతికల్ మిగుల మీగడ నిండిన పాయసం బులున్
    నిండుగ రంగులీను తగు నీలపు చీరను గట్టియుం డగా
    పండుగ నాఁడు కూడఁ గన బ్రాఁత మగండె లభించె నయ్యయో

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    కొండొక వేశ్య దాను గనె కోటి కలల్ , విటుడేగుదెంచెడున్
    నిండుగ సొమ్ములన్ గలిగి , నేడు ధనమ్ము లభించునంచు , మా...
    ర్తాండుడు గ్రుంకగా , మగడు రాన్ విటుడై , విలపించెనివ్విధిన్
    పండుగనాఁడు కూడఁ గనఁ బ్రాఁతమగండె లభించె నయ్యయో !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్య పాదానికి సరైన న్యాయం చేశారు అవధాని గారూ. నమోన్నమః!
      🙏🏻

      తొలగించండి
    2. శ్రీ P S రావు గారికి నమస్సులు.. ధన్యవాదాలు.. 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    3. అవధాని వారికి నమస్సులు! ఒక చిన్న సందేహం! వేశ్యలకు మగడుంటాడా అని! 🙏🙏🙏🙏

      తొలగించండి
    4. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. వారికి అభినందనలు.
      *****
      సీతాదేవి గారూ,
      కొందరు వేశ్యలకు అది కులవృత్తి. వారికి భర్త, పిల్లలు, సంసారం అన్నీ ఉంటాయి.

      తొలగించండి
    5. ధన్యవాదములు గురుదేవా సందేహ నివృత్తికి! అయినా యెంతటి అన్యాయము, అనాచారము??!!

      తొలగించండి
    6. కొండకు పోయి వచ్చునెడ కోటి జనావళి మధ్య నల్గుచున్
      రెండుగ జీలిపోయితిమరే ! గతవర్షమటంచు కుందగా
      పండుగనాఁడు కూడఁ., గనఁ బ్రాఁతమగండె లభించె ., నయ్యయో !
      వండనె లేదు వంట యని భార్యయు పర్వులు బెట్టె వండగాన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    7. సంక్రాంతి కోడిపందెములలో...
      పౌరుషంతో ఊగిపోతూ ఒక పుంజు ... ఈ రోజు ప్రత్యర్థి బలమైనదేమో ... చంపేయాలనుకొంది... అయితే బరిలో ఎదురుగానున్న పుంజు గత సవత్సరం తనచే చావుదెబ్బలు తినిన దానినిగా గుర్తించి... ఆవేశమణగి... ఇలా అనుకుంటోంది... 👇

      ఖండించెద ననుచు మహో...
      ద్దండతఁ గుక్కుటము జూప ధైర్యము , బరిలో
      నుండిన పుంజును గని , యను
      బండుగనాడును లభించె ప్రాతమగండే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    8. మైలవరపు వారి తాజా రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. వండిన వంటలు తినుటకు
    మెండుగ సంతస మొంది మీరిన కోర్కెన్
    పిండార బోసె వెన్నెల
    పండుగ నాఁడును లభించెఁ బ్రాఁత మగండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "సంతసము నంది..." అనండి.

      తొలగించండి
    2. వండిన వంటలు తినుటకు
      మెండుగ సంతసము నంది మీరిన కోర్కెన్
      పిండార బోసె వెన్నెల
      పండుగ నాఁడును లభించెఁ బ్రాఁత మగండే

      తొలగించండి
  9. మెండగు సరసమున పడతి
    "పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే"
    దండుగ యనగా నా పతి
    చెండగ మరి ప్రాఁత సతికె జేజేలనియెన్!


    ఎంతయినా మగవారికి తమ సతియే ముద్దు. పరకాంతను కన్నెత్తయినా చూడరు. :-)

    రిప్లయితొలగించండి
  10. సైనికుల చీకటి పాట చెప్పు దొరికిన వాడె
    జంట వేట
    గేమ్ ఆఫ్ సిండ్రెల కొత్తాట ఛోళి పండుగ
    అడవి బాట
    సార బానల రవిక రవిక బట్టిన వాడె
    రమణుడయ్యయో
    పండుగ నాడు కూడ గన బ్రాత మగండె
    లభించె నయ్యయో

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2648
    సమస్య :: *పండుగనాడు కూడ గన పాత మగండె లభించె నయ్యయో.*
    ‘’పండగనాడు కూడా పాతమొగుడేనా?’’ అనే సామెత ఈ సమస్యలో ఉన్న విశేషం.
    సందర్భం :: భోగి పండుగ రోజు ఉదయాన్నే అందరూ తప్పనిసరిగా కోడికూర వండుకొంటారు. నాకు కూడా భిక్షగా వేస్తారు. కాబట్టి నేను
    ఈ రోజు కోడికూర దండిగా తినవచ్చు అని పగటికలలు కనే బిచ్చగానికి అందరూ చద్ది అన్నమే పెట్టినారు. పండుగనాడు కూడా చద్ది అన్నమే తినవలసి వచ్చిందని బాధపడుతూ ఆ బిచ్చగాడు తన తలరాతను తిట్టుకొనే సందర్భం.

    పండుగ నేడు, పెట్టెదరు బాగుగ నందఱు కోడికూరనే
    దండిగ యంచు, భిక్షుకుడు తాను దలంచెను భోగిపండుగన్,
    దండిగ చద్ది పెట్టిరని తాపము నందుచు వాగె నిట్టులన్
    *పండుగనాఁడు కూడఁ గన ప్రాత మగండె లభించె నయ్యయో.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (11-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సామెతను సామెతగానే ఉంచి సరైన పూరణ చేశారు కోటావారూ. సూపరు..
      💐

      తొలగించండి
    2. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. శ్రీ విట్టు బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. .

      తొలగించండి
    4. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి ప్రణామాలు.

      తొలగించండి
    5. ఈ నాటి నా పద్యానికి శ్రీ చిటితోటి విజయకుమార్ (కలకత్తా) గారి అనువాదం :: సంస్కృత శ్లోకం

      భోగ్యాం పర్వ దినేఽద్య సంప్రతి మయా ప్రాప్యేత నృభ్యః మహా
      రస్యం కుక్కుట మాంస భోజనమితి స్వాన్తే సుఖీ భిక్షుకః।
      ప్రాప్తే పర్యుషితే ప్రహీణ కవళే తాపేన జల్పత్యయం
      హా ధిక్ పర్వ దినే మయా కువిధినా ప్రాప్తః పతిః ప్రాక్తనః।।

      తొలగించండి
  12. గండరగండని, కోవెల
    మండప మందున కనుఁగొని, మగటిమ మదిలో
    మెండుకొన పతిఁగని తలఁచె
    “పండుగ నాఁడును లభించెఁ బ్రాఁతమగండే”

    రిప్లయితొలగించండి
  13. సమస్య : -
    "పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే"

    *కందము**

    మెండగు బ్రహ్మానందము
    పండుగనాఁడును లభించె; ప్రాత మగండే
    దండిగ వెలబెట్టికొనగ
    నిండు మనము తోడ భార్య నిచ్చెను ముద్దుల్
    ..................✍చక్రి

    ప్రాత : వస్త్రము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భార్య కిచ్చెను/ భార్య యిచ్చెను" అనండి.

      తొలగించండి
  14. మెండగు భక్తిని మ్రొక్కగ
    పండుగ నాడును, లభించె ప్రాత మగండే
    గుండెల నిండగ తోషము
    దండకముల గొల్చి పడతి ధన్యతబొందెన్!

    ప్రాతమగవాడు = శివుడు

    రిప్లయితొలగించండి
  15. పండుగ దినమున నొక సతి
    యెండిన రొట్టెలెగతి యని యేడువ సాగెన్
    నిండగ మది వెత పలికెనిటు
    "పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే"
    (She cried in figurative sense
    and not in literal sense)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "నిండగ మది వెత యిటు లనె" ఆనండి.

      తొలగించండి
  16. (విడాకులు తీసుకున్నఆలుమగలు మారుపేర్లతో మళ్ళీ కలిస్తే..)
    నిండుగనున్న కాపురము నీరొనరించిన యాలతాంగియే
    మెండగు నవ్యభావముల పేరును మార్చెను భర్తవోలెనే;
    గండము దప్పనట్టుల సుఖమ్ముగ నిర్వురు పెండ్లియాడగా
    పండుగనాడు కూడ గన బ్రాతమగండె లభించె నయ్యయో!

    రిప్లయితొలగించండి


  17. దండుగసేయమాకు వనితా,హరిమన్,దరి రమ్మ నీకనన్
    చెండుల మల్లిచెండులను చెంగలి చేర్వ జిలేబి తెచ్చినా
    మెండుగ నీకరంకమున మెచ్చినిడన్! మురిసెన్ ప్రియమ్ముగా
    పండుగనాఁడు కూడఁ గనఁ బ్రాఁతమగండె లభించె నయ్యయో :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సేయమాకు' అన్నది గ్రామ్యం. 'చేర్వ, నీకరంకమున'...?

      తొలగించండి
    2. నీ కరంకమున - నీ తలపైన

      కరంకము - తల సరియేనాండి :)

      గండాగొండి కనిబెట్టేసారే :)

      జిలేబి

      తొలగించండి
  18. అండగ నుండుట కొరకై
    పండునునే బోలినట్టి పతియే దొరకన్
    మొండిగ బలుకుట న్యాయమె?
    పండుగ నాడును లభించెబ్రాతమగండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పండును కడు బోలినట్టి' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    దండిగఁ దిండిఁ దింటకయి తా రుచిఁ గోరుచునుండ జిహ్వయే,
    మెండగు నుత్తరమ్మునను మిక్కిలిఁ దిం దని పిండివంటలన్,
    గొండొకనాఁడుఁ బోవఁగను, కోర్కినిఁ బెట్టిరి యన్నమే యటన్,
    బండుగ యౌట వారలకు బాగగు దక్షిణ పాక రక్తిచేన్;
    బండుగనాఁడు కూడఁ గనఁ బ్రాఁతమగండె లభించె నయ్యయో!

    రిప్లయితొలగించండి
  20. [11/04, 09:14] Nvn Chary: దండిగ దక్షణలెన్నియో
    పండుగనాడును లభించె:ప్రాత మగండే
    గుండెలనిండనునిండగా
    చెండును హైందవి నితరుడు చేరగ బూనన్
    [11/04, 09:14] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
    దండిగ దక్షణలెన్నియో
    పండుగనాడును లభించె:ప్రాత మగండే
    గుండెలనిండనునిండగా
    చెండును హైందవి నితరుడు చేరగ బూనన్

    రిప్లయితొలగించండి

  21. నిండగ నరువది యేడులు
    మెండుగ సీతమ్మ తాను మిత్రుల బిలువన్
    దండిగ మెచ్చుచునని రీ
    పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  22. మెండగు ను ల్లాసoబులు
    పండగ నాడు ను లభించె ;పాత మగ oడే
    నిండు గ కోర్కె లు దీర్చియు
    నం డ గ నిలిచి యు సతి కి ని యా ద ర మి డె తా న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సతికిని నాదరమిడె..." అనండి.

      తొలగించండి
  23. పండుగ నాడుకూడ గనబ్రాతమగండెలభించెనయ్యయో
    పండుగ నాటికో మగడు పండుగకానిది నమ్ములందున
    న్నండకుగానొకండు ధర నాయతరీతిని నుండయిష్టమో
    రండల కిష్టమో యటుల ,రాక్షస జాతికి జెంది యుందురే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..నుండ నిష్టమో' అనండి.

      తొలగించండి
  24. పండుగ రోజున వంటలు
    మెండుగ వండెను ముదమున మెచ్చగ తిండే
    నిండుగ పతినే కోరిన
    పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే

    రిప్లయితొలగించండి

  25. దండిగ చేరరే నడత దండము బెట్టుచు మంచినే గనన్
    మొండిగ చూడరే నిలను మొండరి భర్తయు చిక్కనేరనన్
    చండిక పేరునే పడతి చందము వద్దన గా, నదే యనన్
    పండుగ నాడు కూడ గన ప్రాత మగండె లభించె నయ్యయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చూడరే యిలను...' అనండి.

      తొలగించండి
  26. వండక తప్పదు నా కీ
    పండుగ నాఁడును, లభించెఁ బ్రాఁత మగండే
    మెండగు వాత్సల్య మ్మది
    నిండుగ నుండ కొని యిచ్చె నేర్పున నాకున్

    [ప్రాఁత = వస్త్రము / చీర]


    దండుగ కావె సంపదలు దండిగ నున్నను బ్రేమ తోడ వా
    రుండగ బంధు మిత్రు లిట నుత్సవ మందున బంటు లేనిచోఁ
    గండలు పెంచి వత్తునని గారిడి కొంపకు నేఁగ దుఃఖమే,
    పండుగనాఁడు కూడఁ గనఁ బ్రాఁత మగండె, లభించె నయ్యయో

    [కనన్ = చూడను, ప్రాఁతన్ = భృత్యుని, మగండె = శూరుఁడె]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  27. డా.పిట్టాసత్యనారాయణ
    నిండను దడుప విలేకరి
    కొండొకనిని వార్తలందు గోరి భజించున్
    దండి నిరాశయె యువతకు
    పండుగనాడును లభించె ప్రాత మగండే!

    రిప్లయితొలగించండి
  28. "దండగ నిను గట్టుకొంటి
    పండగ నాడును లభించె ప్రాత! మగండే?
    బండ వెధవ" యంచు పడతి
    చెండాడను కొత్త గట్ట చేయని మగన్!

    కొత్త = కొత్త బట్ట
    ప్రాత = ప్రాత బట్ట

    రిప్లయితొలగించండి
  29. చెండాడను కొత్త గట్ట చేయని పతినే!
    అని చదవండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం మూడవ గణం జగణమయింది. "దండుగ నిను గట్టుకొనుట" అనండి.

      తొలగించండి
  30. డా.పిట్టా సత్యనారాయణ
    దండిగ గాంధి వేషమన దత్పరతన్ గొను నాథు నేమన
    న్నుండియునుండి జీనులను ఉద్దెర బేరము జేసి దెచ్చితిన్
    కండకు దగ్గ రూపమును గాంచెద నంచు తపించ మారడీ
    పండుగ నాడు కూడ గన ప్రాత మగండె లభించె నయ్యయో!
    (ఒక యిల్లాలు మనోగతము,పర్వ దిన వేళ)

    రిప్లయితొలగించండి


  31. దండగ వస్తువు లేరగ

    పండుగ నాడును లభించె ప్రాత,మగండే

    యండగ నిలబడి సాయము

    మెండుగ చేయగ సతతము మేలొన గూడెన్

    రిప్లయితొలగించండి
  32. డా}పిట్టా}నుండిసవరణ
    జీనులను నుద్దెరబేరము...గా చదువ గలరు

    రిప్లయితొలగించండి
  33. కండువ గప్పిన బొమ్మకు
    అండగ నాండాళ్లబొమ్మ నమరగ నుంచన్
    మండప మందున!జూడగ?
    పండుగనాడును లభించె పాతమగండె!(బొమ్మలకొలువున గతసంవత్సరమునివే జంట ఈపండుగకుఅవేబొమ్మలు)

    రిప్లయితొలగించండి
  34. వండిన వంటకములకని
    పండుగనాడును లభించె బ్రాతమగండె మెండున యుండెననుచు నా
    కొండిక వేడినను భుతిని కుడుచగ నొచ్చెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మగండే। మెండుగ నుండె ...కుడువగ..." ఆనండి.

      తొలగించండి
    2. 🙏🏽
      ధన్యవాదములు శంకరయ్య గారూ. సవరించుకొనెద

      తొలగించండి
  35. ఈ నాటి నా పద్యానికి శ్రీ చిటితోటి విజయకుమార్ (కలకత్తా) గారి అనువాదం :: సంస్కృత శ్లోకం

    భోగ్యాం పర్వ దినేఽద్య సంప్రతి మయా ప్రాప్యేత నృభ్యః మహా
    రస్యం కుక్కుట మాంస భోజనమితి స్వాన్తే సుఖీ భిక్షుకః।
    ప్రాప్తే పర్యుషితే ప్రహీణ కవళే తాపేన జల్పత్యయం
    హా ధిక్ పర్వ దినే మయా కువిధినా ప్రాప్తః పతిః ప్రాక్తనః।।

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారి సంస్కృత శ్లోకం మనోహరంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
  36. కొండొక చేటి పెన్మిటినిఁ గూడక వీడి, విడాకులొంది వే
    రొండొక వానికై వెదికె నొయ్యన, నచ్చట "మ్యాట్రిమోని"లో
    నుండిన బూర్వభర్తఁ గని యోర్మి నశించగ నిట్లు చింతిలెన్
    పండుగ నాడు కూడఁ గనఁ బ్రాతమగండె లభించె నయ్యయో!.

    రిప్లయితొలగించండి
  37. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    ఒక వృధ్దునికి , ఆతని రెండవ భార్యకు , షష్టి పూర్తి సందర్భంగా

    పెండ్లి ఘనంగా జరిపిరి . పూబోణులు వేడుకతో , పెండ్లికూతరును

    పెండ్లికొడుకు గది లోనికి పంపిరి . శోభనపు పండుగ నాడు కూడా

    పాత ముసలి మొగుడే కదా ఏమున్నదిలే అనుకుంటూ ఆమె

    ప్రవేశించింది . వృద్ధ భర్త అపుడే కునుకు తీయ సాగాడు .


    అపు డాతని రెండవ భార్య చండిక మనసులో ఎలా ఊహించిందో

    పద్యము చివరి భాగము నందు గమ‌నించ గలరు





    రెండవ భార్య చండికకు , రేవంత రెడ్డికి , షష్టి

    ‌నిండిన సందర్భ మందు నెరవేర్చి రత్యుత్సుకతను

    పెండిలిన్ | చారులోచనలు వేడుక మీర శోభనపు

    పండుగ - రాత్రి వధువును , వరుని గదికి పంపి రింక |

    " పండుగ నాడున్ లభించె బ్రాత మగండే గద | ఫల

    ముండునే ? తా శయనించు చున్నాడు చేర దీక ‌నను |

    దండుగ వ్యయముతో వారు దలపెట్టి రీ వేడ్క " ‌ యనుచు ‌

    ‌‌‌‌‌‌ ‌‌‌ చండిక ‌ భావించె , కామ సంకల్ప మెదలో జిగుర్చ ! !

    రిప్లయితొలగించండి
  38. ఒక పండుగ నాడు విటుడు తాను ఎప్పుడూ వెళ్ళే వేశ్య దగ్గరకు వెళ్ళగా ఆమె అన్న మాటలకు....


    ఎండన పడి వచ్చియు పూ
    దండలు తెచ్చియు అడిగిన ధనములు పోసీ
    దండుగ మాటలు వింటిని
    పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే

    నా మొట్టమొదటి పూరణ, మరియు కందం అండీ. ఛందం సాఫ్ట్‌వేరు సహాయంతో...

    శ్రీకాంత్ గడ్డిపాటి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకాంత్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోసీ' అనడం వ్యావహారికం. "ధనమిచ్చియు నే। దండుగ..." అనండి.

      తొలగించండి

    2. ఇంతకీ ఆవిడ ఫో ! సీ అందేమో నండీ కంది వారు :)


      జిలేబి

      తొలగించండి


    3. ఎండన బడి దెచ్చితి పూ
      దండల! తెచ్చితి నడిగిన ధనమున్! పో!సీ !
      దండుగ మాటలు వింటిని
      పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే!

      తొలగించండి
  39. దండిగ ధనమదె కూడగ
    పండుగ నాడును లభించె ప్రాత, మగండే
    గుండెల నిండగు ప్రేమను
    సందడి జేయగ సతికగు సాయమటుంచున్!

    ప్రాత = సేవకుడు ( రాలు)

    రిప్లయితొలగించండి
  40. వ్హాట్సప్ సమూహములోని కోలాహలం:

    "పండుగనాఁడు కూడఁ గనఁ బ్రాఁతమగండె లభించె నయ్యయో"...
    చెండుచు చీల్చుచున్ కవులు చేయగ చక్కటి పూరణమ్ములన్
    దండిగ ధర్మశాస్త్రముల తర్జన భర్జన లారగించగా
    పండుగ నాదుబోంటులగు పక్కున నవ్వెడి బోసినోర్లకున్

    రిప్లయితొలగించండి
  41. నిండుగ మంచమంత కడు నిర్దయు డర్భకు డేగుడెంచె నీ
    పండుగనాఁడు కూడఁ గనఁ బ్రాఁతమగండె లభించె నయ్యయో
    దండము లయ్య చక్రధర! తద్దయు ప్రీతిని మీదిజన్మకున్
    గందర గండనిన్ వరునిగా ఘటియించి ముదమ్మొసంగుమా

    రిప్లయితొలగించండి
  42. నేటి నా సమస్యాపూరణకు స్వీయసంస్కృతీకరణశ్లోకం౼౼౼౼
    యా పత్నీ స్వపతిం విహాయ, నవ్యం తదాన్వేషితా
    హ్యంతర్జాలగతం వివాహితుమముం పూర్వం పతిం వీక్షితా
    చింతాక్రాంతమనస్వినీయమభవత్ స్మృత్వానుభూతిం గతాం
    ధిక్ ధిక్ పర్వదినేపి సా గతవతీ పూర్వం స్వకీయం పతిమ్.

    రిప్లయితొలగించండి
  43. దండగ తిండి మీకు, పని తప్పదు నాకు నిదేమి కర్మమో!
    వండరు వార్చ రెప్పుడును, వాకిట గూర్చొని యుండె జూడు డా
    పండరి! దాని వా డుతుకు బట్టల, నూడ్చును, వండు దాని కీ
    పండుగనాఁడు కూడఁ గనఁ బ్రాఁతమగండె లభించె నయ్యయో.

    (ప్రాతమగడు = సేవకుడైన మగడు) 🤧

    రిప్లయితొలగించండి
  44. మొండితనమ్ముతో పతికి ముగ్దవిడాకుల నిచ్చి వెంటనే
    మెండు ధనాఢ్యుడైన తన మిత్రుని తో మనువాడ గోరగన్
    దండుగ జేరి పెద్దలది ధర్మము కాదన తెల్పెనీ విధిన్
    పండుగ నాడు కూడ గన బ్రాతమగండు లభించె నయ్యయో.

    రిప్లయితొలగించండి
  45. ఉత్పలమాల
    గుండము నందు మూడుమునుగుల్ దగ నాతడు మున్గ మారుటల్
    ఖండిత మంచు దెల్ప శుభకార్యమటంచును మున్చి లేపగన్
    బండుగ నాడు, కూడఁ గనఁ బ్రాఁతమగండె! లభించె నయ్యయో
    దండుగమారి వాడనుచు దారయె యేడ్చెను క్రుంగి పోవుచున్

    రిప్లయితొలగించండి
  46. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అండగ నుండని దిచ్చగు
    గండను వీడిన యువిదకు గమ్మత్తుగ నా
    బండడె నిలు జేరుట గన
    పండుగ నాడును లభించె బ్రాత మగండే!
    (దిచ్చు= జూదరి; గండ= భర్త)

    రిప్లయితొలగించండి
  47. కందం
    గుండొనరఁ దలగొరిగినన్
    మొండితనము వదలు నీదు మొగుడన వినుచున్
    కొండల రాయుని కీయఁగఁ
    బండుగ నాడును, లభించెఁబ్రాఁతమగండే!

    రిప్లయితొలగించండి


  48. మెండగు సమయంబిదియే
    కొండాట్టము బోసినోటి గోపతికి భళా!
    చెండాడగ నుత్పలమున్
    పండుగనాఁడును లభించెఁ బ్రాఁతమగండే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "కొండాట్టం అన్నది అరవ పదం . తెలుగు లో ఐతే సెలేబ్రషన్ అని చెప్పవచ్చు..."

      http://varudhini.blogspot.in/2010/11/blog-post_20.html?ం=౧

      గోపతి = సూర్యుడు (ప్రభాకరుడు)

      http://www.andhrabharati.com/dictionary/

      తొలగించండి
    2. ఏమి అమ్మాయ్ - కొండాట్టమే కొండాట్టం గా ఉండావు ? అని ఎవరి నైన అడిగితే చిత్తూరు అమ్మాయి ఐతే సిగ్గు పడి పోయి - ' అక్కోయి నాకు పెళ్లి కుదిరింది ' అని మెలికలు తిరిగి పోక మానదు. కొండాట్టం కాదంటారా మరి ఇది?

      చీర్స్
      జిలేబి"

      తొలగించండి


    3. కొండాటమాడ వచ్చెను
      నిండుగ మీతో జిలేబి నిక్కము గానన్ :)


      హరునితోడిద కొండాటమై లతాంగి, యుగ్రతాపంబు సైరింపకున్నఁజూచి." వీర. ౧, ఆ.

      :)

      జిలేబి

      తొలగించండి
  49. రిప్లయిలు
    1. కందం
      గుండమున దూకి సతి చలి
      కొండకు కూతుగ జనించి కొమరుని బడయన్
      వెండిమల వేలుపొప్పిన
      పండుగనాఁడును లభించెఁబ్రాఁతమగండే!

      తొలగించండి
    2. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  50. కందం
    వెండిమల వేల్పు నొప్పుచు
    చంఢిక గతజన్మ సతియె జపమొనరించన్
    ఖండపరశువు కలికిఁ గను
    పండుగ నాఁడును లభించె బ్రాఁత మగండే!

    రిప్లయితొలగించండి
  51. నిండుమనస్సు లేక ననునిత్యము సత్యము నాశ్రయించకన్
    అండగ నాశ దోషముల నాదరణంబున కామరూపిణై
    దండుగటంచు వేశ్యగ సదాగడుపన్ “వెలయాలి పొందుకై
    పండుగ నాడు కూడ గన? బ్రాతమగండెలభించె నయ్యెయో|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సత్యము నాశ్రయించకే" అనండి. 'ఆశ్రయించక' అన్నది కళ.

      తొలగించండి
  52. గురువు గారికి నమస్సులు.
    చండీ చాముండీలకు
    పండుగ నాడును లభించె ప్రాత, మగండే
    నిండైనమనసు తోడన్
    మెండుగ సరసం బాడన్ ,మెఱియున్ కవిగాన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "చాముండిలకున్" అనండి. నాల్గవ పాదంలో గణదోషం. "మెండుగ నాడగ సరసము" అందామా?

      తొలగించండి

  53. .. .. .. .సమస్య
    *"పండుగనాఁడు కూడఁ గనఁ*
    *బ్రాఁత మగండె లభించె నయ్యయో"*

    సందర్భము: కొత్త బట్టలు కట్టిన నాడు కొత్త మగ డని, కట్టని నాడు పాత మగ డని ఒక యిల్లాలు భావన.
    యింటి యజమాని మాత్రం పండుగ నాడూ పాతవే కట్టుకుంటా డట! ఇక ఆమె యేమంటుంది మరి!
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    దండిగఁ గ్రొత్త బట్ట లవి
    దాచును గాని మగండు కట్టడే
    పండుగ నాడుఁ గూడ.. మరి
    పాడయిపోను, మగండు కట్టగా
    నండజయాన పిల్చు నట!
    యాతని కొత్త మగం డటంచు.. నా
    పండుగనాఁడు కూడఁ గనఁ
    బ్రాఁత మగండె లభించె నయ్యయో!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  54. కొండొక సత్యభామకట కూడగ జంటలు క్లబ్బునందునన్
    పండుగనాఁడు కూడఁ గనఁ బ్రాఁతమగండె లభించె నయ్యయో
    దండిగ నాథులుండగను దారుణ రీతిని బ్రిడ్జియాటలో
    నండగ పార్ట్నరౌచునహ నారులు వేసిన లాటరీని భల్

    రిప్లయితొలగించండి